ఐదురోజుల పాట..గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు | Afua Asantewaa Surpasses Guinness World Record For Longest Singing Marthon | Sakshi
Sakshi News home page

ఐదురోజుల పాట..గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

Published Sun, Feb 4 2024 8:36 AM | Last Updated on Sun, Feb 4 2024 8:36 AM

Afua Asantewaa Surpasses Guinness World Record For Longest Singing Marthon - Sakshi

వీనుల విందైన పాటను అలా ఎన్ని గంటలైనా వింటూ పోవచ్చు. కానీ అన్నేసి గంటలు పాడటమే కష్టం. కానీ ఘనాకు చెందిన 33 ఏళ్ల అసాంతెవా అనే గాయని ఏకధాటిగా ఐదు రోజులకు పైగా పాటలు పాడి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా క్రిస్మస్‌ సదర్భంగా ఆమె తన గాన మారథాన్‌ ను ప్రారంభించి.. సుమారు 126 గంటల 52 నిమిషాల పాటు కొనసాగించింది.

ప్రముఖ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు, పశ్చిమ ఆఫ్రికా దేశానికి వెళ్లే ప్రయాణికులతో సహా వేలాది మంది ఆమెకు మద్దతుగా.. వేదిక వద్దకు చేరుకొని ప్రోత్సహించారు. మరెన్నో లక్షల మంది సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఆమెను ప్రశంసించారు. అలా ఇప్పటి వరకున్న 105 గంటల పాటు సుదీర్ఘంగా పాడిన రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది అసాంతెవా. ఆ రికార్డ్‌ సునీల్‌ వాగ్‌మారే అనే మన భారతీయుడిదే. 2012లో నెలకొల్పాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement