సాక్షి, హైదరాబాద్: ప్రొస్టేట్ కేన్సర్‌పై ప్రచారం నిర్వహించి కేవలం గంట వ్యవధిలో 487 మందికి అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి అరుదైన గౌరవం లభించింది. ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఎంఎన్‌జే ఆస్పత్రికి చెందిన ప్రొస్టేట్ కేన్సర్ నిపుణుడు డాక్టర్ శ్రీనివాస్‌లు అక్టోబర్ 26న జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొస్టేట్ కేన్సర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేవలం గంట వ్యవధిలోనే ప్రొస్టేట్ కేన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణ పద్ధతులను వివరించారు. దీంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి అవగాహన కల్పించడం ఓ రికార్డు కాగా, దీన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం కొసమెరుపు.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు.. ఎంఎన్‌జే ఆస్పత్రికి రికార్డులు రావడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హర్షం ప్రకటించారు. అందుకోసం కృషిచేసిన ఎంఎన్‌జే అధికారులను ఆయన అభినందించారు.
సీఎం కేసీఆర్ హర్షం..
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి రెండు ప్రపంచ రికార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి అధికారులను ఆయన అభినందించారు. మొదటిసారిగా ఇలాంటి అవార్డులు ఒక ప్రభుత్వ ఆస్పత్రికి రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment