CM Sukhwinder Singh Sukhu Said More Than 50,000 50000 Tourists Were Evacuated from Himachal Pradesh - Sakshi
Sakshi News home page

సాహసం శ్వాసగా.. బాధితులకు అండగా.. రెస్క్యూ బృందాలు!

Published Thu, Jul 13 2023 12:51 PM | Last Updated on Thu, Jul 13 2023 1:22 PM

over 50000 tourists were evacuated in himachal - Sakshi

భారీ వరదలు, వర్షాలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖవిందర్‌ సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ బృందాలు మ్తొతం 50 వేల మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపరులను, పర్యాటకులను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
 

అలాగే వరద ఉధృతిలో చిక్కుకున్న మరో 15 మందిని కూడా తాళ్ల సాయంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఐటీబీపీ, హోమ్‌గార్డ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదల కారణంగా హెచ్‌ఆర్‌టీసీకి భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో సుమారు 300 బస్సులు చిక్కుకుపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు.హెచ్‌ఆర్‌టీసీ బస్సులు మొత్తం 3,700 రూట్లలో తిరుగుతుండగా, ప్రస్తుతం 1200 రూట్లలో బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. 
ఇది కూడా చదవండి: యుమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్‌ నివాసం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement