
సేంద్రియ మామిడి పండ్లతో ఆరోగ్యం
ఉట్నూర్‌రూరల్: ఎలాంటి రసాయన ఎరువులు వా డకుండా సహజంగా పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఆదివాసీ ఆర్గానిక్ మామిడిపండ్ల స్టోర్‌ను ప్రారంభించారు. పీవో మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి రసాయనిక మందులు వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సేంద్రియ మామిడిపండ్లు తాజాగా, రుచిగా ఉంటాయన్నారు. వీటిని తన సొంతఖర్చులతో కొనుగోలు చేసి మంత్రులు, తోటి శాసన సభ్యులకు పంపించి వాటి ప్రాముఖ్యతను వారందరికీ తెలియస్తానన్నారు.