Awareness campaign
-
పదిలమే.. ఆ నాణెం నాణ్యమైనదేనని ప్రచారం
గత కొంతకాలంగా నగరంలోని షాపింగ్ మాల్స్, దుకాణాలు, మెడికల్ షాపులు ఇతర వ్యాపార వేదికల్లో ‘పది రూపాయల నాణెం చెల్లబడును, 10 రూపాయల కాయిన్ ఇవ్వబడును–తీసుకోబడును’ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. పది రూపాయల నాణెం పదిలమే, నిత్య జీవన లావాదేవీల్లో భాగమే, ఈ కాయిన్ నకిలీ కాదు, బ్యాన్ చేయలేదు అని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ పది రూపాయల నాణెంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్ల ఫలితంగా పది రూపాయల కాయిన్ కనిపిస్తే చాలు.. ఇది చెల్లదు, ఇది బ్యాన్ అయ్యిందని నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది రూపాయల కాయిన్ నిషేధించలేదని, దీనిని నిరాకరించినవారు చట్ట రిత్యా చర్యార్హులని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా ప్రకటించింది. సదరు బ్యాంకులకు కూడా దీనిపై అవగాహన కల్పిపంచాలని సూచించింది. 2008 ముద్రణ నకిలీదని పుకార్లు.. దేశంలో 10 రూపాయల నాణేలను 2005లో మొదటిసారి ముద్రించారు. అయితే 2008లో రెండో సారి మళ్లీ ముద్రించిన నాణెం విషయంలోనే గందరగోళం ఏర్పడింది. అనుకోకుండా ఇవి నకిలీవని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పుకార్లతో వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు ఈ 10 రూపాయల కాయిన్‌పై విముఖత ప్రదర్శించారు. 2016 జులైలో భారతదేశంలోని కొంతమంది దుకాణదారులు రూ.10 నాణేన్ని పూర్తిగా స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు నివేదించబడింది.2011లో మూడో సారి, చివరగా 2019లో మరో ముద్రణ చేపట్టినప్పటికీ 2008లో ముద్రించిన కాయిన్ పై వచి్చన వదంతులు మాత్రం తొలగట్లేడు. ఈ సమస్యపై ఆర్బీఐ ఇచి్చన సూచన మేరకు నగరంలోని పలు బ్యాంకులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాయి. వీధుల్లోని దుకాణాలు మొదలు, షాపింగ్ మాల్స్ వరకూ అవగాహన కల్పిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు సైతం దీనిపై పాజిటీవ్‌గా ప్రచారం చేస్తున్నారు. -
గ్రామీణుల్లో ఆరోగ్య బీమాపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్) సీఈవో ఆనంద్ రాయ్ తెలిపారు.విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 28వ తేదీన జాతీయ బీమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య సంరక్షణ ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని విశ్వసిస్తూ ఐఆర్డీఏ మిషన్ ‘2047 నాటికి అందరికీ బీమా’కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో బీమా వ్యాప్తిని పెంపొందించడానికి ఈ అవగాహన డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశామని, ఈ డ్రైవ్‌లో కమ్యూనిటీలకు అవగాహన కల్పించే సమాచార కరపత్రాలతో పాటు సెషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాల్లోని 250 గ్రామాలు, పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, మొత్తం 50 రోజుల పాటు సాగే అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్రంలో కనీసం 1,25,000 మందిని కలవాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. -
ఓటరుగా నమోదు అవడానికి ఈనెల 31 వరకు అవకాశం.. సద్వినియోగం చేసుకోండి..
సూర్యపేట్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదుకు గత నెల 19వ తేదీ వరకు గడువు ఉండగా, ఈ నెల 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారెవరైనా ఉంటారనే ఆలోచనతో ఈ నెల 31వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారే కాకుండా ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుసుకోవచ్చు ప్రజలు తమకు ఓటు హక్కు ఉందా లేదా అనే వివరాలను తెలుసుకునేందుకు వివిధ రకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన వెబ్సైట్ www.nvsp.in, voters.eci.gov.inతో పాటు రాష్ట్రానికి సంబంధించి www.ceotelangana.nic.in వెబ్సైట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేసినా ఓటు హక్కు సంబంధించిన సమాచారం ఇస్తారు. కాగా ఓటు లేని వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చిరునామా మార్పునకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. పూర్తిగా పేరు తొలగింపునకు మాత్రం ఇప్పుడు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అవగాహన కల్పిస్తున్నాం అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల కళాశాలలో అవగాహన కల్పిస్తున్నాం.కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఎలా ఓటు వేయాలని అని వీవీ ప్యాట్లతో అవగాహన కల్పిస్తున్నాం. – భట్టు నాగిరెడ్డి, భువనగిరి జిల్లా నోడల్ అధికారి -
AP: క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ‘ప్రాజెక్ట్ టీల్’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వైద్య శాఖ ప్రవేశపెట్టిందన్నారు. డీఎంహెచ్వోలు, డీసీహెచ్ఎస్, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ టీల్లో భాగంగా పీహెచ్సీ నుంచి బోధనాస్పత్రి వరకూ అన్ని ఆస్పత్రుల్లోని ప్రముఖ ప్రదేశంలో ముదురు నీలం–ఆకు పచ్చ లైటింగ్‌ను ప్రదర్శించాలన్నారు. -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
సౌరశక్తిపై అవగాహనకు బస్సుయాత్ర
ఖైరతాబాద్: గ్లోబల్ వార్మింగ్ చేరుకోవడానికి ఇంకా 8–10 సంవత్సరాలు మాత్రమే ఉందని, అందువల్ల వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి తీవ్రమైన తక్షణ చర్యలు అవసరమని సోలార్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశరయ్య భవన్లో సోలార్ ఎనర్జీపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టిన బస్సు యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం బస్సులోనే నిర్వహించే విధంగా రూపొందిన బస్సులో 3.2 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్, ఆరు కిలోవాట్ల బ్యాటరీ స్టోరేజీ అమర్చారు. ఇది సౌరశక్తితో పేనిచేసే మూడు కిలోవాట్ల ఇన్వర్టర్‌ని కలిగి ఉంటుంది. లైట్లు, ఏసీ, కుక్‌స్టవ్, టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ మరియు బస్సులోపల అన్ని చార్జ్ అవుతాయి. సుదీర్గ ప్రయాణంలో భాగంగా ఎనర్జీ స్వరాజ్ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు చేతన్ సింగ్ సోలంకి తెలిపారు. ఎనర్జీ స్వరాజ్ బస్సు రెండు రోజుల పాటు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు!) -
‘ఇజ్జత్ భయంతో లైంగిక వేధింపులపై మౌనంగా ఉండవద్దు’
సాక్షి, రాయదుర్గం(హైదరాబాద్): ‘ఇజ్జత్’ భయంతో లైంగిక వేధింపులపై మౌనంగా ఉండవద్దని, అంతర్గత ఫిర్యాదు కమిటీ (ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ)కి నివేదించాలని ప్రముఖ మహిళా ఉద్యమకారిణి, రచయిత్రి జమీలా నిషాత్ బాలికలకు సూచించారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని సయ్యద్ హమీద్‌సెంట్రల్ లైబ్రరీలో ఐసీసీ మనూ ఆధ్వర్యంలో ‘సెక్సువల్ హరాష్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్–2013పై అవగాహనా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాలికలు, మహిళలు అనుచితంగా భావించే ఏఅంశంపైనైనా ఐసీసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా పలు సంఘటనలు, లైంగిక వేధింపుల యొక్క వివిధ షేడ్స్, ముఖ్యంగా పరిశోధనా సమయంలో జరిగే అంశాలపై ఆమె అవగాహన కల్పించారు. సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాహిదా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, వికలాంగులకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులను చేర్చడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాయన్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసీసీ చైర్çపర్సన్ ప్రొఫెసర్ షుగుప్తా షాహిన్, ఐసీసీ కన్వీనర్ డాక్టర్ షంషుద్దిన్ అన్సారీ, సభ్యుడు డాక్టర్ బీబీ రజాఖాతూన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: యువతి అదృశ్యం -
యూపీ: వైరల్ ఫీవర్‌తో 50 మంది చిన్నారుల మృతి!
లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా.. ఉత్తర ప్రదేశ్‌లో వైరల్ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది. వైరల్ జ్వరంతో ఫిరోజాబాద్‌లో ఇప్పటి వరకు 50 మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్లేట్లేట్ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి -
మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్‌పై ఆదివారం బీచ్ రోడ్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సినీనటుడు అడవి శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాఖీ పండుగ రోజు దిశ యాప్‌పై అవగాహన కల్పించడం బాగుందని, దిశ యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం అడవి శేషు ముంబయ్‌లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మేజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలతో కలసి సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ ఏడాదే ‘మేజర్’ రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
చిరు-అక్కీ-ఫిక్కీ.. ఓ మంచిపని
కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ సెకండ్ వేవ్‌లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్‌లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో వీళ్లు భాగం కాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌లు ఇందులో పాల్గొనబోతున్నారు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు. ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్‌లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్వర్కర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్పర్సన్ సంజయ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: సత్యదేవ్‌కి జాక్‌పాట్ -
వైరస్‌పై ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్–19) బారిన పడిన వారిని ఏకాంతంగా ఉంచేందుకు తగిన ప్రాంతాలను గుర్తించడంతోపాటు, వ్యాధి మరింత తీవ్రతరమైతే అన్ని అత్యవసర సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై శనివారం ప్రధాని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, ప్రజలు పెద్ద ఎత్తున ఒకచోట గుమికూడే పరిస్థితులను నివారించాలని అధికారులకు సూచించారు. ‘అన్ని విభాగాల వారూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి. అవగాహన పెంచే ప్రయత్నాలు చేపట్టాలి. ముందు జాగ్రత్త చర్యలనూ వివరించాలి’ అని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన ఒకటి తెలిపింది. కోవిడ్ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న పద్ధతుల్లో మేలైనవి ఎంచుకుని అమలు చేయా లని ప్రధాని కోరారని ప్రకటనలో పేర్కొన్నారు. వైరస్ టెస్టింగ్‌కు 52 కేంద్రాలు కరోనా వైరస్ పరీక్షలు జరిపేందుకు దేశవ్యాప్తంగా 52 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రక్త నమూనాల సేకరణ విషయంలో సహకరించేందుకు మరో 57 పరిశోధనశాలలను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో ఇప్పటివరకూ 34 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ కాగా, వీరిలో 16 మంది ఇటలీ పర్యాటకులు ఉన్న విషయం తెలిసిందే. మరో 29 వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని స్విమ్స్, విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, అనంతపురములోని జీఎంసీలు ఉన్నాయి. అలాగే బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, మైసూర్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హాసన్, శివమొగ్గ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లలో పరీక్షలు జరుగుతాయి. కాలర్ టోన్లతో కరోనా వైరస్ అవగాహన పలు టెలికం సర్వీసుల్లో రింగ్టోన్లకు బదులు వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలుకొని జబ్బు లక్షణాలను వివరించే కాలర్ టోన్లు వినిపిస్తున్నాయి. కేంద్రం టెలికం ఆపరేటర్లకు ఈ ఆడియో క్లిప్‌ను అందించగా వాటిని తాము కాలర్ ట్యూన్ల కోసం డబ్బు చెల్లించే వారికి మినహా మిగిలిన వారందరికీ అందిస్తున్నట్లు ఒక టెలికం ఆపరేటర్ తెలిపారు. కరోనా వైరస్‌పై యుద్ధంలో కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగాయి. పేటీఎం, ట్విట్టర్ వంటి కంపెనీలు ఉద్యోగులను ఇంట్లో నుంచే పనిచేయాలని ఆప్పటికే ఆదేశాలు జారీ చేయగా, రిలయన్స్ జియో తమ ఆఫీసుల్లో అటెండెన్స్‌కు వాడే బయోమెట్రిక్ యంత్రాలను పక్కనబెట్టింది. ఓలా తమ డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లను అందించడం మొదలుపెట్టింది. భారత్‌లో మరో మూడు దేశంలో మరో ముగ్గురు కోవిడ్– 19 బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్– 19 బారిన పడిన వీరిలో ఇద్దరు లడాఖ్‌కు చెందిన వారు కాగా.. ఇటీవలే ఇరాన్‌కు వెళ్లారని, మిగిలిన ఒక వ్యక్తి తమిళనాడుకు చెందిన వారని ఒమన్‌ను సందర్శించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో వివరించారు. దీంతో భారత్‌లో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 34కు చేరుకున్నట్లు అయింది. తాజాగా కోవిడ్ వైరస్ బారిన పడ్డ ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. -
వైరల్ : ప్రాణాలు కాపాడుతానంటున్న యమరాజు
ముంబయి : సాధారణంగా మన ప్రాణాలను హరించేందుకు యముడి రూపంలో వస్తాడని మన పురాణాలు చెబుతుంటాయి. కానీ అదే యముడు ప్రాణాలు కాపాడడానికి వస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఇక్కడ చూడండి. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాల భారీన పడుతున్న వారికి అవగాహన కల్పించడానికి పశ్చిమ రైల్వే విభాగం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఒక వ్యక్తికి యముని వేషదారణ వేసి రైల్వే ట్రాక్ దాటుతున్న కొంతమందిని ఎత్తుకొని ప్లాట్పామ్ మీదకు తీసుకువచ్చి ప్రమాదాల పట్ల అవగాహన కల్పించారు. పశ్చిమ రైల్వే విభాగం చేసిన వినూత్న ప్రయత్నానికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 'తరచూ రైల్వే పట్టాలు దాటుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలిసిన విషయమే. వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించడానికే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక మీదట ఎవరు ప్రమాదాల భారీన పడకుండా సబ్వే లేదా రైల్వే బ్రిడ్జిని ఉపయోగించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తామని' పశ్చిమ రైల్వే విభాగం ట్విటర్లో పేర్కొంది. 'ప్రయాణికులు ప్రమాదాల భారీన పడకుండా పశ్చిమ రైల్వే విభాగం చేస్తున్న వినూత్న కార్యక్రమం చాలా బాగుంది అంటూ' నెటిజన్లు తమ సంతోషాన్నివ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల భారీన పడకుండా కాపాడుతున్న యమరాజు రూపంలో ఉన్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. అయితే గతంలోనూ బెంగుళూరు, గుర్గావ్ నగరాల్లో ప్రయాణికులకు రోడ్ సేప్టీ అవేర్నెస్ కల్పించడానికి ఆయా రాష్ట్రాల ట్రాపిక్ విభాగం ఇలాంటి వినూత్న కార్యక్రమాలనే చేపట్టింది. This Yamraj ji saves lives. He catches people who are endangering their lives by trespassing the railway tracks, but to save them. This Yamraj picks people to release them safely. Please do NOT cross tracks, it's dangerous. pic.twitter.com/PT81eYVajL — Western Railway (@WesternRly) 7 November 2019 -
మత్తుకు బానిసలవుతున్న నేటి యువత
సాక్షి, పెద్దపల్లి : బంగారు కలలతో నగరంలో అడుగుపెడుతున్న యువత మత్తు పదార్ధాల కు బానిసలవుతున్నారు.. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం.. పట్టించుకునే వారు అం దుబాటులో ఉండకపోవడంతో సరదాగా మొదలై తర్వాత వ్యసనపరులుగా మారుతున్నా రు. నిత్యం వాటిని తీసుకోకుండా బతలేని పరిస్థితికి దిగజారుతూ జల్సాలకు అలవాటుప డి వాటికి డబ్బులు సరిపోక నేరాల వైపు మొ గ్గుచూపుతున్నారు.. అక్రమార్కులు గం జాయిని యథేచ్ఛగా సాగు చేస్తూ రహస్యంగా నగరాలకు తరలిస్తున్నారు.. దీనికి యువత అ లవాటు పడడంతో వారి పంట పండుతోంది. ఇంకా ప్రమాదకరమైన విషయమేమిటంటే మైనర్ విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు కావడం అందరిని కలవరపరిచే విష యం.. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లా ల సరిహద్దు ప్రాంతాల్లోని అడవులను ఆనుకు ని ఉన్న గ్రామాల నుంచి గంజాయిని నగరా లకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటుడుతున్నారు. జగిత్యాల, మం థని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచి ర్యాల డి విజన్లలో గంజాయి సాగు చేస్తున్నారని తెలి సింది. వీటిని కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజూరాబాద్, గోదావరిఖని డి విజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. హుక్కాకు అ లవాటు పడినవారు కూడా గం జాయికి త్వరగా అకర్శితులవుతున్నారు. దీని కి తోడు యు వత సరదాగా గంజాయిని అలవాటు చేసుకుని చివరకు బానిసలుగా మారుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గం జాయితో సిగరెట్లు తయారు చేసి పలు దు కాణాల్లో ఎవరికీ అనుమానం రాకుండా వారి వద్దకు రెగ్యులర్‌గా వచ్చే ఖాతాదారులకు పలు కోడ్ పేర్లతో అమ్మకాలు చేస్తున్నారని తెలిసింది. బానిసలుగా మారుతున్న మైనర్లు నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి ఇప్పటికే విచ్చలవిడిగా విస్తరించిందని సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్ ప్రాంతం, హౌసింగ్‌బోర్డుకాలనీ, స్టేడియం చుట్టు పక్కల, డ్యాం పరిసరాల్లో, బైపాస్‌రోడ్డు, నగరానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారని సమాచారం. నగరంలో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలోనే ప్యాకెట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారని వీరి వలలో పలువురు విద్యార్థులు సైతం చిక్కుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురికావడంతో అతడిని పరీక్షించగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. అతడి మిత్రులు సుమారు 20 మంది వరకు నిత్యం గంజాయి సేవనంలో మునిగితేలుతూ ఉంటారని సదరు విద్యార్థి పేర్కొనడంతో వారి తల్లిదండ్రులు అవాక్కయినట్లు సమాచారం. ఇలాంటి బ్యాచ్‌లు నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్నట్లు సమాచారం. అక్రమార్కులు 100గ్రా. ప్యాకెట్‌కు రూ.5000 ధరతో అమ్మకాలు చేస్తుండగ నిత్యం సుమారు రూ.50 వేలకు పైగా గంజాయి వ్యాపారం చేస్తున్నారని తెలిసింది. గతంలో ప్రముఖ హోటల్లో కొందరు యువతీయువకులను అనుమానాస్పదస్థితిలో అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద గంజాయి లభించింది. వీరు ఎక్కడి నుంచో వచ్చి సులభంగా గంజాయిని సంపాదించారంటే ఎంత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసుల దాడులు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి గం జాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోం ది. గంజాయి అమ్మకాలు, రవాణ చేస్తున్న పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చింది. అయితే చాలా వరకు కేసుల్లో మొదట గంజాయి అలవాటు పడి తర్వాత వారు అ మ్మకందారులుగా మారుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో గంజాయి కొ నుగోలు చేసి బానిసలుగా మారడమే కా కుండా మరికొందరిని మార్చుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్‌గా మారుతోంది. ఇలా పలువురి విద్యార్ధులను టాస్క్‌ఫోర్స్ అధికారులు అరె స్టు చేశారు. సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటుపడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తాజాగా వారం క్రితం 8, 9వ తరగతి విద్యార్థులు కూ డా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తిం చారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి తర్వాత అమ్మకందారుడిగా అవతారమెత్తిన ఇంటర్ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్క టాస్క్‌ఫోర్స్ దాడులు చేస్తుండడంతో గంజాయికి అలవాటు పడినవారు ఇతర ప్రాంతాలకు వెళ్లి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. డ్రగ్స్ కూడా.. జిల్లాలో డ్రగ్స్ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2 కొకైన్ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరిగడంతో కరీంనగర్ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్‌కు చెందినవారు ఉన్నారని తెలిసింది. కొందరు ఉన్నత స్థాయి విద్యార్థులు డ్రగ్స్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారని ప్రచారంలో ఉంది. ప్రకటనకే పరిమితమైన అవగాహన గతంలో డ్రగ్స్ ఆనవాల్లు బయటపడినప్పుడు వీటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన పలువురి వ్యాఖ్యలు కేవలం ప్రకటనకే పరిమతమైనాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలేజీల్లోని పేరెంట్స్ కమిటీ, స్టూడెంట్ కమిటీలు కూడా వీటిలో పాలు పంచుకోవడంతో పాటు పోలీసులు డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.గంజాయి రవాణ, అమ్మకాలు చేయడంపై 2018లో 42 మందిపై 14 కేసులు నమోదు చేశారు. 2019లో ఇప్పటి వరకూ 15 మందిపై 7 కేసులు నమోదయ్యాయి. -
త్వరలో ఒకే వేదికపైకి కోహ్లి-ఎన్టీఆర్?
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్లున్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన వీళ్లిద్దరు కలిసి ఒక అవేర్నేస్ ప్రోగ్రామ్ కోసం పని చేయనున్నారు. విరాట్ కోహ్లీ అంటే ప్రస్తుతం క్రికెట్లో ఓ బ్రాండ్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. తాత అడుగు జాడల్లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ జాతీయ చానల్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోహ్లితో ఎన్టీఆర్ చేతులు కలపనున్నారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల గురించి తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ రూపంలో తారక్ చెబుతూనే ఉంటాడు. ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా తన అభిమానులను క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరే విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడుగురు సెలబ్రిటీలు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగం కానున్నారని సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి చెందిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
ఓటు మన ఆయుధం
-
కేన్సర్ అవేర్‌నెస్‌లో ఎంఎన్‌జే గిన్నీస్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: ప్రొస్టేట్ కేన్సర్‌పై ప్రచారం నిర్వహించి కేవలం గంట వ్యవధిలో 487 మందికి అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి అరుదైన గౌరవం లభించింది. ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంఎన్‌జే ఆస్పత్రికి చెందిన ప్రొస్టేట్ కేన్సర్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్‌లు అక్టోబర్ 26న జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ప్రొస్టేట్ కేన్సర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం గంట వ్యవధిలోనే ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవగాహన కల్పించడం ఓ రికార్డు కాగా, దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం కొసమెరుపు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు.. ఎంఎన్‌జే ఆస్పత్రికి రికార్డులు రావడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హర్షం ప్రకటించారు. అందుకోసం కృషిచేసిన ఎంఎన్‌జే అధికారులను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ హర్షం.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రెండు ప్రపంచ రికార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అధికారులను ఆయన అభినందించారు. మొదటిసారిగా ఇలాంటి అవార్డులు ఒక ప్రభుత్వ ఆస్పత్రికి రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. -
ఆ నాలుగు జాతులే ప్రమాదకరం
అరసవల్లి : దేశంలో ఉన్న 300 రకాల పాముల్లో కేవలం 10 శాతం జాతులే హాని చేస్తాయని, ఇందులో నాగు పాము(కోబ్రా), రక్త పింజరి, కట్ల పాము, పొడ పాము(ఉల్లి పాము) అనే నాలుగు రకాలే(బిగ్ ఫోర్) తీవ్ర హాని కలిగిస్తాయని కళింగ సెంటర్ ఫర్ రెయిన్ ఫారెస్ట్ ఎకాలజీ(కేసీఆర్ఈ) ప్రతినిధి డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ప్రతినిధులు ప్రత్యేక అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాములపై ప్రజల్లో ఎంతో భయాందోళనలున్నాయని, వీటిని పూర్తి అవగాహనతోనే రూపు మార్చాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది పాముల సంరక్షణను కూడా విధుల్లో భాగమనే విషయాన్ని మరవకూడదని గుర్తుచేశారు. అంతకు ముందు పాముల సంచారం, కాటు వేసిన తరువాత, అలా గే ముందస్తు చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రత్యేక డాక్యుమెంటరీ ద్వారా పాముల రకాలను, జిల్లాలో సంచరిస్తున్న పలు రకాల పాము జాతులపై అవగాహన కల్పిం చారు. అనంతరం కేసీఆర్ఈ మరో ప్రతినిధి కేఎల్ఎన్ మూర్తి జిల్లాలో పాముల సంచారం, తీసుకోవాల్సిన సంరక్షణా చర్యలపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారులు సీహెచ్ శాంతిస్వరూప్, బలివాడ ధనుం జయరావు, రేంజర్లు, డిప్యూటీ రేంజర్లు, కేసీఆర్ ఈ ప్రతినిధులు ప్రియాంక స్వామి, గ్రీన్‌మెర్సీ సంస్థ ప్రతినిధి కేవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో సోంపేటకు చెందిన పాములను పట్టే నిపుణుడు బాలరాజు ఈ సంస్థ ప్రతినిధులను కలిసి పలు విషయాలు, సందేహాల పై చర్చించారు. ఈ సందర్భంగా బాలరాజుకు పాములను చాకచక్యంగా పట్టేలా ఉండే హుక్కు, బ్యాగర్లను డాక్టర్ గౌరీశంకర్ అందజేశారు. నాటు మందుల జోలికి వెళ్లొద్దు పాములను చూసి, లేదా పాము కాటు వేసిన అనంతరం బాధితుడు ఏమాత్రం భయపడ కూడదని, ఆభయమే ప్రాణాలను కోల్పోయేలా చేస్తుందని, అలాగే చికిత్స కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ నాటు మందుల జోలికి వెళ్లొద్దని కేసీఆర్ఈ ప్రతినిధి డాక్టర్ గౌరీశంకర్ సూచించారు. అటవీ శాఖాధికారులకు అవగాహన సదస్సు అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. స్థానిక జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ఇక్కడి పంటపొలాల్లో ప్రస్తుత సీజన్లోనే పాము కాట్లతో ఎక్కువ మంది మృతి చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. ఇటువంటి సమయాల్లో నాటు మందులు కోసం ప్రయత్నాలు చేయకూడదని, వైద్య చికిత్సలపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను తెలియజేశారు. రాత్రి పూట ఆరుబయటకు వెళ్లినా, పొలాలకు వెళ్లినా టార్చిలైట్‌ను వెంట తీసుకెళ్లాలి.∙పాముకాటు వేసిన వెంటనే బాధితుడు భయపడకూడదు.అయితే తక్షణ చర్యలకు సిద్ధం కావాలి. పాముకాటు వేసినప్పుడు ఏమాత్రం గుండెపై ఒత్తిడి లేకుండా చూడాలి. కాటు వేసిన భాగంలో తాడు లేదా గుడ్డతో కట్టు వేయాలి. నాటు మందులను వినియోగించరాదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పాముకాటు రక్షణకోసం స్నేక్వీనమ్ను అందుబాటులో ఉంచాలి. ఈ మందులు ప్రతి గ్రామ పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. -
ఏపీకి ఇస్తే.. మరో 9 రాష్ట్రాలకు ఇవ్వాలి
– కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తిరుపతి గాంధీరోడ్డు : భౌగోళిక అంశాలను పక్కనబెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరో 9 రాష్ట్రాలు హోదా ఇవ్వాలంటూ ముందుకు వస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై శనివారం తిరుపతిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. సరిహద్దు రాష్ట్రాలు, కొండప్రాంత్రాలు, అధిక శాతం గిరిజనులు, అన్ని విధాల వెనుకబడ్డ.. ఇలా నాలుగు అంశాను ప్రతిపాదికగా తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో వెనుకబడ్డ ప్రాంతం కాదని అందు వల్లే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించందన్నారు. తాను ఏపీ నుంచి ఎంపిక కాకపోయినా ప్రాంతీయ అభిమానంతోనే పట్టుబట్టి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చానన్నారు. తాను పట్టుబట్టకపోతే ఇది కూడా వచ్చేది కాదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సహేతుకంగా జరగలేదని, కాంగ్రెస్ అడ్డగోలు విభజన వల్లే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చడానికి కేంద్రం సిద్ధంగా వుందని వెంకయ్యనాయుడు చెప్పారు. హోదావల్ల వచ్చేది విదేశీ రుణ ప్రాజెక్టుల కేటాయింపుతో భర్తీ చేస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా అధికారంలో వున్న కాంగ్రెస్ వల్లే దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. పోలవరం పూర్తి చేయడంలో బీజేపీ విఫలం చెందిందని కాంగ్రెస్ విమర్శిస్తోందని, బిజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందన్నారు. 50 సంవత్సరాల పాటు అధికారంలో వున్న కాంగ్రెస్ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్రం భరిస్తుందని మరో మారు వెంకయ్య స్పష్టం చేశారు. విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థలను కూడా ఏపిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొందరు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చడం దారుణమని, డబ్బును ఎవరైన పాచిన లడ్డూలతో పోలుస్తారా అంటూ మండి పడ్డారు. భారత సైన్యం విజయం గురించి ప్రస్తావిస్తూ సరిహద్దులను దాటి మూడు కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్ళి పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టిన వైనం సాహసోపేతమైనదని వర్ణించారు. సైనిక చర్యలను యావత్తు దేశం గర్విస్తోందన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ, టీడీపీ నాయకులు కేంద్రమంత్రిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి భారీ వాహన ర్యాలీ వెంకయ్యనాయుడు వెంట తిరుపతి వేదిక వరకూ అనుసరించాయి. రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు,ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ,ఎంపీ శివప్రసాద్,శాసనసభ్యులు,బీజేపీ, టీడీపీకి చెందిన పార్టీ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.