● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.. ● ఆరో ప్రయత్నంలో లక్ష్యం సాధించా ● ట్రైబల్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు కృషి ● ‘సివిల్స్‌’ 68వ ర్యాంకర్‌ సాయిచైతన్య జాదవ్‌ మనోగతం | - | Sakshi
Sakshi News home page

● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.. ● ఆరో ప్రయత్నంలో లక్ష్యం సాధించా ● ట్రైబల్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు కృషి ● ‘సివిల్స్‌’ 68వ ర్యాంకర్‌ సాయిచైతన్య జాదవ్‌ మనోగతం

Apr 24 2025 12:27 AM | Updated on Apr 24 2025 12:27 AM

● విజ

● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.

సాక్షి,ఆదిలాబాద్‌: ‘ఈ ఆనంద క్షణాలను మరువలే ను.. పట్టుదల వీడకుండా చేసిన ప్రయత్నమే నన్ను విజయతీరాలకు చేర్చింది.. యూపీఎస్సీ అంటేనే తీవ్రమైన పోటీ. ఆరేళ్లుగా సాగిన నా ప్రి పరేషన్‌ మొత్తం ఈ సారి అత్యుత్తమ ర్యాంక్‌ రావడానికి దోహదపడింది..’ అని అన్నారు ఆది లాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయిచైతన్య జాదవ్‌. మంగళవారం విడుదలైన సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 68వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. ఈ నే పథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న ఆయనను ‘సాక్షి’ బుధవారం ఫోన్‌ ద్వారా ‘ఇంటర్వ్యూ’ చేసింది. ఈ సందర్భంగా ఆయన తన సక్సెస్‌కు దారితీసిన అంశాలను ఇలా వివరించారు.

సాక్షి: మీ కుటుంబ నేపథ్యం..

సాయిచైతన్య: మాది తలమడుగు మండలం పల్సి (బి) గ్రామం. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. నాన్న గోవింద్‌రావ్‌ హెడ్‌కానిస్టేబుల్‌. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో పనిచేస్తున్నారు. అమ్మ కవిత ఉట్నూర్‌ ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయురా లు. సోదరి శృతికి వివాహమైంది. హైదరాబాద్‌లో డాక్టర్‌. 20ఏళ్ల క్రితం మా కుటుంబం పల్సి( బి) నుంచి వచ్చి ఉట్నూర్‌లో స్థిరపడ్డాం.

సాక్షి: మీ విద్య ఎక్కడెక్కడ సాగింది..

జాదవ్‌: ఉట్నూర్‌లోనే ప్రాథమిక విద్య పూర్తయింది. ఆ తర్వాత కాగజ్‌నగర్‌ నవోదయ పాఠశాలలో పదో తరగతి వరకు చదివా. ఇంటర్‌ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో పూర్తి చేశా. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచ్చి ఐఐటీలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా.

సాక్షి: ఐఏఎస్‌ లక్ష్యం ఎప్పుడు పెట్టుకున్నారు..

జాదవ్‌: అమ్మ నాన్నకు ముందు నుంచి మమ్మల్ని మంచి హోదాలో చూడాలనే కోరిక ఉండేది. దాన్ని నేను పైకి తీసుకెళ్లాను. పెద్ద పోస్టు సాధించాలని ముందు నుంచి అనుకున్నాను. ఆ లక్ష్యంలో మా ఫాదర్‌, మదర్‌ సపోర్టు ఉంది.

సాక్షి: ర్యాంక్‌ వచ్చేందుకు దోహదపడిన అంశాలు..

జాదవ్‌: బీటెక్‌ పూర్తయిన వెంటనే 2019లో మొదటిసారి తమిళనాడులోనే సివిల్‌ సర్వీసెస్‌ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్‌లోనే తప్పాను. తర్వాత 2020 లో రెండోసారి రాయగా, మెయిన్స్‌లో పోయింది. మూడు, నాలుగోప్రయత్నంలో 2021, 2022 ఇంటర్వ్యూలో చేజారింది. 2023లో 131వ ర్యాంక్‌ సాధించాను. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యాను. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించారు. ఆ శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత సెలవు పెట్టి మళ్లీ ప్రి పేర్‌ అయ్యాను. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ ర్యాంక్‌ సాధించాను.

సాక్షి: మీ శిక్షణ అనుభవాలను చెప్పండి

జాదవ్‌: ఆరో సారికి నేను 68వ ర్యాంక్‌ సాధించా ను. గత ఐదుసార్లు రాసింది నాకెంతో ఉపయోగపడింది. నా ప్రిపేరేషన్‌ క్రమంలో ఎంతో మంది మిత్రులు దొరికారు. ఐదుగురం మిత్రులం కలిసి హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటూ ప్రి పరేషన్‌ కొనసాగించాను. ఐదేళ్లుగా వివిధ అకా డమిల్లోనూ శిక్షణ తీసుకున్నాం. ఈ ఫలితాల్లో నాతోపాటు మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిత్రులు మంచి ర్యాంక్‌ సాధించారు.

సాక్షి: ఐఏఎస్‌గా మీ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి..?

జాదవ్‌: నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చూశాను.. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అలాంటి వాతావరణంలోనే నేను పెరిగాను.. చుట్టుపక్కలా ఎవరినైనా చూస్తే పూర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చే వారే ఉండేవారు. గవర్నమెంట్‌ వైపు ఏదైనా పథకం కోసం చూసేవారు. అయితే ఆ స్కీమ్‌ వారి వరకు రీచ్‌ అవుతుందా.. లేదో.. ఆ స్కీమ్‌ను అలాంటి వారికే అందించేందుకు బ్యూరోకసి తోడ్పడుతుందని నా భావన. ఐఏఎస్‌గా ప్రభుత్వ పథకాలను పేదల దరికి చేర్చడం, ట్రైబల్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ నా ముఖ్య ఉద్దేశాలుగా ఉండబోతున్నాయి.

సాక్షి: సివిల్‌ సర్వీస్‌కు ప్రిపేర్‌ అయ్యేవారికి, ర్యాంక్‌ రానివారికి మీరిచ్చే సూచన

జాదవ్‌: సివిల్‌ సర్వీస్‌కు ప్రిపేర్‌ అయ్యేవారు, ర్యాంక్‌ రానివారు తమ ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఐదేళ్లుగా నా పరిస్థితిని ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ర్యాంక్‌ రానివారిలో నా ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు నా ఫ్రెండ్స్‌ ఎవరైతే ర్యాంక్‌ సాధించారో.. వాళ్లను చూసి నేను మదిలో అనుకునేవా డిని.. నేను ఎప్పుడు లక్ష్యం చేరుకుంటానని.. అందుకే నేను చెప్పేదేమిటంటే అటెంప్ట్‌ ఉంటే ప్రయత్నం కొనసాగించాలి.. నిన్నటి వరకు నేను ర్యాంక్‌ సాధిస్తానని కూడా అనుకోలేదు. మంగళవారం రిజల్ట్‌ వచ్చేవరకు వస్తదో.. రాదో అనే బెంగ వెంటాడింది. చివరికి ఆన్‌లైన్‌లో నా నంబర్‌ సెర్చ్‌ చేసేంత ధైర్యం కూడా నాకు తొలుత కలగలేదు. ఎలాగోలా సెర్చ్‌ చేస్తూ పైనుంచి చూస్తూ వచ్చాను. సెకండ్‌ పేజీలో కనిపించింది. అయితే సివిల్‌ సర్వీస్‌కు ప్రిపరేషన్‌లో నాది ఒకటే ఫిలాసఫి సాగింది.. నిష్కామకర్మను ఫాలో అయ్యాను. దాని అర్థం ఏమిటంటే.. ప్రయత్నిస్తూనే ఉండాలి. అటెంప్ట్స్‌ అయిపోయిన వారికి కూడా మన దేశంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఫారెన్‌ సర్వీసెస్‌పై దృష్టి సారించాలి. గ్రూప్‌–1 కూడా ఎంపిక చేసుకోవచ్చు.

● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.1
1/1

● విజయం సాధించే దాకా ఆపలే.. ● నిష్కామకర్మను ఫాలో అయ్యా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement