
ఓ వృద్ధురాలు తనచేతితో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వృద్ధురాలి ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఉన్న ఏనుగుకు, బకెట్‌లో నుంచి ఆహారాన్ని తీసి ముద్దగా చేసి ఏనుగు నోట్లో పెడుతుంది. చెవులు ఊపుతూ ఆస్వాదిస్తూ తింటున్నట్లుగా ఉన్న ఏనుగు హావభావాలు చూపరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను వేల మంది వీక్షిస్తున్నారు.
కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తల్లి ప్రేమతో చేసే ఏ పనికైనా విలువ కట్టలేం అని ఒకరు కామెంట్ చేస్తే, మంచి మనసున్న మహిళ సున్నితమైన భారీ కాయానికి ఆహారం తినిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. అనేక మంది యూజర్లు వావ్ అని కామెంట్ చేసి, హార్ట్ సింబల్ ఎమోజీలతో తమ స్పందనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
చదవండి: Chocolate Ganesha:చాక్లెట్ గణేశ్.. పాలల్లో నిమజ్జనం..
Comments
Please login to add a commentAdd a comment