రూ.10.. పరేషాన్‌..! | 10 rupee currency notes troubling | Sakshi
Sakshi News home page

రూ.10.. పరేషాన్‌..!

Published Sun, Oct 13 2024 7:41 AM | Last Updated on Sun, Oct 13 2024 8:54 AM

10 rupee currency notes troubling

మార్కెట్లో తగ్గిన కరెన్సీ నోట్ల చెలామణి

ఇబ్బందుల్లో వ్యాపారులు, ప్రజలు 

నెన్నెల: మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం గగనంగా మారింది. దీంతో అటు వ్యాపారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ కొనుగోళ్లకు 1, 2, 5, 10 రూపాయల నాణేలు గతంలో చాలా చెలామణిలో ఉండేవి. ధరల పెరుగుదల కారణంగా 1, 2, 5 రూపాయల నాణేలు ఉన్నా 5, 10 రూపాయల నాణేల వినియోగం పెరి గింది. ప్రస్తుతం ఆయా నాణేలతోపాటు రూ.10 నో ట్ల చెలామణి కూడా భారీగా తగ్గింది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10కి మూడు అని చెబుతున్నారు. దీంతో కి రాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, బస్సు, ఆటో చార్జీల్లో రూ.10 కరెన్సీనోటుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తు తం రూ.10 నోటు మార్కెట్‌లో అందుబాటులో లేక వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు.

ఆన్‌లైన్‌ చెల్లింపులు
కరోనా తర్వాత డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటుపడ్డారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తు వు కొనుగోలు చేయాలన్నా డిజిటల్‌ చెల్లింపులు అనే పరిస్థితి నెలకొంది. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో, చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్‌ రూపంలో సులభతర చెల్లింపులకు అనుమతిస్తున్నారు. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదా రులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్‌లో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండడం గమనార్హం. 

ఎక్కడ ఆగిందో..?
రూ.10 నోటు మార్కెట్‌లో చెలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వినియోగదారులు చిరు వ్యాపారు ల వద్ద వస్తువులు కొనుగోలు చేసినప్పడు రూ.100నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు గా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదా రుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్‌ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. చిన్నమొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్‌లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు.  

నోట్ల కొరత వాస్తవమే
రూ.10 నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వు బ్యాంకు నుంచి రావడం లేదు. రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10 నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి.    
 – గోపికృష్ణ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఆవుడం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement