
లింగాపూర్‌లో దొంగతనం
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగిల్ల బుచ్చన్న కొడుకు దుబాయ్ వెళ్లగా కోడలు సరిత అత్తమామలతో కలి సి ఉంటుంది. బుధవారం సరిత తల్లిగారింటికి వెళ్లగా బుచ్చన్న గదికి తాళం వేసి పక్క గదిలో నిద్రించాడు. తె ల ్లవారుజాము చూసేసరికి గది తాళం, బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గదిని పరిశీలించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు.