
చికిత్స పొందుతూ మృతి
బోథ్: మండలంలోని నక్కలవాడ గ్రామానికి చెంది న నైతం భూమన్న (35) ఈ నెల 17న పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎ స్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమన్న ఓ రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న మద్యం తాగి ఇంట్లో భార్య లక్ష్మితో గొ డవ పడ్డాడు. దీంతో లక్ష్మి మందలించగా క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు బోథ్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రి మ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, మూడేళ్ల కుమారుడున్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన మునుగంటి చంద్రశేఖర్ (51) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ ఈ నెల 20న పురోహితం ముగించుకుని ఎల్లారం గ్రామ స్టేజీ మీదుగా బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌కు బలమైన గాయాలు కాగా స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు జాహ్నవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రక్తహీనతతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
గుడిహత్నూర్: మండలంలోని తోషం గ్రామానికి చెందిన విద్యార్థిని బోరేకర్ సౌజన్య (15) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌజన్య నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొద్ది నెలలుగా రక్త హీనతతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రాకపోవడంతో రాత్రి 10.30 గంటలకు సిబ్బంది సౌజన్యను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించారు.
ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే..
పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే సౌజన్య మృతి చెందిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి, యు వజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ ఆ రోపించారు. సౌజన్య కుటుంబీకులను ఆయన పరా మర్శించారు. సౌజన్యను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందిందని పేర్కొన్నారు. సౌజన్య తండ్రి గతంలోనే మరణించగా తల్లి అనిత కూలీ పనులకు వెళ్లి ముగ్గురు పిల్లలను పోషిస్తోందని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందించాలని, కేజీబీవీ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

చికిత్స పొందుతూ మృతి

చికిత్స పొందుతూ మృతి