
నాణ్యమైన సేవల కోసమే గ్రీవెన్స్
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకే ప్రజా ఫిర్యాదుల నిర్వహణ (గ్రీవెన్స్) చేపడుటున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు ప్రశంస
మాదకద్రవ్యాల నిర్మూలన, విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ గామ శ్రీని వాస్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రశంసా పత్రం అందజేశారు.