breaking news
Adilabad District News
-
1,43,655
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ బల్దియా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా వార్డుల వారీగా సిద్ధం చేసిన ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాను సాయంత్రం 6 గంటల సమయంలో ప్రకటించారు. పట్టణంలోని 49 వార్డుల పరిధిలో 1,43,655 మంది ఓటర్లున్నట్లుగా లెక్క తేల్చారు. ఇందులో పురుష ఓటర్లు 69,813 మంది ఉండగా, మహిళలు 73,836 మంది ఉన్నారు. ఇతరులు మరో ఆరుగురున్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు 4,023 మంది అధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో వీరే కీల కం కానున్నారు. ఈ జాబితాలను మున్సిపల్ కా ర్యాలయంతో పాటు కలెక్టరేట్, ఎన్నికల అఽ దికారి, ఆర్డీవో, అర్బన్ తహసీల్దార్ కార్యాలయా ల నోటీసు బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఓటరు జాబితా విడుదల కావడంతో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్ర క్రియ షురూ కానుంది. దీనిపై రేపో, మాపో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశమున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్విడుదల కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యంతరాలను సవరించి... ఈ నెల 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. చాలా వరకు తప్పులు దొర్లాయి. పలు వార్డుల్లోని ఓటర్లు ఇతర వార్డుల్లోకి తారుమారయ్యారు. గందరగోళ పరిస్థితి తలెత్తెంది. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏ ర్పాటు చేసి అభ్యంతరాలు స్వీకరించారు. మొ త్తం 308 అభ్యంతరాలు అందాయి. వాటన్నింటిపై వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ చేయించి ఒక వార్డులోనిఓటర్లు అదే వార్డులో ఉండేలా శ్రద్ధ వహించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల వివరాలు వార్డునంబర్ ఓటర్లు వార్డునంబర్ ఓటర్లు 1 2,875 25 2,678 2 3,194 26 3,122 3 2,756 27 2,558 4 3,832 28 2,849 5 2,830 29 2,943 6 2,933 30 3,254 7 3,099 31 2,958 8 3,230 32 3,524 9 2,620 33 2,399 10 3,094 34 2,684 11 2,831 35 3,270 12 3,197 36 3,073 13 2,863 37 2,374 14 2,977 38 3,305 15 3,180 39 3,077 16 3,500 40 2,993 17 2,675 41 2,845 18 2,638 42 2,703 19 3,053 43 2,890 20 2,801 44 3,473 21 3,163 45 2,511 22 3,208 46 2,571 23 2,867 47 2,487 24 2,767 48 2,358 49 2573 -
‘ఇందిరమ్మ’ పనులు అడ్డుకోవద్దు
కై లాస్‌నగర్: ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అటవీశాఖ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ.. దుబ్బగూడ గ్రామానికి 11 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గ్రామానికి చెందిన లేతుబాయి ఎకరం భూమిని దానం చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ రెవెన్యూ భూమిగా నిర్ధారిస్తూ అఫిడవిట్ జారీ చేశారని పేర్కొన్నారు. అందులో నిర్మాణ పనులు ప్రారంభించగా, అటవీశాఖ అధికారులు అడ్డుపడటం సరికాదన్నారు. నిర్మాణాలు కొనసాగేలా చూడాలన్నారు. అనంతరం శిక్షణ ఐపీఎస్ చిన్నబూస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లంకా రాఘవులు, సాజిదొద్దీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ‘అనవసర రాద్ధాంతం సరికాదు’ సాత్నాల మండలం దుబ్బగూడలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట చేపట్టిన ఆందోళనకు సంబంధించిన స్థలం సాత్నాల రిజర్వు ఫారెస్ట్‌లోకి వస్తుందని డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ ప్రకటనలో తెలిపారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అటవీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాన్ని చూపించడం జరిగిందని తెలిపారు. దీనిపై ఒక కుటుంబం మాత్రమే అభ్యంతరం చెప్పి రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో ఇంటి నిర్మాణానికి యత్నిస్తుందని పేర్కొన్నారు. వారిపై అటవీ నేరం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. అటవీ, పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. -
‘మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’
కైలాస్‌నగర్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. అనంత రం సీఎం రేవంతన్న బస్తీబాట ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. మంగళవారం నుంచి పట్టణంలోని ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు దిగంబరావ్ పాటిల్, సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఈనెల 16న జిల్లాకు రేవంత్‌రెడ్డి ● కొరటా–చనాఖా పంప్‌హౌస్ నుంచి నీటి విడుదల ● మంత్రి ‘ఉత్తమ్’ సైతం హాజరు ● బ్యారేజీ, పంప్‌హౌస్, మెయిన్ కెనాల్ ఇప్పటికే పూర్తి ● ఉపకాలువల పనులు మాత్రం పెండింగ్
కొరటా–చనాఖా బ్యారేజ్సాక్షి,ఆదిలాబాద్: సీఎం ఆదిలాబాద్ పర్యాటన ఖరారైంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు విచ్చేయనున్నారు. కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా మెజార్టీ పనులు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంప్‌హౌస్‌ల నుంచి నీటి విడుదల కార్యక్రమాన్ని సీఎం ఆ రోజున ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది. ముఖ్యమంత్రి ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 12 గంటల వరకు భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద పంప్‌హౌస్ వద్దకు హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి మెయిన్ కెనాల్ వద్ద పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యారేజ్ తీరుతెన్నులు లోయర్ పెన్‌గంగపై తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దున నదీ భూభాగాన్ని కలుపుతూ కొరటా–చనాఖా బ్యారేజ్ నిర్మాణానికి రూ.1,227 కోట్ల అంచనా వ్యయంతో 2015–16లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఆమోదం ఇచ్చింది. 2016–17లో కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం పూర్తి చేసుకొని ఆదిలాబాద్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో, బోథ్ నియోజకవర్గంలోని ఒక మండలంలో మొత్తంగా 51వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పదేళ్ల కాలంలో సవరించిన అంచనా వ్యయం అంతకంతకూ పెరుగుతూ పోయింది. దీంట్లో బ్యారేజ్, పంప్‌హౌస్, ఎల్‌పీపీ మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ఉపకాలువల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు కూడా చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పంప్‌హౌస్ వద్ద నీటి విడుదల మాత్రమే చేయనున్నారు. మోటార్ల సామర్థ్యం ఇలా.. హత్తిఘాట్ వద్ద పంప్‌హౌస్ నిర్మించారు. ఆరు మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగా వాట్లకు సంబంధించి మూడు, 12 మెగావాట్లకు సంబంధించి మరో మూడు మోటార్లను ఏర్పాటు చేశారు. భూపరిహారం అందజేత.. ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ కెనాల్ పనులు పూర్తి కాగా, చేల వరకు నీళ్లు అందించేందుకు ఉప కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తంగా వీటి కోసం 1700 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకోసం రూ.175 కోట్లు పరిహారం అందజేయాలి. ఇందులో ప్రస్తుతం రూ.70 కోట్లు భూపరిహారం కింద రైతులకు అందజేయనున్నారు. బ్యారేజ్ స్వరూపం ఇలా.. తెలంగాణ వైపు కొరటా–మహారాష్ట్ర వైపు చనాఖా గ్రామాల మధ్య పెన్‌గంగ భూభాగంపై బ్యారేజ్, దానికి కొద్ది దూరంలో పంప్‌హౌస్, కాలువల నిర్మాణం జరిగాయి. డిస్ట్రిబ్యూటరీ, పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు చేపడుతున్నారు.ప్రాజెక్ట్ వివరాలు.. అంచనా వ్యయం : రూ.1,891 కోట్లు పూర్తయిన పని విలువ : రూ.1,105 కోట్లు బ్యారేజ్ నిర్మాణానికి సవరించిన అంచనా విలువ : రూ.506 కోట్లు పని పురోగతి : పూర్తి లోయర్ పెన్‌గంగ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్.. నిర్మించిన ప్రాంతం: భోరజ్, జైనథ్, బేల మండలాల్లో 42 కిలోమీటర్ల పరిధిలో సవరించిన అంచనా విలువ : రూ.299 కోట్లు పని పురోగతి : పూర్తి పంప్‌హౌజ్.. నిర్మించిన ప్రాంతం: భోరజ్ మండలం హత్తిఘాట్ సవరించిన అంచనా విలువ : రూ.209 కోట్లు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్.. నిర్మించే ప్రాంతం : జైనథ్, భోరజ్, బేల మండలాలు డిస్ట్రిబ్యూటరీ నంబర్లు : డి–14, డి–15, డి–16, డి–16ఏ, డి–17, డి–18, డి–19 పనుల పురోగతి : చేపట్టాల్సి ఉంది -
‘ప్రణామ్’ సద్వినియోగం చేసుకోవాలి
కై లాస్‌నగర్: సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ క్వార్టర్స్లైన్లో ఏర్పాటు చేసిన ప్రణామ్ డే కేర్ సెంటర్‌ను కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణామ్ సేవలను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముందుగా వర్చువల్ విధానంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవిదాస్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్కై లాస్‌నగర్: బాధితులకు న్యాయం చేకూర్చడమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 33 మంది తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. వాటిని స్వీకరించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, కేసులు త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక, సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిఆదిలాబాద్టౌన్: వాహనదారులంతా తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రోడ్డు భ ద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద ప్రారంభమైన ర్యాలీ వినాయక్ చౌక్, దేవిచంద్ చౌక్, బస్టాండ్, కలెక్టర్ చౌ రస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎ స్పీ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలను 20 శాతం తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు బి.సునీల్ కుమార్, కర్ర స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు దేవేందర్, మహేందర్, టీజీఎస్పీ, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆదివారం ఆవిష్కరించా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నరసింహాస్వామి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసంఆదిలాబాద్రూరల్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు దేహదారుడ్యానికి తోడ్పడుతాయని అదనపు కమాండెంట్ రాథోడ్ దేవిదాస్ అన్నా రు. బెటాలియన్ మైదానంలో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. పలు కంపెనీలకు చెందిన సిబ్బంది ఉ త్సాహంగా పాల్గొని క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతో సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందనితెలిపారు. ఇందులో బెటా లియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నాకై లాస్‌నగర్: సాత్నాల మండలంలోని దుబ్బ గూడ కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు ప్రకటనలో తెలిపారు. అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆందోళనకు ఆయా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
నా ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్..
మాది భోరజ్ మండలంలోని పిప్పర్వాడ. అమ్మానాన్న లక్ష్మి–రాజీవ్‌రెడ్డి. నేను 2017లో ఫైర్‌మెన్‌గా ఎంపికయ్యాను. 2018లో ఎకై ్సజ్ కానిస్టేబుల్, 2024లో గ్రూప్–4లో ఉద్యోగాలకు ఎంపికై నా చేరలేదు. గొప్పగా ఆలోచించాలి, గొప్పగా జీవించాలనే వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాను. ఈ క్రమంలోనే 2024లో గ్రూప్–1 అధికారిగా ఎంపికయ్యాను. ప్రస్తుతం జిల్లా ఖజనా శాఖలో అసిస్టెంట్ ట్రెజరరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ‘నీ బలమే జీవనం.. నీ బలహీనతే నీ మరణమనే’ ఆ మహనీయుని సూక్తి మనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని గుర్తించేందుకు తోడ్పడుతుంది. దాన్ని ఎవరైతే గుర్తించి బయటకు తీస్తారో తప్పకుండా విజయం సాధిస్తారు. సరైన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆయన బోధనలు ఎంతో తోడ్పడుతాయి. ఉద్యోగ సన్నద్ధ సమయంలో స్టడీ హాల్, ప్యాడ్‌పైన ఆ మహనీయుని కొటేషన్స్ రాసుకునేవాడిని. ఆ స్ఫూర్తితోనే ఎస్సై మెయిన్స్ వరకు వచ్చి చేజారినా, జూనియర్ లెక్చరర్ 1:2 నిష్పత్తిలో తక్కువ మార్కులతో వెనుకబడినా నిరాఽశ చెందలేదు. పాజిటివ్ ధృక్పథంతో ముందుకు సాగాను కనుకే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాను. – సర్సన్ శఽశిధర్ రెడ్డి, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి, ఆదిలాబాద్ -
ఆయన బోధనలతో ఇన్స్పైర్ అయ్యా..
● ఆ మహనీయుని ప్రేరణ.. తోడైన సంకల్పం ● ముందడుగు వేసి.. లక్ష్యాన్ని సాధించి ● గ్రూప్–1 ఆఫీసర్లుగా రాణిస్తున్న పలువురు ● నేడు యువజన దినోత్సవం‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అనే వివేకానందుని సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత దేశానికి అవసరమంటూ ఆయన బోధనలతో చిన్నతనం నుంచే ప్రేరణ పొందారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగి గ్రూప్–1 అధికారులుగా ఎంపికయ్యారు. వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు స్వామి వివేకానందుని జయంతి (యువజన దినోత్సవం) పురస్కరించుకుని వారిని పలకరించగా తమ విజయంలో ఆయన ప్రభావాన్ని చెప్పుకొచ్చారు. – కై లాస్నగర్సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026మాది సిద్దిపేట పట్టణంలోని కలకుంటకాలనీ. నాన్న మల్లయ్య బీసీ సంక్షేమశాఖలో కుక్‌గా పనిచేసి రిటైరయ్యాడు. అమ్మ పద్మ గృహిణి. ఎంఏ. బీఎడ్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివాను. బీసీ సంక్షేమశాఖలో వార్డెన్‌గా ఆరు నెలల పాటు పనిచేశాను. సివిల్ కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికై నప్పటికీ చేరలేదు. ప్రిపేరయ్యే సమయంలో ఒంటరిగా అనిపించేది. నిరుత్సాహానికి గురైన సమయంలో స్టడీ హాల్లో అతికించిన వివేకానందుడి కొటేషన్స్‌ను చదివేవాడిని. అవి నూతనోత్తేజాన్ని కలిగించేది. ప్రిపరేషన్ సీరియస్‌గా కొనసాగించేవాడిని. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.. అలాగే నిరంతరం శ్రమించే నిన్ను చూసి ఓటమి భయపడుతుందనే వివేకానందుని బోధనలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. గ్రూప్–1 అధికారిగా ఎదిగేందుకు తోడ్పడ్డాయి. యువత ఆయన బాటలో నడిచి సమాజానికి మేలు చేసేలా ఎదగాలి. – ఎర్రోళ్ల అంజనేయులు , ఎంపీడీఓ, బేల కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులునేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పా ర్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ ల క్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కో నప్ప, దుర్గంచిన్నయ్య,బాల్క సుమన్ పాల్గొన్నారు. ఏఆర్ ద్వారా పాఠాలు వింటున్న విద్యార్థులుఆదివాసీల ఆత్మబంధువు మార్లవాయిలో హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు పాల్గొని నివాళులర్పించారు. -
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
ఆదిలాబాద్‌టౌన్: వారంతా బాల్యమిత్రులు.. పదో తరగతి పూర్తయ్యాక ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చదువులమ్మ ఒ డిలో కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆ లింగనాల నడుమ నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసారి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2006 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని పీ ఎస్ గార్డెన్లో నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులంతా ఒకే వేదికపై కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం నాటి ఉ పాధ్యాయులు హేమ, హిమజ, సంగీత, ఉషాన్న, మూర్తి, లచ్చరెడ్డి, శైలందర్ను శాలువాలతో సత్కరించారు. ఇందులో పూర్వ విద్యార్థులు దేవన్న, సంతోష్, ప్రమోద్, శివకుమార్, దశరథ్, స్వాతి, అరుణ, స్వప్న, మమత, తదితరులు పాల్గొన్నారు. -
జంతుగణనకు సన్నద్ధం
ఎన్టీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వన్యప్రాణుల గణనకు అటవీశాఖ సన్నద్ధమైంది. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని 576 అటవీ బీట్లలో ఈ గణన నిర్వహించనున్నారు.చిన్నతనంలోనే ప్రేరణ పొందా.. నాది నిర్మల్ జిల్లా ప్రియదర్శిని నగర్. నాన్న పరమేశ్వర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ సుజాత గృహిణి. నాన్న టీచర్ కావ డంతో ఆయన పనిచేసే పాఠశాల విద్యార్థులను ఏటా విహారయాత్రలకు తీసుకెళుతుండేవారు. నేను ఒకటో తరగతిలో ఉండగా కన్యాకుమారిలోని స్వామి వివేకానందుని మెమోరియల్‌కు తీసుకెళ్లారు. అప్పుడే ఆ మహనీయుని గురించి తెలిసింది. చిన్నతనం నుంచే డాడీ లైబ్రరీ నుంచి వివేకానందుని పాకెట్ బుక్‌లను తీసుకొచ్చి చదివించేవారు. దీంతో తెలియకుండానే నాపై ఆయన ప్రభావం పడింది. 2016లో డిగ్రీ పూర్తిచేశా. ఓయూలో ఎంసీజే చదువుతున్న సమయంలో 2017 ఆగస్టులో ఎఫ్ఆర్వో నోటిఫికేషన్ వచ్చింది. తొలి ప్రయత్నంలో నే ఉద్యోగం సాధించాను. అపారమైన విశ్వా సం.. అనంతమైన శక్తి విజయసాధనకు మా ర్గాలనే స్వామిజీ సూక్తి నన్ను ముందుకు నడిపించింది. – తొడిశెట్టి ప్రణయ్, ఎఫ్ఆర్వో, బోథ్ -
గేట్ కష్టాలకు చెక్ పడినట్లేనా..
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు సుమారు 50కి పైగా గ్రామీణ ప్రాంతాల ప్ర జలకు ఇబ్బందికరంగా మారిన రైల్వేగేట్ కష్టాలు తొలగేలా సర్కారు చర్యలు చేపడుతోంది. తాంసి బస్టాండ్ వద్ద గల రైల్వేట్రాక్ (ఎల్సీ నంబర్ 30)పై రైల్వేఅండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)నిర్మాణ పనులు ఎట్టకేలకు సోమవారం షురూ కానున్నాయి.ఈ మా ర్గం గుండా రాకపోకలను ఆరునెలల పాటు దారి మళ్లిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయి తే గతేడాది మాదిరిగా పనులు ప్రారంభానికే పరి మితమవుతాయా లేక పూర్తయ్యేవరకు కొనసాగుతాయా అనేదానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆర్‌యూబీకి బదులుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ దిశగా చొరవ చూపితే మేలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గేట్ కష్టాలు తొలగినట్లైనా.. తాంసి బస్టాండ్ వద్ద గల రైల్వేట్రాక్ అవతల పట్ట ణంలోని పలు కాలనీలున్నాయి. అలాగే తాంసి, తలమడుగు, భీంపూర్‌తో పాటు మహారాష్ట్రలోని సుమారు 50కిపైగా గ్రామాల ప్రజలు ఈ మార్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్లు వేస్తుండటంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు సైతం వెళ్లలేని దుస్థితి. ఇటీవల రైళ్ల సంఖ్య పెరగడంతో సమస్య మరింత జఠిలంగా తయారైంది. దీంతో ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ప్రతీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇది అస్త్రంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్యూబీ నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా ఈ పనులు ప్రారంభం కానుండటంతో గేట్ కష్టాలు దూరమైనట్లేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది జాప్యం తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం రైల్వే అండర్ బ్రిడ్జి ని మంజూరు చేసింది. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించింది. గతేడాది మేలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు నిర్ణయించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. దీంతో భూ సేకరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అక్కడి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు పనులను అడ్డుకున్నారు. చేసేది లేక కాంట్రాక్టర్ వెనుదిరిగాడు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరి గింది. అయితే కేంద్ర ప్రభుత్వమే వందశాతం నిధులు వెచ్చిస్తూ నిర్మాణాన్ని చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఇటీవల మ రోసారి పనులకు భూమిపూజ చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. తొలుత రైల్వేశాఖకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. కేంద్రం నిధులు విడుదల చేశాక , భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆర్అండ్బీ శాఖ పనులు చేపట్టనుంది. ఈ నిర్మాణానికి ఆరు నెలల పాటు గడువు విధించారు. రైల్వేకు సంబంధించిన పనులను హైదరాబాద్‌కు చెందిన మెహర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకోగా, ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన పనులను శ్రీసాయి తనిష్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో తాంసి బస్టాండ్ మార్గంలో వాహనాల రాకపోకలను ఆదివారం రాత్రి నుంచే నిలిపివేశారు. రెండు వైపులా సూచికలతో కూడిన ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా మహాలక్ష్మివాడ, ఆర్టీవో కార్యాలయం వద్ద గల ఎల్సీ నంబర్ 31,29 లను వినియోగించుకోవాలని ట్రాఫిక్, మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఆరు నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు ఉండవని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఆర్యూబీ నిర్మిస్తే వర్షాకాలంలో నీరు నిలిచి తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశమున్నందున రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ మార్కెట్ ఉండటంతో పత్తి కొనుగోళ్ల సమయంలో అదనంగా ఇబ్బందులు కలుగుతాయని అభిప్రాయపడుతున్నారు. వందశాతం కేంద్ర నిధులతోనే ఆర్యూబీ, ఆర్వోబీలను వందశాతం కేంద్ర నిధులతోనే నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.95 కోట్ల నిధులు సై తం కేటాయించింది. వారం రోజుల్లో విడుదల య్యే అవకాశముంది. నిధులు అందిన వెంటనే రెండింటి భూ సేకరణ ప్రక్రియను రెవెన్యూశాఖ సాయంతో పూర్తి చేస్తాం. అప్పటి వరకు రైల్వే పోర్షన్ పనులు జరుగనున్నాయి. నాణ్యతతో పనులు సాగేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. – ప్రవీణ్ కుమార్, ఆర్అండ్బీ డీఈఆర్యూబీ నిర్మాణ వివరాలు నిర్మాణ వ్యయం : రూ.20.08 కోట్లు భూసేకరణకు.. : రూ.20.81 కోట్లు మార్కెట్ యార్డువైపు : 184.792 మీటర్లు పంజాబ్ చౌక్వైపు : 107.442 మీటర్లు డ్రైన్ల నిర్మాణం : 1.40 మీటర్లు నిర్మాణ గడువు : ఆరు నెలలు -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.జాతీయస్థాయిలో జిల్లా విద్యార్థి ప్రతిభఆదిలాబాద్టౌన్/నార్నూర్: భారత రక్షణ మంత్రి త్వ, విద్యా మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన వీర్గాథ 5.0 పోటీల్లో జిల్లా విద్యార్థి మెరి శాడు. ఇటీవల నిర్వహించిన ఈ జాతీయస్థాయి ఆన్లైన్ పోటీల్లో పాల్గొన్న గాదిగూడ మండలంలో ని బుద్దమహార్ గూడకు చెందిన కాంబ్లే రిషాంక్ ప్రతిభ కనబరిచాడు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పద్య విభాగంలో రాణించాడు. దేశవ్యాప్తంగా 50 మంది పాల్గొనగా, అందులో రాష్ట్రం నుంచి ముగ్గు రు ఉన్నారు. జిల్లా నుంచి పాల్గొని ‘ఓ వీర జవాన్’ అనే పద్యాన్ని రచించి పంపించాడు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి అజయ్ తెలిపారు. ఈ సందర్భంగా రిషాంక్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. మారుమూల ప్రాంతం నుంచి.. బుద్దమహర్గూడ తెలంగాణ–మహారాష్ట్రసరిహద్దు లో ఉంటుంది. ఈ గ్రామంలో మహారాష్ట్ర పాఠశాలతో పాటు తెలంగాణ నుంచి ఎంపీపీఎస్ ఉంది. అయితే ఎక్కువ మంది తెలుగు మీడియం వైపే మ క్కువ చూపుతున్నారు. పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అలాంటి పాఠశాల నుంచి మట్టిలో మాణిక్యంలా మేరిశాడు రిశాంక్. -
జనసంద్రమైన ‘దీక్ష భూమి’
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో జాతీయ బంజారా దీక్ష భూమి ఆదివారం భక్త జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి బంజా రాలు భారీగా తరలివచ్చారు. దీక్ష గురువు సద్గురు శ్రీ ప్రేమ్‌సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో గురుకృపా (గురుమిలన్) దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ చేసి భోగ్ బండారో నిర్వహించారు. ఆధ్యాత్మిక భావనతోనే సమాజం జాగృతం అవుతుందన్నారు. లంబాడా మహిళలు సంప్రదాయ నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఎంపీ నగేశ్ దీక్ష భూమిని సందర్శించి ప్రేమ్ సింగ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష భూమి అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కమిటీకి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కాగా దీక్ష భూమి వద్ద మూడు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. -
మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నరేశ్‌జాదవ్
కై లాస్‌నగర్: జిల్లాలోని కుప్టి, కొరటా– చనాఖా ప్రా జెక్టుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు నరేశ్ జా దవ్ కోరారు. శనివారం ఆయన రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కుప్టి ప్రాజెక్టు నిర్మాణంతో పాటు కొరటా–చనాఖా ప్రాజెక్టును పూర్తిచేసేలా నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. వీటి పై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలి పారు. ప్రాజెక్టుల మంజూరుతో పాటు నిర్మాణ ప నులు త్వరగా పూర్తి చేసేలాచర్యలు తీసుకుంటా మ ని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి ఉన్నారు. -
పండుగ ఆనందంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: సంక్రాంతి పండుగను ఆనందంగా అందరూ జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించా రు. పిల్లలకు గాలిపటాలు, మహిళలకు ము గ్గు ల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పతంగీ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనామాంజా, అసాంఘిక కార్యకలాపాలకు ప్ర జలు దూరంగా ఉండాలని సూచించారు. ము గ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీని వాస్, జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాల పుట్ట
సర్వే, భూ రికార్డులశాఖ తీరిది!సాక్షి,ఆదిలాబాద్: సర్వే భూరికార్డుల శాఖలో అక్రమాల పుట్ట పగులుతోంది. అధికారం అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా అదనపు సేత్వార్లు (సప్లిమెంటరీ సేత్వార్) జారీ చేయడం, అసలు హక్కుదారుల వివరాలు నామరూపాలు లేకుండా చేయడంలో ఈ శాఖ సర్వేయర్లు, అధికారులు రియల్టర్లతో కలిసి నడిపిన అక్రమ భూ దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో జిల్లా కేంద్రంలోని 65 సర్వే నంబర్లో కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంలో సప్లిమెంటరీ సేత్వార్ జారీతోనే భూ అక్రమార్కులకు పని సులువైంది. ఈ వ్యవహారంపై బాధితులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో బడా రియల్టర్లు, వ్యాపారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ సర్వేయర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. తాజాగా మావల పరిధిలో జరిగిన మరో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. గతేడాదిలో.. గత అక్టోబర్‌లో 65 సర్వే నంబర్లో 2.10 ఎకరాల భూమాఫియాకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం కలిగించింది. ఈడీ ఆధీనంలో, ఎస్బీఐ మార్టిగేజ్లో ఉన్న భూమికి సంబంధించి రియల్టర్లు కుమ్ముకై ్క మొదట తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఎలాగైనా ఈ భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో సర్వే అధికారుల ద్వారా సప్లిమెంటరీ సేత్వార్ తీసుకున్నారు. ఇలా భూములకు సంబంధించి అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి అదనపు సేత్వార్ జారీ ద్వారా అక్రమార్కులకు రెవెన్యూ, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులు వంతుపాడుతూ వస్తున్నారు. తద్వారా ఏళ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్న ఈ శాఖలోని ఉద్యోగుల్లో కొంత మంది కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు లేకపోలేదు. తాజాగా మావలలో.. మావలలో కోట్ల విలువైన 16 గుంటల భూమికి సంబంధించి జరిగిన భూమాఫియాపై బాధితులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఆ బాధితులు మళ్లీ పోలీసులను ఆశ్రయించడం, జిల్లా పోలీసులు తిరిగి ఈ కేసుపై దృష్టి సారించడం సంచలనం కలిగిస్తోంది. మావల గ్రామ సర్వేనం.181/4లో అదనపు సేత్వార్ అక్రమంగా జారీ చేయడం, ఫోర్జరీ ఆరోపణలపై పోలీసులు మావల తహసీల్దార్‌ను కొన్ని వివరాలు ఇవ్వాలని వివరణ కోరడం సంచలనం కలిగిస్తుంది. భూమిపై హక్కును హరించివేశారు.. మావలలో కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆ భూమికి సంబంధించి అదనపు సేత్వార్ జారీ విధానంపై వివరాలు కోరుతూ మావల తహసీల్దార్‌ను వాటిని పంపించాలని కోరడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సర్వే రికార్డులను మార్చివేసి కొంత మంది అధికారులతో కలిసి అక్రమంగా ఆ భూమిని పొందారని, తద్వారా ఆ భూమిపై తన హక్కును హరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది ఓ భూమికి సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ జిల్లాలో రెవెన్యూ, సర్వే భూరికార్డుల శాఖల అధికారులు ఇటు రిజిస్ట్రేషన్, అటు అదనపు సేత్వార్లు జారీతో ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు.. అసలు హక్కుదారుల వివరాలను నామరూపాలు లేకుండా చేసి రియల్టర్లకు ఎలా వంతు పాడుతున్నారనేది తేటతెల్లం అవుతుంది. అదనపు సేత్వార్ జారీ విధానంపై ఆరా.. అదనపు సేత్వార్ జారీలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు నిశితంగా దృష్టి సారించారు. ఈ సప్లిమెంటరీ సేత్వార్ జారీలో సర్వేయర్లు ఫీల్డ్ పరిశీలన నిర్వహించారా..? ప్రభావిత పట్టాదారులందరికి (పిటిషనర్‌తో సహా) నోటీసులు జారీ చేశారా..? అనే విషయాలపై స్పష్టతనివ్వాలని రెవెన్యూ అధికారులను పోలీసులు కోరడం జరిగింది. ఇదీ ఈ ఒక్క కేసు విషయంలోనే అనుకుంటే పొరపాటే. ఆదిలాబాద్ చుట్టుపక్కల అనేక భూములకు సంబంధించి సప్లిమెంటరీ సేత్వార్ల జారీలో జరిగిన అనేక మోసాలకు ఈ సేత్వార్ జారీ విధానంలో సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించారా లేదా అనేది స్పష్టమవతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులేమన్నారంటే.. -
మాతా శిశు మరణాల నివారణే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: మాతా శిశు మరణాలు పూర్తి గా అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వై ద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, వివిధ విభాగా ల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడాలని సూచించారు. 2027 నాటికి మాతా శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తగ్గించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రసవం జరిగిన తర్వాత బాలింతలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలన్నారు. కార్డియాలజీ, రేడియాలజీ, గైనకాలజీ విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. ఏ ఎన్సీ కేసులు, హాజరు, ఇతర సమస్యల పరి ష్కారానికి హెచ్వోడీలు, డ్యూటీ డాక్టర్లు, పీజీ లు, సీనియర్ రెసిడెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథో డ్, అదనపు డీఎంహెచ్‌వో సాధన, వైద్యాధికా రులు అనంత్‌రావు, దీపక్, కళ్యాణ్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రోజు ఒకరింట్లో పిండి వంటలు
మేము ముగ్గురం మంచి స్నేహితులం. ఏ పండుగనైనా మా కుటుంబాలతో కలిసి జరుపుకుంటాం. రెండు మూడు రోజుల నుంచి రోజూ ఒక్కరి ఇంటి వద్ద పిండి వంటకాలు తయారు చేస్తున్నాం. దాదాపు పూర్తయినట్లే. పండుగ పూర్తయ్యే వరకు పిల్లలు, పెద్దలంతా సందడి చేస్తూ సంతోషంగా గడుపుతాం. – సుమలత, మమత, యామిని, శాంతినగర్ కాలనీమూడు రోజులైతంది..ఇంట్లో మూడు రోజులుగా పిండి వంటలు తయారు చేస్తున్నాం. పిల్లలు ఇంట్లో చేసినవే ఇష్టంగా తింటారు. పెద్ద మొత్తంలో వంటకాలు చేయాల్సి ఉండడంతో కాలనీలోని మహిళలందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటాం. – ముదికొండ కల్పన, తిర్పెల్లి -
చుట్టుపక్కల వారందరితో కలిసి..
ఉద్యోగ బాధ్యతలతో పాటు పిల్లలకు రుచికరమైన పిండి వంటలు చే యాల్సిందే. సాయంత్రం వేళలో మా స్నేహితురాళ్లతో కలిసి సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, గవ్వలు, ముర్కులు తయారు చేశాం. సంక్రాంతి పండగొచ్చిందంటే వా రం పది రోజులు ఇళ్లంతా సందడిగా ఉంటుంది. – భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఉద్యోగి, బ్రాహ్మణవాడ సకినాలు ప్రత్యేకంసంక్రాంతి అంటేనే పిండివంటలు. నానబెట్టిన బియ్యం పిండితో సకినాలు చేస్తాం. అలాగే అరిసెలు, గారెలు, లడ్డూలు, ఇలా పిల్లలకు ఇష్టమైన అనేక రకాలను ఇంటిళ్లిపాది కలిసి తయారు చేస్తాం. పండుగ రోజు ఆనందంగా గడుపుతాం. – సరిత, రవీంద్రనగర్ -
ప్రకృతి ఒడిలో ‘సదల్పూర్’
బేల మండలంలోని సదల్పూర్ గ్రామంలో గల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ మహాదేవ్ భైరాందేవ్ ఆలయం ఉంది. దశాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని రాక్షసులు రాత్రికిరాత్రే నిర్మించినట్లుగా చెబుతుంటారు. ఇక్కడ ఏటా పుష్యమాసం నవమి రోజున జాతర మొదలవుతోంది. కొరంగే వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమమై19 వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఆలయం జిల్లా కేంద్రం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేలవరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. -
బోనాల స్పెషల్.. పూసాయి
● పుష్య మాసం.. జాతరలకు ప్రత్యేకం ● జిల్లాలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికతభోరజ్ మండలం పూసాయి గ్రామంలో ఎల్లమ్మతల్లి ఆలయం ఉంది. ఏటా పుష్యమాసంలో నెల పాటు జాతర కొనసాగుతుంది. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే చర్మ వ్యాధులు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఈమేరకు కుటుంబాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. డిసెంబర్ 20న ప్రారంభమైన జాతర జనవరి 20 వరకు కొనసాగనుంది. ప్రతీ ఆదివారం, శుక్రవారం రద్దీ ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు. -
‘పుణ్య’ పూజలకు కేరాఫ్.. పెన్‌గంగ
మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని డొలార(తెలంగాణ)– పిప్పల్‌కోటి(మహారాష్ట్ర) పెన్‌గంగ వద్ద ఏటా పుష్యమాసంలో పెన్‌గంగ జాతర నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాఠన్‌బోరి గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గురువులు రామానంద్, మాధవ్రావుల పుణ్యతిథి పురస్కరించుకుని నిర్వహించే జాతరకు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. పాఠన్‌బోరి నుంచి ఆ గురువుల పాదుకలను పెన్‌గంగ తీరంలో గల ఆలయం వద్దకు తీసుకువస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం చేపడుతారు. ఈ నెల 5న ప్రారంభమైన జాతర మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. భక్తులు నదిమాతల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం నదికి ఈ ప్రాంతంలో భక్తజన సందడి కనిపిస్తోంది. -
మెస్రం ఆరాధ్యదైవం.. నాగోబా
మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ ఆలయం కొలువై ఉంది. పుష్యమాసాన్ని ఆదివాసీలు పవిత్రంగా భావిస్తారు. తొలి రోజున కేస్లాపూర్లో సమావేశమై నాగోబా జాతరలో భాగంగా ప్రచార రథయాత్రకు శ్రీకారం చుడుతారు. అదే రోజున పాదయాత్ర రోడ్‌మ్యాప్ ప్రకటిస్తారు. మైళ్ల దూరం ప్రయాణించి గోదావరి నుంచి పవిత్ర గంగా జలం సేకరిస్తారు. వాటితో అమవాస్య అర్ధరాత్రి నాగోబాను అభిషేకిస్తారు. ఈ ఏడాది 18న మహాపూజతో జాతర ప్రారంభం కానుంది. ఈ జాతరకు రాష్టం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దర్బార్‌ను సైతం నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో నాగోబా ఆలయం ఉంది. భక్తుల సౌకర్యార్థం జాతర సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. -
కేంద్ర నిధులతోనే అభివృద్ధి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాను కేంద్ర ప్రభుత్వ ని ధులతో అభివృద్ధి చేసేలా అన్ని బాధ్యతలు తీసుకుంటామని ఎంపీ గొడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీ లో గల పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలి సి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కార్యకర్తలు అన్ని వార్డుల్లో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించిక పోయినా జిల్లా అభివృద్ధికి తమవంతు బాధ్యతగా నిధులు తీసుకొస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ చేపట్టని రైల్వే బ్రిడ్జి పనులను తాము వంద శాతం చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ కు ఎయిర్‌పోర్టు, ఆర్వోబీ, ఆర్యూబీ పనుల ను మంజూరు చేశామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు నగేశ్, విజయ్, ప్రవీణ్, రాజు, క్రాంతి, లాలామున్నా, రఘుపతి, రాందాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రమాదాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మ హా జన్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వా ర్టర్స్ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో ఈ ఏడాది 20శాతం వరకు రోడ్డు ప్ర మాదాలను తగ్గించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మా ంజాను కట్టడి చేస్తామని పేర్కొన్నారు. లక్కీ డ్రాలు నిర్వహించకుండా చర్యలు చేపడతామని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. గత నెలలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, బీ సురేందర్‌రావు, ఏఎస్పీ అడ్మిన్ మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, డీఎ స్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘సీనియర్ టీచర్లకు టెట్ వద్దు’
ఆదిలాబాద్‌టౌన్: సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు బెజ్జంకి రవీంద్ర డిమాండ్ చేశారు. అఖి ల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మ ధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఉందని నోటిఫికేషన్లో పేర్కొ న్న ఎన్సీటీఈ ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు స్ప ష్టంగా తెలియజేయడంలో విఫలమైందని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలైనా కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్సీటీఈ స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియమితులై న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావా లన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐజాక్టో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మా ర్చ్ నిరసనను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఎస్టీయూ అర్బన్ మండలాధ్యక్షుడు బేతం పోచారెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హె చ్ఎం నయ్యర్ జాన్ఆరా బేగం, ఎస్టీయూ నాయకు లు మురళి, శేఖర్, సంజీవరావు, భీంరావు, దిల్షాద్ రుబీనా, పాండురంగ, మాధవి తదితరులున్నారు. -
అక్షరాస్యులుగా మారాలి
కైలాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులంతా అక్షరాస్యులుగా మారాలని మె ప్మా డీఎంసీ శ్రీనివాస్ సూచించారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణ పే దరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో రిసోర్స్ పర్సన్లు, ఎస్ఎల్ఎఫ్ ఓబీలు, సీసీ లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో చదువుకున్న వారికి మార్చిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తీర్ణులైనవారికి ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రా సే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్య క్రమంలో వయోజన విద్యాశాఖ డీడీ శ్రీనివాసరెడ్డి, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి, సీవోలు గంగన్న, సందీప్‌రెడ్డి, పండరి, రాష్ట్ర సీఆర్పీలు ప్రమీల, సునీత, టీఎల్ఎఫ్ ఉపాధ్యక్షురాలు వందన తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు.. భూముల స్వాధీనం
కైలాస్‌నగర్: భూమి కొనుగోలు పథకం కింద ఆది లాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామానికి చెందిన అడ్డురి రమణాబాయి సర్వే నంబర్ 83లో ఎకరా 15గుంటలు, సిరికొండ మండలానికి చెందిన కుమరం జంగు బాపునకు సర్వే నంబర్ 57/అ/1లోని ఆరెకరాల 18గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కొంతమంది అక్రమార్కులు వీరి భూములను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తమ పేరిట పట్టా చేసుకున్నారు. దీంతో బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేసి భూ ములు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి అసలైన లబ్ధి దారుల పేరిట పట్టాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో క లెక్టర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తమ భూములు తమకు దక్కడంతో లబ్ధిదారులు కలెక్టర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారంలో చొరవ చూపిన ఆర్డీవో స్రవంతి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ తహసీల్దార్లు గోవింద్ నాయక్, తుకారాంను కలెక్టర్ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు. పేదలకు అండగా అఽధికార యంత్రాంగం కై లాస్‌నగర్(బేల): పేదలకు అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం బేల మండలంలోని భవానీగూడకు చేరుకున్న కలెక్టర్‌కు మహిళలు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులకు కలెక్టర్ దుప్పట్లు పంపి ణీ చేశారు. జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు చెప్పా రు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, తహసీల్దార్ రఘునాథ్‌రావు, ఎంపీడీవో ఆంజనేయులు, సర్పంచ్ సునీత తదితరులున్నారు. ఆర్వో ప్లాంట్ ప్రారంభం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యపాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. దాతల సహకారంతో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటా రు. సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో పాల్గొన్నారు. పాఠశాలలోని కిచెన్‌షెడ్, ఆరోగ్య పాఠశాల లక్ష్యాలను చాటేలా గోడలపై రాయించిన వాల్ పెయింటింగ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయ న వెంట హెచ్ఎం కృష్ణకుమార్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ముసాయిదా’.. తప్పుల తడక
కైలాస్‌నగర్: ముసాయిదా ఓటరు జాబితాలో దొర్లి న తప్పుల సవరణపై ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 1న ప్రకటించిన జాబితాలో పలు వార్డుల్లోని ఓటర్ల వివరాలు తారుమారయ్యాయి. ఒక వార్డులోని ఓటర్ల ను మరో వార్డులోకి చేర్చడంతో గందరగోళ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాజకీయ పార్టీలతో పాటు ఓ టర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పారదర్శక జాబితా రూపకల్పన దిశగా చర్యలు చేపట్టారు. తమకు అందిన అభ్యంతరాలపై వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి కి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఓటర్ల వివరాల ను ప్రత్యక్షంగా సేకరిస్తున్నారు. వాటి ఆధారంగా జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటించనుండగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెల్లువలా అభ్యంతరాలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రా ష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 1న మున్సిపల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబి తా ప్రకటించారు. ఈ జాబితా పూర్తి తప్పుల తడకగా మారింది. ఓటర్ల వార్డులు తారుమారు కావడం, మృతుల పేర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్ల పేర్లు జా బితాలో చేర్చడంపై ఆందోళన వ్యక్తమైంది. దీంతో వీటిపై అభ్యంతరాలు స్వీకరించేందుకు అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉద్యోగులను నియమించి ఈ నెల 2నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలు అందుతున్నాయి. తమ ఓట్లు వేరే వార్డులోకి వెళ్లాయని, తమను ఫలానా వార్డులోనే కొనసాగించాలని, త మ వార్డులో కొత్త ఓట్లు భారీగా చేరాయని, గ్రామీ ణ ప్రాంత ఓటర్లను తొలగించాలని, మృతి చెందిన ఓటర్ల వివరాలు కూడా ఉన్నాయని.. వాటిని తీసివేయాలంటూ ఇలా వివిధ కారణాలతో ఫిర్యాదులు, విజ్ఞప్తులు అందుతున్నాయి. ఈ నెల 2నుంచి 9వరకు 308 ఫిర్యాదులు అందాయి. ఈ నెల 2న 6 అభ్యంతరాలు, 3న 59, 4న 44, 5న 151, 6న 20, 7న 14, 8న 10, 9న 4 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని నమోదు చేసుకుంటున్న సిబ్బంది ఆ తర్వాత ఎన్నికల విభాగానికి పంపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిశీలన మున్సిపల్ అధికారులకు అందుతున్న ఫిర్యాదుల ను పరిశీలిస్తున్న ఎన్నికల విభాగం సిబ్బంది వాటిని వార్డుల వారీగా విభజిస్తున్నారు. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన చేస్తున్నారు. ఓటర్లు స్థానికంగానే ఉంటున్నారా? అనేదానిపై ఆరా తీయడంతో పాటు వారు నివాసముండే ఇంటి నంబర్లు, ఓటరు ఎపిక్ కార్డులను పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా క్షే త్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని తిరిగి ఎన్ని కల విభాగంలో అందజేస్తున్నారు. అక్కడి సిబ్బంది వార్డులోని ఓటరు జాబితాలో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. బల్దియా యంత్రాంగమంతా ప్రస్తుతం ఓటరు జాబితాతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తులో నిమగ్నమైంది. అయితే సమయం తక్కువగా ఉండటంతో పొరపాట్లకు తావులేని పారదర్శక జాబితా అందిస్తారా? లేదా.. పోలింగ్ రోజున ఓటర్లను ఇబ్బందులకు గు రిచేస్తారా? అని ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆశావహుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. చర్యలు చేపడుతున్నాం ముసాయిదా ఓటరు జాబితాపై ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. వార్డుల వారీగా వివరాలు వార్డు అధికారులకు అందజేస్తున్నాం. వారు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రత్యేక పరిశీలన జరుపుతున్నారు. పొరపాట్లను సవరించి ఎలాంటి తప్పుల్లేని పారదర్శక ఓటరు జాబితాను సిద్ధం చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదు. – కళ్యాణ్, మున్సిపల్ రెవెన్యూ అధికారి -
సాయజ్ గ్రామాన్ని సందర్శించిన అఖిలపక్షం
సాత్నాల: మండలంలోని దుబ్బగూడ అనుబంధ సాయజ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కు అటవీశాఖ అడ్డుపడడంతో కొలాం, ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట ఏడురోజులుగా నిరవధిక దీక్షలు చేపడుతుండగా వారికి మద్దతుగా.. అఖిలపక్ష, ప్ర జాసంఘాల నాయకులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ.. కొలాం, ఆ దివాసీల ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖ అడ్డుకోవడం సరికాదని, ఇది రెవెన్యూ భూమిగానే ఉందని నిర్ధారించారు. రెవెన్యూ పట్టా ఉండి 40 ఏళ్లు నివాసము న్నా అటవీశాఖ భూమి అనడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. తక్షణమే కలెక్టర్ రాజర్షి షా చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చే యాలని, అటవీశాఖ మానవతా దృక్పథంతో ఆది వాసీల ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరా రు. అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలపై చిన్నచూపు తగదని, వారి అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. ఆగి పోయిన ఇండ్లకు వెంటనే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకట్‌నారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, దుబ్బగూడ సర్పంచ్ జాదవ్ కాలురాం, సాంగ్వి సర్పంచ్ ఆత్రం నగేశ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తనుష్, ఉపాధ్యక్షుడు మాడవి నాగరావ్ తదితరులున్నారు. -
అంధుల జీవితాల్లో వెలుగు నింపిన బ్రెయిలీ
కైలాస్‌నగర్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. శ్యామలాదేవి అంధత్వ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన బ్రెయిలీ 17 ఏళ్లలోనే తాను చదివిన పాఠశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారని తెలిపారు. అంధత్వంతో కలిగే ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే ప్రత్యేక లిపి త యారు చేశారని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి సృష్టించిన ఈ లిపి ప్రస్తుతం ఎందరో అంధుల జీవి తాల్లో వెలుగులు నింపుతోందని తెలిపా రు. లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట జిల్లా సంక్షేమాధికా రి మిల్కా తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారుల గుర్తింపునకే పోటీలు
తాంసి: గ్రామాల్లోని క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికే ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని డీవైఎస్వో శ్రీనివాస్ పే ర్కొన్నారు. పొటీల్లో భాగంగా చేపట్టిన టార్చ్ రిలే ర్యాలీ శుక్రవారం మండల కేంద్రానికి చేరుకోగా ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ ల క్ష్మి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎ స్వో మాట్లాడుతూ.. ఈ నెల 17నుంచి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ని క్రీడాకారులు పంచాయతీ కార్యదర్శుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. డీటీ ప వన్ జాదవ్, ఆర్ఐ సంతోష్, వివిధ శాఖల అ ధికారులు, పంచాయతీ కార్యదర్శులున్నారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి రాజేశ్వర్ సూచించారు. శుక్రవారం డీఈవో చాంబర్లో వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. పీఎంశ్రీ ని ధుల్లో అక్రమాలు జరగకుండా పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని, బిల్లులను డీటీవో లో అందించాలని తెలిపారు. కేజీబీవీల్లో మె నూ ప్రకారం విద్యార్థినులకు భోజనం పెట్టాల ని, మెస్‌చార్జీ లను పరిశీలించాలని ఆదేశించా రు. ఉల్లాస్ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రాథమి క పాఠశాలల హెచ్ఎంలు పరిశీలించాలని, 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. రాజేశ్వర్‌రావు వెంట ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ అశోక్, సెక్టోరల్ అధికారులు రఘురమణ, తిరుపతి, మండల విద్యాధికారి సోమ య్య, ఏడీ వేణుగోపాల్‌గౌడ్, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులున్నారు. -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌రూరల్: ఈజీఎస్ పనుల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని అడిషనల్ డీఆర్డీవో కుటుంబరావు సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ రూర ల్ మండల పరిషత్ సమావేశ మందిరంలో 2024–25లో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రూ.7.60కోట్లతో పనులు ప్రారంభించి రూ.7.50 కోట్లు కూలీలకు చెల్లించగా.. రూ.10 లక్షలు మెటీరియల్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, రూ.4.17 కోట్లతో పీఆర్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర పనులు చేపట్టినట్లు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో నర్సరీల్లో మొ క్కల పెంపకం చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, పొ రపాట్లు చేసిన ఉద్యోగులకు చిన్నపాటి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణారా వు, గజానంద్, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి రాజేశ్వర్, అంబుల్డ్ మ్యాన్ వీణ, ఎంపీడీవో వంశీకృష్ణ, ఎస్ఆర్పీలు కొమురయ్య, మహేశ్, ఏపీవో జాకిర్ హుస్సేన్, టీఏ తదితరులున్నారు. -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతిఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నం.1లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అతివేగం ప్రమాదకరమని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్, అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సోమయ్య, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, కోఆర్డినేటర్ తిరుపతి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు అండగా ఉంటాం
ఆదిలాబాద్‌టౌన్: సాత్నాల మండలంలోని దుబ్బ గూడ కొలాం ఆదివాసీలకు అండగా ఉంటామని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కా ర్యాలయంలో అఖిలపక్ష, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరి కాదన్నారు. తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అట వీ అధికారులు అడ్డుకుంటే సహించేది లేదన్నారు. 12న డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడి, 16న సాత్నాల మండల బంద్ చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో లంకా రాఘవులు, దర్శనాల మల్లేశ్, నగేశ్, సచిన్, వెంకటనారాయణ, దేవేందర్, దాదారావ్, మనోజ్, వసంత్‌రావు, గోవింద్, శేషారావు, దత్తాత్రి, మంజుల, ప్రభావతి, రాధ, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి
ఆదిలాబాద్‌రూరల్: పీఎం జన్మన్ కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఆటంకం లేకుండా త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ కోరారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను హైదరాబాద్‌లో గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలపై అటవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కలెక్టర్, ఐటీడీఏ పీవో, అటవీ అధికారులను కలిసి సమస్యను వివరించినట్లు తెలిపారు. అలాగే ఐటీడీఏ ఎదుట ఆందోళనలు సైతం చేపట్టామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. అయితే సమస్యపై సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారరం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాందాస్, సూరు, టేకం భీం, సొనేరావ్, వివిధ గ్రామాల పటేళ్లు చిన్ను, రమేశ్, మాణిక్ రావ్, రవి తదితరులున్నారు. -
పోరాటాలు మరింత ఉధృతం
ఆదిలాబాద్‌టౌన్: మహిళల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పో రాటాలను మరింత ఉధృతం చేస్తామని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఆర్.మంజుల, కోశాధికారిగా టి.ప్రభా వతి ఎన్నిక కాగా, అధ్యక్షురాలిగా కోవె శకుంతల కొనసాగనున్నారు. అనంతరం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత, జిల్లా కమిటీ సభ్యులు పి.రాధ, గంగసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
లంబాడాలను ‘ఎస్టీ’ నుంచి తొలగించాలి
కై లాస్‌నగర్: చట్ట బద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఆయన కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికేలను ఢిల్లీలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. తెలంగాణలో ఏళ్లుగా ఎస్టీలుగా చలామణి అవుతున్న లంబాడాలు ఎస్టీలు కాదని, తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే పలుమార్లు రుజువులతో సహా నివేదికలు అందించామన్నారు. సుప్రీంకోర్టులో కేసు త్వరితగతిన పరిష్కారమైతేనే నిజమైన ఆదివాసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరికాదన్నారు. మంత్రులను కలిసిన వారిలో ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, ఆధార్ సొసైటీ ట్రెజరర్ పాపయ్య, న్యాయవాదులు పాపారావు, వాసం ఆనంద్ ఉన్నారు. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఓ వైపు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠంతో పాటు వార్డు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ వార్డులో ఎలాంటి రిజర్వేషన్ వస్తుందో అనే దానిపై జోరుగా చర్చ సాగుతుంది. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా ప్రకటించాక రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశముంది. పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రొటేషన్ విధానం అమలు చేస్తారా త్వరలోనే తేలనుంది. మున్సిపల్ యూనిట్‌గా రిజర్వేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధానంగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12న ప్రకటించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే దామాషా ప్రకారం సామాజికవర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. చైర్మన్ పీఠాన్ని రాష్ట్రం యూనిట్‌గా ఖరారు చేయనుండగా వార్డు కౌన్సిలర్ స్థానాలను మున్సిపల్ యూనిట్‌గానే కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం స్థానాలను ఖరారు చేయనుండగా మిగతా 50శాతం వార్డులను మహిళలకు రిజర్వు చేయనున్నారు. గతంలోని రిజర్వేషన్లను కాకుండా రొటేషన్ విధానంలో కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏయే వార్డులు ఎవరికి ఖరారవుతాయనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించే మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించాకే దానిపై ఉత్తర్వులు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. గతంలో ఇలా ... ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 49 వార్డులున్నాయి. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాన్ని జనరల్ కేటగిరీగా రిజర్వ్ చేశారు. ప్రస్తుతం రొటేషన్ విధానం అమలు చేయనుండటంతో ఈ సారి ఏ కేటగిరికీ రిజర్వు అవుతుందానే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనరల్ మహిళ లేదంటే బీసీ మహిళకు రిజర్వు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వార్డులు సైతం జనాభా దామాషా ప్రకారం రిజర్వు చేయనున్నారు. ఈ క్రమంలో మెజార్టీ వార్డుల్లో రిజర్వేషన్లు మారనున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇందులో పాతకాపులకు ఎంత మందికి కలిసి వస్తుందనేదానిపై ఎవరికి వారుగా లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన ఓటరు జాబితాలోని మెజార్టీ ఓటర్లు, గతంలో వచ్చిన రిజర్వేషన్లను పరిశీలిస్తూ అంచనా వేస్తున్నారు. అయితే ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్లు కేటాయిస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వీటిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత రానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో కేటాయించిన వార్డుల రిజర్వేషన్ల వివరాలు.. రిజర్వేషన్ కేటగిరీ వార్డులు ఎస్టీ మహిళ 19 ఎస్టీ జనరల్ 18, 20 ఎస్సీ మహిళ 7, 15, 39 ఎస్సీ జనరల్ 13, 30, 33 బీసీ మహిళ 1, 5, 6, 21, 22, 28, 35 బీసీ జనరల్ 2, 4, 23, 25, 29, 34, 40, 45 మహిళ జనరల్ 8, 10, 14, 16, 26, 27, 31, 32, 36, 38, 44, 46,47 జనరల్ 3, 9, 11, 12, 17, 24, 37, 41, 42, 43, 48, 49 -
● పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు ● 315 సర్వీసులు నడిపేలా ప్రణాళిక ● టికెట్‌పై 50శాతం అదనపు వడ్డెన
ఆదిలాబాద్: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంత ఊర్లకు రానున్నారు. ఈమేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టికెట్‌పై 50శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నట్లుగా ప్రకటించింది. 7 నుంచి 14వ తేదీ వరకు.. సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 11నుంచి 17వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారు పండుగకు సొంత ఊర్లకు వస్తుంటారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి భాగ్యనగరానికి, హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు బుధవారం నుంచి ఈనెల 14 వరకు 315 స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అయితే ఈనెల 9నుంచి 12వరకు ఆదిలాబాద్ రీజియన్‌లోని బస్సులు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కాకుండా సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి బయలుదేరనున్నాయి. రాజధానిలో సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఈ మేరకు ఈ సర్వీస్లన్ని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. రద్దీ అంచనాలకు మించి ఉంటే దానికి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందస్తు రిజర్వేషన్ కోసం.. రిజర్వేషన్ చేసుకోవాలనుకునే ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లలో కౌంటర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే www. tgsrtcbus. In వెబ్సైట్ ద్వారా కూడా సీటు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల జేబుకు చిల్లు.. సాధారణంగా పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిసి వెలుతున్నాయి. దీంతో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులు నిలబడి వెళ్లాల్సిన దుస్థితి. తాజాగా స్పెషల్ బస్సుల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రత్యేక సర్వీసుల్లో ఏకంగా 50శాతం అదనపు చార్జీ వసూలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడనుంది. గతంలో సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని వంటి హై అండ్ సర్వీసుల్లోనే అదనపు చార్జీలు వసూలు చేసేవారు. ఈసారి ఏర్పాటు చేసిన ప్రతీ స్పెషల్ బస్సులోనూ అదనపు వడ్డనకు రంగం సిద్ధమైంది. విద్యార్థులకు ‘ప్రత్యేక’ సర్వీసులువిద్యా సంస్థలకు సెలవుల నేపథ్యంలో తమ సొంత ఊర్లకు రావాలనుకునే విద్యార్థులకు సంస్థ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు ఒకేచోట 50 మంది ఉంటే, వారు ఉన్నచోటికి బస్సును పంపి తమ గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈమేరకు సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదిస్తే ప్రత్యేక సర్వీసులు వారికోసం ఆపరేట్ చేస్తారు.డిపో బస్సుల సంఖ్య ఆదిలాబాద్ 64 భైంసా 15 నిర్మల్ 99 ఆసిఫాబాద్ 36 మంచిర్యాల 101 -
పర్యావరణహితమే లక్ష్యం
ఆదిలాబాద్: పర్యావరణహితంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కై ట్ ఫెస్టివల్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలన్నారు. కాగితపు పతంగులు, సాధారణ దారం మాత్రమే వినియోగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే చైనా మాంజా నిషేధమన్నారు. కార్యక్రమంలో డీఎస్సీడీవో బి.సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, ఎస్డబ్ల్యూవోలు నారాయణరెడ్డి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
ఇంద్రవెల్లి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని,ఈ మేర కు ఆదివాసీలు తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ‘పోలీసు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాట గూడ(కే) గ్రామంలో గురువారం నిర్వహించి న దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూ రంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టాలన్నారు. ఫకీర్లు, మంత్రగాళ్లను నమ్మవద్దని, అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, సర్పంచ్‌లు రాజేశ్వర్, జమున నాయక్, శ్రీరాం, విఠల్, విజయమాల, పటేళ్లు తదితరులున్నారు. -
ఫర్టిలైజర్ డీలర్‌కు షోకాజ్
సిరికొండ: ‘యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని శివ ఫర్టిలైజర్ డీలర్‌కు ఆ శాఖ అధికారులు షోకాజ్ జారీ చేశారు. యూరియా పంపిణీ విషయంలో డీలర్ నిర్లక్ష్యం, అలాగే అధిక ధరకు విక్రయిస్తున్న తీరుపై నిరసిస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి గురువారం సదరు డీలర్‌కు షోకాజ్ జారీ చేశారు. -
కాల్ చేసి.. కాజేస్తూ
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే లక్ష్యంగా వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఏఐ వీడియో మెస్సేజ్, సోషల్ మీడియా ఫ్రాడ్, లోన్‌ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్, జాబ్ ఫ్రాడ్, ఫేక్ కాల్స్, బ్లాక్‌మెయిలింగ్, డిజిటల్ అరెస్ట్, స్టాక్ మార్కెట్, యూపీఐ ఫ్రాడ్, ఏపీకే లింక్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లు హ్యాక్ చేయడం.. ఇలా అనేక రకాలుగా వల విసురుతున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, లక్షలాది రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. అయితే బాధితుల్లో విద్యావంతులే అధికంగా ఉండటం గమనార్హం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ చాలా మంది తెలిసి కూడా తప్పులు చేస్తున్నారనేది బహిర్గతమవుతోంది. వల వేసి.. దోచుకోవడమే సైబర్ కేటుగాళ్లు కాల్ చేసి బహుమతులు వచ్చాయని, కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నారని నమ్మిస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌లను హ్యాక్ చేసి తమ పనులు కానిచ్చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి పలు సందేశాలు పంపి మనకు తెలిసిన వారి నుంచి డబ్బులు అడుగుతున్నారు. చిన్నపాటి టాస్క్ ఇచ్చి పూర్తవగానే కొంత డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. అలా నమ్మే వరకు రెండింతలు వేసి పెద్ద మొత్తంలో డబ్బులు వేసినప్పుడు ఉడాయిస్తారు. పండుగల పేరిట.. పండుగలు, వివిధ సందర్భాల్లో సైబర్ కేటుగాళ్లు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ అంటూ మెస్సేజ్ రూపంలో లింక్‌లను పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసిన వారు తమ అకౌంట్‌ను ఖాళీ చేసుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ పిల్లలు డ్రగ్స్, దొంగతనం కేసుల్లో ఇరుక్కుపోయారు. వీడియో కాల్ చేయండి చూపిస్తామని చెప్పి పక్కనుంచి అరుపులు, ఏడ్పులు వినిపిస్తారు. వీడియో కాల్ చేసిన తర్వాత యూనిఫాం వేసుకొని మాట్లాడతారు. ఎఫ్ఐఆర్ కాపీని వాట్సాప్‌కు పంపి కేసు అయ్యిందని నమ్మిస్తారు. డబ్బులు వేస్తే విడిచిపెడతామని బెదిరిస్తారు. దీంతో పాటు నిరుద్యోగులకు టోకరా వేసేందుకు వర్క్‌ఫ్రమ్ హోమ్ పేరిట జాబ్ ఉందని చెబుతారు. నెల వేతనం పంపిస్తారు. దీంతో నమ్మిన వారు స్నేహితులకు కూడా జాబ్ ఉందని చెబుతారు. అయితే వారి నుంచి రూ.30వేలను మోసగాళ్లు వారి ఖాతాల్లో వేయించున్న ఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకున్నాయి. సైబర్ నేరాల వివరాలు..నమ్మించి మోసం చేస్తారు.. సైబర్ నేరగాళ్లు రోజుకో పుంతలో మోసాలకు పాల్పడుతున్నారు. నమ్మించి మోసం చేస్తారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారిని, అపరిచిత వ్యక్తులను ఎవరు నమ్మవద్దు. ఫేక్ పోలీస్, డిజిటల్ అరెస్ట్, ఇలా అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడతారు. డబ్బులు పోగొట్టుకున్న వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. గోల్డెన్ ఆవర్‌లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. – ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ జిల్లాలో ఆగని మోసాలు..సంవత్సరం వెబ్సైట్లో నమోదైన కోర్టు ద్వారా రికవరీ స్వాధీనం చేసుకున్న 2025 603 132 194 49,87,985జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చెప్పుకోలేక కుమిలిపోతుండగా, మరికొంతమంది పో లీసులను ఆశ్రయిస్తుండడంతో వెలుగులోకి వస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే 1930 టోల్‌ఫ్రీకి సమాచారం అందిస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నా రు. గత రెండేళ్లుగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 23 దాకా నమోదు కాగా రూ.6లక్షల వరకు బాధితులు నష్టపోయారు. -
పెండింగ్ దరఖాస్తులపై అలసత్వం వద్దు
కై లాస్‌నగర్: భూసమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, సర్వేయర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి అందే ప్రతీ దరఖాస్తును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. భూభారతి కింద 60 రోజుల మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఎస్ఐఆర్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలు, పిడుగుపాటు మరణాలు, హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన నివేదికలు త్వరగా పూర్తిచేసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా శ్రద్ధ వహించాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెండింగ్, బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ వంటి అంశాలు వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో స్రవంతి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వికేంద్రీకృత ప్రజావాణి మరింత బలోపేతం చేయాలి కై లాస్‌నగర్: వికేంద్రీకృత ప్రజావాణిని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీవోలు, సాట్ డైరెక్టర్, రిసోర్స్ పర్సన్లు, పౌర సమాజ సభ్యులతో కలిసి ఆయా మండలాల్లో గతేడాది సాధించిన పురోగతిపై ఆరా తీశారు. వికేంద్రీకృత ప్రజావాణిని మరింత ముందుకు తీసుకెళ్లడం, జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన మార్పులపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. భవిష్యత్తులో కలెక్టరేట్ ప్రజావాణి, మండల ప్రజావాణి, వికేంద్రీకృత ప్రజావాణి ప్రక్రియలను ఏకీకృతం చేయాలని పేర్కొన్నారు. మండల ప్రజావాణి ప్రక్రియను డిజిటలైజ్ చేసి వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కొత్త ప్రజా వాణి విధానం జనవరి 19 నుంచి ప్రతీ సోమవారం మండల స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: జాతీయ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. 37వ జా తీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశిమందిర్లో రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలి పారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలను తెలియజేయాలని సూ చించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్‌రావు డోలె, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మరింత బాధ్యతతో పనిచేయాలి
కై లాస్‌నగర్: అటవీ సంపద కొల్లగొడుతున్న వారికి కఠిన శిక్షలు పడేలా మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్ర శాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. అటవీనేరా ల కేసుల్లో చార్జిషీట్ దాఖలు, కోర్టుల్లో సమర్పించడంపై జిల్లాలోని ఎఫ్ఆర్వోలు, ఎఫ్ఎస్ వోలు, బీట్ అధికారులు, క్లర్క్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానిక టీటీడీసీలో బుధవారం శిక్షణ నిర్వహించారు. సీఐ ప్రేంకుమార్, జిల్లా కో ర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీం హాజరై ఆయా అంశాల్లో అటవీ అధికారులు పాటించాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, అటవీ సంపదతో పాటు వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని అంశాలను పాటించాలని సూ చించారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణ అటవీ అధికారి చిన్నబుసారెడ్డి , ఉట్నూర్ ఎఫ్‌డీవో అరవింద్, ఎఫ్ఆర్ఓ రాథోడ్ గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కోచ్‌లు లేని క్రీ‘డల్’!
ఆదిలాబాద్: క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు క్రీడా విధానాలను ప్రకటిస్తూనే క్షేత్రస్థాయిలో శీతకన్ను వేస్తున్నాయి. క్రీడాకారులకు ఆడాలనే ఆసక్తి ఉన్నా పలు ప్రాంతాల్లో మైదానాలు అందుబాటులో లేవు. మైదానాలు అందుబాటులో ఉన్న చోట శిక్షకులు లేరు. అరకొర నైపుణ్యాలతో క్రీడల్లో రాణించలేని దుస్థితిలో క్రీడాకారులున్నారు. దీంతో ఎంతోమంది ఎన్నో క్రీడాంశాల్లో తడబాటుకు గురై క్రీడలను అర్ధంతరంగా వదిలేస్తున్నా రు. క్రీడారంగాన్ని ఎంచుకుంటే భవిష్యత్ ఉంటుందో, లేదోనని తల్లిదండ్రులు కూడా చాలామందిని క్రీడల వైపు పంపించేందుకు సంశయిస్తున్నారు. నామమాత్రంగా డీఎస్ఏ.. జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ)నామమాత్రంగా తయారైంది. క్రీడల అభివృద్ధికి నామమాత్రంగా నిధులు వస్తున్నాయని, కార్యాలయాల నిర్వహణకే ఉద్యోగులు పరిమితమవుతున్నారనే అభిప్రాయం క్రీడాకారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలో విశాలమైన ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉంది. ఈ క్రీడా మైదానానికి నిత్యం ఎంతోమంది క్రీడాకారులు వస్తుంటారు. అయితే వీరికి నేర్పించడానికి శిక్షకులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. తాము స్వయంగా ఎంత సాధన చేసినా ఫలితం ఉండడంలేదని వాపోతున్నారు. శిక్షకులుంటే నైపుణ్యాలు అలవర్చుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలని భావిస్తున్నారు. తాత్కాలిక శిక్షకులను ఏర్పాటు చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం కూడా భవిష్యత్ క్రీడాకారులకు శాపంగా మారుతోంది. క్రీడా పాఠశాలలో ఉన్న శిక్షకులు క్రీడా పాఠశాల విద్యార్థులకే శిక్షణ ఇస్తున్నారు. దీంతో క్రీడాభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థల వైపు చూపు అర్హత, ఆసక్తి ఉన్న క్రీడాకారులు తాము ఇష్టపడే క్రీడలో రాణించేందుకు ప్రైవేట్ శిక్షణ సంస్థల వైపు దృష్టిస్తారిస్తున్నారు. నిరుపేద క్రీడాకారులు మా త్రం స్టేడియంలోనే ఎవరికి వారే పట్టుదలతో సాధ న చేస్తున్నారు. ఎగువ మధ్యతరగతి, ధనిక కుటుంబాల నేపథ్యం నుంచి వస్తున్న కొంతమంది క్రీడాకా రులు డబ్బులు చెల్లిస్తూ ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో త ర్ఫీదు పొందుతున్నారు. పిల్లల ఆసక్తిని ప్రోత్సహించడానికి కొందరు నిరుపేద తల్లిదండ్రులూ అప్పు చేసి ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు పంపుతున్నారు. ఆదాయ వనరులపైనే ఫోకస్ స్టేడియంలో శిక్షకుల నియామకంలో వెనుకడుగు వే స్తున్న డీఎస్ఏ ఆదాయం సమకూర్చుకోవడంలో మాత్రం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. స్వి మ్మింగ్ పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ చేతికిచ్చి ఆ దాయం పొందుతోంది. దుకాణాసముదాయం నుంచి వస్తున్న అద్దె, జిమ్, ఇండోర్ స్టేడియం నుంచి వస్తున్న ఫీజులతో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక స్విమ్మింగ్, ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ సాధ న చేయాలనుకునే క్రీడాకారులు వాటికి దూరమవుతున్నారు. కనీసం తాత్కాలిక శిక్షకులను నియమించి తమను ప్రోత్సహించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. -
రంగుమారిన సోయాను కొనుగోలు చేయాలి
ఆదిలాబాద్: రంగుమారిన సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ సాగు రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా ఉందని, ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పంట రంగు మారిందని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫేర్ ఆవరేజ్ క్వాలిటీ నిబంధనల ప్రకారం రంగు మారిన పంటను కొనుగోలు చేయడం లేదని తెలిపారు. రంగు మారిన పంట కొనుగోలుతో వచ్చే నష్టాన్ని 50శాతం వరకు భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిగతా నష్టాన్ని భరించి రైతులకు అండగా నిలవాలని సూచించారు. అప్పుడే అన్నదాతలపై ఉన్న ఆర్థికభారం తగ్గి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
గడువులోపు ఏర్పాట్లు చేయాలి
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి నిర్వహించనున్న నా గోబా జాతర ఏర్పాట్లు గడువులోపు పూర్తి చేయాల ని డీఆర్డీవో రవీందర్ రాథోడ్ సూచించారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. కేస్లాపూర్ అనుబంధ గ్రామాల రోడ్లకు మరమ్మతు చేయడంతోపాటు తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల వసతులు కల్పించా లని, స్వచ్ఛ పనులు పూర్తి చేయాలని సూచించారు. నీటితో గోవాడ్ ప్రాంతం చిత్తడి కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. మహాపూజకు వచ్చే మెస్రం వంశీయులతోపాటు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా పూర్తిస్థాయి ఏర్పా ట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏపీవో జాదవ్ శ్రీనివాస్ తదితరులున్నారు. పాఠశాలల సందర్శన మండలంలోని కేస్లాపూర్ బాలికల ఆశ్రమ పాఠశా ల, ఇంద్రవెల్లి కేజీబీవీని డీఆర్డీవో, ఇంద్రవెల్లి ప్రత్యేకాధికారి రవీందర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పనితీరు తెలుసుకున్నారు. వెనుకబడిన వి ద్యార్థినులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాల ని ఆదేశించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులున్నారు. -
● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నులు ● దిగుబడి కొనాలని వేడుకోలు ● తప్పనిపరిస్థితిలో ఆందోళనలు
ఇది ఈ ఇద్దరు రైతుల పరిస్థితే అనుకుంటే పొరపాటు.. జిల్లాలో వేలాది మంది రైతుల వద్ద ఇప్పుడు సోయా నిల్వలు పేరుకుపోయాయి. మద్దతు ధరకు అమ్ముకుందామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రైవేట్‌లో విక్రయిద్దామంటే తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు 25వేల టన్నుల సోయా పంట రైతుల వద్దే ఉండిపోయింది. నాణ్యత లేని పంట విక్రయానికి వస్తోందని మార్క్‌ఫెడ్ పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేసింది. అయితే.. కొనుగోలు కేంద్రాలకు రాని నిల్వల్లో నాణ్యత కలిగిన పంట కూడా ఉంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఈ వానాకాలంలో 68 వేల ఎకరాల్లో సోయాబీన్ సాగైంది. 54వేల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వే సింది. నాఫెడ్‌కు అనుబంధంగా రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ జిల్లాలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నవంబర్ 2నుంచి కొనుగో ళ్లు ప్రారంభించింది. ఇప్పటివరకు 15,500 టన్నులు కొనుగోలు చేసింది. వందలాది మంది రైతులు ప్రైవేట్‌లోనూ వేల టన్నులు విక్రయించారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం.. ఇప్పటికీ రైతుల వ ద్ద 25వేల టన్నుల సోయా పంట నిల్వ ఉంది. దీంతో పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనబాట పడుతున్నారు. రంగు మారిన సోయా.. గత వానాకాలంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడి చేతికి రావాల్సిన సమయంలో సోయా పంట కు నష్టం కలిగింది. దీంతో వేల క్వింటాళ్ల పంట రంగు మారింది. నాణ్యత ప్రమాణాల ప్రకారం.. తేమ 12శాతం లోపు, క్వింటాల్లో వ్యర్థ పదార్థాలు, ఇత ర గింజలు 2శాతం, దెబ్బ తగిలిన, పగిలిన, చీలిక గింజలు 15శాతం లోపు, రంగు మారిన గింజలు 5 శాతం లోపు, పరిపక్వం కాని నాసిరకం గింజలు 5 శాతం వరకు, పుచ్చిపోయినవి 3శాతం వరకు, ఇత ర గింజలు 3శాతం లోపు మాత్రమే ఉండాలి. ఇలా సోయా కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలను మా ర్క్‌ఫెడ్ పాటిస్తూ వస్తోంది. ఇటీవల జిల్లాలోని బే ల, జైనథ్ మండలాల్లో కొనుగోలు చేసిన తర్వాత సెంట్రల్ వేర్ హౌస్ (సీడబ్ల్యూసీ) గోదాములకు దిగుబడి తరలించిన తర్వాత సరైన నాణ్యత లేదని అక్కడి నుంచి సుమారు 8వేల క్వింటాళ్లను మార్క్‌ఫెడ్ నుంచి రైతులకు తిరిగి పంపారు. దీనిపైనా రైతులు ప్రస్తుతం జిల్లాలో ఆందోళన చేపట్టారు. నాణ్యత గ్రేడ్ విషయంలో చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం
ఆదిలాబాద్‌టౌన్: రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని దుకాణాలు మూసివేశారు. ఉదయం 4గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందో ళనకారులను సముదాయించే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జోగు రామన్నను పోలీసులు అరెస్ట్ చేసి మావల పోలీస్‌స్టేషన్‌కు, మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రే మేందర్ను టూటౌన్‌కు, మిగతావారిని ఆయా పోలీ స్స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఉదయం 7గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రా మన్న మాట్లాడుతూ.. రంగు మారిన సోయాబీన్ కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్, ఎరువుల బు కింగ్ యాప్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు. నాయకులు జోగు మహేందర్, మెట్టు ప్రహ్లాద్, అజ య్, విజ్జగిరి నారాయణ, సాజిద్, ధమ్మపాల్, కొండ గణేశ్, తిరుపతి, ఉమాకాంత్, సుధీర్, గంగుల కిరణ్, సృజన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగోబా జాతరలో పటిష్ట భద్రత
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఉట్నూర్ ఏఎస్పీ కాజ ల్సింగ్తో కలిసి నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లు, పో లీస్ క్యాంప్, పోలీసులకు కల్పించే సౌకర్యాలను ప రిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రా ఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్, రూట్, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు. శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న తదితరులున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌లో గూడ్స్ తరలించొద్దు
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ ట్రావెల్స్‌లో సరుకులు రవాణా చేయవద్దని ఆదిలాబాద్ డీఎస్పీ జీ వన్‌రెడ్డి సూచించారు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో సమావేశమై మాట్లాడారు. బస్సులో సీసీ టీవీ కెమెరాలు అమర్చాలని, డ్రైవర్లు రోడ్డు భ ద్రత నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంకెన్‌డ్రైవ్ టెస్టు నిర్వహించాకే యజమానులు డ్రైవర్లకు వాహనాలు అప్పగించాలని తెలిపారు. గంజాయి, నిషేధిత పదార్థాలు రవాణా చేయకుండా జాగ్రత్త పడాలని, అనుమానాస్పద వ్య క్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐలు సునీల్‌కుమార్, నాగరాజు, కర్ర స్వామి, ఫణిందర్, మురళి తదితరులున్నారు. పత్రాలుంటేనే గదులు అద్దెకివ్వాలి సరైన ధ్రువీకరణ పత్రాలుంటేనే లాడ్జీల్లో గదులు అద్దెకివ్వాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి సూచించా రు. వన్‌టౌన్‌లో లాడ్జి యజమానులతో సమావేశమై మాట్లాడారు. లాడ్జిల్లో పోలీసుల అనుమతి లేకుండా మల్టీ లెవల్ మార్కెటింగ్ సమావేశాలకు అనుమతివ్వొద్దని సూచించారు. ప్రతీ ఫ్లోర్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కెటింగ్ చేసే వారికి గదులు అద్దెకు ఇవ్వవద్దని, వారి ద్వారా మోసం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వ్యభిచారం, గేమింగ్, మ ట్కా, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే చర్యలు యజమానులపై తప్పవని హెచ్చరించారు. -
ఆరోగ్య పాఠశాలతో బంగారు బాట
కై లాస్‌నగర్: విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బా టలు వేసేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాల, రోడ్డు భద్రత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించా రు. తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల పోస్టర్, ఫ్లెక్సీ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ఆరోగ్య పా ఠశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యక్తిగత ప రిశుభ్రత, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, మా దకద్రవ్యాలు, వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై వారపు కార్యాచరణ రూపొందించి రోజుకో అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగా హన కలిగి ఉండాలని, ఆదిలాబాద్‌ను ప్రమాద ర హిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పలువురు విద్యార్థులు ఆరోగ్య పాఠశాల, రోడ్డు భద్రత అంశాలపై ఉపన్యాసాలు, నాటికలతో ఆకట్టుకున్నారు. అనంతరం స్టూడెంట్ ఛాంపియన్ల కు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, టీషర్టులు అందజేశా రు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పాఠశాల కోఆర్డినేటర్లు అజయ్, తిరుపతి, హెచ్ఎంలు, రవాణా, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకత పాటించాలి ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ము న్సిపల్ ఎన్నికలు, ఓటరు జాబితాల సవరణ, అ భ్యంతరాల పరిష్కారంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని, డూప్లికేట్ ఓట్లు, మృతిచెందిన వారి పేర్లు తొలగించాలని సూ చించారు. ఓటరు జాబితాలపై వచ్చే అభ్యంతరా లను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు పరి ష్కరించాలని తెలిపారు. సమావేశంలో లేవనెత్తిన పలు సందేహాలకు కలెక్టర్ సమాధానాలిచ్చారు. వా ర్డుల వారీగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితాల ప్రదర్శన తదితర అంశాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మాతృ మరణాలను నివారించాలి
ఉట్నూర్‌రూరల్: మాతృ మరణాలు సంభవించకుండా ఏఎన్ఎంలు బాధ్యతతో వ్యవహరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. మాతృ మరణాలను నివారించడంలో ఏఎన్ఎంల పాత్ర కీలకమని తెలిపారు. అర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏఎన్ఎంలకు ఒక్కరోజు శి క్షణ ఇచ్చారు. గర్భిణులకు నెలవారీ వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని సూచించారు. కౌన్సిలింగ్ విధానంపై ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఐటీడీఏ సహకారం ఉంటుందని తెలిపారు. పీవో ఎంసీహెచ్ డాక్టర్ సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో మనోహర్, డీపీవో దేవిదాస్, ఇంక్వాస్ మేనేజ ర్ అమర్, హెచ్ఈ నాందేవ్, అర్మన్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ చరణ్, డాక్టర్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: అంకితభావంతో విధులు ని ర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించా రు. తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి ఏఆర్ వి భాగానికి కన్వర్షన్‌పై నియమితులైన 11మంది కానిస్టేబుళ్లు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశా రు. వీరిలో 2012, 2013 బ్యాచ్‌లకు చెందిన 2వ బెటాలియన్ నుంచి ఏడుగురు, మూడో బెటాలియన్ నుంచి ఒకరు, 15వ బెటాలియన్ నుంచి ముగ్గురున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వీరికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర పరి స్థితులు, వీఐపీ సందర్శనలు, బందోబస్తు వి ధులు, ప్రత్యేక ఆపరేషన్లు, ప్రజాభద్రతకు సంబంధించిన విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, సీసీ కొండరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని నర్సాపూర్(బి) పంచాయతీ పరిధి మరపగూడ గ్రామానికి చెందిన హెరకుమ్ర రామారావు ఇల్లు సోమవారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. రామారావు తన సొంత పని నిమిత్తం ఇంద్రవెల్లికి, భార్య చేనుకు వెళ్లింది. ఈక్రమంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటున్నారు. గమనించిన స్థానికులు మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో బట్టలు, బియ్యం, జొన్నలు, మంచాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. సర్పంచ్ హెరకుమ్ర గంగారాం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తాళం వేసిన ఇంట్లో చోరీకాగజ్నగర్రూరల్: పట్టణంలోని సర్సిల్క్కాలనీకి చెందిన దండె మంగ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 3న మంగ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో తన కుమార్తె వద్దకు వెళ్లింది. తన మరిది శ్రీధర్ ఇచ్చిన సమాచారంతో ఈనెల 5న ఇంటికి వచ్చింది. ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో సుమారు 7 తులాల బంగారు, కిలో వెండిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్సపొందుతూ వ్యక్తి మృతినర్సాపూర్(జి): పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుండోల్ల లింగం (53) గత కొన్నినెలలుగా బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గతనెల 31న మద్యం తాగి ఇంటికి రాగా భార్య లక్ష్మి మందలించింది. పొలానికి వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని నిర్మల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు.. నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోన్ గ్రామానికి చెందిన మహమ్మద్ సల్మాన్ (37) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై భెంసా వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో తురాటి ఎక్స్‌రోడ్డు వద్ద నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న లోకేశ్వరం గ్రామానికి చెందిన మోడం రాజు బైక్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని అంబులెన్స్‌లో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి అన్న మహమ్మద్ అబుద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పల్సిలో పుర్రె, ఎముకల లభ్యంకుభీర్: మండలంలోని పల్సి గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయి. ఆదివారం చేనులో పనిచేసేవారికి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా పుర్రె ఎముకలు కనిపించడంతో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. అక్కడ చెప్పులు, పురుగుల మందు డబ్బా లభించింది. సదరు వ్యక్తి పురుగుల మందుతాగి చాలా రోజులక్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామంలో ఒక యువకుడు మూడు నెలలుగా కనిపించడం లేదు. ఎముకలు అతనివా కావా అన్న విషయం తేలాల్సి ఉంది. పోలీసులు సోమవారం ఆ ఎముకలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. -
ముగిసిన క్రీడాశిక్షణ శిబిరాలు
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో పాల్గొనే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల క్రీడాకారుల శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ, టెన్నికాయిడ్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో బాల,బాలికలకు స్థానిక కేబీ ప్రాంగణంలోని 18 రోజుల శిక్షణ కొనసాగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ మొత్తం 248 మందికి క్రీడాదుస్తులు, షూ పంపిణీ చేశారు. శిక్షణ శిబిరాలు విజయవంతంగా నిర్వహించిన పీడీ, పీఈటీలు, కోచ్‌లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో సదానందం, ప్రధానోపాధ్యాయులు ఉత్తం, సీనియర్ పీడీలు హేమంత్, రవీందర్, జైవంత్, జల్పతి, మధుసూదన్, నాని, కృష్ణ, పాండు, కీర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో సత్తా
బెల్లంపల్లి: చెన్నూర్‌లో ఈనెల 4న జరిగిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) పాఠశాల /కళాశాల తైక్వాండో విద్యార్థులు సత్తా చాటారు. కలర్ బెల్ట్ విభాగంలో అర్జున్ ప్రసాద్ గోల్డ్‌మెడల్, ఏ.శ్రీమన్ సిల్వర్, మనోజ్ బ్రాంజ్‌మెడల్ సాధించారు. బ్రౌన్‌బెల్ట్ మహిళల విభాగంలో ఇప్ప శ్రావణి గోల్డ్‌మెడల్ గెలుచుకోగా, బ్లాక్ బెల్ట్ విభాగంలో శ్వేత సిల్వర్, పురుషుల విభాగంలో బి.మనోజ్ గోల్డ్‌మెడల్ గ్రాండ్ చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నట్లు తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సిద్దమల్ల చిరంజీవి, కార్యదర్శి బోగే రాజేష్ తెలిపారు. చెన్నూర్ సీఐ దేవేందర్ రావు విజేతలకు బహుమతి అందజేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయ్ సాగర్ అభినందించారు. -
పకడ్బందీగా ‘నాగోబా’ ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించే నాగోబా జాతర ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతర ముందు లేదా తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారని తెలిపారు. సోమవారం ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్‌తో కలిసి నాగోబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం మెస్రం వంశీయులతో కలిసి నాగోబా జాతర వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. గోవాడ్, మర్రిచెట్టు పరిసర ప్రాంతాలు సందర్శించి ఏర్పాట్ల పనులు పరిశీలించారు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్ల నిధులు, నాగోబా ఆలయాభివృద్ధికి రూ.6 కోట్లు, ప్రత్యేక గెస్ట్‌హౌజ్, డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.కోటి పనుల నివేదిక, పెండింగ్ పనుల వివరాల నివేదించాలన్నారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ మాట్లాడుతూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, సర్పంచ్ తుకారం, ఐటీడీఏ డీఈ తానాజీ, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, దేవదాయ శాఖ ఈవో ముక్త రవి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, మెస్రం వంశీయులు నాగ్నాథ్, బాదిరావ్‌పటేల్ ఉన్నారు. -
కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దండేపల్లి: కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దండేపల్లి మండలం ద్వారక గ్రామానికి చెందిన మునిమడుగు గంగన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు దండేపల్లిలో తహసీల్దార్ రోహిత్దేశ్పాండేకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గంగన్న మాట్లాడుతూ.. 2020సెప్టెంబర్ 19న తన సోదరుడు శ్రీనివాస్‌తో గొడవ జరిగింది. ఈ సమయంలో తన కూతురు మానస తలకు గాయం కావడంతో వెంటనే పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పోలీసులు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. కాగా ఈ గొడవ విషయంలో తమ కుల పెద్దలు వారిని కాదని పోలీస్టేషన్లో కేసు పెడతావా, అంటూ ఐదేళ్లుగా తనును, తన కుటుంబాన్ని ఆ కులంలో జరిగే శుభ, అశుభ కార్యాలకు రానివ్వకుండా బహిష్కరిస్తున్నారు. దీనిపై ఈ నెల 2న కుల పెద్దలను మళ్లీ కలిశాను. నీవు పోలీస్టేషన్లో శ్రీనివాస్‌పై పెట్టిన కేసు వాపస్ తీసుకుంటేనే కులంలోకి రానిస్తామని చెప్పారు. సూటి పోటీ మాటలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుంటుంబాన్ని కులస్తులెవరు పలకరించవద్దని, పనులకు పిలవద్దని, ఒక వేళ పిలిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కులపెద్దలు కులస్తులను బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ విషయమై తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండేను సంప్రదించగా, దీనికి సంబంధించి ఈ రోజే ఫిర్యాదు అందింది. ఎస్సై, ఎంపీడీవోతో కలిసి గ్రామానికి వెళ్లి దీనిపై గ్రామస్తులతో మాట్లాడి, కులబహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కేయూ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మిమ్స్ విద్యార్థిని
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆశ్విత ఎంపికై ంది. ఈనెల 6 నుంచి రాజమండ్రి గన్ని సుబ్బాలక్ష్మీ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగే సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు కేయూ నుంచి మిమ్స్‌లో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న ఆశ్విత కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. యూనివర్సిటీ జట్టుకు మూడోసారి వరుసగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డైరెక్టర్ విజయ్‌కుమార్, పీడీ నూనె శ్రీనివాస్ అభినందించారు. జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతికై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెవె న్యూ శాఖలో పనిచేస్తున్న 12 మంది జూ నియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు సీసీఎల్ఏ సె క్రెటరీ ఎం.మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్.అశ్విని, ఆర్.సునీత, ఎండీ జమ, సాయికృష్ణ, ఏ.రమేశ్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఆ జిల్లాకు కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గౌరంగ్ మండల్ అభిజ్ఞ శ్రీజ, అనిత దుర్గంను ఆ జిల్లాకు కేటాయించారు. మంచిర్యాలలో పనిచేస్తున్న కె.రాజమణి, టి.విద్యబానులను పదోన్నతి కల్పిస్తూ ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారు. పటిక బెల్లం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసుఉట్నూర్రూరల్: పటిక బెల్లం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం 2 కిలోల పటిక బెల్లం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విక్రయాలు, కొనుగోలు చేస్తున్న సేవదాస్‌నగర్‌కు చెందిన గుమ్ముల రాజ్‌కుమార్, నాగాపూర్, గంగాపూర్ గ్రామాలకు చెందిన పౌడే సిద్దేశ్వర్, గంగారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీ కోసం ఉపయోగించే పటిక నల్లబెల్లం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవాల ఎరువు.. పంటకు మేలు దండేపల్లి: భూసారం పెంచేందుకు మూగజీవాల ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. గొర్రెలు, మేకలు, కోళ్లు, కంపోస్టు, సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీటి ద్వారా పంటల దిగుబడి సాధించవచ్చు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు జీవాల ఎరువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరి కోతలు పూర్తవగానే కొందరు రైతులు తమ పంట పొలాల్లో కొన్నిరోజులపాటు, గొర్రెల మందలు పెట్టిస్తారు. వరి కోతలు పూర్తయిన పొలాల్లో మూగజీవాలు మేపడం ద్వారా వాటి విసర్జకాలు పొలంలో పడటంతో భూసారం పెరుగుతుంది. గొర్రెల పేడలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్క వేర్లు భూమి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని దండేపల్లి ఏవో గొర్ల అంజిత్‌కుమార్ తెలిపారు. సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. పశువులు, గొర్రెల ఎరువును పొలంలో వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. దీంతో ఎరువుల కొనుగోలు ఖర్చును కొంత మేర ఆదా చేసుకోవచ్చునని అన్నారు. రైతులు ఏటా పంట పొలాల్లో రసాయనిక ఎరువులకు బదులుగా జీవాల పేడను వినియోగించడం ద్వారా భూ మి సమతుల్యత పెరుగుతుందన్నారు. నీటి త డులు తట్టుకునే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. -
ప్రారంభమైన పెన్ గంగజాతర
నది ఒడ్డున భక్తులుసాత్నాల: భోరజ్ మండలం డోలార గ్రామ సమీపంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు పెన్‌గంగ నది ఒడ్డున గంగజాతర సోమవారం ప్రారంభమైంది. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా పఠాన్బోరి గ్రామం నుంచి ఆధ్యాత్మిక గురువులు రామానంద్, మాధవరావు మహారాజ్‌ల పాదుకలను రథంలో పెట్టి డప్పుచప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. తెలంగాణ నుంచే కాక మహారాష్ట్ర నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుటుంబసభ్యులతో కలిసి పిండి వంటలు చేసి గంగమ్మ తల్లీకి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. నదిలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఈ జాతర శుక్రవారం వరకు కొనసాగనుంది. భక్తుల కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
భైంసాలో పిచ్చికుక్క కలకలం..!
భైంసాటౌన్: భైంసా పట్టణంలో సోమవారం ఓ పిచ్చికుక్క కలకలం రేపింది. గంటన్నర వ్యవధిలో దాదాపు 50 మందిపై దాడి చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గాయపడ్డారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని పంజేషా చౌక్ మీదుగా, బట్టిగల్లి, చౌదరిగల్లి, నయాబాది, మదీనాకాలనీ, రాజీవ్‌నగర్, కప్డా మార్కెట్, బస్టాండ్ రోడ్, తదితర ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించినవారిపై దాడి చేసింది. తానూరుకు చెందిన అంజనాబాయి అనే వృద్ధురాలు భైంసాలో జీడిపండ్లు విక్రయించేందుకు రాగా, నర్సింహానగర్ ప్రాంతంలో ఆమైపె దాడి చేసింది. బోయిగల్లికి చెందిన మేఘమాల అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా దాడి చేసింది. వీరిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతేగాక కుక్కకాటుతో 50 మంది ఆస్పత్రికి వచ్చినట్లు ప్రభుత్వ ఏరియాస్పత్రి వైద్యులు తెలిపారు. కుక్కకాటు బాధితుల హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్లోని తన కార్యాలయంలో జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి బాలిక్ అహ్మద్, మండల పశువైద్యుడు విఠల్‌తో సమీక్షించారు. అనంతరం బాలిక్ అహ్మద్ మాట్లాడుతూ కుక్కకాటు బాధితులు తప్పనిసరిగా ఆరు డోస్‌ల వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. తీవ్ర జ్వర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పిచ్చికుక్కను బంధించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. -
రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్
సాత్నాల: రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య ఎటూ తేలడం లేదు. వీరి తీరుతో అమాయక గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాత్నాల మండలం దుబ్బగూడకు చెందిన ఆత్రం లేతుబాయి ఆ గ్రామంలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఆమెను అభినందించి సత్కరించారు. అయితే దాత ఇచ్చిన భూమి ఫారెస్ట్ పరి ధిలో ఉందని ఆ శాఖ అధికారులు చెబుతుండగా, రెవెన్యూ అధికారులు తమ పరిధిలోకి వస్తుందని పేర్కొంటున్నారు. అటవీ అధికారులు అడ్డుకోవడంతో పునాది దశ పూర్తి చేసుకున్న నిర్మాణాలు ఆగిపోయాయని గిరిజనులు వాపోతున్నారు. సోమవారం పలువురు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ దిలాబాద్ ఆర్డీవో స్రవంతి, ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్‌లు గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలాన్ని వదిలేసి మరోచోట నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని సూచించగా ఇందుకు వా రు ససేమిరా అన్నారు. నిరక్ష్యరాసులైన తమ నుంచి అధికారులు బలవంతంగా సంతకాలు సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్డీవో తిరి గివెళ్తుండగా బాధితులు వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసి ఇక్కడి నుంచి వెళ్లాలని కోరారు. చివరకు ఈ వివాదం ఎటూ తేలకుండా పోయింది. తమకు న్యాయం జరగకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడతామని బాధిత గిరిజనులు పేర్కొన్నారు. -
రహదారి భద్రత నియమాలు పాటించాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతిఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి హీలియం బెలూన్ను గాలిలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రహదారి భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడొద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు అప్పగించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, సీఐ సునీల్, ఇన్స్పెక్టర్లు హరీంద్ర కుమార్, ప్రదీప్, రవాణా, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.‘సహకార’ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కై లాస్‌నగర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ బ్యాంకు ప్రత్యేకాధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాంకు ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించి న ఆయన సోమవారం సాయంత్రం బ్యాంకును సందర్శించారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, ఖాతాదారులకు కల్పి స్తు న్న సౌకర్యాలు, ఇతర పాలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, డీసీసీబీ సీఈవో రవి, డీజీఎంలు సూర్యప్రకాశ్, వెంకటస్వామి, భీమేందర్ పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్‌జూనియర్ అథ్లెటిక్ ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు విద్య, ఉ ద్యోగ రంగాల్లో రెండు శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఈనెల 17, 18 తేదీల్లో ఆదిలా బాద్‌లో తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి రాజేశ్, డీవైఎస్వో శ్రీనివాస్, కోచ్‌లు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్. కె.శ్యామలాదేవి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి వారు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి హామీ, స్వయం ఉపాధి, ఆర్థిక చేయూత వంటి తదితర అంశాలపై ఈ వారం మొత్తం 103 అర్జీలు అందినట్లు అధికారులు వెల్ల డించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. -
తుది దశకు కాంగ్రెస్ కార్యవర్గం ఎంపిక
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)కార్యవర్గం ఎంపిక తుది దశకు చేరుకుంది. పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు కలిసి తయారు చేసిన జా బితా అధిష్టానానికి చేరింది. ఇటీవల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆశావహుల నుంచి ద రఖాస్తులు స్వీకరించారు. పీసీసీ నియమావళి ప్ర కారం పార్టీలో నిబద్ధత గల కార్యకర్తలకు తొలి ప్రాఽ దాన్యత ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. పాత వారితో పాటు కొత్త నాయకుల్లో సమర్థులు, పార్టీ కోసం పనిచేసే వారిని పరిగణలోకి తీసుకొని జాబితా తయారు చేసినట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అధిష్టానం ఆమోద ముద్ర వేస్తుందని పేర్కొంటున్నారు. ఈనెల 8లోగా జిల్లా కమిటీ కార్యవర్గం పూర్తి చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆ దేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆశావహుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు అన్నింటినీ పరి శీలించి అధిష్టానానికి సోమవారం జాబితా అందజేశారు. ఇదివరకే జిల్లా నుంచి కార్యవర్గ కూర్పునకు సంబంధించి పేర్లను పంపించినప్పటికీ పలు జిల్లా ల నుంచి పూర్తి స్థాయి వివరాలు రాకపోవడంతో అఽ దిష్టానం మరికొంత సమయం ఇచ్చి వాటన్నింటిని పూర్తి చేయాలని జిల్లా పరిశీలకులు, అధ్యక్షులకు ఆ దేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి జాబితాను పరిశీలన చేసి అధిష్టానానికి అందజేశారు. పట్టణ, మండల కమిటీలపై ఆసక్తి జిల్లా కార్యవర్గంలో ముఖ్య నేతల అనుచర గణానికి సంబంధించి కూర్పు జరిగిందని, దీనిపై ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చని జిల్లా పరిశీలకులు, అధ్యక్షులు పేర్కొంటున్నారు. అయితే కమిటీ ప్రకటన తర్వాత పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది వేచి చూడాల్సిందే. పట్టణ, మండల కమిటీలపై ఈనెల 10 నుంచి 15 వరకు కసరత్తు జరగనుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముందుండగా, పట్టణ అధ్యక్షులు, కార్యవర్గం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి నెలకొంది. జిల్లా ముఖ్య నేతల అనుచరులు పలువురు పట్టణ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొనడంతో ఆదిలాబాద్ పట్టణ కమిటీ కూర్పు కోసం పరిశీలకులు తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి. ఇక మండల కమిటీల్లో అధ్యక్ష స్థానం కోసం కూడా పోటీ కనిపిస్తోంది. దీంతో అన్ని వర్గాలను సమతూకం ఎలా చేయాలనే విషయంలో తర్జనభర్జన నెలకొంది. నియోజకవర్గ ఇన్చార్జీలు, మండలాల్లో ముఖ్య నేతలు తాము సూచించిన వారిని మండల కమిటీల్లో తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో కమిటీ కూర్పు పరిశీలకులకు సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుండగా, ఈ కమిటీలతో ఎలాంటి భేదాభిప్రాయాలు ఏర్పడుతాయోననే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. పాత కమిటీల్లో ఉన్నవారిని పూర్తిగా మార్చి కొత్త కమిటీల్లో కొత్త ముఖాలను తీసుకోనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
నిబంధనల ప్రకారమే ఓటరు జాబితా
కై లాస్‌నగర్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన ల ప్రకారమే పారదర్శక ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు అన్నారు. ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడు తూ, ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని దాన్ని సరిచేయకుంటే ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారే అవకాశముందన్నారు. వెంటనే సరిచేయాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఈసీ నిబంధనల ప్రకారం ఏ ఒక్క ఓటరు తప్పిపోకుండా జాబితా రూ పొందిస్తున్నట్లుగా తెలిపారు. అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేయిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, మేనేజర్, రెవె న్యూ అధికారి కళ్యాణ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
ఇక ‘మన సీ్త్రనిధి’తో రుణాలు
కై లాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు సీ్త్రనిధి ద్వారా అందించే రుణాల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రుణాలు అవసరమైన వారు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ కిస్తీలు సైతం ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. అలాగే సభ్యులు చెల్లించిన సొమ్ము సక్రమంగా జమ అయిందో లేదో సమాచారం సరిచూసుకోవచ్చు. దీంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగం వంటి అక్రమాలకు చెక్ పడనుంది. స్వయం సమృద్ధిని సాధించేలా .. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీ్త్రనిధి ద్వారా రుణాలు అందజేస్తోంది. ఇంటి వద్దనే ఉండి వివిధ వ్యాపారాలు నిర్వహించేలా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తు అతివలకు అండగా నిలుస్తోంది. దరఖాస్తు, పర్యవేక్షణ సులభతరం సీ్త్రనిధి రుణాల మంజూరు, చెల్లింపుల పరిశీలన సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘మన సీ్త్రనిధి’ పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రుణాలు అవసరమైన సభ్యులు గతంలో సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసి వీవోలు తీర్మానం చేసి రుణాలు కేటాయించేవారు. దీంతో వారిని బతిమాలడంతో పాటు ఎంతో కొంత సమర్పించాల్సి వచ్చేది. ఈ యాప్ ద్వారా దానికి తెరపడనుంది. వీవోఏలు, సీసీల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఆన్లైన్లో వీవోఏకు వెళ్తుంది. 24గంటల్లో దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే సంబంధిత ఏపీఎంకు వెళ్తుంది. ఆయన పరిశీలించి అసిస్టెంట్ మేనేజర్ సీ్త్రనిధికి పంపిస్తారు. వారు ఆమోదం తెలిపితే రీజినల్ మేనేజర్ ఆమోదించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే రుణం నేరుగా సభ్యుల్లో ఖాతాల్లోకి చేరుతుంది. తద్వారా సభ్యుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అక్రమాలకు చెక్.. గతంలో రుణాలు పొందిన సభ్యులు తిరిగి కడుతున్నారో లేదో తెలిసేది కాదు. కానీ ఈ యాప్‌లో సభ్యులు తీసుకున్న రుణాల సమగ్ర సమాచారం నమోదై ఉంటుంది. ఏ సభ్యురాలు ఎంత రుణం తీసుకున్నారు, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది వంటి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే రుణ చెల్లింపులు కూడా ఇంటి నుంచే నేరుగా చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా పొతోంది. అయితే జిల్లాలో కొంతమంది సంఘాల అధ్యక్షులు సీ్త్రనిధి వాయిదాల సొమ్మును సభ్యులకు తెలియకుండానే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా సభ్యుల పర్యవేక్షణ పెరిగి ఇలాంటి అక్రమాలు, మోసాలకు చెక్పడే అవకాశముంది. జిల్లాలో.. గతేడాది సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.39కోట్లు మంజూరు చేసింది రూ.42కోట్లు ఈ ఏడాది పంపిణీ లక్ష్యం రూ.36 కోట్లు(5,418 మంది సభ్యులకు) ఇప్పటివరకు మంజూరు చేసింది రూ.18 కోట్లు సభ్యులకు ఎంతో ప్రయోజనం సీ్త్రనిధి రుణాలు పొందాలనుకునే వారు, ఇది వరకు రుణాలు తీసుకున్న వారు స్మార్ట్ఫోన్లలో మన సీ్త్రనిధి యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్డోల్ చేసుకోవాలి. రుణాల కోసం నేరుగా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. చెల్లించాల్సిన వాయిదాల వివరాలు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. దీంతో సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరనుండగా అక్రమాలకు అడ్టుకట్టపడనుంది. – పూర్ణచందర్, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ -
కలెక్టరేట్‌ను ముట్టడించిన బీఆర్ఎస్
కై లాస్‌నగర్: రంగుమారిన సోయా కొనుగోలుతో పాటు పత్తి కొనుగోళ్లలో ఆంక్షలు లేకుండా చూడాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ర్యాలీగా వచ్చిన పార్టీ శ్రేణులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. సీఎం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ, రైతులు పండించిన పంటల కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. సోయా కొనుగోళ్లు చేపట్టే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ ద్వారా నియమించబడిన త్రీమెన్ కమిటీ చూసిన పంటలు కూడా గోదాంల నుంచి వెనక్కిరావడం విచారకరమన్నారు. ఇందులో పార్టీ నాయకులు నర్సింగ్‌రావు, నారాయణ, అక్బానీ, సాజిదొద్దీన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ వార్డులో ఏం జరుగుతోంది
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లోని ప్రసూతి వార్డులో అసలు ఏం జరుగుతుంది.. గర్భిణులు, బాలింతల ప్రా ణాలు ఎందుకు గాలిలో కలుస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమనే వి మర్శలు వ్యక్తమవుతున్నా వారిపై చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకొని మమా అనిపిస్తున్న అధికారులు అసలు బాధ్యులను వది లిపెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. సొంతశాఖ తో పాటు అదే క్యాడర్ వారితో విచారణ చేపడుతుండటం వాస్తవాలు కప్పి పుచ్చేందుకు కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం డ్యూటీలో ఉండి సేవలందించాల్సిన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రసవంకోసం వచ్చే గర్భి ణులకు అందుబాటులో ఉండటంలేదు. పీజీ విద్యార్థులు వైద్యులకు ఫోన్ ద్వారా సమాచా రం అందిస్తే వారు వచ్చేలోపు పరిస్థితి విషమించి చనిపోతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మారని తీరు.. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్ వైద్యుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఒక్కరు కా దు.. ఇద్దరుకాదు..ఏకంగా గతేడాది ఏడుగురు గర్భి ణులు, బాలింతలతో పాటు పదుల సంఖ్యలో న వజాత శిశువులు మృతిచెందడం ప్రసూతి వార్డులో సేవల తీరుకు అద్దం పడుతోంది. పలువురు తల్లుల కు మాతృత్వం దక్కకపోగా, శిశువులకు తల్లి ప్రేమ దూరమవుతోంది. సేవలు అందించాల్సిన వైద్యులు ప్రైవేట్‌లో కాసులకు కక్కుర్తి పడడంతో పేదలకు నాణ్యమైన సేవలు అందని పరిస్థితి. ఇటీవల కలెక్టర్ పలువురిపై చర్యలు చేపట్టారు. అయినా పరి స్థితిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. అసలేం జరుగుతోంది.. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్ర వాసుల కు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. ఇతర జబ్బులతో పా టు గైనిక్ విభాగానికి పెద్ద సంఖ్యలో గర్భిణులు వ స్తుంటారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ విభాగంలో వైద్యులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా, మధ్యాహ్నం తర్వాత కనిపించకుండా పో తున్నారు. అలాగే ఉదయం 10 తర్వాతే విధులకు హాజరవుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే గర్భిణులు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. పీజీలతోనే సేవలు.. గైనిక్ విభాగంలో ఏడుగురు వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్యులున్నారు. వీరితో పాటు ఇద్ద రు సీనియర్ రెసిడెంట్లు, ఆరుగురు పీజీ వైద్యులు ఉ న్నారు. అదేవిధంగా హౌస్ సర్జన్లు పనిచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యసేవలు అందించాల్సి ఉండగా, సమయపాలన పాటించకపోవడం, వారికి నచ్చినప్పుడే రావడం, ఇష్టమొచ్చినప్పుడు వెళ్లడం పరిపాటిగా మారింది. శిక్షణ పొందే పీజీ వైద్యులతోనే పూర్తిస్థాయి సేవలు అందించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. ఇటీవల ఉట్నూర్ మండలానికి చెందిన ఓ బాలింత శిశువు మరణించిన సమయంలో ఇద్దరు పీజీ వైద్యు లే అందుబాటులో ఉండగా, సంబంధిత వైద్యురా లు శిశువు మరణించిన తర్వాత ఉదయం 6 గంట లకు అక్కడికి చేరుకోవడం గమనార్హం. అలాగే ప లువురు గైనకాలజిస్టులకు ఆదిలాబాద్‌లో క్లి నిక్‌లు ఉన్నాయి. వారు అక్కడే బిజీగా ఉండడంతోరిమ్స్లో గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. బాలింత, శిశువు మృతి ఘటనలో నిర్లక్ష్యం చేసిన వారిని వదిలి ఏఎన్ఎంపై సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు స్టాఫ్ నర్సులను డిప్యూటేషన్‌పై పంపించిన అధికారులు ఒక ఏఎన్ఎంపైనే చర్యలు చేపట్టడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న తెలుత్తుతోంది. ఏఎన్ఎంకు ఓపీలో విదులు కేటాయించాల్సి ఉండగా, ప్రసూతి వార్డులో కొన్నేళ్లుగా విధులు కేటాయించారు. ప్రసవం చేయాల్సింది వైద్యులు, ఇతర సిబ్బంది కాగా సహాయ సిబ్బందిగా ఉండే ఏఎన్ఎంపై వేటు వేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. రిమ్స్‌లో ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడంతో విచారణ సరిగా జరగడం లేదని, ఇతర శాఖల అధికారులతో నిష్పక్షపాతంగా విచారణ చేపడితే అసలు బాగోతం బయట పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను వివరణ కోరగా, విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
సోయా కొనుగోళ్లు అంతేనా?
ఇచ్చోడ: జిల్లాలో ఈ ఏడాది సోయా రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సీజన్లో అధిక వ ర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభా వం చూపింది. అరకొరగా చేతికొచ్చిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పడం లే దు. అతివృష్టి కారణంగా రంగుమారిన సోయా కొ నుగోలుకు ప్రభుత్వం నిరాకరిస్తుండడంతో యార్డులోనే రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థి తి. కొందరు గత్యంతరం లేక తక్కువ ధరకు ప్రైవేట్‌లో అమ్ముకుని నష్టపోతున్నారు. మరోవైపు అధి కారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఇక సోయా కొనుగోళ్ల కథ కంచికే అన్నట్లుగా తెలుస్తోంది. అధికారుల నుంచి స్పష్టత కరువు ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కా రణంగా 80 శాతం పైగా సోయా రంగు మారింది. నాఫెడ్ నిబంధనల ప్రకారం కేవలం మూడు శాతం నాణ్యత ఉన్న వాటినే కొనుగోలు చేసి గోదాంలలో నిల్వ ఉంచడానికి అనుమతి ఇస్తున్నారు. అయితే జిల్లాలో చాలావరకు పంట 10నుంచి 15 శాతం నా ణ్యత ప్రమాణాల్లో ఉంది. ఒకవేళ యార్డుల్లో కొనుగోలు చేసిన సోయా నాణ్యత లేకుంటే సీడబ్లూసీ గోదాం ఇన్చార్జీలు తిప్పి పంపిస్తున్నారు. దీంతో జి ల్లావ్యాప్తంగా పక్షం రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి నిబంధనలు సడలిస్తే కానీ కొనుగోళ్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ అసెంబ్లీలో చర్చకోసం ఇచ్చిన తీర్మానా న్ని రాష్ట్రసర్కారు తిరస్కరించడంతో సోయా కొ ను గోళ్లపై నీలినీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే.. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తేనే రంగుమారిన సోయా కొనుగోలు చేస్తాం. వారం క్రితం అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో కొనుగోలు చేసినా నాణ్యత లేదని సీడబ్ల్యూసీ గోదాంల నుంచి వాపస్ పంపించారు. దీంతో తాత్కాలికంగా కొనుగోళ్లను నిలిపివేశాం. –ప్రవీణ్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎంజిల్లాలో.. ఈ సీజన్లో సోయా సాగు 72వేల ఎకరాలు దిగుబడి అంచనా 6.08 లక్షల క్వింటాళ్లు ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది 1.30 లక్షల క్వింటాళ్లు -
ఏఐతో ‘భవిత’పై ఫోకస్
ఆదిలాబాద్‌టౌన్: వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదు.. వారిని ప్రోత్సహిస్తే ఏ విషయంలోనైనా ముందుకు సాగుతారనే ఉద్దేశ్యంతో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తొలిసారిగా మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ (ఏఐ) ద్వారా బోధన జరిగేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ.5లక్షలు కేటాయించారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల ఆవరణలో గల భవిత సెంటర్లో ఇటీవల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఈ బోధనను ప్రారంభించారు. 20 రోజుల్లో వారిలో సామర్థ్యాలు మెరుగుపడటం గమనార్హం. జిల్లాలోని మిగతా భవిత సెంటర్లలో ప్రారంభిస్తే ప్రయోజనం చేకూరనుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. కలెక్టర్ చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కలెక్టర్ చొరవతో.. కలెక్టర్ రాజర్షి షా సర్కారు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో 12 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ద్వారా సాధారణ విద్యార్థులకు విద్యాబోధన సాగుతుంది. వీరిలాగే వైకల్యం కలిగిన పిల్లల్లోనూ సామర్థ్యాలు మెరుగుపర్చాలని భావించిన కలెక్టర్ ఏఐ ద్వారా వారికి బోధన జరిగేలా చర్యలు చేపట్టారు. గతనెల 16న జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పాఠశాలలో నలుగురు అంధ విద్యార్థులు, ఎనిమిది మంది సరిగా మాట్లాడటం రానివారు, 12మంది బుద్దిమాంధ్యం కలిగిన పిల్లలు ఉన్నారు. వీరి అవసరాలను బట్టి రూ.5లక్షల నిధులతో 2 ల్యాప్‌టాప్‌లు, ఒక ట్యాబ్, బ్రెయిలీ లిపికి సంబంధించి రీడింగ్ పరికరాలు, స్కానర్లు తదితర వస్తువులను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గైర్హాజరు లేకుండా ప్రతిరోజు రావడంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఆడుతూ పాడుతూ పాఠాలు వింటున్నారు. కొత్తకొత్త పదాలు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వారిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. బోధన సులువు.. సాధారణ విద్యార్థులకు బోధన చేయడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది బుద్దిమాంధ్యం, వైకల్యం, వివిధ రుగ్మతలతో బాధపడే పిల్లలకు చదువు బోధించాలంటే అంత సులువేమి కాదు. అయినప్పటికీ భవిత రిసోర్స్ సెంటర్లో పనిచేసే ఉపాధ్యాయులు కష్టపడి వారికి విద్యనందిస్తున్నారు. సరిగా మాట్లాడలేని వారు బొమ్మలు చూస్తూ, వింటూ నేర్చుకుంటున్నారు. అంధత్వం కలిగిన చిన్నారులు వస్తువులను తాకుతూ కొత్త పదాలను తెలుసుకుంటున్నారు. వీరిందరికీ ప్రత్యేకంగా హెడ్ఫోన్లను ఏర్పాటు చేయడంతో బోధన సులువుగా మారింది. దీంతో పాటు బ్రెయిలీ లిపిని సైతం ఏర్పాటు చేశారు. పాఠ్యాంశాన్ని స్కాన్ చేస్తే మాటలు, పాటలు పలుకుతాయి. పిల్లలు నేర్చుకున్న తర్వాత కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలు కలిగింది. ఒకటికి పది సార్లు రావడంతో వారు మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటున్నారు. ఏఐ బోధన ఎంతో ఉపయుక్తం కలెక్టర్ చొరవతో భవిత రిసోర్స్ సెంటర్లో ఏఐ ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యబోధన ప్రారంభించడం జరిగింది. గతం కంటే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెరిగాయి. అందరూ ఒకే చోట కూర్చుని ఆసక్తిగా పాఠాలు వింటూ నేర్చుకున్నారు. అంధులు, బుద్దిమాంధ్యం, స్పిచ్థెరపీ ద్వారా బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా బోధన అందించడం జరుగుతుంది. ఐఆర్పీలకు కొంత ఇబ్బందులు తొలగగా, పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. – ఉష్కం తిరుపతి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి -
‘రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వాలు’
ఆదిలాబాద్‌టౌన్: సోయా కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న ఆదిలాబాద్ బంద్‌కు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. సోయా కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మానసిక స్థితితో ఆటలాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని అన్నారు. వారికి మద్దతుగా తలపెట్టిన బంద్‌లో అన్ని వ ర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో నాయకులు ప్రహ్లాద్, సజీ తొద్దీన్, రమేశ్ తదితరులున్నారు. -
ఓటు అభ్యంతరాలు @ 177
● నేటితో ముగియనున్న గడువు కై లాస్‌నగర్: మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జా బితాపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల్లో 177 అందాయి. నేటితో గడువు ముగియనుంది. చివరి రోజు ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు ఈనెల 1న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పలు వార్డుల్లో ఓటర్ల వివరాలు తారుమారయ్యాయి. దీంతో పోటీ చేయాలనుకునే ఆశావహులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఓటర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడి జాబితాల్లో ఆయా వార్డులోని ఓట ర్ల వివరాలు పరిశీలిస్తున్నారు. తారుమారైన వా టిని సరి చేయాలని విజ్ఞప్తులు అందజేస్తున్నారు. తొలి రోజున 31 అభ్యంతరాలు అందగా, 2వ తేదీ న 81, 3న 65 అందాయి. నేటితో స్వీకరణ గడు వు ముగియనుంది. అనంతరం తుది జాబితా సి ద్ధం చేయనున్నారు. ఈక్రమంలో ఆదివారం సెల వు రోజయినప్పటికీ ప్రజల నుంచి అభ్యంతరా లు స్వీకరించారు. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఎన్నికల కసరత్తులో నిమగ్నమైన బల్దియా సిబ్బందికైలాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఓటర్ల తుది జా బితా ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకా ల దిశగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్, సహాయ రిట ర్నింగ్ అధికారులను నియమించేందుకు చర్యలు చే పడుతోంది. సోమవారం రాజకీయ పార్టీల ప్రతిని ధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితా వివరాలు వెల్లడించనున్నారు. ఎన్నికల నిర్వహణ కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు మున్సిపల్ అధి కారులకు అందించాలంటూ పంచాయతీరా జ్ శాఖ కమిషనర్ ఆదేశించడంతో త్వరలోనే పుర నోటిఫికేషన్ రానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుది జాబితాకు కసరత్తు.. జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అయిన ఆదిలాబాద్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓ టరు జాబితాను ఈ నెల 1న ప్రకటించారు. ఇందులో పలువార్డుల్లో ఓటర్ల వివరాలు తారుమారయ్యా యి. అధికారులు వాటిపై అభ్యంతరాలను స్వీకరి స్తున్నారు. వినతులు, ఫిర్యాదుల ఆధారంగా జా బితా సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. ఆది వారం సెలవు రోజునప్పటికీ సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సోమవారం మున్సిపల్ కా ర్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశం నిర్వహించి ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి సిద్ధం చేసిన తుది జాబి తాను ఈ నెల 10న ప్రకటించనున్నారు. 17 క్లస్టర్ల ఏర్పాటు.. మున్సిపల్ పరిధిలో 49 వార్డులున్నాయి. ఇందులో రెండు, మూడు వార్డులను కలిపి క్లస్టర్‌గా మొత్తం 17 ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో క్లస్టర్‌కు ఓ రిట ర్నింగ్ అధికారి చొప్పున 17మంది ఆర్వోలను నియమించనున్నారు. మరో ముగ్గురిని రిజర్వుగా ఎంపిక చేయనున్నారు. అలాగే క్లస్టర్‌కు నలుగురు చొప్పున 80మందిఏఆర్వోలను నియమించనున్నా రు. మరో 16 మందిని రిజ్వరుగా ఉంచనున్నారు. ఆర్వోలుగా పీజీహెచ్ఎంలు, ఏఆర్వోలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించేదిశగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నారు. వీరితో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదలయ్యాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బ్యాలెట్ బాక్స్‌లు అప్పగించండి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరుగనున్నాయి. దీంతో పట్టణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను మున్సిపల్ అధికారులకు అప్పగించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలకు 312 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమయ్యే అవకాశమున్నట్లుగా బల్దియా అధికారులు అంచానా వేస్తున్నారు. ఇందులో ఒక్కో వార్డుకు కనీసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బ్యాలెట్ బాక్స్ అవసరమేర్పడుతుంది. ఈ లెక్కన పట్టణానికి 260 బ్యాలెట్ బాక్స్‌లు అవసరమవుతాయని ప్రతిపాదించారు. 20 శాతం అదనంగా అంటే మరో 52 రిజర్వులో ఉంచనున్నారు. పట్టణంలోని వార్డులు : 49 ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలు : 183 పట్టణంలోని ఓటర్లు :1,43,773ఏర్పాట్లు చేస్తున్నాం.. ఎస్ఈసీ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తూ తుది జాబితా సిద్ధం చేసే ప్రక్రియ చేపడుతున్నాం. అలాగే ఆర్వో, ఏఆర్వోల నియామకంతో పాటు పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నాం. నోటిఫికేషన్ ప్రకటించే నాటికి అన్ని ఏర్పాట్లతో పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంటాం. – సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్ -
కేంద్రం నిధులతోనే రైల్వే వంతెనల నిర్మాణం
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రైల్వే వంతెనల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆదివారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పట్టణంలో రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయి నిధులు కేటాయించిందన్నారు. గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఈ వంతెనల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తాము కృషి చేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ఆదిలాబాద్ ప్రగతికి తాము కట్టుబడి ఉంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి తలమడుగు: సాగుకు చేసిన అప్పులుతీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని ఎంపీ నగేశ్ అన్నారు. మండలంలోని చెర్లపల్లిలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కనక యాదవ్‌రావు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు గంగాధర్‌రావు, జీవీ రమణ, తదితరులున్నారు. బ్రిడ్జి నిర్మించాలని వినతి మండలంలోని దేవాపూర్, కమలాపూర్ గ్రామాల సమీపంలో పంటచేలకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరారు. ఈమేరకు ఎంపీ నగేశ్‌ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సర్పంచ్ సంతోష్, తదితరులున్నారు. -
‘ముస్లిం తెలి’ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
కై లాస్‌నగర్: ముస్లిం తెలి సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. పట్టణానికి చెందిన నాలుగు జంట లు, మహారాష్ట్రలోని కిన్వట్, పొండ్రకవడ, యావత్మాల్, ఇచ్చోడ ప్రాంతాలకు చెందిన మ రో ఏడు జంటలు కలిపి 11 జంటలకు మత ఆ చారం ప్రకారం నిఖా జరిపించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఈ సామూహిక వేడుకకు సమాజ్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు జహీర్ రంజానీ మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలకు భారంగా మారకూడదనే ఉద్దేశంతో తెలి సమాజ్ ఆధ్వర్యంలో సామూహిక వి వాహాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇక ఏటా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇందులో జావిద్, మోబిన్, మినహజ్, పాల్గొన్నారు. -
చుట్టపు చూ‘పులే’..!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి ఆవా సం, తోడు వెతుక్కుంటూ వచ్చిన వలస పులులు జిల్లాను విడిచివెళ్లాయి. ఇటీవల జిల్లా అడవుల్లోకి కొత్తగా వచ్చిన మూడు పులులు జిల్లా సరిహద్దుల ను దాటి పోయాయి. కొద్ది రోజులుగా చెన్నూరు, భీమారం, జైపూర్, శ్రీరాంపూర్ వరకు వచ్చిన ఓ మగ పులి పది రోజుల క్రితమే గోదావరి దాటి మంథని మీదుగా భూపాలపల్లి, ములుగు, మహబూ బాబాద్ జిల్లా కొత్తగూడ వరకు వెళ్లింది. మరో పులి గోదావరి దాటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానే రు వాగు తీరం వెంబడి తిరుగుతోంది. సుల్తానాబా ద్, కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాలు, పరిసర గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఇక జన్నారం డివిజన్లో సంచరించిన పులి ఇందన్పల్లి మీదుగా గోదావరి దాటి సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దు అడవుల్లో తిరుగుతోంది. ఇలా.. కొత్తగా వచ్చిన మూడు పులులు ప్రస్తుతం జిల్లా దాటి వెళ్లిపోయాయి. ఈ పులులు మహారాష్ట్ర నుంచి తమ అనుకూల ఆవాసం కోసం వెతుక్కుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుండడం గమనార్హం. మరోవైపు జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి డివిజన్ల మధ్య ర్యాలీ, గడ్పూర్, దేవాపూర్, తిర్యాణి అడవుల మధ్య మరో పులి సంచరిస్తోంది. అలాగే, వేమనపల్లి మండలం నీల్వాయి, ప్రాణహిత తీర అటవీ పరిసర ప్రాంతాల్లో మరో పులి తిరుగుతోంది. ఆవాసం, తోడు వెతుక్కుంటూ.. కొత్త పులులు జిల్లా అడవుల్లోకి ప్రవేశించగానే వాటి సంచారంపై అటవీ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలు తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా అడవుల్లో రెండు పులులు సంచరించిన విషయం తెలిసిందే. జిల్లాలో జాతీయ రహదారులు, బొగ్గుగనులు, ఓపె న్కాస్టులు, గోదావరి తీరప్రాంతాలతోపాటు అడవు ల్లో పులులు సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులకు ఇక్కడ అనుకూలమైతేనే ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి.ఇక్కడి అడవుల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే కొంతకాలం ఉంటున్నా యి. లేకపోతే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో స్థానికులకు తారసపడుతున్నాయి. అలాగే, రైతుల పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఇటీవల సంచరించినవి రెండు మగ పులులుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇవి ఆడ పులల కోసమే తిరుగుతున్నాయా? అనే కోణంలోనూ పరి శీలిస్తున్నారు. ఏటా చలికాలంలో పులులు తోడు వెతుక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు. కోర్లోకి వెళ్లలేక.. కవ్వాల్ పులుల అభయారణ్యం పులుల ఆవాసంగా ఉంది. అన్ని అనుకూలతలున్న వందల ఎకరాల భూమి కోర్ పరిధిలోనే ఉంది. అయితే.. ఇప్పటికీ ఒక్క పులి కూడా ఆవాసమేర్పరుచుకోలేదు. ఏటా సీజన్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్లడమే గాని పులులు ఇక్కడ స్థిరంగా ఉండడం లేదు. కోర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. అటవీ సమీపంలో భూములు ఉండడంతో స్థానికులకు కంటపడుతున్నాయి. మరోవైపు ప్రాణహిత, గోదావరి తీరాలతో పాటు వాగులు, వంకలు, దట్టమైన పొదల్లో ఉంటున్నాయి. అయితే.. ఇటీవల శ్రీరాంపూర్ ఆర్కే–8 పరిసర ప్రాంతంలో ఓ పులి కనిపించింది. భీమారం మండలం నరసింహాపురం బస్టాప్ సమీప వాగులో దాని పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఇదే తీరుగా నెలన్నరగా పులులు జిల్లాలో సంచరించాయి. గోదావరి తీరాలు, నీటి కుంటలు, వాగుల వెంట అడవుల్లో కలియదిరుగుతున్నాయి. అయితే.. ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు జిల్లాలో స్థిర నివాసమేర్పరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. కాగా, మళ్లీ ఆ పులులు తిరిగి జిల్లా అడవుల్లోకి వచ్చే అవకాశముందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. -
సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్‌టౌన్: సావిత్రిబాయి పూలే సేవలు చి రస్మరణీయం అని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్. రాజేశ్వర్ అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి పురస్కరించుకుని పలువురు మహిళా ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు విద్యావంతులైనప్పుడే ఆ కుటుంబంతో పాటు సమజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అణగారిన, పేద, బడుగు, బలహీన వర్గాల ప్ర యోజనాలు, వారిని చదివించేందుకు తొలి ఉపాధ్యాయినిగా సావిత్రీబాయి పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూ ల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ కుమార్, డీసీ ఈబీ సెక్రెటరీ గజేందర్, విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్, పాఠ్యపుస్తకాల మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
● కట్టుబాట్లు, క్రమశిక్షణతో ముందుకు ● నాగోబాను స్మరిస్తూ ‘మెస్రం’ పాదయాత్ర ● గత నెల 30న కేస్లాపూర్లో ప్రారంభం ● హస్తినమడుగు దారిలో 145మంది వంశీయులు
పాదయాత్రలో మెస్రం వంశీయులు పూర్తిగా తెల్లని వస్త్రాలతోనే ముందుకు సాగుతారు. తలపాగా, చొక్కా, దోవతి/ప్యాంట్ అన్నీ శ్వేతవస్త్రాలే విని యోగిస్తారు. చెప్పులు లేకుండా రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లచొప్పున నడుస్తారు. ముందుగా నిర్దే శించిన ఎనిమిది గ్రామాల్లో మాత్రమే బస చేస్తారు. శాకాహారంతో కూడిన భోజనం స్వీకరిస్తారు. కల శం చేతబూనిన కటోడా పర్యవేక్షణలో, పర్దాన్ ముందుండగా వారిని మిగతా వారు అనుసరిస్తా రు. నాగోబాను స్మరిస్తూ అడుగులో అడుగేస్తారు. ఈ సారి ప్రధాన కటోడగా మెస్రం హన్మంతరావు, పర్దాన్గా దాదారావ్ వ్యవహరిస్తున్నారు. శనివారం డబోలి గ్రామానికి చేరుకున్నారు. -
సర్పంచ్‌లకు శిక్షణ
కై లాస్‌నగర్: దాదాపు రెండేళ్ల తర్వాత పంచాయతీ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇందులో భాగంగా ఎన్నికై న సర్పంచ్‌లకు పల్లెపాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదనుగుణంగా ఆ శాఖ జిల్లా అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది చొప్పున ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం వివిధ స్థాయిల్లోని 8 మంది అధికారులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్‌లో శిక్షణ పొందిన అనంతరం జిల్లాలో ఈ నెల 21 నుంచి 28వరకు ఆదిలాబాద్, ఉట్నూర్ వేదికల్లో సర్పంచ్‌లకు శిక్షణనివ్వనున్నా రు. శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించేందు కోసం జిల్లాకు పత్యేకంగా ఓ లైజన్ అధికారిని నియమించారు. ఆయన జిల్లాకు చేరుకుని ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 8మంది టీవోటీల ఎంపిక పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎనిమిది మంది జిల్లా అధికారులను ట్రైనర్ ఆఫ్ ట్రైనింగ్ (టీఓటీ) లుగా ఎంపికచేశారు.ఇందులో ఆదిలాబాద్, ఉట్నూ ర్ డీఎల్పీలు, ఉట్నూర్, బోథ్ ఎంపీడీవోలు, ఇంద్రవెల్లి, బేల ఎంపీవోలతో పాటు మరో ఇద్దరు ఏపీడీలు ఉన్నారు. వీరంతా ఈ నెల 5 నుంచి 9వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థకు చెందిన కేంద్రంలో రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందనున్నారు. ఐదు రోజుల శిక్షణ అనంతరం వారు జిల్లాకు చేరుకుని సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు. రెండు వేదికల్లో శిక్షణ జిల్లాలోని సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు రెండు వే దికలను ఎంపిక చేశారు. ఆదిలాబాద్ రెవెన్యూ డివి జన్ పరిఽధిలోని సర్పంచ్‌లకు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో, ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లతో పాటు సిరికొండ మండల సర్పంచ్‌లకు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో గల యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మందికి శిక్షణనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో రోజు రెండు బ్యాచ్‌లు కొనసాగుతాయి. ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించే శిక్షణకు హాజరయ్యే సర్పంచ్‌లు ఆయా వేదికల్లోనే బస చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గ్రా మీణాభివృద్ధి శాఖలో పనిచేసే డీఎల్పీవో శ్రీని వాస్‌ను జిల్లాకు లైజన్ అధికారిగా నియమించారు. ఆయన శుక్రవారం జిల్లాకు చేరుకుని పంచాయతీ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. విధులు, బాధ్యతలపై శిక్షణ నూతన సర్పంచ్‌లకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం పంచాయతీ అధికారాలు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డుసభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల ని ర్వహణను వివరించనున్నారు. ప్రధానంగా గ్రామాల్లో కీలకమైన పారిశుద్ద్యం, తాగునీటి సరఫరా, ప్రజారోగ్యంపై అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వా ల నుంచి వచ్చే నిధుల వినియోగం, చేపట్టనున్న పనులు, పన్నుల వసూళ్లు, జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం అమలు, ఉపాఽధి అవకాశాలు ఆర్థి కాభివృద్ధిలో పంచాయతీల పాత్ర, వ్యవసాయం, సేంద్రియ సాగు, ఈ అప్లికేషన్, జనన, మరణాల నమోదు వంటి 24 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు అన్ని ఏర్పాట్లు .. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఈ నెల 21 నుంచి 28వరకు ఉట్నూర్, ఆదిలాబాద్ వేదికలుగా ఇవ్వనున్న శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. టీవోటీలు హైదరాబాద్‌లో శిక్షణ పొంది వచ్చాక జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులను నిర్వహిస్తాం. సర్పంచ్ల శిక్షణ పూర్తయ్యాక ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు సైతం ఉంటుంది. – జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి -
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ గణిత ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు శనివారం ప్రతిభాపాటవ పరీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ నంబర్–1 ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పరీక్షకు తెలుగు మీడియంలో 54మంది, ఆంగ్ల మాధ్యమంలో 56 మంది, ఉర్దూ మీడియంలో 34 మంది హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 12, మందిని రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక చేశారు. వీరిలో ఎ.వర్షిణి, సాయిచరణ్, నక్షత్ర, గోవింద్, తృప్తి, వంశీకృష్ణ, ప్రనుష్, రితీష్, మనీష్, ఆఫ్రా ఖానమ్, అంజూమ్, నింసా ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 6న గజ్వేల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు జిల్లా సైన్స్ అధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, హెచ్ఎం నీలాదేమి, స్వప్న, శశిధర్‌రెడ్డి, సుదర్శన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ముట్టడి ఉద్రిక్తం
ఆదిలాబాద్‌టౌన్: రంగు మారిన సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు పోలీసులతో పాటు కార్యకర్తలు గాయపడ్డారు. ముందస్తుగా భారీ బందోబస్తు.. బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గులాబీ శ్రేణులు అక్కడికి చేరుకుని రైతుల సమస్యలపై నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారిని పొలీసులు అడ్డుకున్నారు. రామన్నతో పాటు పలువురు నేతలను స్టేషన్‌కు తరలించే క్రమంలో పార్టీ నేతలు ఆ వాహనాల ఎదుట బైఠాయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. స్టేషన్లోనూ రామన్న నిరసనకు దిగడంతో నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో నేతలు స్టేషన్ ఎదుట బైఠాయించి రామన్నను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగా రు. అనంతరం పోలీసులు వారిని సముదాయించి లోనికి అనుమతించడంతో శాంతించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే ఇందుకు కారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా తాము శాంతియుతంగా చేపడుతున్న ధర్నాను పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. రంగు మారిన సోయా, తేమ శాతం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడమే తప్పా అని ప్రశ్నించారు. షాపుల్లో లేని యూరియా కొత్తగా తీసుకువచ్చిన యాప్‌లలో ఎక్కడ ఉంటుందని ఎద్దేశా చేశారు. రైతులను ముప్పుతిప్పలు పెట్టేలా ప్రభుత్వాలు వ్యవహరించడం సరికాదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే కొనుగోలు ఆంక్షలు సడలించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, సాజిదొద్దీన్, లింగారెడ్డి, ప్రశాంత్, వామన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు ఆదిలాబాద్‌టౌన్: పోలీస్ విధులకు అటంకం కలిగించిన బీఆర్ఎస్ నాయకులపై కేసు న మోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సోయా పంట కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాల ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నను ముందస్తు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంలో తరలిస్తుండగా ఆ పార్టీ నాయకులు అలాల్ అజయ్, బట్టువార్ సతీశ్, వాగ్మారే ప్రశాంత్, కళ్యాణ్ అడ్డువచ్చి పోలీసు విధులకు అటంకపర్చినట్లుగా పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లుగా వివరించారు. -
బల్దియా ఎన్నికల ప్రత్యేక విభాగం ఏర్పాటు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎన్ని కల ప్రత్యేక విభాగాన్నిఏర్పాటు చేశారు. కార్యాలయ మేనేజర్, రెవెన్యూ అధికారితో పాటు ప లువురు ఉద్యోగులను నియమించారు. ఎన్నిక ల నిర్వహణకు అవసరమైన కసరత్తు ఈ విభా గం నుంచే చేపట్టనున్నారు. అయితే ఓటర్ల ము సాయిదా జాబితాలో దొర్లిన తప్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు అందుతున్నాయి. తొలి రోజు కేవలం ఐదు రాగా, శనివారం ఏకంగా 55 రావడం జాబితాలో దొర్లిన పొరపాట్లకు అద్దం పడుతుంది. ఇతర వార్డుల్లో చేర్చిన త మను తిరిగి తమ వార్డుల్లో కొనసాగించాలని కోరుతూ విజ్ఞప్తులు అందజేస్తున్నారు. మున్సి పల్ సిబ్బంది వారికి అందిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాబితాను సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. కమిషనర్ సీవీ ఎన్. రాజు ఈప్రక్రియను శనివారం పరిశీలించారు. జాబితాలో పొరపాట్లకు తావివ్వకుండా ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. -
చలితో అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: చలి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విఠల్ ఆడే అన్నారు. ప్రస్తుతం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలి తీవ్రత ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: చలి ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది..డాక్టర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతున్నాయి. దీంతో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, గుండెపోటు, అస్తమా వ్యాధిగ్రస్తులు, కిడ్నీ బాధితులు జాగ్రత్తలు పాటించాలి. సైనస్ సమస్య ఉన్నవారు చలిలో బయటకు వెళ్లకూడదు. జలుబు, దగ్గు, గొంతు సమస్యతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సాక్షి: ఈ సీజన్లో ఏయే వ్యాధులు ప్రబలుతాయి..డాక్టర్: చలి కారణంగా జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలుతుతాయి. నిమోనియా, బ్రాంకై టీస్, జ్వరం, ఇన్ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్, సైనసైటీస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్ల ల్లో నిమోనియా, ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఇబ్బందులకు గురవుతారు. సాక్షి: ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి.. డాక్టర్: ఈ సీజన్లో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్ తీసుకోవద్దు. వీటితో గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. జ్వరం వచ్చి మూడు రోజుల పాటు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. సాక్షి: చలికాలంలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు వస్తాయి.. కారణమేమిటి..?డాక్టర్: చలికాలంలో గుండె పోటుకు సంబంధించి కేసులు నమోదవుతాయి. ప్రధానంగా బ్లడ్ క్లాట్ కావడం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దినచర్యలో భాగంగా ఉదయం ఎండ వచ్చిన తర్వాత, సాయంత్రం నడక ఆరోగ్యానికి మంచిది. సాక్షి: ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?డాక్టర్: డిసెంబర్ నెల నుంచి చలి తీవ్రత బాగా పెరిగింది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. వెచ్చదనం కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. గ్లౌజులు, స్వెట్టర్లు, టోపీలు ధరించడం మంచిది. మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. మెడికల్ షాప్‌లకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు యాంటీబయోటిక్ వాడొద్దు. -
సోయా రైతుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: సోయా రైతుల సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ విన్నవించారు. హైదరాబాద్‌లో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత వానకాలం సీజన్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 6,200 మంది రైతుల నుంచి కేవలం 1.64 లక్షల క్వింటాళ్ల సోయా మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కోత దశలో కురిసిన భారీ వర్షాలతో పంట రంగు మారిందన్నారు. ని బంధనల పేరిట రంగు మారిన సోయా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
బోథ్: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్ అన్నారు. జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్‌తో కలిసి బోథ్ రేంజ్ పరిధిలో శుక్రవారం పర్యటించారు. అటవీశాఖ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీడిపల్లె రోడ్డులో ఈ ఏడాది నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కల సంరక్షణలో సిబ్బంది తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. చింతలబోరి వద్ద ఇటీవల పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ప్రాంతాలను పర్యవేక్షించారు. వన్యప్రాణుల కదలికలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. వారి వెంట ఎఫ్ఆర్వో ప్రణయ్, అధికారులున్నారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
జైనథ్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకుండా వారిని నట్టేట ముంచుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. మండలంలోని కాప్రి గ్రామ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై జైనథ్, బేలా మండలాల రైతులతో కలిసి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా సోయా పంట రంగుమారితే కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమమన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రహ్లాద్, నర్సింగ్‌రావు, లింగారెడ్డి, మనోహర్, గంభీర్, గణేశ్‌యాదవ్, గోవర్ధన్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు అనుమానితులు @ 828
ఆదిలాబాద్‌టౌన్: కుష్ఠు అనుమానితుల లెక్క తేలింది. గత నెల రోజుల పాటు కుష్ఠు గుర్తింపు ఉద్యమం కొనసాగింది. ఇందులో భాగంగా జిల్లాలో ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించారు. ఈనెల 5 నుంచి పీహెచ్‌సీల వారీగా వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. 13వ తేది వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అవసరమైన సిబ్బందికి విధులు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 52 మంది వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ నిర్ధారణ పరీక్షల్లో మరికొంత మంది పెరిగే అవకాశం ఉంది. 828 అనుమానితులు.. డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 1,006 మంది ఆశ కార్యకర్తలు ఈ సర్వే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి శరీరంపై గోదుమ రంగు పోలిన, స్పర్శ లేని మచ్చలను గుర్తించారు. జిల్లాలో 22 పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో అత్యధికంగా చిల్కూరి లక్ష్మినగర్‌లో 25, శాంతినగర్‌లో 20, ఖుర్షీద్‌నగర్‌లో 12 మంది అనుమానితులు ఉండగా, హస్నాపూర్ పీహెచ్సీ పరిధిలో 90, ఇచ్చోడ పీహెచ్సీలో 60, గాదిగూడలో 54, నేరడిగొండలో 70, శ్యామ్‌పూర్‌లో 51 మంది కలిపి మొత్తంగా 828 మందిని గుర్తించారు. వీరందరికీ ఆయా పీహెచ్‌సీలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించనున్నారు. నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించనున్నారు. ఈనెల 5 నుంచి 13 వరకు.. ఈనెల 5 నుంచి 13వరకు ఆయా పీహెచ్‌సీల పరిధి లో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. 5న బజార్హత్నూర్, సొనాల, నేరడిగొండ, ఇచ్చోడ, నర్సాపూర్(టి), గుడిహత్నూర్‌లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 6న భీంపూర్, తాంసి, తలమడుగు, 7న గిమ్మ, జైనథ్, బేల, 8న పిట్టబొంగరం, ఇంద్రవెల్లి, శ్యామ్‌పూర్, దంతన్‌పల్లి, 9న సైద్పూర్, గాదిగూడ, ఝరి, నార్నూర్, హస్నాపూర్, 10న అంకోలి, 13న ఆదిలాబాద్ పట్టణంలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు.స్వచ్ఛందంగా ముందుకురావాలికుష్ఠు అనుమానితులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయిన వారు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మందులు వాడితే 6 నుంచి 12 నెలల్లో నయం అవుతుంది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన సర్వేలో 828 మందిని అనుమానితులుగా గుర్తించాం. ప్రస్తుతం జిల్లాలో 52 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కుష్ఠు రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో -
ఆ నిధులతో నార్నూర్ సమగ్రాభివృద్ధి
కైలాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డు నిధులను నార్నూర్ సమగ్రాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నిధుల వినియోగంపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, దక్షిణాదిన తొలి స్థానం సాధించినందుకు గాను నార్నూర్‌కు కేంద్రం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. ఈ విజయం జిల్లాకు గర్వకారణమన్నారు. తాత్కాలిక పనులకు కాకుండా గ్రామానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా ఎంపిక చేయాలన్నారు. విద్య, ఆరోగ్యం, తాగునీటి సరఫరా వంటి రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి, ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించి, గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గురుకులాల విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల వి ద్యార్థులకు ఈ నెల 28, 29, 30 తేదీల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికా రులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోథ్ సాంఘిక సంక్షేమ బాలి కల పాఠశాలలో నిర్వహించనున్న ఈపోటీల కోసం ప్రభుత్వం రూ.25లక్షలు మంజూరు చేసిందన్నారు. అండర్–17 విభాగంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అంశాల్లో పోటీలు ఉంటా యని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా దుస్తులు, షూ, క్యాప్స్, టీమ్ లోగోలు సిద్ధం చేయాలని, కార్యక్రమ నిర్వహణ ప్రదేశంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్లను ఏర్పాటు చే యాలని ఆదేశించారు. పోటీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజ యవంతం చేయాలన్నారు. ఇందులో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, జిల్లా ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు సునీత కు మారి, రాజలింగం, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మ నోహర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అంబాజీ పాల్గొన్నారు. -
అక్రమాలకు పచ్చ జెండేనా..
సాక్షి, ఆదిలాబాద్: సర్వేయర్ శివాజీ.. ‘రియల్’ ముఠా భారీ మోసం, కుంభకోణం కేసులో నింది తుడు. రెండు నెలల కిందట జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసును పరి శీలిస్తే.. భూ మాఫియాలో ప్రభుత్వ అధికారులు, ఉ ద్యోగులు ఎలా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో తెలిసిపోతుంది. ఈ కుంభకోణంలో ఏ9గా ఉన్న సర్వే, భూ రికార్డుల శాఖలో పని చేసే సర్వేయ ర్ శివాజీని పోలీసులు అరె స్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా అతనిపై శాఖా పరమైన చర్యలు తీసుకోలేదు. పైగా రెండు నెలలు తిరగకుండానే అతడు తిరిగి ఆదిలాబాద్‌లోనే పోస్టింగ్ సాధించి విధుల్లో చేరడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోనే.. సర్వేయర్ శివాజీ ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడు. గత సాధారణ బదిలీల్లో నిజామాబాద్‌కు వెళ్లినా వెంటనే సెలవు పెట్టి సుమారు ఏడాదిగా కొనసాగుతున్నాడు. గతంలో ఆయన ఆదిలాబాద్‌లో పనిచేసినప్పుడు జరిగిన ఒక భూకుంభకోణానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పై గత అక్టోబర్‌లో జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 10మందిపై కేసు నమో దు చేయగా ఏ9గా శివాజీని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో అతడిని రిమాండ్‌కు తరలించారు. సాధారణంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి రిమాండ్‌లో ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. శివాజీ నిజామాబాద్‌లో పోస్టింగ్ ఉండటం, లీవ్‌లో కొనసాగుతుండడంతో ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్, నిజామాబా ద్‌లోని ఆ శాఖ అధికారులు అతడిపై ఉన్నతాధికా రులకు నివేదిక పంపలేదా? అనే అనుమానాలు వ్య క్తమవుతున్నాయి. లేని పక్షంలో ఈ వ్యవహారాన్ని ఆయన మేనేజ్ చేసుకున్నాడా? అనే సందేహాలు న్నాయి. ఇలా లీవ్‌లో కొనసాగుతున్న అతడిని కమి షనర్ కార్యాలయానికి అటాచ్ చేయగా, తాజాగా అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు పోస్టింగ్ తెచ్చుకుని గురువారం విధుల్లో చేరాడు. అతడిపై శాఖాపరమైన చర్యలు లేకపోగా, ఎక్కడైతే అక్రమాలకు పాల్పడ్డాడో తిరిగి అక్కడికే పోస్టింగ్ ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసు వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారికి సంబంధించి ఈడీ అధీనంలో బ్యాంక్ మార్టిగేజ్ పరిధిలోగల భూమిని కబ్జా చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని అక్టోబర్ 12న జిల్లా పోలీసులు 10మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సర్వేయర్ శివాజీ కూడా ఈ కేసులో నిందితుడు. మొదట్లో అతడు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటూ వచ్చా డు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తిరిగి విక్రయించారు. దీంట్లో నకిలీ సేత్వార్ తయారు చేయడంతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రూ.కోట్ల విలువైన స్థలం తిరిగి విక్రయించేందుకు వీలైందనే ఆరోపణలున్నాయి. దీంట్లో సర్వేయర్ పాత్ర ఉండటంతోనే ఆయనను నిందితుడిగా చేర్చారు. కాగా, ఆదిలాబాద్‌లో ఇటీవల అనేక భూ అక్రమాలకు సంబంధించి పోలీసులకు పెద్ద ఎత్తున ఫి ర్యాదులు వచ్చాయి. దీంట్లో సర్వే, భూ రికార్డుల శాఖ నుంచి కూడా అక్రమాలకు వెన్నుదన్నుగా ఉద్యోగులు నిలుస్తున్నారని పోలీసుల దృష్టికి వ చ్చింది. దీంతో సర్వేయర్‌పై కేసు నమోదు చేశా రు. ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణం చుట్టుపక్కలున్న అనేక అసైన్డ్, అటవీ, చెరువు, శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. పట్టా భూములు నామమాత్రంగా ఉండగా, వాటి సమీపంలోని ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి రియల్టర్లు అన్యాక్రాంతం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సహకరించడంతోనే ఈ దందా దశాబ్దాలుగా యథేచ్ఛగా కొనసాగుతూ వస్తుందనేది పట్టణవాసులందరికీ తెలిసిందే. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే అధికా రులు, ఉద్యోగులు ఇలా విలువైన స్థలాలను అ న్యాక్రాంతం చేయడంలో రియల్టర్లకు సహకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వేయర్ శివాజీని తిరిగి ఆదిలాబాద్‌లోనే నియమించడంపై ఆ శాఖ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వివరణ కోరేందుకు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవిని, కొత్తగా విధుల్లో చేరిన సర్వే భూ రికార్డుల శాఖ జిల్లా ఏడీ ప్రభాకర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. -
మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లి..
చెన్నూర్/కాళేశ్వరం: మొక్కులు చెల్లించుకోవడానికి సంతోషంగా వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవర్పూర్ మండలం కాళేశ్వ రం దర్గాలో చోటు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డకు చెందిన ఎంఏ.మజీద్(32), స్నేహితుడు మహమ్మద్ సమీరుద్దీన్‌తోపాటు మరి కొంత మంది ముస్లింలు కాళేశ్వరంలోని మజీద్‌పల్లి దర్గా వద్ద మహ్మద్ షా వలీ జన్మదిన వేడుకల్లో(సందల్) పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుప పైపునకు జెండాను బిగించి పైకి ఎత్తుతున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగి లింది. దీంతో ఆ పైపును పట్టుకున్న ఎం.ఏ.మజీద్, మహమ్మ ద్ సమీరుద్దీన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో అపస్మారక స్థి తికి చేరుకున్నారు. వారిని వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎం.ఏ. మజీద్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమీరుద్దీన్‌ను మె రుగైన వైద్యం కోసం మంచి ర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
కైలాస్‌నగర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు జిల్లాస్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాను గురువారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు, బ్లాంకెట్లు, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, పెన్నులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ప్రభుత్వ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రావు, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు కె.రాజలింగు, సునీతాకుమారి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, కలెక్టరేట్ ఉద్యోగులు, టీఎన్జీవోస్, టీజీవోస్ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, మీడియా ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసినవారిలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సామ రూపేశ్‌రెడ్డి కలెక్టర్‌కు బేల మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, సాంగిడి గ్రామస్తులతో కలిసి 400 నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి కేక్ కట్ చేసిన కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్లు ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. -
ఆర్థిక ఇబ్బందులతో పాస్టర్ బలవన్మరణం
నస్పూర్: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు బలవన్మరణం చెందిన ఘటన సీసీసీ న స్పూర్ పోలీస్‌స్టేషన్ పరి ధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్‌రావు తెలి పిన వివరాల మేరకు సీసీ సీలోని సుందరయ్య కాలనీకి చెందిన సుందరగిరి శ్రీధర్(45) స్థానిక హోలి మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గతనెల 31 న ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. బంగ్లాస్ ఏరియాలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అతని ద్విచక్ర వాహనం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ 31న రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారుడు చరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోస్టర్ ఆవిష్కరణ
కై లాస్‌నగర్: ఈ నెల 1నుంచి 30వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రత మా సోత్సవ కార్యక్రమ అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ రాజర్షి షా గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడు తూ.. ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం ఏ టా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అడిషన్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీందర్‌కుమార్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభం ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం రోడ్డు భద్రత మాసోత్సవాల ను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ రవీందర్‌కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నెల 1నుంచి 30వరకు రోడ్డు భద్రత మాసోత్సవా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు తప్పకుండా పా టించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీవో ఎస్.శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతి మారెడ్డి, ఎంవీఐలు శ్రీనివాస్, ప్రదీప్, అశ్వంత్‌కుమార్, ఆర్టీఏ సభ్యుడు రాజేశ్వర్, ఏఎంవీఐలు విజయ్‌కుమార్, ఫహీమా సుల్తానా, రంజిత్‌కుమార్, ప్రత్యూష, నిహారిక, శ్వేత, ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివా సంలో గురువారం పీఆర్టీయూ, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్సింగ్, నర్ర నవీన్‌యాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మూ గ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాదవ్ రవికుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జాదవ్ అశోక్‌కుమార్, నాయకులు బెజ్జంకి రవీంద్ర, శీతల్ చౌహాన్, బత్తురి సంతోష్, చంద్రశేఖర్, చిలుక విలాస్, జాదవ్ రమేశ్, సత్యనారాయణ, పోచారెడ్డి, ధర్మేందర్, ఎస్.అశోక్, ముమ్మడి మల్లేశ్ తదితరులున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిఆదిలాబాద్టౌన్: విద్యారంగ సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తానని అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవో ఎస్.రాజేశ్వర్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కా ర్యాలయంలో టీఎస్ యూటీఎఫ్, పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపా రు. భవిష్యత్‌లో విద్యారంగాన్ని బలోపేతం చే సేందుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చా రు. పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా ని ర్వహించిన ఉపాధ్యాయులను అభినందించా రు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కిష్టన్న, వీ అశోక్, నాయకులు శ్రీనివాస్, స్వామి, గౌస్ మొహియుద్దీన్, ఏ ఇస్తారి, సీ విలాస్, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడే నూర్సింగ్, నర్ర నవీన్‌యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విఠల్‌గౌడ్ తదితరులున్నారు. -
రిమ్స్ డాక్టర్, సిబ్బందిపై కొరడా
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రి లోని ప్రసూతి విభాగంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటీవల బాలింత, శిశువు మృతి చెందింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ‘ప్రసవం.. ప్రాణాంతకం’ శీర్షికన గత నెల 12న కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ప్రొఫెసర్లతో విచారణ చేపట్టి కలెక్టర్ రాజర్షి షాకు నివేదిక అందించారు. వైద్య సిబ్బంది నిరక్ష్యం స్పష్టం కావడంతో శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ప్రసూతి విభాగం వైద్యురాలు క్రాంతికి చార్జీ మెమో జారీ చేశారు. తదుపరి చర్యలు చేపట్టేలా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు సిఫారసు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎన్ఎం కె.సంతోషమ్మను సస్పెండ్ చేశారు. అలాగే ముగ్గురు స్టాఫ్ నర్సులు గౌలన్బాయిని గాదిగూడకు, కే శాంతను నార్నూర్ కు, కే సౌమ్యను ఇచ్చోడకు డిప్యూటేషన్‌పై పంపించారు. వార్డులో పనిచేసే ఆయాలు సుమ, లక్ష్మిని మరో వార్డుకు కేటాయించారు. కాగా, రిమ్స్‌లోని మెటర్నిటీ వార్డు అస్తవ్యస్తంగా తయారైంది. ప్రస వం కోసం వస్తున్న గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ప్రసూతి విభాగంలో ఆరుగురు బాలింతలు మృతిచెందడం గమనార్హం. వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సాహితీ వ‘కళాభరణం’...
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా సాహితి ఖిల్లాగా పేరుగాంచింది. తాజాగా జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి, రచయిత వకుళాభరణం రామ్ నరేశ్‌కుమార్ సాహితీ కళకు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రశంస దక్కింది. భైంసాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్ నరేశ్ కుమార్ ‘వినరా భారతీయ వీరచరిత్ర.. పేరిట మరుగునపడిన భారత దేశ చారిత్రక వీరుల కథాంశాలను శతకపద్యరూపక పుస్తకంగా తీర్చిదిద్దారు. ఈ శతకాన్ని వందేమాతరం 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు అందించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే మంచి పుస్తకాన్ని సాహితీ విపణిలోకి తెచ్చారని గవర్నర్ ప్రశంసించారు. మరుగున పడిన108 మంది వీరుల చరిత్రలతో పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. విదేశీ ముష్కరుల దాడులను ఎదుర్కొని దేశాన్ని కాపాడిన వీరుల చరిత్రలు నేటితరానికి చెప్పాలన్నారు. -
సరస్వతి.. రైతుల పెన్నిధి
లక్ష్మణచాంద: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయం. నిర్మల్ జిల్లా అన్నదాతల జీవనాధారం సరస్వతి కాలువ. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు ఉన్న కాకతీయ, లక్ష్మీ కాలువల తర్వాత మూడో ప్రధాన కెనాల్ ఇది. 1974–75 నుంచి జిల్లాలోని సాగుభూములను సస్యశ్యామలం చేస్తోంది. ప్రవాహాన్ని నిర్వహిస్తూ ఏడు మండలాల్లోని రైతులకు ఆధారంగా నిలిచింది. 1953లో ఎస్సారెస్పీ నిర్మాణం మొదలు పెట్టారు. 1963లో నిర్మాణం పూర్తయింది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని జాతికి అంకితం చేశారు. సోన్ మండలం గాంధీనగర్, పాక్పట్ల గ్రామాల శివారుల నుంచి ప్రారంభమైన సరస్వతి కాలువ ఏడు మండలాలు, 64 గ్రామాల్లో 33,622 ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. 28 ఉపకాలువల నెట్వర్క్ నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లో 47 కిలోమీటర్ల పొడవున సరస్వతి కాలువ విస్తరించి ఉంది. దీనికి 28 డిస్ట్రిబ్యూషన్ ఉపకాలువలు ఉన్నాయి. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందిస్తూ రైతుల అండగా నిలుస్తోంది. అర్ధ శతాబ్దంగా నిర్విరామంగా పనిచేస్తూ, రైతుల ఆర్థిక భద్రతకు తోడ్పాటు అందిస్తోంది. ఇది కేవలం పొలాలకు మాత్రమే కాక, 64 గొలుసుకట్టు చెరువులను కూడా నింపుతూ కింది ఆయకట్టులకు మద్దతు ఇస్తోంది. నీటి ప్రవాహం మార్పు వ్యూహం లక్ష్మణచాందలోని వడ్యాల్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి నీటిని కనకాపూర్ వాగుకు మళ్లించి, మునిపెల్లి వద్ద గోదావరి నదిలో కలిపి, సదార్మాట్ వరకు విస్తరించాలనే ప్రణాళిక జోరుగా సాగుతోంది. ఈ చర్యలతో కాలువ సామర్థ్యం పెరిగి, మరింత ఆయకట్టు సాగుకు దోహదపడుతుంది. సరస్వతి కాలువ ఆధునీకరణ జరిగితే, నిర్మల్ జిల్లా సాగు ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని నిపుణుల అంచనా.ప్రవహించే మండలాలు : 7 కాలువ ప్రవహిస్తున్న దూరం : 47 కి.మీ కాలువకు ఉన్న ఉప కాలువలు : 28 సాగునీరు అందుతున్న గ్రామాలు : 64 మొత్తం ఆయకట్టు : 33,622 ఎకరాలుఆధునీకరణకు ప్రణాళికలు.. ఇక సరస్వతి కాలువలో లైనింగ్ లోపాలు, మట్టి పేరుకుపోవడం, పిచ్చిమొక్కలు పెరగంతో నీరు చివరి వరకు చేరడం లేదు. దీంతో నీటిపారుదల శాఖ రూ.70 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ ఆమోదం జరిగిన వెంటనే మార్చి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. లైనింగ్ పోయిన ప్రదేశాల్లో కొత్త లేయర్లు వేయడం.. మట్టి, చెత్త తొలగింపు, గండ్లు, డ్యామేజ్ల మరమ్మతు, చెట్ల కత్తిరింపు, ఇరువైపులా రోడ్లు ఏర్పాటు, 28 ఉప కాలువలకు అవసరమైన మరమ్మతులు చేపట్టనున్నారు.సరస్వతి కాలువ వివరాలు..50 ఏళ్లుగా సాగునీరు.. పోచంపాడు ప్రాజెక్టు నుంచి మా లక్ష్మణచాంద మండలానికి వస్తున్న సరస్వతి కాలువ 50 ఏళ్లుగా మా మండల రైతులకు సాగు నీటిని అందిస్తోంది. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూస్తోంది. – నాగుల నారాయణ, రైతు, పొట్టపెల్లి ఆధారం కాలువే సోన్ మండల ప్రజల పంటల సాగుకు జీవనాధారం సరస్వతి కాలువ. దీంతోనే అన్ని పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఏటా రెండు పంటలు ఈ కాలువ ఆధారంగానే సాగవుతున్నాయి. – సాయన్న, రైతు న్యూవెల్మల్ -
కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తా
ఉట్నూర్‌రూరల్: జిల్లాలోని పలు కొలాం గ్రామాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ తెలిపారు. గురువారం ఉట్నూర్ మండలంలోని కొలాంగూడలో 16 కోర్ ఏరియా గ్రామాల పటేళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరయ్యాయని కొలాం తెగకు చెందిన లబ్ధిదారులు ఉన్న గుడిసెలను తొలగించుకుని నిర్మాణాలు చేపట్టగా అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీవో, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జీ మంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సైతం తమ సమస్యను వివరించామన్నారు. సమావేశంలో పీవీటీజీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు టేకం వసంత్ రావ్, ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్ర రాజు, మాజీ ఉపాధ్యక్షుడు మడావి మాణిక్ రావ్, నాయకులు బాపురావ్, రమేశ్, తుకారాం, టేకం భీంరావ్, వివిధ కొలాం గ్రామాల పటేళ్లు, పాల్గొన్నారు. -
‘ఉద్యోగం పేరిట మోసం’
జన్నారం: కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పొనకల్‌కు చెందిన నందాల ప్రదీప్ కోరాడు. ఈ మేరకు రామగుండం పోలీసులు, సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వి లేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం జన్నారంలో ఉంటున్న జీ.సృజన్ క్రెడిట్ కా ర్డుల ద్వారా రూ.5.80 లక్షలు తీసుకున్నాడ ని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నెలకు రూ.50 వేల చొప్పున ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నానని పేర్కొన్నా డు. డబ్బుల విషయంలో నిలదీస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని, పో లీసులు న్యాయం చేయాలని కోరాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతిఖానాపూర్: గత నెల 28 న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని బావాపూర్(కే) గ్రామానికి చెందిన నేరెళ్ల వెంకటేశ్ (25) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. మెట్పల్లి ఆర్టీసీ డిపోలో ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్ గత నెల 28న మద్యం మత్తులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. సంప్రదాయాలు భావితరాలకు అందించాలిఇంద్రవెల్లి: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైఉందని జై జంగో జై లింగో జంగామ్ దేవస్థానం పీఠాధిపతి కుమ్ర భగవంత్‌రావ్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మగూడలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్యమాసం ఆదివాసీలకు ఎంతో పవిత్రమైందన్నారు. జంగుబాయి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుందని ఆదివాసీల నమ్మకమని, ప్రతిఒక్కరూ జై జంగో జై లింగును ఆరాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ సోయం మాన్కు, సర్పంచ్ విజయలక్ష్మి, కొరెంగా యేశ్వంత్రావ్, సురేష్ మహారాజ్, పెందోర్ అర్జున్, మోహపత్రావ్, విషంరావ్, పుర్క బాపురావ్, పెందోర్ పుష్పరాణి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కాలేవార్ పోతన్న, నాగన్నకు గాయాలయ్యాయి. పోతన్న పంటపొలంలో పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనంపై నిర్మల్ వైపు వెళ్తున్న నాగన్న ఢీకొట్టాడు. ఘటనలో నాగన్నకు స్వల్పంగా పోతన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు ఢీకొని కంప్యూటర్ ఆపరేటర్‌కు.. సారంగపూర్: ఉపాధిహామీ పథకంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నరేష్‌ను చించోలి(బి) గ్రామ సమీపంలోని ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సారంగాపూర్‌లో విధులు ముగించుకుని నిర్మల్ వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌కు తరలించారు. -
పోలీసుల కీర్తిని పెంచాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసుల కీర్తిని మరింత పెంచేలా నూతనోత్సాహంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూత న సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎస్పీ మౌనిక, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, కార్యాలయ ఏవో భక్తప్రహ్లాద, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సిబ్బంది, ఎన్ఐబీ, స్పెషల్ బ్రాంచ్, ఫింగర్ ప్రింట్, డీసీఆర్బీ, ఐటీ కోర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మందుబాబులపై పోలీసుల కొరడా
ఆదిలాబాద్‌టౌన్: మందుబాబులపై పోలీసులు కొరడా ఝులిపించారు. నూతన వేడుకల సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 30 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 211 కేసులు నమోదు కాగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలో ఒక్కరోజే 175 కేసులు నమోదు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ అర్ధరాత్రి సమయంలోనూ ఈ తనిఖీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, నాగరాజు, కర్రె స్వామి, ప్రణయ్ కుమార్, ఫణీదర్, శ్రావణ్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
కై లాస్‌నగర్: జిల్లా స ర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమితులైన ఎల్.ప్రభాకర్ గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బా ధ్యతలు స్వీకరించా రు. ఇదివరకు పనిచేసిన ఎం.రాజేందర్ ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కరీంనగర్లో ఏడీగా పనిచేస్తున్న ప్ర భాకర్‌ను జిల్లాకు నియమించింది. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌ను బదిలీపై వెళ్తున్న రాజేందర్, కార్యాలయ ఉద్యోగులు తిరుమల్‌రెడ్డి, జైరాం, రాజు, గోవింద్రావు తదితరులు శాలువాతో సత్కరించారు. పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు. -
ఆర్జీయూకేటీలో ఐఐఈడీ సెల్
బాసర: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో బాసర ఆర్జీయూకేటీలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ (ఐఐఈడీ) సెల్‌ను గురువారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డీ డాక్టర్ మురళీదర్శన్ పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థి కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ వినూత్న ఆలోచనలకు ప్రాణం పోసి నమూనాలను తయారు చేసుకునేందుకు ఈ సెల్ ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందన్నారు. ఈ ఇంక్యుబేషన్ సెల్ మరింత విస్తరించాలని, దీని ఫలాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ మాట్లాడుతూ ‘స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రైజింగ్ తెలంగాణ 2047’ స్ఫూర్తితో సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థాపనల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టీ.రాకేష్‌రెడ్డి, డీన్లు డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ కె.మహేశ్, ఎస్.శేఖర్, జి.నాగరాజు, డాక్టర్ అన్పత్ రాహుల్, డాక్టర్ దిల్ బహార్, డాక్టర్ జి దేవరాజు, డాక్టర్ కె.మధుసూదన్, డాక్టర్ భావ్‌సింగ్, ఎస్.రాజేశ్వర్, అరుణజ్యోతి, సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్ వి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
సోయా కొనుగోలు చేయాలి
ఆదిలాబాద్: జిల్లా రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్తో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడి తగ్గి సోయా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వచ్చిన కాస్త దిగుబడినైనా ఎ లాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పకడ్బందీగా యూరియా పంపిణీ
ఇచ్చోడ: యాప్ ద్వారా యూరియా పంపిణీ పకడ్బందీగా జరుగుతోందని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి నోడల్ అధికారి కనకరాజు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రంలో యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వ్యవసాయశాఖ సిబ్బందితో గ్రామాల వారీగా రైతులకు యా ప్పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి, ఏవో తిరుమల, ఏఈవో సంజీవ్‌నాయక్ తదితరులున్నారు. జిల్లాలో యూరియా కొరత లేదు ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో యూరియా కొరత లేద ని వ్యవసాయ కమిషనరేట్ నుంచి వచ్చిన జిల్లా నో డల్ అధికారి కనకరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరా, బుకింగ్ యాప్ విని యోగం గురించి ఆరా తీశారు. రైతులతో మాట్లాడి బుకింగ్ విధానం, సరఫరా ప్రక్రియ, స్టాక్ అప్డేట్, ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. గతంలో యూరియా కోసం రైతులు ఒక మండలం నుంచి మరో మండలానికి తిరగాల్సి వచ్చేదని, ఎక్కడ స్టాక్ ఉందో తెలియక సమయం, ఖర్చు వృథా అయ్యేదని తెలిపారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా సరఫరాతో రైతులకు ప్రయోజనం కలిగిందని వివరించారు. ఆయన వెంట డీఏవో శ్రీధర్‌స్వామి తదితరులున్నారు. -
నేటి నుంచి బీఆర్ఎస్ ఆందోళనలు
ఆదిలాబాద్‌టౌన్: రైతుల పంట ఉత్పత్తుల కొనుగో ళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తున్నాయని, ఇందుకు నిరసనగా ఆందోళన బాట పట్టనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోళ్లు సజావుగా సాగించేందుకు కలెక్టర్ త్రీమెన్ కమిటీ వేశారని, ఆ కమిటీ ని ర్ధారించిన పంట మార్కెట్‌కు వచ్చి వెనక్కిపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జైనథ్ మండలం కాప్సి ఎక్స్ రోడ్డు వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపట్టి అధికా రులు స్పష్టమైన ప్రకటన చేసేదాకా కొనసాగిస్తామని తెలిపారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి, సోమవారం కలెక్టరేట్ ముట్టడి, మంగళవారం ఆదిలాబాద్ బంద్ కార్యక్రమాలు తలపెట్టినట్లు పేర్కొన్నారు. బంద్‌లో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని సహకరించాలని కోరారు. నాయకులు లింగారెడ్డి, సాజిదొద్దీన్, యూనీస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘ట్రెజరీ’ చెల్లింపులు
కై లాస్‌నగర్: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల బిల్లుల చెల్లింపుల్లో కేంద్రం మార్పులు చేసింది. అక్రమాలను కట్టడి చేయడంతో పాటు పారదర్శతకు పెద్దపీట వేసేలా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది నుంచి చేపట్టనున్న ఉపాధిహామీ పనుల బిల్లులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది వేతనాలను ఇక నుంచి ట్రెజరీ ద్వారానే చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తేనే కేంద్రం నిధులు విడుదల చేసేలా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. దీంతో బిల్లులు, వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి చెక్ పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సకాలంలో చెల్లింపులు చేసేందుకే.. ఉపాఽధిహామీ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలను స్పార్ష్ మాడ్యూల్లో నమోదు చేసేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు ఉపయోగించిన మెటీరియల్, కూలీల పనుల వివరాలను ట్రెజరీ శాఖకు అందించనున్నా రు. జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, అటవీ, ఐటీడీఏ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులన్నింటికీ ఈ నూతన విధానం అమలుకానుంది. ట్రె జరీ అధికారులు బిల్లులను ఆమోదించాక పైనాన్షి యల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు వాటా వివరాలు పంపిస్తారు. అక్కడి అఽధికారులు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం వాటికి సంబంధించి నిధులు విడుదల కానున్నాయి. మెటీరియల్ కంపోనెంట్ బిల్లులతో పాటు ఉపాధిహామీలో పనిచేసే ఏపీవో లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీల్డ్ అసిస్టెంట్లు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలనూ ఇక నుంచి ట్రెజరీ ద్వారా చెల్లించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరి వేతనాలు సర్కారు ట్రెజరీకి పంపించి వేతనాలను జమ చేస్తోంది. అయితే నూతన విధానంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సబ్ ట్రెజరీల వారీగా వారికి వేతనాలు అందనున్నాయి. బిల్లుల చెల్లింపులు కూడా ఇలాగే జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఒకేసారి విడుదల కానుండటంతో వారు వేతనాల కోసం ఇక నుంచి నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండదు. సకాలంలో వేతనాలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే అవకాశముందనే అభిప్రాయాన్ని ఆ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వాటా విడుదల చేస్తేనే.. ఇప్పటివరకు ఉపాధిహామీ పనులకు సంబంఽధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకు న్నా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వ చ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో తీవ్ర జాప్యం చేసేది. దీంతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమయ్యేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర ప్ర భుత్వ వాటాను ముందు విడుదల చేశాకే తన వాటాను విడుదల చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులకు సంబంధించిన వాటాలను ఒకేసారి విడుదల చేయనుండటంతో వాటి చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి ఇక నుంచి చెక్‌పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగానే.. ఉపాధిహామీ బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే బిల్లులను ట్రెజరీ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే జిల్లాలో చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయంతో ఉపాధి ఉద్యోగులు, సిబ్బంది వేతనాల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. బిల్లులు కూడా త్వరగా విడుదలయ్యే అవకాశముంది. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
ఆర్టీసీ.. తీరు మారదేమి?
మంచిర్యాలఅర్బన్: చుట్టూ చూస్తే పల్లెవెలుగు బస్సు. తీరా ఎక్కిన తర్వాత వెంపల్లిలో ఆగుతుందా? అంటే ఇది ఎక్స్‌ప్రెస్ అని ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సమాధానం రావడంతో ప్రయాణికులు చేసేదేంలేక దిగిపోకతప్పలేదు. పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డు తగిలించి ఆర్టీసీ అధికారులు అధికచార్జీలు వసూలు చేస్తుండడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. జగిత్యాల, కోరుట్ల, ఇతర డిపోలకు చెందిన పల్లెవెలుగు బస్సులకు ఎక్కువగా ఇలా ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి రాకపోకలు సాగిస్తున్నాయి. కాళేశ్వరం రూట్లో మంచిర్యాల డిపో బస్సులు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ చార్జీలతో ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. ఇలాంటి చర్యలతో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల మాటెలా ఉన్నా నగదు చెల్లించి టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి మరిన్ని బస్సులు వచ్చేలా చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రూ.39 లక్షల విలువైన 200 ఫోన్ల అప్పగింత
ఆదిలాబాద్‌టౌన్: దొంగిలించిన, పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువైన సెల్ఫోన్లను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అప్పగించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో 200 సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇంత పెద్దమొత్తంలో సెల్ఫోన్లను తిరిగి రాబట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమమన్నారు. రైతు బజార్, రిమ్స్, రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్ చేస్తానంటూ ఫోన్ తస్కరించడం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1500 సెల్ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైల్ రిపేరింగ్ దుకా ణాల యజమానులు సెల్ఫోన్లను కొనుగోలు చేసే ముందు ఫోన్ యజమాని అనుమతి, సరైన పత్రాలు తీసుకోవాలన్నారు. దొంగ ఫోన్లు కొన్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబట్టిన ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటంతో వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఆర్ఎస్ఐ పి.గోపికృష్ణ, ఎంఎ రియాజ్, మజీద్, త్రిశూల్, అన్వేష్, నవనీత్, తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన గంప భోజన్న(78) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భోజన్న కొంతకాలంగా మోకాలు నొప్పులతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాలేదు. మంచంపై కదల్లేని స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు ఓ గదిలో వేరుగా ఉంచారు. జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. బైంసా ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్‌కు మూడున్నరేళ్ల జైలు చెన్నూర్: రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్‌కు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధిస్తూ స్థానిక జూనియ ర్ సివిల్ జడ్జి పర్వతపు రవి బుధవారం తీర్పునిచ్చినట్లు సీఐ దేవేందర్‌రావు తెలిపారు. చెన్నూర్ పట్టణంలోని దుబ్బాగూడెం కాలనీకి చెందిన కడవండి రాజపోషం 2019 జనవరి 30న మంచిర్యాలలోని సదరం క్యాంపు కోసం టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తున్నాడు. డ్రైవర్ నిట్టూరి రాజబాబు వాహనాన్ని అతివేగంగా నడిపి చెన్నూర్ మండలం కిష్టంపేట ఫారెస్ట్ నర్సరీ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో రాజపోషం అక్కడికక్కడే మృతిచెందగా, మహారాష్ట్ర గడిచిరోలి జిల్లా సిరొంచకు చెందిన మర్రి రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి సీఐ ప్రమోద్‌రావు డ్రైవర్ రాజబాపుపై కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను విచారించగా.. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒకరు మృతిచెందినట్లు రుజువు కావడంతో నిందితుడికి మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారు. కోతులను తరిమిన ఎలుగుబంటి వేషధారి జన్నారం: రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతుండడంతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోతుల బెడదను తొలగిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన సర్పంచులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని కలమడుగు గ్రామంలో సర్పంచ్ బొంతల నాగమణి గ్రామంలో ఒక వ్యక్తికి ఎలుగుబంటి వేషధారణ వేయించి కోతులు ఉన్న ప్రాంతంలో తిప్పుతున్నారు. చూసిన కోతులు పరుగులు తీస్తున్నాయి. గ్రామంలో ఎక్కడైన కోతుల బెడద ఉంటే సంప్రదించాలని సర్పంచ్ నాగమణి సూచించారు. -
తండ్రి మందలించాడని బలవన్మరణం
ఉట్నూర్‌రూరల్: తండ్రి మందలించాడని కుమారుడు బలవన్మరణం చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల మేరకు హస్నాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ సాయికిరణ్ (27) ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. ఈ నెల 30న సాయంత్రం విధులకు వెళ్లే ముందు మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి రాథోడ్ బాపురావు మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్సకోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం..
బోథ్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యం. అలా గే త్రీఫేజ్ విద్యుత్, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతా. సాగునీటి ప్రాజెక్టు కుప్టి నిర్మించేలా కృషి చేస్తాను. చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, బోథ్ రెవెన్యూ డివిజన్, పిప్పల్‌కోటి ప్రాజెక్టు పూర్తి, గుబిడి, సిరిచెల్మ రోడ్లతో పాటు ఆలయ అభివృద్ధి, ఇచ్చోడలో షాదీఖానా ఏర్పాటు చేసేలా చూ స్తాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే -
కొత్త ఆశలు.. ఆశయాలతో
కాలచక్రం గిర్రున తిరిగింది. మరో ఏడాది వచ్చేసింది. నూతన సంవత్సరంలో కొత్త ఆశలు.. ఆశయాలతో జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని అంటున్నారు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – ఆదిలాబాద్‌టౌన్/కై లాస్నగర్పోలీస్ వ్యవస్థ పటిష్టతకు కృషి2026 సంవత్సరంలో పోలీసు వ్యవస్థ మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తాం. యాంటీ డ్రగ్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మళ్లీ మళ్లీ నేరాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. రౌడీషీటర్లను కట్టడి చేస్తాం. ఎలాంటి సమస్యలున్నా ప్రజలు పోలీసులను ఆశ్రయించాలి. మెస్సేజ్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేయాలి. యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలి. చెడు వ్యసనాల దూరంగా ఉండాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. – అఖిల్ మహాజన్, ఎస్పీజిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు.. జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతాం. గతేడాది పాలనాపరంగా ఆదిలాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతృప్తి నిచ్చింది. అందరి సహకారంతో సాధించిన ప్రగతికి పురస్కారాలు, అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ ముందుకు సాగుతాం. మహిళాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రెవెన్యూ, భూభారతిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా శ్రద్ధ వహిస్తాం. అలాగే ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేర్చేలా ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్నిరంగాల్లో శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నా. – రాజర్షిషా, కలెక్టర్ -
పోలీసులకు క్రమశిక్షణ తప్పనిసరి
ఆదిలాబాద్‌టౌన్: సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు విధుల్లో నిజాయతీ తప్పనిసరి అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని బుధవారం పరిశీలించారు. ముందుగా హెడ్‌క్వార్టర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి పూలమొక్క అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యాలయంలోని ప్రతీ ఆయుధాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సంరక్షించాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులు కేటాయిస్తామని, ఉత్సాహం కలిగిన వారికి సంబంధిత విభాగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం హోంగార్డ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు రాకేశ్, గోపి, విజయ్, సాయుధ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ–పరిపాలన సౌలభ్యం కోసం స్టేషన్ ఆధునికీరణ ఆదిలాబాద్‌టౌన్: పాలనా సౌలభ్యం దృష్ట్యా పోలీస్ స్టేషన్‌ను ఆధునికీకరించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నవీకరించిన ఎస్హెచ్ఓ కార్యాలయం, సిబ్బంది విశ్రాంతి గదిని బుధవారం ప్రారంభించారు. ప్రజలతో మరింత సత్సంబంధాలు ఏర్పడేలా, సిబ్బందికి విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి కార్యాలయాన్ని సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్ కుమార్, ప్రేమ్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య, ఇసాఖ్, హరూన్ అలీతో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గాడిలో పడేనా?
నా పేరు మల్లెపూల పోతన్న. బోథ్ గ్రామం. ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేశాను. ఈ యాప్ ద్వారా మంచి ఉన్నది.. చెడు ఉన్నది.. మనకున్న వ్యవసాయ భూమి ప్రకారం ఎన్ని సంచుల యూరియా అవసరమో ఆ మేర బుక్ చేసుకుంటున్నారు. వినియోగానికి ఎంత అవసరమో అంతమేర ఇచ్చి మిగతా ఎప్పుడు వినియోగించాలో అప్పుడు ఇస్తున్నారు. అయితే మిగిలిన యూరియా తీసుకునేందుకు వెళ్లినప్పుడు తిరిగి బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఫర్టిలైజర్ ఉన్నది, లేనిది మనకు బుకింగ్ టైమ్‌లోనే తెలిసిపోతుంది. దాంతో షాప్‌కు వెళ్లి లైన్లో నిలబడే సమస్య ఉండదు. వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. డీలర్ దగ్గరికి వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. -
‘నవోదయ’ ఏర్పాటుకు చర్యలు..
జిల్లాలో నవోదయ విద్యాలయంతో పాటు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. ఎయిర్‌పోర్టు త్వరగా ప్రారంభమయ్యేలా చూస్తా. కొత్త రైళ్లు జిల్లా మీదుగా రాకపోకలు సాగేలా నా వంతు కృషి చేస్తా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతిఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. – గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషినియోజకవర్గంలో రెండేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. నూతన సంవత్సరంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తా. అలాగే రైల్వేఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతా. ఎయిర్‌పోర్టు ప్రారంభమయ్యేలా చూస్తాను. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు కృషి చేస్తా. కొరటా–చనాఖా ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలి
గుడిహత్నూర్: ఆదివాసీలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని గర్కంపేట్లో ఆదివాసీలకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలోని పిల్లలంతా చదువుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సర్పంచ్ మడా వి కేశవ్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఈ వో మనోహర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, మండల ప్రత్యేకాధికారి సునీత, డీపీవో రమేశ్, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంపీవో దిలీప్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగంపై అవగాహన అవసరం కైలాస్‌నగర్/ఆదిలాబాద్‌రూరల్: ప్రతీ పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బొక్కల్‌గూడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారానే హక్కులు లభిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం వృద్ధులకు చేతికర్రలు, మంకీ క్యాపులు పంపిణీ చేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సోమయ్య తదితరులు పాల్గొన్నారు. బొకేలు.. శాలువాలు వద్దు కై లాస్‌నగర్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా బొకేలు, శాలువాలకు బదులు పేదలకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే తీసుకురావాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. తనను కలవడానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కమ్ విత్ బుక్ నినాదంతో పిల్లల సాహిత్య పుస్తకాలు తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. దుప్పట్లు, పాఠ్యపుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రి వంటివి ఈ కార్యక్రమం ద్వారా సేకరించి జిల్లాలోని పేదలు, విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఆరు సూత్రాలు పాటించాలిఆదిలాబాద్టౌన్: విద్యార్థులు నిరంతరం ఆ రోగ్య సూత్రాలు పాటించాలని కలెక్టర్ రా జర్షిషా అన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అవలంభించేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్య పాఠశాలకు సంబంధించి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జందాపూర్ యూపీఎస్, ఉట్నూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల, యాపల్‌గూడ ప్రాథమిక పాఠశాల, మావలలోని మహాత్మా జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల, ఝరి గిరిజన ఆశ్రమ పాఠశాల, హస్నాపూర్ జెడ్పీఎస్ఎస్, బాలక్ మందిర్ ప్రభుత్వ పాఠశాల, ఖానాపూర్ యూపీఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రాజేశ్వర్, సెక్టోరియల్ అధికారి తిరుపతి పాల్గొన్నారు. -
‘బోథ్ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం..’
బోథ్: బోథ్ ప్రాంత అభివృద్ధి, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని పలువురు నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఫైర్‌స్టేషన్ సాధన కోసం సాగించిన పోరాటంలో భాగంగా బోథ్ ప్రాంత యువకులపై కేసులు నమోదయ్యా యి. ఈ మేరకు కోర్టుకు హాజరైన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బోథ్ ప్రయోజనాల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు. గతంలో బోథ్ నుంచి తరలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, ఫైర్‌స్టేషన్, గ్రంథాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
డ్రంకెన్ డ్రైవ్ చెక్‌పోస్టుల ఏర్పాటు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 15 డ్రంకెన్ డ్రైవ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలి పారు. వాహనదారులు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రాంగ్‌రూట్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్ వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్‌లు కట్ చేయవద్దని, ఇండ్లపై బాక్సులు, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వివరించారు. వేడుకల్లో బాణసంచా పేల్చవద్దని తెలిపారు. -
జాతీయ స్థాయిలో గుర్తింపు
ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. నార్నూర్ ఆస్పిరేషననల్ బ్లాక్‌లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలను పకడ్బందీగా అమలు చేసినందుకు గాను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కలెక్టర్ రాజర్షి షా అవార్డు అందుకున్నారు. అలాగే జిల్లాలో నీటి సంరక్షణకు చేసిన కృషికి గాను జల్ సంచాయి జన్ బాగీదారి జాతీయ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డుతో పాటు రూ.2కోట్ల నజరానా అందుకున్నారు. అలాగే ఆరోగ్య పాఠశాలను ప్రయోగాత్మకంగా చేపట్టి పక్కాగా అమలు చేసినందుకు గాను జాతీయ స్థాయి స్కోచ్ పురస్కారాన్ని సైతం కలెక్టర్ సొంతం చేసుకుని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. వీటితో పాటు నార్నూర్ అస్పిరేషనల్ బ్లాక్‌లో జరిగిన అభివృద్ధికి గాను మరో మూడు ప్రత్యేక బహుమతులు సైతం జిల్లాకు దక్కాయి. -
‘మున్సిపల్’ సందడి
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీ గా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్ని కల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా మున్సిపల్ అధికారులు చర్యలు షురూ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను విభజించే పనిలో నిమగ్నమయ్యారు. ముసాయిదా ఓటరు జాబితాను జనవరి ఒకటో తేదీన ప్రకటించాలనే ఈసీ ఆదేశాల కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల నిర్వ హణకు ఎక్కువ సమయం లేకపోవడంతో వా ర్డుల పునర్విభజన జోలికి వెళ్లకుండా పాత వార్డుల ప్రకా రమే నిర్వహించే అవకాశముంది. ఇదిలాఉంటే ము న్సిపల్ ఎన్నికలకు సై అంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను షురూ చేశారు. బరిలో ఉంటామని తెలిపేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. ఓటరు జాబితాలతో కుస్తీ.. పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా ఓటర్లతో కూడి న ముసాయిదా జాబితాను ఈ నెల 31న ప్రకటించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇందుకు సమ యం ఎక్కువగా లేదు. దీంతో గడువులోపు జాబితా ఎలాగైనా సిద్ధం చేసే దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల సమ యం నాటి ఓటర్ల జాబితాలను రెవెన్యూ అధికారు ల నుంచి తెప్పించుకున్నారు. వాటి ప్రకారం ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో 1,04,159 మంది ఓటర్లు ఉండగా 148 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను విభజించేందుకు మున్సి పల్ సమావేశ మందిరంలో ఆ జాబితాలతో కుస్తీ ప డుతున్నారు. కుటుంబంలోని ఓటర్లంతా ఒకే పో లింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూస్తున్నారు. పురుషులు, మహిళలు వార్డుల వా రీగా ఎంత మంది ఉన్నారనే లెక్క తేల్చనున్నారు. బుధవారం వరకే గడువు ఉండటంతో ముసాయిదాను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు పర్యవేక్షించారు. జనవరి 1న పట్టణంలోని వార్డుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆశావహుల ప్రయత్నాలు షురూ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం, అధికారులు కసరత్తు ప్రారంభించడంతో ఆశవాహులు సైతం తమ ప్రయత్నాలు షురూ చేశారు. రిజర్వేషన్లపై ఇంకా ఎలాంటి స్పష్టత రానప్పటికి, త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో పోటీకి సై అంటున్నవారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో తమ పార్టీల ప్రాధాన్యతను చాటేలా పేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సా ప్ల్లో ప్రచార పర్వం మొదలెట్టారు. ఓటర్లను ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్లు తమ తమ ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను వివరించేలా పోస్టుల్లో పొందుపరుసున్నారు. నూతన సంవత్సరంలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నగారా మోగనున్నట్లుగా పరిస్థితులు ఉండటంతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అనధికారికంగా వార్డుల్లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్ విడుదలైతే రాజకీయం మరింత వేడెక్కనుంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం ఎక్కువగా లేకపోవడంతో వార్డుల పునర్విభజన జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. పాత వార్డుల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని అభిప్రాయపడుతున్నారు. -
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా ఆయా అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మంగళవారం నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్బార్ హాల్లో జాతర ని ర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జాతర ప్రారంభానికి ముందే ఏ ర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈసారి జాతర ఆహ్వా న పత్రాలను రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రజాప్రతినిధులకు కూడా అందించాలని దేవాదాయ శాఖ అధి కారులకు సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మా ట్లాడుతూ, జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పీవో మర్మాట్ మాట్లాడుతూ, మెస్రం వంశీయులు, భక్తులు తరలివచ్చే రహదారుల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందులో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, ఈవో ముక్త రవి, కేస్లాపూర్ సర్పంచ్ తుకారాం, నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు చిన్ను పటేల్, కోసేరావ్ తదితరులున్నారు. -
కూర్పు కుదిరేనా?
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కా ర్యవర్గం కోసం అధికార పార్టీలో కసరత్తు మొదలైంది. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్‌ను ప్రకటించినప్పటికీ కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ సోమవారం ఆదిలాబాద్ చేరుకుని జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌తో కలిసి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొ నసాగింది. బుధవారం పరిశీలకులు నివేదిక రూ పొందించి టీపీసీసీకి పంపనున్నారు. అక్కడి నుంచి జనవరి 1 తర్వాత ఎప్పుడైనా జాబితా వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోటాపోటీ.. జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి వంటి పదవులతో పాటు కార్యవర్గ సభ్యులు, ఇతర విభాగాలకు పర్సన్స్‌ను ఎంపిక చేసేందుకు పరిశీలకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమ, మంగళ రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో ఈ ప్రక్రియ కొనసాగింది. సుమారు 260 వరకు దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. భారీగా వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఎంపిక కత్తిమీద సాములా మారింది. మెజార్టీ పదవులు పాత నాయకులకేనా.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీ లో కొనసాగుతున్న పాత నాయకులకు కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. 60నుంచి 80 శాతం పాత వారికే చోటు కల్పించాలని ఆదేశాలున్నాయి. 20నుంచి 30 శాతం వరకు కొత్తగా చేరిన వారికి అవకాశం కల్పించేందు కు పరిశీలన చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా పరిశీలన చేస్తున్నారు. మంగళవా రంతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. నివేదికను టీపీసీసీకి పంపనున్నారు. జనవరి 1 తర్వాత ఎప్పుడైనా అక్కడి నుంచి కార్యవర్గం జాబితా వెలువడే అవకాశముంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. వర్గపోరు నేపథ్యంలో..కాంగ్రెస్‌లో తీవ్ర వర్గపోరు నెలకొంది. పార్టీలో ఇటీవల తిరిగి చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డితో పాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ వంటి ముఖ్య నేతల అనుచరులు జిల్లా కార్యవర్గంతో పాటు మండల అనుబంధ సంఘాల్లో ప్రధాన పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పరిశీలకులతో పాటు జిల్లా అధ్యక్షుడిపై తమ అనుచరులకు సమప్రాధాన్యత ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పాత, కొత్త నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తామని, మొత్తంగా పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడే వారికి కమిటీలో చోటు ఉంటుందని పార్టీ అధిష్టానం చెబుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కమిటీల్లో కొనసాగుతున్న వారికి తిరిగి కొనసాగించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కమిటీ పూర్తిగా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశాలన్నీ హస్తం పార్టీలో ఆసక్తి కలిగిస్తున్నాయి. -
భివృద్ధి దిశగా.. డుగులు
అకై లాస్‌నగర్: అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఈ ఏడాది అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడ్డాయి. జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ కేంద్రంగా ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్ స్ట్రిప్‌ను మంజూరు చేసింది. నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. ఐటీ పరంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రూ.40కోట్ల వ్యయంతో చేపట్టిన టవర్ నిర్మాణం తుదిదశకు చేరింది. మరిన్ని రైళ్లు జిల్లా గుండా ప్రయాణించేలా మరమ్మతులకు సంబంధించిన ఫిట్‌లైన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. పరిపాలన కేంద్రమైన నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలా జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అందుతోంది. నూతన సంవత్సరంలోనూ ఇదే ఒరవడి కొనసాగితే జిల్లా మరింత ప్రగతి సాధించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తుది దశకు ఐటీ టవర్ నిర్మాణం నగరాలకే పరిమితమైన ఐటీ సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. ఇందుకోసం రూ.40 కోట్లు మంజూరు చేసింది. దీంతో మావల మండలం బట్టిసావర్గాం పరిధిలో 50వేల చదరపు అడుగులవైశాల్యంలో టవర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో బీడీఎన్టీ, ఎన్టీటీ కంపెనీలు ఐటీ సేవలను నిర్వహిస్తున్నాయి. టవర్ నిర్మాణం పూర్తయినట్లయితే మరిన్ని కంపెనీలు జిల్లాకు వచ్చే అవకాశముంది. దీంతో ఇక్కడి యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. చకచకా ఫిట్‌లైన్ పనులు జిల్లాకు రైళ్ల సంఖ్య మరింతగా పెంచాలనే ఉద్దేశంతో రైళ్ల నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.17కోట్ల వ్యయంతో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌కు 600 మీటర్ల పొడవుతో ఫిట్‌లైన్ మంజూరు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ కేంద్రంగా రైళ్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు సాగుతున్నాయి. అక్కడ రైళ్ల తాకిడి పెరిగినందున జిల్లా కేంద్రంలోనే ఫిట్‌లైన్ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు చకచకా సాగుతున్నాయి. పూర్తయితే 24 కోచ్‌లకు ఒకేసారి మరమ్మతులు, నిర్వహణ, నీళ్లు నింపడం వంటి పనులు చేసేందుకు అవకాశముంటుంది. జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఈ ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వారి కల సాకారం చేసేలా జాతీయ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయంతో పాటు వాయు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధించిన డీపీఆర్ సైతం సిద్ధం చేస్తోంది. ఎరోడ్రమ్‌లో ప్రస్తుతం 362 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా మరో 700 ఎకరాలు సేకరించాల్సిందిగా ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే భూ సేకరణ పనులు మొదలయ్యే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తుండడంతో ఎయిర్‌బస్ కల త్వరలోనే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టనున్న ఎరోడ్రమ్ మైదానం -
కేస్లాపూర్ చేరిన ప్రచార రథం
ఇంద్రవెల్లి: పుష్యమాస అమావాస్యను పుష్కరించుకుని జనవరి 18న నాగోబా ఆలయంలో నిర్వహించే మహాపూజతో పాటు జాతర నిర్వహణపై ఈ నెల 23న కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి నుంచి ప్రారంభమైన మెస్రం వంశీయుల ప్రచార కార్యక్రమం సోమవారం ముగిసింది. మండల కేంద్రంలోని గోండ్గూడలో మెస్రం వంశీయులు ఎడ్లబండికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ప్రచారరథం కేస్లాపూర్ గ్రామానికి చేరుకోగా వారి ఆచారం ప్రకారం రాత్రి మడావి వంశీయుల ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం నాగోబా మురాడికి చేరుకుని మధ్యాహ్నం ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులతో సమావేశమై పవిత్రమైన గంగా జల సేకరణ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. ఈ ప్రచార ముగింపు కార్యక్రమంలో కటోడ మెస్రం హనుమంత్‌రావ్, మెస్రం కోసేరావ్, దేవ్‌రావ్, పర్ధాన్ మెస్రం దాదారావ్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు కష్టం..దొంగలపాలు
కైలాస్‌నగర్(బేల): ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడి పంట పండించిన రైతుకు క న్నీరే మిగిలింది. పత్తిని ఏరి పంట చేనులో గల కొట్టంలో నిల్వ ఉంచగా అపహరణకు గురైంది. బేల మండల కేంద్రానికి చెందిన నీపూంగే రూపేష్ అనే రైతు 16 ఎకరాల భూమిని రూ.4లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటి వరకు 50 క్వింటాళ్ల పత్తి విక్రయించగా, ఇటీవల మార్కెట్‌కు వరుస సెలవులు ఉండడంతో ఏరిన పత్తిని పంట పొలంలోని కొట్టంలో నిల్వ ఉంచాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 15 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించారు. దుండగులు పత్తిని వాహనంలో నింపి తరలించినట్లు అనుమానం వ్య క్తం చేశాడు. ఈ విషయమై సోమవారం బేల పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఎల్.ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. -
విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
కాగజ్‌నగర్‌రూరల్: విహారయాత్రకు వెళ్లిన యువకుడు నీట మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని విలేజ్ నెం 1కు చెందిన మంజిత్ మండల్(35)ఆదివారం గ్రామానికి చెందిన కొంతమందితో కలిసి విహార యాత్ర కోసం జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అక్కడ విందు చేసుకున్న అనంతరం మృతుడు చేపలు పట్టేందుకు వలతో నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువ ఉండడంతో వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. రాత్రి వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం గజ ఈతగాళ్లతో వెతికించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే మంజిత్ మండల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని సోదరుడు సుజిత్ మండల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ(43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన ఎక్కల్దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్నంబర్ల ద్వారా కృష్ణ సెల్‌ఫోన్‌కు ఫోన్‌పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్‌క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్‌జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం. -
శాశ్వత పరిష్కారం చూపాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగం నిర్వహించా రు. జిల్లా నలుమూలల నుంచి 38 మంది అర్జీ దారులు వచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ ఆయా పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం అందిన ఫిర్యాదుల్లో ఫోర్జరీ, భూ సమస్యలు, అన్నదమ్ముల తగాదా లు వంటివి ఉన్నాయి. ఇందులో శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్, జైస్వాల్ కవిత తదితరులున్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి ఆదిలాబాద్‌టౌన్: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈనెల 31న రాత్రి జిల్లా వ్యాప్తంగా 30 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించవద్దని, ర్యాలీలు, ఈవెంట్లు నిషేధమని పేర్కొన్నారు. ఫాంహౌస్‌లు, రిసార్టుల నిర్వాహకులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు, ట్రిపుల్‌రైడింగ్, రాంగ్‌రూట్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై కేక్‌లు, టపాసులు పేల్చడం, బైక్ రేసింగ్ చేయడం వంటివి చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. జిల్లాకు ట్రెయినీ ఐపీఎస్ అధికారిఆదిలాబాద్టౌన్: జిల్లాకు నూతన శిక్షణఐపీఎస్ అధికారిని ప్రభుత్వం కేటాయించింది. ట్రెయినీ ఐపీఎస్ రాహుల్ కాంత్ సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలి శారు. జిల్లాలో ఐదు నెలల పాటు శిక్షణ పొందనున్నారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెంది న ఈయనది 2023 ఐపీఎస్ బ్యాచ్. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో శిక్షణ పొందా రు. పోలీసు శాఖలోని ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు. -
వార్షిక నేర నివేదిక విడుదల
రహదారులు రక్తసిక్తం.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. గతేడాది పోల్చితే ఈసారి కొంత తగ్గినప్పటికీ బాధిత కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది. మర్డర్లు.. సైబర్ క్రైమ్.. గడిచిన మూడేళ్లుగా కేసుల వివరాలు.. కేసులు 2023 2024 2025 దోపిడీ 01 07 11 పగటి చోరీలు 14 24 47 రాత్రి చోరీలు 81 132 193 సాధారణ దొంగతనాలు 171 194 419 మర్డర్ 18 14 13 కిడ్నాప్ 24 41 58 అత్యాచారం 38 48 55 చీటింగ్ 130 192 655 హత్యాయత్నం 68 48 31 రోడ్డు ప్రమాదాలు 120 129 109 క్షతగాత్రులు 06 25 22 సాధారణ క్షతగాత్రులు 380 389 430 ఇతర కేసులు 1337 1094 1737 మిస్సింగ్ కేసులు 242 342 405 అగ్ని ప్రమాదాలు 05 01 13 మొత్తం కేసులు 4128 3979 6486జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహా జన్ సోమవారం వార్షిక క్రైమ్ నివేదిక వెల్లడించా రు. నూతన విధానాలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువైందని తెలిపారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసి ఆయా స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందులో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, శ్రీనివాస్, శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నాగోబా జాతర నిర్వహణపై నేడు సమావేశం
ఇంద్రవెల్లి: జనవరి 18న మెస్రం వంశీయుల మహాపూజతో ప్రా రంభంకానున్న నాగోబా జాతర నిర్వహణపై ‘జాతర సమీపిస్తున్నా...జాప్యమే’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జాతర నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ ఉత్తర్వులు జారీ చేశారని దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు. మంగళవారం ఉదయం నాగోబా దర్బార్ హాల్లో ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు పీవో హాజరుకానున్నట్లు తెలిపారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు, మెస్రం వంశీయులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. -
విజ్ఞానయాత్రలొద్దు.. గూడు కావాలె
ఉట్నూర్‌రూరల్: ‘విజ్ఞానయాత్రలు వద్దు.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముద్దు’ అంటూ కొలం గిరిజనులు సోమవారం ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీవీటీజీ జిల్లా అధ్యక్షుడు వసంత్‌రావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో గల అనేక గ్రామాల్లో కనీస వసతులు కరువయ్యాయన్నారు. ఆదివాసీలకు గూడు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు మంజూరు చేస్తే ఆ నిర్మాణాలను ఫారెస్ట్ ఏరి యా అంటూ అటవీ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు. అయితే ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కుమ్మరికుంటలో పర్యటించిన సమయంలో కొలం గిరిజనులను విజ్ఞానయాత్ర పేరిట హైదరాబాద్ తీసుకెళ్తామని చెప్పారని అన్నారు. అయితే తమకు యాత్రలు ముఖ్యం కాదని ఉండేందుకు గూడు కావాలని డిమాండ్ చేశారు. ఇందులో సంఘ నాయకులు మానిక్‌రావు, కొడప అనసూయ, భీంరావు, నాగోరావు తదితరులున్నారు. -
జాతర రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి
మంచిర్యాలఅర్బన్: మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పగిడిమర్రి సోలోమాన్ సూచించారు. సోమవారం మంచిర్యాల డీఎం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు డిపో ఆవరణలో మొక్కలు నాటారు. డిపో పరిసరప్రాంతాలు పరిశీలించారు. సమావేశంలో రీజియన్ మేనేజర్ భవానీ ప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం (మెకానికల్) రామయ్య, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, భైంసా డిపో మేనేజర్లు శ్రీనివాసులు, పండరీ, ప్రతిమారెడ్డి, రాజశేఖర్, హరిప్రసాద్, అన్ని డిపోల ట్రాఫిక్, గ్యారేజీల ఇన్చార్జీలు పాల్గొన్నారు. 369 స్పెషల్ బస్సులు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా డిపోల నుంచి 369 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన చెన్నూర్ బస్‌పాయింట్ నుంచి 70 బస్సులు, ఆసిఫాబాద్ నుంచి 10, బెల్లంపల్లి పాయింట్ నుంచి 79, భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ బస్‌పాయింట్ నుంచి 45, నిర్మల్ డిపోకు చెందిన 50 బస్సులను మందమర్రి పాయింట్ నుంచి, మంచిర్యాల డిపోకు చెందిన 115 స్పెషల్ బస్సులను మంచిర్యాల పాయింట్ నుంచి నడిపించనున్నట్లు ప్రకటించారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అఽర్టీసీ అధికారులు వెల్లండిచారు. -
‘ధూప దీపం’కు దూరం..!
మంచిర్యాలఅర్బన్: ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్య పూజలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో ఉమ్మడి జిల్లాకు శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా ఆలయాల ఎంపిక మాత్రం రెండు పదులకు పరిమితం కావడం నిరాశకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఒకే ఆలయానికి చోటు దక్కడంపై పెదవి విరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, కుమురంభీం ఆసిఫాబాద్‌లో రెండు,నిర్మల్ జిల్లాలో 13 ఆలయాలు మజూరయ్యాయి. ఆలయాలకు దక్కని చోటు డీడీఎన్ పథకం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 146 ఆలయాలు ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో 21 ఆలయాలు మాత్రమే ఈ పథకం కింద మంజూరుయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల పైరవీలు, ఒత్తిడితో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆశించిన మేర ఆలయాలకు చోటు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనలు ఇలా.. ఈ పథకం కింద ఆలయాలు ఎంపిక కావాలంటే దేవాదాయ శాఖలో నమోదై నిత్య పూజలు నిర్వహిస్తుండాలి. జాతర సందర్భాల్లో తెరిచే ఆలయాలకు పథకం వర్తించదు. ఆలయానికి ఆదాయం వచ్చే ఎలాంటి భూములు ఉండకూడదు. ఆలయంలో ఒక అర్చకుడికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలకు వర్తించదు. రాష్ట్రంలో 2007లో తీసుకొచ్చిన ఈ పథకం కింద ఒక్కో గుడికి రూ.2,500 చెల్లించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. పూజ సామగ్రికి రూ.4వేలు, అర్చకుడికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దరఖాస్తుల వడపోత అనంతరం ప్రత్యేక కమిటీ వందల సంఖ్యలో ఎంపిక చేసి నివేదించినా మంజూరు మూడు పదులకై నా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిన్ని ఆలయాలకు మంజూరు అవకాశం కల్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా దరఖాస్తులు ఎంపిక మంజూరు ఆదిలాబాద్ 219 34 05 కుమురంభీం 102 18 02 మంచిర్యాల 110 34 01 నిర్మల్ 295 60 13 726 146 21 -
రెగ్యులర్ వార్డెన్లను నియమించాలి
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ వార్డెన్లు, హెచ్ఎంలను నియమించాలని కోరుతూ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటేషన్ల విధానం రద్దు చేసి రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని, విద్యార్థుల భద్రత కోసం పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేయాలని, భోజన నాణ్యతను మెరుగు పరచి, మోనూ కఠినంగా అమలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. -
డబ్బులు లే కున్నా.. క్యారెక్టర్ ఉన్నోడు
బోథ్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వద్ద డబ్బులు లేకున్నా.. అంతకన్న విలువైన క్యారెక్టర్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోథ్, సొనాలతో పాటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచి గెలిచిన 134 మంది సర్పంచ్, ఉప సర్పంచ్‌లను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. నియోజకవర్గంలో అనిల్ నాయకత్వంలో పార్టీ బలంగా ఉందనడానికి మీ గెలుపే నిదర్శనమన్నారు. గెలిచిన ప్రతీ సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే అనిల్ ఇచ్చోడ/బోథ్: శాసనసభ సమావేశాల్లో భా గంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో సోమవారం నియోజకవర్గ సమస్యలపై తన గళం వినిపించారు. సోయా పంట విక్రయించేందుకు రైతుల పడుతున్న ఇబ్బందులను ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఎంతుందో..ఏముందో?
కడెం: సాగునీటి ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 4.699 టీఎంసీలుగా ఇరిగేషన్ అధికారుల అంచనా. అంటే 2.904 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు అంచనా. ప్రాజెక్ట్‌లో పూడిక ఎంతుందో తెలుసుకునేందుకు 2013లో సైతం హైడ్రాలజీ సర్వే నిర్వహించారు. సిబ్బంది సర్వే కడెం ప్రాజెక్ట్‌లో పూడికతీత పనులు దక్కించుకున్న రాజస్థాన్‌కు చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఈనెల 27, 28 తేదీల్లో హైడ్రాలజీ సర్వే నిర్వహించింది. ప్రాజెక్ట్‌లో ఎంత మేర పూడిక నిండుకుంది. అందులో బండరాయి, మట్టి ఉందా? ఇసుక, తదితర మెటీరియల్ ఎంత ఉందో తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన బోటుతో సిబ్బంది సర్వే నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు అడ్డంగా పదిలైన్ల చొప్పున ఏర్పాటు చేసుకుని లోకేషన్, ప్రొఫైల్, తదితర రిపోర్టులు సేకరించారు. జియాలజికల్ రిపోర్ట్‌ను బట్టి ఎంత మేర పూడిక ఉందో.. ఎలాంటి మెటీరియల్ ఉందో త్వరలో తేలనుంది. -
గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు
బజార్హత్నూర్: స్వాతంత్య్రానికి పూర్వమే రాయిసెంటర్ల ఆవిర్భావం జరిగినా మూడు దశాబ్దాల క్రితం ప్రాచూర్యం పొందాయి. నిరక్షరాస్యత, అమాయకత్వం రాజ్యమేలుతున్న వెనుకబడ్డ గిరిజన జాతుల్లో ఇప్పటికీ రాయిసెంటర్లే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవీన న్యాయానికి ఏమాత్రం తీసిపోకుండా ఉచిత న్యాయ తీర్పులు చెప్తూ ఆధునిక నాగరికతల్లోనూ వేళ్లూనుకున్నాయి. గిరిజనుల మధ్య తగాదాలకు, వివాదాలకు పరిష్కార మార్గాలకు దారిచూపుతున్నాయి. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గొడవలే పోలీస్స్టేషన్లకు, కోర్టులకు వస్తుంటాయి. కానీ గిరిజన జాతుల మధ్య కేసులు మాత్రం ఆధునిక కోర్టుల వరకు వెళ్లవు. రాయిసెంటర్లలో గిరిజన పెద్దలు చెప్పే తీర్పులతోనే కేసులు సమసిపోతాయి. అందుకే నేటికీ గిరిజన సమాజంలో వీటికి ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే? గోండిభాషలో రాయి అంటే సలహా, నిర్ణయం, న్యాయం అనే అర్థాలు ఉన్నాయి. సెంటర్ అనగా కేంద్రం. ప్రారంభంలో సలహా కేంద్రాలుగా ప్రాచూర్యం పొందిన గిరిజన పంచాయతీలు క్రమేణ నిర్ణయ కేంద్రాలుగా మారాయి. కాలగమనంలో అవి గిరిజనుల న్యాయకేంద్రాలుగా రూపందుకున్నాయి. గోండురాజుల ఏలుబడిలో ఎవరికై నా ఎదైన సమస్య వచ్చినప్పుడు పెద్దల సలహా(రాయి) తీసుకునేవారు. సామాజిక సమస్యలు పరిష్కరించుకోడానికి గ్రామంలోని పెద్దలంతా ఒకచోట గుమిగూడి నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడూ పద్ధతి ఏదైనా ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత సమస్య వస్తే పెద్దలు సమావేశమై న్యాయం చెబుతారు. అవే నేడు రాయిసెంటర్లుగా మారాయి. స్వరూపం... 20 నుంచి 40 గిరిజన గ్రామాల పరిధిలో ఒక రాయిసెంటర్ ఉంటుంది. ఆయా గ్రామాల్లోని పటేల్, దేవరి, మహాజన్, గట్యాల్ (గిరిజన జాతుల పెద్దలు) కలిసి 11 మంది కార్యవర్గంతో రాయిసెంటర్ ఏర్పడుతుంది. రాయిసెంటర్ పెద్దను సార్మేడి (అధ్యక్షుడు), ఉపమేడి(ఉపాధ్యక్షుడు), గీతాదార్ (కార్యదర్శి), ఖజాన్‌దార్(కోశాధికారి), అవాల్దార్ (సమాచారం), మిగతావారు సలహాదారులు గా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 120 రాయి సెంట ర్లు ఉన్నాయి. వీటన్నింటిపై జిల్లాస్థాయిలో ఉట్నూర్‌లోని గుస్సాడిగుట్టలో జిల్లా రాయిసెంటర్ ఉంది. అక్కడి పెద్దను జిల్లా మేడి అని సంభోదిస్తారు. నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తారు. కుటుంబ, ఆ స్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గిరి జనులకు సంబంధించిన అనేక సమస్యలను గ్రామ పటేల్ పరిష్కరిస్తాడు. అతనితో కానిపక్షంలో ఆ కేసుల ను రాయిసెంటర్ కు బదిలీ చేస్తాడు. ఇక్కడా పరిష్కారం కాకుంటే డివిజన్ సెంటర్‌కు బదిలీ చేస్తారు. అక్కడా పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయిలో ఉట్నూర్ గుస్సాడిగుట్ట రాయిసెంటర్కు బదిలీ చేస్తారు. అక్కడ మూడుసార్లు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాని పక్షంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవోలను పిలిపించుకుని వారి సమక్షంలో సమస్య పరిష్కారం చేస్తారు. సద్గుణాలే సార్‌మేడిల ఎంపికకు అర్హతలు రాయిసెంటర్‌లో సా ర్మేడిగా ఎంపిక కా వడానికి ఎలాంటి ఉన్నత విద్య అవసరం లేదు. డ బ్బు, దర్పం పనికిరావు. సత్ప్రవర్త న, సేవాభావం, స ద్గుణాలే గిరిజన పెద్దగా ఎంపిక కావడానికి అర్హతలు. మత్తు పానీ యాలు సేవించకుండా ఉండటం. పొగ, చెడు అలవాట్లు లేకపోవడం వంటి గుణాలే సార్మేడి, జిల్లా మేడిలలో ఉంటాయి. ఎంపికై న తర్వాత వ్యసనాలకు అలవాటు పడితే తొలగించే అవకాశం ఉంది. సెంటర్ల బలోపేతానికి మడావి తుకారాం కృషి బ్రిటిష్ రీసెర్చర్ హైమన్‌డార్ప్ సూచనతో 1943 నిజాం పాలనలో రాయిసెంటర్లను మొదట ప్రారంభించారు. రాజ్‌గోండ్ సేవాసంస్థ గిరిజన సంప్రదాయంలో అంతర్భాగమై ఉన్న సెంటర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత మొదటి గిరిజన ఐఏఎస్ మడావి తుకారాంకు దక్కుతుంది. ఉట్నూర్ మండలం లక్సెట్టిపేట వాసి అయిన మడావి తుకారాం హైమన్‌డార్ప్ వద్ద గోండిభాష అనువాదకుడిగా పనిచేశారు. హైమన్‌డార్ప్ సూచనల మేరకు గిరిజన సంప్రదాయాలను బలోపేతం చేశారు. గిరిజన వ్యవహారాల్లో కీలకమైన షోడావాజన్ (16 రకాల వాయిద్యాలు), అట్రడెమ్సంగ్ (18 రకాల నృత్యాలు)ను పటిష్టం చేయడానికి తీవ్ర కృషి చేశారు. అందులో భాగంగానే రాయిసెంటర్లకు చట్టబద్ధత కల్పించారు. వీటి పరిధిలో ధాన్యాగారాలను (గ్రెయిన్ బ్యాంకులు) ఏర్పాటు చేసి గిరిజనులు ధాన్యం నిల్వ చేసుకుంటే ఐటీడీఏ ద్వారా వాటికి సమాన ధాన్యాన్ని సబ్సిడీపై అందజేశారు. పొదుపు సంఘాలను ప్రోత్సహించారు. ప్రొఫైల్ పంచాయతీలకే పరిమితం కాదు రాయిసెంటర్లు కేవలం పంచాయతీలు, న్యాయం చెప్పడానికే పరిమితం కాలేదు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. గిరిజనుల వ్యవహారాల్లో సంస్కరణలకు బాటలు వేస్తున్నాయి. సామూహిక వివాహాలను ప్రోత్సహించి అనవసర ఆర్థిక వ్యయాన్ని తగ్గిస్తున్నాయి. 2001లో ఇచ్చోడలో జరిగిన 106 గిరిజన పెళ్ళిళ్లలో రాయిసెంటర్ పాత్ర కీలకం. గిరిజనుల పెళ్లి సమయంలో వరుని కుటుంబం వధువు కుటుంబానికి ఆవు, మేక ఇచ్చే ఆచారాలను దూరం చేశారు. 1980–90 దశకంలో దేవ్‌దాన్ గోదాం(గ్రెయిన్ బ్యాంక్)లను ఏర్పాటు చేసి ధాన్యాలను రాయిసెంటర్ల ఆధ్వర్యంలో నిల్వ ఉంచే వారు. అగ్ని ప్రమాదాల్లో గిరిజన గూడేలు కాలిపోయినపుడు, కరువు పరిస్థితులు ఏర్పడినపుడు నిల్వ ధాన్యాన్ని పంచేవారు. ఆదివాసీల ఆందోళనకు సామరస్యంగా పరిష్కారం లంబాడీల వల్లే ఆదివాసీ గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 2017 డిసెంబర్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల రోజులపాటు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. శాంతి భద్రతలు చేయిదాటే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులను బదిలీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్‌గా దివ్యదేవరాజన్ వచ్చారు. ఆదివాసీల ఆందోళనకు గల కారణాలను పరిశీలించి ఆదివాసీ గిరిజన పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు రాయిసెంటర్లను వినియోగించుకున్నారు.ఏటా వార్షికోత్సవం 1943 నుంచి కొనసాగుతున్న రాయిసెంటర్లు నేటికీ గోండుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పనిచేస్తున్నాయి. సెంటర్లను 1987లో పునరుద్ధరించినప్పటి నుంచి ఉట్నూర్ కేంద్రంగా స్థానికంగా ఉన్న గోండు రాజుల పురాతన కోటలో జిల్లాలోని సార్‌మేడిల ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్ 31న వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. – తొడసం దేవరావ్, ప్రధాన కార్యదర్శి, జిల్లా రాయిసెంటర్ న్యాయం జరుగుతుందని నమ్మకం ఎంతపెద్ద సమస్య ఉన్నా గిరిజనులు పోలీస్‌స్టేషన్, కోర్టు గడప తొక్కరు. ఆర్థిక, సామాజిక గొడవలను గ్రామ పటేల్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయి. బలమైన సమస్య, గ్రామాల మధ్య గొడవలు రాయిసెంటర్‌లో పరిష్కారం చేసుకుంటారు. ఇక్కడే తమకు న్యాయం జరుగుతుందని గిరిజనులు నమ్ముతారు. – మెస్రం దుర్గు, జిల్లా మేడి గౌరవిస్తాం రాయిసెంటర్ల తీర్పులను గౌరవిస్తాం. కొంతమంది ఆదివాసీలు ఉన్నత ఉద్యోగాల్లోనూ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఉన్నా రాయిసెంటర్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోం. రాయిసెంటర్లను, సార్మేడిలను, జిల్లా మేడిని గౌరవిస్తాం. మా పూర్వీకులు అందించిన సంప్రదాయాలను కాపాడుకుంటున్నాం. – నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ గిరిజనుల న్యాయస్థానం భారత న్యాయ వ్యవస్థలో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్న విదివిధానాలే గ్రామ స్థాయి రాయిసెంటర్ నుంచి జిల్లా రాయిసెంటర్ వరకు ఉంటాయి. గిరిజనుల సమస్య గ్రామ పటేల్ స్థాయిలో పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయి రాయిసెంటర్కు వెళ్తారు. అనేక సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తారు. – డాక్టర్ తొడసం చందు, జిల్లా రాయిసెంటర్ సలహాదారు -
జాతరకు రెండు అంబులెన్స్‌లు కేటాయింపు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరకు రెండు అంబులెన్స్‌లు కేటాయించనున్నట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ సమ్రాట్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 ఫైలెట్లు, ఈఎంటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఫైలెట్లు విజయ్, బాపురావ్, నాందేవ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అఽ దికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించి న ప్రజావాణికి తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన సత్యనారాయణ తనకు భూమి మంజూరు చేయాలని, కడెం మండల కేంద్రానికి చెంది న ప్రభాకర్ రుణ సదుపాయం కల్పించాలని, వి విధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. -
అర్జీల వెల్లువ
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చి కలెక్టర్ రాజర్షి షా ఎదుట తమ గోడు వినిపించారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు. కాగా, ఈ వారం ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, స్వయం ఉపాధి కల్పన వంటి అంశాలపై మొత్తం 110 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, జెడ్పీ సీఈవో రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. -
సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
కై లాస్‌నగర్: సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ రాజర్షిషా విద్యార్థులకు సూచించారు. ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌లో మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాల విద్యార్థులు వైష్ణవి, రానుష రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారిని ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు. జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డు 2023–24కు మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల సహకారం అభినందనీయమని కొనియాడారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ప్రిన్సిపాల్ కీర్తి, ఉపాధ్యాయులు సుజాత, నీతిఅయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ తదితరులున్నారు.


