మత్స్య సంపద యోజనను వినియోగించుకోవాలి
ఖానాపూర్: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజ న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాబార్డు డీడీఎం వీరభద్రుడు సూచించారు. సోమవారం మండలంలోని మస్కాపూర్ పంచాయతీ పరిధిలోగల గంగాయిపే ట్ గ్రామంలో మత్స్య గాంధీ మల్టీస్టేట్ ఫిషర్ మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెజ్ అండ్ నాన్‌వెజ్ పచ్చళ్ల తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం మత్స్య సంపద యోజన పథకం ద్వారా సబ్సిడీ రు ణాలు ఇస్తోందని తెలిపారు. మత్స్య రంగాన్ని సంఘటితం చేయడంతో పాటు సూక్ష్మ, చిన్న తరహా ప రిశ్రమలకు సహాయపడేలా ఆర్థికసాయం అందించేందుకు ఈ పథకం అందుబాటులో ఉందని తెలి పారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు చేసిన పచ్చళ్లను పరిశీలించారు. ఇక్కడ తయారు చే సిన చేపల పచ్చళ్లను ఒప్పందం ఉన్న దేశవ్యాప్త కంపెనీలకు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇండియా మార్టు, సహకార సంఘాలతో పాటు పలు కంపెనీలతో ఒప్పందా లున్నాయని తెలిపారు. రోజుకు 50కేజీల చేపలతో రూ.30వేల విలువైన పచ్చళ్లు తయారు చేసి విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. డీసీవో పాపయ్య, సొసైటీ గౌరవాధ్యక్షుడు దామెర రాజయ్య, చైర్మన్ పుల్లబోయిన భీమన్న, నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి విజ య, నిర్వాహకులు రాములు, నరేశ్, నర్సయ్య, లా వణ్య, లలిత, పూజ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకుల శ్రీనివాస్, మండలాధ్యక్షుడు ఉపేందర్, నాయకులు గిరి, భూమన్న, స్వామి తదితరులున్నారు.


