చిన్నా.. లేరా! గుండెల్ని తాకే అమ్మ ప్రేమ | After Her Stillborn Baby Moves Mother Seal Heartwarming Reaction | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో వీడియో: చిన్నా.. లేరా! గుండెల్ని తాకే అమ్మ ప్రేమ

Mar 23 2023 9:18 PM | Updated on Mar 24 2023 6:03 AM

After Her Stillborn Baby Moves Mother Seal Heartwarming Reaction - Sakshi

మనిషికి మాత్రమే అమ్మ ప్రేమ సొంతం కాదు.

Viral Video: మనిషికి మాత్రమే అమ్మ ప్రేమ సొంతం కాదు. సకల చర ప్రాణ జీవులకూ సొంతం అది. పైగా ఈ సృష్టిలో  స్వార్థంతో పోల్చలేనిది అదొక్కటి మాత్రమే!.  అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా ఉండదు కూడా. అమ్మ ప్రేమ గొప్పదనం నిరూపించే సాక్ష్యాలు కోకోల్లలు.. అందులో ఒకటి ఈ వీడియో. 

ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ.. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి గుండెల్ని హత్తుకునే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.  ఆడ ఎలిఫెంట్‌(భారీ సైజులో) సీల్‌ ఒకటి అప్పుడే ప్రసవించింది. అయితే బిడ్డ అచేతనంగా పడి ఉండడంతో.. దిగాలుగా దానిని కదిలించే ప్రయత్నం చేసింది. అటుపై ఆ పిల్లలో చలనంతో ఒక్కసారిగా అది మురిసిపోయింది. సంతోషంతో కేకలు వేసింది.

ఇంటర్నేషనల్‌ సీల్‌ డే సందర్భంగా.. సైన్స్‌ గర్ల్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి పోస్ట్‌ అయిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటేలా వ్యూస్‌, లైక్స్‌, షేర్లతో దూసుకుపోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement