
కేఆర్కే కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధి లోని కేఆర్కే కాలనీలో శనివారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పాల్గొని మాట్లాడారు. యువ త గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక మినీ ట్రాలీని స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. అలాగే నాలుగు బెల్టు షాపులు గుర్తించడంతో పాటు 146 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన 20 వాహనాలను స్వాధీ నం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు ఫణిదర్, సునీల్‌కుమార్, సీహెచ్ కరుణాకర్, సాయినాథ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, వెంకటి, ఎస్సైలు, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది సుమారు 250 మంది తదితరులు పాల్గొన్నారు.