తల్లిప్రేమ!
ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... అంటుంటారు. ఇది మనుషులకే కాదు పిల్లులకూ వర్తిస్తుంది.
పిల్లి పిల్లలు బాధతో అరుస్తుంటే... మనకు బాధగా ఉంటుంది. మరి మనకే ఇలా ఉంటే వాటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి?
తల్లిదండ్రులలో ఎవరు ఎక్కువగా స్పందిస్తారు? ఈ విషయంపై హానోవర్ మెడికల్ స్కూల్, జర్మన్ పరిశోధకులు లోతుగా పరిశోధించారు. ఇందులో వారు చెప్పిన కీలక విషయం ఏమిటంటే... పిల్లల అరుపులు వినిపించగానే మగపిల్లులతో పోల్చితే ఆడపిల్లులు పదింతలు వేగంగా స్పందిస్తాయట!