Rs 2000 note
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. రూ.7581 కోట్ల నోట్లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది మే 19న రూ. 2000నోట్ల ఉపసంహరణను ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండువేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి. కానీ ఇంకా సుమారు రూ. 7581 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల దగ్గరే ఉన్నట్లు సమాచారం.ఆర్బీఐ ప్రకారం.. ఇప్పటికి 97.87 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలుస్తోంది. 2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఇది 2024 జూన్ 28 నాటికి రూ. 7581 కోట్లకు తగ్గింది. అంటే మిగిలిన మొత్తం నోట్లు మళ్ళీ బ్యాంకులకు చేరాయి.2024 జూన్ 28 నాటికి వెనక్కు వచ్చిన పెద్ద నోట్లు 97.87 శాతం. నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తరువాత కూడా.. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. దీనికోసం దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజలు తమ నోట్ల మార్పిడి కోసం డబ్బును ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చు.Withdrawal of ₹2000 Denomination Banknotes – Statushttps://t.co/L2SXdYpCTR— ReserveBankOfIndia (@RBI) July 1, 2024 -
97 శాతం వెనక్కి వచ్చిన రెండువేల నోట్లు.. మిగిలింది ఎన్ని కోట్లంటే?
ముంబై: చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మే 19వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 బ్యాంక్ నోట్లు చెలామణిలో ఉన్నాయి. అక్టోబర్ 31వ తేదీ బిజినెస్ ముగింపు సమయానికి ఈ విలువ రూ.10,000 కోట్లకు తగ్గింది’’ అని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ కార్యాలయాల్లో బారులు.. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎవరైనా ఈ కార్యాలయాలకు వెళ్లలేని పక్షంలో పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని ఆర్బీఐ సూచించింది. కాగా, రూ.2,000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ కోసం ఆర్బీఐ కార్యాలయాల వద్ద పని వేళల్లో పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. రెండువేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలను 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు, కంపెనీలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఒకసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్‌కు మాత్రం ఎటువంటి పరిమితి లేదు. 2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ.2,000 నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను పరిచయం చేసింది. -
రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!
భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు. రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. -
రూ.2000 నోట్లు: ఆర్బీఐ గుడ్ న్యూస్
Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్బీఐ ప్రజలను కోరింది. RBI సంచలన ప్రకటన ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది. ► వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు. వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు. ► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి. ► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ తెలిపింది. కాగా క్లీన్-నోట్ విధానంలో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్ సేల్, ధర ఎంతంటే?) -
రూ.2000 నోటు: అమెజాన్ షాకింగ్ అప్డేట్, తెలుసుకోండి!
Rs. 2000 Note Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యూజర్లకు చేదువార్త అందించింది. రెండు వేల నోటుకు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై 2000 నోట్లను అంగీకరించడాన్ని ఇకపై నిలిపివేయనుంది. సెప్టెంబర్ 19 నుండి 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఉత్పత్తిని థర్డ్-పార్టీ కొరియర్ పార్టనర్ ద్వారా డెలివరీ చేస్తే, వీటిని అంగీకరిస్తున్నట్టు వెల్లడించింది. (ఉద్యోగులకు షాక్: గూగుల్‌లో మళ్లీ తొలగింపుల పర్వం) ఆర్బీఐ 2000 కరెన్సీ నోట్లును చలామణినుంచి ఉపసంహరించుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ సేవకు అంగీకరించింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు సమీపిస్తున్న తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటి వద్ద నుంచే రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పించిన సంగతి తెలిసిందే. కాగా 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాటిని చెలామణి నుండి తొలగించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉపసంహరణ ప్రకటన వెలువడిన 20 రోజుల్లోనే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2.72 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు అందాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 25 న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం , చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి లేదా మార్పిడి అయ్యాయి. -
ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే
కర్ణాటక: ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించడంతో ప్రజలు తమ వద్దనున్న నోట్లను ఖర్చు చేయడం, లేదా బ్యాంకుల్లో మార్పిడి చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను ఇస్తుంటే కండక్టర్లు తీసుకోవడం లేదు. దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఆ కండక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బస్సుల్లో ఈ నోట్లను తీసుకుంటారని ఆదివారం స్పష్టం చేశారు. 2 వేల నోట్లను తీసుకోరాదని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. హోసకోటేలో మాత్రమే ఇటువంటి తప్పుడు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఆందోళన వద్దని అన్నారు. -
రూ.2 వేల నోటు ఎఫెక్ట్.. స్కూటీ నుంచి పెట్రోల్ తిరిగి తీసుకున్నాడు!
లక్నో: దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ. 2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30వ వరకు ఈ నోట్లు చలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు నోట్ల మార్పిడికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూలైన్, కేవైసీ అంటూ గంటల సమయం పడుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బంగారం కొనుగోలు, షాపులో వస్తువుల కొనుగోలు ద్వారా 2 వేల నోటు మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. ఇంకొందరైతే రెండు వేల రూపాయల నోటును తిరిగి ఇచ్చేసి తమ వస్తువులను మళ్లీ వెనక్కి కూడా తీసుకుంటున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి తన స్కూటీలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బంకులోని సిబ్బందికి తన వద్ద ఉన్న రూ. 2 వేల నోటు ఇచ్చాడు. ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు వద్దని వేరే నోటు ఇవ్వాలంటూ కోరాడు. వాహనదారుడు తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. దీంతో ఆ సిబ్బంది స్కూటీలో నింపిన పెట్రోల్‌ను పైపు సహాయంతో బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు పలు రాష్ట్రాల్లో కొందరు వ్యాపారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మరికొందరు బహిరంగంగానే రూ. 2 వేల నోటును స్వీకరించబోమని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. A petrol pump of Maharaja Chowk, Durg chattisgarh is denying acceptance of Rs 2000 Notes. Have 2000 notes lost their legal tender status? @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/57FdunTURo — Tejas 🇮🇳 (@railmintejas) May 20, 2023 @DirMktg_iocl @DirMktg_iocl @IOCRetail @FinMinIndia @RBI @nsitharaman @PMOIndia This sign at an Indian Oil Petrol Pump says all about how and panic can be created with wrong understanding of simple withdrawal process for ₹2000 currency. Pl take care and inform your pumps. pic.twitter.com/Fe6DPWMVVr — nipunsheth (@nipunsheth2) May 21, 2023 చదవండి: కామన్వెల్త్, కర్రీ, క్రికెట్.. మన రెండు దేశాలను కలుపుతున్నాయి: మోదీ -
నోట్ల మార్పిడి ఈ రోజు నుంచే.. సులభంగా ఎక్కడ మార్చుకోవచ్చంటే?
Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ. 2,000 ఉపసంహరణ గురించి చేసిన అధికారిక ప్రకటన అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రకారం ఈ రోజు (మే 23) నుంచి రెండు వేల నోట్లను సమీపంలో ఉన్న ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ఉన్న బ్యాంకులోని మార్చుకోవాలనే ఖచ్చితమైన నిబంధన లేదు. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? ప్రారంభంలో చెప్పినట్లుగానే ఒక వ్యక్తి రోజుకి కేవలం 10 నోట్లను మాత్రమే (రూ. 20,000) మార్చుకోవచ్చు. అయితే దీని కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని ఇప్పటికే ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభమై 2023 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత నోట్ల మార్పిడికి గడువు పెరుగుతుందా.. లేదా అనేదానిపైన ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. రూ. 2వేల నోట్లను మార్చుకోవడానికి సమయం చాలా ఉంది. కావున ప్రజలు గుంపులు గుంపులుగా బ్యాంకులపై పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెప్పిన గడువు లోపల రెండు వేల నోట్లు ఖజానాకు చేరుతాయని ఆశిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ కావలసిన చర్యలు తీసుకుంటుందని కూడా వెల్లడించారు. అంతే కాకుండా రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో ఆర్థిక వ్యవస్థపై పడే భారం చాలా తక్కువగా ఉంటుందన్నారు. (ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్కి అవి అవసరం లేదన్న ఎస్బీఐ) ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నోట్ల మార్పిడిని మరింత సులభతరం చేయడానికి సంబంధిత అధికారులు బ్యాంకులలో ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, ప్రజలు క్యూ పాటిస్తూ ఈ అవకాశం వినియోగించుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల వద్ద రద్దీగా ఉన్న సమయంలో నకిలీ రూ. 2000 నోట్లు మార్పిడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) -
రూ. 2వేల నోట్ల రద్దు.. వాటికి బీభత్సమైన డిమాండ్, ఒక్కరోజులోనే!
దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా ఇతర రంగాలపై ప్రభావం పడుతుందేమో గానీ బంగారం అమ్మకాలపై మాత్రం పెద్దగా ప్రభావం చూపదన్న సంగతి తెలిసిందే. ఇటీవల రూ.2000 నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటన తర్వాత మరోసారి ఈ విషయం నిరూపితమైంది. తమ దగ్గర ఉన్న నోట్లను చెల్లుబాటు కోసం ప్రజలు బంగారం దుకాణాలకు క్యూలు కడుతున్నారట. అంతేకాకుండా కొందరు ఫోన్ చేసి ఎంత వరకు కొనుగోలు చేయచ్చు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. బంగారానికి భారీ డిమాండ్ ప్రస్తుత రెండు వేల నోట్లు సెప్టంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలపై ఆ ప్రభావం తీవ్రంగా చూపింది. అయితే ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు రద్దు విషయంలో అంత ప్రభావం చూపకపోవచ్చు అనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం మార్కెట్ ఈ నోట్ల చలమాణి శాతం తక్కువగా ఉండడమే. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా జనం ఈ నోట్లను ఖర్చుపెట్టడమో లేదా బ్యాంకుల్లో మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బ్యాంకులకు సెలవు దినాలు, కేవైసీ తదితరల కారణాల వల్ల మరో దారిపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల షాపులకు వెళ్లి రెండు వేల రూపాయల నోట్ల చలామణికి ప్రయత్నిస్తున్నారట. దీంతో పాటు ఎంతమేరకు నగదుతో కొనుగోలు చేయొచ్చు అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు నగరాలలో ఇతర సాధారణ వారాంతాల్లో కంటే శనివారం ఒక్కరోజే 50% ఎక్కువ ఫుట్‌ఫాల్‌ను చూసినట్లు సమాచారం. గతంలో 500 రూపాయల నోట్లు రద్దు చేసిన సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ప్రజలు అదే దారిని ఎంచుకున్నారని అంటున్నారు బంగారం షాపు యజమానులు. అయితే పెద్ద మొత్తంలో 2వేల రూపాయల నోట్లు ఉన్నవారు మాత్రం వాటిని బంగారంగా మార్చడానికే ఇష్టపడుతున్నారట. చదవండి: సిద్ధరామయ్య హయాంలో రూ.2,42,000 కోట్ల అప్పులు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్ -
అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ
న్యూఢిల్లీ: గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు తీవ్రంగా నగదు కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు డిజిటెల్ లావాదేవీలకు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ, అదే స్థాయిలో 100,500, 2000 నోట్లతోనూ లావాదేవీలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల దేశ ప్రజలకి షాక్కిస్తూ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్న ఆర్బీఐ ప్రకటించింది. దీంతో నోట్ల రద్దు అంశానికి సంబంధించి పలు రకాల వార్తలు వినపడుతున్నాయి. తాజాగా కేంద్ర బ్యాంకులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్..నోట్ల రద్దు అంశంపై పలు విషయాలను వెల్లడించారు. 2వేల నోట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఆర్బీఐ గవర్నర్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో.. 2వేల నోట్లను ఉపసంహరించిన నేపథ్యంలో.. ఆ వత్తిడిని తట్టుకునేందుకు రూ.1000 నోట్లను ప్రవేశపెడుతారా అని ప్రశ్నించారు. అందుకు శక్తికాంత్ దాస్ బదులిస్తూ.. రూ.1000 నోటును పున ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. అది ఊహాజనితమేనని, అలాంటి ప్రతిపాదనే లేదని స్పష్టం చేశారు. వీటితో పాటు అకస్మికంగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అనే ప్రక్రియ ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో 2 వేల నోట్ల విలువ కేవలం 10.8 శాతం మాత్రమే అని, కనుక ప్రస్తుత ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్ప స్థాయిలో ప్రభావం ఉంటుందన్నారు. రూ. 2,000 నోటు నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన ఆర్బీఐ.. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరిత పద్ధతిలో తీర్చేందుకు రూ.2000 నోటు చలామణిలోకి తీసుకొచ్చింది. చదవండి: విచిత్రం.. కేరళలో కిలో మీటర్ వెనక్కి నడిచిన రైలు.. ఎందుకంటే? -
‘రూ.2 వేల నోట్లు వెనక్కి.. ఏ పత్రాలు వద్దు.. కేంద్రం తెలివి తక్కువ పని’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చలామణిలో ఉన్న రూ. 2 వేల నోటు రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారు. అదొక తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. పైగా నలధనాన్ని వెలికి తీసేందుకే ఈ పెద్ద నోట్లని రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు వేల రూపాయల నోటు మార్చుకునేందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు, ఆధారాలు అవసరం లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. అంటే దీని అర్థం నల్లదనాన్ని మార్చుకునే వారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెసులుబాటు కల్పించినట్లేగా అని ఎద్దేవా చేశారు. నిజానికి సాధారణ ప్రజల వద్ద రూ. 2 వేల రూపాయల నోట్లు ఉండనే ఉండవు. 2016లో డీ మానిటైజేషన్ పేరిట ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో ప్రజలు పెద్ద నోట్లకు చాలా దూరంగా ఉన్నారన్నారు. అయినా రోజువారి చిల్లరకు ఆ నోటు సామాన్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు కూడా అని చెప్పారు. నల్లధనాన్ని కూడబెట్టేవారికి సులభంగా దాచుకునేందుకు మాత్రమే ఆ నోటు ఉపయోగపడుతుందన్నారు. 2016 తర్వాత సరిగ్గా ఏడేళ్లకి ఈ మూర్ఖపు చర్యను తీసుకున్నందుకు సంతోషం అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారమే భారత రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటుని చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రజలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వడమే గాక అందుకు ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ రూ. 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపదని, కేవలం అక్రమ డబ్బు తరలింపును కష్టతరం చేయడానికేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పడం విశేషం. (చదవండి: శ్రీనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత..భారీగా బలగాలు మోహరింపు) -
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మొట్టమొదటిగా స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక చర్యగా అభివర్ణించారు. కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ఓ అంతర్గత కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే అవి చెల్లుబాటు అవుతాయని వివరించారు. మరోవైపు రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో వెల్లడించారు. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని వివరించారు. రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేసినట్లు స్పష్టం చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం తగినంత సమయం ఇచ్చామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. సెప్టెంబర్ 30 వరకూ రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చన్నారు. కాగా డిపాజిట్ మొత్తం రూ.50 వేలకు మించితే పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నగదు డిపాజిట్‌కు సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. #WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, "Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank...For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU — ANI (@ANI) May 22, 2023 ఇదీ చదవండి: Rs 2,000 Notes: బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా? జువెలరీ షాపులకు వెల్లువెత్తిన ఎంక్వైరీలు! -
నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉంది: కిషన్‌రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే, రూ.2వేల నోట్ల రద్దుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పుపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. కాగా, కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఒక వార్డు మెంబర్ గెలిచినందుకే సంబురపడిపోతున్నారు. మా పార్టీ జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవడం సహజం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు బేస్‌లెస్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు.. ఇది సీబీఐ పరిధిలోని అంశం. మేము.. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను జైలుకు పంపించాం. 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్ మాకుంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: తలమాసినోళ్లను చేర్చుకుంటున్నారు: కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ -
‘2 వేల నోటు తీసుకురావడమే తప్పు’
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రెండు వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. అయితే.. నోట్లను మార్చుకునేందుకు గడువు ఇచ్చి కాస్త ఊరట ఇచ్చింది. ఈ క్రమంలో మోదీ సర్కార్‌పై రాజకీయంగానే కాకుండా నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. 2 వేల నోటు తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఉపసంహరణ తుగ్లక్ నిర్ణయమంటూ సెటైర్లు పేల్చింది కాంగ్రెస్ పార్టీ. మన విలక్షణమైన స్వీయ-శైలి విశ్వగురువు(ప్రధాని మోదీని ఉద్దేశించి..).. మొదటి చట్టం తేవడం.. రెండోది అంతేవేగంగా ఆలోచన చేయడం. నవంబర్ 8, 2016 నాటి తుగ్లక్ ఫర్మాన్ ప్రకారం.. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోట్లు ఇప్పుడు ఉపసంహరించబడుతున్నాయి అని కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. Typical of our self-styled Vishwaguru. First Act, Second Think (FAST). 2000 rupee notes introduced with such fanfare after that singularly disastrous Tughlaqi firman of Nov 8 2016 are now being withdrawn.https://t.co/gPjY07iKID — Jairam Ramesh (@Jairam_Ramesh) May 19, 2023 2016 నవంబర్ 8వ తేదీనాటి దెయ్యం.. మరోసారి దేశాన్ని వెంటాడేందుకు వచ్చింది. పెద్దఎత్తున ప్రచారంలో ఉన్న పెద్దనోట్ల రద్దు చర్య ఈ దేశానికి స్మారక విపత్తుగా కొనసాగుతోంది. కొత్త 2000 నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై దేశ ప్రజలకు ప్రసంగించిన ప్రధాని, ఈరోజు ముద్రణ నిలిపివేసినప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి?. అటువంటి చర్యకు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రభుత్వం వివరించాలి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక ఎజెండాను కొనసాగిస్తోంది. ఇంత తీవ్రమైన చర్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని.. ప్రపంచంలోని 'చిప్ కొరత' దీనికి కారణం కాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వెటకారంగా ట్వీట్ చేశారు. The ghost of 8th nov 2016 has come back to haunt the nation once again. The greatly propagated move of demonetisation continues to be a monumental disaster for this nation. The PM sermoned the nation on the benefits of the new 2000 notes, today when the printing is stopped what… https://t.co/sfvTyLlDie — Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 19, 2023 మరోవైపు పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో అంటే నవంబర్ 2016లో 2000 నోటు చెలామణిలోకి వచ్చింది. కానీ, 2018 నుంచే 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అయితే చెలామణిలో మాత్రం 3.52 లక్షల నోట్ల విలువైన 2 వేల నోట్లు చెబుతోంది. ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం రెండు వేల నోటును చూసి చాలాకాలం అవుతున్న సామాన్యులకు ఎలా ఊరట అవుతుందని ప్రశ్నిస్తున్నారు. Modiji is in Japan when withdrawal of Rs. 2,000 notes has been announced. Coincidentally, the last time he was in Japan just after demonetization and gave this speech. pic.twitter.com/NDes0aAmst — PuNsTeR™ (@Pun_Starr) May 19, 2023 Good bye 2000 (RBI) has announced to withdraw Rs 2,000 pic.twitter.com/MeAgni204g — 𝑺𝒉𝒘𝒆𝒕𝒂𝒂♥️𝑻𝒆𝒋𝒂𝑻𝒓𝒐𝒐𝒑𝒔~♡ (@shwetak012) May 19, 2023 "RBI to withdraw Rs 2,000 currency notes from circulation" Me reading this news who doesn't even have a 500₹ note : pic.twitter.com/h8PZgr7yKE — Sanskar (@SaanskarJain) May 19, 2023 Those People who doesn't have any Rs 2000 notes#Demonetisation #2000note #2000rs #earthquake #NTR30 pic.twitter.com/0RSPgo9OBY — Lalji Patel (@LaljiPatel34) May 19, 2023 RBI on 2000 Rupee note: RBI to withdraw Rs 2,000 notes from circulation; notes will continue to be legal tender people reaction on it run run for exchange pic.twitter.com/qm2AVa64eL — Mahesh Bhavsar (@imaheshbhavsar) May 19, 2023 RBI withdraws ₹2000 note from circulation, to remain legal tender Why you should not panic? 1) The banks will no longer issue Rs 2,000 currency notes. 2) There is no need to panic as Rs 2,000 will continue to remain legal tender after September 30, 2023 #2000notes #rbi pic.twitter.com/y6KMVqmRTi — Saurav Mishra 🇮🇳 (@SauravmishraTV9) May 19, 2023 RBI 2000 To Withdraw Rs 2,000 Currency Notes From Circulation with immediate effect. It, however, stated that the banknote will continue to be legal tender#BreakingNews #Demonetisation #RBI #2000note #2000note #TejRan #KaranKundrra #TejasswiPrakash happy But HAWALA BE LIKE pic.twitter.com/9A1f9eNLjO — Sandy vats (@Sandip124113) May 19, 2023 Mere pas sirf 1798 rupay hain#Demonetisation Rs 2000 notepic.twitter.com/JVZnKAxQyM — human (@humanbeing1857) May 19, 2023 -
రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు...! గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్ అయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి. -
రూ. 2,000 నోటుకు కళ్లెం!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు. మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు.. బ్లాక్‌మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది. 2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి. అప్పట్లోనే విమర్శలు.. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్‌లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి. -
గత ఆగస్టులోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ
ఇండోర్: నోట్ల రద్దు నిర్ణయానికి రెండున్నర నెలల ముందుగానే రూ.2 వేల నోట్ల ముద్రణ ప్రారంభమైందని ఆర్బీఐకు అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్ బీఎన్ ఎంపీఎల్) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ 2016 ఆగస్టు 22న, రూ. 500 నోట్ల ముద్రణ నవంబర్ 23న ప్రారంభించామని తెలిపింది. పాత 500 రూపాయల నోట్లను గతేడాది 27 నుంచి ప్రింట్ చేయడం మానేసినట్టు తెలిపింది. వెయ్యి రూపాయల నోట్ల ముద్రణను జూలై 28 నుంచే ఆపేసినట్టు వెల్లడించింది. -
2000 నోటుపై అప్పుడే నిర్ణయం..
ముంబై: రెండు వేల రూపాయల నోట్లను చెలామణిలోకి తేవాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గతేడాది మే నెలలోనే నిర్ణయం తీసుకుంది. అయితే పాత పెద్ద నోట్లను రద్దు విషయం అప్పుడు ప్రస్తావనకు రాలేదని వెల్లడైంది. సమాచార హక్కు చట్టం కింద ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ సమర్పించిన దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం ఇచ్చింది. రూ.2000 నోట్లు ప్రవేశపెట్టేందుకు సెంట్రల్ బోర్డు 2016, మే 19న ఆమోదం తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ సమావేశంలో పాత పెద్ద నోట్ల రద్దు ప్రస్తావనే రాలేదని తెలిపింది. జూలై 7, ఆగస్టు 11న జరిగిన బోర్డు సమావేశాల్లోనూ పాత పెద్ద నోట్ల ఉపసంహరణపై ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. రఘురామ్ రాజన్ గవర్నర్ గా ఉన్నప్పుడే రూ. 2000 నోట్లు ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది సెప్టెంబర్ 4న రాజన్ వైదొలగారు. తర్వాత రోజు ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. -
2 వేల నోటుపై సరి కొత్త సీక్రెట్!
పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా విడుదలైన రెండు వేల రూపాయల నోటు గురించి బయటికొచ్చిన విషయాలు అన్నీ ఇన్నీ కావు. అందులో జీపీఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, అందువల్ల పెద్దమొత్తంలో నోట్లు ఎవరిదగ్గరైనా ఉంటే తెలిసిపోతుందని అనేవారు. అదంతా ఉత్త ట్రాష్ అని తేలిపోయింది. ఇప్పుడు ఈ నోటు గురించి మరో కొత్త విషయం బయటకు వచ్చింది. అందులో పి32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందన్న విషయం ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది. 2వేల రూపాయల నోటు ముద్రించడానికి రేడియోధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వదంతులు తెగ వ్యాపిస్తున్నాయి. ఢిల్లీ, చెన్నై, వెల్లూరు, బెంబగళూరు, పుణె లాంటి నగరాల్లో సరిగ్గా ఎక్కడైతే పెద్దమొత్తంలో నోట్లు దాచిపెట్టారో అక్కడే ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి, వాటిని పట్టుకోవడంతో ఆ తర్వాతి నుంచి ఈ రేడియో ధార్మిక ఇంకుకు సంబంధించిన కథనాలు మరీ ఎక్కువయ్యాయి. ఒకేచోట ఎక్కువ మొత్తంలో ఈ పి32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని, అందుకే పెద్దమొత్తంలో నోట్లు ఉన్నచోటల్లా దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. నోటులో ఉన్న ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు. వాస్తవం ఏంటి? అసలు ఈ నోటు తయారీ విషయంలో రెగ్యులర్‌గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్‌ను చేర్చలేదని రిజర్వు బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే నోటు ముద్రణకు రేడియోధార్మిక ఇంక్ వాడారన్నది కూడా ఉత్త వదంతి మాత్రమేనని తెలిపాయి. దాంతో.. ఈ నోటు గురించిన మరో విశేషం కూడా తప్పేనని తేలిపోయింది. -
రెండువేల నోటు ఇల్లీగల్!
దేశంలో ఆర్థిక అరాచకం పార్లమెంటు ఎదుట కాంగ్రెస్ నిరసన న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా కొత్త రెండువేల నోటుపైనా తీవ్ర ఆరోపణలు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రధాని మోదీ రూ. రెండువేల నోటును జారీచేశారని ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలిందని మండిపడింది. ఈ విషయంలో పార్లమెంటు లోపల, బయటా కేంద్రాన్ని ఎండగడతామని పేర్కొంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘రూ. రెండువేల నోటు జారీచేయడం చట్ట వ్యతిరేక చర్య. ఆర్బీఐ చట్టం ప్రకారం కొత్త కరెన్సీ ముద్రణ కోసం నోటీఫికేషన్ జారీచేయాలి. ఆ తర్వాత కొత్త నోటు విడుదల చేయాలి. కానీ చట్టప్రకారం తప్పనిసరి అయిన ఈ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో గళమెత్తడమే కాకుండా ఇటు ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. -
రూ.2000 నోటు వాటర్ ప్రూఫా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను దక్కించుకునేందుకు సామాన్య జనం నరకయాతన పడుతుంటే కొందరు మాత్రం వాటి నాణ్యతను పరీక్షించే పనిలో పడ్డారు. రూ.2000 నోట్లు దక్కించుకున్న వారు వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడుతుండగా, కొందరు వీటిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు. ఈ వీడియోలు ఆన్ లైన్ లో సంచలనంగా మారాయి. కొత్త నోటు నలుగుతుందా, లేదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి, మళ్లీ సరిచేశారు. అంతేకాదు వాటర్ ప్రూఫా, కాదా అనేది కూడా టెస్ట్ చేశారు. రూ. 2000 నోటును నీటిలో ముంచేసి, టాప్ వాటర్ తో దాన్ని తడిపి కూడా పరీక్షించారు. పాత నోట్లతో పోలిస్తే ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ అని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు ఇలా చేశారు. తడిసిన రూ. 2000 నోటు రంగు వెలిసిపోలేదు. అంతేకాదు మామూలు కాగితం, పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా మారింది. పాత నోట్లతో పోలిస్తే రూ. 2000 మెరుగ్గా ఉందని ఈ వీడియోల ద్వారా ప్రయోత్మకంగా నిరూపించారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించడం విశేషం. -
కొత్త 2వేల నోటుపై మరో కలకలం
కొత్తగా మార్కెట్లలోకి వచ్చిన 2వేల రూపాయల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనం చెలరేగింది. నోటు వెనకాల భాగంలో 15 భాషల్లో ముద్రించినప్పుడు 'దోన్ హజార్ రూపయా' అని ఒకసారి, 'దోన్ హజార్ రుపయే' అని మరోసారి ఉందని.. ఇది స్పెల్లింగు తప్పు కావడంతో మొత్తం నోట్లన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని దుమారం రేగింది. కానీ, దీనిపై విస్తృతంగా పరిశోధన చేయగా.. నోట్లలో ఎలాంటి తప్పు లేదన్న విషయం తేలిపోయింది. నోటులో ముద్రించిన భాషల ప్యానల్లో అసలు హిందీ లేనే లేదు. నోటుకు వెనక భాగంలో ఎడమవైపు హిందీలో రాయగా, మిగిలిన మరో 15 భారతీయ భాషలలో మాత్రమే రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా ముద్రించారు. ఆ రెండింటిలో ఒకటి మరాఠీ కాగా మరొకటి కొంకణి కావచ్చని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టంగా చెబుతున్నారు. -
కొత్త నోట్లలో చిప్‌పై ఆర్బీఐ క్లారిటీ!
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 500, రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. వీటిస్థానంలో రూ. 500, రూ. రెండువేల నోట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, రూ. రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉంటుందని, ఈ నోట్లు ఎవరు పెద్దమొత్తంలో దాచినా.. అవి ఎక్కడ ఉన్నాయో ఆదాయపన్నుశాఖ (ఐటీ) అవలీలగా కనుక్కోగలదని పెద్ద ఎత్తున వదంతులు ఫేస్బుక్, వాట్సాప్‌లో షికార్లు చేశాయి. ఈ నోట్లలో ఉండే నానో జీపీఎస్ చిప్‌లు శక్తిమంతమైనవనీ, భూమిలో 120 మీటర్ల లోతులో ఈ నోట్లను పాతిపెట్టినా.. వీటిని రాడర్ నిఘా నుంచి తప్పించలేరని, నానో చిప్ ఆధారంగా వచ్చే సిగ్నళ్లతో వీటిని ఐటీ అధికారులు ట్రాక్ చేసే వీలు ఉంటుందని వదంతులు భారీగా వచ్చాయి. అయితే, ఈ వదంతులన్నీ ఉత్తవేనని తాజాగా భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తేల్చింది. రూ. 2000 నోటుకు సంబంధించిన ఆర్బీఐ ఇచ్చిన వివరణలో ఎక్కడా కూడా నానో చిప్ ఉంటుందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అంతేకాకుండా నోటులో చిప్ ఉంటుందని వస్తున్న వదంతులను కూడా ఆర్బీఐ తోసిపుచ్చింది. రూ. 2వేల నోట్లలో అలాంటివేమీ ఉండవని స్పష్టం చేసింది.