
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, రూ.2వేల నోట్ల రద్దుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పుపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.
కాగా, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఒక వార్డు మెంబర్ గెలిచినందుకే సంబురపడిపోతున్నారు. మా పార్టీ జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు బేస్‌లెస్.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు.. ఇది సీబీఐ పరిధిలోని అంశం. మేము.. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను జైలుకు పంపించాం. 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్ మాకుంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: తలమాసినోళ్లను చేర్చుకుంటున్నారు: కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment