
రాయితీ సద్వినియోగం చేసుకోండి
కై లాస్‌నగర్: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించేవారికి 5శాతం రాయితీ కల్పించినట్లు ము న్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎర్లీబర్డ్ పథకం అమలు తీరుపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటాయించిన వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీలైనంత మేర పన్ను వసూలు చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 30 వరకు గడువు ఉందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో ఆర్‌వో స్వామి, ఆర్‌ఐలు వెంకటేశ్, హన్మంతు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.