Guinness World Records
-
వసంత యోగం
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి. హైదరాబాద్ అమీర్‌పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్‌లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్‌లోని యోగా ఇన్ స్టిట్యూట్లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు. తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది. ఆరోగ్య భారత్ కోసం....రికార్డ్‌లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం. – వసంతలక్ష్మి – నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/ కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్ -
14,505 బంతులతో...
ముంబై: సాధారణంగా క్రికెట్లో భారీ స్కోర్లు, భాగస్వామ్యాలు, పరుగులు, శతకాల మోత, వికెట్ల కూతతో అంతర్జాతీయ రికార్డులు నమోదు కావడం సహజం. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆట (మ్యాచ్)తో సంబంధం లేకుండా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) విన్నూత్నమైన రికార్డులోకి ఎక్కడం... అది కూడా ప్రపంచ రికార్డులకే జేజమ్మలాంటి ‘గిన్నిస్ బుక్’లో ఎక్కితే పెద్ద విశేషం కదా! ఇక అసలు సంగతికి వచ్చేద్దాం... ఎంసీఏకు చెందిన వాంఖెడే స్టేడియంలో అత్యధిక బంతులతో 50 వసంతాలకు సంబంధించిన ఆంగ్ల అక్షర తోరణాన్ని వేదికపై పరిచింది. రెడ్ (ఎరుపు టెస్టులకు వాడే బంతి), వైట్ (తెలుపు వన్డే, టి20లకు వాడే బంతి) ఈ రెండు కలిపి మొత్తం 14, 505 బంతులతో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖెడే స్టేడియం’ అని గోల్డెన్ జూబ్లీకి సంబంధించిన అక్షరమాలను రాశారు. గావస్కర్, సచిన్‌లాంటి ఎందరో దిగ్గజాలకు పుట్టిల్లు (సొంతగడ్డ)లాంటి వేదిక 50 వసంతాల వేడుకకు ముస్తాబైంది. ఇక్కడ 1975వ ఏడాది జనవరి 23 నుంచి 29 వరకు తొలి మ్యాచ్ జరిగింది. గురువారం (2025, జనవరి 23)తో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంసీఏ సిబ్బంది వేల సంఖ్యలో ఎరుపు, తెలుపు క్రికెట్ బంతులతో వాంఖెడే మైదానాన్ని తీర్చిదిద్దింది. ఈ వేదికపైనే 2011లో ధోని సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. తొలి ప్రపంచకప్‌ను కపిల్ సేన 1983లో లార్డ్స్ (ఇంగ్లండ్)లో నెగ్గింది. అత్యధిక బంతుల వినియోగంతో తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కడంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ టి20ల్లో కూడా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. సఫారీలో 2007లో మొదలైన ఆరంభ టి20 ప్రపంచకప్‌ను ధోని నేతృత్వంలో గెలిస్తే... గతేడాది కరీబియన్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ బృందం నెగ్గుకొచ్చింది. -
గగుర్పొడిచే సాహసాలకు గిన్నిస్ గుర్తింపు
సూర్యాపేట: ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పనికెర క్రాంతికుమార్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వేదికపై అరుదైన సాహసాలు ప్రదర్శించి ఒకేసారి 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు అందుకొన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన క్రాంతికుమార్ 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు.ఆయన చేసిన సాహసాలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆయనకు తన బుక్‌లో చోటిచ్చింది. ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు క్రాంతికుమార్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ విషయాన్ని క్రాంతికుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. రికార్డులు సాధించింది ఈ విభాగాల్లోనే.. » 60 సెకన్లలో 72 టేబుల్ ఫ్యాన్లను నాలుకతో ఆపగా, అందులో 57 ఫ్యాన్లు ఆగినట్లు రికార్డు నమోదైంది. » గొంతులో రెండు అడుగుల పొడవైన 37 కత్తులు దింపుకుని 16 సెకన్లలో 1,944 కిలోల బరువు (కారు, దానిపై ఎనిమిది మంది)ని లాగాడు. » 60 సెకన్లలో నాలుగు ఇంచుల పొడవైన 22 మేకులను ముక్కులో దించుకుని రక్తపు చుక్క రాకుండా కొత్త రికార్డు నమోదు చేశాడు. » 60 సెకన్లలో మరుగుతున్న నూనె నుంచి 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు. -
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
సకుటుంబ సపరివారం.. గిన్నిస్ పురస్కారం
సాక్షి, అనకాపల్లి: రికార్డు నెలకొల్పాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.. అందులోనూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలంటే ఎన్ని కోట్లమందిని దాటి రావాలి..! అంతటి అరుదైన ఘనతను నూటికో కోటికో ఒక్కరు సాధిస్తారు. కానీ అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ఆ రికార్డును సాధించి, సరికొత్త రికార్డు సృష్టించారు. అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల విజయ్ 2012లో చైనాలో స్థిరపడ్డారు. ఆయన, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా వారి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల బాటలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కొణతాల విజయ్, జ్యోతి దంపతుల కుమార్తె జస్మిత వయస్సు 14 ఏళ్లు. ఒంటి కాలుతో ఒక నిమిషంలో 168సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. వారి కుమారుడు శంకర్ వయస్సు ఐదేళ్లు. ఒక నిమిషంలో 129 సార్లు స్కిపింగ్స్ (ఒలింపిక్ ట్రంప్లిన్స్) చేసి రికార్డు సాధించాడు. 2019లో జపనీస్ కుర్రాడు సాధించిన రికార్డును శంకర్ అధిగమించాడు. -
హైదరాబాద్‌లో 3 వేల కిలోల భారీ కేక్.. గిన్నిస్ రికార్డ్
అతిపెద్ద హనీ కేక్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధనకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. నగరంలోని మాదాపూర్‌లో ఉన్న హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ ఈ వినూత్న ఫీట్‌ను సమర్పిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సురేష్‌నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆదరణ పొందిన మెడోవిక్ హనీ కేక్ ద్వారా ఈ రికార్డ్ సాధించనున్నామని, దీని కోసం ఇప్పటికే 3వేల కిలోల బరువున్న కేక్‌ను తయారు చేశామని వివరించారు. భారీ కేక్ 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. గతంలో ఉన్న రికార్డ్ కంటే దాదాపు 10 రెట్లు మిన్నగా ఈ భారీ కేక్ రూపొందిందన్నారు. ఈ భారీ కేక్‌ను శుక్రవారం నగరంలోని మాయా కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శించనున్నామని తెలియజేశారు.ఏళ్ల వయసు.. 16 వేల అడుగుల ఎత్తు..16 ఏళ్లకే 16 వేలకుపైగా అడుగుల పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ్ కార్తికేయ. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్ మాసిఫ్(16,050 అడుగులు)ను అధిరోహించిన అతి పిన్న వయసు్కడైన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. నిర్మల్ పుర్జా నేతృత్వంలో బూట్స్, క్రాంపాన్స్–ఎలైట్ ఎక్స్‌పెడ్ బృందంలో విశ్వనాథ్ ఈ నెల 3న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అనంతరం సురక్షితంగా బేస్ క్యాంప్‌నకు చేరుకున్నాడు.నవంబర్ 21న హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 25న యూనియన్ గ్లేసియర్‌కు చేరుకున్నాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం బేస్ క్యాంప్‌నకు తరలించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యాన్ని సాధించాడు. ‘నీకు నచ్చింది చేయడం వల్ల సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం ఉంటుంది’అని తన తల్లి చెప్పేదని ఆయన అన్నారు.లాంగ్వేజ్.. స్కిల్స్ అందించేందుకు..పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(కేఈఎఫ్) నడుం కట్టింది. ఇందులో భాగంగా కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ ఫ్యూచర్ రెడీ(సిఈ–ఎఫ్ఆర్) డిజిటలైజ్డ్ కంటెంట్‌ను ఉపాధ్యాయులకు అందించే ప్రక్రియను ‘వన్ కేఈఎఫ్’ అనే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: ఆ విషయంలో మిగిలిన మెట్రో నగరాలన్నింటికన్నా మనమే టాప్ప్రపంచీకరణ ప్రపంచంలో విజయం సాధించడానికి సంభాషణా చాతుర్యం ముఖ్యంగా ఆంగ్లభాషా నైపుణ్యం ముఖ్యమైనదని, తమ కంటెంట్ ద్వారా విద్యార్థులు భాషా నైపుణ్యంతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కొనే అనేక సామర్థ్యాలను సొంతం చేసుకుంటారన్నారు.హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆదరిస్తున్న యువత సహజసిద్ధ ఉత్పత్తులను తయారు చేసే చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మిసెస్ ఇండియా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ 2023 విజేత ఛాయాదేవి రుద్రరాజు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ చేనేత పట్టువస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ కొలువుదీరిన చేనేత వ్రస్తోత్పత్తులు తిలకించి చేనేత వస్త్ర తయారీ విధానం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు.భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు. ఆ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదన్నారు. నేటితరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారని తెలిపారు. -
నిర్లక్ష్యం ఊడలు.. మర్రికి చెదలు!
తిమ్మమ్మమర్రిమాను... 669 సంవత్సరాల చరిత్ర. 8.15 ఎకరాల్లో విస్తరించి... 1350కిపైగా ఊడలతో వ్యాపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో నిలిచింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నా.. కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం కావడంతో తిమ్మమ్మ మర్రిమాను ఖ్యాతికి చెదలు పడుతోంది ఎన్పీకుంట: సత్యసాయి జిల్లాలోని నంబులపూలకుంట (ఎన్పీకుంట) మండలం గూటిబైలు గ్రామంలోని తిమ్మమ్మమర్రిమాను చరిత్ర అమోఘం. అభివృద్ధి మాత్రం దారుణం. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ అతిపెద్ద మర్రిమాను గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా సౌకర్యాలు కరువయ్యాయి. మర్రిమాను చరిత్ర.. దిగువగూటిబైలు గ్రామానికి చెందిన తిమ్మమాంబ భర్త బాలవీరయ్యతో కలిసి 1355లో సతీసహగమనం చేసినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో చితికి నాలుగు వైపులా నాటిన ఎండు మర్రిగుంజల్లో ఈశాన్యం వైపు నాటిన గుంజ చిగురించి, నేడు మహావృక్షంగా మారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 8.15 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిమ్మమ్మమర్రిమాను కర్ణాటక రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ సత్యనారాయణ అయ్యర్ కృషి ఫలితంగా 1989లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. సౌకర్యాలు కరువు.. తిమ్మమ్మమర్రిమాను గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో ఆసక్తితో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడిదాకా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. కనీసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో వెంటనే వెళ్లిపోతున్నారు. మరోవైపు పర్యవేక్షణ కరువై ఊడలు కూడా చెదలు పడుతున్నాయి. అటవీశాఖ ఆదీనంలోకి తీసుకున్నా.. 1990వ సంవత్సరంలో తిమ్మమ్మమర్రిమాను అటవీ అభివృద్ధి శాఖ ఆ«దీనంలోకి తీసుకుంది. పార్కు, షెడ్డు ఏర్పాటు చేసి కొన్ని వన్యప్రాణులను తీసుకువచ్చి అందులో ఉంచింది. సమీపంలోని 27 ఎకరాలు కూడా సేకరించింది. కానీ ఆ తర్వాత నిర్వహణ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. పార్కులో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వన్యప్రాణుల షెడ్డులో జింకలు, కుందేళ్లు, నెమళ్లు మాత్రమే ఉన్నాయి. భూమి కోత.. ఊడలకు చెదలు.. గతంలో దట్టమైన ఆకులతో మర్రిమాను కళకళలాడుతూ ఉండేది. పర్యాటకులు కూడా మర్రిమాను కింద సేదతీరేవారు. అటవీశాఖ ఆ«దీనంలోకి తీసుకున్నాక చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం శుభ్రత చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం మర్రిమాను లోపలిభాగంలో కొన్ని చోట్ల భూమి కోతకు గురైంది. భూసారం తగ్గి ఆకులు రాలిపోవడంతో పాటు, చెట్టు సైతం నేల వాలింది. మరికొన్ని చోట్ల ఊడలకు చెదలు పట్టింది. వెంటనే ప్రభుత్వాలు తిమ్మమ్మమర్రిమాను సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.అభివృద్ధి పనులు డిమాండ్ ఇలా.. » తిమ్మమాంబ అమ్మవారి దర్శనం అనంతరం పర్యాటకులు మర్రిమాను పరిసర ప్రాంతంలో సేద తీరడం కోసం పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. » పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని వణ్యప్రాణులను తీసుకురావడం, ఆటస్థలాన్ని అభివృద్ధి చేయాలి. » పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం, నీటి, మరుగుదొడ్ల వసతి కల్పించాలి. రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి. మర్రిమాను పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల పూలమొక్కలు పెంచి అందంగా తీర్చిదిద్దాలి. » మర్రిచెట్టు ఉన్న విస్తీర్ణంలో మీటరు ఎత్తున కొత్త మట్టిని తోలించి, వాలిన ఊడలను సంరక్షించాలి. » తిమ్మమ్మమర్రిమానుకు పడమర వైపున ఓబుళదేవరగుట్టపై 10 ఏళ్ల క్రితం టీటీడీ వారు వెంకటేశ్వస్వామి ఆలయం నిర్మించారు. కానీ ఇంత వరకు విగ్రహప్రతిష్ట చేయలేదు. దీంతో ఆ ఆలయ ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. వెంటనే విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయంలో పూజలు ప్రారంభిస్తే ఈప్రాంతానికి భక్తుల రాక పెరుగుతుంది. వసతులు కల్పించాలి మేము ఏటా మర్రిమానును సందర్శిస్తాము. గతంలో బాగుండేది. ప్రస్తుతం సౌకర్యాలు లేవు. అమ్మవారిని దర్శించి వెళ్లాల్సి వస్తోంది. మధ్యాహ్న సమయంలో భోజన వసతి కూడా ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి పార్కు, ఆటస్థలం అభివృద్ధి చేయాలి. నీటి, భోజన వసతి కల్పిస్తే బాగుంటుంది. అలాగే మర్రి ఊడలు చెదలు పట్టకుండా కాపాడాలి. – సి.నాగార్జునరెడ్డి, యాత్రికుడు, అనంతపురంసౌకర్యాలు కరువు తిమ్మమ్మమర్రిమాను దర్శనానికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. అమ్మవారి దర్శనం తరువాత సేద తీరడానికి అవకాశమే లేదు. మరుగు దొడ్లు, విశ్రాంతి భవనాలు లేవు. ఆటస్థలంలో క్రీడాపరికరాలు ఏవీ లేవు. అలాగే మర్రిమాను కింద సేదదీరే ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచే చూసి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. – రవికుమార్, యాత్రికుడు, అనంతపురం -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళలుగా గిన్నిస్ రికార్డులకెక్కిన వారెవ్వరో మనకు తెలిసిందే. వారిన చూసి యావత్తు దేశం అబ్బురపడింది కూడా. అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో ఎదురపడితే ఎలా ఉంటుంది..అన్న ఆలోచనే ఎంతో ఆశ్యర్యానికిలోను చేస్తుంది. అలాంటిది అదే నిజమైతే ఎలా ఉంటుందో చెప్పండి. ఔను..! మీరు వింటుంది నిజమే..!. ఆ ఇద్దరు వ్యక్తులు తాము రికార్డులకెక్కిన అదే వేదిక వద్ద కలుసుకుని ఆనందంతో మునిగితేలారు. ఆ క్షణం ఆ ఇరువురూ ఇది కల? నిజమా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. నవంబర్ 13, 2024 అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే రోజున ఆ ఇరువురు లండన్‌లో మధ్యాహ్నం టీ కోసం సమావేశమయ్యారు. లండన్‌లో ది సావోయ్ హోటల్ రుచికరమైన టీ సిప్ చేస్తూ..ఒకరి ఇష్టాలను ఒకరూ షేర్చేసుకున్నారు. అక్కడ టీ తోపాటు పేస్ట్రీలను కూడా ఆస్వాదించారు. ఇక అత్యంత పొడవైన మహిళ రుమిసా.. "జ్యోతిని కలవడం ఇదే తొలిసారి. ఆమె అత్యంత అందమైన మహిళ. తాను ఆమెను కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది". రుమిసా. అలాగే జ్యోతి ప్రతిస్పందనగా.."నాకంటే ఎత్తుగా ఉన్నవారిని చూడటం అలవాటు చేసుకున్నాను. ఈ రోజు ప్రపంచంలోనే ఎత్తైన మహిళను కలుసుకోవడం అత్యంత సంతోషంగా ఉంది." అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, రుమీసా 215.16 సెం.మీ (7 అడుగుల 0.7 అంగుళాలు)తో అత్యంత ఎత్తైన మహిళగా నిలిచింది. ఇక జ్యోతి 62.8 సెం.మీ (2 అడుగుల 0.7)తో అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by NDTV (@ndtv) (చదవండి: ఆరు పదులకు అందాల కిరీటం) -
ఎనిమిదో వింత పక్షి మ్యూజియం
పక్షి మ్యూజియం అంటే... రకరకాల పక్షుల రూపాలు, వాటి రెక్కలు, గుడ్లు, పొదిగిన పిల్లల రూపాలను ఒక చోట పొందు పరిచిన మ్యూజియం కాదు. పక్షి ఆకారంలో ఉన్న మ్యూజియం. జటాయు పక్షి ఆకారంలో ఉన్న ఈ మ్యూజియం పరిమాణం కూడా జటాయువులాగ భారీగానే ఉంటుంది. రెండు వందల అడుగుల పొడవు, నూట యాభై అడుగుల వెడల్పు, డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మ్యూజియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ మ్యూజియం కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలో ఉంది. ఈ మ్యూజియాన్ని జటాయు ఎర్త్ సెంటర్ అంటారు. ఈ మ్యూజియం ఉన్న కొండ ప్రదేశాన్ని జటాయు నేచర్ పార్క్ అంటారు.జటాయు పురజటాయు నేచర్ పార్క్... కేరళ, కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణంలోని జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో కీలక పాత్ర జటాయువుది. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు కేరళవాళ్లు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. పక్షి ఆకారంలోని ఈ నిర్మాణం లోపల జటాయువు కథను తెలిపే ఘట్టాలను చూడవచ్చు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ పార్కుకు చేరడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రోప్‌వే ఉంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది.రామాయణం గొప్పదనం ఇదేవెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు. శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ నిర్మించాడు. సీతాపహరణం సమయంలో రావణాసురుడిని అడ్డగించిన జటాయువును రావణాసురుడు సంహరించాడని రామాయణం చెబుతుంది. ఈ ఘట్టానికి వేదిక ఈ జటాయుపుర అని కేరళవాళ్లు చెప్పుకుంటారు. తెలుగు వాళ్లుగా మనం అనంతపురంలోని లేపాక్షిని జటాయువు మరణించిన ప్రదేశంగా చెప్పుకుంటాం. రామాయణం గొప్పదనం అది. దేశం అంతటా ప్రతి ఒక్కరూ కథను స్వాగతిస్తూ ఐడింటిఫై అవుతారు.జటాయుపుర... కేరళ రాజధాని త్రివేండ్రం నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. పునలూర్ రైల్వేస్టేషన్ నుంచి పాతిక కిలోమీటర్లే. ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకోవచ్చు. సొంతంగా వాహనాన్ని నడుపుకునే ఆసక్తి ఉంటే కొంత కాషన్ డిపాజిట్, వ్యక్తిగత వివరాలు తీసుకుని కారు అద్దెకిస్తారు. -
ఐదేళ్లకే పుస్తకాన్ని రచించి రికార్డు సృష్టించింది..!
కథలు వినడమే కాదు, చెప్పడానికి కూడా ఇష్టపడుతుంటారు కొంతమంది చిన్నారులు. అయితే ఈ చిన్నారికి మాత్రం కథలు రాయటం కూడా ఇష్టమే! అలా అతిచిన్న వయసులోనే ఏకంగా ఓ పుస్తకాన్ని రచించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఈ ఐదేళ్ల బాలిక పేరు అల్ఫయ్ అల్ మర్జూకీ. ‘ది లాస్ట్ ర్యాబిట్’ అనే పేరుతో పుస్తకాన్ని రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. జంతువుల మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని అందమైన కథగా మలచి ఈ పుస్తకం రాసింది.ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పటికే వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. పుస్తకంలోని పాత్రలన్నింటికీ తన స్నేహితుల పేర్లనే పెట్టిందట! నిద్రపోయే ముందు తన తల్లిదండ్రులు కథలు చదివి వినిపించేవారు. అలా తనకు కథలపై ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసులో తానే స్వయంగా ఒక పూర్తి కథను తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమె ఆసక్తిని గుర్తించి, పుస్తక రచనలో శిక్షణ ఇచ్చారు. అలా కథను రాయడంతో పాటు, వాటికి సంబంధించిన బొమ్మలు వేయడం కూడా నేర్చుకుంది. మరో రెండు కథలు ‘క్యూట్ క్యాట్’, ’ హ్యాపీ ప్రిన్సెస్’ అనే పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయట! అంతేకాదు, తన తమ్ముడు హమద్‌కు కూడా పుస్తక రచనలో శిక్షణ ఇస్తోంది. రచనలు కొనసాగిస్తూనే, పెద్దయ్యాక ఫ్యాషన్ డిజైనర్ అవుతానని చెబుతోంది ఈ చిన్నారి. (చదవండి: జస్ట్ ఐదేళ్లకే యోగా గురువుగా చిన్నారి..!) -
వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..
ఒరెగాన్లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్సెన్ అసాధారణమైన గిన్నిస్ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్‌లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిమీ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు. ఆయన 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి ‘వెస్ట్‌కోస్ట్ జెయింట్ పంప్కిన్ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ అక్టోబర్ 4న 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్5న అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. ఇక అధికారులు ఆ పడవకి ఒక కెమెరాను అమర్చి గ్యారీ ప్రయాణాన్ని రికార్డు చేశారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు. (చదవండి: కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!) -
శాండ్విచ్.. పోషకాలు రిచ్..
శాండ్విచ్ నగరంలో అత్యంత క్రేజీ స్నాక్స్‌లో ఒకటి. అల్పాహారం, భోజనం లేదా సాయంత్రం స్నాక్‌గా లేదా లైట్ డిన్నర్గా కూడా తీసుకోగలిగిన ఏకైక ఫుడ్ ఐటమ్. దీంతో నగరంలో ఫుడ్ లవర్స్‌కి మాత్రమే కాదు యువత నుంచి ముసలి వారి వరకూ, ఉద్యోగుల నుంచి లైట్ ఫుడ్‌ని తీసుకునేవారి వరకూ బాగా దగ్గరైన ఫుట్ ఐటమ్‌గా చెప్పుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉండే ఈ రుచికరమైన శాండ్విచ్ పోషకాహారంగా కూడా పేరొందింది. బ్రిటిష్ పాలకుడు జాన్ మోంటాగు 18వ శతాబ్దంలో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో మటన్ స్లైసెస్ ఉంచి సర్వ్ చేయమని సిబ్బందిని ఆదేశించాడట. దాని వల్ల తాను అవి తింటూనే పేకాట ఆడు కోవచ్చని ఆయన భావించాడట. అలా పుట్టిన శాండ్విచ్ ఆ తర్వాత క్రమంలో విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. మన భాగ్యనగరంలోనూ సిటిజనులకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్‌గా అవతరించింది. తయారీ సులువుగా ఉండడంతో పాటు అందుబాటు ధరల్లో ఉండటం కూడా శాండ్విచ్ పాప్యులర్ అవ్వడానికి ప్రధాన కారణం.. కనీసం రూ.100 మొదలుకుని రూ.600 దాకా కూడా నగరంలో విభిన్న రకాల శాండ్విచ్లు అందుబాటులో ఉన్నాయి.ట్రెడిషన్స్‌ను కలుపుకుంటూ టేస్టీగా.. బ్రిటీష్ డచ్ జాతీయులు యూరోపియన్ బ్రెడ్–మేకింగ్ పద్ధతులను మన నగరం స్వీకరించి సంప్రదాయ మసాలా దినుసులు. నాన్, రోటీ వంటి స్థానిక ఫ్లాట్‌బ్రెడ్‌లను కూడా ఉపయోగించి సరికొత్త శాండ్విచ్ రుచులను సృష్టించింది. ‘టిక్కా మసాలా వంటి మన సంప్రదాయ రుచులు శాండ్‌విచ్‌లలో చేర్చారు’ అని మకావు రెస్టారెంట్ హెడ్ చెఫ్ రవి చెబుతున్నారు. ‘కేఫ్‌కి వెళ్లినప్పుడు, ప్రతి ఒక్కరూ వెరైటీ కోసం చూస్తారు. అందుకే సోర్‌డౌ శాండ్విచ్ల నుంచీ క్రోసెంట్ బన్స్ వరకూ మెనూలో చేరుతున్నాయి’ అని చెఫ్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. స్థానిక అభిరుచులకు గ్లోబల్ ట్రెండ్ మిళితం చేసి అవొకాడో లేదా పెస్టోతో ఓపెన్–ఫేస్డ్ శాండ్విచ్లను కూడా ఇక్కడి కేఫ్స్ పరిచయం చేశాయి. మారుతున్న ఆధునికుల అభిరుచికి అనుగుణంగా వీగాన్ శాండ్విచ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ..శాండ్విచ్లను చాలా సులభంగా ఇంట్లో సైతం వేగంగా తయారు చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి మిడ్ డే స్నాక్స్‌గానూ, సాయంత్రం టీ టైమ్ దాకా ఎనీ టైమ్ శాండ్విచ్ బెస్ట్ కాంబినేషన్.. నచి్చన కూరగాయలను లేదా విభిన్న రకాల మేళవింపులను దీనికి జతగా ఉపయోగించవచ్చు. రుచికరమైన సాస్‌లు, చీజ్‌లతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, ఫైబర్ మేళవింపునకు అనుకూలం కావడంతో ఆరోగ్యకర పోషకాహారంగానూ ప్రాచుర్యం పొందింది.ఇంట్లోనే.. రుచికరంగా..రుచికరమైన శాండ్విచ్ చేయడానికి ఎల్లప్పుడూ చీజ్, బ్రెడ్ రెండూ కలపడం మంచిది. సోర్డోఫ్ బ్రెడ్, చీజ్ తాజా దోసకాయ ముక్కలతో దోసకాయ–చీజ్ శాండ్విచ్, సాయంత్రం టీ సమయంలో తినాలనిపిస్తే, బ్రెడ్ మష్రూమ్లను ఉపయోగించి మష్రూమ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. దీనికి వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో, మోజారెల్లా చీజ్, బ్రెడ్ స్లైసెస్, మసాలా దినుసులు జోడించవచ్చు. మొక్కజొన్న, బ్రోకలీ, బెల్ పెప్పర్స్, టొమాటోలు వంటి తాజా కూరగాయల కలయికతో ఇంట్లో తయారుచేసిన స్ప్రెడ్లు, సాస్‌లతో వెజ్ శాండ్విచ్ తయారు చేయవచ్చు. ఇదే విధంగా చికెన్, ఎగ్స్ రకరకాల మేళవింపులతో నాన్‌వెజ్ వెరైటీలూ తయారు చేసుకోవచ్చు. సూప్స్ నుంచి తేనీటీ దాకా పీనట్ బటర్ నుంచి జామ్ దాకా ఏ కాంబినేషన్‌లోనైనా అమరిపోతాయి. రోస్ట్ చికెన్, మస్టర్డ్ శాండ్విచ్ స్పినాచ్ అండ్ కార్న్, రోస్టెడ్ వెజిటబుల్ అండ్ ఛీజ్ వంటి ఫిల్లింగ్స్‌తో ఇంట్లో వీట్ బ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు.నగరం నలువైపులా.. నగరంలో దాదాపు అన్ని కేఫ్స్, రెస్టారెంట్స్, బేకరీల్లో రుచికరమైన శాండ్విచ్ వెరైటీలు లభిస్తాయి. అలా చెప్పుకోదగ్గ వాటిలో కొన్ని ఎగ్ బటర్‌తో బేక్ చేసిన ఫ్రెంచ్ బ్రెడ్ మెల్ట్ శాండ్విచ్లు ప్యాటీ మెల్ట్ పేరుతో మాదాపూర్‌లోని సిగుస్తా అందిస్తుండగా, గండిపేటలోని బృందావన్ కాలనీలోని కేఫ్ శాండ్‌విచో, అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ఉన్న రోస్టరీ కేఫ్, మాదాపూర్‌లోని బేక్లోర్, నగరంలో పలు చోట్ల ది బేక్ ఫ్యాక్టరీ, అమెరికన్ శాండ్విచ్లకు పేరొందిన హిమాయత్ నగర్‌లోని కింగ్ అండ్ కార్డినల్, సింధి కాలనీలోని చత్వాలా, కొండాపూర్‌లోని శాండ్విచ్ స్క్వేర్, జూబ్లీహిల్స్ లోని కోర్ట్‌యార్డ్ కేఫ్స్ కూడా శాండ్విచ్లకు పేరొందాయి. ఇక శాండ్ విచ్ ఈటరీ పేరుతో నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకించిన ఔట్లెట్స్ ఫుడ్ లవర్స్‌కి చిరునామాగా మారాయి. ‘మాంసం లేదా చీజ్‌తో నిండిన బ్రెడ్ లేదా పేస్ట్రీ కలయికలు, మసాలా దినుసులు ధరించడం పురాతన కాలం నుండి ఆనందించబడింది’ అని ఫ్యూ డెసర్ట్, బార్ మరియు కిచెన్‌లో ఎగ్జిక్యూటివ్ చెఫ్ జో ఫ్రాన్సిస్ వివరించారు. గిన్నిస్ రికార్డ్స్‌లో శాండ్విచ్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్ కూడా ఉంది. గిన్నిస్ రికార్డుల ప్రకారం.. పేరొందిన అంతర్జాతీయ చెఫ్ జోయ్ కాల్డరోన్ తయారు చేసిన గ్రిల్డ్ ఛీజ్ శాండ్ విచ్ 214 డాలర్లు అంటే దాదాపు భారతీయ కరెన్సీలో రూ.17వేల ఖరీదు చేస్తుందట. న్యూయార్క్‌లోని 3 రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. షాంపేన్ తదితర ఖరీదైన వాటిని ఇందులో మేళవించడమే దీనికి కారణమట. -
స్వాప్నికళ
ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ క్రోచెట్ ఆర్టిస్ట్ జెన్నీ కింగ్ నోటి నుంచి వినిపించే మాట... ‘అల్లికల కళకు మాంత్రిక శక్తి ఉంది. అది మన మనసును ఎప్పుడూ ఆహ్లాదభరితం చేస్తుంది. మంత్రముగ్ధుల్ని చేసే మనోహర కళ ఇది’.మార్కాపురానికి చెందిన స్వాప్నిక రాజ్ఞీ చిన్నప్పుడే ఆ మంత్రముగ్ధకళలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ కళ ఇచ్చిన ఉత్తేజం ఊరకేపోలేదు. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక పేరు గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక అమ్మమ్మ తోటకూర క్రిస్టియనమ్మ పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ తీరిక వేళల్లో ఇంట్లో అల్లికలు (క్రోచెట్స్) చేసేది. అమ్మమ్మ అల్లికల పనిలో ఉన్నప్పుడు స్వాప్నిక ఆసక్తిగా గమనించేది. అలా ‘అమ్మమ్మ అల్లికల స్కూల్’ లో స్టూడెంట్‌గా చేరింది. గురువుగారి ప్రియ శిష్యురాలు అయింది. అల్లికలకు సంబంధించి ఎన్నో మెళకువలు అవలీలగా నేర్చుకుంది.కొత్త అల్లికల గురించి ఆలోచించడమే కాదు, క్రోచెట్స్కు సంబంధించి కొత్త రికార్డ్ల గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం. మదర్ ఇండియాస్ క్రోచెట్ క్వీన్స్ (ఎంఐక్యూ)లో ఆరు వేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రోచెట్ ఆర్టిస్ట్‌లకు స్ఫూర్తినిచ్చే సంస్థ ఇది. ‘క్రోచెట్ క్వీన్స్’కు చెందిన మహిళలు అతి పెద్ద క్రోచెటెడ్ దుప్పటి, అతి పెద్ద క్రోచెటెడ్ స్కార్ఫ్, అతి పెద్ద క్రోచెటెడ్ క్రిస్మస్ డెకరేషన్... మొదలైన వాటితో రికార్డ్ సృష్టించారు.‘ఎంఐక్యూ’లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్‌లపై ఆసక్తి మొదలైంది.‘గిన్నిస్ బుక్ రికార్డ్’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే సవాలు. అలాంటి అరుదైన సవాలును స్వీకరించే అవకాశం స్వాప్నికకు విశాఖపట్టణంలో వచ్చింది.విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనోవికాస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్’ సంస్ధ క్రోచెట్స్కు సంబంధించి నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది. ఈ సవాలుకు ‘సై’ అంటూ స్వాప్నిక బృందంలోని మహిళలు అతి తక్కువ సమయంలో 58,112 క్రోచెట్ స్క్వేర్లను తయారుచేసి ‘లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్స్ స్వే్కర్’ అనే టైటìఃల్ సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ రికార్డు కోసం 20వేల క్రోచెట్స్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా స్వాప్నిక బృందం 58,112 తయారుచేసి వరల్డ్ రికార్డు సాధించింది.‘గిన్నిస్ రికార్డ్ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పుతాం’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో స్వాప్నిక రాజ్ఞీ. కూచిపూడి నుంచి కరాటే వరకు‘నేర్చుకుంటే పోయేదేమీ లేదు... వచ్చేదే తప్ప’ అన్నట్లుగా ఉంటుంది స్వాప్నిక ఉత్సాహం. అల్లికల కళలో చేయి తిరిగిన స్వాప్నిక అక్కడితో ఆగిపోలేదు. తల్లిదండ్రులు నాగెళ్ల లీనా కెఫీరాల, డాక్టర్ కొండేపోగు డేవిడ్ లివింగ్ స్టన్ ్రపోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. బిఫార్మసీ చదివే రోజుల్లో స్వాప్నిక తన చేతులపై జీపును నడిపించుకుని సాహసవంతమైన ఫీట్ చేసింది. వృత్తిరీత్యా ఫార్మసిస్టు అయిన స్వాప్నిక ప్రవృత్తిరీత్యా ఆర్టిస్ట్. ఎప్పటికప్పుడు కొత్త కళలపై ఆసక్తి చూపుతుంటుంది.– గోపాలుని లక్ష్మీ నరసింహారావు, ‘సాక్షి’, మార్కాపురం, ప్రకాశం జిల్లా -
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!
ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్ మెషిన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్ సెబిన్ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. అయితే ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్ పరంగా అసెంబుల్ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్ అవ్వడమే కాక, వాష్ , రిన్ , స్పిన్, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్లను ఉపయోగించారు. సాజీ వాషింగ్ మెషీన్ ఎలా వర్క్చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వాషింగ్ మెషీన్లో చిన్న క్లాత్, చిటికెడు వాషింగ్ పౌడర్ వేయగానే ఎలా వాష్ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్ మెషీన్లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. (చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
వన్ ఫ్యామిలీ.. 20 గిన్నిస్లు!
పటాన్చెరు: కొన్నేళ్ల వ్యవధిలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 గిన్నిస్ రికార్డులను నెలకొల్పి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం అసాధారణ ఘనతను సొంతం చేసుకుంది. 17 గిన్నిస్ రికార్డులను తమ పేరిట లిఖించుకున్న గీతం డీమ్డ్ వర్సిటీ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లిదండ్రులు కవిత, అనిల్ తాజాగా 18, 19, 20 వ గిన్నిస్ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించారు. 3,400 ఒరిగామి నెమళ్లు, 4,400 ఒరిగామి చొక్కాలు, 3,200 ఒరిగామి పందుల బొమ్మ లను ఒకేచోట ఏర్పాటు చేసి అతిపెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆ కుటుంబం గిన్నిస్ సంస్థకు పంపగా వాటిని ఆ సంస్థ రికార్డులుగా అధికారికంగా నిర్ధారించింది. ఈ మేరకు గీతం యాజమాన్యం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో శివాలి కుటుంబం చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, క్విల్డ్ పూలు, ఒరిగామి వేల్స్, పెంగ్విన్లు, సిట్రస్ పండ్లు మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 17 గిన్నిస్ రికార్డులను సాధించింది. మొత్తం 20 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ అదనపు వీసీ ప్రొఫెసర్ డి.ఎస్.రావు, విభాగాధిపతులు అభినందించారు. -
శంకర్బాబుని పిలవండి... డ్యాన్స్ చేస్తాడనేవారు
156 చిత్రాలు... 537 పాటలు... 24 వేల డ్యాన్స్ మూమెంట్స్... ఆ 24వేల డ్యాన్స్ మూమెంట్స్ హీరో చిరంజీవి పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరేలా చేశాయి. యాక్టర్, డ్యాన్సర్ విభాగంలో ‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు చిరంజీవిని ఈ రికార్డ్‌కి ఎంపిక చేశారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డ్‌ని అందజేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘నటనకు అవార్డులు వస్తాయని తెలుసు. కానీ ఇలా డ్యాన్సులకు రావడం అనేది ఊహించలేదు. నాకు నటన మీదకన్నా డ్యాన్స్ మీద ఆసక్తి ఎక్కువ. బహుశా అదే నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి, మనకు సంబంధం ఏంటి? అని అనుకుంటాం కదా. అందుకని ఈ రికార్డు గురించి నాకు ఊహే లేదు. డ్యాన్స్ అనేది నాకు అదనపు అర్హత అయితే నా కొరియోగ్రాఫర్లు, నా ఈ విజయంలో నా దర్శక–నిర్మాతలు, అభిమానుల పాత్ర మరువలేనిది. నటనకన్నా ముందే డ్యాన్స్‌కి ఓనమాలు చిన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికి వివిధభారతి, రేడియో సిలోన్లో వచ్చే పాటలకు డ్యాన్సులు చేసేవాడిని. రేడియోల్లో పాటలు రాగానే, ‘శంకర్‌బాబు (చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్) ని పిలవండి. డ్యాన్సులు వేస్తాడు’ అనేవారు. ఉత్సాహంగా స్టెప్పులు వేసేవాడిని. ఎన్సీసీలో చేరాక సాయంత్రాల్లో తిన్నాక అల్యూమినియమ్ ప్లేట్లను తిరగేసి వాయించి డ్యాన్సులు వేసేవాడిని కాలు జారి పడినా ఆపలేదు ఒకసారి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సావిత్రి, రోజా రమణి, కవిత, నరసింహరాజు... ఇలా అందరూ సాయంత్రం ఓ పంచలో కూర్చున్నారు. లైట్‌గా వర్షం పడుతోంది. నన్ను డ్యాన్స్ చేయమని అడిగారు. వర్షానికి కాలు జారి కిందపడినా ఆపలేదు. దాన్ని నాగిని డ్యాన్సులాగా మార్చేసి స్టెప్పులేశాను. అక్కడున్న కో–డైరక్టర్ చూసి దర్శకుడు క్రాంతికుమార్‌గారికి చె΄్పారు. ప్రాణం ఖరీదు’కి నన్ను తీసుకున్నప్పుడు ‘ఏలియల్లో ఏలియల్లో ఎందాక...’ అనే పాటను పెట్టారు. ఆ పాటకు స్టెప్ వేశాను. దానికన్నా ముందు ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్ వేస్తూ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాను. చిరంజీవి ఉంటే ఎక్కువ డబ్బు అన్నారు ఆ రోజుల్లో లింగమూర్తిగారు డిస్ట్రిబ్యూషన్‌కి చీఫ్. ఆయన ఏ నిర్మాత కథ వింటారు? ఎవరికి డబ్బులు శాంక్షన్ చేస్తారనే పరిస్థితి ఉండేది. ఒకసారి ఆయన ‘చిరంజీవి అని కొత్తగా వస్తున్నాడు. అతనితో సినిమాలు చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాను. లేదంటే లిమిటెడ్‌గా ఇస్తాను’ అన్నారు. దాంతో అందరూ చిరంజీవినే పెట్టుకుందాం అనుకునేవారు. లింగమూర్తిగారికి ప్రజానాడి తెలుసు. ఆడియన్స్ ఇతని సాంగ్స్ కోసమే సినిమాలకు వస్తున్నారు. అలాంటప్పుడు ఇతనితో సినిమాలు చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా అని ఆయన మా నిర్మాతలతో అనడం.. వాళ్లు కూడా నాకు అవకాశాలు ఇవ్వడం అన్నది నాకు ప్లస్ అయింది’’ అన్నారు. ఆ డ్యాన్సుల్లో మనసు కనబడుతుందిఆమిర్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు ఫోన్ చేసి, ఈవెంట్‌కి రావాలని అడిగినప్పుడు ‘అడగకూడదు... మీరు ఆర్డర్ వెయ్యాలి’ అన్నాను. చిరంజీవిగారి డ్యాన్సులు ఎందుకు బాగుంటాయంటే ఆ డ్యాన్సుల్లో ఆయన మనసు కనబడుతుంది. తనని తాను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు కాబట్టి చూడ్డానికి మనకు రెండు కళ్లూ సరిపోవు’’ అన్నారు. 537 పాటలు చూడటం నాకో మంచి అనుభూతి రిచర్డ్ స్టెన్నింగ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారి 46 ఏళ్ల కెరీర్లో రిలీజైన కమర్షియల్ సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. 156 సినిమాలనేది అద్భుతమైన అచీవ్మెంట్. ఆ సినిమాల్లో ఆయన డ్యాన్స్ చేసిన పాటలను తీసుకున్నాం. 537 పాటల్లో ఆయన వేసిన 24 వేల డ్యాన్స్ మూవ్స్ చూశాం. ఆ పాటలు చూడటం వ్యక్తిగతంగా నాకు మంచి అనుభూతినిచ్చింది. ఆయనకు గిన్నిస్ రికార్డ్ అందించాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్‌కు చిరంజీవి ఓ పెన్నుని బహుమతిగా అందజేశారు. ఇంకా దర్శక–నిర్మాతలు కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్ర రావు, బి. గోపాల్, గుణశేఖర్, బాబీ, వశిష్ఠ, అశ్వనీదత్, కేఎస్ రామారావు, అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, పి. కిరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులు సుష్మిత, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజునే చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకోవడం ఓ విశేషం. కాగా సరిగ్గా చిరంజీవి పుట్టిన సంవత్సరం 1955లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి శ్రీకారం జరిగింది. అయితే చిరంజీవి పుట్టిన తేదీ 22 కాగా... ఈ రికార్డ్‌కి శ్రీకారం చుట్టింది 19వ తేదీన.25 రోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నారని, అయినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని యాంకర్ పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని కూడా తెలిపారు. -
గిన్నిస్‌బుక్‌లో చిరంజీవి.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వరంతో గిన్నిస్ రికార్డు..ఏకంగా 72 గంటల 30 నిమిషాల..!
ఘనత సాధించిన రేడియో విష్ణు 90.4. వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్లపాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన వంద మంది రేడియో జాకీల్లో 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు.‘గుడ్ మార్నింగ్... భీమవరం. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం’ అంటూ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఉపాధి, వాతావరణం.. ఇలా నిరంతర సమగ్ర సమాచారాన్ని శ్రావ్యమైన గొంతుతో ప్రజాపయోగకరమైన వంద అంశాలపై 72 గంటల 30 నిముషాల 30 సెకన్ల పటు నిరంతర ప్రసారంలో అనర్గళంగా మాట్లాడి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.కమ్యూనిటీ రేడియో !ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్య కేంద్రీకృత, చర్చా ఆధారిత తొలి రేడియో స్టేషన్‌గా ఈ కమ్యూనిటీ రేడియో గుర్తింపు పొందింది. సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రసారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు సుదీర్ఘ రేడియో ప్రసారం 66 గంటల 6 నిముషాల 1 సెకనుగా నార్త్ ఆఫ్రికాలోని ట్యునీషియా పేరిట గిన్నిస్ రికార్డు ఉంది.15 ఏళ్లుగా గొంతు వినిపిస్తోంది!విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డిబేటింగ్ ఎబిలిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ పెంపొందించడం లక్ష్యంగా భీమవరంలోని విష్ణు క్యాంపస్‌లో చైర్మన్ కేవీ విష్ణురాజు 2007 సంవత్సరంలో రేడియో విష్ణు ప్రారంభించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
గిన్నిస్ రికార్డుల్లోకి బెంజ్ కారు.. ఫుల్ చార్జింగ్‌తో 949 కిమీ
సింగిల్ చార్జితో 949 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకేముంది గతంలో ఉన్న రికార్డును తిరగరాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఆటోకార్ ఇండియా సహకారంతో మెర్సిడెస్ బెంజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ వెహికిల్ అయిన ఈక్యూఎస్ 580 4మేటిక్ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణించి ఈ ఘనతను సాధించింది.ఒక వైపు భారీ వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు.. మరోవైపు నగరాలు, పట్టణాల ట్రాఫిక్‌ను చేధించుకుంటూ ఏకధాటిగా ప్రయాణం సాగిందని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ప్రయాణినికి ఉపయోగించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్. ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీసింగిల్ చార్జితో 916.74 కిమీ ప్రయాణించిన యూకేలో ‘ఫోర్డ్ మస్టాంగ్ మ్యాక్ ఈ’ కారు పేరిట ఈ గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ మెర్సిడెస్ బెంజ్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ పొందిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి అభినందించారు. -
ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
ఒక ఫోన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది.. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక ట్యాబ్ అంటే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏకంగా 6.74 అడుగుల ఫోన్ ఒకటి వెలుగులోకి వచ్చేసింది. అంటే సగటు మనిషి ఎత్తుకంటే ఎక్కువే.బ్రిటీష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ.. ప్రపంచములోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ రూపొందించారు. దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది. యితడు రూపొందిన ఫోన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్. దీని ఎత్తు 6.74 అడుగులు. ఈ ఫోన్ తయారు చేయడానికి మైనీ గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ 'మాథ్యూ పెర్క్స్'తో జతకట్టాడు.ఇదీ చదవండి: రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ తయారీకి సంబంధించిన వీడియోను కూడా అరుణ్ రూపేష్ మైనీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో ఫోన్ తయారు చేయడానికి సంబంధించిన విషయాలను పూర్తిగా చూడవచ్చు. మొత్తానికి భారీ ఐఫోన్ రూపొందించేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ భారీ ఫోన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.This scaled-up version of an iPhone 15 Pro Max was created by @mrwhosetheboss and @DIYPerks 📱 pic.twitter.com/vqhjMqTA0S— Guinness World Records (@GWR) September 6, 2024 -
ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్: విశేషాలు
ఎవరూ చేయలేని అద్భుతాలు చేసినప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. 23 ఏళ్ల విద్యార్థి 'తపాలా నాదముని' బాల్‌పాయింట్ పెన్ భాగాలను ఉపయోగించి ఒక వాల్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాక్యూమ్ క్లీనర్ కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.చిన్నప్పటి నుంచే గాడ్జెట్లను తయారు చేయడం పట్ల అభిరుచి కలిగిన నాదముని 2020లో 0.69 ఇంచెస్ వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత దానికంటే 0.07 ఇంచెస్ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించారు. దీనిని తయారు చేయడానికి 8 నెలల సమయం రూ. 20000 డబ్బు ఖర్చు అయినట్లు సమాచారం.ఈ చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌లో రివాల్వింగ్ ఫ్యాన్, ఫోర్-వోల్ట్ వైబ్రేషన్ మోటారును ఉపయోగించారు. ఇది సులభంగా దుమ్ము కణాలను సేకరిస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తయారీకి కొన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ బిట్స్, మెటల్ కూడా ఉపయోగించినట్లు నాదముని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలునాదముని రూపొందించిన ఈ చిన్న ఆవిష్కరణలే.. అతన్ని సూక్ష్మ ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా నిలిపాయని పేర్కొన్నారు. దీనిని చూసి కాలేజీలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపోతున్నారని, అధ్యాపకులు అభినందిస్తున్నారని నాదముని వెల్లడించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద వంకాయ..గిన్నిస్ రికార్డు!
అమెరికాకు చెందిన డేవ్ బెన్నెట్ అతి పెద్ద వంకాయను పండించి గిన్ని స్ వర్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ వంకాయ ఆశ్చర్యపరిచే విధంగా ఏకంగా 3.778 కేజీల బరువు ఉంది. సుమారు 16 అడుగుల పొడవు, 35 సెంటిమీటలర్ల చుట్టుకొలతతో ఉంది. జూలై 31న అయోవాలోని బ్లూమఫీల్డ్లో ఇంత పెద్ద భారీ వంకాయ కాసినట్లు గుర్తించాడు. ఇది సాధారణ మార్కెట్లలో పండించే వంకాయ కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. ఈ వంకాయకి సంబంధించిన విత్తనాలను ఏప్రిల్‌లో నాటినట్లు తెలిపాడు. జూలై నాటికి కాయడం ప్రారంభించిందని వివరించాడు. అంతేగాదు ఇదే ప్రపంచంలోనే అత్యంత భారీ వంకాయ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకటించింది. ఈ అద్భుతమైన వంకాయను ప్రపంచ రికార్డుల జాబితాలో చేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని అధికారులు తెలిపారు. అందుకు సంబంధంచిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: ఆ దేశంలో జీన్స్ బ్యాన్..పొరపాటున ధరిస్తే అంతే సంగతులు..!) -
బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు. 347 ఫ్లాష్ కార్డ్స్‌ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు సోమవారం తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్లైన్లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఇవి చదవండి: కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం -
సిక్స్ ప్యాక్ చెఫ్ ’కట్ చేస్తే’ : వరల్డ్ రికార్డ్, వైరల్ వీడియో
కూరగాయలు కట్ చేయడం కూడా ఒక కళే. కళే కాదు వరల్డ్ రికార్డు కూడా అని నిరూపించాడు ఒక నలభీముడు. అదీ కళ్లు మూసుకుని. ‘సిక్స్ ప్యాక్ చెఫ్’గా పేరొందిన కెనడియన్ చెఫ్ వాలెస్ వాంగ్(WallaceWong) కట్ చేయడంలో తన రికార్డుల పరంపరను కొనసాగించాడు. తాజాగా ఏకంగా కళ్లకు గంతలు కట్టుకొని మరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పదునైన కత్తితో, తొమ్మిది టొమాటోలను సమానభాగాలుగా కట్ చేశాడు.చెఫ్ వాంగ్ జూన్ 12న లండన్‌లో కేవలం 60 సెకండ్ల వ్యవధిలో 9 టమోటాలను కోసి ఈ ఘనతను సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. వాయువేగంతో, అన్ని టొమాటాలను సమానంగా అందంగా కత్తిరించాడని వెల్లడించింది. ఇక్కడ విశేషం ఏంటేంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చిన టమాటా ముక్కల స్థానంలో అతని వేళ్లు ఉండేవి. కానీ ప్రయోగాలు,రికార్డులు అతనికి వెన్నతో పెట్టిన విద్య. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)చాలా జాగ్రత్తగా ఒడుపుగా కట్ చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. వాలెస్ వాంగ్ ఈ ఒక రికార్డును మాత్రమే కాదు 2023, ఇటలీలో మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. తాజా వీడియోపై కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించగా, మా అమ్మ కూడా బాగా కట్ చేస్తుందని ఒకరు, ఇండియాలో ఇంతకంటే వేగంగా కట్ చేసే నిపుణులు చాలామంది ఉన్నారు అంటూ మరొకరు కమెంట్ చేశారు.వాలెస్ వాంగ్ చెఫ్, ఫిట్నెస్ అథ్లెట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మాత్రమే కాదు. ఒక కంపెనీకి సీఈవో కూడా. కేన్సర్ సర్వైవర్. ప్రపంచవ్యాప్తంగా అనేక టాప్ మెస్ట్ రెస్టారెంట్లలో పనిచేశాడు. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లున్నారు. Can he beat the record? #chef #worldrecord #foodpreparation #canadasgottalent #foodchopper guinessworldrecord Wallace Wong attempts a World Record on Canada's Got Talent! 🥕🔪 pic.twitter.com/FpJPRDJ9WC— Olivia Gran (@GranOlivia) April 21, 2024 -
24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి..
మధ్యప్రదేశ్ వ్యాపార రాజధాని ఇండోర్ పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. కేవలం 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఈ నగరం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇండోర్ నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు, పురుషులు, సామాన్యులు.. అంతా కలసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, పట్టణ పరిపాలనా మంత్రి కైలాష్ విజయవర్గీయ, మేయర్ పుష్యమిత్ర భార్గవ తదితరులు ఒక్కరోజులో 11 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 50 వేల మంది శ్రమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, ఉద్యానవనాలు, అడవుల్లో మొక్కలు నాటారు.ఇండోర్‌లోని బీఎస్ఎఫ్ రేవతి రేంజ్లో 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు ‘మా తుజే సలామ్’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను మొక్కలు నాటుతూ ఇతరులను ఉత్సాహపరిచారు. -
జొమాటో గిన్నిస్ రికార్డ్.. సీఈఓపై మండిపడ్డ కునాల్ కమ్రా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల 'ఒకే వేదిక వద్ద అతిపెద్ద ఫస్ట్ ఎయిడ్ లెసన్' నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. ఫోటోలు కూడా షేర్ చేశారు.దీపిందర్ గోయల్ ట్వీట్ మీద హాస్యనటుడు 'కునాల్ కమ్రా' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జొమాటో సీఈఓ వారి డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం, వారి పని గంటల గురించి ప్రకటించగలరా?. కానీ ఒక రోజులో ఎన్ని కేజీల బిర్యానీ ఆర్డర్ చేశారో చెప్పగలరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డ్జొమాటో కంపెనీ ఇటీవల తన 4300 మంది డెలివరీ భాగస్వాములకు ఒకే వేదిక మీద ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన కల్పించారు. జొమాటో డెలివరీ భాగస్వాములు ఇకపైన ప్రధమ చికిత్స సమయంలో కూడా సహాయం చేయగలరు.. భారతదేశంలోని ఈ ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్, పెద్ద థాంక్స్ అంటూ దీపీందర్ గోయల్ ట్వీట్ చేశారు.జొమాటో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఇది పలువురు నెటిజన్లను ఎంతగానో ఆకర్శించింది. కొందరు దీపేందర్ గోయల్‌ను ప్రశంసించారు. ఇది అద్భుతమైన అచీవ్మెంట్.. డెలివరీ భాగస్వాములకు హ్యాట్సాఫ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.Can you declare the no of delivery partners you have with their average income & working hours over the last 3 months?No you can’t But you can tell kgs of biryani ordered in one day. You’re such a hack bro… https://t.co/C4zjZP7CVv— Kunal Kamra (@kunalkamra88) June 13, 2024 -
ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు!
పెళ్లి అంటే ఈడు జోడు ఉండాలి, ఇరు సంప్రదాయాలు అన్ని కలవాలి అని చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడూ ఈ రోజుల్లో అదంతా కష్టంగా మారింది.కెరీర్ అంటూ.. ముప్పై, నలభైల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్థితికే ప్రాధాన్యత, మిగతా అంతా ఎలా ఉన్న పర్లేదు అన్నట్లుగా ఉంది వ్యవహారం. అలాంటి పరిస్థితుల్లో శారీరకపరంగా పొట్టిగా ఉన్న ఓ జంట మాత్రం తమలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తులు దొరికే వరకు నిరీక్షించి మరీ పెళ్లి చేసుకున్నారు. పైగా అదే వారిని విలక్షణమైన జంటగా రికార్డులకెక్కేలా చేసింది. వివరాల్లోకెళ్తే..బ్రెజిలియన్కి చెందిన పాలో గాబ్రియేల్ డా సిల్వా బారోస్, కటియుసియా లీ ఇద్దరూ ఆహార్యం పరంగా అత్యంత పొట్టి వ్యక్తులు. సమాజం నంచి ఎదురైనా అవహేళనలు, ఒత్తిళ్లకు తగ్గకుండా..తమలాంటి వ్యక్తులు కోసం అన్వేషించారు. వారి భౌతిక లక్షణాలను అంగీకరించి మరీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. వారి అన్వేషణ ఎట్టకేలకు ఫలించి 2006లో ఇరువురు కలుసుకోవడం జరిగింది. దాదాపు 15 ఏళ్లుగా ఒకరి అభిప్రాయాలను ఒకరు షేర్ చేసుకుంటూ..వారి మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించుకున్నారు.ఆ తర్వాత ఇరువురు వివాహ బంధంతో ఒక్కటి అవ్వాలని భావించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ప్రపంచంలోని అత్యంత పొట్టి వివాహిత జంటగా గిన్నిస్ రికార్డులకెక్కారు. జీవతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాం. తామిరువురం ఎదురపడతామనే ఊహించలేదు. అలాగే మా బంధాన్ని కొనసాగించగలమా? లేదా ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని ఇరువరి నిలబడగలుగుతామా అని నిర్ణయించుకుని, ఒకరిపై ఒకరికి అవగాహన ఏర్పడ్డాక తాము వివాహ బంధంలోకి అగుడుపెట్టాం అని చెబుతోంది ఆ జంట. అంతేగాదు తాము చూసేందుకు చిన్నగా ఉన్నా తమ ఇద్ది\రి మనసులు చాలా విశాలమని, జీవితం విసిరే ప్రతి సవాలుని ఎదుర్కొని సంతోషంగా జీవించగలమని నమ్మకంగా చెబుతున్నారు. కాగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఈ జంట ఉమ్మడి ఎత్తు 181.41 సెం.మీ (71.42 అంగుళాలు). పాలో ఎత్తు 90.28 cm (35.54 in) అయితే కటియుసియా ఎత్తు 91.13 సెం.మీ(35.88 అంగుళాలు). ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామం వేదికగా వెల్లడించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు. అంతేగాదు నెజన్టు కూడా ది బెస్ట్ కపుల్, ఈ జంట సూపర్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు) -
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
నైన్ ఆల్ ఫైన్
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్‌కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. -
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్‌లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
ఐదురోజుల పాట.. రికార్డు సాధించింది ఇలా..!
వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్ సదర్భంగా ఆమె తన గాన మారథాన్‌ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్‌ను బ్రేక్ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్ సునీల్ వాగ్మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు. What’s your experience with Chocolate 🍫? Plus your location. #afuaasantewaasingathon #ChocolateLovers #ghanachocolate #fypageシ pic.twitter.com/PeGDSInxwq — AFUA ASANTEWAA SINGATHON 🇬🇭 (@efiadahemaa) January 26, 2024 -
ఐదురోజుల పాట..గిన్నిస్ వరల్డ్ రికార్డు
వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్ సదర్భంగా ఆమె తన గాన మారథాన్ ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్‌ను బ్రేక్ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్ సునీల్ వాగ్మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు. -
ముక్కుతో 'ఈల' పాట విన్నారా?
ఈల పాటలు వినే ఉంటారు. కానీ ఇలాంటి ఈల పాట విని ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే? ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండి ఉండరు కూడా. వింటే ఇలా కూడా ఈల వేస్తారా అని ఆశ్చర్యోవడం ఖాయం.! ఈలపాట పాడటం అంత ఈజీ కాదు. చాలామంది హుషారుగా ఉన్నప్పుడు ఏదో కొద్ది క్షణాల సేపు ఈలతో కూనిరాగాలు తీస్తుంటారు గాని, పూర్తిపాటను శ్రుతిలయలు తప్పకుండా పాడలేరు. అలా పాడగలిగే వారు చాలా అరుదు. అందుకే ఈలపాట కచేరీలు చేసేవారిని అంతా అబ్బురంగా చూస్తారు. ఆరితేరిన ఈలపాట గాయకులు సైతం నోటితో ఈలవేసే బాపతే గాని, వారెవరూ ముక్కుతో ప్రయత్నించలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ యువతి మాత్రం ఇంచక్కా ముక్కుతో ఈలపాటలను ఇట్టే పాడేస్తోంది. ఈమె పేరు లులు లోటస్. కెనడాలోని ఒంటారీయోకు చెందిన ఈమె ముక్కు దగ్గర మైకుపెట్టుకుని పాడుతుంటే జనాలు ఉర్రూతలూగుతారు. ముక్కు ద్వారా 44.1 డెసిబల్స్ ధ్వనితో ఈలపాటలు పాడగలగడమే ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ఈమెను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
కొత్త ఏడాదిలో ప్రపంచ రికార్డు : అదేంటో తెలుసా..!
ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు (SuryaNamaskar)చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి వైనం విశేషంగా నిలిచింది. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గుజరాత్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఏకంగా నాలుగు వేల మంది సామూహిక సూర్య నమస్కారాల్ని ఆచరించారు. 108 ప్రాంతాల్లో, 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోను, ఫోటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించడం గర్వంగా ఉందని గుజరాత్ హోం మంత్రి సంఘవి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ప్రపంచ రికార్డ్ అని గిన్నిస్ ప్రతినిధి తెలిపారు. సూర్య నమస్కారం చేసే అత్యధిక మంది రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ ధృవీకరించారు. ఇంతకుముందు ఎవరూ ఈ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నించ లేదు కాబట్టి ఇది కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అన్నారు. 2024లో గుజరాత్ ఈ ఘనత సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా మన సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలోని మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన ఈ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ హాజరైనారు. పలువురు విద్యార్థులు, వృద్ధులు, యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. Gujarat welcomed 2024 with a remarkable feat - setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP — Narendra Modi (@narendramodi) January 1, 2024 -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ‘కూచిపూడి డ్యాన్స్ లెసన్’
గచ్చిబౌలి (హైదరాబాద్): తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నిస్ వరల్డ్ రికా ర్డ్స్లోకి ఎక్కింది. ఏకకాలంలో 3,783 మంది కళా కారులు కూచిపూడి నృత్యంచేసి కళా వైభవాన్ని ప్ర పంచానికి చాటారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వ ర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచి పూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు. స్టేడియం నలు మూలలా ఏడు నిమిషాలపాటు కళాకారులు నృత్యంచేస్తూ అలరించారు. గురువు పసుమర్తి శేషు బాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. గిన్ని స్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రిషినాథ్ నిర్వాహ కులకు సర్టిఫికెట్‌ను అందజేశారు. 2020లో త్యాగ రాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఏక కాలంలో 1,183 మంది కళాకారులు కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారని రిషినాథ్ తెలిపారు. కళలను ప్రోత్సహించి ప్రేరణ కల్గించాల్సిన అవస రం ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పాఠశాల స్థాయి లోనే కళలను ప్రోత్సహించే సంఘాలుండాలని ఆ యన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ కూచిపూడి నృత్యం తెలుగువారికి ఎంతో ఇష్టమైందని, ఈ నృత్యరూపకం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లలిత, వ్యవస్థాపక అధ్యక్షుడు రమణారావు పాల్గొన్నారు. -
ఎంత పెద్ద జుట్టో..! గిన్నీస్ రికార్డ్ కైవసం
లక్నో: కురులు ఆడవారికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందుకే పొడవాటి కేశాల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే యూపీలో ఓ మహిళ ఏకంగా 7 పీట్ల 9 ఇంచుల పొడవైన జుట్టును కలిగి ఉంది. ఇంతటి భారీ కేశాలతో ఏకంగా గిన్నీస్ రికార్డ్‌ను సాధించింది. స్మితా శ్రీవాస్తవ(46) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ. ఆమె తన 14వ ఏట నుంచి జుట్టును కత్తిరించలేదు. అప్పటి నుంచి ఆమె జుట్టు క్రమంగా పెరగసాగింది. ప్రస్తుతం ఆమె జుట్టు 7 పీట్ల 9 ఇంచుల పొడవు ఉంది. ఇంతటి స్థాయిలో కేశాలను కలిగి ఉండటంతో ప్రపంచ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. "భారతీయ సంస్కృతిలో దేవతలకు చాలా పొడవాటి జుట్టు ఉంటుంది. మన సమాజంలో జుట్టు కత్తిరించడం అశుభం అని భావిస్తారు. అందుకే మహిళలు జుట్టును పెంచుకునేవారు. పొడవాటి జుట్టు మహిళల అందాన్ని పెంచుతుంది." అని స్మిత వివరించారు. ఈ జుట్టుకు తాను ప్రతి వారం రెండు సార్లు శుభ్రం చేస్తానని స్మిత చెప్పారు. జుట్టును శుభ్రం చేసిన ప్రతిసారి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. తన పొడవాటి జుట్టును చూసి చాలా మంది సెల్ఫీ తీసుకుంటారని చెబుతోంది. ప్రస్తుతం గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
వామ్మో..! నోట్లో ఎన్ని పళ్లో..? గిన్నీస్ రికార్డ్
సాధారణంగా మనందరి నోట్లో 32 పళ్లుంటాయి. కానీ కల్పనా బాలన్(26) అనే మహిళకు నోట్లో ఏకంగా 38 పళ్లున్నాయి. ఈ ఘనతతో మహిళల్లో అత్యధిక పళ్లున్న జాబితాలో ఆవిడ గిన్నీస్ రికార్డ్ సాధించారు. తనకు అడ్డంకిగా ఉన్న పళ్లే రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. Kalpana Balan from India has six more teeth than the average human. Read more by clicking the picture 👇 — Guinness World Records (@GWR) November 20, 2023 కల్పనకు నాలుగు అదనపు దవడ (దిగువ దవడ) పళ్ళు, రెండు అదనపు దవడ (ఎగువ దవడ) పళ్ళు ఉన్నాయి. తన యుక్తవయసులో ఉండగానే అదనపు దంతాలు ఆవిర్భవించాయి. అవి క్రమంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ పైకి వచ్చాయి. ఎటువంటి నొప్పిని కలిగించనప్పటికీ ఆహారం తరచుగా అదనపు దంతాల మధ్య చిక్కుకుపోతోందని కల్పన తెలిపారు. అదనపు దంతాలు ఏర్పడినప్పుడు ఆశ్చర్యపోయినట్లు కల్పన తల్లిదండ్రులు తెలిపారు. వాటిని తీసివేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ పూర్తిగా పెరిగిన తర్వాతనే తొలగించాల్సి ఉంటుందని వైద్యులు సూచించడంతో ఆగిపోయారు. ఇబ్బందిగా మారిన ఈ పళ్లే తనకు గిన్నీస్ రికార్డ్ సాధించి పెట్టడం పట్ల కల్పన ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. కల్పనలో మరో రెండు అసంపూర్తిగా ఉన్న పళ్లు ఉన్నాయి. అవి పెద్దైతే ఈ రికార్డ్‌ను ఆమె మరింత పెంచనున్నారు. ప్రస్తుతం మగవారిలో అత్యధికంగా 41 పళ్లున్న జాబితాలో కెనడాకు చెందిన ఎవనో మెల్లోన్ రికార్డుల్లో నిలిచారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం
-
గిన్నీస్ రికార్డు సాధించిన తెలుగుతేజం నిహాల్!
న్యూజెర్సీ: అక్టోబర్ 7, 2023 అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధికంగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా బ్యాటరీలను ఇంతవరకు ఎవరు లైనింగ్ చేయలేదు.. కానీ మన తెలుగు విద్యార్థి నిహాల్ తన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యుల సహకారంతో ఈ ఘనతను నిహాల్ సొంతం చేసుకున్నారు. నిహాల్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం యావత్ తెలుగువారికి గర్వకారణం.. ఇది ప్రపంచంలో పర్యావరణ మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని గిన్నీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్‌లో రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సాధించిన విజయాలను అధికారికంగా నమోదు చేసి నిహాల్‌కు గిన్నీస్ రికార్డు ధ్రువ పత్రాన్ని అందించారు. రీసైకిల్ మై బ్యాటరీ సాధించిన ఈ విజయం తన పిలుపు స్పందించిన విద్యార్ధుల సహకారంతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నిహాల్ తెలిపాడు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి 10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్‌కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది. 2019లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
Video: ప్లేయింగ్ కార్డ్స్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు..
కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చంటారు. కష్టపడేతత్వం ఉంటే ఎంతటి లక్ష్యాలను అయినా సాధించగలం. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు 15 ఏళ్ల బాలుడు నిదర్శనంగా నిలిచాడు. తన అసాధారణ ప్రతిభతో ఏకంగా వరల్డ్ రికార్డునే కొల్లగొట్టాడు. కోల్‌కతాకు చెందిన అర్నవ్ దగ అనే 15 ఏళ్ల బాలుడు ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఎలాంటి టేపు, గమ్ సాయం లేకుండా ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేయడం విశేషం. దీని పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలతో ప్రాజెక్టును నిర్మించాడు. దీంతో అర్నవ్ రూపొందిన ఈ కట్టడం గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం’గా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తమ ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించింది. బ్రయాన్బెర్గ్ మూడో హోటళ్లను 34 అడుగుల 1 అంగుళం పొడవుతో, 9 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 11 అడుగుల 7 అంగుళాల వెడల్పుతో నిర్మించాడు . తన ప్రాజెక్ట్ గురించి అర్నవ్ మాట్లాడుతూ.. ప్లేయింగ్ కార్డ్స్‌తో నిర్మాణాన్ని చేపట్టేందుముందు నాలుగు ప్రఖ్యాతి ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపాడు. వాటి నిర్మాణం, పని, ఆర్కిటెక్చర్ అన్నీంటిని అధ్యయం చేసినట్లు చెప్పాడు.‘ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్ కార్డ్స్‌తో చిన్న చిన్న మేడలు కట్టడం మొదలుపెట్టానని తెలిపాడు. లాక్డౌన్ సమయంలో దీనిపై మరింత కసరత్తు చేశా. దీంతో మూడేళ్లు శ్రమించి గిన్నిస్ రికార్డులో స్థానం సంపాధింనని అర్నవ్ తెలిపాడు. -
కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం
ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్ రాజశేఖర్. ఈ చిన్నారికి చెస్ అంటే ఇష్టం. తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్లలో చెస్‌బోర్డ్‌పై అత్యంత వేగంగా 32 పావులను సెట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. -
దోసిత్తనంపై అద్భుతం
కళ్యాణదుర్గం: బియ్యపు గింజలు... సుద్దముక్కలు.... సబ్బు బిళ్లలు... పెన్సిళ్లు... కాదేదీ కళకు అనర్హం అన్నట్టు తన సూక్ష్మ కళతో ఆర్టీసీ కండక్టర్ వివేకానంద అద్భుత చిత్రాలు ఆవిష్కరిస్తున్నారు. అక్షరాలను సూక్ష్మంగా రాస్తూ మైక్రో ఆర్టిస్ట్‌గా అవతారమెత్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. దోస కాయ విత్తనాలతో పాటు బియ్యం గింజలపై 189 తెలుగు అక్షరాలు, వందేమాతర గీతం, వేమన పద్యాలు రాసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. దోసకాయ విత్తనాలపై గాంధీ, మూత్ర పిండాల వ్యవస్థ, తాజ్‌మహల్, ఏసు శిలువ, పడవ, గుడిసె తదితర బొమ్మలను చిత్రీకరించారు. బియ్యపు గింజపై సెలవుచీటి రాసి అందరినీ అబ్బురపరిచారు. సుద్దముక్కపై సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలతో పాటు జంతువుల బొమ్మలూ వేశారు. అగ్గిపుల్ల, నారుపోగులపై ఏ నుంచి జడ్ వరకూ ఆంగ్ల అక్షరాలు లిఖించి ఆకట్టుకున్నారు. అలాగే పురాతన నాణేల సేకరణపై సైతం మక్కువ పెంచుకున్న ఆయన ఇప్పటి వరకూ భారతదేశంతో పాటు బెల్జీయం, జర్మనీ, ఆప్ఘనిస్తాన్, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాలకు చెందిన సుమారు 300కు పైగా నాణేలు సేకరించారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకునేలా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎం.వివేకానంద కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. 1995లో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సూక్ష్మ కళతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు దక్కించుకోవచ్చునని తెలుసుకున్న వివేకానంద తాను కూడా మైక్రో ఆర్టిస్ట్‌గా రాణించాలని భావించారు. అప్పటి నుంచి తన సాధనను మొదలు పెట్టిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పోస్టుకార్డుపై 2,058 ఇంగ్లిష్ అక్షరాలతో ‘జై సమైక్యాంధ్ర’ అనే నినాదాన్ని ఏపీ చిత్ర పటం ఆకారంలో లిఖించారు. అగ్గిపుల్లలపై జై సమైక్యాంధ్ర నినాదాన్ని 76 అక్షరాలతో, బియ్యపు గింజపై 14 అక్షరాలతో రాశారు. ప్రస్తుతం ఆయన అగ్గిపెట్టెలో పట్టేంత చిన్నపాటి పుస్తకంలో భగవద్గీత రాస్తున్నారు. ఇప్పటి వరకూ 9 పర్వాలు పూర్తయ్యాయి. కాగా, 2 సెం.మీ. వెడల్పు, 3 సెం.మీ. పొడవు పరిమాణంలో ఉన్న పుస్తకంలో మాత్రమే భగవద్గీత రాసినట్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఉంది. ఈ రికార్డును అధిగమించేలా 1.8 సెం.మీ. వెడల్పు, 2.8 సెం.మీ. పొడవు (అగ్నిపెట్టె) పరిమాణంలో ఆయన భగవద్గీత రాస్తూ గత రికార్డును బద్ధలుగొట్టే దిశగా ప్రయత్నిస్తూనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌కు చేరువయ్యారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంటా మనసుంటే మార్గం ఉంటుంది అనే నమ్మకంతో ముందుకు పోతున్నా. ఇప్పటి వరకూ దోస విత్తనాలు, బియ్యపు గింజలపై ప్రముఖుల చిత్రాలతో పాటు సైన్స్‌కు సంబంధించిన అంశాలను చిత్రీకరించాను. ప్రస్తుతం అగ్గిపెట్టెలో పట్టేంత పరిమాణమున్న పుస్తకంలో భగవద్గీత రాస్తున్నా. ఎలాగైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్సలో చోటు దక్కించుకుంటా. – ఎం.వివేకానంద, ఆర్టీసీ కండక్టర్ -
కురులతో భారత కుర్రాడు.. గిన్నిస్ బుక్ ఎక్కేశాడు
లండన్: చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటుంటే.. అంతా అతన్ని ఏడిపించేవారట. అమ్మాయిలా.. ఆ జుట్టేంట్రా అని టీజ్ చేసేవారట. అది అతన్ని ఎంతో బాధించేదట. ఇంట్లో గోల చేసి మరీ ఆ జుట్టును తొలగించే ప్రయత్నమూ చేశాడట. కానీ, మత సంప్రదాయాలు(సిక్కు) పాటించే ఆ తల్లిదండ్రులు.. అతనికి సర్దిచెప్పారు. అలా 15 ఏళ్లపాటు అతను ఓర్పుగా పెంచుకున్న జుట్టు అతనిప్పుడు పాపులర్‌ని చేసింది. 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్.. ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు ఉన్న టీనేజర్‌గా(కుర్రాడు) గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిదక్‌దీప్.. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జుట్టు తీసింది లేదట. అలా అదిప్పుడు 146 సెంటీమీటర్లు పెరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో చోటు దక్కేలా చేసింది. Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It's took him 15 years to grow the longest head of hair on a teenager. — #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023 పెరిగేకొద్దీ ఒకానొక టైంలో.. నాకు జుట్టు మీద ఇష్టం పెరిగింది. కానీ, దానిని మెయింటెన్ చేయడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తాను. కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తారు. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుందేమో!.రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు మా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నమ్మలేదు::: సిదక్‌దీప్ -
250 మంది మహిళలు, ఒకే ఆలోచన.. గిన్నిస్ బుక్‌లో చోటు
250 మంది మహిళలు ఆరు నెలల్లో 2,719 క్రొచెట్ పాంచోలు తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ΄పాంచోలను గిరిజన పిల్లలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా వీరందరూ ఒక తాటి మీదకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మహిళా మనోవికాసం పేరుతో క్రొచెట్ గ్రూప్‌ను ప్రారంభించిన మాధవి సూరిభట్ల, డెభ్బై ఏళ్ల వయసులోనూ చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ, టీమ్‌లీడర్‌గా ఫణి శిరీష, తనూజలు ఈ సందర్భంగా ఈ రికార్డు సాధనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొత్త ప్రపంచం కుటుంబ జీవనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. 70 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంబ్రాయిడరీ, క్రొచెట్ అల్లిక చిన్నప్పటి నుంచీ అలవాటు. మహిళా గ్రూప్‌లో చేరి నాలుగేళ్లు అవుతోంది. వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, తెలియంది తెలుసుకోవడం చేస్తుంటాను. ఇంటి దగ్గర రోజూ కొంత సమయం ఎంబ్రాయిడరీకి కేటాయిస్తుంటాను. ఈ గ్రూప్ ద్వారా ఈవెంట్లో పాల్గొని చాలామంది మహిళలతో పరిచయాలు పెంచుకోగలిగాను. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా, చాలా ఆనందంగా అనిపించింది. – డి.వి.రాఘవమ్మ, విజయవాడ గ్రూప్‌కి లీడర్ని మా పిల్లలతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. మూడేళ్ల క్రితం మహిళా మనోవికాస్లో జాయిన్ అయ్యాను. 25 మంది ఉన్న గ్రూప్‌కి లీడర్‌గా ఉన్నాను. ఇలా మొత్తం తొమ్మిది టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీమ్‌లో 25 నుంచి 35 వరకు ఉంటారు. నెల రోజులు ఆన్లైన్లో క్రొచెట్ కోర్సు నేర్చుకున్నాను. కిందటేడాది గ్రూప్ అంతా దాదాపు 4,686 క్రొచెట్ టోపీలు అల్లి, ఈవెంట్ చేశాం. ఆ టోపీలను చలి ఎక్కువ ఉండే గిరిజన ప్రాంతాల పిల్లలకు అందజేశాం. ఈసారి పాంచోస్ను కూడా అదేవిధంగా పంపిణీ చేస్తున్నాం. రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – ఫణి శిరీష, హైదరాబాద్ ఆన్లైన్ క్లాసుల నుంచి మొదలు... ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగం చేసే నేను పిల్లలు సెటిలయ్యాక మానేశాను. ఇంటి వద్ద ఉంటూ నా హాబీస్ పైన దృష్టి పెట్టాను. అన్నిరకాల హ్యాండ్‌క్రాఫ్ట్స్ చేయగలను. అందులో భాగంగానే నా క్రాఫ్ట్ వర్క్ నలుగురికీ తెలియజేద్దామని ఎఫ్‌బిలో మధురం క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. కొంతమంది తమకు క్లాసులు చెప్పమన్నారు. దీంతో కోవిడ్ టైమ్‌లో గ్రూప్ స్టార్ట్ చేసి, ఆన్లైన్ క్లాసులు చెబుతూ వచ్చాను. విదేశాలలోనూ నా స్టూడెంట్స్ ఉన్నారు. చెన్నై గ్రూప్‌తో 3 సార్లు క్రొచెట్ గిన్నిస్ రికార్డ్‌లో పాల్గొన్నాను. నా వ్యక్తిగతంగానే ఏడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వైజాగ్‌లోనూ ఈవెంట్ చేయాలనే ఆలోచనతో మహిళా మనోవికాస్ పేరుతో గ్రూప్ ప్రారంభించాను. ఆన్లైన్లో మహిళలకు క్రోచెట్ క్లాసులు తీసుకునేదాన్ని. ఒకరి ఆలోచనను ఇంకొకరు పంచుకుంటూ క్రొచెట్ అల్లికలు చేసి, వాటిని పేదవారికి పంచాలనేది ఆలోచన. దేశ విదేశాల నుంచి ఒకరి ద్వారా మరికొందరు పరిచయం అవుతూ ఆన్లైన్లో ఒక తాటిమీదకు వచ్చారు. కిందటేడాది క్రొచెట్ టోపీలు తయారుచేశాం. ఇప్పుడు పాంచోస్ తయారుచేశాం. పెళ్లి అయిన తర్వాత గృహిణులుగా ఉన్నవారు తమ జీవితంలో ఎలాంటి అచీవ్మెంట్ లేదు అనుకునేవారికి ఇదో మంచి బూస్టింగ్ అయ్యింది. మా గ్రూప్‌లో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. కీమో తీసుకుంటూ కూడా ఈ అల్లికలు చేశారు. ఈవెంట్‌కు అటెండ్ అవ్వాలనుకునేవారు 150 మెంబర్స్ వచ్చారు. ఆరేళ్ల పాప నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అందరికీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. – మాధవి సూరిభట్ల, విశాఖపట్నం మా పిల్లలకూ నేర్పిస్తున్నాను.. డెలీవరీ టైమ్‌లో ఖాళీగా ఉండటంతో ఆన్లైన్లో క్రోచెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆర్డర్స్ మీద అమీ గ్రూమీ స్టఫ్డ్ టాయ్స్ కూడా చేయడం నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పది పాంచోస్ చేస్తే చాలు అనుకున్నాను. నేను 25 పాంచోస్ చేసిచ్చాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా అచీవ్మెంట్ వస్తుంది అని. కొంతమంది ‘మాకు నేర్పిస్తారా, మేం ఎలా ఇందులో పాల్గొనాలి..’ అని అడుగుతున్నారు. ట్రైబల్ పిల్లలకు వాటిని అందజేశారు. – తనూజ, నంద్యాల -నిర్మలా రెడ్డి -
కూతురిపై ప్రేమ: గిన్సిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఏం చేశాడో తెలుసా?
Mark Owen Evans Record గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం కొంతమంది ఒక గోల్. ఎవరూ చేయడానికి సాహసించని పనులు , విన్యాసాలతో తమ పేరును ప్రత్యేకంగా నిలుపుకోవాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఓ 49 ఏళ్ల వ్యక్తి వ్యక్తి తన గారాల పట్టి మీద ఉన్న ప్రేమను అనూహ్యంగా చాటుకున్నాడు. యూఏకి చెందిన మార్క్ ఓవెన్ ఇవాన్స్ ఏకంగా తన ముద్దుల కుమార్తె పేరును శరీరంపై 667 సార్లు టాటూలా వేయించుకుని పంచ రికార్డు సాధించాడు. ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకోవడం ఇది రెండో సారికావడం విశేషం. అలా తన సొంత రికార్డును తానే అధిగమించాడు. 2017లో తొలిసారిగా తన కూతురు పేరును తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకుని రికార్డు సృష్టించాడు. కానీ 2020లో అమెరికన్ డైడ్రా విజిల్ తన పేరు మీద 300 సార్లు టాటూ వేయించుకోవడం ద్వారా రికార్డును బద్దలు కొట్టడంతో ఎవాన్స్ ఆ రికార్డును కోల్పోయాడు. తాజాగా ఇవాన్స్ తన కూతురు పేరు 'లూసీ'పై 667 టాటూలు వేయించుకుని తన రికార్డును తానే బ్రేక్ చేయడమేకాదు తమ తండ్రీకూతుళ్లు బంధం సాటిలేనిదని నిరూపించాడు. ఇద్దరు టాటూ ఆర్టిస్టులు గంటపాటు శ్రమించి మొత్తం భాగాన్ని పూర్తి చేశారు. ఒక్కో కాలుపై 200, మొత్తం 400 టాటూలతోపాటు ఈ మొత్తం టాటూలు పూర్తి కావడానికి ఐదున్నర గంటలు పట్టిందని ఇవాన్స్ మీడియాకుతెలిపారు. ఇది విచిత్రంగా ఉన్నా.. రికార్డును తిరిగి దక్కించు కోవడం, దీన్ని తన కుమార్తెకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్‌కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్‌కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్‌బుక్‌లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్‌లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్‌లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్‌లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్‌క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్‌ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
గిన్నిస్ భర్ సింగ్
పంజాబ్‌కు చెందిన అమృత్భర్సింగ్ పేరు వినబడగానే అదేదో ఆయన ఇంటి పేరులాగా ‘గిన్నిస్ బుక్’ అనే సౌండ్ ఠకీమని ప్రతి«ధ్వనిస్తుంది. గతంలో ఎన్నో రికార్డ్లను క్రియేట్ చేసిన అమృత్భర్సింగ్ తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు. ఒక నిమిషంలో ఫింగర్ టిప్స్‌పై 86 పుషప్‌లు చేసి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడు. గుర్దాస్పూర్ జిల్లా ఉమర్వాలా గ్రామానికి చెందిన సింగ్ ΄ాశ్చాత్య పద్ధతుల్లో కాకుండా సంప్రదాయ పద్ధతుల్లో ్ర΄ాక్టీస్ చేస్తుంటాడు. మోడ్రన్ జిమ్‌లకు వెళ్లకుండా ఇంటిపరిసరాలలో ఉన్న పశువుల కొట్టాన్ని జిమ్‌గా మార్చుకున్నాడు. ఇటుకలు, ఇసుక బస్తాలు, ΄్లాస్టిక్ క్యాన్లు తన ్ర΄ాక్టీసింగ్ సాధనాలు. సప్లిమెంట్స్‌కు దూరంగా ఉండే సింగ్ నేచురల్ డైట్స్ మాత్రమే తీసుకుంటాడు. ‘గతనెల ఫిబ్రవరి నెలలో సెట్ చేసిన రికార్డ్‌ను నేనే బ్రేక్ చేయాలనుకున్నాను. ్ర΄ాక్టీస్ కోసం ఎన్నోనెలలు చెమటలు చిందించాను. ఫలితం వృథా ΄ోలేదు’ అంటున్నాడు అమృత్భర్ సింగ్. -
మొక్కవోని ధైర్యం.. గడ్డంతో ఆమె గిన్నిస్ బుక్‌లోకి
అమెరికా మిచ్గాన్కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి. ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్‌తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట. షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది. -
గిన్నిస్ రికార్డ్: టీపాట్ ధర రూ. 24 కోట్లు! దీని సృష్టికర్త మనోడే..
World most valuable teapot Guinness World Records: సాధారణంగా అందరి ఇళ్లలోనూ టీపాట్‌లు వాడుతూ ఉంటారు. వీటి ధర ఎంత ఉంటుంది? రూ.1000 వరకు ఉంటుంది. మరీ ప్రత్యేకమైనవైతే ఇంకొంచెం ఎక్కువ ధర ఉంటుంది. కానీ ఓ టీపాట్ ధర ఏకంగా రూ.24 కోట్లు. ఇది అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. బ్రిటన్‌కు చెందిన ఎన్ సేథియా ఫౌండేషన్, లండన్‌లోని న్యూబీటీస్ సంయుక్తంగా తయారు చేయించిన ఈ టీపాట్‌ను ఇటాలియన్ స్వర్ణకారుడు ఫుల్వియో స్కావియా రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీపాట్ చుట్టూ వజ్రాలను పొదిగారు. వాటి మధ్యలో 6.67 క్యారట్ల రూబీలను అమర్చారు. ఈ టీపాట్ తయారీలో మొత్తం 1658 వజ్రాలు, 386 థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ అద్భుతమైన టీపాట్కు ‘ది ఇగోయిస్ట్’ (The Egoist) అని పెట్టారు. 2016లోనే దీని విలువ 3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.24 కోట్లు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీపాట్‌గా గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది. ఈ టీపాట్ ఫొటోలను, వివరాలను ట్విటర్లో షేర్ చేయగా యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చేయించింది మనోడే! ఈ అత్యంత ఖరీదైన టీపాట్‌ను తయారు చేయించింది భారత సంతతి వ్యక్తి కావడం గమనార్హం. బ్రిటిష్-ఇండియన్ బిలియనీర్ నిర్మల్ సేథియా స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఎన్ సేథియా ఫౌండేషన్ ఈ టీపాట్‌ను తయారు చేయించింది. మరో విశేషం ఏంటంటే దీని డిజైన్‌ను నిర్మల్ సేథియా స్వయంగా రూపొందించారు. టీ వ్యాపారి అయిన నిర్మల్ సేథియా ప్రపంచంలోని అత్యుత్తమ టీలకు అంకితమిచ్చేలా ఒక టీపాట్‌ను సృష్టించాలనుకుని దీన్ని తయారు చేయించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. This is the most valuable teapot in the world. Owned by the N Sethia Foundation in the UK, the teapot is made from 18-carat yellow gold with cut diamond covering the entire body and a 6.67-carat ruby in the centre. The teapot's handle is made from fossilised mammoth ivory. It… pic.twitter.com/TFZZF63YiW — Guinness World Records (@GWR) August 9, 2023 -
ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ సిక్సర్! అత్యంత ఖరీదు.. ధర తెలిస్తే షాక్!
MS Dhoni- World’s most expensive cricket bat: ‘‘ధోని తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. అద్భుతమైన షాట్! 28 ఏళ్ల తర్వాత ఇండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీని గెలిచింది’’... మహేంద్ర సింగ్ ధోని సిక్సర్‌తో భారత్ రెండోసారి ప్రపంచకప్ విజేతగా నిలిచిన సందర్భంగా కామెంటేటర్ రవిశాస్త్రి అన్న మాటలు. 2011లో ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక పేసర్ నువాన్ కులశేఖరకు పీడకలను మిగిల్చి అద్బుత షాట్‌తో.. సొంతగడ్డపై భారత్ జగజ్జేగతగా నిలిచిన సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ధోని అలా గాల్లోకి బంతి లేపగానే ఊపిరిబిగపట్టుకుని చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన తలాను ఆకాశానికెత్తుతూ కరతాళధ్వనులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ధోని బ్యాట్ ప్రపంచ రికార్డు ఇక ఈ గెలుపుతో కపిల్ దేవ్ తర్వాత భారత్‌కు ఐసీసీ టైటిల్ అందించిన రెండో కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరి.. విన్నింగ్ సిక్సర్ కొట్టిన ధోని బ్యాట్ కూడా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కిందన్న సంగతి తెలుసా?! వరల్డ్‌కప్-2011 నాటి ఫైనల్ మ్యాచ్‌లో ధోని రీబక్ లేబుల్‌తో ఉన్న బ్యాట్‌ను వాడాడు. దీనిని లండన్‌లోని చారిటీ ఈవెంట్లో వేలం వేయగా ఏకంగా 83 లక్షల రూపాలయకు అమ్ముడుపోయింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్(ఇండియా) ఈ బ్యాట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ డబ్బు దేనికోసం వాడారంటే తద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా ధోని వాడిన బ్యాట్ చరిత్రకెక్కింది. ఇక ఇదిలా ఉంటే.. అదే ఏడాది జూలై 18న ఆర్కే గ్లోబల్ షేర్స్ కంపెనీ ధోనితో ఈస్ట్ మీట్స్ వెస్ట్ చారిటీ డిన్నర్‌ను నిర్వహించింది. బ్యాట్‌ను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ధోని సతీమణి పేరిట నిర్వహిస్తున్న సాక్షి ఫౌండేషన్ కోసం వాడినట్లు సమాచారం. ఇప్పుడు రోహిత్ వంతు ఇక.. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత మరోసారి భారత గడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ధోని మాదిరే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ ట్రోఫీ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. ధోని అద్భుత ఇన్నింగ్స్(91- నాటౌట్) గుర్తు చేసుకుంటూ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విన్నింగ్ సిక్సర్ బ్యాట్ గురించి కూడా అభిమానుల్లో చర్చ నడుస్తోంది. చదవండి: రవీంద్ర జడేజాకే అత్యధిక సార్లు! రోహిత్, కోహ్లిలకు మాత్రం.. షాకింగ్ రిపోర్టు! "Dhoni finishes off in style!" 🇮🇳🏆 Happy birthday to the man who hit the winning runs in the 2011 @cricketworldcup final, @msdhoni! pic.twitter.com/X0s7Jo7cWp — ICC Cricket World Cup (@cricketworldcup) July 7, 2018 -
Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!
సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్ జగ్తాప్. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. గంటకు ఐదు నిమిషాల విరామం సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి. -
క్షణాల్లో తలపాగా కట్టించి గిన్నిస్ రికార్డ్.. వీడియో వైరల్
భారతీయ సంప్రదాయంలో తలపాగాను వివాహాలు వంటి శుభకార్యాల్లో ధరిస్తారన్న సంగతి తెలిసిందే. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సిక్కులు మత పరంగా దీన్ని తప్పనిసరిగా ధరిస్తారు. టర్బన్ లేదా దస్తర్ పేర్లతో పిలిచే తలపాగాను ఎవరైనా కట్టుకుంటారు. కానీ క్షణాల్లో, మెరుపువేగంతో తలపాగా కట్టేయగలగడం ఆదిత్యలో ఉన్న స్పెషాలిటీ. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య పచోలి అతి తక్కువ సమయంలోనే తలపాగాను కట్టించి గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. వృత్తిరీత్యా లాయర్ అయిన పచోలి తన వృత్తిని కొనసాగిస్తూనే, అభిరుచి మేరకు 15 ఏళ్లుగా తలపాగా కట్టే పని చేస్తున్నాడు. ఇటీవలె ఓ వ్యక్తికి కేవలం 14.12 సెకన్లలోనే తలపాగా చుట్టేసి ఆదిత్య రికార్డ్ సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వైరల్ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు పచోలి టాలెంట్‌కు ఫిదా అవుతుందటే, మరికొందరు మాత్రం గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రతి చిన్న దాన్ని హైలైట్ చేస్తూ దాని విలువను కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్...
సొకా (జపాన్): తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి ఇన్నాళ్లూ ఇంటాబయటా డబుల్స్ టైటిల్స్‌తో పతాక శీర్షికల్లో నిలిచాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచాడు. మేటి డబుల్స్ షట్లర్‌గా రాటుదేలిన సాత్విక్‌కు టైటిళ్లు కొత్తేం కాదు. అయితే తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్‌తో సాత్విక్ రికార్డు సృష్టించాడు. జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్‌కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఫార్ములావన్ సర్క్యూట్లో రయ్ రయ్‌మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! బ్యాడ్మింటన్‌లో ఇది అసాధారణ వేగం. దీంతో దశాబ్దం క్రిందట మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్‌లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ప్రస్తుతం కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఆడుతున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–14తో సుపక్ జోమ్కో–కిటినిపోంగ్ కెద్రెన్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్‌కే చెందిన ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
ఆగస్టు ఫస్ట్.. తొమ్మిది మందికీ బర్త్‌డే ఫెస్ట్
ఎవరైనా ఇద్దరికి ఒకేరోజున బర్త్‌డే వస్తే.. భలే కదా అనిపిస్తుంది. అదే ముగ్గురు, నలుగురి పుట్టినరోజు ఒకే రోజున ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఒకే కుటుంబంలో అందరి బర్త్‌డే ఒకే రోజున అయితే.. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పుట్టినది ఒకే తేదీన అయితే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం అవుతుంది. మరి అలాంటి ఓ ‘రికార్డు’ ఫ్యామిలీ గురించి తెలుసా? పుట్టినరోజు పెళ్లి చేసుకుని.. పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతానికి చెందిన మంగి అమీర్ అలీ, ఆయన భార్య ఖుదీజా.. ఇద్దరి పుట్టిన రోజు ఆగస్టు ఒకటో తేదీనే. దీంతో వారు 1991లో ఆగస్టు ఒకటో తేదీనే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి ఆగస్టు ఒకటినే వారికి పాప పుట్టింది. తమ పుట్టినరోజునే పాప పుట్టడంపై అమీర్, ఖుదీజా ఆశ్చర్యపోయినా.. సంబురంగా ఆమెకు సింధు అని పేరుపెట్టుకున్నారు. కొన్నేళ్లకు సాసూ, సప్నా అనే కవల అమ్మాయిలు.. తర్వాత విడివిడిగా అమీర్, అంబర్ అనే ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత అమర్, అహ్మర్ అనే కవల అబ్బాయిలు పుట్టారు. వీరంతా పుట్టినది ఆగస్టు ఒకటో తేదీనే కావడం విశేషం. అంతేకాదు.. ఏదో సిజేరియన్ ఆపరేషన్లతో ఇలా ఒకేరోజు పుట్టారనడానికీ లేదు. అంతా సహజ ప్రసవాలేనట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ కుటుంబం సర్టిఫికెట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలించేసి.. వీరిని గిన్నిస్‌బుక్ లోకి ఎక్కించేశారు. ‘‘ఇలా ఒకే తేదీన అందరూ జన్మించడం మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఏటా అందరం కలసి ఒకే కేక్ కట్ చేస్తాం. ఒకరికొకరు అందరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం..’’ అని అమీర్ పేర్కొన్నాడు. ఇంతకుముందు అమెరికాలో.. ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది బర్త్‌డే ఒకే రోజు ఉన్న రికార్డు ఇంతకుముందు అమెరికాకు చెందిన కమ్మిన్స్ కుటుంబం పేరిట నమోదైఉంది. 1952–66 మధ్య అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిపి ఐదుగురు ఫిబ్రవరి 20వ తేదీనే పుట్టారు. ఇప్పటివరకు కూడా అదే రికార్డుగా నిలవగా.. అమీర్ అలీ కుటుంబం దాన్ని బద్దలు కొట్టింది. రెండు కవల జంటల రికార్డు కూడా.. అమీర్ కుటుంబంలో సాసూ–సప్నా కవలలు, అమర్–అహ్మర్ కవలలు అంతా ఒకే తేదీన జన్మిం చారు. ఇలా ఒకే తల్లికి ఒకే తేదీన రెండు సార్లు కవలలు పుట్టడం కూడా విశేషమే. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి జననాలు నమోదవడం గమనార్హం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కనివిని ఎరుగని గిన్నిస్ రికార్డు ఇది!.. బీట్ చేయలేరు..ట్రై చేయలేరు
ఎన్నో రకాల ఫీట్లు లేదా విభిన్నంగా చేసి రికార్డులు సాధించిన ప్రముఖులను చూశాం. ఓ కుటుంబం మొత్తం కలిసి గిన్నిస్ రికార్డు సృష్టించడం విన్నామా!. అసలు అలా కుదురుతుందా? పైగా ఈ రికార్డుని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ట్రై చేయడం కూడా కుదరదు. అలాంటి ఇలాంటి రికార్డు కాదు గ్రేటెస్ట్ గిన్నిస్ రికార్డు అంటే ఇదేనేమో. ఎవ్వరూ ట్రై చేయలేనిది, సాధ్యం చేసి చూపలేని రికార్డు. ఇంతకీ ఆ కుటుంబం ప్రపంచ గిన్నిస్ రికార్డుల్లోకి ఎందుకు ఎక్కిందంటే.. పాకిస్తాన్‌కి చెందిన ఓ కుటుంబం ప్రపంచ గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకుంది. అత్యంత అసాధారణమైన రికార్డుని సృష్టించి ఈ వరల్డ్ రికార్డుని కైవసం చేసుకుంది. పాక్‌కు చెందిన అమీర్ ఖుదేజా దంపతులు ఇద్దరు పుట్టిన తేదిలు ఒక్కటే.. సంవత్సరాలే వేరు. ఇంత వరకు ఓకే ఎందుకంటే చాలా జంటల్లో ఇలాంటివి చూశాం. అయితే వారికి పుట్టిన ఏడుగురు పిల్లలు కూడా సంవత్సరాలు మాత్రమే వేరు.. పుట్టిన తేదీలు ఒక్కటే. ఇక దంపతులు కూడా 1991లో వారి పుట్టిన తేదీ రోజునే పెళ్లి చేసుకున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ పుట్టిన తేదీలు ఒకటే అయ్యి వేర్వేరు సంవత్సరాలు అంటే అత్యంత అరుదు. జరగడం అసాధ్యం. ఇక ఖుదేజాకి జన్మించిన ఆ ఏడుగురు పిల్లలు కూడా నార్మల్ డెలివిరిలో జన్మించిన వారే. పైగా అందులో ఇద్దరూ మగ కవలలు, ఇద్దరు ఆడ కవలలు, మిగతా ముగ్గురు పిల్లలు. వారి పేర్లు వరసగా.. సింధూ, అమీర్, అంబర్, ఆడ కవలలు ససూయ్, సప్నా, మగ కవలలు అమ్మర్, అహ్మర్. అందులో ఒక్కరూ కూడా ప్రీమెచ్చుర్‌గా జన్మించిన వారు కాదు. ఆమె ఏమి సీజేరియన్ ద్వారా ప్లాన్ చేసి కనింది కూడా కాదు. ఇలాంటి అత్యంత అరుదైన కుటుంబ ఉండటం అసాధ్యం అంటూ గిన్నిస్ సంస్థ నిర్వాహకులు ఈ ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్‌ని ఆ కుటుంబానికి ప్రధానం చేసింది. ఈ మేరకు అమీర్ మాట్లాడుతూ..తామేమి ప్లాన్ చేసుకుని కనింది కూడా కాదు. ఇదంతా అల్లా మాకు ఇచ్చిన వరం. ఇదివరకు మా పుట్టినరోజును సాధారణంగా జరుపుకునే వాళ్లం. కానీ ఇప్పుడూ చాలా వేడుకగా జరుపుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నాడు అమీర్. (చదవండి: బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిది కాదా!) -
ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?
ఫ్రాన్స్: ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు. అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. New record: The fastest full body burn 100 m sprint without oxygen - 17 seconds by Jonathan Vero (France) Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf — Guinness World Records (@GWR) June 29, 2023 ఇది కూడా చదవండి: ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..? -
హైహిల్స్‌తో రన్నింగ్ చేసి..గిన్నిస్ రికార్డు సృష్టించాడు!
పరుగు పందెం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. కానీ హైహిల్స్‌తో హైస్పీడ్‌గా పరుగు తీయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడొక వ్యక్తి ఆ అడ్వెంచర్‌ని చాలా సునాయాసంగా చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకెళ్తే..స్పెయిన్‌కి చెందిన 34 ఏళ్ల సీరియల్ రికార్డ్ బ్రేకర్ క్రిస్టియన్ రాబర్టో లోపేజ్ రోడ్రిగ్జ్ ఈ రికార్డుని సాధించాడు. అతను సుమారు 2.76 అంగుళాల స్టిలెట్టో హీల్స్ ధరించి కేవలం 12.82 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి ఈ రికార్డు సృష్టించాడు. గతంలో 2019లో 14.02 సెకన్లలో 100 మీటర్లని హైహిల్స్‌తో పరుగెత్తిన ఆండ్రీ ఓర్టోల్ఫ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు రోడ్రిగ్జ్. ఈ మేరకు అతను మాట్లాడుతూ..ఇలా పరుగెత్తడం తనకొక సవాలని, ఇలాంటి రేసులను ఎన్నో అవలీలగా సాధించానని చెబుతున్నాడు. అంతేగాదు తనలాంటి టైప్ 1 మధుమేహ వ్యాధిగ్రస్తులు.. మధుమేహం లేని వ్యక్తుల కంటే అన్ని పనులు చురుగ్గా చేయగలరని నిరూపించేందుకే తాను ఈ రికార్డు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. రోడ్రిగ్జ్ గతంలో కళ్లకు గంతలు కట్టుకని సుమారు 100 మీటర్లు ముందుకు, వెనుకకు వేగంగా పరుగెత్తి రికార్డు సృష్టించాడు కూడా. అలాగే కళ్లకు గంతలు కట్టుకుని సుమారు 100 మీటర్లు వేగంగా పరిగెడుతూ.. అదే సమయంలో మూడు వస్తువులతో గారడీ చేసి ప్రపంచ రికార్డు సాధించాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆలస్యం కానిదే ఏది కాదేమో! ఓ వ్యక్తి ఆన్లైన్ ఆర్డర్ పెడితే..ఏకంగా..) -
రొనాల్డో అరుదైన ఘనత.. గిన్నిస్ రికార్డుతో చరిత్ర! అతడి తర్వాత..
Cristiano Ronaldo World Record- రెక్జావిక్ (ఐస్లాండ్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు దిగ్గజం, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గ్రూప్ ‘జె’లో ఐస్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. 38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 1–0తో ఐస్లాండ్ను ఓడించింది. గ్రూప్ ‘జె’లో పోర్చుగల్కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్) పేరిటే ఉంది. మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ 2016 తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్‌లో అల్ నాసర్ క్లబ్ జట్టుకు ఆడుతున్నాడు. జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్–10 ఆటగాళ్లు ప్లేయర్ - దేశం - మ్యాచ్‌లు రొనాల్డో - పోర్చుగల్ - 200 బదర్ అల్ ముతవా - కువైట్ - 196 సో చిన్ అన్ - మలేసియా - 195 అహ్మద్ హసన్ - ఈజిప్ట్ - 184 అహ్మద్ ముబారక్- ఒమన్ - 183 సెర్జియో రామోస్- స్పెయిన్ - 180 ఆండ్రెస్ గ్వార్డాడో - మెక్సికో - 179 అల్దెయా - సౌదీ అరేబియా - 178 క్లాడియో స్వారెజ్- మెక్సికో - 177 గియాన్లుగి బఫన్ - ఇటలీ - 176 . చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? -
న్యూయార్క్‌లో మోదీ యోగా ఈవెంట్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం
అమెరికాలోని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం న్యూయార్క్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఈ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. యూఎన్ జనరల్ సెక్రటరీ సహా 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వసుదైక కుంటుంబం థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. యోగా ఓ జీవన విధానం ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ.. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యావాదాలు తెలియజేశారు. యోగా దినోత్సవం ప్రాముఖ్యాన్ని, కలిగే లాభాలను ప్రధాని వివరించారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికి, మతానికి లేదా జాతికి చెందినది కాదని తెలిపారు. యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీల వంటివి లేవన్నారు. యోగా డేలో దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్న ఆయన.. యోగా అంటేనే అందరినీ కలిపేది అని కితాబిచ్చారు. ఇది కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అన్నారు. భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయం యోగా! యోగా భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమని మోదీ తెలిపారు. యోగా పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరమన్నారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వార్షిక వేడుకగా గుర్తించాలని మోదీ ప్రతిపాదించారు. యోగా డే జరపాలనే ప్రతిపాదనను కూడా దేశాలన్నీ ఆమోదం తెలిపాయని చెప్పారు. భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందని మోదీ చెప్పుకొచ్చారు. కాగా 2014లో యోగా దినోత్సవం నిర్వహించాలని మోదీ ప్రతిపాదించగా.. 2015 నుంచి జూన్ 21న ఐరాస యోగా దినోత్సవం నిర్వహిస్తోంది. గిన్నిస్ రికార్డు సాధించిన మోదీ యోగా కార్యక్రమం న్యూయార్క్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అత్యధికంగా 140 దేశాలకు చెందిన జాతీయస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారి మైఖేల్ ఎంప్రిక్ బుధవారం ఐరాస ప్రధాన కార్యాలయం లాన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ క్సాబా కొరోసి, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌లకు ఈ అవార్డును అందించారు. Delighted to take part in the #YogaDay programme at @UN HQ. Let us make Yoga a part of our lives and further wellness. https://t.co/XvsB8AYfGs — Narendra Modi (@narendramodi) June 21, 2023 -
వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నిస్ రికార్డ్
ఎక్కడైన కుక్కల నాలుక ఎంత ఉంటుంది? సుమారు 5 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ అమెరికాలోని లూసియానాలో ఓ కుక్కకు నాలుక ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉంది. తాజాగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న 9.49 సెంటీమీటర్లతో బెస్బీ అనే కుక్క పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఆ కుక్క పేరు 'జోయ్'. దాని యజమాని సాడీ, విలియమ్స్. వారికి ఈ కుక్క ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. సాధారణంగానే జోయ్ నాలుక ఎలాస్టిక్ మాదిరిగా నోటి బయటికి సాగి ఉండేది. పెరిగే కొద్దీ అందరూ ఆ కుక్కపైనే కామెంట్ చేసేవారని యజమానులు తెలుపుతున్నారు. జోయ్‌కి బయట తిరగడం, బాల్స్‌తో ఆడుకోవడం, పక్క కుక్కలతో గొడవపడడం, కారు వెంట పరుగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని చెబుతున్నారు. తమ చుట్టుపక్కల జోయ్ అంటే తెలియనివారుండరని పేర్కొన్నారు. Zoey loves to fetch and swim. Coincidentally, she has the world’s longest tongue on a dog!https://t.co/2jvoSbvga9 — Guinness World Records (@GWR) June 2, 2023 'మేము వాకింగ్‌కు జోయ్‌ను తీసుకువెళితే అందరూ మా దగ్గరికే వస్తారు. దానిని తాము పెంచుకుంటాం ఇవ్వమని అడుగుతారు. దీనిపై మేము చాలా సార్లు హెచ్చరించాం. జోయ్‌కి కోపమొస్తే కరిచిన సందర్భాలు కూడా ఉన్నాం.' అని యజమాని చెప్పారు. తన ప్యాంటుకు ఉన్న జోయ్ పంటి గాట్లను చూపిస్తూ విలియమ్స్ చిరునవ్వుతో చెప్పాడు. ఇదీ చదవండి:రెస్టారెంట్లో మహిళకు చేదు అనుభవం.. ‘అలా చేయడం తప్పా’? -
గిన్నిస్‌లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్‌దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్‌లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్‌నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?
నైజీరియా దేశానికి చెందిన ఒక చెఫ్ చేపట్టిన కుక్-ఏ-థాన్ విశేషంగా నిలుస్తోంది. లాంగెస్ట్ కుక్ఏథాన్లో హిల్డా బాసీ వరుసగా 100 గంటలు వంట చేసి రికార్డ్ బద్దలు కొట్టింది. మే 11-15 వరకు ఏకథాటిగా కుక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల కెక్కింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తమ నైజీరియన్ వంటకాల గురించి ప్రచారం చేయడమేనని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో నైజీరియన్ వంటకాలు కూడా ఒకటని, వీటి గురించిన విశేషాలు మరింతమందికి చేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. హిల్డా బాసిగా ప్రసిద్ధి చెందిన హిల్డా ఎఫియాంగ్ బస్సే ఈ 100 గంటల్లో 100 కంటే ఎక్కువ మీల్స్ , దాదాపు 55 ఇతర వంటకాలను ప్రిపేర్ చేసింది. ఈ కుక్-ఎ-థాన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో లక్షల లైక్స్‌ను సొంతం చేసుకుంది. హిల్డా బాసికంటే ముందు సుదీర్ఘమైన వంట చేసిన రికార్డు భారతీయ చెఫ్ లతా టొండన్ పేరుతో ఉంది. దాదాపు 88 గంటల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by Hilda Baci’s Cookathon (@hildabacicookathon) View this post on Instagram A post shared by Myfood By Hilda Baci (@myfoodbyhilda) -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డాక్టర్ రెడ్డీస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటుపై అవగాహన కార్యక్రమాలతో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. 30,813 మంది వైద్యులు పంపిన సందేశాలను ఆకులుగా అలంకరించి అతి పెద్ద హృదయాకృతిని రూపొందించినందుకు గాను ఈ ఘనత దక్కించుకుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఈ ఇన్‌స్టాలేషన్‌ను హైదరాబాద్ బాచుపల్లిలోని కంపెనీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. -
ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?
ఎదురుగా ఉన్నది దెయ్యమో మనిషో తేల్చుకోవడానికి కాళ్లు వెనక్కు తిరిగి ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు జానపదులు. ఇక్కడ ఉన్న కెల్సీ గ్రబ్ దెయ్యమేమో అని అనుమానం వస్తే తప్పులేదు. ఎందుకంటే ఏకంగా ఆమె తన పాదం మొత్తాన్ని వెనక్కు తిప్పి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. మే 2న ఈ రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈమె కాళ్ల వైపే లోకం అబ్బురంగా చూస్తోంది ‘పిల్లలకు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే క్రేజ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాక్కూడా ఉండేది. కాని నేను కూడా ఆ రికార్డ్ సాధిస్తాననుకోలేదు’ అని సంబరపడుతోంది కెల్సీ గ్రబ్. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే ఊరికి చెందిన 32 ఏళ్ల కెల్సీ తన కాలిని171.4 డిగ్రీలు వెనక్కు తిప్పడం ద్వారా గిన్నెస్ రికార్డు స్ధాపించింది. ‘గత సంవత్సరం ఏదో షాపులో గిన్నెస్ రికార్డ్–2021 పుస్తకం తిరగేశాను. అందులో కాలు వెనక్కు తిప్పే వ్యక్తి ఫొటో ఉంది. అతని కంటే ఎక్కువగా వెనక్కు ఎందుకు తిప్పకూడదు అనిపించింది’ అంది కెల్సీ. చదవండి: రిలేషనే కాదు.. ఎదో తెలియని ఎమోషన్.. జుకర్‌బర్గ్ ఫోటో వైరల్ ఐస్ స్కేటింగ్‌ను తరచూ సాధన చేసే కెల్సీ స్కేటింగ్‌లో పాదాలు చురుగ్గా ఉండాలి కనుక తను సాధన చేస్తే కాలిని వెనక్కు తిప్పగలదు అనుకుంది. ‘నేను పెద్దగా కష్టపడలేదు. అప్పుడప్పుడు పాదాన్ని వెనక్కు తిప్పుతూ ఉండేదాన్ని. కొన్నిసార్లు మోకాల్లో నొప్పి అనిపించేది. అప్పుడు మాత్రం కొంచెం మెల్లగా తిప్పేదాన్ని’ అని తెలిపింది కెల్సీ. ఆమె ఇప్పుడు ఎంత సాధన చేసిందంటే ‘జనం వెనక్కు తిరిగిన పాదాన్ని కాకుండా అంత సులభంగా పాదాన్ని తిప్పినందుకే ఎక్కువ ఆశ్చర్యపోతుంటారు’ అని నవ్వింది. స్నేహితులు ఆమె విన్యాసాన్ని పూర్తిగా గమనించాక గిన్నెస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది కెల్సీ. ‘ఇదేదో రికార్డు స్థాయి ఫీట్లాగానే ఉంది. వచ్చి పరీక్షించండి అని మెయిల్ పెట్టాను. చిన్నపిల్లల్లాగే ఉత్సాహంగా ఎదురు చూశాను. రికార్డు కన్ఫర్మ్ అయ్యాక చాలా సంబరపడ్డాను’ అందామె. సాధారణ జనంలో చాలా మంది కాలిని 90 డిగ్రీల వరకూ వెనక్కు తిప్పగలరు. కాని కెల్సీ దాదాపు 180 డిగ్రీలు వెనక్కు తిప్పడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. -
కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి
అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్ డుగాస్(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్ 1999 నుంచి కురులను పెంచుతోంది. -
గంటలో 3,206 పుష్ అప్లు
సిడ్నీ: జిమ్ చేసే సిక్స్‌ప్యాక్ బాడీ అయినా రోజూ 100 పుష్అప్లు చేస్తేనే బాగా అలిసిపోతారు. అలాంటిది ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్అప్లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ పుష్ అప్లు చేయడం ద్వారా తనకున్న స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. గంటకి 3,182 పుష్ అప్లు చేసి రికార్డు సా«ధించిన సాటి ఆస్ట్రేలియన్ డేనియల్ స్కాలి పేరు మీదున్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు సాధించడానికి అనుభవజ్ఞులైన జిమర్ల దగ్గర రెండు మూడేళ్ల పాటు శిక్షణ కూడా తీసుకున్నట్టు లుకాస్ వెల్లడించాడు. -
ప్రపంచంలోనే అతి పొట్టి శునకం.. ఎత్తు 3.5 అంగుళాలే..!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి చిన్న శుకనంగా అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'పర్ల్' అనే ఆడ శునకం నిలిచింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న శునకాల్లో ఇదే అత్యంత పొట్టిది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది. చిహువాహువా బ్రీడ్‌కు చెందిన ఈ బుల్లి శునకం వయసు రెండేళ్లు. ఎత్తు 3.59 అంగుళాలు. పొడవు 5 అంగుళాలు. అంటే టీ కుప్పు సైజులో ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ఔన్సు బరువు కంటే తక్కువ ఉండటం గమనార్హం. గతంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మిరాకిల్ మిల్లీ సోదరే దీనికి జన్మనివ్వడం మరో విశేషం. 2020లో మిల్లీ చనిపోయింది. మరో ప్రత్యేక ఏంటంటే ఈ రెండు శునకాల యజమాని కూడా ఒక్కరే. ఆమే ఫ్లోరిడాలోని వనేసా సెమ్లర్. పర్ల్ చాలా యాక్టివ్‌గా ఉంటుందని, చికెన్, సాల్మన్ ఫిష్‌ను చాలా ఇష్టంగా తింటుందని సెమ్లర్ చెప్పుకొచ్చారు. రోజుకు నాలుగు సార్లు దీనికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై కేఫ్‌లు కన్పిస్తే వాటి ముందు అరుస్తుందని, దానికి క్రీమ్ ఇచ్చేంతవరకు అలాగే మొరుగుతుందని వివరించారు. కాగా.. గతంలో ప్రపంచంలో అతి పొట్టి శునకంగా బ్రిటన్‌కు చెందిన యార్క్‌షైర్ టెర్రియర్ ఉండేది. దీని ఎత్తు 2.8 అంగుళాలే. పొడవు 3.75 అంగుళాలు. అయితే ఈ శునకం 1945లో చనిపోయింది. ఇంతకంటే పొట్టి శునకాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. చదవండి: 92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ.. -
వామ్మో! రూ. 122 కోట్లకు అమ్ముడైన కారు నెంబర్ ప్లేట్
కారు ధర అంటే లక్షల్లో ఉంటుందని, ఇంకా ఖరీదైన లగ్జరీ కార్లు అయితే కోట్ల రూపాయల వరకు ఉంటాయని అందరూ వినే ఉంటారు. అయితే ఇటీవల ఒక నెంబర్ ప్లేట్ ఏకంగా రూ. 122 కోట్లకు అమ్ముడైంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది, దాని పూర్తి వివరాలేంటి అనేది ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, దుబాయ్‌లో మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలంలో ‘పీ 7' (P 7) అనే ఓ వీఐపీ కారు నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయింది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 122. 6 కోట్లు. ఇంత ధరకు అమ్ముడుపోవడంతో ఇది ప్రపంచంలోనే ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంత డబ్బు చెల్లించి ఈ నెంబర్ ప్లేట్ ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం వెల్లడి కాలేదు. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుని 'వంద కోట్ల భోజనాల వితరణ నిధి' (1 Billion Meals Endowment) కార్యక్రమానికి అందించనున్నట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా ఆహార సాయం కోసం భారీ దాతృత్వ నిధిని సేకరించేందుకు ఈ బిలియన్ మీల్ ఎండోమెంట్ కార్యక్రమం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. (ఇదీ చదవండి: కృతి కర్బందా కొత్త కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు!) ప్రపంచంలోని చాల దేశాల్లో ప్రకృతి వైపరిత్యాలు, ఇతరత్రా కారణాల వల్ల మరణించే వారికంటే రోజూ ఆకలి బాధతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో ఆకలిపై యుద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమిరేట్ ఆక్షన్స్, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ సంయుక్తంగా ఈ వేలాన్ని నిర్వహించాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) వేలంలో పీ7 మాత్రమే కాకుండా ఏఏ19, ఏఏ22, ఏఏ80, ఓ71, ఎక్స్36, డబ్ల్యూ78, హెచ్31, జెడ్37, జే57, ఎన్41 వంటి 10 నెంబర్ ప్లేట్స్ విక్రయించారు. ఇందులో వై900, క్యూ22222, వై6666 లాంటి స్పెషల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఏఏ19 నంబర్ ప్లేట్ ఈ వేలంలో 4.9 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోగా.. ఓ71 నంబర్ ప్లేట్ 1.50 మిలియన్ దిర్హామ్‌లకు విక్రయించారు. -
Largest Hair: ఈమె జుట్టు మీదే రికార్డులు ఉన్నాయి
సరదా.. కొందరికి అనుకోకుండా గుర్తింపు తెచ్చిపెడుతుంటుంది. అదే పనిగా ఆ పనిలో మునిగిపోతే. లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచుల పొడవు ఆఫ్రో(ఆఫ్రికన్ స్టైల్) హెయిర్‌స్టైల్‌తో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్నిస్ రికార్డు బద్ధలు కొట్టడం ఇదే తొలిసారి కాదు. 2010 సమయంలో.. నాటుగు ఫీట్ల జుట్టుతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ జుట్టును మరింతగా పెంచి.. తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారామె. గత 24 ఏళ్లుగా ఆమె ఆ జుట్టును అలాగే పెంచుతోందట. అయితే.. మొదట్లో ఆమె జుట్టు కోసం కెమికల్స్ వాడేదట. వాటిలో చాలావరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తర్వాతే ఆమెకు తెలిసిందట. దీంతో అప్పటి నుంచి ఆమె సహజ పద్ధతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోందామె. తన జుట్టుకోసం ఓ హెయిర్ స్టైల్ డిజైనర్‌ను పెట్టుకున్న ఆమె, కేవలం అంచులు కత్తిరించేందుకు మాత్రమే ఆమెను పిలిపించుకుంటుందట. ఆ జుట్టు మెయింటెనెన్స్ కష్టంగా ఉన్నప్పటికీ.. ఇష్టంతోనే తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్తోంది డుగాస్. -
పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు
అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు. -
Pull-ups: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు..
కాన్బెర్రా: వ్యాయామం చేసే వారు తమ బాడీ ఫిట్‌గా ఉండేందుకు కచ్చితంగా పుల్ అప్స్ చేస్తారు. వీటి వల్ల వీపు, ఛాతీ, భుజాల ఖండరాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఇవి చేయడం కాస్త కఠినమే. రోజుకు 1,000 పుల్ అప్స్ చేయడమంటే గగనమే. అయితే ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు మాత్రం పుల్ అప్స్లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. గత రికార్డు 7,715 పుల్ అప్స్‌ను చెరిపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జాక్సన్ ఇటాలియోనో తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఈ రికార్డు కోసం తాను 8 నెలలపాటు శిక్షణ తీసుకున్నట్లు వివరించాడు. ఎట్టకేలకు తన శ్రమకు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉందన్నాడు. View this post on Instagram A post shared by Jaxon Italiano (@jaxon_italiano) గతంలో మరొకరి పేరుపై ఉన్న 12 గంటల్లో 5,900 పుల్ అప్స్ రికార్డును కూడా జాక్సన్ అధిగమించాడు. కాగా.. మొత్తం 24 గంటల్లో చివరి 3.5 గంటలను జాక్సన్ వినియోగించుకోలేదు. తీవ్రంగా అలసిపోవడంతో ఈ సమయంలో ఒక్క పుల్ అప్ కూడా చేయలేదు. అయినా గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సత్తా చాటాడు. జాక్సన్ పుల్ అప్స్ రికార్డుతో పాటు ఈ ఒక్క రోజే చారిటీ కోసం రూ.5లక్షల విరాళాలు కూడా సేకరించడం గమనార్హం. చదవండి: షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి! -
18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు
ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. 2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు. -
బాబీ.. ఓ కురు వృద్ధ శునకం!
లిస్బన్: పోర్చుగల్ వాసికి చెందిన బాబీ అనే కుక్క ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన ఈ కుక్క వయసు ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్ల 226 రోజులు. ఆస్ట్రేలియాకు చెందిన బ్లూవై అనే కుక్క 29 ఏళ్ల 5 నెలలు జీవించి 1939లో చనిపోయింది. ఈ రికార్డును బాబీ తుడిచిపెట్టింది. పోర్చుగల్ ప్రభుత్వ పెట్ డేటాబేస్ ప్రకారం దాని వయస్సును నిర్ధారించారు. ఈ జాతి కుక్కల సరాసరి ఆయుర్దాయం 12–14 ఏళ్లు. బాబీ యజమానులు పోర్చుగల్‌లోని కాంకెయిరోస్ గ్రామానికి చెందిన కోస్టా కుటుంబం. ఈ కుటుంబంలోని లియోనెల్ కోస్టా అనే కుర్రాడికి 8 ఏళ్లుండగా బాబీ పుట్టింది. ఇంట్లో చాలా పెంపుడు కుక్కలుండటంతో కొన్నింటిని వదిలి పెట్టినా ఇది మాత్రం తప్పించుకుంది. ‘‘ఇంట్లో వాళ్లు తినేది ఏం పెట్టినా బాబీ తినేది. అనారోగ్య సమస్యల్లేకుండా హుషారుగా ప్రశాంతంగా ఉండేది. అదే దాని ఆయుష్షును పెంచి ఉంటుంది’ అంటారు కోస్టా. వయో భారంతో బాబీ ఇప్పుడు చురుగ్గా నడవలేకపోతోందట! చూపు కూడా తగ్గిందని కోస్టా చెప్పారు. -
కాళ్లు లేకున్నా.. ప్రపంచ రికార్డు బద్ధలు
వైకల్యం అనేది మనసుకే కానీ, శరీరానికి కాదని నిరూపిస్తున్నవాళ్లు ఎందరో. కొందరి సంకల్పానికి ఏకంగా ప్రపంచ రికార్డులే బద్ధలు అవుతున్నాయి. ఆ జాబితాకు చెందిన వ్యక్తే జియాన్ క్లార్క్. కాళ్లు లేకుండా పుట్టాడని తల్లిదండ్రులు నడిరోడ్డు పాలు జేస్తే.. అనాథశ్రమంలో పెరిగి, ఆపై ఓ అమ్మ అండతో ఛాంపియన్‌గా ఎదిగిన పాతికేళ్ల వ్యక్తి కథ ఇది. జియాన్‌కు కాళ్లు లేవు. అందుకే చేతులనే కాళ్లుగా మార్చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా చేతులతో పరిగెత్తిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 20 మీటర్ల దూరాన్ని.. కేవలం 4.78 సెకండ్లలో అదీ చేతులతో పరిగెత్తి చూపించాడు అతను. విశేషం ఏంటంటే.. 2021లోనే అతను ఆ ఘనత సాధించాడట. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్లు ట్విటర్ ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు. Meet Zion Clark, the fastest man on two hands 💪 pic.twitter.com/AVPNlT0cIT — Guinness World Records (@GWR) January 22, 2023 క్లార్క్ స్వస్థలం ఒహియో స్టేట్‌లోని కొలంబస్ ప్రాంతం . వైకల్యంతోనే పుట్టాడతను. దానివల్ల నడుము కింది భాగం ఉండదు. కయుడాల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే పరిస్థితి అందుకు కారణం. పుట్టిన వెంటనే అతన్ని తల్లిదండ్రులు వదిలేశారు. దీంతో.. ఒహియోలోనే ఓ ఆశ్రమంలో పెరిగాడు. ఆపై ప్రముఖ అమెరికన్ స్టాక్‌మార్కెట్ నిపుణురాలు కింబర్లీ హాకిన్స్ అతన్ని కథ తెలిసి దత్తత తీసుకున్నారు. హాకిన్స్ సంరక్షణలో క్లార్క్.. చదువుకున్నాడు. వీల్‌చైర్ రేసర్‌గా రాటుదేలాడు. అంతేకాదు మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా, రెజర్ల్గానూ అలరించాడతను. తన ఇద్దరు కన్నపిల్లలకు సమానంగా జియాన్‌ను పెంచిందామె. అతని జీవితం జియాన్ పేరుతో డాక్యుమెంటరీగా తీయగా.. అది సూడాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపిక కావడంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమ్ అయ్యింది. ఈ డాక్యుమెంటరీకి 40 స్పోర్ట్స్ ఎమ్మీ అవార్డుల్లో రెండు ఎమ్మీలను దక్కించుకుంది కూడా. ఇక ఆపై చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాడు. అయితే.. క్లార్క్ 2021లోనే ఆగిపోలేదు. కిందటి ఏడాది మరో రెండు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడు.త్వరలో మరో రెండు రికార్డులు నెలకొల్పనేందుకు రెడీ అవుతున్నాడు. తనకు జన్మనిచ్చిన వాళ్ల సంగతి ఏమోగానీ.. ఈ తల్లి రుణం తీర్చుకోలేనిదని చెప్తున్నాడు జియాన్.