
● ఎస్పీ అఖిల్ మహాజన్
నిజాయతీగా విధులు నిర్వర్తించాలి
ఆదిలాబాద్‌టౌన్: పోలీసులు క్రమశిక్షణతో పా టు నిజాయతీగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు సాయుధ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలున్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. సమయపాలన పాటిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం హెడ్‌క్వార్టర్‌లో ఉన్న మోటర్ వెహికిల్ అధికారి, హోంగార్డు కార్యాలయాలను పరిశీలించారు. వారికి కేటాయిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, శ్రీపాల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ అన్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి 12 మంది ఫిర్యాదుదారులు రాగా, వారి సమస్యలను ఓ పిగ్గా విని పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు.
కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలు
ఆదిలాబాద్‌టౌన్: ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు ఉదయం పదో తరగతిలో 518 మందికి గాను 476 మంది హాజరు కాగా, 42 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షకు 395 మందికి గాను 347 మంది హాజరు కాగా, 48 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ పరీక్షకు పదో తరగతిలో 217 మందికి గాను 197 మంది హాజరు కాగా, 20 మంది గైర్హాజరైనట్లు ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.