
‘భూ భారతి’పై విస్తృత చర్చ అవసరం
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగాహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూగార్డెన్‌లో శని వారం నిర్వహించిన ఆదిలాబాద్ అర్బన్ మండల భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాల పై అధికారులు రైతులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనే క నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి అంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూబారతి చట్టాన్ని రూపొందించారన్నారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తె చ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూ భారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. అనంతరం రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించా రు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ విజయ్‌కాంత్, ఆర్‌ఐ యజువేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ: ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. మండల కేంద్రంలోని సూర్య గార్డెన్‌లో శని వారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ని ర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ఎంఏ కలీం, డీటీ మ హేశ్, ఆర్‌ఐ నాగోరావ్, ఎంపీడీఓ రాజ్‌వీర్, కుమా రి పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ రైతులు పాల్గొన్నారు.
మావలలో..
ఆదిలాబాద్‌రూరల్: మావల మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్‌వోఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో శంకర్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
కై లాస్‌నగర్: ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.శివరాం ప్రసాద్ సన్మానించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శాలువాతో సత్కరించారు.
ఇంటర్ ప్రతిభావంతులకు సన్మానం
కైలాస్‌నగర్: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియె ట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులను కలెక్టర్ రాజర్షి షా శనివారం సన్మానించారు. తంతోలి గ్రామానికి చెందిన ఏ.అంజలి బైపీసీ సెకండియర్‌లో 955 మార్కులు సాధించగా, పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన డి.స్నేహ ఎంపీపీ ఫస్టియర్‌లో 467 మార్కులతో టాపర్‌గా నిలిచింది. కలెక్టర్ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. జేఈఈ, ఎంసెట్ కోచింగ్‌కు అవసరమైన ఆర్థికచేయూత అందిస్తామని భరో సా ఇచ్చారు. ఇందులో డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సూరజ్ తదితరులున్నారు.

‘భూ భారతి’పై విస్తృత చర్చ అవసరం