rescue
-
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్‌ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్‌లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్‌ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్‌కు, రెస్టారెంట్ పార్టనర్‌కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్‌క్రీమ్‌లు, షేక్‌లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్‌కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్‌స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్‌లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్‌కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్‌కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎవరి ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్ లాల్ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ బృందం జహంగీరాబాద్‌లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ -
మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..!
మూడేళ్ల చిన్నారి డ్రోన్ సాంకేతికతో విజయవంతంగా రక్షించారు అధికారులు. ఇలాంటి రెస్క్యూఆపరేషన్లో డ్రోన్ సాంకేతికత సమర్థవంతంగా ఉపయోగపడుతుందనే విషయం ఈ సంఘటనతో తేటతెల్లమయ్యింది.అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని విస్కాన్సిన్లో ఆల్టోలో అనే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అదికూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దీనికితోడు దట్టమైన మొక్కజొన్న అడవి తదితర కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్‌ని మోహారించారు.దీనిలోని ఇన్ఫ్రారెడ్ కెమెరా హీట్ సిగ్నేచర్లు చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేయడంతో వీడియో తీయడం ప్రారంభించిన నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్‌పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలికలని నిర్థారణ చేశారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా ఆ మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికత ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టొచ్చు లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నారు షెరీఫ్ కార్యాలయం అధికారులు.(చదవండి: సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!) -
‘పోతే నా ఒక్కడి ప్రాణం..’ ఖమ్మం రియల్ హీరో సాహసం వైరల్
ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. అయితే..శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. If I go, it is one life, if I return, I will save nine lives: this was the courage shown by #Subhankhan who took a JCB to bring back 9 people marooned on Prakash Nagar Bridge #Khammam from early hrs on Sept1; You can hear daughter brimming with pride #MyDaddyBravest #RealLifeHero pic.twitter.com/tbthGfUhRB— Uma Sudhir (@umasudhir) September 3, 2024వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్‌ను ఫొన్లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆ రియల్ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది. -
Uttar Pradesh: కూలిన రెండు ఇళ్లు.. శిథిలాల కింద పలువురు..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో సోమవారం అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం దరిమిలా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే నాల్గవ నెంబరు ద్వారాన్ని మూసివేశారు. ఆలయానికి వెళ్లే సందర్శకులకు గేట్ నంబర్ వన్, గేట్ నంబర్ టూ నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. కూలిపోయిన రెండు ఇళ్లు 70 ఏళ్ల క్రితం నాటివని అధికారులు తెలిపారు. #WATCH | Kaushal Raj Sharma, Commissioner Varanasi Division says "Two houses collapsed here in which 9 people were trapped. 2 of them came out on their own and 7 others were rescued. One woman has lost her life and the remaining are under treatment. The rescue operation is almost… pic.twitter.com/YWhycEVmgZ— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2024 -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
వయనాడ్ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ?
వయనాడ్/కొల్లామ్: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్‌ఫోన్ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. సెల్‌ఫోన్ చివరి లొకేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్ జీపీఎస్ కోఆర్డినేట్స్, డ్రోన్ ఏరియల్ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.బృందాలుగా ఏర్పడి బరిలోకి..దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, డీఎస్జీ, కోస్ట్‌గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. డ్రోన్ ఆధారిత అత్యాధునిక రాడార్‌ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.నిక్షేపంగా ఇల్లు,కుటుంబంఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.పరిమళించిన మానవత్వంరూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్ యజమానురాలుసర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్‌దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.మేజర్ సీతకు సలామ్కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్ సీత అశోక్ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, సెంటర్ తలకెత్తుకుంది. మేజర్ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్ సీత ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్ దగ్గర్లోని గడిల్‌గావ్. -
వయనాడ్ విలయం : ఆమె సీత కాదు.. సివంగి
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎవ్వరూ బతికి ఉంటే అవకాశం లేదంటూ స్వయంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతటి విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో, రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించిన మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.ఇండియన్ ఆర్మీకి చెందినమద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్‌కు చెందిన మేజర్ సీతా షెల్కే సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిల్సుస్తోంది. కేరళలోని వాయనాడ్‌లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు. ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లుఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు. వంతెన నిర్మాణం జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 1సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది.Kudos to Maj Seeta Shelke & her team of #MadrasEngineersGroup of #IndianArmy who went beyond all kind of challenges & built the 190ft long bridge with 24 Ton capacity in 16 hours in #Wayanad Started at 9 pm on 31 July & completed at 5:30 pm on 1 Aug. @giridhararamane #OPMADAD pic.twitter.com/QDa6yOt6Z2— PRO Defence Trivandrum (@DefencePROTvm) August 1, 2024 -
భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు
చిరుత పులి లేదా మచ్చలపులి ఉన్నట్టుండి మనకు ఎదురుపడితే.. దాడి చేస్తే. అమ్మో, అసలు ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్యా బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులిపైనే పంజా విసిరాడు. చేతిలో ఎలాంటి ఆయధం లేకుండానే దాని ఎదుర్కొన్నాడు. పిడిగుద్దులతో దానికి చుక్కలు చూపించాడు. శరీరం రక్తమోడుతున్నా ఏ మాత్రం భయపడలేదు. ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను, భార్యను కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే ప్రాణాలకు తెగించి మరీ పోరాడి దాన్ని మట్టి కరిపించి హీరోగా నిలిచాడు కర్ణాటకకు చెందిన గోపాల్ నాయక్. వాస్తవానికి ఈ సంఘటన 2021లో జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు 200 కి.మీ దూరంలోని అరసికెరె సమీపంలోని బెండేకెరె గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ మరోసారి రౌండ్లు కొడుతుంది. మిక్కు అనే ఎక్స్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.-Leopard attacks his daughter -He comes to the rescue -KiIIs leopard with bare hands Not a textbook hero, but a real brave 👑 pic.twitter.com/PuUpLGLDzn— Mikku 🐼 (@effucktivehumor) July 29, 2024 -
‘నాన్న అంటే జీవితం..నాన్నే ధైర్యం’ : వైరల్ వీడియో
జోరుగా కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగి పారుతున్న నదులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో ప్రమాదంలో చిక్కుకుంది. పుణేలోని లోనావాలా ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన దృశ్యం విషాదాన్ని నింపింది. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో తన బిడ్డలను అత్యంత సాహసోపేతంతో తండ్రి కాపాడుకున్న వైనం విశేషంగా నిలిచింది. ఇది ఎక్కడ, ఎలా జరిగింది అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నాన్న పక్కనుంటే అలలైనా తలవొంచాల్సిందే అనే క్యాప్షన్‌తో లక్నోకు చెందిన శ్యామ్ యాదవ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కూడ తండ్రి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కమెంట్స్ చేశారు. తండ్రి అన్న పదం వినగానే శక్తి వస్తుంది. ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన గొప్ప శక్తి లేదు అని ఒకరు వ్యాఖ్యానించారు. శక్తివంతమైన అలలు వచ్చినపుడు నాన్న అయినా ఏమీ చేయలేడు. అత్యుత్సాహ ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని మరొకరు కమెంట్ చేశారు.पिता साथ है, तो लहरों की क्या औकात pic.twitter.com/fqTjEXUZtr— Shyam Yadav (@shyamyadav2408) July 5, 2024 -
ప్రకాశం: గుంతలో చిరుత.. అధికారుల పరుగులు
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్.. ఒకరు మృతి
రాజస్థాన్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన గనిలో మంగళవారం రాత్రి చిక్కుకున్న 15 మంది అధికారులలో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక అధికారి మరణించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. నాలుగు దశల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. వారిని జైపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గనిలో 1,875 అడుగుల లోతులో లిఫ్ట్ చైన్ తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. #WATCH झुंझुनू, राजस्थान: कोलिहान खदान में लिफ्ट गिरने से 14 लोगों के फंसे होने की आशंका है, बचाव अभियान जारी है।वीडियो आज सुबह की है। pic.twitter.com/gIuVYnRsbd— ANI_HindiNews (@AHindinews) May 15, 2024ఈ ప్రమాదంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే మరణించారు. అతని మృతదేహాన్ని కేసీసీ ఆస్పత్రికి తరలించారు. కాగా గనిలోని లిఫ్ట్‌లో ఏదో లోపం ఉందని, మరమ్మతులు చేయించాలని ఎనిమిది రోజుల క్రితం కెసిసి యాజమాన్యానికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్వయంగా దృష్టి సారించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
Spain: అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు.. నలుగురు మృతి
మాడ్రిడ్: స్పెయిన్‌లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్మెంట్లలో చిక్కుకున్నవారిని రక్షించారు. తొలుత ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలలు, పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. BREAKING: Entire multi-storey building on fire in Valencia, Spain pic.twitter.com/sTXMm6KY4p — Insider Paper (@TheInsiderPaper) February 22, 2024 ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్‌తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’
ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn — ANI (@ANI) January 29, 2024 అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఎయిమ్స్‌లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. #WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services (Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ — ANI (@ANI) January 4, 2024 -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్‌కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్‌లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
టన్నెల్ టైంపాస్ పై వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నప్పుడు వారు ఎలా టైమ్ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్‌కు చెందిన అంకిత్ టన్నెల్లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. ‘టన్నెల్లో గడిపిన 17 రోజులు టైమ్ పాస్ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్, సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్లం. టన్నెల్లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్టైల్స్ వాడాం’అని అంకిత్ చెప్పాడు. ‘అయితే, టన్నెల్లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్ వివరించాడు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్దామ్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్‌లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్‌రే రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్‌జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్‌కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
ఉత్తర కాశీ టన్నెల్ వర్కర్స్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్
రిషికేష్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు టచ్‌లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి