
● అమాయకుల అవసరాలు సొమ్ము చేసుకుంటున్నవైనం.. ● అధిక వడ్డ
సాక్షి,ఆదిలాబాద్:జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోయాయి. అవసరానికి రుణాలు తీ సుకునే వారి నుంచి అధిక మొత్తంలో మిత్తి వసూలు చేస్తూ అమాయక ప్రజల నడ్డి విరుస్తున్నారు. డ బ్బులు చెల్లించని వారి నుంచి ఇల్లు, పొలాలు, వి లువైన ఆస్తులు బలవంతంగా హస్తగతం చేసుకుంటున్నారని బాధితుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి సమస్య పలు చోట్ల వెలుగులోకి రావడంతో గతం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలోనూ ఈ ఆగడాల నేపథ్యంలో తొలిసారి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం ఏకకాలంలో పోలీసులు పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ నుంచి గురువారం ప్రకటన విడుదల చేశారు.
కోట్ల రూపాయల వరకు..
అవసరానికి రుణాలు తీసుకునే వారి నుంచి వడ్డీ వ్యాపారులు అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు అప్పులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు అంతకుమించి విలువైన ఇల్లు, పొలాలకు సంబంధించిన పత్రాలను తమ దగ్గర ఉంచుకుని జనా లకు రుణాలు ఇస్తున్నారనే ప్రచారం ముందు నుంచీ ఉంది. ప్రాపర్టీ సేల్ డీడ్, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌చెక్కుల ద్వారా రుణం ఇచ్చే సమయంలోనే వడ్డీ వ్యాపారి తనకు అనువైన రీతిలో మలుచుకోవడం ద్వారా రుణగ్రహీత అవకాశాన్ని అనువుగా మార్చుకుంటున్నారన్న విమర్శలు కోకొల్లాలు. ఆ తర్వాత ఆ వ్యక్తి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ ఆస్తులను పూర్తిగా తమవశం చేసుకోవడం వంటివి ఇప్పటికే ఎన్నో జరిగాయనే అపవాదు ఉంది. జిల్లాలో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన వచ్చిపడుతుందని పలువురు చెప్పుకుంటున్నారు. వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితుల్లో సర్వం కోల్పోతున్న నేపథ్యాలు కూడా లేకపోలేదు. కాగా కొంతమంది పేరుకు ఇత ర బిజినెస్‌లు నిర్వహిస్తున్నట్లు మార్కెట్లో చెలామ ణి అవుతున్నప్పటికీ ప్రధానంగా వడ్డీ వ్యాపారమే వృత్తిగా కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు.
31 కేసులు నమోదు..
జిల్లా వ్యాప్తంగా బుధవారం 30 బృందాలతో పోలీ సులు వడ్డీ వ్యాపారుల నివాస స్థలాలపై ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణం, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్, గుడిహత్నూర్, బేల, నార్నూర్ మండలాల్లో దాడులు ని ర్వహించి 31 కేసులు నమోదు చేశారు. ప్రామిసరి నోట్లు, స్టాంప్ పేపర్స్, చెక్కులు, స్థలాల డాక్యుమె ంట్లు స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 3(5)(బి)తెలంగాణ ఏరియా మనిరెండర్స్ యాక్ట్ 1349 కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తోంది. అదేవిధంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు తెలియజేస్తుంది.
చర్యలు తప్పవు
అవసరాలకు రుణాలు తీసుకున్న అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఇచ్చోడలో 10, బోథ్‌లో 6, మావలలో 3, ఆదిలాబాద్ పట్టణంలో 6, ఉట్నూర్‌లో 2, ఆదిలాబాద్‌రూరల్, బేల, నార్నూర్, గుడిహత్నూర్‌లలో ఒక్కో కేసు నమోదు చేశాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ, ఆదిలాబాద్

● అమాయకుల అవసరాలు సొమ్ము చేసుకుంటున్నవైనం.. ● అధిక వడ్డ