Mother love
-
అమ్మా... నా పేరు గుర్తుందా?
తల్లిని కౌగిలించుకొని కూతురు ఏడ్చింది. ఆ తల్లి కూతురిని ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. దశాబ్దకాలంగా డిమెన్షియాతో బాధ పడుతోంది తల్లి. తన ముందు మరో వ్యక్తి ఉన్నట్లుగానే భావిస్తుంది తప్ప తన కూతురుకు సంబంధించిన విలువైన జ్ఞాపకాలేవీ ఆ తల్లిలో లేవు. అయినప్పటికీ సహజాతమైన తల్లి ప్రేమతో... ఏడుస్తున్న కూతురిని ఓదార్చుతుంది. ఇది ఏ దేశంలో వీడియో అయితేనేం?అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెచ్చుకునే వీడియోగా మారింది.‘దే నెవర్ ఫర్గెట్ లవ్’ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. కామెంట్ సెక్షన్ కన్నీళ్లతో తడిసి΄ోయింది. ఈ వైరల్ వీడియో క్లిప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కూతుళ్లు, కుమారులు అనారోగ్యం బారిన పడిన తమ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ బాధపడ్డారు.‘నీ పేరు గుర్తుకు రావడం లేదు అని అమ్మ అన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది’ అని ఒక కుమారుడు అలై్జమర్స్ బారిన పడిన తన తల్లి గురించి బాధపడ్డాడు. ఇది చూసి ఒక యూజర్ – ‘తల్లిప్రేమ అనేది జ్ఞాపకం కాదు. అది శాశ్వతం’ అని కామెంట్ పెట్టాడు. -
తల్లి ప్రేమ గురించి ఎంత బాగా చెప్పాడో చూడండి..!
-
ఈ సూపర్ మామ్స్‌కి కుడోస్.. మదర్స్ డే స్పెషల్
కోవిడ్ టైమ్‌లో.. ఇటు ఆఫీస్ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్ మదర్స్ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 32.3 శాతమేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్ సెంటర్స్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్ కౌన్సెలర్స్ సపోర్ట్ అవసరమని స్పష్టం చేశారు. అది జాబ్స్ ఫర్ హర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే వివరం. కోవిడ్ తర్వాతే.. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్ మదర్స్ కోవిడ్ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్ మదర్స్ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట! ‘ప్రిడిక్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్ మదర్స్ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్ మదర్స్.. మెటర్నిటీ లీవ్, పాండమిక్ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్‌తో. ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్.. ఈ రోజు మదర్స్ డే! ఆ సందర్భంగా వర్కింగ్ మదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్‌గా డిఫరెంట్ కెరీర్‌కి స్విచ్ ఆన్ అయిన వర్కింగ్ మదర్స్ పరిచయ ప్రయత్నమే ఈ కథనం.. మమీయూ ఇదో మెటర్నిటీ గార్మెంట్స్ బ్రాండ్. శాలినీ శర్మ బ్రెయిన్ చైల్డ్. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి. ఆన్లైన్.. ఆఫ్‌లైన్ మార్కెట్ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లోనూ వెదికింది. ఫారిన్ బ్రాండ్స్‌లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. ఆ ప్రయాణానికి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్ నుంచి మిజోరమ్ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది. మమీయూను కమ్యూనిటీ బేస్డ్ క్లాతింగ్ బ్రాండ్‌గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్లో మెటర్నిటీ గార్మెంట్స్‌కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్‌ను లాంచ్ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్‌గా దేశంలోని డిఫరెంట్ సిటీస్‌లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. చాలెంజెస్‌ను హ్యాండిల్ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్ ప్లేస్‌నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్ కోసం హిమాచల్, సోలన్ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్ వర్క్ స్కిల్స్.. డిఫరెంట్ వర్క్ టైమింగ్స్‌లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్ సక్సెస్‌కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్‌గా మారిన మదర్ శాలినీ శర్మ. జాబ్స్ ఫర్ హర్.. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్ మదర్స్ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్ అంట్రప్రెన్యూర్ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్‌లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్గా సక్సెస్ఫుల్ కెరీర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది. ‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్‌లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్‌కి సంబంధించి అప్టు డేట్ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్‌ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్ మదర్స్‌కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్ చేసి.. వాళ్ల చేత సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్కెరీర్ను స్టార్ట్ చేసింది. అదే జాబ్స్ ఫర్ హర్ సంస్థ. మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఎంటర్ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్ ఫర్ హర్ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్ మదర్స్‌కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా. మిష్రీ డాట్ కామ్ జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్డీటీవీ ఫుడ్ చానెల్‌కి పదేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్‌కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్ రివ్యూ వెబ్‌సైట్‌గా డిసైడ్ అయింది. అదే మిష్రీ డాట్ కామ్ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్‌హుడ్ కారణంగా జాబ్ వదిలేసిన తల్లులు తమ కిచెన్ స్కిల్స్‌కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేసే తొలి వెబ్సైట్ కూడా! ‘మన ఎక్స్పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్ చానెల్లోని నా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నే నా ఈ ఫుడ్ రివ్యూ వెబ్సైట్ మీద ఇన్వెస్ట్ చేశా. సక్సెస్ చూస్తున్నా. ఈ వెబ్సైట్లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్‌లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. వీళ్లు సరే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తమ మదర్ హుడ్‌తో ఇన్ఫ్లుయెన్స్ చేసి.. మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వేల.. లక్షల ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. అనుప్రియ కౌర్.. ఆమె ఇన్స్టాగ్రామ్ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్ అండ్ ఫిట్ అని! కార్పొరేట్ ఉద్యోగిని. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఫిట్నెస్, శారీ ఫ్యాషన్ వరకు చాలా విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. రిద్ధి డోరా సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్ కోసం బయట కూడా వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను’ అంటుంది. చావి మిత్తల్ ‘మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్’విన్నర్. కంటెంట్ క్రియేటర్. ‘బీయింగ్ ఉమన్ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్‌కి సంబంధించి అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సరు ముఖర్జీ శర్మ ‘డైపర్స్ అండ్ లిప్స్టిక్స్’ పేరుతో పేరెంటింగ్ నుంచి ఫ్యాషన్, ఫిట్నెస్ దాకా అన్ని విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్‌లోని ‘బికాజ్ యూ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఏ మామ్’ అనే స్టేట్మెంట్తో! శ్రద్ధ సింగ్.. యూట్యూబ్‌లో చాలా పాపులర్. ఇన్‌స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్‌హుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్‌లను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్‌స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్ శ్రాడ్స్తో ఇంకో ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్ చేస్తూంటుంది. మదర్స్ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్.. షెఫ్.. బైకర్ గర్ల్.. స్కూబా డైవర్ అండ్ యాక్టర్’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్ అన్నీ ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్‌లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్ లేకుండా తనను తనలాగే ఇన్‌స్టాలో ప్రెజెంట్ చేసుకుంటుంది. గ్లామర్ రంగంలో వైట్ స్కిన్ పట్ల ఉన్న అబ్సేషన్ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్ నుంచి కాస్మెటిక్ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్ఫెక్ట్లీపర్ఫెక్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయినే చెప్తోంది. ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్‌గా పోస్ట్‌లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్‌పార్టమ్ స్ట్రెస్ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్ క్యారెక్టర్లకు కాల్షీట్స్ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్ గ్రామర్ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్ వంటివారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ మామ్స్కీ కుడోస్.. బాక్సర్ మేరీ కామ్ అంటే తెలియని వాళ్లుండరు! 2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు. వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్ మామ్ మేరీ కామ్. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్ టెన్నిస్ కోర్ట్‌లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం. -
ఈ పిల్లి 'మ్యావ్' అనదు.. ‘మామ్’ అంటుంది..!
ఈ పిల్లి ‘మ్యావ్’ అంటుందా? ‘మామ్’ అంటుందా? అనే విషయం కాస్త కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ ‘మామ్’ అంటుందనే శబ్దభ్రమను కలిగిస్తుంది. ముంబైకి చెందిన ఒక మహిళ పిల్లిని పెంచుకుంటుంది. ఆమె పేరేమిటో తెలియదుగానీ పిల్లి పేరు జగ్గు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జగ్గు ఆమెకు కన్న కొడుకుగా మారిపోయి, ఆమెను నీడలా అనుసరిస్తోంది. వీరి బంధాన్ని ప్రతిబింబించే వీడియో ఎన్నో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jaggu Patil (@jaggu_ae_jaggu) ఇన్స్టాగ్రామ్ పేజీ ‘జగ్గు పాటిల్’లో జగ్గు ప్రతి మూమెంట్‌ను డాక్యుమెంట్ చేశారు. ‘మదర్స్ లవ్ ఈజ్ యూనివర్శల్’ ‘ఎందరో తల్లులు. ప్రేమ మాత్రం ఒక్కటే’ ‘భావోద్వేగాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి కావు’ ‘ఇలాంటి ప్రేమ మన దేశంలోని తల్లులకు మాత్రమే సాధ్యపడుతుంది. భగవంతుడు కోరుకునేది ఇదే’ ‘నిజమైన ప్రేమకు నిలువెత్తు సంతకం... తల్లి’... అంటూ నెటిజనులు స్పందించారు. -
వైరల్ వీడియో: తల్లి ప్రేమ.. మొసలికే చక్కులు చూపించింది
-
చిన్నా.. లేరా! గుండెల్ని తాకే అమ్మ ప్రేమ
Viral Video: మనిషికి మాత్రమే అమ్మ ప్రేమ సొంతం కాదు. సకల చర ప్రాణ జీవులకూ సొంతం అది. పైగా ఈ సృష్టిలో స్వార్థంతో పోల్చలేనిది అదొక్కటి మాత్రమే!. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా ఉండదు కూడా. అమ్మ ప్రేమ గొప్పదనం నిరూపించే సాక్ష్యాలు కోకోల్లలు.. అందులో ఒకటి ఈ వీడియో. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ.. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి గుండెల్ని హత్తుకునే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆడ ఎలిఫెంట్(భారీ సైజులో) సీల్ ఒకటి అప్పుడే ప్రసవించింది. అయితే బిడ్డ అచేతనంగా పడి ఉండడంతో.. దిగాలుగా దానిని కదిలించే ప్రయత్నం చేసింది. అటుపై ఆ పిల్లలో చలనంతో ఒక్కసారిగా అది మురిసిపోయింది. సంతోషంతో కేకలు వేసింది. ఇంటర్నేషనల్ సీల్ డే సందర్భంగా.. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటేలా వ్యూస్, లైక్స్, షేర్లతో దూసుకుపోతోంది. This elephant seal mum has just given birth and is anxious her baby is still, Watch her reaction when her child moves pic.twitter.com/D3DdU7h0on — Science girl (@gunsnrosesgirl3) March 22, 2023 -
అమ్మకి చిరు కానుక.. ఆమె రియాక్షన్ ఇది
వైరల్: సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. ప్రపంచంతో సంబంధం లేనట్లు కేవలం ఇంటికే పరిమితమై కుటుంబాల కోసం కష్టపడే తల్లులకు సలాం. అయితే.. వాళ్లపై ప్రేమను ప్రదర్శించేందుకు బిడ్డలు చిరు కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. అలాంటి కానుకనే ఇచ్చి.. అమ్మను సర్ప్రైజ్ చేశాడు ఓ తనయుడు. ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్ ద్వారా వైరల్ అవుతోంది. కుటుంబం కోసం ఇంట్లోనే అహర్నిశలు కష్టపడే ఓ అమ్మ.. వంటను సిద్ధం చేస్తూ ఉంటుంది. వెనుక నుంచి బంగారు గొలుసుతో వెళ్లి ఆమె మెడలో సర్ప్రైజ్ చేశాడు ఆ తనయుడు. ఊహించని ఆ పరిణామాన్ని నవ్వుతో సరిపెట్టుకున్న ఆ తల్లి.. ఆ గొలుసును చూసుకుంటూ మురిసిపోతుంటుంది. छोटा सा गिफ्ट मम्मी के लिए 👩❤️💋👨🎁💐 pic.twitter.com/WPUc7fTvRj — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022 -
అమ్మ చేతి ఆఖరి వంట.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్
అమ్మ ప్రేమకు కొలమానం ఉంటుందా?.. అంతులేని మమకారాన్ని ప్రదర్శించిన ఓ అమ్మ వీడియో కోట్ల మందితో కంటతడి పెట్టిస్తోంది. ఎందుకంటే ఆమె ఆఖరి గడియలు ఉంది కాబట్టి. అయినా ఆ ఇబ్బందికర క్షణాల్లోనూ ఆమె కొడుకు కోసమే ఆలోచించింది. ప్రేమగా అతనికి వండిపెట్టింది. చైనాలో ఓ వీడియో.. సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇప్పటిదాకా కోట్ల మంది ఆ వీడియోను తిలకించడంతో రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఈ వారం మోస్ట్ సెర్చ్డ్ న్యూస్‌గా అక్కడి నిలిచింది ఆ వీడియో. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ మహిళ.. ఆఖరి క్షణాల్లో తన కొడుకు కోసం ప్రేమగా వండిపెడితే.. వ్లోగర్ అయిన ఆ కుర్రాడు కన్నీళ్లతో తీసిన వీడియో అది. దలైయాన్కు చెందిన ఓ 20 ఏళ్ల టీనేజర్.. డెంగ్ అనే మారుపేరుతో గత వారం చైనా షార్ట్‌వీడియో యాప్ డౌయిన్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. చైనా జానపద సంగీతం ఫేర్వెల్ సంగీతాన్ని ఆ వీడియోకు జత చేశాడు. ‘‘అమ్మా.. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. ఇకపై ఏదీ నన్ను ఓడించదు’’ కన్నీళ్లతో ఆమెకు నివాళి ఇస్తూ క్యాప్షన్ ఉంచాడు. ‘‘మా అమ్మకి మనోధైర్యం ఎక్కువ. స్వతంత్రంగా బతకాలనుకునే మనిషి. ఈ ఫిబ్రవరిలో ఆమె(49) క్యాన్సర్ బారిన పడింది. కానీ, ఇంట్లోవాళ్లకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే.. ఆ విషయం తెలిస్తే మేం ఏమైపోతామో అని ఆమె భయం. ఆమెకి ఉన్న జబ్బు మాకు తెలిసేసరికి.. పరిస్థితి చేజారిపోయింది. అయినా అమ్మను బతికించుకునేందుకు ప్రయత్నించాం. మూడో సెషన్ కీమోథెరపీ పూర్తైన కొన్నాళ్లకు.. ఆమె ఒకరోజు హఠాత్తుగా ‘ఏం తినాలని ఉంది’ అని నన్ను అడిగింది. మార్కెట్‌కు తాను కూడా వచ్చింది. కావాల్సిన సరుకులన్నీ ఆమె ఎంచుకుంది. స్వయంగా వంట గదిలో దగ్గరుండి వండింది. మా అమ్మను అలా చూసేసరికి నా కన్నీళ్లు ఆగలేదు. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిపడుతూనే ఆమె వంట చేసింది. కనీసం నన్ను దగ్గరికి కూడా రావొద్దని వారించింది. దగ్గరుండి ఆమె వడ్డించింది. ఆమె వండిన వంట.. ఎప్పటిలాగే రుచికరంగా ఉంది. దురదృష్టవశాత్తూ అదే మా అమ్మ చేతి ఆఖరి వంట అయ్యింది. ఆ మరుసటిరోజే ఆమె నిద్రలో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను, చివరి క్షణాలను ఇక నేను జీవితాంతం మోయక తప్పదు అంటూ భావోద్వేగంగా ఆ వీడియోను ఉంచాడు. కేవలం ఆ షార్ట్ వీడియో డౌయిన్‌లో రెండు లక్షల దాకా లైకులు తెచ్చుకుంది. చావు.. ఎల్లప్పుడూ బతికి ఉండే ప్రేమకు ముగింపు కాదు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. తన అమ్మ చనిపోయిన తర్వాత ఆమె వండిన వంటకాలు ఫ్రిజ్‌లో ఉండిపోయాయని, వాటిని చాలాకాలం ఆమెను తల్చుకుంటూ తిన్నానని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక ఏ లోకంలో ఉన్నా ఆ అమ్మ నిన్ను చూస్తూనే ఉంటుందని ఓ మహిళ కామెంట్ చేసింది. -
ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన మరో అడోరబుల్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ట్విటర్లో ఆకర్షణీయమైన పో'స్టులు, ఆసక్తిరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ఆయన ఈ వీకెండ్లో మరో ఇంట్రస్టింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఒక్కోసారి పిల్లలు వేరే జాతివాళ్లా... అనిపిస్తుంది. ఏది ఏమైనా పిల్లలంటే పిచ్చి ప్రేమే అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. (కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!) ఈ వీడియోలో ఒరంగుటాన్ పులి పిల్లలకు పాలు పట్టడం, ముద్దు చేయడం కన్నతల్లి కంటే మిన్నగా ప్రేమను పంచడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో అమ్మ ఎక్కడైనా అమ్మే అని కొంతమంది, జంతువులనుంచి మనుషుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మరికొంతమంది కమెంట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న చక్కటి ఈ వీడియోను ఈ వీకెండ్లో మీరు కూడా చూసేయండి. (Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) Sometimes you feel like your kids belong to a different species but you’re crazy about them nevertheless! 😊 pic.twitter.com/rD9IGohPQq — anand mahindra (@anandmahindra) August 7, 2022 -
Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అనే నానుడికి మరో ఉదాహరణ ఆమె కథ. వికలాంగుడైన బిడ్డను ఇతర తల్లుల్లా చెత్త కుప్పల్లో పడేయడానికి ఆమె మాతృ హృదయం వెనుకాడింది. అమ్మకు బిడ్డ ఎప్పటికీ బరువు కాదుగా! అందుకే కడుపున మోసిన బిడ్డను ఈ సారి వీపున మోసింది. ప్రపంచం అంచులా దాకా తీసుకెళ్లింది. కళ్లు కనిపించని బిడ్డకు తన కళ్లతో లోకమంతా చూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తల్లీబిడ్డలకు చెందిన ఫొటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా భావోధ్వేగానికి గురౌతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. ఐతే పుట్టిన బిడ్డకు అంగవైకల్యంతోపాటు, కళ్లు కూడా కనిపించవని తెలుసుకుని కుమిలిపోయింది. ఐతేనేమి తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలనుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే ప్రపంచ పర్యటన (వరల్డ్ టూర్)కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు కొడుకును తీసుకెళ్తోంది. మామూలు పిల్లలకు అందినట్టే నా కొడుకుకు కూడా సకల ఆనందాలను పంచాలనుకుంటున్నాను. నా కోడుకు జిమ్మీతో కరోనా వ్యాప్తికి ముందే కెనడాను సందర్శించానలనుకున్నాను. డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్స్, దుప్పట్లు, దిండులు మాతో పాటు తీసుకెళ్తున్నాను. వీపుపై జిమ్మీని మోయడం ప్రాక్టీస్ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది. నిక్కీ - జిమ్మీల కథ ఎందరికో ఆదర్శం. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
గజేంద్రుడి ఆకలి తీర్చిన వృద్ధురాలు..
ఓ వృద్ధురాలు తనచేతితో ఏనుగుకు ఆహారం తినిపిస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వృద్ధురాలి ఇంటి ముందు ఆవరణలో నిలబడి ఉన్న ఏనుగుకు, బకెట్లో నుంచి ఆహారాన్ని తీసి ముద్దగా చేసి ఏనుగు నోట్లో పెడుతుంది. చెవులు ఊపుతూ ఆస్వాదిస్తూ తింటున్నట్లుగా ఉన్న ఏనుగు హావభావాలు చూపరులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోను వేల మంది వీక్షిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తల్లి ప్రేమతో చేసే ఏ పనికైనా విలువ కట్టలేం అని ఒకరు కామెంట్ చేస్తే, మంచి మనసున్న మహిళ సున్నితమైన భారీ కాయానికి ఆహారం తినిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. అనేక మంది యూజర్లు వావ్ అని కామెంట్ చేసి, హార్ట్ సింబల్ ఎమోజీలతో తమ స్పందనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చదవండి: Chocolate Ganesha:చాక్లెట్ గణేశ్.. పాలల్లో నిమజ్జనం.. -
తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి
ముంబై: కష్టపడి పెంచి పెద్ద చేసింది.. తండ్రి లేని లోటును పూడుస్తూ.. అన్నీ తానై వ్యవహరించి స్థితిమంతులుగా తీర్చిదిద్దింది. అటువంటి మాతృమూర్తికి పుట్టిన రోజు సందర్భంగా ఓ తనయుడు అరుదైన కానుక అందించాడు. ఆమె జీవితంలో ఎప్పుడూ ఎరుగని గిఫ్ట్ ఇవ్వడంతో ఆ తల్లి ఆనందంలో మునిగి తేలింది. ఆమె కళ్లల్లో ఆనందం చూసి ఆ తనయుడు తన్మయత్వం పొందాడు. ఆ తల్లీకుమారుల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన రేఖకు ముగ్గురు సంతానం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అర్దాంతరంగా తనువు చాలించాడు. అప్పటి నుంచి పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది. ఇతరుల ఇళ్లల్లో పనిచేసి వీరిని పోషించింది. ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో స్థిరపడేలా శక్తి మేరకు కష్టపడింది. తల్లి కష్టానికి తగ్గట్టు పిల్లలు స్థిరపడ్డారు. అయితే 19వ తేదీన తల్లి 50వ జన్మదినం సందర్భంగా ఆమె చిరకాల కోరిక నెరవేర్చాలని పెద్ద కుమారుడు ప్రదీప్ నిర్ణయించుకున్నాడు. ప్రఖ్యాత్య ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్న కుమారుడు ప్రదీప్ తన చిన్నప్పుడు ఇంటిపై ఉండగా హెలికాప్టర్ వెళ్తుంటే ‘మనం ఎప్పుడైనా అందులో కూర్చోగలమా’ అని తల్లి ఆవేదన చెందింది. ప్రదీప్ ఆ మాటను అప్పటి నుంచి మనసులో దాచుకున్నాడు. ఎలాగైనా అమ్మను హెలికాప్టర్ ఎక్కించాలని ధ్రుడంగా అనుకున్నాడు. ఇప్పుడు స్థితిమంతులుగా కావడంతో కుమారుడు ప్రదీప్ తల్లి 50వ జన్మదినోత్సవం సందర్భంగా హెలికాప్టర్ ఎక్కించాడు. జుహు ఎయిర్‌బేస్‌కు వెళ్లి తల్లితో పాటు కుటుంబసభ్యులను హెలికాప్టర్లో కూర్చొబెట్టారు. ఉల్లాస్‌నగర్ పట్టణమంతా హెలికాప్టర్ రెండు రౌండ్లు చక్కర్లు కొట్టింది. కుమారుడు తన మాటలను గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆ కోరిక తీర్చడంతో ఆ తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆకాశం ఎత్తుపై నుంచి భూమిని చూస్తుండగా పిల్లలు కేరింతలు కొట్టగా.. ఆ తల్లి మాత్రం కుమారుడిని చూస్తూ కన్నీళ్లు రాల్చింది. ఆ తల్లీకుమారుడు ఇద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తల్లీకుమారుల ప్రేమానుబంధంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన ఆ కుమారుడిని ప్రశంసిస్తున్నారు. -
తల్లి ప్రేమకు ప్రతీక
ఒడిశా,కొరాపుట్: సృష్టిలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లలపై ప్రేమను చూపిస్తాయి. అందుకు ఈ చిత్రమే నిరద్శనం. స్థానిక పూజారిపుట్ రోడ్డులో బుధవారం ఉదయం బైక్ ఢీకొని ఒక కుక్కపిల్ల మృతి చెందింది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న శునకపు మృతదేహం వద్ద తల్లి శునకం కన్నీరు కారుస్తూ గంటల తరబడి కూర్చొంది. అది చూసిన వారంతా ఆ శునకం పడుతున్న ఆవేదనను, తల్లి ప్రేమను అర్థం చేసుకుని బాధాతప్తులయ్యారు. -
తల్లి ప్రేమ కావాలంటూ యువతి ధర్నా
చేర్యాల(సిద్దిపేట) : తనకు జన్మనిచ్చిన తల్లి ప్రేమ కావాలని.., తనను కన్న తల్లివద్దకు చేర్చాలని కోరుతూ ఓ యువతి ధర్నాకు దిగింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చేర్యాల మండల కేంద్రానికి చెందిన ఎర్రోల్ల భాగ్యలక్ష్మి, ఆరుకట్ల నాగభూషణంలకు 1998లో వివాహం జరిగింది. వారికి 2001లో పాప (గ్రీష్మిక) జన్మించింది. పాప పుట్టిన నాలుగు నెలలకు నాగభూషణం మృతి చెందాడు. అప్పటినుంచి నుంచి గ్రీష్మిక తన పెద్దనాన్న ప్రభాకర్ ఇంట్లో వారి బిడ్డలాగే పెరిగింది. కాగా, ఇటీవల బంధువుల ద్వారా తన కన్న తల్లి వేరే ఉందని తెలుసుకున్న గ్రీష్మిక, భాగ్యలక్ష్మి వద్దకు వచ్చింది. అయితే భాగ్యలక్ష్మి గ్రీష్మిక ఇంట్లోకి రావడానికి నిరాకరించింది. దీంతో గ్రీష్మిక పెద్దమనుషులు, పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేక పోవడంతో తనకు కన్నతల్లి ప్రేమకావాలని, తనను తల్లివద్దకు చేర్చాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గ్రీష్మికతో మాట్లాడి అనంతరం తల్లి భాగ్యలక్ష్మికి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. -
జాతివైరం పక్కనపెట్టిన అమ్మ మనసు
సాక్షి, కర్నూలు : అమ్మ.. పిల్లల ఆకలి తీరుస్తుంది తప్ప జాతీ వైషమ్యాలు చూడదని ఓ శునకం నిరూపించింది. కర్నూలు మాధవనగర్‌కు చెందిన శునకం ఆకలితో ఉన్న పంది పిల్లలకు నిత్యం పాలిస్తూ అమ్మతనానికి మరేది సాటి రాదని చాటి చెబుతోంది. పది రోజుల క్రితం ఈ శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆ పిల్లలు అనారోగ్యంతో చనిపోయాయి. అప్పటి నుంచి జాతి వైరం పక్కనపెట్టి పంది పిల్లలకు పాలిస్తోంది. నిత్యం వాటిని వెంట తిప్పుకుంటూ ఆకలి తీరుస్తోంది. ఇదంతా చూస్తున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రేమ ఔన్నత్యం గురించి గుర్తు చేసుకుంటున్నారు. -
ఇంటర్నెట్ను కుదిపేస్తోన్న ఫోటో..
వాషింగ్టన్ : బిడ్డకు ఏమైనా అయితే తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. బిడ్డ తిరిగి మామూలు మనిషి అయ్యేదాకా తల్లి బిడ్డను వదిలి ఉండలేదు. ఒక వేళ ఆ బిడ్డ మరణిస్తే.. తల్లి కడుపుకోతను ఎవరు తీర్చలేరు. మాతృప్రేమ అంటేనే అలా ఉంటుంది. దీనికి మనుషులు, జంతువులు, జలచరాలు ఏవి అతీతం కావు. దీన్ని నిరూపించే ఓ రెండు సంఘటనలు వాషింగ్టన్‌లోని ఒలంపిక్ ద్వీపకల్పంలో చోటు చేసుకున్నాయి. జే35 అనే 20 ఏళ్ల నీలి తిమింగలం రెండు వారాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కానీ తల్లి అయిన సంతోషం దానికి ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే రెండు వారాలు గడిచేలోపు ఆ బిడ్డ మరణించింది. కానీ జే మాత్రం ఈ నిజాన్ని నమ్మలేకపోతుంది. తన బిడ్డ నిద్ర పోతుందనుకుందో ఏమో.. దాన్ని మేల్కోల్పడం కోసం వీపు మీద ఎక్కించుకుని ఆ ద్వీపకల్పం అంతా తిరుగుతుంది. కానీ ఆ బిడ్డ మాత్రం లేవడం లేదు. హృదయాన్ని కలచివేసే ఈ దృశ్యాన్ని మైల్స్టోన్ అనే ఎన్ఓఏఏ (జాతీయ మహాసముద్ర, వాతావరణ యంత్రాంగం) అధికారి ఒకరు గమనించారు. మరణించిన బిడ్డతో తిరుగుతున్న జే ఫోటోలను తీసి ఇంటర్నెట్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోల గురించి ప్రపంచవ్యాప్తంగా భావోద్వేగమైన చర్చ నడుస్తోంది. ఇలాంటిదే మరో సంఘటన గురించి కూడా చెప్పారు మైల్స్టోన్. జే50 అనే నీలి తిమింగలం మూడున్నరేళ్ల చిన్నారికి జబ్బు చేసింది. మనుషులమైతే మన బాధను చెప్పుకోగలుగుతాం.. వైద్యం కూడా చేయించుకోగలుగుతాం. కానీ మూగ జీవాల పరిస్థితి అలా కాదు కదా. అవి తమ బాధను ఎవరితోను చెప్పుకోలేవు. పాపం జే పరిస్థితి కూడా అలానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోక బిడ్డను తనతో పాటే తిప్పుకుంటోంది. ఇది గమనించిన మైల్స్టోన్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రసుత్తం వైద్యుల బృందం గాయపడిన జే50 బిడ్డకు వైద్యం చేయడం కోసం ద్వీపకల్పం అంతటా గాలిస్తున్నారు. -
బిడ్డ శవాన్ని నెత్తిన పెట్టుకుని...
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూలం అమ్మ. గర్భాశయంలో పెంచి, జన్మనిచ్చే ప్రేమమూర్తి. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అలాంటి అమ్మ ప్రేమ కంటే గొప్పది.. భద్రమైంది మరేదీ ఉండదు. అలాంటిది చనిపోయిన తన బిడ్డ చలనం రాకపోతుందా అన్న ఆశతో నాలుగు రోజులపాటు మోసుకు సుదూర ప్రయాణం చేసిందో తల్లి. వాన్కోవర్: బ్రిటీష్ కొలంబియా, విక్టోరియాలోని తీర ప్రాంతం. J35 అనే ఓర్కా తిమింగలం(కిల్లర్ వేల్.. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దది) 17 నెలలుగా ఆ మధుర క్షణాల కోసమే ఎదురు చూసింది. గత మంగళవారం ఉదయం అది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అవి గుంపుగా జీవించే జీవులు కావటంతో.. మిగతావి దాని దగ్గరికొచ్చి బిడ్డను చూసి సందడి చేశాయి. కాసేపు నీటిలో హాయిగా చక్కర్లు కొట్టిన ఆ పిల్ల ఓర్కా.. కాసేపటికే చలనం లేకుండా పోయింది. గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. ఎలాగైనా మళ్లీ ఊపిరి పోయాలన్న ఆలోచనతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం ప్రారంభించింది. అలా గంటలు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల బరువు.. ఏకంగా నాలుగు రోజులపాటు ఏకధాటిగా 185 కిలోమీటర్లు ప్రయాణించింది. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద వేల్ రీసెర్చర్ ‘కెన్ బాల్కోమ్’ J35ను గుర్తించి దాని వ్యధను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ’సాధారణంగా జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే. అయితే ఇన్నిరోజులపాటు ఓపికగా ఎదురు చూడటం బహుశా ఇదే తొలి ఘటన అయి ఉండొచ్చు. ఈ నాలుగు రోజులు అది చాలా అవస్థలు పడింది. తిండికి కూడా దూరంగా ఉంది. ఊపిరి కష్టమైన బిడ్డను తల నుంచి దించలేదు. రోజుకు 60 నుంచి 70 మైళ్ల మధ్య అది ఈదుతూ వచ్చింది. బిడ్డలో కదలిక కోసం అది తీవ్రంగా యత్నించింది. ఈ భావోద్వేగాన్ని షూట్ చేయాలని నిర్ణయించి దాన్ని ఫాలో అయ్యాం. గుండెకు తాకేలా ఉన్న ఈ కథనాన్ని ప్రపంచానికి తెలియజేశాం’ అని బాల్ కోమ్ చెబుతున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... -
బిడ్డకు పాలిస్తూ ర్యాంప్‌పై నడిచిన మోడల్
‘బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తన చిన్నారి ఆకలి తీర్చడమే అమ్మకు ప్రధానం. తల్లి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్న ఆమె ఆలోచనలన్ని తన బిడ్డ చూట్టే తిరుగుతుంటాయి. పిల్లలు ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. అంతే ఇంక ఆ సమయంలో ఏం ఆలోచించదు. వెంటనే బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం చనుబాలు. కానీ నేటికి మన సమాజంలో మహిళలు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. కారణం చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించి. కేవలం ఈ కారణం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తల్లి అయిన తర్వాత కొన్నేళ్లపాటు ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ విషయంలో విచక్షణ లేని పశుపక్ష్యాదులే మనిషి కంటే మేలు. బిడ్డ ఆకలి తీర్చడంలో వాటికున్న స్వతంత్రలో కనీసం ఒక్క శాతాన్ని కూడా సమాజం మన తల్లులకు ఇవ్వడంలేదు’. కానీ ఇప్పుడిప్పుడే మాతృమూర్తుల ఆలోచన ధోరణి మారుతుంది. ‘బిడ్డకు పాలు ఇవ్వడం నా ధర్మం. తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీనికి సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు’ అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక, భారత్ లాంటి సనాతన దేశాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కొన్నాళ్ల క్రితమే ప్రముఖ కేరళ పత్రిక ‘మాతృభూమి’ తన గృహలక్ష్మి మ్యాగ్జైన్లో బిడ్డకు పాలు ఇస్తున్న మోడల్ ఫోటో ప్రచురించి ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మోడల్ బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్ షోలో పాల్గొంది. మోడల్ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్ వాక్ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మార్టినా. మార్టినా షేర్ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్నో పబ్లిసిటి స్టంట్లా భావించి విమర్శలు చేస్తున్నారు. అయితే తనను విమర్శించే వారికి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మార్టినా. ‘నేను ఈ రోజు చేసిన పని కావాలని, నలుగురి దృష్టిలో పడాలని చేసింది కాదు. నేను గత ఐదు నెలలుగా చేస్తున్న పనినే ఇప్పుడు చేశాను. రోజు నా బిడ్డకు నేను ఇదే సమయంలో పాలు ఇస్తాను. ఈ రోజు కాస్తా ఆలస్యం అయ్యేసరికి తను ఏడుస్తుంది. తన ఆకలి తీర్చడం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. ఈ విషయం కేవలం తల్లికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను విమర్శించే ముందు ఈ విషయం గురించి మీ అమ్మను అడగండి. వారికి తెలుసు నేను చేసింది కరెక్టో, కాదో’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించారు. ఇప్పటికైతే అమెరికాలో బిడ్డలకు తల్లులు బహిరంగంగా పాలు ఇవ్వొచ్చు, కానీ రెస్టారెంట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో మాత్రం కవర్ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా మహిళలు ఈ ఆదేశాలను తప్పు పడుతున్నారు. ‘మేము కవర్ చేసుకోవడం కాదు మీరు మీ బుద్ధిని సరి చేసుకోండి’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆట మధ్యలోనూ అమ్మతనం చాటింది..
అల్బర్టా : ఎనిమిది వారాల కిందట పాపకు జన్మనిచ్చిన కెనడా హాకీ క్రీడాకారిణి సారా స్మల్కు ఓ సమస్య ఎదురైంది. ఇటీవల ఓ హాకీ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె తనతోపాటు పాలిచ్చే బ్రెస్ట్ పంప్ తీసుకెళ్లడం మరచిపోయింది. విరామ సమయంలో డ్రెసింగ్ రూమ్‌కి వచ్చిన ఆమె తన చిన్ని పాప పాలకోసం ఏడవటం చూసి క్షణం కూడా ఆలోచించకుండా టీషర్ట్ తీసివేసి బిడ్డకు స్తన్యమిచ్చారు. తల్లిప్రేమను చాటుతూ ఆట మధ్యలో ఆమె పాలిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డకు పాలిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆమె.. ‘ఓ తల్లిగా చాలా గర్వపడుతున్నాను. నా బిడ్డ అవసరాలు తీర్చడంతో నాకు ఏదో సాధించాననే ఆనందం కలిగింది. మీరు కూడా మీకు నచ్చిన పనిచేయండి. బయటివారి గురించి ఆలోచించకుండా మీ పిల్లలకు స్తన్యమివ్వండి. మీ పిల్లలకు మరింత చేరువ అవ్వండి’ అని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఆమె చూపిన మాతృప్రేమను అభినందిస్తున్నారు. కొంతమంది వికృతమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. తల్లి కావడమే మహిళకు జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం. బిడ్డ కోసం నవమాసాలు మోసి ఎన్ని సమస్యలు ఎదురయినా తట్టుకునే మహిళలు, తమ పిల్లలు పాలకోసం అలమటిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వారు ఎక్కడున్నా పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన ఓ హీరోయిన్ బిడ్డకు పాలిస్తూ ఫొటోషూట్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు స్తన్యమివ్వడం నేరం కాదు. బిడ్డ ఏడ్వగానే ఆ బుజ్జీ కడుపును నింపాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. ఈ విషయంలోనూ సామాజికంగా ప్రతికూల ఆలోచనలు ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడంలో మాతృత్వం కల్పించే గొప్ప వరం.. దానిని కూడా సంకుచిత దృష్టితో చూడవద్దని కోరుతున్నారు. -
గూడు చెదిరె..ప్రేమ మిగిలె..
సృష్టిలో వెల కట్టలేనిది.. వర్ణించలేనంత గొప్పది ఏదన్నా ఉందంటే అది తల్లి ప్రేమే. సకల జీవరాశిలోనూ మాతృప్రేమ కనిపిస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని చెట్టు కొమ్మపై ఓ ఉడత గూడుకట్టుకుని పిల్లలను పెట్టింది. అనుకోకుండా ఆ గూడు చెదిరిపోయింది. దీంతో తల్లి ఉడత తన పిల్లలను కాపాడుకునేందుకు కళ్లు తెరవని తన బిడ్డలను నోట పట్టుకుని వేరేచోటికి తీసుకెళ్లింది. బుధవారం కనిపించిన ఈ అపురూపమైన దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా బంధించింది. – ఫొటోలు: వి.రవీందర్ -
అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి
ఆదిశంకరాచార్యుల వారు తను రాసిన ఒక గ్రంథాన్ని ‘శివానందలహరి’ అన్నారు. మరొకటి అమ్మవారి మీద రాసినప్పుడు దానిని ‘శ్రీమాతానందలహరి’ అనో, శ్రీమాతాలహరి’ అనో అనాలి. కానీ ఆయన ‘సౌందర్య లహరి’ అన్నారు. ఎందుకంటే – సౌందర్యమంటే అమ్మే. లోకంలో ‘‘మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది’’ అని ఎవరూ అనరు. ఎవరి అమ్మ వాళ్ళకు అందం. అమ్మకు ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఎంత చదువు ఉన్నదీ అన్నదానితో సంబంధం ఉండదు. రోడ్డు నిర్మాణంలో ఒళ్ళంతా చెమటపట్టి కూలీపని చేసుకునే తల్లికి సమీపంలోనే ఆడుకుంటున్న ఒక పిల్లను దారిన పోతున్న ఆగర్భ శ్రీమంతురాలయిన ఒక స్త్రీ ఎత్తుకుని నోట్లో పంచదార పోసే ప్రయత్నం చేస్తే... ఇంత డబ్బున్న ఆమె, ఇన్ని నగలు వేసుకున్నామె, ఈమె పెట్టిన పంచదార తిందాం, ఈమె ముందు మా అమ్మ ఏ పాటి’’ అని ఆ పిల్ల అనుకోదు. బలవంతంగా విడిపించుకుని వెళ్ళి చెమటతో, దుమ్ముతో తడిసిముద్దయిన తన తల్లి ఒళ్లో వాలిపోతుంది. అమ్మే క్షేమం. అమ్మే సంతోషం. బిడ్డకు ఎంత వయసొచ్చినా అమ్మలో అందం అంటే క్షేమమే. అమ్మకున్న మరో గొప్పతనం ఎక్కడుంటుందంటే తన కడుపున పుట్టిన పిల్లల్లో అందరికన్నా పనికిమాలిన వారు, అర్భకులు ఎవరోవారిని ఎక్కువ ప్రేమిస్తుంది, ఎక్కువగా దగ్గరకు తీసుకుంటుంది. వారిని ఎక్కువ స్మరిస్తుంటుంది. లోకంలో మిగిలిన వాళ్ళు సమర్థత ఉన్న పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అమ్మ తన సంతానంలో అర్భకుడు, చేతకానివాడైన బిడ్డ వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక అలా ప్రేమించే వాళ్ళుంటారని ఆ కొడుకు విషయంలో చెప్పడం కష్టం. మిగిలిన వారికి వాడు నిస్సందేహంగా బరువే. అమ్మ నిరంతరం వాడి క్షేమం కోసమే ప్రార్థిస్తుంది. అటువంటి వ్యక్తి సృష్టిలో ఉండరు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మదయ అటువంటిది. అందుకే మిగిలిన సంతానం అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి. -
తల్లిప్రేమ!
ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... అంటుంటారు. ఇది మనుషులకే కాదు పిల్లులకూ వర్తిస్తుంది. పిల్లి పిల్లలు బాధతో అరుస్తుంటే... మనకు బాధగా ఉంటుంది. మరి మనకే ఇలా ఉంటే వాటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువగా స్పందిస్తారు? ఈ విషయంపై హానోవర్ మెడికల్ స్కూల్, జర్మన్ పరిశోధకులు లోతుగా పరిశోధించారు. ఇందులో వారు చెప్పిన కీలక విషయం ఏమిటంటే... పిల్లల అరుపులు వినిపించగానే మగపిల్లులతో పోల్చితే ఆడపిల్లులు పదింతలు వేగంగా స్పందిస్తాయట! -
నన్ను పస్తుపెట్ట లేదు
అమ్మ జ్ఞాపకం మనిషి ప్రకృతికి దూరమవుతున్నాడు. మనిషి స్వచ్ఛత కోల్పోతున్నాడు, సహజత్వాన్ని కోల్పోతున్నాడు. కొన్నిసార్లు మనిషితనాన్నే కోల్పోతున్నాడు. కానీ... అమ్మ... తనలోని అమ్మతనాన్ని ఎప్పటికీ కోల్పోదు. అదే అమ్మతనంలోని గొప్పతనం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్ప కవికైనా అమ్మ గురించి పూర్తిగా చెప్పగలిగే పాండిత్యం ఉండదని నమ్ముతాను. తనకు తెలిసిన భాషలో, తెలిసిన పదాలతో, నేర్చుకున్న పాండిత్యంతో ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మప్రేమ గురించి చెప్పాలంటే ఏ పాండిత్యమూ చాలదు. వినమ్రంగా ఆమెకు తలవంచడం, ఆమె ఒళ్లో తలపెట్టుకుని ఆమె ఆత్మీయస్పర్శను ఆస్వాదించడమే. అమ్మ ప్రేమను కరువు తీరా ఆస్వాదించిన జీవితం నాది. అది అనిర్వచనీయమైన అనుభూతి. సంపదలో పుట్టి పెరిగిన చాలామందికి అందనంత ప్రేమను మా అమ్మ పేదరికంలోనూ పంచింది మా అమ్మ. పేదరికంలోనూ మమ్మల్ని గారాబంగా, సంస్కారం నేర్పించి పెంచింది మా అమ్మ. నా పాటల్లో సాగే లాలిత్యానికి, అనురాగానికి ప్రేరణ మా అమ్మే. ‘పురిటిలో నీ తనువు పచ్చి పుండయినా... నా ఆకలి పాల జున్నుకుండ’ వంటి ప్రయోగాలు చేయగలిగానంటే అమ్మ పంచిన ప్రేమతోనే సాధ్యమైంది. వెన్నెల్లో మచ్చ ఉంటుందేమో, నీటిలో నాచు ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వచ్ఛత మాత్రమే ఉంటుంది. పుడమి తల్లికి, కన్నతల్లికి మరేదీ సాటిరాదు. నేను తింటుంటే! మా అమ్మ ఇప్పటికీ మమ్మల్ని చంటిబిడ్డల్లాగానే అనుకుంటుంది. నేను అన్నం తిన్నంత సేపు నా ఎదురుగానే ఉంటుంది. తన కంటితో చూస్తే తప్ప నేను తృప్తిగా కడుపు నిండా తిన్నానని చెప్పినా ఆమెకు తృప్తి ఉండదు. ఆమె కంటితో చూస్తేనే సంతోషం. చిన్నప్పుడు మాకు జ్వరమొస్తే రాత్రంతా ఆమెకూ నిద్ర ఉండేది కాదు. జ్వరం తగ్గి మేము తిన్న తర్వాతనే ఆమె అన్నం తినేది. పంట గింజలు మాకు పెట్టి మా అమ్మానాన్న పరిగి గింజలతో కడుపు నింపుకునే వారు. డెబ్బైలలో వచ్చిన తీవ్రమైన కరువు రోజుల్లోనూ మమ్మల్ని పస్తు పెట్టలేదు. మా కడుపు నింపడానికి వాళ్లు కడుపు మాడ్చుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదంటే నమ్ముతారా? ఆమెకు బిడ్డలైన మమ్మల్నే కాదు ఎవరినీ పల్లెత్తు మాట అనే తత్వం కాదు. ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసి మేము తిరిగి బదులు చెప్పబోతే వారిస్తుంది. ‘రోజులు గడిస్తే ఏది నిజమో వారే తెలుసుకుంటారు. అప్పటి వరకు ఓపిక పట్ట’మని చెబుతుంది. ‘రోజులు గడిస్తే కాయ పండవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలె’ అంటుంది. ఆమెతో మాట్లాడుతుంటే సాహిత్యకారుల ప్రసంగం వింటున్నట్లు ఉంటుంది. తప్ప సాధారణ పల్లె మహిళ మాట్లాడినట్లు ఉండదు. చిన్నప్పుడు మంగళహారతులు, శ్రుతితో కూడిన పాటలు పాడిన అనుభవం ఆమెది. తన భావాన్ని ఎంత సున్నితంగా చక్కటి మాటలతో చెబుతుంది. తాత్విక మూర్తి! చేతిలో డబ్బు లేని రోజుల్లోనే కాదు, మేమిప్పుడు సంపాదిస్తున్న రోజుల్లోనూ తన కోసం ఏమీ కావాలనుకోదు. నేను డబ్బిచ్చినా కూడా ‘నాకెందుకు బిడ్డా డబ్బులు’ అంటుంది. హైదరాబాద్‌లో పెద్ద డాక్టర్‌కి చూపిస్తానంటే తెలకపల్లిలో ఆమె ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి దగ్గరే చూపించుకుంటుంది. జీవితం ప్రశాంతంగా, ఘర్షణలు లేకుండా జీవించాలనే సత్యాన్ని ఆమె ఆచరించి చూపించింది. నాకిప్పటికీ ఏ కష్టమొచ్చినా ఆమె దగ్గరకెళ్లి కూచుంటే... చల్లటి మాటలతో బాధను మైమరిపిస్తుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. చెబుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయి. ఆ ప్రేమ ఎప్పటికీ కావాలని గుండె ఆర్ద్రమవుతుంది. వెంకన్న సొంతూరు: మహబూబ్‌నగర్ జిల్లా, తెలకపల్లి మండలం, గౌరారం పుట్టింది: 1965,వైశాఖ పౌర్ణమి రోజు అమ్మ: ఈరమ్మ, నాన్న... నరసింహ చదువు: ఎంఎ తెలుగు లిటరేచర్ ఉద్యోగం: నాగర్‌కర్నూల్ కో ఆపరేటివ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తింపు: రచయిత, గాయకులు