
శ్రీచైతన్య విద్యాసంస్థల విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.