
‘భూ భారతి’తో రైతులకు మేలు
● కలెక్టర్ రాజర్షి షా ● యాపల్‌గూడ, తాంసిలో అవగాహన సదస్సులు
ఆదిలాబాద్‌రూరల్: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన చట్టంపై ప్రతీ రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.
దహిగూడ పంప్‌హౌస్ పరిశీలన
అనంతరం మండలంలోని దహిగూడ పంప్‌హౌస్‌ను కలెక్టర్ పరిశీలించారు. నీటి సరఫరా తీరుపై ఆరా తీశారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినో ద్ కుమార్, తహసీల్దార్ గోవింద్ నాయక్, ఎంపీడీవో నాగేశ్వర్, మిషన్ భగీరథ ఏఈ ఆదిత్య తది తరులు పాల్గొన్నారు.
తాంసి: మండల కేంద్రంలోని రామేశ్వర ఫంక్షన్ హాల్‌లో నిర్వహంచిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. నూతన చట్టంతో పెండింగ్ భూసమస్యలు పరిష్కారం కానున్నట్లు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడు తూ.. భూభారతి చట్టంపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ భో జారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ సలోని, ప్రత్యేకాధికారి వెంకటరమణ, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, ఏవో రవీందర్,మాజీ జెడ్పీటీసీలు గణే శ్‌రెడ్డి,రాజు,మాజీఎంపీపీ శ్రీధర్‌రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు.