Ten rupees
-
పదిలమే.. ఆ నాణెం నాణ్యమైనదేనని ప్రచారం
గత కొంతకాలంగా నగరంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలు, మెడికల్ షాపులు ఇతర వ్యాపార వేదికల్లో ‘పది రూపాయల నాణెం చెల్లబడును, 10 రూపాయల కాయిన్ ఇవ్వబడును–తీసుకోబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. పది రూపాయల నాణెం పదిలమే, నిత్య జీవన లావాదేవీల్లో భాగమే, ఈ కాయిన్ నకిలీ కాదు, బ్యాన్ చేయలేదు అని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పది రూపాయల నాణెంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్ల ఫలితంగా పది రూపాయల కాయిన్ కనిపిస్తే చాలు.. ఇది చెల్లదు, ఇది బ్యాన్ అయ్యిందని నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రూపాయల కాయిన్ నిషేధించలేదని, దీనిని నిరాకరించినవారు చట్ట రిత్యా చర్యార్హులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. సదరు బ్యాంకులకు కూడా దీనిపై అవగాహన కల్పిపంచాలని సూచించింది. 2008 ముద్రణ నకిలీదని పుకార్లు.. దేశంలో 10 రూపాయల నాణేలను 2005లో మొదటిసారి ముద్రించారు. అయితే 2008లో రెండో సారి మళ్లీ ముద్రించిన నాణెం విషయంలోనే గందరగోళం ఏర్పడింది. అనుకోకుండా ఇవి నకిలీవని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పుకార్లతో వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు ఈ 10 రూపాయల కాయిన్‌పై విముఖత ప్రదర్శించారు. 2016 జులైలో భారతదేశంలోని కొంతమంది దుకాణదారులు రూ.10 నాణేన్ని పూర్తిగా స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు నివేదించబడింది.2011లో మూడో సారి, చివరగా 2019లో మరో ముద్రణ చేపట్టినప్పటికీ 2008లో ముద్రించిన కాయిన్ పై వచి్చన వదంతులు మాత్రం తొలగట్లేడు. ఈ సమస్యపై ఆర్బీఐ ఇచి్చన సూచన మేరకు నగరంలోని పలు బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాయి. వీధుల్లోని దుకాణాలు మొదలు, షాపింగ్ మాల్స్ వరకూ అవగాహన కల్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం దీనిపై పాజిటీవ్‌గా ప్రచారం చేస్తున్నారు. -
రూ.10.. పరేషాన్..!
నెన్నెల: మార్కెట్లో రూ.10 నోటు కనిపించడం గగనంగా మారింది. దీంతో అటు వ్యాపారులు.. ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాధారణ కొనుగోళ్లకు 1, 2, 5, 10 రూపాయల నాణేలు గతంలో చాలా చెలామణిలో ఉండేవి. ధరల పెరుగుదల కారణంగా 1, 2, 5 రూపాయల నాణేలు ఉన్నా 5, 10 రూపాయల నాణేల వినియోగం పెరి గింది. ప్రస్తుతం ఆయా నాణేలతోపాటు రూ.10 నో ట్ల చెలామణి కూడా భారీగా తగ్గింది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10కి మూడు అని చెబుతున్నారు. దీంతో కి రాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, బస్సు, ఆటో చార్జీల్లో రూ.10 కరెన్సీనోటుకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తు తం రూ.10 నోటు మార్కెట్లో అందుబాటులో లేక వ్యాపారులు ఇక్కట్లకు గురవుతున్నారు.ఆన్లైన్ చెల్లింపులుకరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నా యి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తు వు కొనుగోలు చేయాలన్నా డిజిటల్ చెల్లింపులు అనే పరిస్థితి నెలకొంది. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో, చిన్నపాటి చెల్లింపులకు ఫోన్‌పే, గూగుల్‌పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులకు అనుమతిస్తున్నారు. దీంతో రూ.5, రూ.10 లావాదేవీలకు కూడా వినియోగదా రులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10 నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండడం గమనార్హం. ఎక్కడ ఆగిందో..?రూ.10 నోటు మార్కెట్లో చెలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. వినియోగదారులు చిరు వ్యాపారు ల వద్ద వస్తువులు కొనుగోలు చేసినప్పడు రూ.100నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2 చెల్లింపులకు బదులు గా చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి ఇచ్చేవారు. కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదా రుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండడమే ఈ పరిస్థితికి కారణం. చిన్నమొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నోట్ల కొరత వాస్తవమేరూ.10 నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వు బ్యాంకు నుంచి రావడం లేదు. రూ.20, రూ.50, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10 నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి. – గోపికృష్ణ,తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్, ఆవుడం -
10 Rupee Biryani: రూ.10కే కడుపు నిండా భోజనం... రూ.10కే బిర్యానీ కూడా..
రూ.10కే కడుపు నిండా భోజనం. ప్రస్తుత రోజుల్లో ఇది వినడానికి కొంచెం ఆశ్చరంగానే ఉంటుంది. ఎందుకంటే హోటల్లో ఓ ప్లేటు భోజనం తినాలంటే రూ.100కు పైనే అవుతుంది. అంత మొత్తం చెల్లించుకోలేని పేద రోగుల సహాయకులకు వాల్తేర్ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ చైర్మన్ మక్సూద్ అహ్మద్ సహకారంతో.. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ రూ.10కే సంతృప్తికర భోజనం అందిస్తోంది. ఎంతో మంది అనాథలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పించిన ఈ సంస్థ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే నానుడిని నమ్ముతూ.. ఎవరూ ఆకలితో ఉండకూడదన్న భావనతో ముందుకు సాగుతోంది. విశాఖపట్నం: అభాగ్యుల సేవలో అలుపన్నదే లేకుండా పయనిస్తోంది స్వామి వివేకానంద సంస్థ. కరోనా సమయంలో కూడా కేజీహెచ్‌లోని రోగుల సహాయకులు, జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది, వివిధ రైతుబజార్లలోని స్టాళ్లు నడుపుకునే రైతులకు ఆహారం అందజేసింది. వివేకానంద వృద్ధాశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ పర్యవేక్షణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. కాగా.. ఘోషాస్పత్రికి ప్రసవాల నిమిత్తం దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నట్లు సంస్థ గుర్తించింది. రోగుల సహాయకులకు అతి తక్కువ ధరకే ఆహారం అందించాలని సంకల్పించింది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రూ.10కే భోజనం అందించే బృహత్తక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాల్తేరు రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ చైర్మన్ మక్సూద్ అహ్మద్ సహకారంతో 150 రోజులకు పైగా ఘోషాస్పత్రిలో రోగుల సహాయకులకు ఆహారం అందజేస్తోంది. ‘అమృతాహార్’పేరిట అందిస్తున్న ఈ భోజనం నిజంగానే అమృతంలా ఉందని రోగుల సహాయకులు కొనియాడుతున్నారు. తొలుత ఇక్కడ రోజుకు 100 మందికి ఆహారం అందించేవారు. క్రమంగా ఈ సంఖ్య పెరగడంతో 120కి పెంచారు. ఇంకా అవసరం అనుకుంటే ఈ సంఖ్యను మరింత పెంచుతామని వివేకానంద సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు తెలిపారు. రోగుల సహాయకులు హోటళ్లలో అధిక ధరలు చెల్లించి ఆహారం కొనుగోలు చేయలేకపోవడం, ఇక్కడ క్యాంటీన్ సదుపాయం కూడా లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు ముందుకొస్తే.. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా అందజేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రుచిగా.. శుచిగా.. అన్నార్తుల కోసం తయారు చేసే ఆహారం రుచిగా, శుచిగా ఉండాలన్నది సంస్థ లక్ష్యం. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘అమ్మవంట’నూకాలమ్మ పర్యవేక్షణలో వివేకానంద సేవా సంస్థకు చెందిన మహిళలు వంట చేస్తున్నారు. వంట చేసే ప్రాంతంలోనే హరినామ సంకీర్తన చేస్తూ.. భోజనాన్ని శుభ్రంగా ప్యాక్ చేస్తారు. ఆటోలో ఘోషాస్పత్రికి తీసుకొచ్చి రోగుల సహాయకులకు అందజేస్తున్నారు. ప్రతి 50 రోజులకు ఓసారి రూ.10కే బిర్యానీ రోగుల సహాయకులకు రుచి, శుచికరమైన భోజనం అందించేందుకు మంచి రకం బియ్యం, నూనె వాడుతున్నాం. గ్యాస్‌తో కాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం. ఆ పొయ్యి ఖరీదు రూ.1.80 లక్షలు. ఈ కార్యక్రమానికి డి.సత్యనారాయణ, సీహెచ్ పోతురాజు, ఉమాదేవి, రాణి, సుజాత, భవానీ, నాగమణి, ర త్న, అచ్యుత, కనకమహాలక్ష్మి, డి.సత్యనారాయణ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ప్రతీ 50 రోజులకు ఒకసారి రోగు ల సహాయకులకు రూ.10కే బిర్యా నీ అందజేస్తున్నాం. – సూరాడ అప్పారావు, భోజనం బాగుంది మా పాప డెలివరీ కోసం ఘోషాస్పత్రికి వచ్చాం. బయట మూడు పూటలా భోజనం కొనుక్కుని తినలేకపోతున్న సమయంలో.. ఇక్కడ రూ.10కే ఇస్తారని తెలిసిన వాళ్లు చెప్పారు. రెండు రోజులుగా ఇక్కడికి వచ్చి భోజనం తీసుకెళ్తున్నాను. భోజనం శుభ్రంగా.. ఇంట్లో చేసినట్లే ఉంది. నిర్వాహకులకు ధన్యవాదాలు. – పద్మ, సింహాచలం తక్కువ ధరకే మంచి భోజనం మా అమ్మాయి ప్రసవం కోసం ఈ ఆస్పత్రికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం ఇస్తున్నారని తెలిసి రెండు రోజులుగా తీసుకుంటున్నాను. భోజనం చాలా బాగుంది. ఈ రోజుల్లో పది రూపాయలకు ఏం వస్తుంది? ఇంత చక్కటి భోజనం తక్కువ ధరకే ఇస్తున్న వారు ధన్యులు. – దానీలు, జెండాచెట్టువీధి అన్నీ ప్రత్యేకమైన ప్యాక్‌లో.. వీలున్నప్పుడల్లా ఇక్కడ భోజనం చేస్తుంటాను. చాలా బాగుంటుంది. చక్కని ప్యాకింగ్‌లో భోజనం తీసుకొచ్చి అందజేస్తారు. పేషెంట్ల సహాయకులు ఇక్కడే ఏ చెట్టు కిందో కూర్చుని భోజనం చేస్తారు. అన్నం, కూరలు, సాంబారు అన్నీ ప్రత్యేకంగా ప్యాక్ చేయటం వల్ల సులువుగా శుభ్రం చేసుకునే వీలుంది. –డి.గణేష్, స్వీపర్, ఘోషాస్పత్రి పుణ్యమంతా వీళ్లదే.. మా మనవరాలు డెలివరీకి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కే భోజనం పెడుతున్నారని తెలుసుకుని వచ్చాను. భోజనం చాలా బాగుంది. పుణ్యమంతా వీళ్లదే. ఉదయం, రాత్రి కూడా తక్కువ ధరకి ఆహారం ఇస్తే బాగుంటుంది. – నక్కా సూరి అప్పాయమ్మ, మధురవాడ రూ.10కే భోజనం.. గొప్ప విషయం మాది దిబ్బపాలెం. పాప డెలివరీ కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ రూ.10కు భోజనం తీసుకుంటున్నాం. చాలా బాగుంది. రుచిగానే కాదు శుభ్రంగానూ ఉంది. పది రూపాయలకే ఇంత మంచి భోజనం పెడుతున్నారంటే గొప్ప విషయమే. – వి. గౌరీ, దిబ్బపాలెం పేదలకు ఉపయోగకరం మా కోడలి పురిటికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడంతా ఏం తెలియదు. భోజనానికి ఇబ్బంది పడుతుంటే ఎవరో ఇక్కడ రూ.10కే మంచి భోజనం పెడుతున్నారని చెప్పారు. రెండు రోజులుగా ఈ భోజనం తింటున్నాం. చాలా బాగుంది. పేదలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. –పిరిడి అప్పలనాయుడు, ఎస్.కోట -
రూ.10 అడిగితే ప్రాణం తీశాడు
ఛత్రా(జార్ఖండ్): కేవలం రూ.10 అడిగిన కుమారుడి పట్ల తండ్రి కాలయముడైన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఉన్న తండ్రి.. కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఛత్రా జిల్లాలోని వశిష్ట్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేలీబర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్టేషన్ ఇన్చార్జ్ గులామ్ సర్వర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల బిలేశ్ భుయాన్ తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు కుమార్‌తో కలిసి జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకే భుయాన్, అతని భార్య ఇద్ద రూ పూటుగా తాగి ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. అదే సమయంలో ఓ పది రూపాయలు ఇవ్వు నాన్నా అంటూ బాలుడు పప్పు కోరాడు. అప్పటికే కోపంతో ఉన్న భుయాన్ మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. తీవ్ర ఆవేశంతో కుమారుడిని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అదే సమయానికి ఇటుక బట్టీలో పనిచేసే కూతురు పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తమ్ముడి మరణం చూసి పొరుగువారిని కేకలేసి పిలిచింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే తండ్రిని అరెస్ట్‌చేశారు. -
రూ.10కే వెజ్ బిర్యానీ.. మన హైదరాబాద్‌లోనే ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మార్కెట్లో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లలో సైతం కనీస ప్లేట్ ధర రూ.30. మీల్స్ అయితే రూ.70 నుంచి 100కు పైనే. ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్‌లో కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ అందిస్తున్నాడు. గతంలో అంబర్‌పేట్‌లో నడిపే వాడినని తెలిపాడు. అక్కడ తన కుటుంబ సభ్యులకు అప్పగించి దేవేందర్‌నగర్‌లో బిర్యాని సెంటర్ నడుపుతున్నానని పేర్కొన్నాడు. వచ్చే కొద్దిపాటి లాభాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు మహేష్ తెలిపాడు. ప్రతిరోజు 70 నుంచి 100 ప్లేట్ల వరకు అమ్ముతున్నాడు. అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్ బిర్యానీ బోర్డు చూసి ఒక పట్టు పట్టి వెళ్లిపోతున్నారు. -
విశాల్ ఐ లవ్ యూ.. ప్లీజ్ నన్ను తీసుకెళ్లు నీ కుసుమ్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్ మొత్తం ఫోన్లోనే సందేశాలు పంపుతున్నారు. లవ్ ప్రపోజల్ నుంచి పెళ్లి వేడుక వరకు అంతా స్మార్ట్ ఫోన్లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పటిలా గ్రీటింగ్ కార్డు, పోస్టు కార్డుల కాలం చెల్లిపోయింది. ఇలాంటి తరుణంలో తన వద్ద ఫోన్ అందుబాటులో లేని ఓ యువతి రూ.10 నోటుపై ప్రేమ రాయబారం పంపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పది రూపాయల నోటుపై.. "విశాల్ నా పెళ్లి ఏప్రిల్ 26న ఫిక్స్ అయ్యింది. మనం లేచిపోదాం. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కుసుమ్" రాసి ఉంది. కుసుమ్ అనే మహిళ తన లవర్ కోసం ఇలా రాసింది. కాగా, కుసుమ్, విశాల్ ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. కుసుమ్ అనే యువతి.. విశాల్‌ని ప్రేమిస్తోంది. కానీ, ఆమె తల్లిదండ్రులు మాత్రం కుసుమ్‌ను ఇంట్లో బంధించి.. తన దగ్గర ఫోన్ లేకుండా చేసి మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన ఆమె వివాహానికి డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఎలాగైనా విశాల్‌కు పెళ్లి విషయం తెలియాలని కుసుమ్ ఇలా చేసింది. వారిద్దరూ కలిసి బతికేందుకు విశాల్‌తో లేచిపోవడానికి కూడా రెడీ అయినట్టు నోటుపై క్లియర్‌గా రాసింది. Twitter show your power... 26th April ke Pehle kusum ka Yeh message vishal tak pahuchana hai.. Doh pyaar karne wale ko milana hai.. Please amplify n tag all vishal you know.. 😂 pic.twitter.com/NFbJP7DiUK — Crime Master Gogo 🇮🇳 (@vipul2777) April 18, 2022 అయితే, ఇది నిజంగానే రాశారా..? లేక ఎవరైనా సరదాగా రాశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇలా కరెన్సీ నోట్లపై రాతలు రాయడం భారతీయ చట్టాల ప్రకారం నేరం. కాబట్టి ఇలాంటి రాతలు రాయకపోవడమే మంచిదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం.. "విశాల్ సరైన సమయానికి చేరుకుంటే.. ఆమె అతనితో పారిపోతుందా?" కామెంట్స్ చేశాడు. Lets do it! Vishal your dulhaniya is waiting for you! https://t.co/P283jaF2T3 — Chinten Shah (@chintenshah) April 20, 2022 -
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది. ►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది. ►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే.. ►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం. ►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ. -
డబ్బా ఇసుక రూ.10
మంథని: ఇసుక బంగారమైంది. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో సోమవారం డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతానికి కొత్త ఇసుక అవసరం. గద్దెల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు ఇసుక వినియోగిస్తారు. గోదావరిలో స్నానం చేసి నదిలో కాసింత ఇసుకను భక్తులు ఏటా తీసుకెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని వద్ద గోదావరి నిండుగా ఉండి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఇదే అదనుగా గోదావరి అవతలి వైపు మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి కొంతమంది సంచుల్లో ఇసుకను తీసుకొచ్చి స్నాన ఘట్ల వద్ద ఇలా విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు కొనుక్కుని వెళ్లారు. -
రూ.10 కే గ్రీవెన్స్ మీల్స్
సీతంపేట : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ చొరవతో ప్రతి సోమవారం గిరిజన దర్బార్‌కు వచ్చే గిరిజనులకు రూ.10కే మధ్యాహ్న భోజనం అందించనున్నారు. సుదూర ప్రాంతాలు, కొండలపై నుంచి గ్రీవెన్స్‌కు రానున్న గిరిజనులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీనిలో భాగంగా ఐటీడీఏ పీఓ శివశంకర్ గ్రీవెన్స్ మీల్స్ పథకాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం భోజనం ఖరీదు రూ.30 కాగా, ఇందులో ఐటీడీఏ రూ.20 భరిస్తుందని తెలిపారు. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఐటీడీఏ పరిధిలో 20 మండలాల నుంచి వచ్చే అర్జీదారులు లబ్ధిపొందేందుకు భోజనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభం రోజున సుమారు 300ల మందికి భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ఎల్.ఆనందరావు, డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, ఈఈ అశోక్, డీఈ సింహాచలం, ఐడబ్ల్యూఎంపీ ఏపీడీ డోల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
10రూపాయలకే రెండు పూటలా భోజనం..
సాక్షి, హైదరాబాద్ : జబ్బు చేసి ఆస్పత్రి పాలైన వారి పరిస్థితి ఒకలా ఉంటే... వారిని పరామర్శించడానికి వచ్చే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. దూర ప్రాంతం నుంచి వచ్చేవారి పరిస్థితి ఇంకా దారుణం. ఒక్కరోజులో చూసి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తినడానికి, ఉండటానికి కూడా ఇబ్బందే. పట్నంలో పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నట్లు ఉంటాయి. అలాంటి వారి పట్ల ఆత్మీయ బంధువవుతుంది ‘సేవా భారతి ట్రస్ట్’. రోగులకు, వారితో పాటు వచ్చే బంధువులకు కూడా రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టడమే కాక ఉండటానికి వసతి కల్పిస్తుంది ఈ ట్రస్ట్. ఇదంతా కూడా కేవలం ‘పది రూపాయలకే’. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దూర ప్రాంతం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు అలానే వారితో పాటు వచ్చే కుటుంబసభ్యులకు పట్టెడన్నం పెట్టి ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ విషయం గురించి ‘సేవా భారతి ట్రస్ట్’ సెక్రటరీ నర్సింహమూర్తి ‘మొదట మేము కేవలం భోజన సదుపాయం మాత్రమే కల్పించే వాళ్లం. కానీ 2013లో గాంధీ ఆస్పత్రి సుపరిండెంట్ ‘రోగుల కోసం వచ్చే వారి కోసం వసతి కల్పించమ’ని కోరాడు. దాంతో మేము ఈ వసతి గృహాన్ని నిర్మించాము. కేవలం మూడు నెలల వ్యవధిలోనే మేము ఈ భవనాన్ని నిర్మించాం. దీన్ని నిర్మించిన కొత్తలో రోజుకు కేవలం పది మంది మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజుకు ఇక్కడ దాదాపు రెండు వందల మంది వరకూ బస చేస్తున్నారు. వారానికి దాదాపు 7 వేల మందికి బస కల్పిస్తున్నామని’ చెప్పారు. -
కోఠిలో భారీగా కొత్త రూ.10 నోట్లు పట్టివేత
-
రూ.10 ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో పది రూపాయల ప్లాస్టిక్ నోట్లు మనకు దర్శనమివ్వనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 ప్లాస్టిక్ నోట్ల ప్రింట్కు తన అనుమతిని ఆర్బీఐకి చేరవేసింది. ఆర్బీఐ దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్ల వాడకంపై ట్రయల్స్ నిర్వహించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ లోక్‌సభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మనం ఉపయోగించే నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. -
ప్రాణం తీసిన రూ. 10 కోసం
తాగిన మైకంలో బండరాయితో కొట్టి చంపిన తోటి కూలీ శ్రీరాంపూర్: పది రూపాయల కోసం జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి దొరగారిపల్లెలో శనివారంరాత్రి జరిగింది. గ్రామపరిధిలోని మన్నెవాడకు చెందిన కుమ్మరి పోశం(30), కొడిపె లక్ష్మణ్(25) కూలీ పనులు చేస్తుంటారు. శనివారం ఇద్దరు వేర్వేరుగా గుడుంబా తాగి, పాన్‌షాప్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోశంను ఉద్దేశించి కొడిపె లక్ష్మణ్ ‘పది రూపాయలు ఇవ్వరా’ అంటూ అడిగాడు. ‘ఇంతలేనోనివి నువ్వు నన్ను పది రూపాయలు అడిగేటోనివా?, ఇంకా రా అంటవా..’ అంటూ పోశం ప్రశ్నిం చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి లక్ష్మణ్‌ను పోశం కింద పడేసి కొట్టాడు. తర్వాత తేరుకున్న లక్ష్మణ్ కోపంతో బండరాయి తీసుకొని పోశం ఛాతీపై బలంగా కొట్టగా, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. -
ప్లాట్‌ఫాం టికెట్ పది రూపాయలు
సాక్షి, చెన్నై: రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచారు. రూ. ఐదుగా ఉన్న ఆ ధర ఇక, రూ. పదిగా నిర్ణయించారు. ప్లాట్ ఫాం టికెట్లు లేకుంటే రూ. వెయ్యి జరిమాన విధించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది. అలాగే, 120 రోజులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా అమల్లోకి రానున్నది. రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్లు కొనుగోలు చేసే వాళ్లు అరుదే. ప్రధాన రైల్వేస్టేషన్లలో అయితే, ఎక్కడ టీసీలు పట్టుకుంటారో నన్న భయంతో కొనుగోలు చేసే వాళ్లు కొందరు ఉంటారు. తమ వాళ్లను ఆహ్వానించేందుకు, వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు బంధు మిత్రులు రావడం సహజం. అయితే, వీరిలో ఎక్కువ శాతం మంది ప్లాట్ ఫాం టికెట్లను కొనుగోలు చేయడం లేదన్న వాదన ఉంది. *ఐదు పెట్టి ఫ్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేయకుండా, దర్జాగా వచ్చి ఆహ్వానాలు, డ్కొలు పలికి వెళ్లే వాళ్ల భరతం పట్టేందుకు రైల్వే వర్గాలు సిద్ధం అయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా *ఐదు ఉన్న ప్లాట్ ఫాం టికెట్టు ధర రూ. పదికి పెంచారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే అధికారులు సిద్ధం అయ్యారు. రూ. వెయ్యి జరిమాన : ఇక రూ. పది పెట్టి ఫ్లాట్ ఫాం టికెట్టు కొనుగోలు చేయకుంటే, రూ. వెయ్యి జరిమానా కట్టాల్సి వస్తుందన్న హెచ్చరికల్ని దక్షిణ రైల్వే వర్గాలు చేశాయి. రైల్వే స్టేషన్లలోని ఫ్లాట్ ఫాంల మీద రద్దీని క్రమబద్ధీకరించే విధంగా ప్లాట్ ఫాం టికెట్లకు సమయాన్ని సైతం తగ్గించారు. ఇది వరకు మూడు గంటలు సమయం కేటాయించగా, ఇక, ఒక సారి కొనుగోలు చేసిన ప్లాట్‌ఫాం టికెట్టు రెండు గంటల పాటుగా మాత్రమే ఉపయోగ పడుతుంది. ఒక వేళ రైళ్ల రాక పోకల్లో జాప్యం నెలకొన్న పక్షంలో, ఇచ్చిన సమయం ముగిసిన పక్షంలో మరో ప్లాట్‌ఫాం టికెట్టు కొనాల్సిందే. రాష్ర్టంలోని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆగే ప్రతి రైల్వే స్టేషన్లలో ఇక ఫ్లాట్ ఫాం టికెట్‌ను కొనుగోలు చేయాల్సిందే. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్లలో ప్లాట్ ఫాం టికెట్ల కన్నా, ఎలక్ట్రిక్ రైలు టికెట్లను చూపించి తప్పించుకునే వాళ్లే ఎక్కువ. ఇక, ఎలక్ట్రిక్ రైళ్ల టికెట్లు సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్ల ఫ్లాట్ ఫారాల్లో పనిచేయవని అధికారులు ప్రకటించారు. అలాగే, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల టికెట్లను పెట్టుకుని ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కేందుకు యత్నించినా జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్లాట్ ఫాం టికెట్ కొత్త ధరల అమల్లోకి వస్తుందని, టికెట్ లేకుంటే ఇది వరకు *350 విధించే వాళ్లమని, ఇక రూ. వెయ్యి జరిమానా విధించ బోతున్నామని ఓ అధికారి పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్లాట్ ఫాం టికెట్టు తప్పని సరి కానున్నడంతో, ఇక టీసీ,టీటీఆర్, స్టేషన్ల అధికారులకు చేతి నిండా పనే. ముందస్తు రిజర్వేషన్: ఇది వరకు 60 రోజులకు ముందుగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక, 120 రోజులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని రైల్వే యంత్రాంగం కల్పించి ఉన్నది. ఈ విధానం కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. అలాగే, ఇది వరకు బెర్తుల రిజర్వేషన్లలో సీనియర్ సిటిజన్‌కు కింది భాగంలో రెండు సీట్లు కేటాయించే వాళ్లు. ఇక నాలుగు సీట్లను కేటాయించనున్నడం విశేషం.