Feeding
-
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింతలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఉపనగరాల్లో 50 చోట్ల ఆణిముత్యం (పసిబిడ్డలకు పాలిచ్చే) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపనగర జిల్లా ప్లానింగ్ కమిటీ రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అవసరమైన స్ధల సేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరం, ఉప పనగరాల్లో పాలిచ్చే కేంద్రాలు ఎక్కడ లేవు దీంతో బాలింతలు, పసిపిల్లల తల్లులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పసిపిల్లల తల్లులు, బాలింతలకు ఊరట లభించనుంది. ఆణిముత్యం కేంద్రాల నిర్వాహణ మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా)కు చెందిన సుధార్ సమితి పర్యవేక్షించనుంది. 50 చోట్ల ఆణిముత్యం కేంద్రాలు నేటి ఆధునిక సాంకేతిక యుగంలో పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్నారు. వివాహానికి పూర్వమే కాక ఆ తరువాత కూడా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమించి ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా విధులకు లేదా రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులు, లేదా ఇతర పనులు నిమిత్తం వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలింతలు, పసిపిల్లల తల్లులకు మార్గమధ్యంలో పాలిచ్చేందుకు చాటు దొరకడంలేదు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాలంటే ఎవరైన ఆకతాయిలు దొంగచాటుగా తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేస్తారని భయం. దీంతో గత్యంతరం లేక కొందరు బస్టాపుల్లో లేదా దుకాణాల వెనక, నివాస సొసైటీ కాంపౌండ్లలో చాటు వెతుక్కుని తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇది వారికెంతో ఇబ్బందికరంగా, అసౌకర్యవంతంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఆణిముత్యం కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. 125 చదరపుటడుగుల ఒక్కో ఆణిముత్యం కేంద్రానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనుంది. అందులో తాగునీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్, వాష్ బేసిన్, ఒక బెడ్డు, మూడు కుర్చీలలు, శానిటరీ ప్యాడ్ మెషీన్, గాలి, వెలుతురు ఆడేందుకు వీలుగా విశాలమైన కిటికీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ కేంద్రాల బయట సీసీ టీవీ కెమరాలుంటాయి. దీంతో సౌకర్యంతో పాటు భద్రత కూడా లభిస్తుందని జిల్లా ప్లానింగ్ కమిటీ స్పష్టం చేసింది. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
ఫుడ్ సపోర్టింగ్
చిన్నారులకు ఆర్నెల్ల వయసు వచ్చాక, వారికి ఇచ్చే తల్లిపాలతో పాటు క్రమంగా ఘనాహారాన్ని ఇవ్వడం మొదలుపెడతారు. ఇలా తల్లిపాలతో పాటు చిన్నారిని ఘనహారం వైపునకు మళ్లించడానికి ఇచ్చే ఆహారాన్ని కాంప్లిమెంటరీ డైట్‌గా చెప్పవచ్చు. అయితే పిల్లలకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఎలాంటి ఇతర ఆహారాలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఆర్నెల్ల వయసు వరకు పిల్లలకు నీళ్లు కూడా తాగించాల్సిన అవసరమూ ఉండదు. వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా ఇలా చిన్నారులను ఘనాహారం వైపునకు మళ్లించేందుకు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆహారం గురించి మార్కెట్ ప్రకటనల హడావుడి ఇటీవలి రోజుల్లో చాలా ఎక్కువగానే ఉంటోంది. నిజానికి కాంప్లిమెంటరీ డైట్ అనేది... తల్లిపాలతో పాటు పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం మాత్రమే. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమంటే అదేదో మార్కెట్లో మాత్రమే లభ్యమయ్యే ఆహారం అని అపోహపడాల్సిన అవసరం లేదు.కాంప్లిమెంటరీ డైట్ ఇవ్వాల్సిందిలా... ఘనాహారంలో భాగంగా పిల్లలకు ఉడికించిన అన్నం (రైస్), ఉడికించిన పప్పు (దాల్), అరటిపండు, ఉడకబెట్టిన కూరగాయలు (ఆలూ వంటివి) చిదిమి, మెత్తగా చేసి పెట్టాలి. అలాగే ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి వాళ్లకు కాచి చల్లార్చిన నీళ్లు పట్టాలి. ఇది మినహా మార్కెట్లో లభించే వాణిజ్య ప్రయోజనాలతో తయారు చేసిన ఎలాంటి ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ ఆహారాన్ని ఆర్నెల్ల పిల్లలకు రోజూ 150 నుంచి 200 ఎమ్ఎల్ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... ఇకపై మెత్తగా చిదిమిన రోటీ, కాస్తంత గట్టిగా వండిన పప్పు, ఇడ్లీ, రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్), సపోటా, బొ΄్పాయి వంటి ఆహారం ఇవ్వవచ్చు. ఇక్కడ మనం పైన పేర్కొన్న ఆహారం కూడా కాంప్లిమెంటరీ ఆహారమే.కాంప్లిమెంటరీ ఆహారానికి నిర్వచమిదీ... అసలు కాంప్లిమెంటరీ ఆహారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే... పిల్లలకు సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, భరించగలిగే ఆర్థిక స్తోమతను బట్టి చూస్తే చవకగా లభించేది అని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడు దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా అభివర్ణిస్తున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అనేవారు. కానీ ఈ ప్రక్రియను వీనింగ్ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభి్రపాయం. నిజానికి వీనింగ్ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ / నిలిపేస్తూ ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ... పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడం కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్) అంటున్నారు. ఇక ఆరు నెలలు నిండిన పిల్లలకు ఈ వయసు నుంచి ఎదుగుదలకు దోహదం చేసే ఆహారం అవసరం కాబట్టి ఈ టైమ్‌లో దీన్ని మొదలుపెట్టాలి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 30% నుంచి 35% మంది మాత్రమే పిల్లలకు ఆర్నెల్ల వయసు నుంచి అనుబంధ ఆహారాన్ని మొదలుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంటోంది.త్వరగా మొదలుపెట్టడమూ, లేట్ చేయడం ఈ రెండూ సరి కాదు... ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసు నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో తట్టుకోవడం (చోకింగ్), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే ఆలస్యంగా మొదలుపెడితే అది వాళ్ల సాధారణ పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అలాగే ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం మేలు. అదే ఆరోగ్యకరం కూడా. -
రామ్మా చిలుకమ్మా..
‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి. క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి. తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది. ‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’ – నూర్‌బాషా బాబావలీ. -
Delhi High Court: సంక్షేమం కాదు.. సంఘర్షణ
జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది. -
సీసాతో పాలు పడుతున్నారా?
బిడ్డకు ఎప్పుడూ తల్లి పాలు పట్టడమే చిన్నారికి మేలు చేస్తుంది. కేవలం తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రమే ΄ోత ΄ాలు పట్టాలి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.పాడి పశువుల పాలు: ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు.డబ్బా పాలు: మార్కెట్లో అమ్మే పిల్లల కోసం ఉద్దేశించిన పాల ΄పోడర్ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి. గేదె వంటి ΄ాడి పశువుల ΄ాలైనా / డబ్బాపాలైనా సీసాలో పాసి తాగిస్తారు. సీసాతో పాలు పట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సీసానూ, పాలపీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. కడిగాక పాల సీసాను పదినిమిషాలు మరిగే నీళ్లలో ఉంచాలి. ΄ాల పీకనూ కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో ఉంచాలి. బిడ్డకుపాలు పట్టిన వెంటనే పక్కమీద పడుకోబెట్టకూడదు. మొదట బిడ్డను భుజంపై వేసుకుని వీపుపై నెమ్మదిగా తడుతూ ఉండాలి. తేన్పు వచ్చే వరకు ఇలా చేయాలి. ఒకసారి తాగాక సీసాలో మిగిలిన పాలను పారబోయాలి. నిద్రపోయే సమయంలో బిడ్డకు పాలు తాగించకూడదు. పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు పట్టాలి. -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
-
షాకింగ్ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్ కౌర్‌లు ఇంటి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్యూవీ కారు యూటర్న్ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్ కౌర్ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Caught On CCTV: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog https://t.co/xs6vfKpoPR pic.twitter.com/fgngCqWq4X — NDTV (@ndtv) January 16, 2023 (చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు) -
Viral Video: చేపల ఆకలి తీర్చిన హంస.. ఎలానో తెలుసా ..!
-
ఓ నలుగురికి భోజనం.. ఆ తర్వాతే మనం
సాక్షి, కామారెడ్డి: జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకుంటే చాలనేది పెద్దల మాట. మరి ఆ మాటనే ఒంట పట్టించుకున్నాడో ఏమో కానీ ఈ పోలీసాయనకి మాత్రం నిత్యం నలుగురుకి కడుపునిండా అన్నం పెట్టనిదే గానీ పొద్దు గడవదు. తానే స్వయంగా వండి నలుగురు పేదలకు వడ్డించిన తర్వాతే కానీ భోజనం చేయడు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సబ్ ఇస్పెక్టర్ గా పని చేస్తున్న బి. కోనారెడ్డి 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా రెండేళ్ళుగా విధులు నిర్వహిస్తున్నారు. హైవే మీద సుదూరప్రాంతాలకు కాలినడకన వెళ్లే పేదలను చూసి చలించిపోయిన ఆయన తనకు చేతనైనంతగా.. ప్రతిని«త్యం నలుగురికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజున కూడా అలవాటును మానుకోకుండా పట్టణంలోని సీఎస్ఐ గ్రౌండ్ సమీపంలోని పేదలకు భోజనం పెడతారు. మానసిక వికలాంగులకైతే తానే అన్నం కలిపి ఇస్తాడు. తన వద్ద స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తులను కూడా తీసుకుని పేదలకు అందిస్తుంటాడు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని, ఇది ఎంతో నాకు తృప్తినిస్తోందని సాక్షి వద్ద ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
షాకింగ్ వీడియో: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై..
వైరల్: ఎవరైనా ఏ కుక్కనో, పిల్లినో సాదుకుంటారు. కొంచెం రిస్క్ అయినా సరే.. వన్య మృగాలను సైతం పెంచుకుంటారు కొందరు. కానీ, ఏ కండకు ఆ కండను పీక్కుతినే మొసలితో పరాచికాలు ఆడతారా? తాజాగా ఇంటర్నెట్ను పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో కుదిపేస్తోంది. ఏదో చంటిబిడ్డలా కాళ్ల సందులో మొసలిని ఉంచుకుని.. దాని నోటికి ఆడిస్తూ ఆహారం అందించాడు ఓ వ్యక్తి. పైగా దాని మూతి మీద తట్టి మరీ అభినందించడంతో ఆది నీళ్లలోకి తిరుగు టపా కట్టింది. ‘ఇదేం తరహా పెంపుడు జీవి బ్రో’ అంటూ ఫైజెన్ అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేశారు. నాలుగున్నర మిలియన్ల వ్యూస్ పూర్తి చేసుకున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. What type of pet is that bro?pic.twitter.com/SjlJRYJsDA — Figen (@TheFigen) August 2, 2022 -
పాపం ఆ పెద్దాయన చేసింది నేరమా? నెటిజన్స్ ఫైర్
Charged with unlawfully feeding wildlife: నేరాలు సైతం విచిత్రంగా ఉండొచ్చు. వాటి గురించి విన్నప్పుడు.. అసలు అది ఒక నేరమేనా అని సందేహం కలుగుతుంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాగే విచిత్రమైన ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూఎస్‌లోని 71 ఏళ్ల డోనాల్డ్ అంటాల్ అనే వ్యక్తి తన ఇంటి ముందు కొన్ని పక్షుల కోసం ట్రైలు ఏర్పాటు చేశాడు. వాటిల్లో అవి తినే వేరుశనక్కాయలు, కొన్ని గింజలను ఆహారంగా పెడుతుంటాడు. ఐతే ఇదంతా నచ్చని పొరిగింటివారు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల అతన్ని అరెస్టు చేశారు. పైగా వన్యప్రాణులకు చట్టవిరుద్ధంగా ఆహారం పెడుతున్నాడంటూ అభియోగాలు మోపీ మరీ అరెస్టు చేశారు. పక్షుల కోసం చాలా ఆహార ట్రైలు పెడుతున్నాడు ఇది విలేజ్ ఆఫ్ సోడస్ పాయింట్ లోకల్ ఆర్డినెన్స్ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించడమే అంటూ ఆరోపణల చేసి అరెస్టు చేశారు. అంతేకాదు ఈ ఆరోపణలతోటి ఆ వృద్ధుడిని ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు పోలీసులు మంచి చేసేవారిని అరెస్టు చేయాలనుకుంటున్నారంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్. (చదవండి: అరటి పండు ఎంత పనిచేసింది.. 120 మందికి ఆసుపత్రిలో చేరిక) -
వారెవ్వా వానరం.. ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
పిఠాపురం(తూర్పుగోదావరి): కన్న పిల్లలను సాకడంలో కోతిని మించిన జంతువు ఉండదంటారు. తన కడుపున పుట్టిన పిల్లలను తన కడుపుకే హత్తుకుని వెన్నంటి ఉంటుంది కోతి. కాని ఒక వానరం తన పిల్ల కాక పోయినా ఒక పిల్లి పిల్లను తన కన్న పిల్లలా సాకుతూ ఆశ్చర్యపరుస్తోంది. పిఠాపురం సమీపంలో మాధవపురం వెళ్లే రోడ్డులో ఉన్న ఒక కూరగాయల దుకాణం వద్దకు రోజూ వస్తున్న ఒక కోతి ఒక పిల్లి పిల్లను తన కడుపునకు హత్తుకుని తీసుకువచ్చి తనకు పెట్టిన ఆహారాన్ని దానికి తినిపిస్తోంది. జాతి వైరం లేదని చాటుతున్న దీనిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. చదవండి: ఖాకీ వనంలో ‘గోపాలుడు’ -
శునకాలకు అన్నం పెట్టి.. జైలు పాలయ్యాడు!
సాక్షి, చెన్నై : కుక్కలకు ఆహారం పెట్టే విషయంలో చోటు చేసుకున్న గొడవ కారణంగా ఓ ఇంటి యజమాని హత్యకు గురయ్యాడు. ఇక మానవత్వంతో వ్యవహరించిన పుణ్యానికి ఓ కార్మికుడు జైలు పాలయ్యాడు. వివరాలు.. చెన్నై కొరుక్కు పేట జేజే నగర్‌కు చెందిన సురేష్‌కుమార్(29) కూలి కార్మికుడు. ఇతడికి వీధి శునకాలకు ఆహారం పెట్టడం అంటే, ఎంతో ఇష్టం. రోజూ తన సంపాదనలో కొంత మొత్తాన్ని వీధి శునకాలకు వెచ్చించే వాడు. రోజూ రాత్రి వేళల్లో ఆకలితో ఉండే శునకాల్ని గుర్తించి ఆహారం పెట్టే వాడు. ఆ దిశగా శుక్రవారం రాత్రి ఓ చోట శునకాలు ఉండడంతో అక్కడి ఓ ఇంటి వద్ద ఆహారాన్ని ఉంచాడు. దీంతో అక్కడున్న శునకాలు ఆహారం కోసం పోటీ పడ్డాయి. అదే సమయంలో ఆ ఇంటి యజమాని గోవిందరాజ్(40) అక్కడకు వచ్చి శునకాల్ని తరిమే యత్నం చేశాడు. సురేష్కుమార్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శునకాల్ని తరిమేస్తావా..? అంటూ గోవిందరాజ్‌ను సురేష్ తోసేశాడు. కింద పడ్డ గోవిందరాజ్ తల పగిలి మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందరాజ్‌ను హతమార్చిన నేరానికి సురేష్‌కుమార్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (30 ఏళ్ల తరువాత మళ్లీ జంటగా ఎవర్గ్రీన్ జోడి) -
మూగప్రేమకు అమ్మానాన్న.. 50 ఏళ్లకుపైగా సేవలు
‘మానవసేవే మాధవసేవ’గా భావిస్తారు. ఈ దంపతులు మాత్రం అంతకుమించి జంతుసేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నారు. ‘ఆకలి’ అన్ని ప్రాణులకు సమానమే. మనిషికి ఆకలైతే నోరు తెరిచి అర్ధించి కడుపు నింపుకుంటారు. జంతువులు ఆకలైయినా నోరు తెరిచి అడగలేవు. తాము తినేప్పుడు ఎదుటకు వచ్చిన మూగజీవుల ఆకలి బాధను వారు గ్రహించారు. ఆరోజు నుంచి క్రమం తప్పకుండా రెండుపూట్ల వాటి ఆకలి తీర్చడం దినచర్యగా పెట్టుకున్నారు. అన్నం, కూరలు వండి మూగజీవులుండే ప్రాంతాలకు వెళ్లి ప్రేమతో ఆహారాన్ని అందిస్తూ అమ్మానాన్నలయ్యారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్కాలనీలో ఎం.విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వారుండేది మానవ ప్రపంచంలో అయినా మనస్సు మాత్రం జంతు ప్రపంచంతో ముడిపడి ఉంది. విజయ్‌కుమార్ కేబుల్ ఆపరేటర్. వేకువజాము నుంచి కుక్కలు, కోతులు, పిల్లులు, ఆవులు, పక్షుల ఆకలి తీర్చడంతో ఈ దంపతుల దినచర్య ప్రారంభమవుతోంది. ఆ సమయానికి మూగప్రాణులు వారి కోసం ఎదురు చూస్తుంటాయన్న ఆత్రుత వారిలో కనపడుతుంటుంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద నుంచి అయ్యప్పగుడి సెంటర్ వరకు ఉన్న వీధుల్లోని మూగజీవాలకు అతను సుపరిచితుడు. ఉదయాన్నే పాలు, బిస్కెట్లు దగ్గర నుంచి భోజనం వరకు అందిస్తుంటాడు. అనారోగ్యం పాలై ఇబ్బందులు పడే వాటికి వైద్యసేవలు సైతం అందిస్తుంటాడు. తాను తినే ముద్దలో మూగజీవాల ఆకలి తీర్చాలనే సంకల్పాన్ని తండ్రి ఆనందరావు దగ్గర నుంచి విజయ్‌కుమార్ పుణికి పుచ్చుకున్నాడు. దీనికితోడు భార్య రాజ్యలక్ష్మి సహకారం కూడా తోడవడంతో తన సేవా కార్యక్రమాలు మరింత బలపడ్డాయి. దీంతో సుమారు 50 ఏళ్లుగా మూగజీవాల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్వయంగా వెళ్లి.. ఉదయం ఐదు కేజీలు, సాయంత్రం ఐదు కేజీల బియ్యం, కూరలు, అప్పుడప్పుడు మాంసం, చేపలు కూరలు సైతం వండి ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి మూగజీవాలకు పెడుతుంటాడు. వీధుల్లో చాలామంది ఆహార పదార్థాలను పడేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి మూగజీవాలు తినేవిధంగా తయారు చేస్తారు. విజయ్‌కుమార్ దంపతుల సేవను గుర్తించిన స్నేహితులు, బంధువులు సైతం ఈ విషయంలో తోడుంటారు. వైద్యసేవలు ఆకలి తీర్చడంతో పాటు జబ్బున పడిన మూగ జీవులకు వైద్యసేవలు అందించేందుకు డాక్టర్ల సహాయం తీసుకునేవాడు విజయ్‌కుమార్. ఓ రోజు రాత్రి సమయంలో రైలు పట్టాల మధ్యలో ఆవు చిక్కుకున్న విషయాన్ని గుర్తించి పశువైద్యాధికారులను, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆవును ప్రమాదం నుంచి తప్పించిన ఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్తాడు. కరెంట్ షాక్‌కు గురైన కోతి కాలును బాగు చేయించేందుకు మూడు నెలలకు పైగా వైద్యసేవలు అందించానంటాడు. తాను చేస్తున్న పనులను చూసి ఆ వీధుల్లో వారు పాలు, పెరుగు ఇచ్చేవారు. కరోనా సమయంలో.. కరోనా సమయంలో మూగజీవాలు ఆకలికి అల్లాడాయి. ముఖ్యంగా కరెంటాఫీస్ సెంటర్ కోతులకు కేంద్రం. ఆ సమయంలో విజయ్‌కుమార్ కష్టపడి అరటి పండ్లను సేకరించి వాటి ఆకలి తీర్చాడు. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు, పిల్లులకు సైతం ఆకలిని తీర్చడం కరోనా సమయంలో కష్టమైంది. అయినా తమ సేవా కార్యక్రమాలను ఆపలేదు. జంతువులపై తనకున్న జాలి, దయ, తన సంపాదనలో అధికంగా వెచ్చించేందుకు ఇష్టపడ్డాడు. ఇటీవల నెల్లూరులో భారీ వర్షాలు, వరదల సమయంలో సైతం మూగజీవాలకు ఆహారం పెట్టే కార్యక్రమాలకు బ్రేక్ వేయలేదు. మొదలైందిలా.. విజయ్‌కుమార్ తండ్రి ఆనందరావు ఆర్టీసీ ఏడీసీగా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో జంతువులకు బిస్కెట్లు, పాలు అందించేవాడు. తాను వి«ధులకు వెళ్లి వచ్చేప్పుడు విధిగా ఈ పనిని చేయడం తనకు అలవాటు. ఈ పని చిన్నప్పటి నంచి విజయ్‌కుమార్ చూస్తూ మూగజీవాలపై ప్రేమను పెంచుకున్నాడు. ఉద్యోగం నుంచి తండ్రి విశ్రాంతి పొందిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ ఈ పనిని కొనసాగించారు. తమకున్నంతలో కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో పాటు అన్నం ఆయా ప్రాంతాల్లోని జంతువులకు పెట్టడం దిన చర్యగా చేసుకున్నారు. ఎంతో ఆనందాన్నిస్తోంది తాను తినే ముద్దలోనే పశుపక్షాదుల ఆకలి గుర్తు చేసుకుంటాం. ఉన్నంతలోనే మా కుటుంబం మూగజీవాల కోసం సహాయం అందించడం తృప్తినిస్తుంది. వీధి కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడం సామాజిక బాధ్యతగా భావిస్తాను. ఉదయాన్నే గోవులు, పక్షుల ఇంటి ముందు వాలడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదయం, సాయంత్రం ఒక గంట కేటాయిస్తే మూగజీవాల ఆకలి తీర్చిన వాడినవుతాను. మనుషులకు పెడితే మర్చిపోతారేమో కానీ, మూగజీవాలు మాత్రం తమ ప్రేమను కళ్లల్లోనే చూపే విధానం ఒక మధురమైన అనుభూతి. మూగజీవాలకు ఎటువంటి సేవలు కావాలన్నా 97002 21223 నంబర్‌కు ఫోన్ చేస్తే నిస్వార్థంగా అందిస్తాను. – విజయ్‌కుమార్ -
Video Viral: ‘బాలుడు చేసిన పనికి.. హత్తుకొని ముద్దు ఇవ్వాలనుంది’
తల్లులు పిల్లలకు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తారు. కాలేజీ, ఆఫీస్ క్యాంటిన్లో పలువురు తమ మిత్రులకు ప్రేమగా అన్నం కలిపి తినిపించటం కూడా చూశాం. ప్రియమైనవారికి ప్రేమతో అన్నం తినిపించటంలో కూడా కొంతమంది ఆనందాన్ని పొందుతారు. చిలిపిగా మారాం చేసినా.. ఇంకొంచం తినూ రా.. అంటూ గద్దించి మరీ ప్రేమతో నోటికి అన్నం ముద్దలు అందిస్తారు. అటువంటి కల్మషం లేని ప్రేమ.. ముఖ్యంగా బాల్యంలో అధికంగా కనిపిస్తుందనటంలో సందేహం లేదు! తాజాగా అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాఠశాలలో విద్యార్థులంతా లైన్లో కూర్చొని భోజనం చేస్తుంటారు. అయితే అందులో ఓ ఇద్దరు విద్యార్థుల ముందు అన్నం ప్లేట్ ఉంటుంది. అయితే అందులో ఒక విద్యార్థి మాత్రమే అన్నం తింటూ.. తన స్నేహితుడైన మరో విద్యార్థికి అన్నం కలిపి నోటికి అందిస్తాడు. ఎందుకంటే రెండో విద్యార్థికి కళ్లు కనిపించవు.. ఆ బాలుడు మారాం చేస్తున్నా తను తింటూ స్నేహితుడికి అన్నం తినిపిస్తాడు. ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘సంస్కారం అనేది ప్రవర్తనలో కనిపిస్తుంది!’ అని కామెంట్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు అన్నం తినిపించే బాలుడి స్నేహాన్ని అభినందిస్తున్నారు. ‘ఆ బాలుడిని హత్తుకొని ఓ ముద్దు ఇవ్వాలని ఉంది’.. ఇదే స్వచ్ఛమైన స్నేహం.. బాలుడికి ఉన్న సంస్కారం అందరిలో ఉండాలి’.. ‘అద్భుతం! అలా పెంచిన పిల్లాడి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. If you get right Sanskars,it shows up in your behaviour ❤️🙏 pic.twitter.com/ruvH780YWb — Vikas Chopra (@Pronamotweets) November 28, 2021 -
కోతులకు ఆహారం పెట్టొద్దు!
కొరాపుట్: కోతులకు ఆహారం పెట్టొద్దంటూ కొరాపుట్-జయపురం ఘాటీలో జిల్లా అధికార యంత్రాంగం సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అక్తార్ ఆదేశాల మేరకు వీటిని సోమవారం ఏర్పాటు చేశారు. ఇదే మార్గంలోని మలుపుల వద్ద వాహనదారులు తమ వాహనాలను నిలిపి, ఇక్కడి కోతులకు ఆహారం ఇస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
Viral: ‘పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటింది’
సాధారణంగా అన్ని జీవాలకు ఆకలి బాధలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన ఆకలితో వాటికి జాతి వైరం కూడా గుర్తుకురాదు. అలా కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం. తాజాగా ఓ చిన్న పంది పిల్ల ఆకలి వేయడంతో శునకం పాలు తాగింది. ఆ పందిపిల్ల పాలు తాగుతున్న క్రమంలో శునకం మరో చోటుకి వెళ్లుతుంది. కానీ, పంది పిల్లకు ఎంత ఆకలి ఉందో? దాని వెంటనే పరుగెడుతూ మళ్లీ శునకం దగ్గరుకు వెళ్లీ పాలు తాగుతుంది. దీంతో శునకం అక్కడే ఉండి పంది పిల్ల ఆకలి తీర్చుతుంది. ఈ వింత ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలోని వీధిలో శునకం పంది పిల్లకు పాలు ఇచ్చింది. దీన్ని ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. జాతి వైరం వీడి పంది పిల్లకు పాలిచ్చి, శునకం తల్లి ప్రేమను చాటిందని పలువురు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Viral Video: డార్లింగ్ ఈ స్నాక్స్ తిను.. నీరసంగా ఉన్నావు...
మూగ జీవాల ప్రేమానుబంధాలు ఒక్కోసారి అమితాశ్చర్యాలకు గురయ్యేలా చేస్తాయి. అరే.. మనుషులమైన మనమే అంత ఇదిగా ఉండమే అనిపిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత వింతగా అవేం చేశాయో మీరు కూడా ఓ లుక్కెయండి. ఈ వీడియోలో కిటికీ పక్కన బెడ్‌షీట్‌పై కూర్చుని పప్పీలకు పాలు ఇస్తున్న తెల్ల కుక్క కనిపిస్తుంది. నల్లకుక్క (బహుశా పప్పీల నాన్నేమో) నడుచుకుంటూ దాని దగ్గరకు వచ్చి తినడానికి స్నాక్స్ పక్కన పెడుతుంది. పిల్లల సంరక్షణలో అలసిన తల్లికుక్క దాన్ని ఆబగా తింటుంది. ఆ తర్వాత ఒకదానిమరొకటి ఆలింగనం చేసుకుని పడుకోవడం కనిపిస్తుంది. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. ముచ్చట గొలిపేలా ఉన్న ఈ కుక్కల ప్రవర్తన జంతు ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తోంది. ఇంకేముంది కామెంట్ల రూపంలో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘అద్భుతం ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో ఇదే స్వీటెస్ట్ ఫ్యామిలీ’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘కుటుంబాన్ని హత్తుకున్న మంచి అబ్బాయి’ అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదేమైనా జంతువులకు కూడా కుటుంబం పట్ల అనురాగ ఆప్యాయతలు ఉంటాయనిపించేలా ఉన్న ఈ వీడియోని వేల మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: Old viral video: పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా.. -
గజేంద్రుడి ఆకలి తీర్చిన వృద్ధురాలు..
ఓ వృద్ధురాలు తనచేతితో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వృద్ధురాలి ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఉన్న ఏనుగుకు, బకెట్లో నుంచి ఆహారాన్ని తీసి ముద్దగా చేసి ఏనుగు నోట్లో పెడుతుంది. చెవులు ఊపుతూ ఆస్వాదిస్తూ తింటున్నట్లుగా ఉన్న ఏనుగు హావభావాలు చూపరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను వేల మంది వీక్షిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తల్లి ప్రేమతో చేసే ఏ పనికైనా విలువ కట్టలేం అని ఒకరు కామెంట్ చేస్తే, మంచి మనసున్న మహిళ సున్నితమైన భారీ కాయానికి ఆహారం తినిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. అనేక మంది యూజర్లు వావ్ అని కామెంట్ చేసి, హార్ట్ సింబల్ ఎమోజీలతో తమ స్పందనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చదవండి: Chocolate Ganesha:చాక్లెట్ గణేశ్.. పాలల్లో నిమజ్జనం.. -
తల్లిపాలు... రకాలు!
రొమ్ము పాలు పట్టే తల్లి... తన బిడ్డకు పాలు తాగేటప్పుడు ఆమె నుంచి రెండు రకాల పాలు వస్తాయి. మొదటిది తొలిసారి వచ్చే పాలు. వీటిని ఫోర్ మిల్క్ అంటారు. రెండోది మలిసారి పాలు... వీటిని హైండ్ మిల్క్ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ హైండ్ మిల్క్ అన్నవి.. చిన్నారి కాసిన్ని పాలు తాగాక స్రవించడం మొదలవుతాయి. వాస్తవానికి ఫోర్ మిల్క్ కంటే... హైండ్ మిల్క్ చాలా బలవర్ధకమైనవి, పుష్టికరమైనవి, మంచి పోషకాలను ఇచ్చేవి. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి. అందుకే పిల్లలు పది పదిహేను గుటకలు వేశాక స్రవించే పాలు చాలా మంచివన్న విషయం తల్లి గ్రహించడం మేలు. ఫోర్ మిల్క్‌ను ముర్రుపాలతో పొరబడవద్దు... పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ మొదలు కాగానే... స్రవించే ఫోర్ మిల్క్‌ను... ప్రసవం కాగానే తొలి రెండు మూడు రోజుల్లో స్రవించే ముర్రుపాలతో పొరబాటు పడవద్దు. నిజానికి ముర్రుపాలు వేరు, ఫోర్ మిల్క్ వేరు. పుట్టగానే స్రవించే ముర్రుపాలు శిశువుకు చాలా మంచివి. మంచి రోగనిరోధకతను ఇస్తాయి. అద్భుతమైన ఇమ్యూనిటీ వ్యవస్థను నిర్మించడానికి దోహదపడతాయి. ఫోర్ మిల్క్ అంటే... ప్రతిసారీ పాలు తాగడం మొదలు పెట్టగానే తొలిసారి స్రవించేవి అనీ... ఓ పది–పదిహేను గుటకల తర్వాత స్రవించేవి హైండ్ మిల్క్ అనీ గుర్తుపెట్టుకుంటే చాలు. -
పెనుభారమైన గుర్రాల పోషణ
-
బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అసలే ఎండాకాలం.. సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మనుషులం.. మనమే ఎండవేడికి తాళలేకపోతున్నాం. ఇక నోరులేని జీవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక బాలుడు మాత్రం ఓ పక్షి దాహార్తి తీర్చి మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఒక పిల్లవాడు తన ఇంటి బాల్కనీ పక్కన ఒక పావురాన్ని చూశాడు. చాలాసేపటి నుంచి అది ఎటు కదలకుండా అలాగే ఉండిపోయింది. పైగా అది చాలా నీరసంగా కనిపించింది. ఇది చూసిన ఆ బాలుడు చలించిపోయాడు. పాపం.. ఎంత దూరం నుంచి ఎగురుతుందో, ఆ పక్షికి కాసిన్ని నీళ్లు ఇద్దాం అనుకున్నాడు. అలా ఒక చిన్న స్పూన్‌ను నీటితో నింపి ఇనుప చువ్వల సందులో నుంచి పావురం ముందు పెట్టాడు. మొదట పావురం నీరు తాగడానికి తటపటాయించింది. దీంతో బాలుడు కొంత నీరు కింద పోశాడు. ఆ వెంటనే పావురం గాబరాగా ఆ నీరు తాగటం మొదలుపెట్టింది. కాసేపటికి చెంచాలో ఉన్న నీళ్లన్నీ తాగి తన దాహార్తిని తీర్చుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ బాలుడు చేసిన పనికి ‘హ్యట్సాఫ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
పసిబిడ్డకు సీసాతో పాలు పడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
సాధ్యమైనంత వరకు బిడ్డకు తల్లిపాలే పట్టాలి. నిజానికి అవే చాలా మంచివి. అయితే తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రం పోత పాలు ఇవ్వవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ►పాడి పశువుల పాలు : ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు. ►డబ్బా పాలు : పిల్లల కోసం ఉద్దేశించి అమ్మే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిసి ఇచ్చేవి. పాడి పశువుల పాలైనా లేదా డబ్బాపాలైనా సీసా సహాయంతో ఇస్తారు. ఇలా సీసాతో పాలు పట్టాల్సివచ్చినప్పుడు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... ►ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ►పాల సీసాను పదినిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం రెండు నిమిషాల పాటు వెడి నీళ్లలో మరగనివ్వాలి. ►బిడ్డకు పాలు పట్టే సమయంలో సరైన విధంగా పట్టాలి. ►అంటే బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. అలాగే.. పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు. ►పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి. ►సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను తప్పక పారబోయాలి. ►బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు. -
మయూరానికి ప్రేమతో...
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నెమలికి ఆహారం అందిస్తున్న దృశ్యమిది. ఇదే కాంపౌండ్‌లో ఆఫీసు భవనాలు ఉన్నాయి. వీటి మధ్య నిత్యం మోదీ మార్నింగ్ వాక్ చేస్తుంటారు. ప్రధాని నడక, ఇతర వ్యాయామాలు చేస్తుంటే పరిసరాల్లో నెమళ్లు తచ్చాడుతుంటాయట. వీటి స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారాయన. ప్రకృతి ప్రేమికుడైన మోదీ తన నివాసంలో పక్షులు గూళ్లు పెట్టుకునేందుకు వీలుగా ఎత్తైన స్తంభాలతో కూడిన ఆకృతులను కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం వాకింగ్ చేస్తున్నపుడు తన దగ్గరకు వచ్చిన నెమళ్లకు మోదీ కింద కూర్చొని మరీ ఇలా ఆహారం అందించారు. తన మార్నింగ్ వాక్ దృశ్యాలతో కూడిన 107 సెకన్ల నిడివిగల వీడియోను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. -
కరోనా ఉన్నా తల్లిపాలు అమృతమే
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా కలకలమే. చికిత్సలేని, నివారించేందుకు టీకా కూడా లభ్యం కాని పరిస్థితుల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయడం ఎలా అన్నది అందరిలోనూ మెదులుతున్న సందేహం. కోవిడ్–19 కారక కరోనా వైరస్ ఆనుపానులపై మనకు తెలి సింది కొంత, తెలియంది కొండంత. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా, తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1–7) సందర్భంగా చాలామందిలో కలిగే అనుమానాలను పరిశీ లిద్దాం. ఈ వ్యాధి తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తుందా? తల్లి వ్యాధి బారిన పడితే బిడ్డకు పాలు పట్టవచ్చా? అన్ని రకాల శాస్త్ర విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరు వాత తేలిందేమిటంటే, కరోనా సోకినప్పటికీ తల్లిపాలు అమృతమంత స్వచ్ఛమే! పైగా పుట్టిన బిడ్డతో అను బంధం పెంచుకునేందుకు తల్లికీ, తల్లి స్పర్శతో బిడ్డకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. ఒకవేళ తల్లి కోవిడ్ బారిన పడ్డా, లేదా ఆ లక్షణాలు ఉన్నా పాలు పట్టడం ఆపాల్సిన అవసరం లేదని సైన్స్ చెబుతోంది. కాకపోతే ముఖానికి మాస్కు తొడుక్కోవడం, చేతులు తరచూ సబ్బుతో లేదా ఆల్కహాల్ ఆధారిత ద్రావ ణంతో కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించి బిడ్డను ముట్టుకోవచ్చు. వ్యాధి కారణంగా తల్లి బలహీనంగా ఉంటే శుభ్రం చేసిన స్పూన్ లేదా కప్ ద్వారా తల్లిపాలు అందివ్వవచ్చు. ఇది కూడా సాధ్యం కాదనుకుంటే సరి పోయే కల్చర్ ఉన్న దాతల పాలు కూడా పట్టవచ్చు. రొమ్ముపాలు పట్టేందుకు ఉపయోగించే, పాలు నిల్వచేసే పాత్రలను కోవిడ్–19 సంబంధిత శుద్ధీకరణ పద్ధతులు ఉపయోగించిన తరువాత మాత్రమే వాడటం, శభ్రం చేయడం చేయాలి. ఒకవేళ బిడ్డ వ్యాధి బారిన పడినా స్తన్యం మాత్రం నిలపకూడదని సైన్స్ చెబుతోంది. తల్లి పాలు బిడ్డ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తాయనీ, తల్లిలోని యాంటీబాడీలు బిడ్డకు అందుతా యనీ, తద్వారా బిడ్డ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కో గలదన్నదీ మనకు తెలిసిన విషయమే. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారి ప్రభావం పసిపిల్లల పోష ణపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పేద, మధ్యాదాయ దేశాల్లో ఐదేళ్లలోపు పిల్లలు తీవ్రమైన కుపోషణకు గురవుతున్నారు. కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమికి గురికానున్నారు. వీరిలో సగం మంది దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నారు. భారత్ విషయానికి వస్తే పిల్లల పోషకాహారానికి సంబంధించిన పలు సూచీల్లో గుణాత్మక మార్పు, వృద్ధి కనిపిస్తున్నప్పటికీ సుమారు రెండు కోట్ల మంది ఐదేళ్ల వయసులోపు పిల్లలు తక్కువ కాలంలో తీవ్ర పోషకాహార లోపానికి గురికాగా, మరో నాలుగు కోట్ల మందికి తగినన్ని పోషకాలు అంద డం లేదు. అంతేకాకుండా 14 –19 ఏళ్ల మధ్య వయసు యువతుల్లో సగం మంది రక్తహీనతతో బాధ పడుతు న్నారు. కరోనావల్ల జరిగే నష్టం కంటే, పోషకాహార లోపం వల్ల పిల్లలకు దీర్ఘకాలంలో జరిగే నష్టమే ఎక్కు వగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పోషకాహార లోపం నిశ్శబ్దంగా మనిషిని చంపే స్తుంది. తగినంత పోషహాకారం తీసుకోకపోతే లేదా తీసు కున్న ఆహారం ద్వారా విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు, శక్తి తగినంత శరీరానికి వంటబట్టక పోతే పోషకాల లోపం తలెత్తుతుంది. చిన్నప్పుడు అతి సారం లేదా ప్రేవుల్లో సూక్ష్మక్రిములు చేరినా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. భారత్‌లో ఐదేళ్లలోపు వయసున్న పిల్లల మరణాల్లో మూడింట రెండు వంతులకు కుపోషణే కారణం. వీటివల్ల భౌతికంగా, మానసికంగానూ ఎదుగుదల సరిగా లేకుండాపోతుంది. దీని ప్రభావం కాస్తా విద్యాభ్యాసం, మేధ, చివరకు పెరిగి పెద్దయ్యాక ఆదాయ ఉత్పత్తిపై కూడా పడుతుంది. పుట్టిన బిడ్డ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే తొలి రెండేళ్లు అత్యంత కీలకం. పుట్టిన గంట లోపు తల్లి పాలు అందించడం మొదలుకొని, నిర్ణీత కాలం వరకూ తల్లిపాలు మాత్రమే అందించి ఆ తరువాత దశలవారీగా ఇతర ఆహారం అందివ్వడం ద్వారా ఐదేళ్లలోపే మరణి స్తున్న పిల్లల్లో 20 శాతం మందిని కాపాడుకోవచ్చు. దుర దృష్టవశాత్తూ భారతదేశంలో పుట్టిన గంట లోపు బిడ్డకు తల్లిపాలు అందివ్వడం లేదు. కనీసం 57 శాతం మంది పిల్లలు ఈ భాగ్యానికి నోచుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. తొలినాళ్లలో తల్లిపాలు మాత్రమే అందు కునే పిల్లలకు అతిసారం, నిమోనియా వంటివి సోకే అవకాశాలు తక్కువ. ఆరు నెలల తరువాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారం కూడా ఇవ్వడం వల్ల పిల్లలు దృఢంగానే కాకుండా వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరుగుతారు. రెండేళ్ల వరకూ బిడ్డకు అవసరమైన పోష కాల్లో అత్యధికం తల్లిపాల ద్వారానే అందుతాయన్నది మరచిపోకూడదు. కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరు ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కుపోషణ సమస్యను ఎదుర్కొనేందుకు యూనిసెఫ్ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. పసిపిల్లల పోషణావసరాలను తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని యూనిసెఫ్ అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. సురక్షితమైన, చౌకైన ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు యత్నిస్తోంది. తల్లి, పిల్లల సంరక్షణ, తల్లిపాల ప్రాము ఖ్యతను చాటడం, పసిపిల్లల ఆహార ఉత్పత్తుల మార్కె టింగ్ సక్రమంగా జరిగేలా చూడటం చేస్తోంది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పిల్లలను ముందుగానే గుర్తించి చికిత్స కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అత్య వసర పరిస్థితుల్లో పిల్లలకు పోషకాహారం అందించేం దుకు పాఠశాలలు, అంగన్ వాడీలు మూతకు గురైన ఈ తరుణంలో వారి ఇళ్లకే ఆహారం అందించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోషణ్’ కార్యక్రమానికి యూనిసెఫ్ సాంకేతిక సాయం అందివ్వడం, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని అధికారులకు శిక్షణ ఇవ్వడం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పోషకాహార సంస్థ సాయంతో తెలంగాణలో ఐదేళ్లలోపు వయసున్న, కుపోషణతో బాధపడుతున్న పిల్ల లకు తగిన ఆహారం అందించే ప్రయత్నం చేస్తోంది. వ్యాసకర్త హైదరాబాద్ యూనిసెఫ్ కార్యాలయ ముఖ్యాధికారి -
కొండెంగకు గోరుముద్దలు తినిపించిన మహిళ
న్యూఢిల్లీ: ఈ సమాజంలో జంతువులకు హాని చేసే మానవ మృగాలే కాదు.. వాటికి సాయం చేసే మంచి మనుషులూ ఉన్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్యమే ఈ వార్త. ఓ మాతృమూర్తి కొండముచ్చు(కొండెంగ)కు అన్నం తినిపించింది. అది బల్లపై ఒకే దగ్గర కుదురుగా కూర్చోగా ఆమె పెద్ద పెళ్లంలో అన్నం కలుపుతూ దాని ఎదుటే నిలబడింది. అనంతరం దానికి చంటిపాపలా గోరు ముద్దలు పెడుతూ తినిపించింది. ఆ జంతువు కూడా ఆమెను సతాయించకుండా బుద్ధిగా కూర్చోవడం కొసమెరుపు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు) "ఇంట్లో మా అమ్మ కొండముచ్చుకు అన్నం తినిపిస్తోంది" అంటూ ఓ వ్యక్తి వీడియోను షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. మూగజీవానికి, ఆ మహిళకు మధ్య ఉన్న అనుబంధానికి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. కొండెంగను ఇంట్లో మనిషిలా చూస్తూ దానికి ఆప్యాయతను అందించిన మహిళా మూర్తిని ఆకాశానికెత్తుతున్నారు. (వైద్యం కోసం ఆస్పత్రికి కొండముచ్చు) -
ఒక్కరికైనా సాయపడండి
‘‘ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పేదలకు సాయం చేయగలిగినవారు కనీసం రోజులో ఒక్కరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి’’ అని కోరుకుంటున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన దాదాపు 200 కుటుంబాలకు ఆహారం అందజేస్తున్నారు రకుల్. గుర్గావ్లోని తన ఇంటి సమీపంలో ఉన్న పేదవారికి రకుల్ ఈ సహాయం చేస్తున్నారు. ‘‘లాక్డౌన్ కారణంగా పేదవారి జీవనశైలి దెబ్బతింటోంది. కనీస అవసరాలు తీరని పేదవారికి మేం సహాయం చేయాలనుకున్నాం. మా వంతుగా మా ఇంటి సమీపంలోని బస్తీలో నివాసం ఉంటున్న 200 కుటుంబాలకు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు ఇలా చేయాలనుకున్నాం. ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే మా సహాయాన్ని కూడా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇదంతా మా నాన్నగారి (కుల్విందర్ సింగ్) ప్రోత్సాహంతోనే జరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో నా వంతుగా నేను ఏదో సాయం చేయాలని తాపత్రయపడుతుంటాను’’ అని పేర్కొన్నారు రకుల్. -
అయ్యో! అవి కొట్టుకోవడం లేదు.. కానీ
-
అయ్యో! అవి కొట్టుకోవడం లేదు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్ షేర్ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ్లెమింగో పక్షి తన ముక్కుతో మరో ఫ్లెమింగో తలపై రక్తం వచ్చేలా పొడుస్తూనే ఉంది. ఫ్లెమింగోకు రక్తం దారలా పోతున్నా అది మాత్రం తన మిత్రునిపై ఎటువంటి ప్రతిదాడి చేయకపోవడం ఏంటనే చిన్న డౌటు వచ్చింది. అయితే మనం అనుకుంటున్నట్టుగా వీడియోలో అవి కొట్టుకోవడం లేదట.. వాటి పిల్లలకు ఆహారం అందించేందుకు అలా చేసాయని వీడియో చూస్తే గానీ అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే.. ఫ్లెమింగోలు తన పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు తలపై భాగంలో ఉన్న ఎలిమెంటరీ కెనాల్లో క్రాప్ మిల్క్ రూపంలో నిల్వ చేసి పెడుతుంది. ఫ్లెమింగో తన తిన్న ఆహారంలో జీర్ణం కాకముందే కొంతభాగాన్ని ఎలిమెంటరీ కెనాల్‌లోనే క్రాప్ మిల్క్ రూపంలో ఉంచుకుంటుంది. ఆ క్రాప్ మిల్క్లోనే తన పిల్లలకు కావాల్సిన ప్రొటీన్,ఫాట్ పదార్థాల మిశ్రమం కలిసి ఉంటాయి. ఫ్లెమింగో తన పిల్లలు సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునే వరకు వాటికి ఈ క్రాప్ మిల్క్ ద్వారానే ఆహారం అందిస్తుంది. అయితే తన పిల్లలకు ఆహారం అందించడానికి తనతో జత కట్టిన పక్షి ముక్కు సహాయంతో తలపై పొడవడం ద్వారా రక్తం రూపంలో క్రాప్ మిల్క్‌ను తన పిల్లలకు అందిస్తుంది. అయితే వీడియోనూ నిశితంగా పరిశీలిస్తే రక్తం ద్వారా బయటకు వచ్చే క్రాప్ మిల్క్‌ను బుల్లి ఫ్లెమింగో ఆహారాన్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన ఈ వీడియానూ దాదాపు 35వేల మందికి పైగా వీకక్షించడం విశేషం. No they are not fighting. This is one of the most amazing thing in nature. Parent flamingos produce crop milk in their digestive tracts & regurgitate it to feed young ones. See how together they are doing it. Source: Science Channel. pic.twitter.com/GrJr4irGox — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 20, 2020 -
ఎంపీ బిడ్డకు పాలు పట్టిన స్పీకర్; ప్రశంసలు!
పదవి చేపట్టగానే దాని స్థాయితో సంబంధం లేకుండా అధికార దర్పం ప్రదర్శించే ఎంతో మంది వ్యక్తులను మనం రోజూవారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. మునుపటిలా వారితో మాట్లాడబోయి బిక్కముఖం వేయాల్సి రావడం దాదాపుగా ప్రతీ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అత్యున్నత పదవిలో ఉన్నా సరే ఎదుటి వారికి సముచిత గౌరవం ఇచ్చి హుందాగా ప్రవర్తిస్తారు. న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్్డ కూడా ఈ కోవకు చెందిన వారే. కివీస్ ఎంపీ టమాటి కాఫే బుధవారం తన నెలల పాపాయితో కలిసి పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆకలితో ఏడ్వడం గమనించిన స్పీకర్ ట్రెవర్ తనను దగ్గరకు తీసుకున్నారు. తనతో పాటు స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. గొప్ప సందేశం ఇచ్చారు సారూ! ‘సాధారణంగా ప్రిసైడింగ్ అధికారులు స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. అయితే ఈరోజు ఓ విశిష్టమైన వ్యక్తి నాతో పాటు ఇక్కడ ఆసీనులయ్యారు. ఓ కొత్త సభ్యుడు కుటుంబంలోకి వచ్చిన సందర్భంగా టమాటీ కాఫే, టిమ్‌లకు శుభాకాంక్షలు’ అంటూ ఎంపీ జంటకు ట్రెవర్ అభినందనలు తెలిపారు. ఇక పాపాయితో ఉన్న ట్రెవర్ ఫొటోలకు ఫిదా అయిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తండ్రులకు చాలా గొప్ప సందేశం ఇచ్చారు సార్. మగవాళ్లకు కూడా పిల్లల పెంపకంలో భాగం ఉంటుందనే విషయాన్ని హుందాగా చాటిచెప్పారు. పాపాయిలను చక్కగా ఎత్తుకోవడంలో, వారికి పాలుపట్టడంలో ఏమాత్రం ఇబ్బంది కలగదని విధులు నిర్వర్తిస్తూనే వివరించారు. అద్భుతం సార్! మా హృదయాలు గెలుచుకున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Normally the Speaker’s chair is only used by Presiding Officers but today a VIP took the chair with me. Congratulations @tamaticoffey and Tim on the newest member of your family. pic.twitter.com/47ViKHsKkA — Trevor Mallard (@SpeakerTrevor) August 21, 2019 -
మాల్ లోపాలు
అనడానికి ‘మాల్’ లోపాలు అంటున్నాం కానీ.. నిజానికైతే ఇది మగవాళ్ల లోపం! పాలకోసం ఏడ్చేబిడ్డ.. పాలిచ్చి ఏడుపు ఆపాలని ఆరాట పడే తల్లి.. మాల్లో ఉన్నామా.. మగవాళ్లున్న చోట ఉన్నామా అని చూసుకుంటారా?! బహిరంగ ప్రదేశాలలో స్తన్యం ఇవ్వడం ఏమిటనిఘీంకరించే పురుష ప్రపంచం..ఈ ప్రకృతి అనివార్యతను ఎన్ని జన్మలకు అర్థం చేసుకుంటుంది? ఇంకెన్ని జన్మలకు.. తల్లి పాలివ్వడానికి అనువైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది? పాపాయి ఏడుస్తుంది. ఏడుస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకుని స్తన్యమిస్తుంది తల్లి. ‘‘ఇప్పుడే కదా పాలిచ్చావ్! మళ్లీ ఇంతలోనే ఏడుపా’’ అని అడిగే భర్తకు సమాధానమివ్వదు తల్లి. భర్తను ఓ చూపు చూసి బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చినా అతడికి అది అర్థం కాదు. బిడ్డ ఏడిచింది పాలకోసం కాదు తల్లి సాన్నిహిత్యం కోసం అని తెలుసుకునే అవకాశం పురుష జన్మకు ఉండదు కాబట్టి. ‘‘తిరిగి ఇంటికి వచ్చే వరకు సరిపోయేటట్లు ఫ్లాస్కులో పాలు పెట్టుకో. తీరా వెళ్లినప్పటి నుంచి ఏడుపు మొదలు పెడితే ఇబ్బంది’’.. అని భార్యను హెచ్చరిస్తాడు ఓ భర్త. బిడ్డతో బయటకు వెళ్లాల్సిన పని పడినప్పుడు. ‘‘చుట్టూ మనుషులు తిరుగుతుంటే ఇక్కడ పాలివ్వడమేంటి. అయినా బాటిల్లో ఉన్న పాలు తాగించవచ్చు కదా’’ అని చిరాగ్గా అంటాడు మరో భర్త. కేన్ల కొద్దీ పాలు ఎదురుగా ఉన్నా సరే... తల్లి పాలిస్తే తప్ప పిల్లలు ఊరుకోరని ఈ మగవాళ్లకు తెలిసేదెప్పటికి! తాము తల్లి దగ్గర పాలుతాగిన జ్ఞాపకాలేవీ వాళ్లకు గుర్తుండే అవకాశం, గుర్తుకొచ్చే అవసరం వారి జీవితంలో ఉండదు. మగవాళ్లు తీర్చిదిద్దిన ప్రపంచం కూడా మగవాళ్లలానే ఉంటుంది కనుక మగ దృష్టితో మాత్రమే వారేదైనా చూడగలరు. ఓ బిడ్డకు తనకు కావాలనిపించినప్పుడు తల్లి దగ్గర పాలు తాగే హక్కును కలిగించని, అలాగే.. బిడ్డకు పాలు అవసరమైనప్పుడు ఏ ప్రదేశంలోనైనా పాలిచ్చే హక్కును స్త్రీలకు కల్పించని సమాజ నిర్మాణం ఇది. ఒక్కమాటలో మగవాళ్ల కోసం మగవాళ్ల చేత మగవాళ్లు నిర్మించుకున్న సమాజం. అందుకే ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన బిడ్డతల్లి తన ఏడు నెలల పాపాయికి పాలివ్వడానికి టాయిలెట్లోకి వెళ్లాల్సి వచ్చింది. తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. అలాంటిది ఆ తల్లి మనసు ఎంతగా గుక్కపట్టి ఏడ్చి ఉంటుంది! పాల కోసం ఏడ్చే పాపాయిలా. కలకత్తా కాళి ఇంతటి అమానుషానికి వేదిక కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్. ఆ షాపింగ్‌మాల్‌కి ఓ కొత్త తల్లి తన ఏడు నెలల పాపాయితో వచ్చింది. ఆ మాల్లో మల్టీనేషనల్ కంపెనీల షోరూమ్‌లున్నాయి. ఐస్‌క్రీమ్ కార్నర్లున్నాయి. ఒక ఫ్లోరంతా విశాలమైన ఫుడ్‌కోర్టు ఉంది. స్మోకింగ్ జోన్ కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ చంటిబిడ్డకు పాలివ్వడానికి పదడుగుల స్థలం మాత్రం లేదు. బిడ్డకు అవేవీ తెలియదు. తల్లిపాలిచ్చే వరకు ఏడుపు ఆగదు. బిడ్డ ఏడుస్తుంటే తల్లికి మనసు పిండేసినట్లవుతుంది. ఓ కార్నర్లో బెంచి మీద కూర్చుని పాలివ్వబోతే మాల్ సిబ్బంది ఒప్పుకోలేదు. ‘‘ఇక్కడ కూర్చోకూడదు. టాయిలెట్లోకి వెళ్లి పాలిచ్చుకోండి’’ అని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి అదే పని చేసింది. ఆ తర్వాత ఆమె తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో మాల్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు మాల్ నిర్వాహకులు స్పందించిన తీరు మరింత అమానుషంగా ఉంది. ‘‘మీ బిడ్డకు మీరు ఎక్కడైనా పాలిచ్చుకోవచ్చు. కానీ మా మాల్కి వచ్చిన ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మాకు ముఖ్యం’’ అనే అర్థంలో పోస్టు పెట్టింది. అప్పుడు ఆ మహిళలోని తల్లి కలకత్తా కాళి అయింది. భౌతికంగా ఉగ్రరూపం దాల్చి దండెత్తలేదనే కానీ, సుతిమెత్తని ప్రశ్నలతో మాల్ నిర్వాహకుల తీరును ఎండగట్టింది. పాల కోసమే అనేముంది? బిడ్డ ప్రతిసారీ ఆకలి, దాహంతో ఏడవదు. జనసమ్మర్థం ఉన్న చోట కొత్త గొంతులు వినిపించినప్పుడు ఆందోళనకు గురవుతుంది. తల్లి పొత్తిళ్లలోకి వెళ్లాలని కోరుకుంటుంది. తల్లి పాలిస్తూ దగ్గరకు తీసుకుంటే తనకు కొండంత భద్రత ఉందనే భరోసాతో ఏడుపు ఆపుతుంది. పిల్లలకు పాలిచ్చే గదిని ఏర్పాటు చేయడం మాల్‌కు సాధ్యమయ్యే పని కాదనేదే మీ ఉద్దేశమైతే అదే విషయాన్ని గమనికగా ఓ బోర్డు పెడితే సరిపోయేది. నాలాంటి తల్లులు మీ మాల్‌కు రాకుండా ఉంటారు. సమాజంలో చంటిబిడ్డల తల్లులు ఎప్పుడూ ఉంటారు. ఇది మొదలు కాదు, చివరా కాదు. స్మోకింగ్ జోన్కంటే బిడ్డ పాలు తాగడానికి ఫీడింగ్ జోన్ ముఖ్యమైన అవసరం కాదా?.. అంటూ మాల్ నిర్వాహకులకు శరాలు సంధించింది. ఫీడింగ్ జోన్ ఎందుకుండదు? కన్నతల్లి కడుపు రగిలి సంధించిన ఈ ప్రశ్నలు మగవాళ్ల ‘ఏక దృష్టి’ని సరిచేస్తాయా? చేస్తే మంచిదే. ఒక వ్యవస్థ నిర్మాణంలో మహిళ కూడా ఉంటే మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేస్తుంది. మహిళ భాగస్వామ్యం లేని సమాజంలో ప్రతి నిర్మాణమూ మెన్ఫ్రెండ్లీగానే ఉంటుంది. బార్ రూములుంటాయి, స్మోకింగ్ జోన్లుంటాయి తప్ప ఫీడింగ్ జోన్లుండవు. ఈ సంఘటనతో ఆలోచన రేకెత్తి.. ఇకపై రాబోయే మాల్ నిర్మాణాల్లో ఫీడింగ్ జోన్ ఉంటుందేమో చూడాలి. మగవాళ్లకు మహిళల అవసరాలు స్ఫురించకపోవడాన్ని తప్పు పట్టలేం కానీ, ఎదురుగా అవసరం కనిపిస్తున్నా సరే, మూర్ఖంగా ప్రవర్తించడాన్ని మాత్రం క్షమించలేం. తల్లిపాల ఆవశ్యకతను తెలియచేస్తూ ఉద్యమాలే నడుస్తున్నాయి. అది బహిరంగ ప్రదేశమైనా, పార్లమెంట్ సమావేశమైనా సరే.. తల్లి పాలు అవసరమైన క్షణంలోనే ఆ బిడ్డకున్న ‘పాలు తాగే హక్కు’ను తీర్చాల్సిన బాధ్యత బహిరంగ ప్రదేశాలకూ ఉంది. ఈ హక్కును సాధించుకోవడానికి బిడ్డకు చేతనైన ఆయుధం ఏడుపు ఒక్కటే. అందుకే బిడ్డ ఏడుపును గౌరవించాలి. తల్లికి ఆ క్షణంలోనే పాలిచ్చే ‘అనువు’ కల్పించాలి. – మంజీర -
4 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కోళ్ల పెంపకంపై శిక్షణ
దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు పద్ధతిలో నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్లను రసాయనాలు వాడకుండా, దుర్వాసన రాకుండా, సొంతంగా తయారు చేసుకునే దాణాతో పెంచే పద్ధతులపై అక్టోబర్ 4 నుంచి 25 రోజుల పాటు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు షిండే శివశంకర్ తెలిపారు. సహజ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్ నైపుణ్యాలపై కూడా ఆచరణాత్మక శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు కనీసం పదో తరగతి చదివి, 18 సంవత్సరాలు నిండాలి. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈనెల 23వ తేదీలోగా 81210 08002, 70133 09949 నంబర్లకు వాట్సప్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని శివశంకర్ కోరారు. వ్యవసాయ డిప్లొమా చదివిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. -
తినే స్పూన్లను తయారుచేస్తా.. లోన్ ఇవ్వండి
-
స్పూన్‌తో తిందాం
‘తినే స్పూన్లను తయారుచేస్తాను. నాకు లోన్ ఇవ్వండి’ అని నారాయణ పీసపాటి బ్యాంకులను సంప్రదించినప్పుడు,బ్యాంకు మేనేజర్లు కూడాఆయన్ని తినేసేలా చూశారు. అయితే ఇక్రిశాట్లో సైంటిస్టుగా ఆయన పనితనం, అంతకుముందు బరోడాలో పన్నెండేళ్ల అనుభవం గురించి తెలిశాక ‘కుదరదు’ అని గట్టిగా చెప్పలేకపోయారు. కానీ.. ‘తినే స్పూన్లను కొనేదెవ్వరు? మీరు మా లోన్ తీర్చే మార్గం çసమీప భవిష్యత్తులో కనిపించడం లేదు’ అన్నారు. అలా.. ‘మీకు లోన్ ఇవ్వడం కుదరదు’ అనే అర్థాన్ని సున్నితంగా తెలియచేశారు. బ్యాంకు వాళ్లే కాదు నారాయణ్ భార్య ప్రజ్ఞా కేస్కర్ కూడా ‘ఏమిటిది ఫన్నీగా’ అని నవ్వేశారు. నిజానికి నారాయణ దశాబ్దాల పాటు చదివిన చదువుని, చూసిన సమాజాన్ని మేళవించి, మేధనంతా రంగరించి చేసిన పరిశోధన ఇది. అంతకంటే ఎక్కువగా తాను నమ్మిన సిద్ధాంతం. దానిని ఆచరణలో పెట్టడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టును వదిలేది లేదనుకున్నారు. ఆయన ఇక్రిశాట్ ఉద్యోగాన్ని వదిలింది కూడా ఈ ప్రాజెక్టు కోసమే, కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించిన తర్వాత తనకు దొరికిన ఒక సొల్యూషన్ ఇది. సమాజానికి ఈ తినే స్పూన్లను అలవాటు చేయడం సైంటిస్టుగా తన బాధ్యత అనుకున్నారు. అందుకే చేతిలో ఉన్న డబ్బుతోపాటు ఉన్న ఇంటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి ‘బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో 2010లో తినే స్పూన్లు, ఫోర్కులను తయారు చేసే యూనిట్‌ని స్థాపించారు. ఆ యూనిట్ నిర్వహణ బాధ్యత చూసుకుంటున్న ప్రజ్ఞా కేస్కర్ నారాయణ్ ఈ ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ప్లేటుంది.. స్పూన్ లేదు! ఇక్రిశాట్లో ఉన్నప్పటి నుంచి భూగర్భ జలాల పరిరక్షణ, నీటిని అనవసరంగా తోడేయడాన్ని నివారించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం వంటి కోణాల్లో మా వారి పరిశోధనలు సాగాయి. ప్లాస్టిక్ స్పూన్ల వల్ల ఎంత గ్రీజ్ కడుపులోకి వెళ్తుందనే విషయాలను కూడా నిశితంగా పరిశోధించేవారు. వీటన్నింటినీ అరికట్టాలంటే ఎవరో ఒకరు ఒక ప్రయత్నమంటూ చేయాలి కదా. సమాజంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగిందనేదొక్కటే మనకు కనిపిస్తోంది. ఇంకా లోతుల్లోకి తవ్వుతూ పోతే భయంకరమైన నిజాలు తెలిశాయి. ఒక ఫంక్షన్ జరిగితే భోజనాల తర్వాత ఆ ప్లేట్లు, స్పూన్లు చెత్త బుట్టల్లోకి చేరాలి కదా! ధర్మాకోల్ ప్లేట్లు మాత్రమే గార్బేజ్ బిన్లో కనిపిస్తాయి, ప్లాస్టిక్ స్పూన్లు చేరవు. ఒకరోజు మావారు ఐస్‌క్రీమ్ పార్లర్ ముందు రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు నిలబడి అక్కడేం జరుగుతోందో గమనించారు. పార్లర్ మూసేస్తూ పార్లర్ వాళ్లు డస్ట్‌బిన్‌ను బయట పెట్టి వెళ్లిపోయారు. ఆ బిన్లో కర్రపెట్టి కెలికి మరీ చూశారట నారాయణ! ఐస్‌క్రీమ్ కప్పులతోపాటు విరిగిన స్పూన్లు రెండు మూడు మాత్రమే ఉన్నాయి. కప్పులు ఉన్నన్ని స్పూన్లు ఉండాలి కదా, అలా లేవు. అంటే మిగతావి రీయూజ్ అవుతున్నాయన్నమాట! భోజనానికి ప్లేట్‌కి కనీసంగా ఐదు వందల రూపాయలు వసూలు చేసే హోటళ్ల నుంచి.. కప్పు ఐస్‌క్రీమ్‌కి రెండు వందలు వసూలు చేసే పార్లర్ల వరకు ప్లాస్టిక్ స్పూన్ల రీయూజ్ కి పాల్పడుతున్నాయి. వాటిని ఎలా వాడినా అనారోగ్యం తప్పదు. అంతకంటే ఘోరం ఏమిటంటే.. స్పూన్లు తయారు చేసే కంపెనీల్లో.. ప్యాకింగ్‌కి ముందు స్పూన్లను తుడిచే క్లాత్‌ను చూస్తే ‘ఇప్పటికి మన కడుపులోకి ఎంత గ్రీజ్ వెళ్లి ఉంటుందో’ ననే ఆలోచనతో కడుపు తిప్పినట్లవుతుంది. ఒక్కో స్పూన్‌కి ఉన్న గ్రీజ్‌ను తుడిచి, తుడిచి... రోజుకి వేలాది స్పూన్లను అదే క్లాత్‌తో తుడుస్తుంటారు. మావారు ఇవన్నీ నాకు చెబుతూ... జొన్న, గోధుమ, వరి పిండితో స్పూన్లు తయారు చేస్తే, భోజనం పూర్తయిన తర్వాత వాటిని కరకరా నమిలి తినేయవచ్చని, తినకుండా పారేసినా త్వరగా నేలలో కలిసిపోతుంది, పర్యావరణానికి హాని కలగదని వివరించారు. ఈ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తే ప్లాస్టిక్‌తో గ్రీజును తినే దుస్థితి తప్పుతుంది, జొన్న పంటకు డిమాండ్ పెరుగుతుంది. జొన్నలు పండించే రైతులకు మంచి మార్కెట్ ఉంటే వాటినే ఎక్కువగా పండిస్తారని అని కూడా చెప్పారు. ఆయన వాదనతో నేను కన్విన్స్ అయ్యాను. కానీ ఉన్న పళంగా ఉద్యోగం మానేస్తే ఎలాగనే భయం కూడా ఉండింది. ఆయన అప్పటికే మానేసి పూర్తిగా ఇందులోనే మునిగిపోయారు. ఒకరి ఉద్యోగమైనా ఉంటే కొంత భరోసా ఉంటుందనిపించింది. నాలుగేళ్ల తర్వాత నేనూ మానేసి ఆయనతో పాటు యూనిట్ నిర్వహణ బాధ్యతను పంచుకున్నాను. స్పూన్లను మొదట మాన్యువల్‌గా చేశాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం వచ్చిన తర్వాత మెషినరీతో చేస్తున్నాం. మూడు షిఫ్టులు పని చేస్తే రోజుకు పాతిక వేల స్పూన్లు చేయవచ్చు. పవర్ సప్లయ్‌లో ఇబ్బందులతో రెండు షిఫ్టులే చేస్తున్నాం. పిండి.. స్పూన్‌గా మారాలంటే.. పిండి కలిపి స్లైడర్ మీద పెడితే రొట్టెలా ప్రెస్ అయ్యి, స్లైడర్ మౌల్డ్‌లోకి వెళ్తుంది. మౌల్డ్‌లో స్పూన్ ఆకారంలో కట్ అయి, బేకింVŠ సెక్షన్లో బేక్ అవుతుంది. ఆ తర్వాత డీహైడ్రేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్‌కి ఇరవై నిమిషాలు పడుతుంది. పిండి కలపడం నుంచి మొదలు పెట్టి, బేకింగ్, డీహైడ్రేటింగ్, క్వాలిటీ చెకింగ్, ప్యాకింగ్ వరకు అన్ని దశలు పూర్తి కావడానికి రెండు గంటలు పడుతుంది. ఒకసారి రౌండ్‌కి వెయ్యి స్పూన్లు వస్తాయి. వెయ్యికి రెండు–మూడు ఓవర్ బేక్ అవుతుంటాయి. మధ్యలో కరెంట్ పోయిందంటే అంతా వృథా. కరెంట్ వచ్చాక మళ్లీ మెషీన్ వేడెక్కడానికే ఒకటిన్నర గంట పడుతుంది. ప్లెయిన్ స్పూన్లతోపాటు షుగర్, సాల్డ్, పెప్పర్, జీరా, వాము ఫ్లేవర్లలో చేస్తున్నాం. అదృష్టం ఏమిటంటే ఆర్డర్లు బాగా వస్తున్నాయి, మా మెషినరీ కెపాసిటీ ఇంత పెద్ద ఆర్డర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదు. దాంతో సప్లయ్ లేటవుతోంది. ఫారిన్ ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. యూనిట్‌ని విస్తరించే ధైర్యం చేయలేకపోతున్నాం. మా ప్రోడక్ట్ మీద నమ్మకం కుదిరింది కాబట్టి ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తాయేమో కానీ, ఉన్న అప్పులు తీరకుండానే కొత్త అప్పు చేయడానికి మాకే భయంగా ఉంది. వ్యాపారం కోసం కాదు మేము ఈ తినే స్పూన్ల కాన్సెప్ట్‌ను మొదలు పెట్టింది... అనారోగ్యకరమైన అలవాట్లను మాన్పించి ఆరోగ్యకరమైన అలవాటు చేద్దామని మాత్రమే. మా ప్రయత్నంలో పాత్బ్రేకర్స్గా ఓ గుర్తింపును తెచ్చుకోగలిగాం. అయితే వ్యాపారంగా మార్చుకోవడం మాకు తెలియని పని. స్పూన్ తయారీ కంటే ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్టుకే ఎక్కువ ఖర్చవుతోంది. ఆ ఖర్చులన్నీ స్పూన్ మీదనే మోపడం అనేది వ్యాపార సూత్రం, వ్యాపారం నిలబడాలంటే అలాగే చేయాలి కూడా. అలాగని ధర పెంచుతూ పోతే మా ఉద్దేశం నెరవేరదు. ప్లాస్టిక్ స్పూన్‌కి ప్రత్యామ్నాయంగా జొన్న పిండి స్పూన్లను వాడుకలోకి తేవడంలో విజయవంతం అయ్యాం. కానీ వీటి ధర పెరిగితే ఎవరూ వీటి వైపు చూడరు, కడుపులోకి గ్రీజ్ పోతే క్యాన్సర్ వస్తుందని తెలిసినా తక్కువ ధరలో దొరికే ప్లాస్టిక్ స్పూన్లకే మొగ్గుచూపుతారు. సమాజం అలా వెళ్లకుండా ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గర చేయడమే మా లక్ష్యం. అంతర్లీనంగా రైతుల ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. మాది వ్యాపారం కాదు, ఒక సోషల్ కాజ్ మాత్రమే. మా అమ్మాయి కెనడాలో మేథమెటీషియన్. తనకు ఈ రంగం మీద ఆసక్తి లేదు. ఇక మా ఇద్దరికీ ఇదే ప్రపంచం’’. పిండి స్పూన్ పాడవదు మచిలీపట్నంలో పుట్టి కోల్‌కతాలో పెరిగి బరోడాలో ఉద్యోగం చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. జొన్నపిండి స్పూన్ల కాన్సెప్ట్‌ని డిజైన్ చేసుకున్నాకే పనిలోకి దిగాను. కానీ మెషినరీ కోసం ప్రయత్నించినప్పుడు కొత్త సంగతి తెలిసింది. ఇంత వరకు అలాంటి మెషీన్ అవసరం రాకపోవడంతో ఎవరూ డిజైన్ చేయలేదని! దాంతో మెషినరీ డిజైన్ కూడా మేమే చేయాల్సి వచ్చింది. జామ్‌బాగ్, మసాబ్ట్యాంకులు తిరిగి మౌల్డ్ మేకర్స్ దగ్గర కూర్చుని, చేత్తో చేసిన స్పూన్లను చూపించి నా ఐడియా వాళ్లకు అర్థమయ్యేలా వివరించాను. బ్యాంకు వాళ్లు చూసినట్లే వీళ్లూ వింతగా చూశారు. ఐదారు ప్రయత్నాలతో ఒకతడు ముందుకొచ్చాడు. ఎల్బి నగర్లో ఉన్న మా యూనిట్ ఇప్పుడు పూర్తిస్థాయి మెషినరీతో నడుస్తోంది. సమాజం మర్చిపోయిన జొన్నలు ఇతర చిరుధాన్యాలను తిరిగి తీసుకురావాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఈ స్పూన్లను నూటికి నూరుశాతం సహజమైన ఉత్పత్తులతో తయారు చేస్తున్నాం, కాబట్టి వాటి కారణంగా ఏ విధమైన అనారోగ్యాలూ రావు. ఏ మాత్రం తేమ లేకుండా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఇవి పాడుకావు. – నారాయణ పీసపాటి, సైంటిస్ట్, బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపకులు – వాకా మంజులారెడ్డి -
వైరల్ వీడియో చేసిన మేలు
షోలాపూర్/ముంబై: రోజురోజుకి మనుషుల మధ్య బంధాలు పలుచనైపోయి.. సొంత వారినే కాదనుకునే ఈ రోజుల్లో ఓ పోలీసు చేసిన పని అందరిచేత మన్ననలు అందుకుంటోంది. ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడికి పోలీసు స్వయంగా అన్నం తినిపించడంతో ఆ వార్త వైరల్ అయింది. అది కాస్తా తప్పిపోయిన ఆ వృద్ధుడిని తిరిగి సొంత గూటికి చేర్చింది. వివరాలు.. ముంబైకి చెందిన భికాజీ పన్సారే (90) కొన్ని నెలల క్రితం షోలాపూర్ పట్టణంలోని బైకుల్లా ప్రాంతంలో తప్పిపోయాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. బైకుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం షోలాపూర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నస్రుద్దీన్ షైక్ రోడ్డు పక్కన పడి ఉన్న ఓ వృద్ధుడికి అన్నం తినిపించాడు. పోలీసు చేస్తున్న గొప్ప పనిని వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అది చక్కర్లు కొడుతూ.. పన్సారే ఇంటి పక్కనే నివాసముండే మరో కానిస్టేబుల్ బుజ్బల్ కంటబడింది. వృద్ధుడి కుటుంబ సభ్యులకు ఆ వీడియోని చూపించగా వారు పన్సారేని గుర్తించారు. బుజ్బల్ హుటాహుటిన బైకుల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు వృద్ధుడి ఆచూకీ కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వైరల్ వీడియో: ‘ఐ లవ్ యూ బేబీస్’
వాషింగ్టన్, అమెరికా : తల్లి, పిల్లల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మనుషులకే కాదు సృష్టిలోని జీవులన్నింటిలోనూ ఉంటాయి. అమెరికాలో సోమవారం జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. పక్షి ప్రేమికురాలు హాగ్కు తాను పెంచుకుంటున్న మాటల చిలుక పిల్లలతో ఆడుకోవడం మహా సరదా. ఎప్పటిలానే సోమవారం చిలుక పిల్లలతో ఆట మొదలుపెట్టిన హాగ్ ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. పొడిపొడి మాటలను మాత్రమే పలికే హాగ్ చిలుక పిల్లలకు ‘ఐ లవ్ యూ బేబీస్’ అని చెప్పింది. పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తూ తల్లి చిలుక వాటిని ముద్దాడుతున్న ఈ అరుదైన సన్నివేశాల్ని హాగ్ రహస్యంగా కెమెరాలో బంధించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దాదాపు లక్షా ముప్పైవేల మంది ఆ పక్షుల ప్రేమానురాగాల్ని చూసి మురిసిపోయారు. -
మే నాటికి వాటర్‌బేస్ హ్యాచరీ రెడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల దాణా ఉత్పత్తిలో ఉన్న వాటర్‌బేస్ నెల్లూరు జిల్లాలో హ్యాచరీని ఏర్పాటు చేస్తోంది. రామతీర్థం సమీపంలో రానున్న ఈ ప్లాంటులో ఏటా 50 కోట్ల పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. తొలి దశ ప్లాంటు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. రెండో దశ 2019 జనవరిలో కార్యరూపంలోకి వస్తుంది. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ మొత్తంలో సగం రుణం ద్వారా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. తొలి ఏడాది రూ.10 కోట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచే హ్యాచరీ ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరనుంది. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20లో రూ.25 కోట్ల ఆదాయాన్ని వాటర్‌బేస్ ఆశిస్తోంది. కాగా, దాణా తయారీకి కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 1,10,000 టన్నులు ఉంది. ప్రస్తుతం 50,000 టన్నులు విక్రయిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 60,000 టన్నులు దాటనుందని అంచనా వేస్తోంది. కంపెనీ 2017–18 ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.277 కోట్ల టర్నోవర్‌పై రూ.27 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీకి అవార్డు: వాటర్బేస్కు రొయ్యల దాణా విభాగంలో ఆసియాస్ మోస్ట్ వాల్యుయేబుల్ బిజినెస్ బ్రాండ్ అవార్డు వరించింది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్ బ్రాండ్, లీడర్షిప్ కాంక్లేవ్‌లో కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల ఈ అవార్డు అందుకున్నారు. ఐబ్రాండ్స్ 360 ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. -
కుక్కలదాడిలో 15 గొర్రెపిల్లల మృత్యువాత
కోడేరు (కొల్లాపూర్): కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లలు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలోని కొండ్రావుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల ఆశన్న సోమవారం తనకున్న గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. 15 చిన్న గొర్రె పిల్లలు ఉండటంతో వ్యవసాయ పొలంలో జల్ల కింద ఆపాడు. సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి గొర్రెపిల్లలను కుక్కలు పీక్కుతిన్నాయని బాధితుడు వాపోయాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.60 వేల ఆస్తినష్టం జరిగిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వీఆర్ఓ నారాయణ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాధితునికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి రూ.5 వేల ఆర్థికసాయం అందించినట్లు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, కోడేరు మండల పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణయాదవ్, బాలచంద్రయ్య, అంజి తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ సమీకృత దాణాతో ఎంతో మేలు
మిర్యాలగూడ రూరల్ జిల్లా వ్యాప్తంగా పశువులు, జీవాలు(గొర్రెలు, మేకలు) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిని చాలా మంది సాంప్రదాయ పద్ధతిలోనే మేపుతున్నారు. పచ్చిక బయళ్లలోకి తీసుకెళ్లి గాని, ఇంటి వద్దే కట్టేసి గాని మేత మేపుతున్నారు. దాణా వినియోగం నామ మాత్రంగానే ఉంటుంది. కొనే స్థోమత లేక చాలా మంది దాణా జోలికి వెళ్లడం లేదు. దీని వల్ల పశువులకు, జీవాలకు పోషకాలు సరైన నిష్పత్తిలో అందడం లేదు. ఫలితంగా వాటి ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పాడి పశువుల్లో ఆశించిన మేర పాల దిగుబడి పెరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సంపూర్ణ సమీకృత దాణా ’ మంచి ప్రత్యమ్నాయమని మిర్యాలగూడ వెటర్నరీ ఏడీ జూలకంటి వెంకట్ రెడ్డి తెలిపారు. పెద్దగా ఖర్చు లేకుండానే ఎండు పంటలను దాణా దినుసులను కలిపి తయారు చేసుకోవచ్చని ఆయన వివరించారు. పశువులకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను సరైన మోతాదులో సమకూర్చేలా ఎండ మేతతో సహా అన్ని దాణా దినుసులను పొడి చేసి మిశ్రమంగా తయారు చేసే దాణాను సమీకృత దాణా అంటారు. ఇందులో పత్తి కట్టె, కంది కట్టె, మొక్క జొన్న చొప్ప, కండెలు, ఉలువ చొప్ప, వేరుశనగ పొట్టు, పొద్దు తిరుగుడు మొక్కలు, పూలు, చింత గింజలు, చెరకు ఆకులు, మొదలైన ఎండు పంటలను, మొక్క జొన్నలు, జొన్నలు తౌడు, గానుగ చెక్క యముకల పొడి, యూరియా దాణా దిగుబడులను ఉపయోగించుకోవచ్చు. తయారీ ఇలా... ముందుగా ఎండు మేత, దాణా దినుసులను యంత్రంలో వేసి పొడి చేయాలి. తరువాత మిక్సర్‌లో నింపాలి. ‘ఫ్రీమిక్స్’ చేసిన తరువాత 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడిచేసి మొలాసిస్‌ను తగిన మోతాదులో కలపాలి. పది నిమిషాల పాటు అన్ని పదార్థాలను బాగా కలియ బెట్టాలి. ఉదాహరణకు వేరుశనగ పొట్టు 60 కిలోలు, మొక్కజొన్న గింజలు ఎనిమిది కిలోలు, వరి తవుడు ఏడు కిలోలు, సాధారణ ఉప్పు అరకిలో, యూరియా 20.5 కిలోలు, ఖనిజలవణ మిశ్రమం కిలో, మొలాసిస్ ఒక శాతం వినియోగించి సంపూర్ణ సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. ఎన్నో ఉపయోగాలు సంపూర్ణ సమీకృత దాణా వల్ల పశువులకు కావాల్సిన పోషక పదార్థాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి. దాణాలో దినుసులు కలుస్తున్నందున పశువులు ఇష్టంగా మేస్తాయి. అదికాక సాంప్రదాయేతర మాంసకృత్తులు(యూరియా)వినియోగం పెరగడానికి వీలుంటుంది. ఘన పదార్థాల రూపంలో పశువులు ఎక్కువ మేత తినడానికి అవకాశం ఉంది. పాడి పశువులకు ఇది చాలా మంచిది. పాడి శాతం 11 నుంచి 23 వరకు పెరగవచ్చునని పరిశోధనలు తెలుపుతున్నాయి. దాణా ఖర్చు కూడా 21నుంచి 25 శాతం తగ్గుతుంది. గొర్రెల్లో 20–22, మేకల్లో 11–32 శాతం పెరుగుదల నమోదు అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితుల్లో గొర్రెలను, మేకలను వలసకు తీసుకువెళ్లకుండా స్థానికంగానే సమీకృత దాణా ఇచ్చి మేపవచ్చు. ఎంత మోతాదులో ఇవ్వాలంటే ... గొర్రెలకు అయితే వాటి శరీర బరువులో మూడు శాతం వరకు ఇవ్వాలి. సా«ధారణ మేకలైతే శరీర బరువులో మూడు శాతం వరకు, పాలిస్తుంటే ఐదు శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆవులకు 2.5 శాతం, గేదెలకు మూడు శాతం వరకు ఇస్తే ఫలితం ఉంటుంది. -
పుట్టిన బిడ్డకు ఆరు మాసాల వరకు తల్లి పాలివ్వాలి
మహారాణిపేట(విశాఖ): ఆస్తులివ్వకపోయినా పర్వాలేదు గాని పుట్టే ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు పాలిచ్చి మంచి ఆరోగ్యానివ్వాల్సిన బాధ్యత తల్లులదేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం విశాఖలో ఏర్పాటు చేసిన తల్లిపాల రాష్ట్రస్థాయి సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందం పోతుందని పట్టణాల్లో, అవగాహన లేక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 58 శాతం తల్లులే తమ బిడ్డలకు పాలిస్తుండగా.. వారిలో 70 శాతం మందే ఆరుమాసాల వరకు పాలిచ్చే వారున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విధంగా బిడ్డల అనారోగ్యానికి పరోక్షంగా వారే కారకులవుతున్నారని అన్నారు. గర్భిణులు, బాలంతలు, పిల్లల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేస్తోందని.. ప్రతిపైసా వారికి చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 55వేల అంగన్వాడీ కేంద్రాలుండగా 35 వేల కేంద్రాలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులతో 7వేల అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేశామన్నారు. ఒక్కో కేంద్రానికి రూ.10 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 14వ ఆర్ధిక సంఘం నిధులతో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం మొదటి విడతగా రూ.654 కోట్లు విడుదల చేసినట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల నుంచి చెత్త అలవాటు
ధన్‌బాద్: నాలుగేళ్ల బాలుడికి ఓ వింత అలవాటు అయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్లు అవాక్కయ్యేలా అతడు కుక్కపాలు తాగడం మొదలుపెట్టాడు. ఆ పనికి పూర్తిగా బానిసలా మారాడు. పేదవారైన అతడి తల్లిదండ్రులు ఆ చెత్త అలవాటును ఎలా మాన్పించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ధన్ బాద్ లో ఓ పేద తల్లిదండ్రులకు మోహిత్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి తల్లి రెండేళ్లకు పాలు మాన్పించింది. కానీ, అనూహ్యంగా అతడు నాలుగేళ్ల వయసుకు వచ్చాక కుక్కపాలు తాగడం మొదలుపెట్టాడు. వీధుల్లో ఆడుకునేందుకు వెళ్లిన అతడు దార్లో కనిపించే ఊరి కుక్కలతో సహవాసం చేస్తూ వాటి పాలు తాగడం మొదలుపెట్టాడు. అక్కడి కుక్కలు కూడా అతడికి పాలు ఇవ్వడం ఇష్టపడేవి. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తూ ఉండే అతడి తల్లి ఒకసారి ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయింది. ఎన్నిసార్లు నియంత్రించి అతడికి ఇదే పరిస్థితి అలావాటైంది. ఇప్పుడు ఆ బాలుడికి పదేళ్లు. ఇంటి చుట్టుపక్కల వారికి కూడా పలు చోట్ల అతడు కుక్కపాలు తాగుతూ కనిపించడంతో విసుగెత్తిపోయిన తల్లి ఇంట్లో పెట్టింది. అయినా అతడు రెండు వారాల కిందట బయటకు వెళ్లి మరో వీధిలోని కుక్క వద్దకు వెళ్లి దాని పాలుతాగేందుకు ప్రయత్నించగా అది కాస్త దాడి చేయడంతో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అతడికి ర్యాబిస్ రాకుండా వ్యాక్సిన్ వేశారు. కుక్కపాలతో ప్రాణాలకు ప్రమాదం లేదని అయితే, ర్యాబిస్ సోకే ప్రమాదం మాత్రం తప్పదని హెచ్చరించారు. -
దుఃఖసాగరమే!
♦ ‘క్షీర’సాగర్‌లో పడిపోయిన పాల దిగుబడి ♦ గ్రాసం, దాణా, నీళ్ల కొరత ♦ బక్కచిక్కిన పాడి పశువులు ♦ అప్పుల పాలైన రైతులు ♦ పోషించే శక్తి లేక అమ్ముకునుడే.. ♦ గ్రామం…లో దయనీయ దుస్థితి క్షీరసాగర్.. పేరుకు తగ్గంటే ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువే. పాడి పరిశ్రమకు నెలవు. అలాంటి ‘క్షీర’సాగర్ ఇప్పుడు దుఃఖసాగరంగా మారింది. కరువు దృష్ట్యా పరిస్థితులు తలకిందులయ్యాయి. పశువులను సాకేందుకు గ్రాసం లేక.. దప్పిక తీర్చేందుకు నీళ్లు లేకపోవడంతో బక్కచిక్కిపోతున్నాయి. పాలు ఇవ్వడమే మానేశాయి. అప్పుల పాలైన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పాడి పశువులను అమ్మేసుకుంటున్నారు. ఈ గ్రామంలో ఏ రైతును కదిలించినా కన్నీరే కారుస్తున్నారు. గజ్వేల్/ములుగు: దశాబ్దాలుగా ‘పాడి’కి నెలవుగా మారడంతో ఈ గ్రామానికి క్షీరసాగర్ పేరొచ్చింది. పేరుకు తగ్గట్టే ఎక్కడా లేనివిధంగా ఇక్కడి రైతులు పాడి అభివృద్ధిలో దూసుకెళ్తారు. ప్రియ, జెర్సీ, విజయా డెయిరీ తదితర కంపెనీలు ఏళ్ల తరబడి ఈ గ్రామం నుంచే పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్నారు. నేరుగా రైతుల డెయిరీ ఫారాల వద్దకు వచ్చి పాలను సేకరించేవారు. గతేడాది వరకు గ్రామంలో నిత్యం 2,500 వేల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి జరిగింది. కానీ ఆరు నెలలుగా గ్రామంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ధాటికి ‘పాడి’పరిశ్రమ అవసాన దశకు చేరుకుంది. ప్రస్తుతం రోజుకు 800 లీటర్ల పాలు రావడమే గగనంగా మారింది. పదుల సంఖ్యలో గేదెలు, ఆవులను ్చఠమొదటిపేజీ తరువాయి పెంచుతూ పాల ఉత్పత్తి చేపడుతున్న రైతులు కరువు కాలంలో గ్రాసం దొరక్క, నీళ్లు అందక ‘అడ్డికి పావుసేరు’ కాడికి వాటిని అమ్ముకుంటున్నారు. అప్పుల్లో మునిగి వారు చివరకు బంగారం, పుస్తెలతాళ్లను కూడా అమ్ముకుంటున్నారు. మరికొందరు ‘పాడి’పై మమకారాన్ని చంపుకోలేక వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఎండుగడ్డిని కొనుగోలు చేస్తూ ఉన్న పశువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో దాదాపు అందరు రైతులు ఇదే రకమైన భారాన్ని మోస్తున్నారు. మంగళవారం ‘సాక్షి’ గ్రామాన్ని సందర్శించగా పాడి రైతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టారు. అల్లం బలరామ్ ఆశలు గల్లంతు... క్షీరసాగర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు అల్లం బలరామ్ మూడేళ్ల క్రితం ఒక్కోదానికి రూ.65 నుంచి రూ.75 వేల వరకు వెచ్చించి అధిక పాల దిగుబడినిచ్చే 12 గేదెలు కొనుగోలు చేశాడు. ఈయనకు గ్రామంలో ఎకరా సొంత భూమి ఉండగా అందులో చిన్నపాటి డెయిరీ ఫారమ్ ఏర్పాటు చేశాడు. తనకున్న ఓ బోరుబావి ఆధారంగా పశుగ్రాసాన్ని పెంచుతున్నాడు. రెండేళ్ల క్రితం వరకు కూడా నిత్యం 40 లీటర్లకుపైగా పాలు ప్రైవేటు కంపెనీలకు పోసేవాడు. ఖర్చులు, శ్రమ పోను మంచి ఆదాయం లభించడంతో దర్జాగా బతికాడు. పాడిపరిశ్రమపై ఉన్న మమకారంతో ఇంటిని వదిలి డెయిరీ ఫారమ్ వద్దే నివాసం ఏర్పరచుకున్నాడు. భార్య నర్సమ్మతో కలిసి పొద్దంతా పశుపోషణలో నిమగ్నమయ్యాడు. కానీ గత కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయి. బోరుబావి నుంచి నీళ్ల రావడం లేదు. పశుగ్రాసం ఎండిపోయింది. ఇప్పటివరకు రూ.10వేల చొప్పున మూడుసార్లు ట్రాక్టర్ల నిండా, మరోసారి రూ.16 వేలతో డీసీఎం నిండాఎండుగడ్డి కొనుగోలు చేశాడు. దీంతోపాటు నెలకు రూ.4-5వేల విలువైన దాణా అందించాడు. అయినా గేదెలకు గ్రాసం, దాణా సరిపోలేదు. పాల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. రోజుకు 10 లీటర్లు కూడా రావడం లేదు. ఎండుగడ్డి, దాణా భారీగా తేలేక బలరామ్ అప్పుల పాలయ్యాడు. చివరకు తన భార్య నర్సమ్మ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పుస్తెలతాడు 4 తులాల వరకు అమ్మేశాడు. రూ.6 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలరామ్ 8 పాడిగేదెలను కేవలం రూ.20 వేలకు ఒకటి చొప్పున అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం అతని వద్ద 4 గేదెలు మాత్రమే ఉన్నాయి. వాటి పోషణ కూడా ఇబ్బందికరంగానే ఉందంటున్న బలరామ్.. మరికొన్ని రోజుల్లో మరో రెండు గేదెలను సైతం అమ్ముకునే దయనీయ స్థితిలో ఉన్నాడు. ఈ ముసలితనంలో ఏ మూలకు కూసోకుండా...పశువులను పెంచుకుంటే... మాకు కస్టాలే మిగిలినయ్. మమ్మలను ఆదుకుంటనే గడ్డకు పడతం...అంటూ బలరామ్ వాపోయాడు. అందరిదీ ఇదే పరిస్థితి... క్షీరసాగర్కు చెందిన ఆదోసు పెద్ద యాదయ్యకు ఎకరం భూమి ఉండగా, మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో నుంచి నీరు రావడం లేదు. కౌలుకు తీసుకున్న పొలంలో 3 బోరుబావులున్నాయి. అందులో రెండు మాత్రమే కొద్దిగా నీరు పోస్తుండడంతో ఆ నీటి ఆధారంగా అర ఎకరం వరి సాగు చేశాడు. మిగతా నీటిని ఆరు గేదెలకు వాడుకుంటున్నాడు. గ్రాసం లేక ఇతను కూడా కొన్ని నెలలుగా రూ.30వేలు వెచ్చించి గడ్డి కొనుగోలు చేశాడు. విసుగు చెంది రెండు గేదెలను అతి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు. ప్రస్తుతం నాలుగు గేదెలను అతి కష్టం మీద పోషిస్తున్నాడు. గతంలో నిత్యం 20 లీటర్ల పాలు అమ్మే యాదయ్య ఇప్పుడు 4 లీటర్లు అమ్మడమే గగనమవుతుంది. ఇదే గ్రామానికి చెందిన చాకలి వెంకట్ సైతం 12 గేదెలకు గ్రాసం దొరకని కారణంగా వాటిని ఎనిమిదింటిని అమ్మేశాడు. గ్రాసం కోసం నానా తంటాలు పడుతున్నాడు. కోల సాయిలు అనే మరో రైతు సైతం నాలుగు గేదెల్లో రెండింటిని అమ్మేయగా వీటి పోషణ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఎండుగడ్డి కొనుగోలు చేస్తున్నాడు. -
మంత్రి ఆలస్యం.. భక్తులకు నీరసం
ఆలస్యంగా ప్రారంభమైన అన్నదానం మూడు గంటలపాటు క్యూలైన్లోనే భక్తుల పడిగాపులు విజయవాడ : దుర్గమ్మ అన్నప్రసాదాన్ని స్వీకరించేం దుకు బుధవారం ఇంద్రకీలాద్రికి చేరుకున్న భక్తులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాక ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణంగా రోజూ ఉదయం 10.30 గంటల నుంచే ఆలయంలో అన్నప్రసాదం పంపిణీ ప్రారంభిస్తారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నసంతర్పణను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.45 గంటలకు ఈ కార్యక్రమాన్ని మంత్రి ఉమా ప్రారంభిస్తారని ప్రకటించారు. అయితే మంత్రి రాక ఆలస్యం కావడంతో కార్యక్రమాన్ని 12 గంటలకు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు నేరుగా క్యూలైన్లోకి చేరారు. ఎంతకీ అన్న ప్రసాదం పంపిణీ ప్రారంభం కాకపోవడంతో పలువురు భక్తులు నిరాశగా వెను తిరిగారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాత్రం క్యూలైన్లోనే వేచివున్నారు. వృద్ధులు, చిన్నారులు నీరసంతో ఇబ్బందిపడ్డారు. క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు కనీసం మంచినీరు కూడా అందజేయలేదు. మంత్రి కోసం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబని పలువురు భక్తులు ప్రశ్నించారు. -
తిన్నది అరిగిందో లేదో చూడాలని..
చిత్రంలో రెండు ఆవులు, వాటి వీపులపై రంధ్రంతో ఉన్న గొట్టాలు అమర్చి ఉండటం చూస్తున్నారు కదా.. ఆ ఆవులు తింటున్న గడ్డి, దాణా ఎంతమేరకు అరుగుతుందో తెలుసుకుందామనే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను అమర్చారు! ఎనిమిది అంగుళాల రంధ్రంతో ఉన్న ఈ గొట్టాలు నేరుగా వాటి జీర్ణాశయంలోని ఓ గదిలోకి తెరుచుకుని ఉంటాయి. అంటే ఒకరకంగా ఆ ఆవుల కడుపులకు ఇవి కిటికీల వంటివన్నమాట. వీటిలోంచి చూస్తే.. ఆవుల కడుపులో మేత ఎంతవరకూ అరిగిందో కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ గొట్టంలోంచి కొంత మేతను సేకరించి పరీక్షలు చేయడం ద్వారా అది ఆవుకు ఎంత మేలైన ఆహారమో కూడా అంచనా వేస్తారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వ పరిశోధన సంస్థ ‘అగ్రోస్కోప్’ శాస్త్రవేత్తలు ఇలా 14 ఆవులకు కాన్వులాస్ అనే ఈ గొట్టాలను అమర్చారు. ప్రస్తుతం యూరప్‌తోపాటు అమెరికాలో కూడా ఇలాంటి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అయితే నోరులేని అమాయకపు జంతువులను ఇలా ప్రయోగాల పేరుతో హింసించడం క్రూరమైన చర్య అంటూ.. జంతుహక్కుల కార్యకర్తలు మండిపడుతున్నా.. గోమాతల మేలు కోసమే ఈ ప్రయోగం చేస్తున్నామని శాస్త్రవేత్తలు బదులిస్తున్నారు. ఆవులకు ఏది మంచి ఆహారమో నిర్ణయించి, ఆ ఆహారాన్నే ఇవ్వడం ద్వారా వాటికి ఆరోగ్యాన్ని, ఆయువునూ ఇవ్వవచ్చని చెబుతున్నారు. అన్నట్టూ.. పశువులపై ఇలాంటి ప్రయోగాలు 1833లోనే మొదలయ్యాయట. -
బాధితులకు వైఎస్సార్సీపీ ఆపన్న హస్తం
సాక్షి, గుంటూరు, ఒంగోలు: గుంటూరు జిల్లాలో జలవిలయానికి నష్టపోయిన బాధితులను వైఎస్సార్సీపీ నాయకులు ఆదుకున్నారు. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), సీజీసీ సభ్యుడు జంగాకృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి బాధితులను పరామర్శించారు. నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధితులకు ఆర్థిక సాయం, అన్నదానం చేశారు. బాపట్ల మండలం దగ్గుమల్లివారిపాలెంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో పార్టీ పట్టణ కన్వీనర్ దగ్గుమల్లి ధర్మారావు 2 రోజులుగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఒంగోలులోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముంపు కాలనీల్లో ప్రజలకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు.