
పండంటి బిడ్డకు జన్మనిచ్చి..
లక్ష్మణచాంద: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే బాలింత ప్రాణాలు కో ల్పోయిన విషాదకర ఘటన మండలంలోని మల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, చుట్టుపక్కల వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాపట్ల ఆశన్న–లలిత దంపతుల చిన్న కుమారుడు అరుణ్‌కు మూడేళ్ల క్రితం ఖానాపూర్‌కు చెందిన హేమశ్రీతో వివాహమైంది. ఏడాదిన్నర క్రితం హేమశ్రీ మొదటి సంతానంగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం నిర్మల్‌లోని ఓ ఆస్పత్రిలో రెండో సంతానంగా మరో మగబిడ్డను ప్రసవించింది. అంతలోనే హేమశ్రీకి గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిందని వైద్యులు కుటుంబీకులకు పిడుగులాంటి వార్త చెప్పారు. దీంతో హేమశ్రీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి హేమశ్రీ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మల్లాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆ తల్లి కన్నుమూయగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రోధించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.