
ఆత్మహత్యకు యత్నించిన యువతి..
ఖానాపూర్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లి దండ్రులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ప్రోబేషనరీ ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కొన్ని రోజులు వేచి ఉండాలని తెలిపారు. మనస్తాపానికి గురైన స్వప్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.