
‘భూభారతి’తో సమస్యలకు పరిష్కారం
నార్నూర్: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరి ష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. గాదిగూడ మండలంలోని రైతు వేదిక భవనంలో, నార్నూర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భూభారతి చట్టంతో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఆధార్‌లాగే ప్రతీ భూ కమతానికి భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నార్నూర్ మండలవాసుల సహకారంతోనే నీతి ఆయోగ్ బ్లాక్‌లో భాగంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం మండలంలోని బలాన్‌పూర్ చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు.
కలెక్టర్‌కు సన్మానం
నార్నూర్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు మండల పేరును జాతీయ స్థాయిలో నిలిపిన కలెక్టర్‌ను మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉట్నూ ర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మండల ప్రత్యేకాధికారి గంగారాం, తహసీల్దార్ జాడి రాజలింగు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సన్నబియ్యం లబ్ధ్దిదారుడి ఇంట్లో
కలెక్టర్ భోజనం
అనంతరం కలెక్టర్ నార్నూర్ మండలకేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన రేషన్ లబ్ధిదారు జిల్లెపల్లి సుకుమార్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.
కలెక్టర్ రాజర్షి షా
నార్నూర్, గాదిగూడలో నూతన చట్టంపై అవగాహన సదస్సులు