sea lion
-
చిన్నా.. లేరా! గుండెల్ని తాకే అమ్మ ప్రేమ
Viral Video: మనిషికి మాత్రమే అమ్మ ప్రేమ సొంతం కాదు. సకల చర ప్రాణ జీవులకూ సొంతం అది. పైగా ఈ సృష్టిలో స్వార్థంతో పోల్చలేనిది అదొక్కటి మాత్రమే!. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా ఉండదు కూడా. అమ్మ ప్రేమ గొప్పదనం నిరూపించే సాక్ష్యాలు కోకోల్లలు.. అందులో ఒకటి ఈ వీడియో. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ.. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటి గుండెల్ని హత్తుకునే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆడ ఎలిఫెంట్(భారీ సైజులో) సీల్ ఒకటి అప్పుడే ప్రసవించింది. అయితే బిడ్డ అచేతనంగా పడి ఉండడంతో.. దిగాలుగా దానిని కదిలించే ప్రయత్నం చేసింది. అటుపై ఆ పిల్లలో చలనంతో ఒక్కసారిగా అది మురిసిపోయింది. సంతోషంతో కేకలు వేసింది. ఇంటర్నేషనల్ సీల్ డే సందర్భంగా.. సైన్స్ గర్ల్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటేలా వ్యూస్, లైక్స్, షేర్లతో దూసుకుపోతోంది. This elephant seal mum has just given birth and is anxious her baby is still, Watch her reaction when her child moves pic.twitter.com/D3DdU7h0on — Science girl (@gunsnrosesgirl3) March 22, 2023 -
జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం
చిన్న పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వారికి ఏదో ఒక రూపంలో అపాయం జరుగుతూనే ఉంటుంది. క్షణ కాలంలో తీవ్రగాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఈ వీడియోలో ఓ తండ్రి అజాగ్రత్త కారణంగా తన కూతురు కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనలో తండ్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి రోడ్డుపై ఉన్న సముద్ర సింహంపై ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సముద్ర సింహం సడెన్‌గా చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు చిన్నారి తండ్రి పక్కనే ఉండి చోద్యం చూస్తూ నిలబడ్డాడు. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే సముద్ర సింహం.. చిన్నారిపై దాడి చేయబోయిందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టుపిడ్ ఫెలో పిల్లల్ని చూసుకునేది ఇలానేనా అని ఓ నెటిజన్లు కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండగా.. సముద్ర సింహాలు చాలా ప్రశాంతమైన జీవులు. సాధారణంగా అవి ఎవరీని ఏమీ అనవు. కానీ, వాటి జోలికి వెళ్లి విసిగిస్తే మాత్రం వెంబడించి మరీ దాడి చేస్తాయి. కొద్ది రోజలు క్రితం అమెరికాలోని ఓ బీచ్‌లో రెండు సముద్ర సింహాలు పర్యటకులను పరిగెత్తించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Putting your kid on a wild sea lion’s back for The Gram is some horrendous parenting. pic.twitter.com/NRbxlixf4P — kereD (@i__m__kered) July 13, 2022 ఇది కూడా చదవండి: బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. ట్రెండింగ్ నిలిచిన వీడియో -
భయానకరీతిలో విరుచుకుపడి.. లాగేసింది!
-
భయానకరీతిలో విరుచుకుపడి.. లాగేసింది!
భయానకరీతిలో ఓ సీలైన్ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఓ బాలిక సముద్రం డాక్‌పై కూర్చోని.. నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్ డాక్ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చటపడింది. ఇంతలో ఆ బాలిక డాక్ అంచుల మీద కూర్చోగా.. ఒక్కసారిగా భయానకరీతిలో సీలైన్ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసింది. దీంతో చూపరులు భయాందోళనకు గురై.. కేకలు వేశారు. ఓ వ్యక్తి తెగించి నీటిలోకి దుంకి బాలికను కాపాడాడు. ఇంతలోనే సీలైన్ నీటిలో మాయమైంది. సీలైన్ అమాంతం నీటిలోకి లాగేసినా.. బాలికకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఆమె తన వారితో కలిసి మామూలుగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ అనూహ్య ఘటన కెనడా పశ్చిమ తీరంలోని వాంకోవర్ పట్టణం రిచ్మండ్ బీచ్‌లో శనివారం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థిని అయిన ఫుజివరా ఈ ఘటనను స్వయంగా వీడియో తీసింది. నీటిలో తేలియాడుతున్న క్షీరదానికి ఆహారం వేసేందుకు సందర్శకులు ప్రయత్నించారని, ఇంతలోనే బాలికపై అది దాడి చేసిందని ఆమె మీడియాకు తెలిపింది. బాలిక దుస్తులను సీలైన్ ఆహారం అనుకొని ఉంటుందని, అందుకే ఆమెను నీటిలోకి లాగేసి ఉంటుందని నేవీ నిపుణుడు అండ్యూ ట్రైట్స్ తెలిపారు. -
సీ లయన్స్‌కు తప్పని అతిపెద్ద ముప్పు
న్యూయార్క్: కాలిఫోర్నియాలో అనూహ్యంగా భారీ సంఖ్యలో సీల్ చేపలు పెరిగిపోయాయి. ఎంతగా అంటే 1970లో వాటి సంఖ్య 50 వేలు ఉండగా.. ప్రస్తుతం అవి 3,40,000కు చేరుకున్నాయి. ఈ పెరుగుదల రేటు గతంలోని రికార్డులన్నింటిని దాటేసినా వాటి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం అయ్యో పాపం అనిపించక మానదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ జీవరాశికి ఓ ముప్పు వచ్చి పడింది. సీల్ పిల్లలు పౌష్టికాహార లోపంతో తిండిలేక ఆకలి సమస్యతో బాధపడుతున్నాయి. ఇప్పటివరకు మనుషులనే వేధిస్తున్న జంక్ ఫుడ్ సమస్య ప్రస్తుతం ఈ జీవరాశిని కూడా వెంటాడడమే ఇందుకు ఓ కారణం. వీటి తల్లులు జంక్ ఫుడ్ ను అమితంగా తీసుకోవడం వల్లే ప్రస్తుతం అవి ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఆసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సీల్ జీవరాశిపై పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది. 2004 నుంచి 2014 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మధ్యకాలంలో సీలు చేప పిల్లల ఆరోగ్య స్థితిని అంచనా వేశారు. ఇందులో అవి అనూహ్యంగా బరువు తగ్గిపోతున్నట్లు, పౌష్టికాహార లోపంతో బాధపడిపోతున్నట్లు గుర్తించారు. వాటిలో ఉండే కేలరీల స్థాయి కూడా పడిపోతుందని, అత్యధిక స్థాయి నుంచి అతి తక్కువ స్థాయికి వాటి పోషక విలువలు పడిపోతున్నట్లు వారు చెప్తున్నారు. సముద్రపు నీరు వేడెక్కడం కూడా అవి బలహీనంగా తయారవడానికి మరోకారణం అని వారు భావిస్తున్నారు. సముద్ర జలాల్లో జంక్ ఫుడ్‌లాంటి పదార్థాలు ఎక్కువవడం వాటిని అవి తినడం వల్ల ప్రస్తుతం ఈ జాతి పిల్లలు పెను ప్రమాదాన్ని చవిచూస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. -
ఓ పావు కిలో చేపలు ఇవ్వు బాబూ!
ఈక్వెడార్‌లోని శాంతా క్రజ్ ద్వీపం.. కొలంబియాకు చెందిన ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్ కాస్ట్రో సముద్ర తీరం వద్ద తిరుగుతూ ఫొటోలు తీసుకుంటున్నాడు. అంతలో అతడు ఎన్నడూ ఊహించని దృశ్యం కనిపించింది.. ఒక సీలయన్ సముద్రంనుంచి బయటకొచ్చి.. తీరానికి సమీపంలో ఉన్న చేపలు అమ్మే దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే దుకాణం రష్‌గా ఉంది. చాలా మంది తమ వంతు కోసం వేచిఉన్నారు. ఆ సీలయన్ కూడా ఓపిగ్గా క్యూ కట్టింది. దాదాపు గంటపాటు తమ వంతు కోసం వేచి చూసింది. చివరకు తన వంతు రాగానే.. చేపలమ్మే వ్యక్తి వేసిన ముక్కలు నోట కరుచుకుని, లొట్టలేస్తూ.. తాపీగా సముద్రంలోకి తిరిగి వెళ్లిపోయింది. కాస్ట్రోకు ఇది కొత్త విషయం గానీ.. అక్కడోళ్లకు కామన్ అట. ఆ సీలయన్ తరచూ ఇలా వస్తుందట. వీళ్లు కూడా దాన్నేమీ అనరు. తాకడానికి ప్రయత్నించరు. దీంతో అది కూడా మనుషులంటే భయపడకుండా ఎంచక్కా వచ్చేస్తుందట. -
మత్స్య మాయ
సొరంగంలా ఏర్పడిన వేలాది చేపల మధ్య నుంచి దూసుకుపోతున్న సీ లయన్ ఫొటో.. అద్భుతంగా ఉంది కదూ.. ఈ అందమైన ఫొటో వెనుక ఆ వేలాది చేపల జీవన్మరణ సమస్య దాగుని ఉందట. ఈ చేపలు వేలాదిగా ఒకదాని వెంట ఒకటి గుంపుగా సంచరిస్తుంటాయి. తమను తినేయడానికి వచ్చే భారీ చేపలు, సీ లయన్లాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి అప్పటికప్పుడు ఇలా రకరకాల ఆకారాల్లో మారిపోయి తప్పించుకుంటాయని ఈక్వెడార్‌కు సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఈ చిత్రాన్ని తీసిన అండర్‌వాటర్ ఫొటోగ్రాఫర్ డే విడ్ ఫ్లీట్హాం చెప్పారు. ఈ చేపలు ఆ క్షణంలోనే దాదాపు 500 అడుగుల పొడవునా సొరంగంలా ఏర్పడి.. ఆ సీ లయన్ నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.