Singareni Collieries Company
-
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్.వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. -
సీఓ2 నుంచి మిథనాల్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంట్‌ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును మండించడంతో పెద్ద మొత్తంలో కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ సేకరించి, హైడ్రోజన్‌తో రసాయన చర్యకు గురిచేయడం ద్వారా మిథనాల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ కేంద్రం చిమ్నీకి అనుసంధానం చేసి మిథనాల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఇది పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతా వరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపి టేటర్స్ (ఈఎస్పీ)ను ఏర్పాటు చేశామని ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో అనుమతించిన పరిమితులకు లోబడే కర్బన ఉద్గారాలను విద్యుత్ కేంద్రం విడుదల చేస్తుండగా, వాటినీ రీసైకిల్ చేసి మిథనాల్‌ను తయారు చేయనున్నట్లు వివరించారు. విజయవంతమైతే భారీ ప్లాంట్మిథనాల్ ప్లాంట్‌కి సంబంధించిన సివిల్ పనులు పూర్తి కాగా..కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుబంధ పరిశోధన సంస్థ ‘సీఎంపీడీఐఎల్’ ఆర్థిక సహకారంతో ఇథనాల్ ప్లాంట్‌ను చేపట్టారు. నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ సంస్థలకు అప్పగించారు. ప్లాంట్ రోజుకి 180 కేజీల మిథనాల్‌ను ఉత్పత్తి చేయనుండగా, సింగరేణి సంస్థ విక్రయించడం లేదు. ప్రయోగాత్మక ప్లాంట్ విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా భారీ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించి వాణిజ్య విక్రయాలు జరపాలని సంస్థ భావిస్తోంది. మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్‌ను వినియోగిస్తుండగా, 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్‌ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్‌స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్‌లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్‌కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్‌కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
సింగరేణికి ‘భూగర్భ’ శోకం
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు సింగరేణి సంస్థకు గుదిబండగా మారాయి. ఈ గనులతో సంస్థ గత ఐదేళ్లలో రికార్డుస్థాయిలో రూ.13,093 కోట్ల నష్టాలను మూటగట్టు కుంది. ఈ గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.10,394 ఖర్చు అవుతుండగా, అమ్మకం ద్వారా రూ.4854 మాత్ర మే ఆదాయం వస్తోంది. భూగర్భ గనుల్లో 2019–20లో 86.65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగగా, 2023–24లో 59 లక్షల టన్నులకు తగ్గిపోవడం సంస్థను మరింత కుంగదీస్తోంది.మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 2019–20లో రూ.5413 ఉండగా, 2024–25 నాటికి రూ.10,394కు పెరిగింది. అందులో రూ.7901 ఉద్యోగుల జీతభత్యాల వ్యయమే ఉండటం గమనార్హం. ఇదే కాలంలో అమ్మకం ధర టన్నుకు రూ.3135 నుంచి రూ.4854కు మాత్రమే పెరగడంతో ఏటేటా నష్టాల శాతం పెరిగిపోతోంది. ఉపరితల గనులు, బ్యాంకు డిపాజిట్ల వడ్డీలు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో వస్తున్న లాభాలతో భూగర్భ గనుల నష్టాలను పూడ్చుకొని సంస్థ నికర లాభాలను సాధిస్తోంది. డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆదేశాలతో దసరా పండుగ సందర్భంగా సింగరేణివ్యాప్తంగా 40వేల మంది కార్మికులకు గత రెండు రోజులుగా సామూహిక విందు భోజనం ఏర్పాటు చేసి వారికీ ఈ విషయాలను అధికారులు వివరిస్తున్నారు. ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర....‘ఉజ్వల సింగరేణి–కార్మికుల పాత్ర’అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, మార్కెట్లో తక్కువ ధరకు బొగ్గు అమ్ముతున్న ఇతర కంపెనీలతో ఎదుర్కొంటున్న సవాళ్లు, సింగరేణిలో ఉత్పత్తి ఖర్చును తగ్గించాల్సిన అవసరం, యంత్రాలను సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత, డ్యూటీ సమయం సద్వినియోగం అనే అంశాలపై గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి గనిలో వివరిస్తున్నారు. సింగరేణి బొగ్గుధర... కోల్ ఇండియా, ఇతర ప్రైవేట్ కంపెనీల కన్నా ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ⇒ మొత్తం 22 భూగర్భ గనులుండగా, 16 గనుల్లో ఎస్డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఈ 16 గనుల్లోనే ఉంటోంది. భూగర్భ గనుల ఉద్యోగుల్లో 75 శాతం అనగా, 17,286 మంది ఈ గనుల్లోనే పనిచేస్తున్నారు. ఎస్డీఎల్ యంత్రాల పనిని రోజుకు 2 గంటలు పెంచితే 30 టన్నుల ఉత్పత్తి పెరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు చేరుతుంది. దీంతో నెలకు రూ.104 కోట్ల నష్టాలు తగ్గుతాయి.⇒ 2008–09లో భూగర్భ గనుల్లో అత్యధికంగా రోజుకు 142 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 2023–24లో 102 టన్నులకు తగ్గింది. కార్మికుల పనిగంటలూ 8.5 నుంచి 6.7కి పడిపోయాయి. ఈ రెండు గంటల ఉత్పత్తిని మళ్లీ పెంచితే రోజుకి 30 టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగి మొత్తం రోజువారీ ఉత్పత్తి 132 టన్నులకు పెరుగుతుంది. ఉత్పత్తి కనీసం 20శాతం పెరిగినా నెలకు రూ.155 కోట్ల నష్టాలు తగ్గుతాయి. ⇒ వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్), మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(ఎంసీఎల్) విక్రయిస్తున్న బొగ్గు ధరలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధరలు రెండింతలు అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు టన్ను గ్రేడ్–5 బొగ్గును సింగరేణి రూ.5,685కు విక్రయిస్తుండగా, డబ్ల్యూసీఎల్, ఎంసీఎల్ సంస్థలు కేవలం రూ.2,970కే విక్రయిస్తున్నాయి. ⇒ రాబోయే ఏళ్లలో సింగరేణి సంస్థ కొత్తగా ఒక భూగర్భ గని, 6 భూ ఉపరితల గనులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటి నుంచి ఏటా 21.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీకే, జీడీకే 10, జేకే(రొంపేడు), గోలేటి, ఎంవీకే, పీవీఎన్ఆర్(వెంకటాపూర్) అనే ఉపరితల గనులతో పాటు కేటీకే ఓసీ–2 అనే భూగర్భ గని ఇందులో ఉంది. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. -
‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్ వీరే
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాల వాటా సాధించిన టాప్‌టెన్ ఉద్యోగుల పేర్లను ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఈ వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ–1కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు అత్యధికంగా సాధించారు. మందమర్రి కేకే–5కు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీ రాజు రూ.3.10 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ తుమ్మనపల్లి శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎస్ఆర్పీ–1కు చెందిన మేడం తిరుపతి రూ.3 లక్షలు, ఆర్కే న్యూటెక్‌కు చెందిన ఫోర్‌మెన్ కర్నె వెంకటేశం రూ.2.96 లక్షలు, ఆర్కే–5కు చెందిన ఎస్డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.2.92లు, ఆర్కే–7కు చెందిన కోల్‌కట్టర్ దుర్గం తిరుపతి రూ.2.91 లక్షలు, ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనికి చెందిన ఓవర్‌మెన్ వి.వంశీకృష్ణ రూ.2.89 లక్షలు, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–6కు చెందిన సర్వేయర్ బర్ల మహేందర్ రూ.2.88 లక్షలు సాధించారు. వీరిని సింగరేణి యాజమాన్యం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ప్రత్యేకంగా అభినందించాయి. వీరికి సోమవారం సీఅండ్ఎండీ కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. -
సింగరేణిలో ‘వర్చువల్ రియాలిటీ’!
సాక్షి, హైదరాబాద్: కార్మికుల రక్షణ దృష్ట్యా సింగరేణి ప్రస్తుత, భవిష్యత్ గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న అంతర్జాతీయ గనుల ప్రదర్శన (మైనెక్స్)–2024లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్‌ను గురువారం ఆయన సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రంతోపాటు వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని వెలుపలి నుంచి ప్రత్యక్షంగా చూస్తూ యంత్రాలను నడపొచ్చని కంపెనీ నిర్వాహకులు వివరించారు. యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. గని లోపలికి యంత్రాన్ని పంపించి వెలుపల నుంచే వాటిని ఆపరేట్ చేస్తూ బొగ్గు తవ్వొచ్చని చెప్పారు. భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే యంత్రానికి సంబంధించిన హెడ్గేర్ను ధరించి దాని పనితీరును పరిశీలించారు. ఈ పరిజ్ఞానం అద్భుతంగా పనిచేస్తోందని, కారి్మకులకు చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. హూవర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలి అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల మధ్య ఉన్న హూవర్ డ్యామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి నీటి వినియోగం, రక్షణ చర్యలు ఆచరించదగినవని ప్రశంసించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికా రులు ఆయనకు ప్రాజెక్టు గురించి వివరించారు. 17 జనరేటర్ యూనిట్ల ద్వారా 2,080 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందన్నారు. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. హువర్ డ్యామ్ జలవిద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ భట్టి వెంట ఉన్నారు. -
సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభు త్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో మూడోవంతు సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నామని, దీని ప్రకారం సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులందరికీ సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందని, వీరితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు కూడా తొలిసారి బోనస్ కింద రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రు లు, సింగరేణి అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ వివరాలను ప్రకటించారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు: ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనే సింగరేణి యాజమాన్యం, మంత్రివర్గంతో కలిసి బోనస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడ్డ సింగరేణి గని కార్మికులు ఉద్యమాన్ని పతాక స్థాయికి కెళ్లారు. వారి పోరాట పటిమ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది. అలాంటి సంస్థ వ్యాపార లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి యాజమాన్యంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన మేరకు బోనస్ ప్రకటిస్తున్నాం’అని రేవంత్ వెల్లడించారు. సింగరేణితో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సంస్థ కార్మికుల శ్రమశక్తి కారణంగా ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను కార్మికులకు పంచడం సంతోషంగా ఉందన్నారు. పన్నులన్నీ మినహాయించుకున్న తర్వాత ఈ ఏడాది సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వచి్చందని, అందులో పెట్టుబడి కింద రూ.2,289 కోట్లు పోను మిగిలిన రూ.2,412 కోట్లలో 33 శాతం అంటే రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ కింద ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా సగటున ప్రతి ఉద్యోగికి రూ.1.90లక్షల బోనస్ లభిస్తుందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.20 వేలు అధికమని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న 41,837 మంది శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 25 వేల మంది పనిచేస్తున్నారని, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. విస్తరణ కార్యాచరణ కూడా... సింగరేణి కార్మికులకు బోనస్‌తోపాటు సంస్థ విస్తరణ కార్యాచరణ కూడా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలోని 100 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ విస్తరణ చేపడతామని, 500 మెగావాట్ల పంప్ స్టోరేజీ (రామగుండం ఏరియా) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ జెన్కోతో కలిసి మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ప్రారంభిస్తామని, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన అంగూల్ జిల్లాలో 2,400 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.వీకే, గోలేటీ, నైనీ ఓపెన్‌కాస్ట్‌ల విస్తరణ చేపడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆస్పత్రుల ఆధునీకరణతోపాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి,హైదరాబాద్:సింగరేణి సంస్థలో పనిచేసే ఒక్కో కార్మికునికి లక్షా 90 వేల రూపాయల దసరా బోనస్‌ను ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్‌రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్20) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇస్తున్న బోనస్ గతేడాది ఇచ్చిన బోనస్ కంటే రూ.20 వేలు అధికం అని భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈసారి వారికి కూడా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు -
సింగరేణి తంగలాన్..!
‘కేజీఎఫ్’, ‘తంగలాన్ ’ సినిమాలతో కర్నాటకలోని కోలార్ గోల్డ్ఫీల్డ్లో బంగారం అన్వేషణ ఎలా జరిగిందో చూపించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన కార్మికులు కొలార్ గనుల్లో ఎలా దగాపడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారనే అంశాలను మ్యాజిక్ రియలిజం ధోరణిలో ‘తంగలాన్’ సినిమా చూపించింది. బంగారు గనులపై గుత్తాధిపత్యం కలిగిన నియంతలకే రాకీ అనే యువకుడు ఎలా భాయ్‌గా మారాడనే అంశాన్ని వాస్తవ ఆధారిత కల్పితాలుగా ‘కేజీఎఫ్’ సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు లేకపోయినా, నల్ల బంగారంగా పిలుచుకునే సింగరేణి గనులు ఉన్నాయి. బొగ్గు తవ్వకాల కోసం గనుల యజమానులు కార్మికులను ఎలా రప్పించారో, కార్మికుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో, వారి ఆగడాలను కార్మికులు ఐక్యంగా పోరాడి ఎలా సాధించుకున్నారో ఓసారి చూద్దాం...మనదేశంలో బొగ్గు తవ్వకాలను బ్రిటిషర్లు ప్రారంభించారు. తొలి బొగ్గు గని 1774లో పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్‌లో మొదలైంది. మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 1889లో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు గని మొదలైంది. స్వాతంత్య్రం వచ్చే సమయానికి ఇల్లెందు, బెల్లంపల్లి (1928), కొత్తగూడెం (1938)లలో బొగ్గు గనులు మొదలయ్యాయి. 1914, 1942లలో జరిగిన మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి బొగ్గు అవసరం బాగా పెరిగింది. దీంతో గనుల్లో పని చేసే కూలీలను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లను నియమించింది. కాంట్రాక్టర్ల తరఫున ఏజెంట్లు పల్లెల్లో తిరుగుతూ, ప్రజలను సమీకరించి కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి గ్రామాలకు తీసువచ్చేవారు. అయినా, కూలీలు సరిపోకపోవడంతో అప్పటికే బొగ్గు గనుల రంగంలో అనుభవం ఉన్న బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ కార్మికులను ఇక్కడికి రప్పించేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ల పేరుమీదుగానే బొగ్గు గనుల ప్రాంతంలో సన్యాసి బస్తీ, గాజుల రాజంబస్తీ, గంగా బిషన్ బస్తీ, కూలీ లైన్, బర్మా క్యాంప్, మథుర బస్తీ, నాగయ్య గడ్డ, పంజాబ్ గడ్డ, కొత్తూరు రాజం బస్తీ, బాబు క్యాంపు, రడగంబాల బస్తీ తదితర పేర్లతో కాలనీలు ఏర్పాటయ్యాయి.చావుతో చెలగాటం..గాలి, వెలుతురు, నీరు వంటి కనీస సౌకర్యాలు కరువైన గనుల్లో పని చేయడమంటే చావుతో చెలగాటం ఆడటమే! 1928 మార్చి 12న ఇల్లెందులోని స్ట్రట్‌పిట్ మైన్ లో మీథేన్ లాంటి విషవాయువులు వెలువడటంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకేసారి 43 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత బెల్లంపల్లి, కొత్తగూడెంలోని బర్లిపిట్ గనిలో ఈ తరహా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు గనుల్లో మాడిమసైపోయారు.రక్తాలు కారుతుండగా..బొగ్గు వెలికి తీయడానికి కార్మికులు దొరక్కపోవడంతో మహిళలు, పిల్లల చేత కూడా పని చేయించేవారు. చెప్పులు లేకుండా బొగ్గు పెళ్లల మీదుగా నడుస్తూ, బావుల్లోకి దిగాల్సి వచ్చేది. గనిలోకి వెళుతుంటే పైకప్పు నుంచి నీరు కురిసేది. నీటితో పాటు వచ్చే బొగ్గు రజను చర్మానికి ఒరుసుకుపోయి గాయాలయ్యేవి. గాయాల బాధను భరిస్తూనే, పనిముట్లతో బొగ్గు బండలను కొట్టి చిన్న ముక్కలుగా చేసి తట్టల్లో నింపుకుని నెత్తిపై మోస్తూ పనిచేయాల్సి వచ్చేది. గనిలో విషవాయులు ఎప్పుడు వెలువడుతాయో, గని పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కార్మికులు పనిచేసేవారు. ఇక కటిక చీకటితో ఉండే గనిలో దారి తప్పి అదృశ్యమైన వారి సంఖ్యకు అంతేలేదు.కాంట్రాక్టర్ల దోపిడీ..కార్మికులకు అరకొర జీతాలు చెల్లిస్తూ, వారితో కాంట్రాక్టర్లు బండెడు చాకిరీ చేయించే వారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, పిల్లాపాపలు, మహిళలతో సహా బొగ్గు గనుల్లో రేయింబగళ్లు పనిచేయించేవారు. గనుల్లో ప్రమాదాలు, మరణాలు నిత్యకృత్యం. ఇక్కడ పని చేయలేక పారిపోయేందుకు ప్రయత్నించే వారిని కాంట్రాక్టర్ల గుండాలు వెతికి పట్టుకుని, చిత్రహింసలు పెట్టేవారు. ఇక మహిళలపై జరిగే అకృత్యాలకు అంతేలేదు.కాంట్రాక్టర్లకే నిజాం మద్దతు..బొగ్గు తవ్వకాల బాధ్యతలు చూస్తు్తన్న బ్రిటిషర్లకు, కార్మికులను అందిస్తున్న కాంట్రాక్టర్లకు రక్షణగా నిజాం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ, కార్మికులను పీడించే కాంట్రాక్టర్లకు వెన్నుదన్నుగా నిలిచేది. కార్మికులు ఎటూ పారిపోకుండా రైల్వే స్టేషన్లలోను, ఊరి పొలిమేర్లలోను నిఘా పెట్టేది. తమకు జరిగే అన్యాయాలపై ఎవరైనా నోరు విప్పినా, పట్టించుకునే నాథులు ఉండేవారు కాదు. కాంట్రాక్టర్ల చేతిలో చిక్కి వెట్టిచాకిరి చేసే కార్మికులను ఆదుకునే వారూ ఉండేవారు కాదు.సాయుధ పోరాటం..రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక నిజాం రాజ్యంలో సాయుధ రైతాంగ పోరాటానికి అడుగులు పడ్డాయి. అదే సమయంలో సింగరేణిలో కార్మిక సంఘాలు పురుడు పోసుకున్నాయి. అలా నిజాం రైల్వే యూనియన్ (హైదరాబాద్), అజాంజాహీ మిల్ వర్కర్స్ (వరంగల్) యూనియన్ల తర్వాత 1938లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ పేరుతో మూడో యూనియన్ ఏర్పడి, గనుల్లో కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తు్తన్న నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది.ప్రశ్నించిన శేషగిరి..నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో 1918 సెప్టెంబరు 24న జన్మించిన దేవనూరి శేషగిరిరావు అక్కడే విద్యాభాస్యం పూర్తి చేసుకుని ఉపాధి కోసం సింగరేణిలో అకౌంటంట్గా చేరి, కొత్తగూడేనికి మకాం మార్చారు. ఇక్కడి కార్మికుల కష్టాలు, కాంట్రాక్టర్ల దోపిడీని దగ్గరగా చూశారు. అన్యాయానికి ఎదురెళ్లాలని నిర్ణయించుకున్నారు. పొద్దంతా హెడాఫీసులో పని చేస్తూ, సాయంత్రం వేళ కార్మికవాడలకు వెళ్లి, వారితో కలసిపోయి, వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, హక్కుల కోసం పోరాడేలా తయారు చేశారు. 1947లో రహస్య జీవితం గడుపుతున్న శేషగిరిని నిజాం పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక కేసు విచారణ కోసం అక్కడి నుంచి ఇల్లెందుకు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో డోర్నకల్‌లో ఆగారు. అక్కడ పోలీసుల నుంచి తప్పించుకున్న శేషగిరి విజయవాడ చేరుకున్నారు. అక్కడ గెరిల్లా యుద్ధతంత్రాలు నేర్చుకుని, వాటిని సింగరేణి ప్రాంతంలో అమల్లోకి తెచ్చారు. చివరకు 1948 ఫిబ్రవరి 15న భద్రాచలం సమీపంలో నెల్లిపాక దగ్గర జరిగిన ఎన్ కౌంటర్లో శేషగిరితో పాటు పాపయ్య, రంగయ్య అనే విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు.యూనియన్ కొమరయ్య..కొమరయ్య 1928లో ఇల్లెందులో జన్మించారు. కొత్తగూడెంలోని మెయిన్ వర్క్‌షాప్‌లో 1940లో టర్నర్‌గా చేరారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1947లో అరెస్టయి, సుమారు ఏడాది పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత 1948లో జైలు నుంచి విడుదలయ్యాక 1949 వరకు అజ్ఞాత జీవితం గడిపారు. ఇండియాలో నిజాం స్టేట్ విలీమైన తర్వాత చివరి శ్వాస వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారు. దీంతో ఆయన పేరే యూనియన్ కొమరయ్యగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయింది. దేవనూరి శేషగిరిరావు, మనుబోతుల కొమరయ్యల తరహాలోనే సర్వదేవభట్ల రామనాథం, డాక్టర్ రాజ్‌బహదూర్, పర్సా సత్యనారాయణ, పులిపాక రాజయ్య, మఖ్దూం మొíహియుద్దీన్, వంగా రాజేశ్వరరావు, కారపెల్లి రాఘవరావు వంటి నాయకులు కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారు.హక్కుల సాధన..కార్మికులు ఐక్యంగా సాగించిన పోరాటాల ఫలితంగా గనుల్లో కాంట్రాక్టు వ్యవస్థ రద్దయ్యింది. రోజుకు పన్నెండు గంటల పని స్థానంలో ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. బాలలతో పనులు చేయించడం ఆపించారు. మహిళలకు గనుల్లో కాకుండా ఉపరితలంలోనే పనులు ఇచ్చేలా మార్పులు తెచ్చారు. గనుల్లోకి కిరోసిన్ దీపాలు తీసుకుని వెళ్లడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు సేఫ్టీ ల్యాంప్స్‌ను ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారు. కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్లు అందుబాటులోకి తెచ్చారు. వేతనాలు పెరిగాయి. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు మరణం/అంగవైకల్యం సంభవిస్తే నష్టపరిహారం ఇచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సాధించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన రాజకీయ పార్టీలకు అనుబంధంగా అనేక సంఘాలు కార్మికుల సంక్షేమం కోసం పని చేశాయి.ప్రస్తుతం ఇలా..ఆరేడు దశాబ్దాలుగా కార్మికులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా సింగరేణి కార్మికుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ప్రస్తుతం 39 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరి సగటు వేతం రూ. 70 వేలు ఉండగా, వీరిలో ప్రారంభ జీతం రూ.60 వేలు మొదలుకొని గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు అందుకునేవారు ఉన్నారు. సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్నారు. చివరిసారిగా రూ. 2,220 కోట్లను కార్మికులకు అందించారు. సంస్థ పరిధిలో 40 వేల క్వార్టర్లు, 12 ఆస్పత్రులు, 20 వరకు విద్యాసంస్థలు ఉన్నాయి. సర్వీసులో సింగరేణి కార్మికుడు అకస్మాత్తుగా చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఉంది. సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు బీమా మొత్తం రూ. 30 లక్షలుగా ఉంది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, కొత్తగూడెంఇవి చదవండి: అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్! -
కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని వస్తావ్?: భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి: రూ.లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇచ్చిన హామీ మేరకు నెలరోజుల్లోనే రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయిన మీరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే.. మీ మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా? జాబ్ కేలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా? దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఇవ్వలేదని చెప్పడానికి వస్తారా? .. అని కేసీఆర్‌ను నిలదీశారు. ‘నీవు, నీ కొడుకు పదేళ్లు తెలంగాణను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు’ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రులు శ్రీధర్‌బాబు, పోన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉద్యోగల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతోపాటు, ప్రతీ నియోజకవర్గంలో యువతకు పోటీ పరీక్షలకు తరీ్ఫదు ఇచ్చేందుకు అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ రామగుండం థర్మల్ బీ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు, అక్కడ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాత ఆర్టీఎస్–బీ ప్లాంట్ స్థలంలోనే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్‌ప్లాంట్‌ను జెన్కో, సింగరేణి సంయుక్త సహకారంతో స్థాపిస్తామని వెల్లడించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి, త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే పవర్‌ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2031నాటికి గరిష్టంగా తెలంగాణకి 27,059 మెగావాట్ల విద్యుత్, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని అంచనా వేశామని వివరించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో మరో 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందులో ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ప్రాధన్యత కల్పిస్తామని భట్టి చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్, విజయరమణారావు, గడ్డం వివేక్, వినోద్, ప్రేమ్‌సాగర్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. -
సింగరేణిలో 2,364 ఉద్యోగాల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్/ గోదావరిఖని: సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించేందుకు ఆమోదం లభించింది. సంస్థలో చేరిన తర్వాత ఒక కేలండర్ సంవత్సరంలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, ఇతర విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం వెల్లడించారు.ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించబోతున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో బలరాం తెలిపారు. సింగరేణిలో సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని, సమయ పాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు. వీరు ఎవరంటే..!సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా నియమిస్తారు. వీరు ఏడాది కాలం పనిచేసిన తర్వాత కనీస మస్టర్లు పూర్తి చేస్తే జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తారు. వీరిలో ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉంటే పదోన్నతులు పొందడానికి అర్హులవుతారు. క్వార్టర్ల కేటాయింపులో కూడా ఈ జనరల్ మజ్దూర్లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి క్రమబద్ధీకరణ ద్వారా 234 మంది మహిళలు శాశ్వత ఉద్యోగాలు పొందనున్నారు. ఏరియాల వారీగా పరిశీలిస్తే కార్పొరేట్ ఏరియా (25), కొత్తగూడెం (17), ఇల్లందు (9), మణుగూరు (21), భూపాలపల్లి (476), రామగుండం–1 (563), రామగుండం–2 (50), రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్టు (240), శ్రీరాంపూర్ (655), మందమర్రి (299), బెల్లంపల్లి (9) మంది రెగ్యులరైజ్ కానున్నారు. -
అసెంబ్లీలో తీర్మానానికి సిద్ధమా..!
ఆదిలాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీలో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సోమవారం సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను బెల్లంపల్లి లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడారు. సింగరేణి సంస్థలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే చాపకింద నీరులాగా బొగ్గు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అంత్యత సన్నిహితుడైన అదానికి దేశంలోని కోలిండియా, సింగరేణి సంస్థల్లోని బొగ్గు బ్లాక్‌లను అప్పగించడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అన్నా రు. శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాక్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వేలం పాట నిర్వహిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం వెనుక మర్మమేంటో స మాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర భుత్వాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాల శ్రేణులు పో రాటంలో కలిసి రావాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం డెప్యూటీ కార్యదర్శి నాగరాజ్‌గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ప్రకాష్, నాయకులు రాజన్న, శ్రీనివాస్, రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఐక్యంగా ఉద్యమించాలి..రామకృష్ణాపూర్: ప్రైవేటీకరణ బారి నుంచి సింగరే ణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ప క్షాలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. బస్సుయాత్ర సోమవారం సాయంత్రం ఆర్కేపీకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిరక్షణకు చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్, ఆశన్న, శంకర్, రవి, వెంకట స్వామి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణికే కేటాయించాలి..మందమర్రిరూరల్: రాష్ట్రంలోని నూతన బొగ్గు గనులను సింగరేణికి కేటాయించి సంస్థను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం బస్సుయాత్ర మందమర్రికి చేరుకోగా.. ఏరియాలోని కేకే–5గనిపై ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్, పలు వీధుల గుండా బస్సుయాత్ర సాగింది.ఇవి చదవండి: ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ -
సింగరేణికే కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ.. ⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. ⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. ⇒ భారత్‌మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి. ⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్‌గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం) – రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి. – తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. – ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. – హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. – 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. – తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి. -
రాజస్తాన్‌లో సింగరేణి సోలార్ ప్లాంట్
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం రాజస్తాన్ జెన్కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు. సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. -
బీఆర్ఎస్ పార్టీకి గోల్డెన్ ఛాన్స్
-
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
-
కష్టాల గనిలో రాజేష్
-
మీ అబద్ధాలకు సమాధిలో గోబెల్స్ సిగ్గుపడుతున్నాడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి అబద్ధాల ప్రచార సృష్టికర్త జోసెఫ్ గోబెల్స్ కూడా సమాధిలో సిగ్గుతో తలదించుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో రేవంత్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని కేసీఆర్ వ్యతిరేకించినందునే గత ప్రభుత్వం ఎన్నడూ వేలంలో పాల్గొనలేదన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొడుతోందని ఆరోపించారు. గతంలో నియంతృత్వ పోకడలతో తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించడం వల్లే ఆ గనుల నుంచి తట్టెడు బొగ్గు కూడా ఎత్తలేకపోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ పేర్కొన్న రెండు కంపెనీలు 2021లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గనులు దక్కించుకున్న విషయాన్ని రేవంత్ మర్చిపోరాదన్నారు.కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలుతెలంగాణ ప్రజల ఆకాంక్షలను క్రూరంగా అణచి వేసి వేల మందిని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రయోజనాల ను కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా తాకట్టు పెడు తున్న తీరును తెలంగాణ పౌరులు గమనిస్తున్నా రన్నారు. ప్రజల హక్కులు, ఆస్తులు, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇప్పటికే నదీజలాల వాటాను వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. గనుల వేలంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్, కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.పెట్టుబడుల్లో తెలంగాణ అగ్రస్థానంగత ఆర్థిక సంవత్సరం 2023–24లో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తగ్గినా బీఆర్ఎస్ సాగించిన పాలన వల్లే తెలంగాణ మాత్రం 100 శాతానికి మించి ఎఫ్‌డీఐలను సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2022–23తో పోలిస్తే 2023–24లో గుజరాత్ 55 శాతం, తమిళనాడు 12 శాతం ఎక్కువ పెట్టుబడులను సాధించగా తెలంగాణ ఏకంగా 130 శాతం వృద్ధి సాధించిందన్నారు. అమెజాన్ వెబ్ సేవల కోసం రూ. 36,300 కోట్లు, మైక్రోసాప్ట్ రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో రావడంతో ఇది సాధ్యమైందన్నారు. -
సింగరేణిలో ఆర్థిక విధ్వంసంపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్‌లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.పారదర్శకంగా బొగ్గు గనుల వేలం‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు. సింగరేణికి కేసీఆర్ మరణశాసనం‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్జెన్కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.నీట్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్‌సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్‌కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్‌కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు. నాగర్‌కర్నూల్ ఘటన దారుణం ఇల్లందకుంట: నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండికేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్‌పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్‌లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
బొగ్గు గనుల కేటాయింపు..అవసరమైతే ప్రధానితో భేటీ అవుతాం : భట్టి
సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కబొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు.