జస్ట్‌ మిస్‌.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం | Sea Lion Almost Attacks Little Girl | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మిస్‌.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్‌ ఫెల్‌ అంటూ’.. 

Published Wed, Jul 13 2022 8:10 PM | Last Updated on Wed, Jul 13 2022 8:46 PM

Sea Lion Almost Attacks Little Girl - Sakshi

చిన్న పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వారికి ఏదో ఒక రూపంలో అపాయం జరుగుతూనే ఉంటుంది. క్షణ కాలంలో తీవ్రగాయాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఈ వీడియోలో ఓ తండ్రి అజాగ్రత్త కారణంగా తన కూతురు కొద్దిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఘటనలో తండ్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో ప్రకారం.. ఓ చిన్నారి రోడ్డుపై ఉన్న సముద్ర సింహంపై ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సముద్ర సింహం సడెన్‌గా చిన్నారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు చిన్నారి తండ్రి పక్కనే ఉండి చోద్యం చూస్తూ నిలబడ్డాడు. ఇలా అజాగ్రత్తగా ఉండటం వల్లే సముద్ర సింహం.. చిన్నారిపై దాడి చేయబోయిందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టుపిడ్‌ ఫెలో పిల్లల్ని చూసుకునేది ఇలానేనా అని ఓ నెటిజ​న్లు కామెంట్స్‌ చేశాడు.

ఇదిలా ఉండగా.. సముద్ర సింహాలు చాలా ప్రశాంతమైన జీవులు. సాధారణంగా అవి ఎవరీని ఏమీ అనవు. కానీ, వాటి జోలికి వెళ్లి విసిగిస్తే మాత్రం వెంబడించి మరీ దాడి చేస్తాయి. కొద్ది రోజలు క్రితం అమెరికాలోని ఓ బీచ్‌లో రెండు సముద్ర సింహాలు పర్యటకులను పరిగెత్తించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: బాహుబలి ఏనుగు అంటే ఇలా ఉంటది.. ట్రెండింగ్‌ నిలిచిన వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement