గత కొంతకాలంగా నగరంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలు, మెడికల్ షాపులు ఇతర వ్యాపార వేదికల్లో ‘పది రూపాయల నాణెం చెల్లబడును, 10 రూపాయల కాయిన్ ఇవ్వబడును–తీసుకోబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. పది రూపాయల నాణెం పదిలమే, నిత్య జీవన లావాదేవీల్లో భాగమే, ఈ కాయిన్ నకిలీ కాదు, బ్యాన్ చేయలేదు అని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పది రూపాయల నాణెంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్ల ఫలితంగా పది రూపాయల కాయిన్ కనిపిస్తే చాలు.. ఇది చెల్లదు, ఇది బ్యాన్ అయ్యిందని నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రూపాయల కాయిన్ నిషేధించలేదని, దీనిని నిరాకరించినవారు చట్ట రిత్యా చర్యార్హులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. సదరు బ్యాంకులకు కూడా దీనిపై అవగాహన కల్పిపంచాలని సూచించింది.
2008 ముద్రణ నకిలీదని పుకార్లు..
దేశంలో 10 రూపాయల నాణేలను 2005లో మొదటిసారి ముద్రించారు. అయితే 2008లో రెండో సారి మళ్లీ ముద్రించిన నాణెం విషయంలోనే గందరగోళం ఏర్పడింది. అనుకోకుండా ఇవి నకిలీవని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పుకార్లతో వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు ఈ 10 రూపాయల కాయిన్‌పై విముఖత ప్రదర్శించారు. 2016 జులైలో భారతదేశంలోని కొంతమంది దుకాణదారులు రూ.10 నాణేన్ని పూర్తిగా స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు నివేదించబడింది.
2011లో మూడో సారి, చివరగా 2019లో మరో ముద్రణ చేపట్టినప్పటికీ 2008లో ముద్రించిన కాయిన్ పై వచి్చన వదంతులు మాత్రం తొలగట్లేడు. ఈ సమస్యపై ఆర్‌బీఐ ఇచి్చన సూచన మేరకు నగరంలోని పలు బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాయి. వీధుల్లోని దుకాణాలు మొదలు, షాపింగ్ మాల్స్ వరకూ అవగాహన కల్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం దీనిపై పాజిటీవ్‌గా ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment