వరదల్లో చిక్కుకున్న కారు... కానీ ఆ కారులోని కుక్క...: వీడియో వైరల్‌ | Viral Video: Woman Getting Rescued Her Car Stuck In Flood Waters | Sakshi
Sakshi News home page

Viral Video: వరదల్లో చిక్కుకున్న కారు... కానీ ఆ కారులోని కుక్క...: వీడియో వైరల్‌

Published Wed, Aug 3 2022 4:28 PM | Last Updated on Wed, Aug 3 2022 4:28 PM

Viral Video: Woman Getting Rescued Her Car Stuck In Flood Waters - Sakshi

US Police Officers Rescue Woman: అమెరికాలోని అరిజోనాలో వరదలు భీభత్సం సృష్టించాయి. దీంతో ఆ వరదల్లో ఒక ఎరుపు రంగు కారు చిక్కుకుపోయింది. ఈ మేరకు సమీపంలోని అపాచీ జంక్షన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌(ఏజేపీడీ) సకాలంలో స్పందించి ఆ కారులో ఉన్న వాళ్లను రక్షించేందుకు సిద్ధమైంది. అపాచీ జంక్షన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ కారు వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేలా ఒక ఎల్లో టేపుతో గట్టిగా కట్టి ఉంచారు.

ఆ తర్వాత ఆ కారులోని మహిళను, డ్రైవర్‌ను రక్షించారు పోలీసులు. ఐతే ఆమె తన కారులో ఒక  పెంపుడు కుక్కు కూడా ఉందంటూ... పోలీసులను అప్రమత్తం చేసింది. కానీ దురదృష్టవశాత్తు వారికి  ఆకారులో కుక్క కనిపించకపోవడంతో రక్షించలేకపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఏజే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: గ్గుమంటున్న చైనా!...తైవాన్‌ పై కక్ష సాధింపు చర్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement