తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది.
అమెరికాలోని ఒరెగాన్‌కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ‍్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు.
గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర‍్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి..
Comments
Please login to add a commentAdd a comment