notes
-
రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2,000 నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పటి నుంచి దాదాపు 98.08 శాతం వెనక్కి వచ్చాయి. ఇంకా రూ. 6839 కోట్లు విలువైన రెండు వేల రూపాయల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.2023 మే 19 నాటికి మార్కెట్లో చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. 2024 జూన్ 28 నాటికి 97.87 శాతం బ్యాంకులకు చేరాయి. ఆ తరువాత మిగిలిన రెండు వేల రూపాయల నోట్ల విలువ రూ.7,581 కోట్లు. నవంబర్ 29 నాటికి 98.08 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని.. ఇక మిగిలిన రూ. 6,839 కోట్ల విలువైన పెద్ద నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది.ఇంకా తమ వద్ద ఉన్న రెండు వేలరూపాయల నోట్లను ప్రజలు.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీఘడ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలోని ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.The total value of Rs 2000 banknotes in circulation, which was Rs 3.56 lakh crore at the close of business on May 19, 2023, when the withdrawal of Rs 2000 banknotes was announced, has declined to Rs 6839 crore at the close of business on November 29, 2024. Thus, 98.08% of the Rs… pic.twitter.com/hfpAFJCMR7— ANI (@ANI) December 3, 2024 -
కరెన్సీ కాదు.. కలర్ జిరాక్స్!
బత్తలపల్లి: టెక్నాలజీ మహిమ..అంతా మాయ. కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇట్టే మోసం చేస్తున్నారు. తెలివిమీరిపోయిన కొందరు కేటుగాళ్లు... బత్తలపల్లిలోని చిరు వ్యాపారులకు టోకరా వేశారు. రూ.10 విలువైన వస్తువులు కొని రూ.200, రూ.500 నోట్లు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుని మరీ వెళ్లారు. ఆ నోట్లు తీసుకుని బ్యాంకులకు వెళ్లిన చిరువ్యాపారులు అవి కలర్ జిరాక్సు పేపర్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మోసాలు ఇటీవల బత్తలపల్లిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. కూడలిలో ఆటోవాలాకు ఓ వ్యక్తి ఇలాగే కలర్ జిరాక్స్ నోటు ఇచ్చాడు. అలాగే జొన్నరొట్టెలు విక్రయించే వృద్ధురాలినీ ఓ ఆగంతకుడు ఇలాగే మోసం చేశాడు. కలర్ జిరాక్స్ నోట్ల బాధితుల్లో ఎక్కువగా చిరువ్యాపారులే ఉండటం గమనార్హం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంకా ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లు ఎంతంటే..
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 98.04 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.6,970 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 అక్టోబర్ 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.6,970 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: పెళ్లి కూతురిని వెతకనందుకు రూ.60 వేలు జరిమానా!ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలంటే..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
-
రూ.10.. పరేషాన్..!
నెన్నెల: మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం గగనంగా మారింది. దీంతో అటు వ్యాపారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ కొనుగోళ్లకు 1, 2, 5, 10 రూపాయల నాణేలు గతంలో చాలా చెలామణిలో ఉండేవి. ధరల పెరుగుదల కారణంగా 1, 2, 5 రూపాయల నాణేలు ఉన్నా 5, 10 రూపాయల నాణేల వినియోగం పెరి గింది. ప్రస్తుతం ఆయా నాణేలతోపాటు రూ.10 నో ట్ల చెలామణి కూడా భారీగా తగ్గింది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10కి మూడు అని చెబుతున్నారు. దీంతో కి రాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, బస్సు, ఆటో చార్జీల్లో రూ.10 కరెన్సీనోటుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తు తం రూ.10 నోటు మార్కెట్లో అందుబాటులో లేక వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు.ఆన్లైన్ చెల్లింపులుకరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తు వు కొనుగోలు చేయాలన్నా డిజిటల్ చెల్లింపులు అనే పరిస్థితి నెలకొంది. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో, చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులకు అనుమతిస్తున్నారు. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదా రులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండడం గమనార్హం. ఎక్కడ ఆగిందో..?రూ.10 నోటు మార్కెట్లో చెలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వినియోగదారులు చిరు వ్యాపారు ల వద్ద వస్తువులు కొనుగోలు చేసినప్పడు రూ.100నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు గా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదా రుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. చిన్నమొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నోట్ల కొరత వాస్తవమేరూ.10 నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వు బ్యాంకు నుంచి రావడం లేదు. రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10 నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి. – గోపికృష్ణ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఆవుడం -
2.1 గోల్డ్ కొట్టేశారు!
అహ్మదాబాద్: వీళ్లు అలాంటిలాంటి మోసగాళ్లు కాదు.. దొంగనోట్ల కట్టలు. అవీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మతో ఉన్నవి అక్షరాలా రూ.1.30 కోట్లు..ఓ బడా బంగారం వ్యాపారికి అంటగట్టి ఏకంగా 2.1 కిలోల బంగారంతో ఉడాయించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వాళ్లు ఓ నకిలీ హవాలా ఆఫీసును సైతం ఏర్పాటు చేసుకున్నారు. మోసం తెలుసుకునేలోపే పత్తా లేకుండా పోయారు. బాలీవుడ్‌ను సైతం తలదన్నే ట్విస్టులున్న ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి మెహుల్ ఠక్కర్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు ప్రశాంత్ పటేల్ అని, స్థానికంగా ఉన్న ఫలానా నగల దుకాణం మేనేజర్‌ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ దుకాణం మెహుల్‌కు తెలిసిందే కావడంతో ఆయన నిజమేననుకున్నాడు. పటేల్ 2.1 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపగా, కొంత బేరసారాల తర్వాత రూ.1.60 కోట్లకు డీల్ కుదిరింది. అతడిచి్చన సమాచారం మేరకు సెప్టెంబర్ 24వ తేదీన ఠక్కర్ తన మనుషులకు 2.1 కిలోల బంగారమిచ్చి పంపించారు. చెప్పిన ప్రకారం వాళ్లు ఓ హవాలా దుకాణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వీరి కోసం ముగ్గురు వ్యక్తులున్నారు. దుకాణంలోని నోట్ల లెక్కింపు మిషన్‌తో తీసుకువచి్చన 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించడం మొదలైంది. తాము రూ.1.30 కోట్లే తెచ్చామని, మిగతా రూ.30 లక్షలు పక్కనే మరో దుకాణం నుంచి తెస్తామంటూ ముగ్గురిలో ఇద్దరు బంగారం బిస్కెట్లను తీసుకుని వెళ్లారు. అయితే, ఆ నోట్లపై మహాత్మా గాం«దీకి బదులు నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. రిజర్వు బ్యాంక్ ఇండియా స్థానంలో తప్పుగా ‘రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’అని ఉంది. ఠక్కర్ సిబ్బంది ఇదంతా గమనించి, అనుమానించారు. ఇదేమని, అక్కడే ఉన్న మూడో వ్యక్తిని ప్రశ్నించారు. కౌంటింగ్ మిషన్ తెమ్మంటే తెచ్చానే తప్ప, వారెవరో, ఆ నోట్ల విషయమేంటో నాకూ తెలియదు’అంటూ అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. బంగారం బిస్కెట్లతో వెళ్లిన పెద్దమనుషులు తిరిగి రాలేదు. దీంతో, సిబ్బంది ఆ విషయాన్ని ఠక్కర్ చెవిన వేశారు. ఆయన గుండె ఆగినంత పనైంది..! ఇదేమిటని ఆరా తీయగా ఆ హవాలా దుకాణాన్ని రెండు రోజుల క్రితమే ఎవరో తెరిచారని తేలింది. దీంతో, మెహుల్ ఠక్కర్ తననెవరో బకరాను చేశారని గ్రహించి, నవ్‌రంగ్‌పుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?
భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే.. అందరూ రూ.2000 నోటనే చెబుతారు. 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రెండు వేలరూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ.. నిజానికి భారదేశంలో స్వాతంత్య్రం రాకముందే 1938లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.10000, రూ.5000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారదేశంలో ప్రవేశపెట్టిన రూ10000 నోటు.. అతిపెద్ద డినామినేషన్‌గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారాలు, వ్యాపారులు అధిక-విలువ లావాదేవీల కోసం ఉపయోగించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1946లో వీటిని ఆరికట్టింది.ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954లో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఆ తరువాత 1978 వరకు చెలామణి అవుతూనే ఉన్నాయి. ఆ తరువాత 1978లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే.. రూ.5,000 నోట్లతో పాటు రూ.10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరిమీదా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 1976 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నగదు రూ.7,144 కోట్లు. ఇందులో రూ.1,000 నోట్లు రూ.87.91 కోట్లు. అంటే మొత్తం డబ్బులో రూ. 10000 నోట్ల శాతం 1.2 శాతం మాత్రమే. రూ. 5000 నోట్లు రూ.22.90 కోట్లు మాత్రమే. రూ.10000, రూ.5000 నోట్ల రద్దు తరువాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు మళ్ళీ రాలేదు. ఆ తరువాత రూ. 2000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు భారదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే రూ. 500 నోటు అనే చెప్పాలి. -
ఇంకా మూలుగుతున్న రూ.రెండువేల నోట్లు
రెండువేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక అప్డేట్ అందించింది. ఇప్పటివరకు మొత్తం ఆర్బీఐ ముద్రించిన రూ.2000 నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ.7,261 కోట్లు విలువచేసే రూ.రెండువేలు నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని చెప్పింది.మే 19, 2023న ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడే నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయాల నోట్లు చలామణిలో ఉండేవి. ఈ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకునే వీలు కల్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అయినా 2024 ఆగస్టు 31 నాటికి ఇంకా వ్యవస్థలో రూ.7,261 కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయి.ఇదీ చదవండి: తగ్గిన దేశ జీడీపీ వృద్ధి రేటు.. కారణాలు..ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను మార్చుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి , హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రూ.1000, రూ.500 నోట్లు రద్దు తర్వాత 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను వ్యవస్థలోకి తీసుకొచ్చారు. -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్‌లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
రూ. 5 నుంచి రూ. 2000.. ఏ నోటుపై ఏ చిహ్నం?
మరికొద్ది రోజుల్లో మనమంతా పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోనున్నాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన స్వదేశీ ఆవిష్కరణలు జరిగాయి. వాటిలో ఒకటే సొంత కరెన్సీ. భారతీయ నోట్లపై వివిధ చిత్రాలు మనకు కనిపిస్తాయి. ఏ నోట్‌పై ఏ చిత్రం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.ఐదు రూపాయలుఐదు రూపాయల నోట్ల ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ కావడంతో ఆర్బీఐ ఇటీవలే ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. అయినప్పటికీ గతంలో ముద్రించిన 8 వేల 500 కోట్ల విలువైన ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో చలామణీలో ఉన్నాయి. ఐదు రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ చిత్రం, మరో వైపు పొలం దున్నుతున్న రైతు చిత్రం కనిపిస్తుంది. ఈ ఫోటో ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.పది రూపాయలుపది రూపాయల నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫోటో, వెనుకపైపు అశోక చక్రం కనిపిస్తాయి. 10 రూపాయల కొత్త నోట్ల శ్రేణిలో ఒకవైపు సూర్య దేవాలయ చక్రం కనిపిస్తుంది.ఇరవై రూపాయలుఇరవై రూపాయల నోటు విషయానికొస్తే ఈ నోటుపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రం, మరోవైపు అశోక స్థూపం కనిపిస్తుంది. మరికొన్ని నోట్లపై ఎల్లోరా గుహల దృశ్యం కనిపిస్తుంది.యాభై రూపాయలుయాభై రూపాయల నోటులో ఒకవైపు గాంధీజీ చిత్రం, వెనుకవైపు 'స్వచ్ఛ భారత్' లోగో కనిపిస్తుంది.100 రూపాయలుకొత్త రూ.100 నోటుపై ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని, వెనుకవైపు రాణికి వావ్(గుజరాత్‌లోని చారిత్రక ప్రాంతం) చిత్రాన్ని చూడవచ్చు.200 రూపాయలురూ.200 నోటుపై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక భాగంలో ప్రసిద్ధ సాంచి స్థూపం చిత్రాన్ని చూడవచ్చు.500 రూపాయలుకొత్త రూ.500 నోటు విషయానికొస్తే, ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, వెనుక వైపు స్వచ్ఛ్ భారత్‌తో పాటు ఎర్రకోట చిత్రాన్ని చూడవచ్చు.రెండు వేల నోటురెండు వేల రూపాయల నోటును చలామణీని నిలిపివేశారు. ఈ నోట్‌పై ఒకవైపు గాంధీజీ చిత్రాన్ని, మరోవైపు మంగళయాన్ చిత్రాన్ని చూడవచ్చు. -
రూ.7,409 కోట్ల విలువైన 2,000 నోట్లు ఇంకా ప్రజల్లోనే..
ముంబై: ఉపసంహరించిన రూ. 2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 97.92 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం తెలిపింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని పేర్కొంది. రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఉపసంహరణ ప్రకటించిన గత ఏడాది మే 19న బిజినెస్ వ్యవహార సమయం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు. ఈ ఏడాది జూలై 31న ఇదే సమయానికి ఈ విలువ రూ.7,409 కోట్లకు తగ్గింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడం, లేదా మార్చుకునే సౌకర్యం దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌లలో 2023 అక్టోబర్ 7 వరకు అందుబాటులో ఉంది. అటుపై 2023 అక్టోబర్ 9వ తేదీ నుండి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను స్వీకరిస్తున్నాయి. ప్రజలు రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపడానికి తగిన సౌలభ్యతను కూడా కలి్పంచడం జరిగింది. 2016 నవంబర్‌లో అప్పుడు అమలులో ఉన్న రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. -
నోట్లరద్దుపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2వేలనోట్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు వెల్లడించింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2వేలనోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ నిర్ణయానికి ‘నో’ చెప్పిన ఈసీ ఆర్బీఐ గతేడాది మే 19న రూ.2వేలనోట్ల రద్దు ప్రకటించింనా, సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఆ తర్వాత నుంచి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు వీలుంది. -
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్! కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంక్ కొన్నేళ్ల కిందటే చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది. -
మహాత్మా గాంధీ స్థానంలో శ్రీరాముడు ఆర్బీఐ క్లారిటీ
-
నలభై రెట్లు పెరిగిన అసెంబ్లీ ఎన్నికల వ్యయం
నిర్మల్ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇష్టారీతిన డబ్బు ఖర్చు చేయడానికి వీలులేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ.40 లక్షలు మాత్రమే విధించబడినది. అయితే ఈ వ్యయ పరిమితి గతంలో ఉన్నదానికంటే క్రమంగా శ్రీఇంతింతై వటుడింతై...శ్రీఅన్న చందంగా పెరుగుతూ వస్తోంది. భారతదేశంలో స్వాతంత్య్రానంతరం 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో అప్పటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చు గరిష్టంగా రూ.లక్షగా నిర్దేశించబడింది. అప్పటి నుంచి ప్రతీసారి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు చేయడానికి వ్యయపరిమితి విధించబడింది. అంటే ఎన్నికలు ప్రారంభమైన ఏడు దశాబ్దాల కాలంలో దాదాపు 40 రెట్లు పెరుగుతూ వచ్చింది. నామినేషన్ వేసిన రోజు నుంచే లెక్క షురూ.. 2014 అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకంగా రూ.40 లక్షలకు పెంచింది. లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిమితిని రూ.95 లక్షలుగా నిర్ణయించింది. నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ జరిగే వరకు అభ్యర్థి చేసే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తారు. పార్టీ చేసే ఖర్చు మాత్రం అభ్యర్థి వ్యయంలోకి రాదు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు చేసే ఖర్చులను బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి. అందుకోసం నామినేషన్ దాఖలు చేసే నాటికే పోటీలో ఉన్న అభ్యర్థులంతా కొత్తగా బ్యాంకు అకౌంట్ ప్రారంభించుకున్నారు.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లేదా ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ఎలాంటి ఖర్చు చేయరాదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన తాయిలాలను అభ్యర్థుల వ్యయంలో చేర్చాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రోజువారీగా అభ్యర్థులు చేసే వ్యయంతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, భోజనాలు, వాహనాల అద్దె, ఇంధన ఖర్చులు, సభా వేదికలు, మైకులు, పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు చేసే ఖర్చులను కలిపి అభ్యర్థి ఎన్నికల వ్యయంగా లెక్కిస్తారు. వీటిలో ప్రతి దానికీ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటికి ఎన్నికల సంఘం ధరలు నిర్ణయిస్తుంది. వాటి ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్నాయి. పెరుగుతున్న వ్యయపరిమితి.. 1952 సాధారణ ఎన్నికల్లో రూ.లక్షతో ప్రారంభమైన ఎన్నికల వ్యయ పరిమితి 1962 నాటికి రూ.3 లక్షలు 1971 ఎన్నికల నాటికి రూ.4 లక్షలు, 1975 నాటికి రూ.5 లక్షలు పెరుగుతూ వచ్చింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరువైంది. 1991 నాటికి మరో రెండు లక్షలు పెరిగి రూ.12 లక్షలకు చేరుకుంది. 1999లో రూ.15 లక్షలు, 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని విధించారు. ప్రస్తుతం జరుగుతున్న 2023 ఎన్నికల్లో ఈ గరిష్ట వ్యయపరిమితి రూ.40 లక్షలకు చేరుకుంది. వ్యయపరిమితి పెరుగుదల ఇలా.. సంవత్సరం వ్యయపరిమితి (రూ.లక్షలలో) 1952 1 1962 3 1971 4 1975 5 1984 10 1991 12 1999 15 2004 17 2009 26 2014 28 2023 40 -
నోట్ల రద్దు తర్వాత రెట్టింపైన నగదు చలామణి! కారణం ఇదేనా..
దేశంలో పెద్దనోట్లు రద్దయ్యి ఏడేళ్లు అవుతోంది. యూపీఐతోపాటు అనేక ఇతర డిజిటల్ పేమెంట్ పద్దతులూ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల ఫలితంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ... పెరక్కపోవడం మాట అటుంచండి.. ఆర్థిక వ్యవస్థలో నగదు చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే రెట్టింపు అయినట్లు తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి చెబుతోంది. ఎందుకిలా? పెద్దనోట్ల రద్దు తరువాత నగదు లావాదేవీలు యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాల ద్వారా జరుగుతూండటం వాస్తవమే. ఏటీఎంలలోనూ చాలా పరిమిత స్థాయిలోనే నగదు లభ్యమవుతోంది. సామాన్యులకు క్యాష్ దొరకడమే కష్టమవుతోంది. కానీ.. ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు మాత్రం పెద్దరోట్ల రద్దుకు ముందుకంటే డబుల్ అయింది. పైగా ఈ ఏడేళ్లలో ఆస్తుల కొనుగోళ్లలో నగదు లావాదేవీలు 76 శాతం వరకూ ఉన్నట్లు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వే ఒకటి తెలిపింది. దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 78 శాతం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ద్వారా ప్రజలను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలు నగదు లావాదేవీలను తగ్గించగా, భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు నవంబర్ 2016లో రూ.17 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 2023 నాటికి రూ.33 లక్షల కోట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. చిన్నచిన్న లావాదేవీలకు డబ్బు వినియోగించడం తక్కువైంది. కానీ ఆస్తుల కొనుగోలు వంటి భారీ లావాదేవీలకు మాత్రం నగదును ఎక్కువగా వాడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆస్తుల లావాదేవీల్లో నగదు అవసరం లేదని 30 శాతం మంది తెలిపారని, కానీ ప్రస్తుతం వారి సంఖ్య 24 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తేలింది. అయితే కొంతమంది మాత్రం వాహనమైనా లేదా గాడ్జెట్ అయినా అధిక విలువ కలిగిన గృహోపకరణాల కొనుగోళ్లు డిజిటల్‌గా చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ కిరాణా సామగ్రి, ఫుడ్ డెలివరీ, ఇంటి మరమ్మతులు, వ్యక్తిగత ఖర్చులు..వంటివి చెల్లించడానికి నగదును ఉపయోగిస్తున్నారని సర్వేలో తెలిపారు. ఇదీ చదవండి: అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా.. నవంబర్ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు నల్లధనాన్ని వెలికితీయడానికి, నగదు చెల్లింపునకు బదులు ప్రజలను డిజిటల్ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేపట్టారు. -
రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!
భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు. రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే.. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. -
జైపూర్‌లో నోట్ల వర్షం హల్చల్: వీడియో వైరల్
Money Heist' Attire రాజస్థాన్‌లోని జైపూర్‌లో నోట్ల వర్షం కురిసిన ఘటన గందరగోళ పరిస్థితికి దారి తీసింది. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఫలితంగా ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జైపూర్లోనిమాల్వియా నగర్‌లోని గౌరవ్ టవర్ సమీపంలో చోటు చేసుకుంది. 'మనీ హీస్ట్' సిరీస్ స్ఫూర్తితో మనిషి నోట్ల వర్షం కురిపించాడు. తన ముఖంపై సాల్వడార్ డాలీ మాస్క్‌తో ఎరుపు రంగు జంప్‌సూట్‌లో ఉన్నట్టుండి బిజీగా ఉన్న మార్కెట్లో గాలిలో డబ్బుల వర్షం కురిపించాడు. దీనితో భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలు వీలైనన్ని ఎక్కువ నోట్లను అందిపుచ్చుకోవడానికి పరుగులు తీశారు. ఇందులో దాదాపు అన్నీ 20, 10 రూపాయల నోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఎక్కడి వాహనాలు అక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ చర్యకు కారణమైన వ్యక్తిని జవహర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ అరెస్టు చేసి, విచారణ కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) తూర్పు జ్ఞానచంద్ యాదవ్ వెల్లడించారు. 'మనీ హీస్ట్': అలెక్స్ పినా రూపొందించిన స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్ -
రూ. 2వేల నోట్లు తీసుకోవద్దు
తమిళనాడు: ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లు తీసుకోవద్దని రాష్ట్ర రవాణా సంస్థ అదేశించింది. నవంబర్ 8, 2016సంవత్సరంలో ప్రధాని మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేరోజు కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. తర్వాత 2019లో రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ పరిస్థితులో రాష్ట్ర రవాణా సంస్థ గురువారం నుంచి ప్రయాణికుల నుంచి రూ.2000 నోట్లను తీసుకోవద్దని ఆ శాఖ మేనేజర్లు, కండక్టర్లకు బుధవారం సమాచారం అందించింది. -
అదిరిపోయే ఫీచర్: జూమ్ మీటింగ్‌లో ఇక ఆ ఇబ్బంది ఉండదు..
Zoom Notes Feature: వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫామ్ జూమ్ (Zoom) అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ (Video Call) సమయంలో టెక్స్ట్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి, షేర్ చేయడానికి, ఏకకాలంలో ఎడిట్ చేయడానికి అనుమతించే 'నోట్స్' (Notes) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. (Layoffs: భారత్‌లో లేఆఫ్‌లు.. విస్తుగొలుపుతున్న లెక్కలు!) ఈ నోట్స్.. జూమ్ చాట్ బాక్స్ లాగే వీడియో కాల్ స్క్రీన్‌పై ఓ వైపున కనిపిస్తాయి. కాల్లో ఉన్న వ్యక్తులు మీటింగ్ జరుగుతున్నప్పుడు మరొక స్క్రీన్‌కి మారే పని లేకుండా ఈ నోట్స్‌లో రాసుకోవడం, ఎడిట్ వంటివి చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన నోట్స్‌ను జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న వారికి షేర్ చేయవచ్చు. దీని వల్ల ఇతర థర్డ్ పార్టీ డాక్యుమెంట్స్‌ను, టూల్స్‌ను ఆశ్రయించే పని ఉండదు. యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వారు ఇతర కంటెంట్ మేనేజ్మెంట్ టూల్స్‌కు వెళ్లే పని లేకుండా జూమ్ ప్లాట్‌ఫారమ్‌లోనే ఉంటూ మీటింగ్ అజెండాలు, ఇతర నోట్స్ తయారు చేసుకునేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు జూమ్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్ హెడ్ డారిన్ బ్రౌన్ పేర్కొన్నారు. జూమ్ మీటింగ్ ప్రారంభానికి ముందు కానీ, మీటింగ్ జరుగుతున్న సమయంలో కానీ నోట్స్ ద్వారా అజెండా రూపొందించి ఇతరులకు షేర్ చేయవచ్చు. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ నోట్స్‌ను ఇతరులకు షేర్ చేసే వీలు ఉంటుంది. ఇక ఈ నోట్స్‌లో ఫాంట్, స్టైలింగ్, బుల్లెట్లు, టెక్ట్స్ కలర్స్ వంటి ఆప్షన్లు ఉంటాయి. అలాగే వీటికి ఇమేజ్‌లను, లింక్‌లను యాడ్ చేయవచ్చు. ఈ నోట్స్ ఎప్పటికప్పడు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన -
లెక్కల్లో జీరో స్కోర్.. ఇతర పేరెంట్స్‌కు స్ఫూర్తినిస్తున్న తల్లి సందేశం
పిల్లలు పరీక్షల సమయంలోనూ, వాటి ఫలితాలు వచ్చే సమయంలోనూ తెగ ఆందోళన చెందుతుంటారు. మంచి మార్కులకు రాకపోతే తల్లిదండ్రులతో తన్నులు తప్పవని భావిస్తుంటారు. అలాగే తక్కువ మార్కులు వస్తే టీచర్లు తిడతారని ఆందోళన చెందుతుంటారు. మార్కులు ఎలా ఉన్నా విద్యార్థులు తమ ప్రోగ్రస్ రిపోర్టును తల్లిదండ్రులకు చూపించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొందరు విద్యార్థులు ప్రోగ్రస్ రిపోర్టులో మార్కులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు తమ ప్రోగ్రస్ రిపోర్టును నిజాయితీగా తల్లిదండ్రులకు చూపిస్తారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియా ప్లాట్ఫారం X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. దీనిని (@zaibannn) అనే పేరు కలిగిన అకౌంట్లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘నా 6వ తరగతి పాత నోట్‌బుక్ దొరికింది. ఇది చూశాక నాకు స్కూలు రోజుల్లో మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం మరోమారు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు మా అమ్మ స్కోరు తక్కువ వచ్చిన ప్రతీ టెస్టులో పాజిటివ్ మెసేజ్ రాసేది’ అని రాశారు. ఆ పోస్టులోని వివరాల ప్రకారం ఆమె తల్లి మార్కులు రాసివున్న నోట్ బుక్‌లో సైన్ చేయడమే కాకుండా మెసేజ్ కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి ఫొటోలో ‘ఇలాంటి రిజల్టు రావడానికి ధైర్యం కావాలి’ అని రాశారు. రెండవ ఫొటోలోనూ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె తల్లి అలానే రాసింది. వీటిని కలిపి చూసినప్పుడు తల్లిదండ్రులంతా పిల్లలతో ఇలానే వ్యవహరించాలని, అప్పుడేవారు నిరాశ చెందకుండా, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని దీనిని పోస్టు చేసిన యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon — zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023 -
‘ధన’ చరిత్ర! భారతీయ కరెన్సీ నోట్ల విశేషాలు తెలుసుకోండి..
భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్య్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారిన అనంతరం అనేక డినామినేషన్ల నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటివరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏయే భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు, ఉపసంహరణలు ఎప్పుడు జరిగాయి? వంటి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం. వలసరాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే, 1950 జనవరి 26న దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. కానీ అంతకు ముందు నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలను ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రం స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారనాథ్‌లోని లయన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మొదటి నోట్లు ఇవే.. రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో రూ. 2, రూ. 5, రూ.10, రూ.100 కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్లలో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే రూ. 10 నోటు వెనుకవైపు ఉన్న షిప్ మోటిఫ్‌ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయ హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపియేగా మార్చారు. 1954లో రూ. 1,000, రూ. 5,000, రూ.10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లు తిరిగి ప్రవేశపెట్టారు. 1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. రూ. 2, రూ.5 వంటి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా రూ. 100 నోటుపై వ్యవసాయం, తేయాకు ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. మొదటిసారిగా గాంధీ చిత్రం 1960ల ఆరంభంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సైజ్‌లను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ సిరీస్‌ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో రూ.20 నోట్లు, రూ. 1975లో రూ.50 నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం. 1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్ & టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని తెలియజేసేలా రూ. 2 నోటుపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా రూ. 1 నోటుపై ఆయిల్ రిగ్, రూ. 5 నోటుపై ఫార్మ్ మెకనైజేషన్, రూ. 100 నోటుపై హీరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళా రూపాలను ప్రదర్శించేలా రూ. 20 నోటుపై కోణార్క్ ఆలయ చక్రం, రూ. 10 నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ సిరీస్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987 అక్టోబర్‌లో మహాత్మా గాంధీ చిత్రంతో రూ. 500 నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్ లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్‌గా కొనసాగింది. రిప్రోగ్రాఫిక్ టెక్నిక్‌లు అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయ భద్రతా లక్షణాలు బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త 'మహాత్మా గాంధీ సిరీస్'ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్‌మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్ 9న రూ. 1000 నోట్లను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న రూ. 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్‌గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్-షిఫ్టింగ్ ఇంక్‌ను చేర్చారు. మెరుగైన భద్రతా ఫీచర్లు 2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా రూ.100, అంత కంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైడ్ కలర్ షిఫ్టింగ్ మెషిన్ రీడబుల్ మాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణ సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్‌ని నిర్వహించడానికి, అదే క్రమ సంఖ్యతో లోపభూయిష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై “స్టార్ సిరీస్” ప్రవేశపెట్టారు. రూపాయి చిహ్నం (₹) భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని (₹) ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని (₹) లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. నకిలీ నోట్ల బెడదను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్ల భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్-గ్రేడేషన్ చేస్తుంటాయి. భారతదేశంలో అటువంటి అప్-గ్రేడేషన్ 2005లో జరిగింది. తర్వాత 2015లో అధిక డినామినేషన్లపై బ్లీడ్ లైన్లు, ఎక్స్‌ప్లోడింగ్ నంబర్లు వంటి కొన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. రూ. 50, రూ. 20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్‌ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోటును తిరిగి ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ నూతన సిరీస్ ద్రవ్య సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్‌లో రెండో సారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన రూ. 500, రూ. 1,000 డినామినేషన్ల మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం , శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోటును ఒక్కో రంగు, సైజ్‌ల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా 2016 నవంబర్ 8న రూ. 2000 నోటును 2017 ఆగస్టు 23న రూ. 200 నోటును కొత్తగా తీసుకొచ్చారు. కాగా రూ.2000 నోటును 2023 మే 19న చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇదీ చదవండి: Independence Day 2023: స్వాతంత్య్రానికి ముందే వందలాది బ్యాంకులు! ఘనమైన మన బ్యాంకింగ్ చరిత్ర -
టీడీపీ నేతలకు పోలీసు నోటీసులు
ద్వారకాతిరుమల: గోపాలపురం టీడీపీలో గ్రూపు రాజకీయాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. రెండు గ్రూపుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు, ఎటువంటి ఘటనలకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలకు దేవరపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచేందుకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీలోని బలమైన వర్గం మద్దిపాటికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు బహిరంగ సమావేశాలు నిర్వహించింది. దాంతో ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం చంద్రబాబు రాకను పురస్కరించుకుని పార్టీ నేతలు దేవరపల్లి జంక్షన్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రెండు వర్గాల నేతలు, వారి అనుచరులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని పోలీసు నోటీసులో పేర్కొన్నారు. అనుమతి లేకుండా రెండు వర్గాలు బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా.. అవాంఛనీయ ఘటనలు జరిగినా తాము చేపట్టే చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ఆర్బీఐ అప్డేట్.. రూ. 2000 నోట్లు ఎన్ని కోట్లు వెనక్కి రావాలంటే?
RBI Update: రెండు వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ప్రకటన 2023 మే 19న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే చాలా వరకు రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో చేరుతున్నాయి. కాగా దీనికి సంబంధించి ఆర్బీఐ అప్డేట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇంకా బ్యాంకులకు చేరవలసిన మొత్తం రూ. 0.42 లక్షల కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రూ. 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 30 అని గతంలోనే వెల్లడైంది, కాగా ఈ గడువు మళ్ళీ పెరుగుతుందా? లేదా అనేదాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలుగులోకి రాలేదు. కావున తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గడువు లోపల రెండు వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలి. -
నేస్తమా పుస్తకం విందామా!
పుస్తకం హస్తభూషణం అన్నారు.చేతిలో ఉండాల్సిన పుస్తకం ‘ఆడియో బుక్స్’ రూపంలో చెవికి చేరువవుతోంది.వ్యక్తిత్వ వికాసం నుంచి కాల్పనిక సాహిత్యం వరకు పుస్తకాలను ‘ఆడియో బుక్స్’ రూపంలో వినడానికి యూత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్న బెంగళూరుకు చెందిన విరజ, పుస్తకాల విలువ గురించి తెలుసుకొని వాటిపై ప్రేమ పెంచుకున్న భోపాల్‌కు చెందిన చైత్రకు పుస్తకాలకు చేరువ కావడానికి ఒకప్పుడు టైమ్ దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం వీరిద్దరికి మాత్రమే కాదు యువతరంలోని ఎంతోమందికి పుస్తకాలు దగ్గర కావడానికి ‘టైమ్’ అనేది సమస్య కావడం లేదు. దీనికి కారణం... ఆడియో బుక్స్.మిలీనియల్స్, జెన్‌జెడ్ జెనరేషన్‌కు ‘ఆడియో బుక్స్’ హాట్ ఫేవరెట్‌గా మారాయి.‘ఒక పుస్తకం చదవడానికి రకరకాల కారణాల వల్ల నెల రోజులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆడియో బుక్స్ వారానికి ఒకటి వినగలుగుతున్నాను. వినడం పూర్తయిన వెంటనే ఆ పుస్తకానికి సంబంధించిన నోట్స్ రాసుకుంటాను’ అంటుంది విరజ.గూగుల్ ప్లేలో ఆడియో బుక్స్ సెక్షన్ ప్రారంభమైన కొత్తలో యువత అంత దగ్గర కాలేదు. అయితే ఇప్పుడు దృశ్యం మారింది. వారి ప్రధానమైన ఆసక్తులలో ‘గూగుల్ ఆడియో బుక్స్’ కూడా ఒకటి.గూగుల్ ప్లేలో డబ్బు చెల్లించే ఆడియో బుక్స్‌తో పాటు చెల్లించనవసరం లేనివి కూడా ఉన్నాయి.‘ఓకే గూగుల్, హూ ఈజ్ అథర్?’ ‘ఓకే గూగుల్, స్టాప్ ప్లేయింగ్ ఇన్ 20 మినిట్స్’...ఇలాంటి కమాండ్స్ గూగుల్ అసిస్టెంట్‌కు ఇవ్వవచ్చు. గ్లోబల్ ఆడియో బుక్స్ మార్కెట్ లీడర్‌గా ఉన్న ‘ఆడిబుల్’ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత ఆడియో బుక్స్‌కు ఊపు వచ్చింది. రకరకాల వయసుల వారిని దృష్టిలో పెట్టుకొని ‘ఆడిబుల్ ఇండియా’లో వేలాది ఆడియో బుక్స్‌ను రొమాన్స్, థ్రిల్లర్, ఆధ్మాత్మికం, హారర్, డ్రామా జానర్లలో తీసుకువచ్చారు.ఇంగ్లిష్తో సహా హిందీ, మరాఠీ, ఉర్దూ, బెంగాలీ... మొదలైన భాషలలో ఆడియో బుక్స్ ఉన్నాయి.‘ఆడియో బుక్స్ సక్సెస్ కావడానికి కారణం మన మూలాల్లోనే ఉంది. చిన్నప్పుడు కథలను వినేవాళ్లం’ అంటుంది ముంబైకి చెందిన స్మిత. ఒక పుస్తకం విజయాన్ని అంచనా వేసే ప్రమాణాలలో ఆడియో బుక్స్ కూడా చేరాయి. మాతృభాషలో పుస్తకాలు చదవడానికి ఇబ్బంది పడే యువతరానికి ఆడియో బుక్స్ ఆత్మీయనేస్తాలయ్యాయి.‘పాడ్‌కాస్ట్‌తో పాటు ఆడియో బుక్స్‌కు ఆదరణ పెరిగింది’ అంటున్నాడు ‘వన్ బై టు’ మీడియా కో–ఫౌండర్ రాజేష్ తాహిల్.ఫిక్షన్, రొమాన్స్ జానర్స్ కోసం యాపిల్ బుక్ ‘మాడిసన్’ ‘జాక్సన్’ ‘హెలెన్’ అనే డిజిటల్ నేరేటర్లను క్రియేట్ చేసింది.యూఎస్, యూరోపియన్ దేశాలలో పబ్లిషర్స్‌కు ఆడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. మన దేశంలో అలాంటి పరిస్థితి వచ్చినట్లు లేదు. ఒక ఆడియో బుక్కు కనీసం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.‘స్పాటిఫై’ అనగానే గుర్తుకు వచ్చేది సంగీతం. ఆడియో బుక్స్ ఆదరణను పసిగట్టిన ఈ డిజిటల్ మ్యూజిక్ సర్వీస్ యూఎస్‌తో పాటు నాలుగు దేశాల్లో ఆడియో బుక్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మూడు లక్షల ఆడియో బుక్స్‌ను తీసుకువచ్చిన ‘స్పాటిఫై’ యూజర్ల కోసం ‘ఆడియో కామెంట్’ తీసుకురానుంది.ఆడియో బుక్ ఇండస్ట్రీ ఊపందుకోవడాన్ని గమనించిన పబ్లిషర్లు రానున్న రోజుల్లో ఆడియో బుక్స్ స్పేస్‌ను పెంచాలనుకుంటున్నారు. క్లాసిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.‘గతంతో పోల్చితే ఆడియో బుక్స్ వినడానికి వెచ్చిస్తున్న టైమ్ పెరిగింది’ అంటున్నాడు ‘స్టోరీ టెల్ ఇండియా’ కంట్రీ మేనేజర్ యోగేష్ దశరథ్.ఆడియో బుక్స్ యూత్‌ను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణాలలో, బారెడు క్యూలలో నిలబడిన సందర్భాలలో కూడా వాటిని వినే అవకాశం ఉండడం. కొందరైతే వ్యాయామాలు చేస్తూ కూడా ఆడియో బుక్స్ వింటున్నారు.‘ఆడియో బుక్స్ వల్ల పుస్తకం చదివే దృశ్యం అదృశ్యం కానుందా?’ అనే ప్రశ్నకు ఇంజనీరింగ్ స్టూడెంట్ సౌమ్య మాటల్లో జవాబు దొరుకుతుంది.‘పుస్తకం చదవడం అంటేనే నాకు ఇష్టం. అంతమాత్రాన ఆడియో బుక్స్‌కు దూరం కాలేదు. సమయ సందర్భాలను బట్టి చదవాలా, వినాలా అనేదాన్ని ఎంచుకుంటాను’ అంటుంది సౌమ్య. ఆడియో బుక్ రీడ్ బై సెలబ్రిటీ ఆడియో బుక్స్ విజయంలో పుస్తకంలోని కంటెంట్‌తో పాటు నేరేటర్ ప్రతిభ కూడా ఆధారపడి ఉంటుంది. వినే కొద్దీ వినాలనుకునే గొంతులు ఆడియో బుక్స్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.‘ఆడియో బుక్ రీడ్బై సెలబ్రిటీస్’ ధోరణి మన దేశంలోనూ పెరగనుంది. ఆడియో బుక్ రీడింగ్‌లో బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మంచి పేరు తెచ్చుకుంది. వుడీ ఎలెన్ ‘కౌంట్ డ్రాకులా’తో పాటు ఎన్నో పుస్తకాలు ఆమె స్వరంలో యువత మంత్రముగ్ధులై విన్నారు.