రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ అప్డేట్.. | Rs 6839 Crore Worth Rs 2000 Banknotes Still In Circulation, Check Press Release Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

రూ.2000 నోట్లపై ఆర్‌బీఐ అప్డేట్..

Published Tue, Dec 3 2024 2:27 PM | Last Updated on Tue, Dec 3 2024 3:41 PM

Rs 6839 Crore Rs 2000 Notes Still With Public

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్‌బీఐ అధికారికంగా వెల్లడించింది.

ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement