భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు | Man kills leopard with bare hands to protect wife daughter going viral now | Sakshi
Sakshi News home page

భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు

Published Tue, Jul 30 2024 1:43 PM | Last Updated on Tue, Jul 30 2024 2:47 PM

Man kills leopard with bare hands to protect wife daughter going viral now

చిరుత పులి లేదా మచ్చలపులి ఉన్నట్టుండి మనకు ఎదురుపడితే.. దాడి చేస్తే. అమ్మో, అసలు ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్యా బిడ్డల్ని కాపాడుకునేందుకు  ఏకంగా చిరుతపులిపైనే పంజా విసిరాడు. చేతిలో  ఎలాంటి ఆయధం లేకుండానే దాని ఎదుర్కొన్నాడు. పిడిగుద్దులతో దానికి చుక్కలు చూపించాడు.  శరీరం రక్తమోడుతున్నా ఏ మాత్రం భయపడలేదు.  ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను, భార్యను కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే ప్రాణాలకు  తెగించి మరీ పోరాడి దాన్ని మట్టి కరిపించి హీరోగా నిలిచాడు కర్ణాటకకు చెందిన గోపాల్‌ నాయక్‌. 

వాస్తవానికి ఈ సంఘటన 2021లో జరిగింది.  కర్ణాటకలోని బెంగళూరుకు 200 కి.మీ దూరంలోని అరసికెరె సమీపంలోని బెండేకెరె గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ మరోసారి రౌండ్లు కొడుతుంది.  మిక్కు అనే ఎక్స్‌ యూజర్‌ ఈ ఫోటోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement