సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణలో ప్రభుత్వం మారాలని అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ డ్రామాలడుతోందని ఫైరయ్యారు.
కాగా, మంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సింగరేణి కార్మికులు ఎన్నికల సమయంలో మాత్రమే బీఆర్‌ఎస్‌కు గుర్తుకువస్తారు. సింగరేణి కార్మికులకు సొంతిల్లు కట్టిస్తామన్న హామీ ఏమైంది?. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగరేణిని విస్తరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం లేదు. సింగరేణిని రక్షించడం లేదు.. భక్షిస్తున్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
సింగరేణి పరిస్థితి బాగుపడాలంటే తెలంగాణలో ప్రభుత్వం మారాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రకటించడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమే. కోల్ ఇండియాలో కార్మికులకు 930 రూపాయలు వేతనం ఉంటే సింగరేణిలో 420 మాత్రమే ఉంది. ఎందుకింత విపక్ష?. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు. సింగరేణి నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. అధికార దుర్వినియోగానికి సింగరేణి యాజమాన్యం రెడ్ కార్పెట్ వేసింది. కార్మికుల షిఫ్టులు మార్చాలన్నా అధికారపార్టీ నేతలు జోక్యం చేసుకోవడం దారుణం. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: రేవంత్ వర్గం దూకుడు
Comments
Please login to add a commentAdd a comment