న్యాయవాదుల నిరసన ర్యాలీ
కై లాస్‌నగర్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ న్యాయవాదులు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసేలా కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి డీఎస్‌పీ శర్మ, ఉపాధ్యక్షుడు చందూసింగ్, ముజాయిద్ హుస్సేన్, అఖిలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


