
‘భారత్‌సమ్మిట్’లో ఎమ్మెల్యే బొజ్జు
ఉట్నూర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌తో తెలంగాణకు మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొని మాట్లాడారు. అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కాంగ్రెస్ పార్టీ మూల సూత్రాలపై నెహ్రూ అలీనోద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పరామర్శ
మండలంలోని దంతన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సనావుల్లాఖాన్ హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనను పరామర్శించారు.