Buses
-
ఇజ్రాయెల్‌లో వరుస పేలుళ్లు
టెల్అవీవ్:మధ్య ఇజ్రాయెల్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. బాట్‌యామ్ నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న మూడు బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. మరో రెండు బస్సుల్లో దొరికిన బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.వరుస పేలుళ్లతో దేశవ్యాప్తంగా బస్సులు,రైళ్లలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఎవరు పెట్టారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో దొరికన పేలుడు పదార్థాలను పోలినట్లు తాజాగా దొరికన బాంబులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుళ్లకు హమాస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఖస్సమ్ బ్రిగేడ్స్ కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లోని తమ భూభాగాన్ని ఆక్రమించుకున్నవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని బబ్రిగేడ్స్ తాజాగా సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌పై దాడులు మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న కారణంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. -
డిపోల్లో ఎలక్ట్రిక్‌తో పాటు ఇతర బస్సుల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో పాటు కొన్ని ఆర్టీసీ సొంత బస్సులు, ఇప్పటికే తిప్పుతున్న అద్దె బస్సుల నిర్వహణ కూడా కొనసాగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అంటే హైబ్రిడ్ పద్ధతిలో డిపోలను వాడనుంది. ఎలక్ట్రిక్ బస్సులను భారీ సంఖ్యలో సమకూర్చుకుంటున్న నేపథ్యంలో, వాటి సరఫరా సంస్థకు డిపోలను కేటాయించనున్న తీరును వివరిస్తూ ‘ప్రైవేటు చేతికి ఆర్టీసీ డిపోలు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సంస్థ వైఖరిపై ఉద్యోగులతో పాటు, ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆర్టీసీ స్పందించింది. డిపోలను కేవలం ఎలక్ట్రిక్ బస్సులకే పరిమితం చేయకుండా, ఇతర బస్సులకు కూడా ఉపయోగిస్తామని ప్రకటించింది. ‘డిపోల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ అ«దీనంలోనే ఉంటుంది. కార్యకలాపాలన్నీ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే సంస్థ డిపో స్థలాన్ని చార్జింగ్, పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకుంటుంది..’అని స్పష్టం చేసింది. ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సంస్థలో డ్రైవర్లకు కొరత ఉంది. వివిధ కేటగిరీలకు సంబంధించి 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ నియామక ప్రక్రియ వివిధ నియామక సంస్థల పరిశీలనలో ఉంది..’అని పేర్కొంది. -
పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ
సాక్షి, హైదరాబాద్: పండుగపూట ప్రయాణికులను సురక్షి తంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సంక్రాంతిని పురస్కరించు కుని 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటు లో ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఈ నెల 19, 20 తేదీల్లో తి రుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా కూడా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తోంది.హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బ స్స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రా స్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కాగా, పండుగపూట నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను ఆర్టీసీ సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటిన్నర రెట్ల వరకు ధరలను సవరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పెంచిన చార్జీలు ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అమలు చేస్తారు.ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలను అమలు చేస్తామని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా పండుగలు, ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–69440000, 040–23450033 సంప్రదించాలని సూచించింది. -
కేజ్రీవాల్ చేతిలో మొహల్లా బస్సుల బ్రహ్మాస్త్రం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికారంలో ఉన్న ఆప్ మరోమారు అధికారం సొంతం చేసుకునేందుకు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. వాటిలో ఒకటే ‘మొహల్లా’.. మొహల్లా క్లీనిక్‌ల తరువాత మొహల్లా బస్సులను రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు.మొహల్లా క్లినిక్‌లకు అమితమైన ఆదరణకేజ్రీవాల్ సారధ్యంలో ఢిల్లీలో ఏర్పాటైన 300కు పైగా మొహల్లా క్లినిక్‌లు అమితమైన ప్రజాదరణ పొందాయి. 1.6 కోట్ల మంది మొహల్లా క్లీనిక్‌ల ద్వారా ఉచితంగా ఆరోగ్య సేవలను అందుకున్నారు. ఇప్పుడు త్వరలోనే ఢిల్లీ రోడ్లపైకి ఎక్కనున్న మొహల్లా బస్సులు రవాణా రంగంలో మరో విప్లవానికి నాంది పలకబోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొహల్లా బస్సులు బ్రహ్మాస్త్రంగా మారనున్నాయనే మాట కూడా వినిపిస్తోందిమహిళల భద్రతే ధ్యేయంగా..మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొహల్లా బస్సులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. శాంతిభద్రతల అంశాన్ని ఎన్నికల్లో ఆయుధంగా మలచుకునే ఉద్దేశంలోనే అరవింద్ కేజ్రీవాల్ మొహల్లా బస్సులను తీసుకువస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ప్రతిరోజు మూడు అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఢిల్లీ ఎంత అభద్రతలో ఉందో తెలియజేస్తుంది. కార్యాలయాల్లో పనిచేసే మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటామో లేదో అనే అభద్రతా భావంతో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కోసం మొహల్లా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో యోచిస్తోంది. గల్లీల్లోనూ సులభంగా తిరిగేలా..మొహల్లా బస్సులు 9 మీటర్ల పొడవు కలిగివుంటాయి. ఇవి చిన్నపాటి గల్లీల్లోనూ సులభంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేజ్రీవాల్-అతిషి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా మొహల్లా బస్సుల కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నేపధ్యంలో మరో రెండు వారాల్లో ఢిల్లీ రోడ్లపై మొహల్లా బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ బస్సులో 23 సీట్లు ఉండనున్నాయి. అలాగే 13 మంది నిలుచునేందుకు అవకాశం ఉంటుంది. మొత్తంగా 36 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఆరు సీట్లు మహిళలకు కేటాయించారు.రాత్రి 10 గంటల వరకూ అందుబాటులో..తొలిదశలో 140 మొహల్లా బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బస్సులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. మొత్తం 16 గంటల్లో 12 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ విధంగా ఒక్కరోజులో లక్షా 20 వేల 960 మంది ప్రయాణికులు ఒక రోజులో ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొహల్లా బస్సులు ప్రారంభం కావడం విశేషం. మొహల్లా బస్సుల వినియోగం ఢిల్లీ రవాణా రంగంలో ఒక మైలురాయిగా మారనుందనే మాట వినిపిస్తోంది. మొహల్లా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు. ఫలితంగా వీటి నుంచి కాలుష్యం ఏర్పడదు. ఇది కూడా చదవండి: మరోమారు తెరపైకి అమృత్సర్.. -
సెలవులొచ్చాయ్.. ఛలో ఊరికి..
సాక్షి, అమరావతి : గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. 18న నర్సాపూర్– సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్– నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ– తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. వాటన్నింటిలోనూ ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వీటిలో ప్రయాణికులకు ఇచ్చేందుకు బెడ్ రోల్స్ లేవు. దక్షిణ మధ్య రైల్వే రోజూ నిత్యం 210 రెగ్యులర్ రైళ్లను నిర్వహిస్తోంది. ఇక ఏడాదిలో వివిధ సందర్భాలను పరిగణలోకి తీసుకుని 200 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నిర్ణీత తేదీల్లో వీటిని నడుపుతుంటుంది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు (బెడ్‌రోల్స్) ఇస్తుంది. విజయవాడ, తిరుపతి, గుంతకల్, కాచిగూడల్లో ఉన్న రైల్వే మెకనైజ్డ్ లాండ్రీల్లో వాటిని శుభ్రపరిచి, తిరిగి సరఫరా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అదనంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌ల ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు లేవు. దాంతో ఈ రైళ్లలో బెడ్ రోల్స్ అందించలేమని, ప్రయాణికులు దుప్పట్లను వారే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు 11 వేల బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. వరుస సెలవుల కారణంగా బస్సుల్లో టికెట్లు దొరకడంలేదు. రానున్న వారం రోజులకు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ రూ.1,200 ఉండగా ఇప్పుడు రూ.2 వేలకు పెంచేశారు. స్లీపర్ ఏసీ బస్సుల్లో రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇవీ సెలవులు15వ తేదీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఐచ్ఛిక సెలవు17వ తేదీ శనివారం – సాధారణ సెలవు 18వ తేదీ ఆదివారం – సాధారణ సెలవు 19వ తేదీ సోమవారం – రాఖీ పౌర్ణమి సెలవు -
ఢిల్లీ రోడ్లపైకి ఉబెర్ ఏసీ బస్సులు
దేశరాజధాని ఢిల్లీలో త్వరలో ఉబెర్ బస్సులు తిరగనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఒక వినూత్న పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని కింద ఆగస్టు నుండి ఢిల్లీవాసులు ప్రైవేట్ కంపెనీలకు చెందిన ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది.గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసిన ‘ఢిల్లీ మోటార్ వెహికల్ లైసెన్సింగ్ అగ్రిగేటర్ (ప్రీమియం బస్సులు) పథకం’ కింద లగ్జరీ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని అరికట్టడం ఈ పథకంలోని ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో రెండు అగ్రిగేటర్లు.. ఉబెర్, అవేగ్ బస్సులను నడపడానికి లైసెన్స్‌లను మంజూరు చేసింది. ఈ బస్సులు ఏఏ మార్గాల్లో సేవలను ప్రారంభించాలనేది ఖరారు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారి తెలిపారు.త్వరలో డిల్లీ రోడ్లపై తిరిగే ఈ ప్రీమియం బస్సులు తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. ఈ బస్సులలో వైఫై సదుపాయం ఉంటుంది. అలాగే జీపీఎస్, సీసీటీవీ కూడా ఉంటుంది. ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలోగా ఈ బస్సులు ఢిల్లీ రోడ్లపై తిరగనున్నాయని సమాచారం. -
నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు
ఖట్మాండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింది. మడన్-ఆశ్రిత్ హైవేపై శుక్రవారం(జులై 12) తెల్లవారుజామున కొండ చరియలు విరిగి పడ్డాయి. హైవేపై ప్రయాణిస్తున్న రెండు బస్సులపై భారీ కొండ రాళ్లు పడ్డాయి. దీంతో బస్సులు నదిలో పడిపోయాయి. బస్సులు నదిలో పడిపోయి మొత్తం 65 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరిలో ఏడుగురు భారతీయులున్నట్లు సమాచారం.గల్లంతైన వారి కోసం గాలింపు ఆపరేషన్ కొనసాగుతోందని, అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి పుష్ఫ కమాల్ ప్రచండ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. -
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
వచ్చే 4 రోజులు తెలంగాణ బస్సులు బిజీ బిజీ
తొందరపడి బస్టాండ్లవైపు పరుగులు తీయొద్దని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. వచ్చే నాలుగు రోజులు ఎక్కువ బస్సులు మేడారం వెళ్తాయి కాబట్టి.. సాధారణ రూట్లలో బస్సులు తక్కువ ఉంటాయి. అలాగే కొన్ని రద్దవుతాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. "తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం." రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. – వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, టీఎస్ఆర్టీసీ. సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!! తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024 -
ఆర్టీసీ రికార్డు స్థాయి కిటకిట.. డ్రైవర్లకు దడదడ
సాక్షి, హైదరాబాద్: ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యం చేర్చి ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 106.02 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమో దైంది. సోమవారం ఈ రికార్డు నమోదైంది. ఈ అంశం గొప్పగా చెప్పుకోవడం కంటే, ప్రమాద ఘంటికలను మోగించడానికి సంకేతంగా భావించాల్సి రావటమే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ఆందోళన ఎందుకంటే..? ప్రస్తుతం ఆర్టీసీ వద్ద అద్దె వాటితోపాటు మొత్తం 9,100 బస్సులున్నాయి. రెండు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభించింది. ఆ పథకం మొదలైన తర్వాత ఆర్టీసీకి అదనంగా సమకూరిన బస్సులు 150 మాత్రమే. ఉచిత ప్రయాణం వల్ల రోజువారీ అదనపు ప్రయాణికుల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరింది. ఇందుకు 4 వేల అదనపు బస్సులు కావాల్సి ఉంది. కానీ, అన్ని బస్సులు ఇప్పట్లో సమకూరే పరిస్థితి లేదు. దీంతో బస్సులపై విపరీతమైన భారం పడుతోంది. రెండు బస్సుల్లో ఎక్కాల్సిన ప్రయాణికులు ఒక్క బస్సులో కిక్కిరిసిపోయి బస్సులను నడపటం డ్రైవర్లకు కష్టంగా మారింది. అసలే 30 శాతం బస్సులు బాగా పాతబడి ఉన్నందున, ఈ ఓవర్ లోడ్‌తో ఎక్కడ అదుపు తప్పుతాయోనన్న భయం ఆర్టీసీని వెంటాడుతోంది. ఇంతగా కిక్కిరిసిన బస్సులను సోమవారం అతి జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. అధికారులు అనుక్షణం సిబ్బందిని అప్రమత్తం చేసి బస్సులు నడపడం గమనార్హం. డ్రైవర్ల కొరత ప్రస్తుతం ఉన్న బస్సులను పరిగణనలోకి తీసుకుంటే 400 మంది డ్రైవర్ల కొరత ఉంది. సోమవారం లాంటి రద్దీ ఉన్న సమయంలో అదనపు బస్సులు నడపాల్సి ఉంటుంది. అయితే, బస్సుల్లేక ఆ పనిచేయలేకపోతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా డ్రై వర్లు లేనందున వాటిని డిపోలకే పరిమితం చేయా ల్సి ఉంటుంది. కొత్త బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. 2,000 మంది డ్రైవర్లను ఉన్నఫళంగా రిక్రూట్ చేసుకోవాలనీ ప్రతిపాదించారు. కానీ, ఇటీవలి బడ్జెట్ లో ఆర్టీసీకి ఎన్ని నిధులు కేటాయించారో వెల్లడించలేదు. కేవలం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతినెలా రూ.300 చొప్పున రీయింబర్స్ చేసే అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఇదిలాఉంటే, దూరప్రాంతాలకు తిరిగే బస్సుల్లో విధులు నిర్వహించే డ్రైవర్లకు కచి్చతంగా చాలినంత విశ్రాంతి అవసరం. కానీ, డ్రైవర్ల కొరత ఫలితంగా కొందరికి సరిపడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా డబుల్ డ్యూటీలు చేయించాల్సి వస్తోంది. ఇలా విశ్రాంతి లేని డ్రైవర్లు, డొక్కు బస్సులను కొనసాగి స్తున్న నేపథ్యంలో ఒకే రోజు 65 లక్షల మంది బ స్సుల్లో ప్రయాణించటం కలవరానికి గురిచేస్తోంది. -
సీఎం గారు బస్సులో మాకు సీట్లు ఎక్కడ ?
-
కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిసున్న వారిలో 90 శాతం మహిళలే అన్నది సుస్పష్టం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు రూ.4.50 కోట్లు పెరిగినట్టు లె క్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సు (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్)ల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది త ప్ప పెరగదు. కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయా న్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయనున్నందున ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం రూ.13–14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, ఇప్పుడది రూ.18.25 కోట్లకు చేరుతోంది. గతంలో సాధారణ రోజుల్లో (సోమవారం కాకుండా) నిత్యం బస్సుల్లో 25–30 లక్షల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడది 43 లక్షలు దాటుతోంది. వెరసి.. ఈ పథకం ప్రారంభమయ్యాక 40 శాతం ప్రయాణికులు పెరిగనట్టు గుర్తించారు. జీరో టికెట్ జారీతో తేలిన లెక్క సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే, సోమవారాల్లో ఆ సంఖ్య 34 లక్షల వరకు ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ప్రారంభమయ్యాక, గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్టు అధికారులు లెక్కలేశారు. అయితే, ఆరోజు వరకు మహిళలకు టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. టికెట్లు జారీ చేస్తే, ఎంతమంది మహిళలు బస్సులెక్కారో కచ్చితంగా తెలుస్తుంది. మూడు రోజుల క్రితం జీరో టికెట్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో ఆ టికెట్ల జారీతో తేలుతుంది. దానికి ఎంత చార్జీ చెల్లించాల్సి ఉంటుందో కూడా అందులో స్పష్టమవుతుంది. ఆర్టీసీ ఆ లెక్కలను ప్రతినెలా ప్రభుత్వానికి అందిస్తుంది. దాని ఆధారంగానే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఇప్పుడు జీరో టికెట్ల జారీ ప్రకారం 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్లు తేలింది. వీరి ద్వారా రూ.1,826.49 కోట్ల ఆదాయం సమకూరింది (ప్రభుత్వం రీయింబర్స్ చేసే మొత్తంతో కలిపి). నాలుగువేల బస్సులు పాతవే... మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. చాలా బస్సుల్లో మూడొంతుల స్థలంలో మహిళలే ఉంటున్నారు. దీంతో పురుషులు కొందరు స్థలం లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపుతప్పకుండా ఉండాలంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేశారు. ప్రస్తుతం 40 శాతం రద్దీ పెరిగినా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న బస్సులతోనే నెట్టుకొస్తున్నారు. అయితే, ఆర్టీసీలో దాదాపు 4 వేల బస్సులు బాగా పాతబడి ఉన్నాయి. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే అదుపుతప్పే ప్రమాదం ఉంటుంది. ప్రమాదాలు చోటుచేసుకునే వరకు ఎదురుచూడకుండా కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. గతంలో ఆర్డర్ ఇచ్చిన బస్సులు కొన్ని త్వరలో సమకూరే అవకాశం ఉంది. కానీ అవి సరిపోవు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కొత్త బస్సులు కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. -
ఓటర్ల ఇక్కట్లు.. ఓటు వేసేది ఎలా?..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఎన్నికల తమ వంతుగా ఓట్లు వేసేందుకు ఓటర్లు కదిలారు. భాగ్యనగరం నుంచి తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో, బస్సు, రైళ్లు నిండిపోయాయి. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, ఉన్న కొద్ది బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండంతో స్థలం సరిపోక.. బస్సులపైకి ఎక్కి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద.. బస్సుపైకి ఎక్కి ప్రయాణికులు ఇళ్లకు వెళ్తున్నారు. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు భారీ తరలివెళ్తున్న ప్రజలు. ఔటర్ వైపు భారీగా చేరుకుంటున్న వాహనాలు. -
బస్సులకూ... ఎన్నికలకూ సంబంధమేమిటి?
‘‘ఆర్టీసీ బస్సులకూ..ఎన్నికలకూ ఎంతో సంబంధముంది. మరీ ముఖ్యంగా బస్సుల్లో రాసి ఉండే సూక్తులు, ఉపదేశాలతో’’ ఓ పెద్ద బాంబునే పేల్చాడు మా రాంబాబుగాడు. ‘‘మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశె తింటుంటే..నువ్వొచ్చి ఎలక్షన్లకూ, బస్సులకూ ముడిపెడతావా? అలాంటి సంబంధాలకు ఆస్కారమే లేని చోట నువ్వు సృష్టిస్తున్న ఈ రా.కీ.వాహన సంబంధాలేమిటి? ఈ సంగతేమిటో నాకిప్పుడే తెలియాలి. తెలిసితీరాలి’’ అంటూ కోప్పడ్డాడు మా బావ. అప్పుడు మా రాంబాబుగాడు చెప్పిన ఉదంతాలూ, ఉదాహరణలు అపూర్వం, అనిర్వచనీయం, అవిస్మరణీయం. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం..వాళ్ల సీట్లలో వాళ్లనే కూర్చోనిద్దాం. బస్సుల్లో మహిళలుగానీ..ఎన్నికల్లో మహిళలంటే ఇక్కడ జెండర్‌గా తీసుకోకూడదు. స్త్రీలంటేనే చాలా స్పెషల్. అలాంటివారే కీలకమైన కొందరు అభ్యర్థులు కూడా. దేవతల్లో అమ్మవారి లాంటివారే..రాజకీయాల్లో ఈ అయ్యవార్లు! ప్రస్తుతానికి వాళ్లు మన పార్టీలో లేరు. పక్క పార్టీ నుంచి... ఆల్ ద వే..పార్టీ మారి మరీ రావాలి. అందుకే..ఎన్ని జాబితాలు వెలువడ్డా..ఆయనొచ్చేవరకూ ఆ సీటును మాత్రం ఖాళీగా ఉంచాల్సిందే. ఉదాహరణకు ఓ అభ్యర్థి పేరు రాజగోపాల్‌రెడ్డి, ఆ స్థానం పేరు మునుగోడు. ఇది ఆయనొక్కడికే కాదు..చాలామందికి వర్తిస్తుంది. దాదాపు అన్ని పార్టీలూ అలా ఖాళీల్ని ఉంచి, అభ్యర్థుల రాక కోసం వెయిట్ చేసేవే, చేస్తున్నవే. ఫుట్‌బోర్డు మీద ప్రయాణం ప్రమాదకరం... కొందరు నేతలుంటారు. దశాబ్దాలపాటు పార్టీకి సేవలందిస్తారు. జీవితమంతా పార్టీకే ధారబోస్తారు. కీలకమైన ప్రభుత్వ, పార్టీ పదవులు చేపట్టి ఉంటారు. పాపం... తీరా ఎలక్షన్ టైముకు టికెట్ రాదు. కొందరు రాజీనామా చేస్తారు. మరికొందరు చెయ్యరు. ఇక వీళ్లంతా సీటు దొరకని ప్రయాణికుల్లా ఉంటారు. సీటు దొరకనందుకు అసహనంగా ఉంటారు. ఫుట్‌బోర్డు మీద ప్రయాణికుల్లా కనిపిస్తారు. అప్పుడు పొరుగు పార్టీ అధినేతనో లేదా మరో పార్టీలోని పెద్ద నేతనో కండక్టర్‌లా వస్తాడు. లోనికి రమ్మంటాడు. ఫుట్‌బోర్డు మీద నుంచి బస్సులోకి తీసుకెళ్లినట్టుగా..తమ పార్టీలోకి పట్టుకుపోతాడు. ఒక్కటే తేడా. కండక్టర్ హార్ష్‌గా తిట్టి తీసుకుపోతాడూ... కీలకనేతల్ని గౌరవం నటిస్తూ పట్టుకుపోతారు. డిఫరెన్స్ ఇంతే. ఉదాహరణకు పొన్నాల లక్ష్మయ్య గానీ ఇలాంటివారు ఎందరో నేతలూ!...ఎన్నో పార్టీలూ!! ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం ఈ నినాదం ఎలక్షన్స్‌కు ఎలా వర్తిస్తుందో చూద్దాం. దీనర్థం ఏమిటంటే..మా పార్టీలోనే మీకు తగిన ప్రాధాన్యముంటుంది. ప్రైవేటు బస్సుల్లాంటి ఇతర పార్టీల్లో మీకంత ప్రయారిటీ ఉండకపోవచ్చు అని సూచించేలాంటిదే ఈ నినాదం. ‘‘అన్నీ నాయకులకేనా, సామాన్యులకేమీ సందేశాలు లేవా?’’ అడిగాడు మా బావ. ‘‘ఎందుకు లేవూ... ‘లైట్లు ఆర్పి సెల్ఫ్ కొట్టవలెను’ అని కూడా రాసి ఉంటుంది. ఇది డ్రైవరుకు సంబంధించిన సూచన. ఓటర్లంతా మామూలు ప్రయాణికుల్లాంటివారు. వాళ్లంతా బస్సెక్కాక..అంటే ఓటేశాక..తమ దారి స్పష్టంగా ఉండటం కోసం డ్రైవర్లలాంటి నేతలంతా బస్సులో దీపాలార్పేసి జనాల బతుకులు చీకటి చేస్తారు. ఇది నేతలకు ఓ సూక్తి!..జనాలకో హెచ్చరిక!! -
TSRTC: హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసులు రద్దు: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, కృష్ణా జిల్లాలోని కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యూలర్ టీఎస్ఆర్టీసీ బస్సుల రద్దు చేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు టీఎస్ఆర్టీసీ బస్సులు వెళ్తాయి. ఎంజీబీఎస్ నుంచి ప్రతీ అరగంటకో బస్సు ఉంటుంది. దీనిపై మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలన్నారు. ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023 ఇది కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్ -
సాహసం శ్వాసగా.. బాధితులకు అండగా.. రెస్క్యూ బృందాలు!
భారీ వరదలు, వర్షాలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ బృందాలు మ్తొతం 50 వేల మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపరులను, పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. #WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A — ANI (@ANI) July 12, 2023 అలాగే వరద ఉధృతిలో చిక్కుకున్న మరో 15 మందిని కూడా తాళ్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఐటీబీపీ, హోమ్‌గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు, వరదల కారణంగా హెచ్ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో సుమారు 300 బస్సులు చిక్కుకుపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు.హెచ్ఆర్టీసీ బస్సులు మొత్తం 3,700 రూట్లలో తిరుగుతుండగా, ప్రస్తుతం 1200 రూట్లలో బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: యుమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం -
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. బస్సుల్లో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి.. -
హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు (ఫోటోలు)
-
పెళ్లిళ్ల సీజన్.. టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. అన్ని రకాల బస్ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు అద్దె బస్సులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా అద్దె బస్సులకు రాయితీని గతంలో సంస్థ కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 31తో ఆ రాయితీ గడువు ముగిసింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావడంతో డిమాండ్ దృష్ట్యా.. 10 శాతం రాయితీ కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులు సూచన చేశారు. ఈ మేరకు ఆ రాయితీని సంస్థ ప్రకటించింది. శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు. ప్రైవేట్ వాహనాల కన్నా చాలా తక్కువ ధరకే తమ సంస్థ బస్సులను అద్దెకు ఇస్తోందని పేర్కొన్నారు. ముందస్తుగా ఎలాంటి నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామని వివరించారు. చదవండి: బదిలీ వెనుక రాజకీయం.. చక్రం తిప్పిన ఇద్దరు ప్రజాప్రతినిధులు..? అద్దె బస్సుల బుకింగ్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక డిపో మేనేజర్‌ను సంప్రదించాలన్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులకు వినియోగించుకుని టీఎస్ఆర్టీసీని ప్రోత్సహించాలని కోరారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌ను బట్టి అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. -
ఆర్టీసీ సైబర్ లైనర్ రెడీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా ప్రారంభిస్తున్న బస్సు సర్వీసు ‘సైబర్ లైనర్’. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం కొత్తగా ఈ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మూడు ఐటీ కారిడార్లలో ఈ బస్సులు నడపనున్నారు. వీటికి ఆదరణ మెరుగ్గా ఉంటే మరికొన్ని బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైటెక్స్ మెట్రో స్టేషన్ సమీపంలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘వజ్ర’లకు కొత్త రూపు.. దాదాపు ఏడేళ్ల క్రితం ఆర్టీసీ వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటి నిర్వహణ, రూట్ల ఎంపిక పూర్తి లోపభూయిష్టంగా, ప్రణాళిక లేకుండా ఉండటంతో అప్పట్లోనే ఆ ప్రయోగం వికటించింది. రూ.కోట్లలో నష్టాలు వస్తుండటంతో వాటిని దూరప్రాంతాలకు తిప్పటం ప్రారంభించారు. కానీ, బస్సుల్లో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆ ప్రయోగం కూడా విఫలమైంది. చూస్తుండగానే అవి డొక్కుగా మారి తుక్కుకు చేరాయి. మొత్తం వంద బస్సులకు గాను 32 బస్సులు కొంత మెరుగ్గా ఉండటంతో వాటిని పక్కన పెట్టి మిగతావాటిని తుక్కుగా మార్చేశారు. ఇప్పుడు ఆ 32 బస్సులను సైబర్ లైనర్లుగా మార్చాలని నిర్ణయించి తొలుత పది బస్సులకు వర్క్‌షాపులో కొత్త రూపు ఇచ్చారు. ఐటీ రూట్లలోనే ఎందుకంటే.. గతంలో సిటీలో ఓల్వో ఏసీ బస్సులను మెట్రో లగ్జరీలుగా తిప్పటంతో వాటికి ఐటీ ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ మెట్రో రైళ్ల ప్రారంభంతో అవి దివాలా తీశాయి. దీంతో వాటిని తప్పించి దూర ప్రాంత సర్వీసులుగా మార్చారు. అయితే మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లటం కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బందిని అనుకూలంగా మార్చుకునేందుకు ఆర్టీసీ వీటిని ప్రారంభించింది. మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులకు ఇవి రెడీగా ఉంటాయి. ఇవి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐటీ హబ్ గర్, వేవ్‌రాక్, విప్రో రూట్లలో తిరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి. తిరిగి సాయంత్రం ఐటీ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు.. ఆ మూడు ప్రాంతాల నుంచి తిరిగి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు తిరుగుతాయి. గర్ ప్రాంతానికి రూ.40, మిగతా రెండు ప్రాంతాలకు రూ.30ని టికెట్ ధరగా నిర్ధారించారు. సాధారణ ప్రయాణికులకు కూడా ఇవే వర్తిస్తాయి. ఈ బస్సులకు మధ్యలో హాల్టులుండవు. అందుకే వీటిల్లో కండక్టర్ ఉండడు. ఇవి విజయవంతమైతే మరిన్ని బస్సులను ప్రారంభించాలని ఆర్టీసీ భావిస్తోంది. -
టాటా మోటార్స్‌కు భారీ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా హర్యానా రోడ్‌వేస్‌కు 1,000 బస్‌లను సరఫరా చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. 52 సీట్ల సామర్థ్యం గల డీజిల్‌తో నడిచే బీఎస్–6 బస్‌లను అందించనుంది. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడానికి తాము కట్టుబడి ఉన్నట్టు టాటా మోటార్స్ ప్రొడక్ట్ లైన్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: ఎలాన్ మస్క్‌కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! -
ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది చివరలో కొనే కొత్త బస్సులకు పేర్లు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలిసారి స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్న ఆర్టీసీ ... ప్రయాణికులకు చేరువయ్యేందుకు వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టాలని నిర్ణయించింది. ఏడాది చివరికి మొత్తం 630 కొత్త బస్సుల రాక మొదలువుతుంది. డిసెంబరులో వీటి సరఫరా ప్రారంభమై మార్చి వరకు పూర్తిగా అందుతాయి. వీటి ల్లో 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. మిగతావి సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులు. అద్దె రూపంలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులు సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీమియం కేటగిరీలో గరుడ, గరుడప్లస్, రాజధాని పేరుతో బస్సులున్నాయి. ఇప్పుడు ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ కేటగిరీ సర్వీసులకు పేర్లు పెట్టాలని అధికారులు నిర్ణయించారు. బస్సులకు ఆకర్షణీయమైన పేర్లు సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పేర్లు సూచించటం మొదలైంది. ఇటీవలే భారత్‌కు ఆఫ్రికా చీతాలు రావటంతో వాటి పేరు జనం నోళ్లలో బాగా నానుతోంది. దీంతో ఏసీ స్లీపర్ సర్వీసుకు చీతా పేరు పెట్టాలని కొందరు, ప్యారడైజ్ ఆన్ వీల్స్, డెక్కన్ ప్రైడ్, స్వర్ణ రథం, మయూఖా, జాగ్వార్, విహారీ, షీతల శయన, శాతవాహన, కాకతీయ, రుద్రమ, జనతాబస్, విహంగ, హరివిల్లు, రోడ్ ఫ్లైట్, మయూర, రాజహంస, అంబారీ, ఉయ్యాల.. ఇలా చాలా పేర్లు సూచించారు. మరిన్ని సూచనలు రానున్నాయి. వీటిల్లోంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆయా సరీ్వసులకు పెట్టనున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఆరంభంలో బ్యాటరీ నాన్ ఏసీ బస్సులు కూడా సమకూరనున్నాయి. వాటికి కూడా పేర్లు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్‌పోర్టుకు తిరుగుతున్నాయి. నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు పేర్లు పెట్టాల్సి ఉంది. కొనసాగుతున్న దసరా ప్రత్యేక బస్సులు.. బతుకమ్మ, దసరా పండుగల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు నగరం నుంచి మూడు వేల బస్సులు ప్రయాణికులను గమ్యానికి చేర్చాయి. రెండో శనివారం, ఆదివారం సెలవురోజులు కావటంతో భారీగా జనం ఊళ్లకు తరలివెళ్లారు. శనివారం షెడ్యూల్ ప్రకారం 560 బస్సులు నడపాల్సి ఉండగా, రద్దీ ఎక్కువగా ఉండటంతో 820 బస్సులు నడిపారు. ఆదివారం 565 బస్సులు నడపాల్సి ఉండగా, 765 బస్సులు తిప్పారు. మంగళవారం మళ్లీ రద్దీ ఎక్కువగా ఉండనున్నందున వేయి బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
12 ఏళ్లలో 339 చోరీలు.. కూలీలే కానీ కాస్ట్లీ కార్లలో తిరుగుతూ..
కాస్త రద్దీగా బస్సు కనిపిస్తే చాలు.. ఆ రెండు కార్లకు సడన్ బ్రేకులు పడతాయి. అందులో ఉన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి. బస్సులో మహిళల వైపు రష్ కనిపిస్తే.. ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు దిగి తమ చేతివాటం ప్రదర్శించుకొస్తారు. అదే పురుషుల వైపు రద్దీ ఉంటే.. ఆ ఇద్దరు మగవాళ్లలో ఒకరు దిగి తమ పని కానిచ్చేస్తారు. ఏ మాత్రం సందేహం రాకుండా బస్సు దిగిపోయి.. తమ తమ కార్లలో గాయబ్ అవుతారు. ఇలా 12 ఏళ్లుగా 339 చోరీలకు పాల్పడ్డ రెండు జంటలను.. గుజరాత్ సోమనాథ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితులు సంజయ్-గీత, నరేష్-రేఖలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ల నుంచి రెండు బ్రెజ్జా కార్లను, ఐఫోన్లను, లక్ష రూపాయల దాకా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలీలు ఇలా.. దాహోడ్ జిల్లాకు చెందిన ఈ రెండు జంటలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే.. తేలికగా డబ్బు సంపాదించడం కోసం చేతులు కలిపి ఇలా చోరీలకు దిగారు. ఆ చోరీల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆరేసి లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు కాస్ట్లీ కార్లను కొనుగోలు చేశారు కూడా. కార్లలోనే తిరుగుతూ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. కానీ, స్థానికులకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ వస్తున్నారు. అయితే.. ఎలా పట్టారంటే.. ఆగస్టు 21, 22 తేదీల్లో వెరవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సోమనాథ్ మాంగ్రోల్ బస్ స్టేషన్ వద ఇద్దరు బాధితులు బస్సుల్లోనే.. నగదును పొగొట్టుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అందులో బ్రెజ్జా కారులో వచ్చిన ఇద్దరు మహిళలు.. లగేజీ లేకుండా రద్దీ బస్సులు ఎక్కడం, కాసేపటికే ఆ బస్సు దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం పోలీసులకు అనుమానంగా అనిపించింది. దీంతో.. కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వెరవల్ దగ్గర వాళ్లను పట్టుకున్నారు. ఆపై భార్యలు ఇచ్చిన సమాచారంతో భర్తలనూ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గత 12 ఏళ్లుగా గుజరాత్లో వివిధ ప్రాంతాల్లో ఇలా రద్దీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు ఈ రెండు జంటలు ఒప్పుకున్నాయి. ఇదీ చదవండి: మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్! -
కోవిడ్ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కారణంగా సుమారు 2 లక్షల ప్రైవేట్ బస్సులు మూలన పడ్డాయని బస్, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీవోసీఐ) వెల్లడించింది. ఇవి రోడ్డెక్కాలంటే ఆపరేటర్లు ఒక్కో బస్‌కు కనీసం రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిందేనని బీవోసీఐ ప్రెసిడెంట్ ప్రసన్న పట్వర్ధన్ తెలిపారు. దేశంలో 10లోపు బస్‌లు కలిగి ఉన్న చిన్న ఆపరేటర్లు 90 శాతం ఉంటారని, వీరికి ఈ వ్యయాలు భారమేనని చెప్పారు. (ఇది చదవండి : వోల్వో-ఐషర్ కొత్త ఇంటర్ సిటీ బస్సులు) ప్రవాస్ 3.0 పేరుతో ఇక్కడి హైటెక్స్‌లో ప్రారంభమైన ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ షోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సేవల రంగంలో ఇప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో బస్‌లకు డిమాండ్ ఆశించినట్టు లేదు. మరోవైపు స్కూల్ బస్‌లకు కొరత ఉంది. దేశంలో 2021-22లో అన్ని రకాల బస్‌లు సుమారు 20,000 యూనిట్లు అమ్మడయ్యాయి. మొత్తం 19 లక్షల బస్‌లు పరుగెడుతున్నాయి. వీటిలో 17.7 లక్షలు ప్రైవేట్ ఆపరేటర్లవి. మిగిలినవి వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్‌ల విషయంలో తయారీ సంస్థలు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి’ అని వివరించారు. చదవండి : ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్:టైటన్ మెరిసెన్ -
ప్రైవేట్ ట్రావెల్స్ రూటే సెపరేటు..అనుమతులు ఒకలా.. ప్రయాణం మరోలా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అడ్డదారిలో జిల్లా ప్రయాణికులను తరలించుకుపోతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. కాంటాక్టు క్యారియర్ అనుమతులు ఉన్న బస్సులు ఇలా మధ్య, మధ్యలో ఆపి ప్రయాణికులను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నా.. ఆదిలాబాద్‌లో నిలిపి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ బస్సులపై చర్య తీసుకోవాల్సిన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లా కేంద్రం మీదుగా ఆదిలాబాద్–హైదరాబాద్, రాయ్‌పూర్ – హైదరాబాద్, నాగ్‌పూర్ – బెంగళూరు మధ్య అనేక ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. ఆరెంజ్, జీడీఆర్, ఎస్ఆర్ఎస్, శబరి, దివాకర్, ఖురానా అనే ట్రావెల్ బస్సులు ఇతర ప్రాంతాల నుంచి బయలుదేరి ఆదిలాబాద్ మీదుగా గమ్య స్థానానికి వెళ్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్ నుంచి నిత్యం ముస్కాన్, మెట్రో, డైమండ్, పల్లవి, సహరా స్థానిక ట్రావెల్స్ ఏజెన్సీల నుంచి హైదరాబాద్‌కు రాత్రి సర్వీసులు నడుస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దగ్ధమైంది. ఈ ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. వారంతా హైదరాబాద్ వాసులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. ప్రైవేట్ బస్సుల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వందలాది మంది ప్యాసింజర్లు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. లాగేజీ దందా.. కాంటాక్టు క్యారియర్ అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘిస్తూ స్టేజ్ క్యారియర్‌గా బస్సులను నడుపుతుండడమే కాకుండా ఈ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకులు పార్శిల్, లగేజీ దందాను అక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చిపోయే బస్సులు పెద్ద మొత్తంలో పార్శిల్, లగేజీ నిర్వాహణ చేపడుతున్నాయి. వస్తు సామగ్రిని ఒక చోట నుంచి మరోచోటకి బస్సుల ద్వారా తరలించే అనుమతి వీరికి లేకపోయినా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్యాసింజర్లను చేరవేయడం ద్వారా ట్రావెల్ ఏజెన్సీలకు అనుకున్న స్థాయిలో లాభాలు ఉండవని, అసలు పార్శిల్, లగేజీలు చేరవేయడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బస్సుల ద్వారా వస్తుసామగ్రి చేరవేత రూపంలో అనేక అక్రమ దందాలు కూడా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొంత మంది వ్యాపారులు డబ్బులను హవాలా రూపంలో చేరవేస్తారనే ప్రచారం కూడా ఉంది. పెద్ద మొత్తంలో లగేజీని బస్సుల బాక్స్లతోపాటు టాప్‌పై తీసుకొస్తుండడంతో ఎదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ లగేజీ కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుంది. దీనిపై ఇటు పోలీసు, అటు రవాణా శాఖ అధికారుల నిఘా లేకపోవడం వారికి కలిసి వస్తోంది. భద్రత డొల్లా.. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు స్లీపర్ కోచ్‌లను తీసుకురావడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీటింగ్ విధానంతో బస్సు లోపల స్థలం ఇరుకుగా మారింది. ఎదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు ఒకరికి దాటుకుని మరొకరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మరణాల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా కాంటాక్టు క్యారియర్ అనుమతి ఉన్నవారు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకిస్తారు. దానికి విరుద్ధం స్టేజ్ క్యారియర్ అనుమతి లేకున్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సును నడపడమే కాకుండా మధ్యమధ్యలో బస్సును ఆపి ప్రయాణికులను చేరవేయడం నిబంధనలకు విరుద్దం. కానీ ఇవన్నీ యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్‌కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
డిఫరెంట్‌గా కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు.. టీఎస్ఆర్టీసీ చేసేదేంటి...?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఆకర్షణీ యంగా రూపుదిద్దుకుంటోంది. కొత్త హంగులు, రంగులతో ప్రయాణికుల ముందుకు రానుంది. ఆర్టీసీ బస్సు ఏళ్లుగా ఒకే రకంగా ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు తెలంగాణ బస్సుల కంటే భిన్నం గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కూడా మార్పులు, చేర్పులు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఎలా ఉండాలో చెప్పండి: ఎండీ గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు బస్సుల రంగులు, ఇత రాల్లో మార్పులు చేసేవారు. కానీ, ఇప్పుడు డిపోస్థాయి నుంచి సిబ్బంది ఎవరైనా సరే ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని ఎండీ ఆహ్వానించారు. ఈ మేరకు డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బస్సుల ఆకృతి, సీట్లు ఎలా ఉండాలి, ఫుట్ రెస్టు ఏర్పాటులో మార్పు అవసరమా, డోర్లు ముందుండాలా, వెనక ఉండాలా, మధ్యలో ఉండాలా, ఏసీ వ్యవస్థలో మార్పులు కావాలా, రంగుల్లో ఎలాంటి మార్పులుండాలి, ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు, వారి నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదులేంటి? ఏయే మార్పులు చేయాలి? ఇలా చాలా అంశాల్లో సలహాలను అడిగారు. సిబ్బంది సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేయబోతున్నారు. దాదాపు 550 కొత్త బస్సులను త్వరలో కొనబో తున్నారు. సాధారణంగా ఆర్టీసీ ఛాసీస్‌లను మాత్రమే కొంటుంది. వాటి బస్‌బాడీ మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో రూపొం దించుకుంటుంది. ఏసీ బస్సులు మాత్రం బాడీతోసహా అన్నీ కంపెనీ నుంచే వస్తాయి. ఇప్పుడు సిబ్బంది ఇచ్చే సూచనల ఆధా రంగా ఈ కొత్త బస్సుల కొనుగోలు నుంచే మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గూగుల్ మీట్ ద్వారా మంగళవారం ఉన్నతాధికారులు డిపో మేనేజర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
ఆర్టీసీపై షార్ట్‌ఫిల్మ్ చేయండి.. రూ.10 వేలు గెల్చుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆరీ్టసీని జనానికి చేరువ చేసేందుకు నానా పాట్లు పడుతున్న అధికా రు లు తాజాగా షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఆకట్టుకోవా లని నిర్ణయించారు. ఈమేరకు షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మెరుగ్గా ఉన్న వాటి ల్లోంచి ఎంపిక చేసిన మొదటి ఫిల్మ్‌కు రూ.10 వేలు, రెండో ఫిల్మ్‌కు రూ.5 వేలు, మూడో ఫిల్మ్‌కు రూ.రెండున్నర వేలు పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం, లీటరు పెట్రోలు ధర కంటే తక్కువ మొత్తంతో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు వంటి తదితర అంశాలు ఇతివృత్తాలుగా షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని అందులో పేర్కొన్నారు. ఉత్సాహం ఉన్న వారు వివరాలతో ఈనెల 21 లోపు tsrtcshortfilm@gmail.com చిరునామాకు ఎంట్రీలు పంపాలని సూచించారు. -
‘డొక్కే’ దిక్కు!
ఇది తాండూరు డిపో బస్సు. తాండూరు నుంచి మెహిదీపట్నం బయలుదేరింది. అనంతగిరి గుట్టను దాటే క్రమంలో ఎత్తు ఎక్కలేక రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రయాణికులను దింపేసి వెనకకు పల్లం ఉండటంతో రివర్స్‌లో వేగంగా పోనిచ్చి అతికష్టమ్మీద ఇంజిన్ ఆన్చేయగలిగాడు. కానీ ప్రయాణికులతో ఎత్తు ఎక్కలేకపోయింది. దీంతో ఖాళీ బస్సు ఎత్తు ఎక్కిన తర్వాత ప్రయాణికులు బస్కెక్కాల్సి వచ్చింది. డొక్కు బస్సులను నడపడం ఆర్టీసీకి దినదినగండంగా మారింది. ప్రయాణికులు నిండితే మోయలేనివి కొన్ని, పికప్ లేక ముందుకు ఉరకలేకపోతున్నవి మరికొన్ని, ఉన్నట్టుండి అదుపుతప్పి భయపెడుతున్నవి ఇంకొన్ని.. ఇలాంటి బస్సులతో సంస్థ సతమతమవుతోంది. ఏరోజుకారోజు సర్వీసింగ్‌తో అతికష్టమ్మీద నడుపుతోంది. పరిస్థితి మారాలంటే ఇప్పటికిప్పుడు రూ. 500 కోట్లు కావాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేక, ప్రభుత్వం నుంచి లోన్ పుట్టక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మూలన పడే స్థితిలో సగం బస్సులు నిబంధనల ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న బస్సులను తప్పించాలి. కానీ అవి పోతే ప్రయాణికుల అవసరాలకు బస్సులు సరిపోవు. దీంతో నిత్యం సర్వీసింగ్ చేసి, బ్రేకులు వగైరా సరిగా ఉన్నాయో లేదో ఒకటికి పదిమార్లు సరిచూసుకుని బస్సులను రోడ్డుపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో దాదాపు సగం.. అంటే 2,800 బస్సులు ఈ పరిస్థితిలోనే ఉన్నాయి. కొన్ని బస్సులు ఏకంగా 20 లక్షల కిలోమీటర్ల సర్వీసునూ పూర్తి చేసుకున్నాయి. ఒక్క డీలక్స్ కేటగిరీలోనే 15 లక్షల కిలోమీటర్లు దాటిన, అతి చేరువగా ఉన్న బస్సులు 190 ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో ఈ సమస్య ఉంది. 1,400 కొత్త బస్సులు కావాలి ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు దాదాపు 1,400 కొత్త బస్సులు అవసరముంది. ఇందుకు కనీసం రూ.500 కోట్లు కావాలి. కానీ చేతిలో పైసా లేక ఆర్టీసీ దిక్కులు చూస్తోంది. గతంలో బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు అందులోంచి రూ.100 కోట్లు కొత్త బస్సులకు వాడాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. కానీ జీతాలకు ఇబ్బందిగా ఉండటంతో వాడారు. ఇటీవలి బడ్జెట్లో ఆర్టీసీకి ప్రభుత్వ పూచీకత్తు రుణాల కింద ఒక్క పైసా కూడా ప్రతిపాదించలేదు. దీంతో కొత్త బస్సుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. అతికష్టమ్మీద ఓ బ్యాంకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆర్టీసీ డిపోను కుదువపెట్టి ఆ రుణం తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాటితో 300 బస్సులు కూడా రాని పరిస్థితి. కొత్త బాడీలు కట్టించాలన్నా రూ. 250 కోట్లు కావాలి ఓ కేటగిరీలో ఎక్కువ కాలం తిరిగిన బస్సును అంతకంటే తక్కువ కేటగిరీలోకి మార్చి కొత్త బాడీ కట్టించి తిప్పే మరో ప్రతిపాదననూ అధికారులు ఇచ్చారు. ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించి 2,683 బస్సులను రీప్లేస్ చేయాలని పేర్కొన్నారు. కొత్త బాడీ కట్టేందుకు కూడా దాదాపు రూ.250 కోట్లు అవసరమవుతాయన్నారు. పల్లెలకు బస్సులు దూరం ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ ఏకంగా రూ.2,200 కోట్ల నష్టాలను చవిచూసింది. కోవిడ్, డీజిల్ సంక్షోభాలతో నష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆదాయం ఎక్కువ వచ్చే రూట్లకే సంస్థ ప్రాధాన్యమిస్తోంది. ఫలితంగా చాలా పల్లెలు ప్రభుత్వ రవాణాకు దూరమవుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
కేటీఆర్ భరోసా.. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు!
సాక్షిహైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులపై మరోసారి కదలిక వచ్చింది. నిధుల కొరత కారణంగా ఈ బస్సుల కొనుగోళ్లపై వెనకడుగు వేసిన ఆర్టీసీకి మంత్రి కేటీఆర్ భరోసా ఇవ్వడంతో ఆశలు చిగురించాయి. నగరంలోని వివిధ రూట్లలో ఈ బస్సులను నడిపేందుకు బస్సుల కొనుగోళ్ల కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. హెచ్ఎండీఏ నుంచి ఈ నిధులను అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులపై మరో అడుగు పడినట్లయింది. 10 బస్సుల కొనుగోలుకు నిధులు.. హైదరాబాద్ నగరానికి వన్నెలద్దిన డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి గతంలో తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రజారవాణాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ఆ బస్సులను తిరిగి ప్రవేశపెట్టడంపై ఆయన ఆసక్తి చూపారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులపై అప్పట్లో ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. రూట్ సర్వే నిర్వహించింది. బస్సుల కొనుగోళ్లకు టెండర్లను సైతం ఆహ్వానించింది. పలు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ నిధుల కొరత కారణంగా ఈ ప్రతిపాదన వాయిదా పడింది. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోళ్లు తెరమరుగైంది. భారీగా పెరిగిన అప్పుల కారణంగా కూడా ఆర్టీసీ సాహసం చేయలేకపోయింది. తాజాగా 10 డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోళ్లకు తన శాఖ నుంచి నిధులు కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఆర్టీసీ అధికారవర్గాలు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఆర్టీసీకి పూర్వవైభవం.. వైవిధ్యభరితమైన హైదరాబాద్ నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా జూపార్కు వరకు, సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకు, సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం తదితర రూట్లలో ఆకుపచ్చ రంగులో ఉండే రెండంతస్తుల డబుల్ డెక్కర్లు పరుగులు తీసేవి. ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్లు విధులు నిర్వహించేవారు. బస్సు రెండో అంతస్తులో కూర్చొని ప్రయాణం చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్ అందాలను విహంగ వీక్షణం చేస్తున్న భావన కలిగేది. కానీ నగరం విస్తరణ, అభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. పలు చోట్ల బస్సులు మలుపు తీసుకోవడం అసాధ్యమైంది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులను నిలిపివేశారు. మంత్రి కేటీఆర్ ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదించడంతో అప్పటి నుంచి ఇవి చర్చనీయాంశంగా మారాయి. మూడు రూట్ల ఎంపిక... డబుల్ డెక్కర్ బస్సుల కోసం మూడు రూట్లను ఎంపిక చేశారు. పటాన్చెరు–కోఠి (218), జీడిమెట్ల– సీబీఎస్, (9 ఎక్స్), అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం (118) రూట్లలో డబుల్ డెక్కర్లను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 10 బస్సుల కోసం ప్రతిపాదనలు రూపొందించారు. టెండర్లను ఆహ్వానించారు. నిధుల కొరత కారణంగా కొనుగోళ్లను నిలిపివేశారు. (చదవండి: అక్కడ చంద్రుడు.. ఇక్కడ రాముడు) -
భారతీయ విద్యార్థుల కోసం 130 బస్సులు
మాస్కో: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్, సుమీ నగరాల్లో చిక్కుబడి పోయిన భారతీయులు సహా విదేశీ విద్యార్థులను తమ దేశంలోని బెల్గోరోడ్ రీజియన్‌కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు 130 బస్సులను పంపను న్నట్లు రష్యా సైనిక ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. ఉక్రెయిన్‌లోని సంక్షోభ ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయాలంటూ భారత ప్రధాని మోదీ బుధవారం అధ్యక్షుడు పుతిన్‌ను కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా సైనికాధికారి కల్నల్–జనరల్ మిఖాయిల్ మిజిన్ట్సెవ్ తెలిపారు. ఈ బస్సులు బెల్గోరోడ్‌లోని నెఖొటెయ్వ్కా, సుడ్జా చెక్పాయింట్ల నుంచి ఖర్కీవ్, సుమీలకు వెళతాయని ఆయన చెప్పినట్లు అధికార టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. తిరిగి వచ్చాక చెక్పాయింట్ల వద్ద నుంచి తమ సైనిక విమానాల్లో గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు. (చదవండి: స్వదేశానికి మరో 798 మంది భారతీయులు) -
Telangana: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. 20% బస్సులు డిపోల్లోనే!
సాక్షి, హైదరాబాద్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పెరిగిన ఖర్చులు తగ్గించుకునేందుకు బస్సుల ట్రిప్పులు కుదించుకోవాలని ఆలోచిస్తోంది. కనీసం 20 శాతం ట్రిప్పులు తగ్గించి ఆ మేరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలనుకుంటోంది. కుదుటపడుతున్న సమయంలో.. కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో ట్రిప్పులు తిప్పలేకపోతోంది. ఇప్పుడిప్పుడే అన్ని బస్సులు ఊళ్లకు వెళ్తున్నాయి. పరిస్థితి క్రమంగా కుదుటపడుతుందని అనుకుంటున్న సమయంలో తాజా ‘డీజిల్ సంక్షోభం’ఆర్టీసీని మళ్లీ సమస్యల్లోకి నెట్టింది. ఆర్టీసీ నిత్యం సగటున 5 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఆర్టీసీ కొనే బల్క్ డీజిల్ లీటరు ధర రూ.92గా ఉంది. తర్వాతి రోజే అది రూ. 6 మేర పెరిగింది. దీంతో అంతకంటే తక్కువ ధర ఉన్న రీటైల్లో కొనటం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగుస్తూనే రిటైల్లోనూ రేట్లు పెరగుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ లీటరు ధర రూ.104కు చేరింది. యూపీ ఎన్నికలు ముగిసేనాటికి నాటికి రేటు రూ. 110ని మించుతుందని, ఆర్టీసీకి బల్క్ పర్చేస్ డిస్కౌంట్‌తో కలుపుకుంటే అది రూ.105 కంటే ఎక్కువే ఉంటుందని ఆర్టీసీ అంచనా. అదే జరిగితే రోజువారీగా అదనంగా రూ.65 లక్షల భారం ఆర్టీసీపై పడుతుంది. దీన్ని భరించటం అసాధ్యమని సంస్థ చెబుతోంది. అందుకే కనీసం 20 శాతం ట్రిప్పులను, ఆ మేరకు ఖర్చులను తగ్గించుకోవాలని ఆలోచిస్తోంది. చదవండి: (గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం) పెళ్లిళ్లూ లేకపోవడంతో.. సాధారణంగా ఆర్టీసీకి పెళ్లిళ్ల సీజన్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లకు కూడా విరామం వచ్చింది. మరో 20 రోజులు ముహూర్తాల్లేవు. శుభముహూర్తాలు లేకుంటే ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతుంది. బుధవారం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోనే నమోదైంది. ఇది ఇంకా తగ్గే అవకాశముంది. తక్కువ ఆక్యుపెన్సీ రేషియోను చూపి ట్రిప్పులను తగ్గించి అంతమేర బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది. నేరుగా జనంపై డీజిల్ భారం చాలినన్ని బస్సుల్లేక, కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేక పాత బస్సులనే ఆర్టీసీ నడుపుతోంది. వేల సంఖ్యలోని ఊళ్లకు రవాణా వసతిని అందించలేకపోతోంది. దీంతో జనం ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నారు. డీజిల్ ధర పెరగటంతో ఆటో చార్జీలూ భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ట్రిప్పులూ తగ్గితే, బస్సుల్లేవని ఆటోవాలాలు చార్జీలు పెంచే అవకాశం ఉంది. దీంతో డీజిల్ భారం నేరుగా జనం జేబుపై పడబోతోంది. -
విద్యార్థులను తరలించేందుకు గ్రీన్ చానల్!
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత విద్యార్థు లను ప్రత్యేక బస్సుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు తీసుకెళ్లి.. ఇతర దేశాల మీదుగా భారత్‌కు తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జెఫరోజియా, కీవ్, ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది, వారిని ఎలా తరలించాలన్న దానిపై సమాలోచ నలు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు తెలిపారు. దీనికి సంబంధించి ‘సాక్షి’ ప్రతినిధులకు వివరాలు వెల్లడించారు. విమానాలు నిలిపేయడంతో.. ఉక్రెయిన్‌కు చెందిన పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా అధీనంలోకి వెళ్లాయి. ఆ దేశ రాజధాని కీవ్ నగరానికి సమీపంలోకి రష్యా దళాలు చేరినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయని అక్క డున్న తెలుగు విద్యార్థులు తెలిపారు. ‘‘భారత విద్యార్థులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించ డంపై రష్యా, భారత్, ఉక్రెయిన్ అధికారుల మధ్య చర్చలు జరిగాయని భారత ఎంబసీ, యూని వర్సిటీ అధికారులు చెప్పారు. విమానాశ్రయాలన్నీ మూతపడటంతో రోడ్డు మార్గంలో సరిహద్దులకు తరలించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా గ్రీన్‌చానల్ ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం కుదిరిందని వివరించారు. విద్యార్థు లను ప్రత్యేక బస్సుల ద్వారా రుమేనియా, హంగరీ, ఇతర దేశాల సరిహద్దులకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ మార్గంలో ప్రయాణిం చేప్పుడు.. ముందుగానే ఉక్రెయిన్, రష్యా భద్రతా బలగాలకు, చెక్‌పోస్టులకు సమాచారం అందిస్తా రని, బస్సులపై భారత త్రివర్ణ పతకాన్ని ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కడా, ఎవరూ ఆపకుండా ప్రయాణించేలా (గ్రీన్ చానల్) చూస్తామని ఎంబసీ అధికారులు చెప్పారు. ఎవరూ ఎలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉండదని, క్షేమంగా భారత్‌కు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు..’’ అని విద్యార్థులు వివరించారు. తాము సమాచారం ఇచ్చేవరకు ఎవరూ బయటికి రావొద్దని, ప్రయాణానికి అవసర మైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారని వెల్లడించారు. చదువేమైపోతుందో? ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో చాలా మంది వైద్య విద్య (ఎంబీబీఎస్) అభ్యసిస్తు న్నారు. అందులో వందల మంది ఫైనలియర్లో ఉన్నారు. కొద్దిరోజులైతే పరీక్షలు కూడా పూర్తయి ఎంబీబీఎస్ పట్టాతో తిరిగివచ్చేవారు. నాలుగో ఏడాది చదువుతున్నవారికి కూడా ఒక్క ఏడాదైతే వైద్య విద్య చదువు పూర్తయ్యేది. ఇప్పుడు వారంతా తమ చదువు ఏమైపోతుందోనన్న ఆందోళనలో పడ్డారు. ముఖ్యంగా ఫైనలియర్ వారైతే.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వెళ్దామా, ఎలాగోలా కొంత కాలం ఉండి చదువు పూర్తి చేసుకుని, కల నెరవేర్చు కుందామా? అని తర్జనభర్జన పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులేమో తమ వారికి ఏమైనా అయితే ఎలాగన్న ఆవేదన చెందుతున్నారు. తక్కువ ఖర్చులో వైద్య విద్య కోసం.. ఉక్రెయిన్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉంది. అందుకే విదేశాల నుంచి చాలా మంది ఉక్రెయిన్‌కు వచ్చి చదువుకుం టుంటారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది ఉక్రెయిన్‌కు వెళ్లి ఎంబీబీ ఎస్ చేస్తున్నారు. ఇక్కడ నీట్లో మంచి ర్యాంకులు వచ్చినా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య తక్కువ. కన్వీనర్ కోటాలో సీట్లు దొరికితే సరి. మేనేజ్మెంట్ కోటాలో అయితే కోటి రూపాయలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ఉక్రెయిన్‌లో సుమారు రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్ కోసం ఉక్రెయిన్ వెళ్తున్నారని వివరిస్తున్నారు. వెంటాడుతున్న భయం విద్యార్థులను రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. భారత్‌కు క్షేమంగా చేరేవరకు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వెంటాడుతోందని తెలుగు విద్యార్థులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉక్రె యిన్ రాజధాని కీవ్, పలు ఇతర నగరాల్లో దాడులు జరుగుతున్నాయని.. అక్కడి యూనివర్సిటీల్లో ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా రని అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లోని బంకర్లలో తలదాచుకునేందుకు ఇతరులను కూడా అనుమతి స్తున్నారని, ఏమైనా సమస్యలు చెప్పుకోవడానికి అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదని కీవ్ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థి సుకన్య తెలి పారు. ఇక జెఫరోజియా యూనివర్సిటీ ప్రాం తంలో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులేమీ లేవని, కానీ భయం భయంగానే ఉందని నిజామాబాద్‌కు చెందిన విద్యార్థి స్వప్న తెలిపారు. తమను భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైందని యూనివర్సిటీ అధికారులు చెప్పారని వివరించారు. ఒకవేళ బస్సుల్లో ఎక్కినా రష్యా స్వాధీనంలోకి వెళ్తున్న ప్రాంతాల్లో ప్రయాణించడం ఆందోళనగానే అనిపిస్తోందని విద్యార్థి రాహుల్ వర్మ చెప్పారు. కొంత ఊరట మమ్మల్ని భారత్‌కు తరలించేందుకు జరుగు తున్న ప్రయత్నాలు ఊరట కలిగిస్తున్నాయి. సరిహద్దులకు వెళ్లాలంటే దాదాపు 800 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాలి. ఇం దుకు కనీసం రెండు రోజులు పట్టే అవకాశ ముంది. ఏర్పాట్లు వేగంగా చేయాలని, త్వరగా తరలిం చాలని విద్యార్థులంతా కోరుతున్నారు. – జోత్స్న భార్గవి, విద్యార్థిని ఒకట్రెండు రోజులు గడిస్తేనే.. జెఫరోజియా వర్సిటీలో చదువుతున్న వాళ్లం దరం బంకర్లకు వెళ్తున్నాం. పరిస్థి తులు తీవ్ర రూపం దాల్చితే విదేశాలకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదు. భారత విద్యార్ధులను, ఉద్యోగులను బస్సుల్లో పోలాండ్, హంగేరీ, రొమేనియా దేశాలకు పంపేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోరోజు గడిస్తే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేం. డబ్బులు కూడా అయిపోవచ్చాయి. – వెంకటేశ్, జెఫరోజియా ఎంబీబీఎస్ విద్యార్ధి, -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
హైదరాబాద్ రోడ్లపై 300 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఫేమ్ పథకం కింద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని నష్టాలపాలైన ఆర్టీసీ, ఈసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఫేమ్–2 పథకం కింద గతంలో మంజూరైన 325 ఏసీ బస్సులు వదులుకున్న ఆర్టీసీ, ఆ కేటాయింపులో భాగంగా నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసే బాధ్యతను కేంద్రం ఇటీవల తన అధీనంలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) అనుబంధ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్)కు అప్పగించింది. ఆ సంస్థ తాజాగా 5,580 బస్సులకు టెండర్లు పిలిచింది. హైదరాబాద్‌కు 300 బస్సులను కేటాయించింది. 2019 ఆర్టీసీ సమ్మె తర్వాత దాదాపు వెయ్యి బస్సులను హైదరాబాద్‌లో తగ్గించారు. మరో వెయ్యి బస్సులు కాలం చెల్లి తుక్కు కింద మారిపోయాయి. మరోవైపు నగరశివారులో కొత్త కాలనీలు విస్తరించి జనాభా పెరగటంతో రవాణా సౌకర్యం మెరుగుపర్చాల్సిన అవసరం ఏర్పడింది. పెరిగిన అప్పుల కారణంగా దివాలా దశగా పయనిస్తున్న ఆర్టీసీకి బస్సులు కొనే స్థోమత లేదు. దీంతో పాత బస్సులతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. అయితే, వీటి వల్ల వాయుకాలుష్యం పెరిగిపోతుండటం గమనార్హం. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకోవాలని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త అద్దె అనుకూలంగా ఉంటేనే.. ప్రస్తుతం విమానాశ్రయానికి తిప్పుతున్న ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బస్సులను ఒలెక్ట్రా కంపెనీ తిప్పుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చే నాన్ ఏసీ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏసీ బస్సులకు చెల్లిస్తున్న అద్దె అంతే కొత్త కంపెనీలు కూడా కోట్ చేస్తాయని ఆర్టీసీ భావిస్తోంది. -
డబ్బులు తెద్దాం.. బస్సులు కొందాం
సాక్షి, హైదరాబాద్: కొత్త బస్సులకు నిధుల్లేక దిక్కులు చూస్తున్న ఆర్టీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. రోడ్లను మెరుగుపర్చడం, పర్యావరణహిత వాహనాలు, బస్సులు సమకూర్చుకోవటానికి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం అందిస్తుండటంతో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు 800 కొత్త బస్సులు కొనాలని, ఇందుకు రూ. 270 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తూ ప్రతిపాదన రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్లో ఇంకా రూ.500 కోట్లకు పూచీకత్తు ఇచ్చే వీలుంది. దాన్ని కలుపుకొంటూ వరల్డ్ బ్యాంకుకు పూచీ ఇస్తే ఆ నిధులు చేతికందుతాయని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. సిటీకి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరంలో తిప్పేందుకు కొత్తగా 320 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కేంద్ర పథకం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఫేమ్) లో భాగంగా వీటిని సమకూర్చుకోనుంది. ఈ పథకం రెండో విడతలో రాష్ట్రానికి 324 బస్సులు మంజూరయ్యాయి. అప్పట్లో ఏసీ బస్సులు తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు తీసుకున్న ఏసీ బస్సులు తెల్ల ఏనుగుల్లా మారి తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతుండటంతో ఆ మంజూరును వద్దనుకుంది. ఇప్పుడు అదే కేటాయింపులో భాగంగా ఏసీ బస్సులకు బదులు నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధుల ప్రతిపాదన అలాగే ఉంచి అదనంగా అద్దె బస్సులు తీసుకోవాలా, లేక ప్రతిపాదన సంఖ్య తగ్గించి అద్దెవాటితో సర్దుబాటు చేయాలా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్తగా కొనే బస్సులివే.. గరుడ ప్లస్ – 30, రాజధాని – 25, సూపర్ లగ్జరీ – 270, డీలక్స్ – 190, ఎక్స్‌ప్రెస్ – 30, సిటీబస్సులు – 210, పల్లెవెలుగు – 15 -
వాటిని కొనాలంటే కష్టం.. అద్దెకే ఇష్టం!
సాక్షి, హైదరాబాద్:భాగ్యనగర మనసు దోచిన డబుల్ డెక్కర్ బస్సుపై ఆర్టీసీ దోబూచులాడుతోంది. ఈ బస్సులను ఎలా తీసుకురావాలో అంతుచిక్కక తటపటాయిస్తోంది. ఒక్కో బస్సు ఖరీదు ఏకంగా రూ.70 లక్షలుగా కంపెనీ నిర్ధారించటంతో అంత ధర పెట్టి కొనడం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అలవాటైన అద్దె విధానాన్ని దీనికీ వర్తింపచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం సొంతంగా బస్సులను కొనడం కంటే అద్దెప్రాతిపదికన తీసుకోవడం మేలని భావిస్తూ భారీగా అద్దె బస్సులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు వేల అద్దె బస్సులు వినియోగిస్తున్న ఆర్టీసీ ఇటీవలే మరో 70 బస్సులకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇదే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది. అశోక్ లేలాండ్ ద్వారానే.. నగరంలో 2006 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. ఈ బస్సులతో నష్టాలు భారీగా వస్తుండటంతో ఆ తర్వాత వాటిని ఉపసంహరించు కుంది. కానీ ఇటీవల ఓ నగరవాసి ఆ బస్సులను గుర్తు చేస్తూ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ స్పందించి.. మళ్లీ ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపితే బాగుంటుందని రీట్వీట్ చేస్తూ దాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడకు ట్యాగ్ చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన పువ్వాడ.. కొత్త బస్సుల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ప్రయోగా త్మకంగా 20 బస్సులు తీసుకోవాలని నిర్ణయించిన ఆర్టీసీ అప్పట్లో టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కంపెనీని ఎల్–1గా ఎంపిక చేసింది. అది ఒక్కో బస్సుకు రూ.70 లక్షలు కోట్ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవటం, మామూలు బస్సుల అవసరం బాగా ఉన్నందున డబుల్ డెక్కర్ బస్సులు కొనేబదులు సాధారణ బస్సులకు ఆ నిధులు వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో అద్దెప్రాతిపదికన డబుల్ డెక్కర్ బస్సులు తీసుకోవాలని భావిస్తూ, ఆ బాధ్యతను అశోక్ లేలాండ్ కంపెనీకి అప్పగించాలని చూస్తోంది. ఆసక్తి ఉన్న సంస్థలను అద్దె పద్ధతిలో డబుల్ డెక్కర్ బస్సులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరనున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. మధ్యేమార్గంగా.. ప్రస్తుత పరిస్థితిలో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ సరికాదన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇటీవలే టీఎస్ఆర్టీసీతో పాటు ముంబైలో కూడా డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు పిలిచారు. వంద బస్సులు తీసుకోవాలనుకోగా, అశోక్ లేలాండ్ టెండరే ఖరారైంది. కానీ అక్కడ కూడా బస్సులు తీసుకునేందుకు తటపటాయిస్తూ తాజాగా టెండర్‌ను రద్దు చేసుకుంటున్నట్టు తెలిసింది. ముంబైలోనే వద్దనుకున్నాక, తీవ్ర నష్టాల్లో ఉన్న తాము వీటిని ఎలా నిర్వహించగలమన్న యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. మధ్యేమార్గంగా అద్దె విధానాన్ని తెరపైకి తెస్తోంది. -
TSRTC: ఆర్టీసీ బస్సు.. అదరహో!
సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు. సొంత డిపోల్లోనే.. ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పట్లో రూ.4 కోట్ల దుబారా.. మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది. -
ట్వీట్ చేస్తే.. బస్సొచ్చె.. భలె భలె!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. డిపాజిట్ కూడా రద్దు చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణికులు ఇటీవల ట్వీట్ చేసిన సమస్యలపై అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన సమస్యలివీ... సమయానికి బస్సు రావడం లేదంటూ ఓ ప్రయాణికుడి ఫిర్యాదు.. మా ఊరికి బస్సు రాక ఏళ్లు అయితుంది.. మీరు బస్సు వేయిస్తారా?.. ఓ గ్రామ యువకుడి ప్రశ్న.. బస్సు సమయానికి రాక కాలేజీకి టైంకు చేరుకోలేకపోతున్నం.. పాఠ్యాంశాలు నష్టపోతున్నం.. ఓ విద్యార్థి వినతి.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.. మెస్సేజ్ రావడమే ఆలస్యం అన్నట్లు.. వెంటనే ఆయన స్పందించి రిప్లయ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. సాక్షి,నెన్నెల(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్ 16 నుంచి బస్సు ప్రారంభించారు. 30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్‌ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్ 21న ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది. కష్టాలు దూరమయ్యాయి మా ఊరికి 30ఏళ్ల కిందట సర్కార్ బస్సు వచ్చేది. అప్పట్లో రాకపోకలకు సౌలత్ ఉండేది. అధికారులు బస్సు బంద్ చేయడంతో ఇబ్బంది పడ్డాం. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడక, ఎడ్లబండే దిక్కయ్యేది. ప్రస్తుతం మా ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి. – చాపిడి పెంటక్క, కోనంపేట చదువులు మానొద్దని.. తాంసి(బోథ్): ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు. తిర్యాణి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర బస్సు ప్రారంభించారు. దీంతో 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంతోషంగా ఉంది దాదాపు 26 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం సంతోషంగా ఉంది. ఘాట్ రోడ్డు బాగాలేక ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 108 వాహనం కూడా వస్తోంది. పోలీసులకు రుణపడి ఉంటాం. – బోజ్జిరావు, ఉప సర్పంచ్, మంగి రెండ్రోజుల్లోనే.. సిరికొండ(బోథ్): మండల కేంద్రంతోపా టు చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇక్కట్లకు గురయ్యేవాళ్లం. మండల కేంద్రం నుంచి నిత్యం దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఉన్నత చదువులకోసం వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులేక పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సామాజిక కర్యకర్త రాథోడ్ మౌనిక సమస్యను ఆర్టీసీ ఎండీకి ట్వీట్ చేసింది. సజ్జనార్ రెండు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించారు. నిర్మల్ నుంచి బోథ్‌కు లింక్బస్సు బోథ్: హైదరాబాద్ నుంచి బోథ్‌కు రాత్రి సమయంలో నడిచే బస్సును లాభాలు రావడం లేదని గతంలో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ప్రజల ఇబ్బందులు గమనించిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్‌కుమార్ బస్సు పునరుద్ధరించాలని అక్టోబర్ 29న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన సజ్జనార్ నిర్మల్ నుంచి బోథ్‌కు ఉదయం 5 గంటలకు లింక్ బస్సును ఏర్పాటు చేశారు. గిరి గ్రామాలకు ఆర్టీసీ బస్సు పెంచికల్పేట్: మండలంలోని గుండెపల్లి, కమ్మర్గాం, నందిగామ, మురళీగూడ గ్రామాలకు గతేడాది మే నుంచి ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలు లేక పడుతున్న ఇబ్బందులపై నవంబరు 16న ‘సాక్షి’లో ‘అందని ఆర్టీసీ సేవలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన యువకులు కథనాన్ని ఎండీ సజ్జనా ర్కు ట్వీట్ చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత అధికారులు నవంబరు 19 నుంచి గిరి గ్రామాలకు బస్సు పునరుద్ధరించారు. హైదరాబాద్ బస్సు పునరుద్ధరణ ఖానాపూర్: ప్రతీరోజు ఉదయం 5 గంటలకు కడెం, ఖానాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోయింది. బస్సు సేవలు పునరుద్ధరించాలని గత నెల 19న ఖానాపూర్‌కు చెందిన బీసీ యువజన సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోట సుమీత్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్ చేశాడు. స్పందించిన ఆర్టీసీ అధికారులు ఈ నెల 22 నుంచి బస్సు పునరుద్ధరించారు. చదవండి: డ్రైవింగ్ చేసేందుకు డోర్ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి.. -
రండి బాబు రండి.. సరికొత్త స్కీమ్‌తో ఆర్టీసీ ‘పెళ్లి సందడి’
సాక్షి,నిర్మల్: కోవిడ్ అనంతరం ఆర్టీసీ లాభాల బాట పడుతోంది. జిల్లాలోని నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు సీజన్ వారీగా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పిస్తూ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. పెళ్లిళ్లకు బస్సుల అద్దెపై ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. వివాహాలకు బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ రద్దు... పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సంస్థ టార్గెట్ పెట్టుకుంది. పెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేసింది. గతంలో మొత్తం చార్జీలో 20శాతం అ డ్వాన్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డిపాజిట్‌ను రద్దు చేయడంతో ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చార్జీలు తక్కువే... జిల్లాలో రెండు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇస్తున్నారు. అప్ అండ్ డౌన్ కలిపి గరిష్టంగా 200కిలో మీటర్ల దూరం ఉంటే బస్సులు కేటాయిస్తారు. 200కిలో మీటర్ల లోపు ఉన్న బస్‌లకు ఒకటిన్నర టికెట్ చార్జీ చేస్తున్నారు. అలాగే 200కిలో మీటర్ల పైన ఉన్న పల్లె వెలుగులకు 10శాతం మాత్రమే అదనంగా చార్జ్ చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏక్స్ప్రెస్ బస్సులకు 240 కిమీ మీటర్లకంటే ఎక్కువగా ఉంటే అదనపు చార్జీలు తీసుకోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను వివాహాలకు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్నా బస్సులను కేటాయిస్తారు. కనీస చార్జీ రూ.11,934 చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం.. జిల్లాలోని నిర్మల్ ఆర్టీసీ డిపోలో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 49 బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చారు. తద్వారా రూ.9,25,880 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల చార్జీలు తక్కువ కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణం కోరుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి గతంలో బస్సుల అద్దె కోసం అడ్వాన్స్ ఉండేవి. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు రద్దు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. పెళ్లిళ్ల కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి. – ఆంజనేయులు, డిపో మేనేజర్, నిర్మల్ చదవండి: డుగ్గు డుగ్గు బండి కాదండి.. కానీ భలేగా ఉందండి ! -
భద్రతకు డేంజర్ లోడ్ ఓవర్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దూలపల్లి నుంచి జీడిమెట్లకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి ఇది. పారిశ్రామిక వ్యర్థాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రవాణా అవుతాయి. నిత్యం 5 వేలకుపైనే లారీలు, అంతకు పదింతలుపైనే ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇంత కీలకమైన ఈ రోడ్డు చాలాచోట్ల గుంతల మయంగా మారింది. ఓవర్ లోడ్ వాహనాల కారణంగా.. కొత్తగా వేసిన మూడేళ్లలోనే ఈ స్థితికి చేరుకుందని స్థానికులు వాపోతున్నారు. నాసిరకం రోడ్లతో... ►సాధారణంగా సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్లు వేగాన్ని సరిగా అదుపు చేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్‌లోడ్ కారణంగా పటిష్టమైన రోడ్లపైనే వాహనాలు అదుపుతప్పుతుంటే.. నాసిరకం రోడ్లపై మరింతగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకట్రెండు వర్షాలకే పెచ్చులూడే రోడ్లపై అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ►రోడ్ల పునర్నిర్మాణం, మరమ్మతుల సమయంలో నాసిరకం సామగ్రిని వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పైగా హడావుడిగా నిర్మాణంతో నాణ్యతను గాలికి వదిలేస్తున్నారు. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో తారువేసే సమయంలో అది కనీసం 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల (లేయింగ్ టెంపరేచర్) సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కానీ దూరంలో ఎక్కడో తయారుచేసి, ఓపెన్ ట్రక్కుల్లో తరలిస్తున్న తారు 90డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంటోందని.. దానిని అలాగే పరిచి, రోలింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఇక తారు నాణ్యత (బిటుమినస్ తార్) 4.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉండాలని.. కానీ 3.5 శాతం నుంచి 4 శాతం వరకే ఉంటోందని పేర్కొంటున్నారు. ఇలాంటి తారును రోడ్డు రోలర్లతో తొక్కించడం వల్ల మొదట్లో బాగానే కనిపించినా.. కొద్దిరోజులకే దెబ్బతింటోందని స్పష్టం చేస్తున్నారు. చిన్నవానలకే రోడ్లకు పగుళ్లురావడం, పైపొర కొట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయని.. అలాంటి రోడ్లపై ఓవర్‌లోడ్ వాహనాలు తిరుగుతుండటంతో మరింత నష్టం కలుగుతోందని వివరిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళితే.. ►రహదారులపై వాహనాల బరువుతో పడే ఒత్తిడిని కిలోన్యూటన్ల (కిలోన్యూటన్ అంటే సుమారు 101 కిలోల బరువు)లో కొలుస్తారు. ఆయా రోడ్ల నిర్మాణ తీరు (అక్కడి నేల తీరు, వాడిన కంకర పరిమాణం, రోలింగ్, తారు (బిటుమినస్ తార్) నాణ్యత తదితర అంశాల)ను బట్టి అవి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. గ్రామాల మధ్య నిర్మించే సాధారణ రోడ్ల సామర్థ్యానికి, భారీ హైవేల సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. ►రోడ్లను నాసిరకంగా తక్కువ సామర్థ్యంతో నిర్మించినా, తక్కువ కెపాసిటీ ఉన్నరోడ్లపై పరిమితికి మించి ఓవర్‌లోడ్ వాహనాలు వెళ్లినా.. సదరు రోడ్లు దెబ్బతింటాయి. ►రాష్ట్రంలో 30 కిలోన్యూటన్ల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించిన రహదారులపై కూడా 60 కిలోన్యూటన్ల ఒత్తిడిపడే భారీ ఓవర్‌లోడ్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, ఇటీవల నిర్మించిన కొన్ని హైవేలు మినహా.. మిగతా రోడ్లన్నీ 40కిలోన్యూటన్లలోపు సామర్థ్యమున్న రోడ్లే కావడం గమనార్హం. ఇలాంటి ఈ రోడ్లపై ఇసుక, ఇటుక, కంకర, ఐరన్, గ్రానైట్స్, మార్బుల్స్ వంటి సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నారు. ►ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లపై ఒత్తిడి పెరగడం, ఆ వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే తీవ్ర వైబ్రేషన్ (ప్రకంపనాల)తో రోడ్ల బేస్ దెబ్బతింటుంది. పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆ పగుళ్లు, రంధ్రాల్లోకి వాన నీరు, గాలిచేరి రోడ్డు బలాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని రహదారి భద్రతా నిపుణులు చెప్తున్నారు. ఇలా కొద్దిగా దెబ్బతిన్న రోడ్లు వాహనాల రాకపోకలు జరిగిన కొద్దీ మరింతగా పాడైపోయి.. పెద్ద పెద్ద గుంతలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు, నగర శివారు రహదారులు, లోపలి రోడ్లు కూడా ఇలా ఓవర్‌లోడ్ వాహనాల వల్ల దెబ్బతింటున్నాయని చెప్తున్నారు. ఇది రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమేంటి? నాణ్యమైన రోడ్లు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయని, మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లపాటు వినియోగించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రెండు, మూడేళ్లకే మరమ్మతులు చేసినా దెబ్బతింటున్నాయి. ►ఓవర్‌లోడ్ కారణంగా డ్రైవర్లు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఓవర్‌లోడ్, రోడ్లపై గుంతలు కలిసి వాహనాల టైర్లు పేలిపోయి ఇతర వాహనాలను ఢీకొట్టడం, బోల్తాపడటానికి కారణమవుతున్నాయి. ►రోడ్లపై తారు కొట్టుకుపోవడం, కంకర తేలడం, గుంతలు పడటం కారణంగా సాధారణ వాహనాలు కూడా అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. పగిడిపాల ఆంజనేయులు ఓవర్‌లోడ్ వాహనాలు రహదారి భద్రతకు పెనుముప్పుగా మారాయి. పరిమితికి మించిన బరువుతో పరుగులు తీస్తున్న సరుకు రవాణా లారీలు, ప్రైవేట్ బస్సుల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలు దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ప్రధాన రహదారులపై పరిస్థితిని గమనించింది. నిత్యం వేలకొద్దీ లారీల్లో ఇసుక, కంకర, మట్టి, గ్రానైట్, ఐరన్, మార్బుల్స్ తదితర సామగ్రిని పరిమితికి మించిన బరువుతో తరలిస్తున్నట్టు గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. వరంగల్ నుంచి వర్ధన్నపేట మీదుగా తొర్రూరు, మహబూబాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఇది. నిత్యం ఆర్టీసీ బస్సులు, మైనింగ్ లారీలు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్లే మైనింగ్ లారీల కారణంగా రోడ్డు చాలా చోట్ల దెబ్బతిన్నది. దీనితో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ –చించొల్లి అంతరాష్ట్ర రహదారి దుస్థితి. ప్రస్తుతం రోడ్డు సామర్థ్యం 20 టన్నుల బరువులోపే. కానీ 30 టన్నులకుపైగా బరువుతో రోజూ వందలాది లారీలు ప్రయాణిస్తున్నాయి. దీనికితోడు రోడ్డు నాణ్యతా లోపం కారణంగా.. అడుగుకో గుంత అన్నట్టుగా తయారైంది. రోడ్ల సామర్థ్యం కాస్త పెరిగినా.. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ జరిగింది. సామర్థ్యం ఎక్కువగా ఉండే నాలుగులైన్ల రహదారులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గతంలో ఉన్న నిబంధనలను సవరించిన రవాణాశాఖ.. టైర్ల సంఖ్యకు అనుగుణంగా సుమారు 3 టన్నుల చొప్పున వాహనాల రవాణా బరువు పరిమితిని పెంచారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఓవర్‌లోడ్ రవాణాకు ఇది ఏమాత్రం దగ్గరగా లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి ఇసుక, కంకర, ఐరన్, గ్రానైట్ వంటి సామగ్రిని రవాణా చేస్తున్న వాహనాలు యథేచ్చగా లోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. ►ఒకవైపు రాజకీయ నాయకుల జోక్యం, మరోవైపు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఏడాదిన్నర కాలంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలను నిలిపివేశారు. దీంతో బాహాటంగానే ఓవర్‌లోడ్ సరుకు రవాణా సాగుతోంది. ►ఓవర్‌లోడ్, రోడ్లు దెబ్బతినడంపై రవాణా శాఖ ఉన్నతాధికారులను సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా.. వారి నుంచి స్పందన రాలేదు. నిబంధనలు ఏమిటి? ►రవాణాశాఖ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల లారీల్లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే తీసుకెళ్లాలి. కానీ 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. ►12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల వరకు అనుమతి ఉంటుంది. అయినా 45 టన్నుల వరకు ఇసుక, ఐరన్, గ్రానైట్ వంటివి రవాణా చేస్తున్నారు. ►6 టైర్ల సాధారణ లారీల్లో 18 టన్నుల వరకు బరువును తీసుకెళ్లవచ్చు. కానీ వాటిలో 25 టన్నుల వరకు వివిధ రకాల వస్తువులను రవాణా చేస్తున్నారు. ►హైదరాబాద్‌లోని జీడిమెట్ల, బాలానగర్, మియాపూర్, బొల్లారం, నాచారం, చర్లపల్లి, ఉప్పల్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వివిధ రకాల రవాణా వాహనాలు, వ్యర్ధాల తరలింపు లారీలు పరిమితికి మించిన లోడ్‌తో రహదారి భద్రతకు సవాల్‌గా మారుతున్నాయి. ►చాలా వాహనాల్లో పరిమితికి మించి 10 నుంచి 20 టన్నుల మేర ఎక్కువ బరువును రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే రహదారిలో సుచిత్ర ప్రాంతం వద్ద రోడ్డు దుస్థితి ఇది. కనీసం 10 ఏళ్లు ఉండాల్సిన రోడ్డు.. వేసిన రెండు, మూడేళ్లకే చాలా చోట్ల గుంతలు పడి, తారు కొట్టుకుపోయి దెబ్బతిన్నదని స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్లు ఇలా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతోనూ.. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు ఇసుక పెద్ద ఎత్తున రవాణా అవుతుంది. రోజూ కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 10 వేల లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. కేవలం 18 టన్నుల సామర్ధ్యం ఉండే ఆ లారీల్లో 25 టన్నులకుపైగా ఇసుకను నింపి రవాణా చేస్తున్నారు. రోజూ రాత్రిళ్లు వేలాది లారీలు వేగంగా రహదారులపై ప్రయాణిస్తున్నాయి. ఉప్పల్, అల్వాల్, తిరుమలగిరి, కర్మన్‌ఘాట్, చంపాపేట్, కూకట్పల్లి తదితర అడ్డాలకు.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలకు ఇసుక రవాణా చేస్తున్నాయి. ఇలా ఓవర్‌లోడ్ తరలింపును అరికట్టడంలో రవాణాశాఖ విఫలమవుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది లారీ యజమానుల నుంచి ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బస్సులా?.. సరుకు రవాణా వాహనాలా..? ప్రైవేటు బస్సులు చాలా వరకు సరుకు రవాణా వాహనాలుగా కూడా మారిపోతున్నాయి. లగేజీ బాక్సులతోపాటు బస్సుల టాప్‌పై కూడా సరుకులను నింపి రవాణా చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికులు, వారి లగేజీకి తోడు అదనంగా సరుకులతో బస్సులు ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, బెంగళూర్ తదితర ప్రాంతాలకు బట్టలు, ఐరన్, ద్విచక్ర వాహనాలు వంటివాటిని బస్సుల్లో తరలిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, బహదూర్‌పురా, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో.. బస్సుల్లో తరలిస్తున్న ఇనుప షీట్లు, బట్టలు, వివిధ రకాల ఇనుప వస్తువులు, ఎలక్ట్రికల్ విడిభాగాలను గుర్తించడం గమనార్హం. ఇప్పటికీ కూకట్పల్లి, మియాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ప్రైవేట్ బస్సుల్లో క్వింటాళ్ల కొద్దీ సరుకు రవాణా జరుగుతూనే ఉంది. ఓవర్‌లోడ్‌తో రోడ్లకు పగుళ్లు ఇటీవల కాలంలో పలుచోట్ల రోడ్ల సామర్థ్యాన్ని పెంచారు. కానీ ఓవర్‌లోడ్ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయి. లక్ష టన్నుల బరువు మోయాల్సినరోడ్డుపై ఏకంగా కోట్ల టన్నుల బరువు మోపితే ఎలా ఉంటుంది? ఓవర్‌లోడ్ కారణంగా రోడ్ల బేస్మెంట్ నుంచి పగుళ్లు వచ్చి దెబ్బతింటాయి. అంతిమంగా రహదారి భద్రతకు ఇది ముప్పు. – ప్రొఫెసర్ గోపాల్‌నాయక్, రోడ్డు నిర్మాణ నిపుణుడు వాహనాలను నియంత్రించలేక ప్రమాదాలు ఓవర్‌లోడ్ వల్ల డ్రైవర్లు వాహనాలను నియంత్రించలేక పోతున్నారు. ప్రమాదాలను నివారించే అవకాశమున్న సందర్భాల్లో కూడా.. ఓవర్‌లోడ్ వల్ల వాహనాలను అదుపు చేయలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు డివైడర్లను ఢీకొంటున్న సంఘటనల్లో చాలా వరకు ఓవర్‌లోడే ప్రధాన కారణం. – సి.రామచంద్రయ్య, రహదారి భద్రత నిపుణుడు -
AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో తొలిసారిగా 100 ఎలక్ట్రిక్ బస్సులు (ఇ–బస్సులు) ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. తిరుమల, తిరుపతిలలో ఈ 100 ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ఇటీవల టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అందుకు రాయితీ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా ఆమోదం తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతిలలో మొత్తం 250 ఇ–బస్సులను అద్దె విధానంలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టెండర్లు పిలిచింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అద్దె డీజిల్ బస్సుల రేట్లకు మించకుండా ఇ–బస్సులకు టెండర్లను ఆమోదించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కానీ విశాఖపట్నం, విజయవాడ, కాకినాడలలో సర్వీసులకు పలు సంస్థలు డీజిల్ బస్సు ధరల కంటే చాలా అధికంగా కోట్ చేశాయి. దీంతో ప్రస్తుతానికి ఆ నగరాల్లో ఇ–బస్సు సర్వీసుల అంశాన్ని వాయిదా వేశారు. తిరుమల, తిరుపతిలలో సర్వీసులకు కూడా డీజిల్ బస్సుల ధరలకంటే అశోక్ లేల్యాండ్, ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాస్త ఎక్కువగా కోట్ చేయడంతో ఆర్టీసీ ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. చివరకు డీజిల్ బస్సుల ధరలకే ఎల్–1గా నిలిచిన ఈవే ట్రాన్స్ లిమిటెడ్‌కు తిరుమల–తిరుపతిలలో 100 బస్సులకు టెండరును ఖరారు చేసింది. త్వరలో సీఎంతో ప్రారంభోత్సవం 100 ఇ–బస్సుల్లో తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 50 బస్సులు, తిరుపతి నుంచి కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటలకు మరో 50 బస్సు సర్వీసులను ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్టీసీ త్వరలో అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వనుంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తిరుమల, తిరుపతిలలో ఇ–బస్సు సర్వీసులకు ప్రారంభోత్సవం చేయించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తదుపరి దశలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలలో కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
పల్లెవెలుగుకు చీకట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇటు సిటీ, అటు ఊళ్లకు జీవనాడిగా ఉన్న ఆర్డినరీ బస్సులను భారీగా తగ్గించుకునేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. వాటి స్థానంలో దూరప్రాంతాలకు తిప్పే బస్సులను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. సిటీ, పల్లె వెలుగు బస్సులే ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలను భారీగా పెంచుతున్నాయి. దూరప్రాంతాలకు తిరిగే బస్సుల ద్వారా ఆదాయం ఎక్కువగా ఉండటంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించే దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ.. అప్పులు తెస్తే తప్ప ఎలాంటి పనులు చేయలేని దుస్థితికి చేరుకుంది. ప్రతినెలా ప్రభుత్వం నిధులు ఇస్తేగానీ సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టాలు భారీగా పెరిగి సంస్థను నిర్వహించే పరిస్థితి ఉండదన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. నష్టాలను తెచ్చిపెడుతున్న బస్సులను తగ్గించుకుంటూ రావాలనే నిర్ణయానికి వచ్చింది. సిటీలో ట్రాఫిక్‌తో నష్టం ప్రస్తుతం నగరంలో దాదాపు 3,600 సిటీ బస్సులున్నాయి. కోవిడ్ కంటే ముందు దాదాపు 35 లక్షల మంది ప్రయాణికులు నిత్యం వాటిల్లో రాకపోకలు సాగించేవారు. కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నందున రోజురోజుకు బస్సుల సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ముంబైలో లోకల్ రైళ్లలాగా హైదరాబాద్‌లో సిటీ బస్సులు లైఫ్‌లైన్‌గా మారాయి. కానీ ట్రాఫిక్ వల్ల ఈ బస్సులతో నష్టం వస్తోంది. ఇటీవలి కాలంలో డీజిల్ ధరలు, సిబ్బంది జీతాలు భారీగా పెరగటంతో ఖర్చు బాగా పెరిగి నష్టాలు కూడా మరింత పెరిగాయి. దీనికితోడు నగరంలో మెట్రో రైలు సేవలను విస్తరిస్తుండటంతో సిటీ బస్సుల అవసరం కొంత తగ్గుతుందన్నది కూడా ఆర్టీసీ యోచన. జీపులు, ఆటోలతో ముప్పు.. అటు పల్లె వెలుగు బస్సులకు ఆటోలు, జీపులతో పెద్ద ము ప్పు ఏర్పడింది. ఇది వరకు ఊరి ప్రయాణికులు బస్సు వచ్చే వరకు ఎదురు చూసేవారు. కొన్నేళ్లుగా స్వయం ఉపాధి పేరు తో ఊళ్లలో ఆటోలు, జీపులు బాగా పెరిగిపోయాయి. ఫలి తంగా జనం బస్సుల కోసం చూడకుండా ఆటోనో, జీపో ఎక్కి వెళ్లిపోతున్నారు. ఇవి కూడా ఆర్టీసీకి నష్టాలను పెంచా యి. ప్రతి కిలోమీటరుకు సగటున రూ.28 నుంచి రూ.30 వరకు ఆదాయం వస్తుంటే ఖర్చు రూ.50 వరకు ఉంటోంది. కి.మీ.కి రూ.20 నష్టం వస్తోంది. అడ్డూఅదుపూ లేని డీజిల్ ధరలతో భవిష్యత్తులో ఇంధన భారం సంస్థకు శరాఘా తంగా పరిణమిస్తుందని ఆర్టీసీ భావిస్తోంది. కోవిడ్ రాక ముందు వార్షిక నష్టాలు రూ.వేయి కోట్లను మించగా, ప్రస్తు త ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రూ.900 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకు అప్పులు రూ.3 వేల కోట్ల వరకు ఉండగా, బకాయిలు రూ.2,500 కోట్లకు చేరుకున్నాయి. మరింత పెరగనున్న ఆటోలు, క్యాబ్‌లు కొంతకాలంగా రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆటోలు 4.42 లక్షలు, మోటార్ క్యాబ్‌లు 1.14 లక్షలుండగా, మ్యాక్సీ క్యాబ్‌లు 31 వేలు దాటాయి. ఇప్పటికీ అధికారులు యువతకు ఉపాధి పేరుతో ఆటోలు, క్యాబ్‌లను మంజూరు చేస్తున్నారు. కొత్తగా వస్తున్న పథకాలతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. అప్పుడు కష్టాలు మరింత పెరుగుతాయన్న ఆందోళన ఆర్టీసీని వెంటాడుతోంది. ఈనేపథ్యంలో దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను పెంచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది జరగాలంటే ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనాల్సిందే. కానీ అంత ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం గ్రాంటు ఇవ్వడమో, పూచీకత్తుతో మరిన్ని రుణాలను మంజూరు చేయడమో జరగాలి. ఇది ప్రభుత్వానికి కూడా భారమే. దీంతో అవసరమైతే దూరప్రాంత సర్వీసులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. -
రైట్.. రైట్.. గచ్చిబౌలి టు శంషాబాద్
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగురోడ్డుపై మినీ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు గచ్చిబౌలి–శంషాబాద్ మార్గంలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టారు. డిమాండ్కనుగుణంగా ఇతర మార్గాల్లోనూ బస్సుల విస్తరణకు గ్రేటర్ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. కొంతకాలంగా నగరంలో మెట్రో రైళ్ల నుంచి ఎదురవుతున్న పోటీ, కోవిడ్ దృష్ట్యా ప్రజా రవాణా రంగంలో నెలకొన్న స్తబ్దత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. నష్టాల బాటలో.. నగర శివారు ప్రాంతాల అవసరాల మేరకు మార్గాలను ఎంపిక చేసుకొని బస్సులను నడుపుతున్నారు. దశలవారీగా సుమారు ఏడాది పాటు సిటీ బస్సులు నిలిచిపోవడంతో తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సివచ్చింది. సాధారణంగా రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం లభించాల్సిన గ్రేటర్ ఆర్టీసీకి కోవిడ్ కాలంలో రోజుకు రూ.50 లక్షలు కూడా లభించలేదు. నష్టాలను అధిగమించేందుకు ప్రయాణికులకు చేరువయ్యేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రయాణికుల చెంతకే.. ఔటర్‌పై ప్రైవేట్ వాహనాల రాకపోకలు ఎక్కువ. దీంతో వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడా ఈ వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు తాజాగా మినీ బస్సులను ప్రవేశపెట్టింది. 30 సీట్ల సామర్ధ్యం ఉన్న ఈ బస్సులు రోజుకు 76 ట్రిప్పులు తిరుగుతాయి. ప్రతిరోజూ సుమారు 5 వేల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం లభించనుంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు రూ.35 టికెట్ చార్జీ. ఈ బస్సుల్లో ఎలాంటి పాస్‌లను అనుమతించబోమని ఆర్ఎం వెంకన్న తెలిపారు. -
సికింద్రాబాద్‌లో విషాదం.. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి
సాక్షి, సికింద్రాబాద్: రేతిఫైల్ బస్టాప్ వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. రెండు బస్సుల మధ్య ప్రమాదశాత్తూ ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, అతనికి సాయం చేసేందుకు ప్రయాణికులెవరూ దగ్గరకు కూడా వెళ్లలేదు. తీవ్ర గాయాలతో కాపాడండీ అంటూ ఆ యువకుడు అరగంట పాటు ఆర్తనాదాలు చేసిన ఎవరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి ఆర్టీసీ సిబ్బంది ‘108’కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపు ఆ యవకుడు ప్రాణాలు విడిచాడు. చదవండి: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం.. మావోయిస్టుల ఇళ్లకు రాచకొండ పోలీసులు -
హైదరాబాద్ మహానగరంలో 25 డబుల్ డెక్కర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో నగరానికి ప్రత్యేకాకర్షణగా ఉండి నష్టాల కారణంగా కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగరవాసులకు కనువిందు చేయబోతున్నాయి. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఆ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది. రెండు నెలల క్రితం నగరవాసి ఒకరు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేసుకుంటూ నాటి బస్సు ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్, తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఉన్న అనుభూతులను నెమరేసుకుంటూ ‘అప్పట్లో డబుల్ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన ఆయన, వెంటనే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు. రూట్ నెం.229 (సికింద్రాబాద్ – మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్–పటాన్చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్డు), రూట్ నెం. 218 (కోఠి–పటాన్చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9ఎక్స్ (సీబీఎస్–జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. -
అగ్నిప్రమాదం..నారాయణ కాలేజీ బస్సులు దగ్ధం
విశాఖ : విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. నారాయణ కాలేజీకి చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే పార్క్ చేసిన బస్సులు దగ్ధం అవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులు నిలిపి ఉంచిన స్థలంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్కింగ్‌లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డెహరాడూన్లో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: డెహరాడూన్ పౌరులు మొదటిసారిగా శబ్దం లేని, జీరో ఎమిషన్‌తో కూడిన ఎలక్ర్టిక్ బస్సులలో ప్రయాణం చేయబోతున్నారు. ఈ బస్సులను దేశంలో ఎలక్ర్టిక్ ప్రజా రవాణా వ్యవస్థలో అగ్రగామి అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ అందిస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేది సింఘ్ రావత్ శుక్రవారం ఈ బస్సులకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రావత్ మాట్లాడుతూ “ఈ సంవత్సరంలో 30 ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ బస్సులు డెహరాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ కొండ ప్రాంతాల్లో కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తాయని" తెలిపారు. (చదవండి: కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) తొమ్మిది మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్, 25 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు వీల్ చెయిర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ నియంత్రిత ఎయిర్ సస్పెన్షన్ తో ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణం పొందగలరు. ప్రయాణికుల రక్షణ కొరకు బస్సులో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా బస్సులో హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంప్, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ సాకెట్ ఉంటుంది. బస్సులో అమర్చిన లిథియమ్-ఇయాన్ (Li-ion) బ్యాటరీని ఒకసారి చార్జింగ్ ద్వారా దాదాపు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ అత్యాధుని సాంకేతిక ఎలక్ట్రిక్ బస్సులో ఉన్న ప్రత్యేకమైన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా ప్రయాణంలో ప్రతిసారి బ్రేక్ వేసినప్పుడు కోల్పోయిన చార్జింగ్‌ను కొంతమేరకు తిరిగి పొందుతుంది. ఇందులో ఉన్న అతి శక్తివంతమైన ఏసీ చార్జింగ్ వ్యవస్థ ద్వారా బ్యాటరీ 3 నుంచి 4 గంటల్లో మొత్తం చార్జింగ్ అవుతుంది.(చదవండి: లాజిస్టిక్స్ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్) ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను మరో రాష్ట్రంలో కూడా నడపడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్ జీవావరణాన్ని సంరక్షించడంలో భాగం ఈ ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయన్నారు. సమర్థవంతమైన విద్యుత్ ప్రజా రవాణా వ్యవస్థతో కాలుష్యాన్నితగ్గించే కృషిలో ఒలెక్ట్రా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఉత్తరాఖండ్ లో కూడా ప్రవేశపెట్టిన ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా తమ సేవలు అందిస్తాయని తెలిపారు. ఇప్పటికే ముంబాయి, పూణె, నాగ్ పూర్, హైదరాబాద్, కేరళలో తాము అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తమ ప్రామాణికతను సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. ఒలెక్ట్రా కంపనీ ఇప్పటికే వివిద రాష్ట్రాలలో 280 బస్సులను సరఫరా చేసింది. దేశ రహదారులపై పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే 2 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. CO2 ఉద్గారాలను 13000 టన్నుల మేరకు తగ్గించింది. ఇది లక్ష చెట్లు నాటాడానికి సమానం. మనాలి నుండి రోహ్తాంగ్ పాస్ వరకు ఎత్తైన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపనీ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదయింది. ఎలక్ర్టిక్ బస్సు నిర్మాణ రంగంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది అలాగే FAME-II లో భాగంగా మంజూరు చేసిన 5595 బస్సుల్లో 20 శాతం మేరకు ఒప్పందాలను సాధించింది. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపాణి రేపు (శనివారం) ఒలెక్ట్రా ఎలక్ర్టిక్ బస్సుల ట్రయల్ రన్ కు సూరత్ లో ప్రారంభించనున్నారు. సూరత్ మునిసిపల్ కార్పోరేషన్ కు ఒలెక్ట్రా కంపనీ 150 ఎలక్ర్టిక్ బస్సులను దశల వారీగా సరఫరా చేయనుంది. అలాగే సిల్వాసా కు కూడా 25 ఎలక్ర్టిక్ బస్సులను అందిస్తుంది. వీటి ట్రయల్ రన్ వచ్చే వారం చేయబోతున్నారు. ఫేమ్-II లో భాగంగా వివిధ రాష్ట్రాలకు 775 ఎలక్ర్టిక్ బస్సులను ఒలెక్ట్రా దశల వారీగా అందించనుంది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2000లో స్థాపించబడింది. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపనీ. 2015లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ కావడం విశేషం. -
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు..?
సాక్షి, హైదరాబాద్ : నిజాం కాలంలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి. తాజాగా షాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేయడంతో వాటిపై మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు బస్సులు తిరిగేవని, ఇప్పుడు మళ్లీ అలాంటి డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని కేటీఆర్‌ను కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. తాను అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకునే రోజుల్లో ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని, వాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. అయితే ఆ బస్సులను ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని, మళ్లీ హైదారాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ సూచించారు. I have many fond memories of riding the double decker bus on my way to St. George’s Grammar School at Abids 😊 Not sure why they were taken off the roads. Any chance we can bring them back Transport Minister @puvvada_ajay Garu? https://t.co/ceEGclQLFz — KTR (@KTRTRS) November 7, 2020 విజయవంతంగా ఎలక్ర్టిక్ బస్ ట్రయల్స్ తిరుమలలో రెండవరోజు నిర్వహించిన ఎలక్ర్టిక్ బస్ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. మొత్తం మూడు రోజులపాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. తిరుమల పవిత్రత, కాలుష్య నివారణలో భాగంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఈ బస్సులను నడపాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు ఎలక్ర్టిక్ బస్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. మూడవ రోజు కూడా ట్రయల్స్ నిర్వహించి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలక్ట్రికల్ బస్ ట్రయల్స్‌లో డ్రైవర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్టు ఏపియస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. -
కల్లం వద్దకు కార్గో బస్సు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల రవాణా తీరు మారిపోయింది. బండ్లు పోయి బస్సులొ చ్చాయి. కల్లాల వద్ద కార్గో బస్సులు దర్శనమిస్తున్నాయి. కల్లాల నుంచి ఇళ్లకు వరి ధాన్యం తరలించడానికి ఇదివరకు ఎడ్లబండ్లు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కార్గో బస్సులు వచ్చాయి. కల్లంలో ఒడ్లు సిద్ధం కాగానే వాటిని ఎడ్లబండి మీద ఇంటికి తీసుకెళ్లేవారు. తర్వాత ఊరికి లారీ రాగానే రైతులంతా మళ్లీ బండ్లకెత్తుకుని లారీలోకి మార్చేవారు. లారీలు అంతగా అందుబాటులో లేని సమయంలో ధాన్యాన్ని ఎక్కడికి తీసు కెళ్లాలన్నా ఎడ్లబండ్లే దిక్కు. ఇప్పుడు ఫోన్ చేయగానే నేరుగా కల్లం వద్దకే కార్గో బస్సు వస్తోంది. ధాన్యం ఎత్తుకుని రైస్ మిల్లుకంటే మిల్లుకు, కాదు మార్కెట్‌కంటే మార్కెట్‌కు తీసుకెళ్తోంది. ప్రస్తుతం 200 ఎర్రబస్సులు రైతులసేవలో పరుగుపెడుతున్నాయి. వానభయం ఉండదు.. ఎదురుచూపు లేదు.. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఈసారి కల్లాలు ధాన్యంతో కళకళలాడు తున్నాయి. దాదాపు కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని అంచనా. దీంతో పొలాల నుంచి రైస్ మిల్లులకు, మార్కెట్ యార్డులకు ధాన్యం తరలింపు పెరిగింది. రవాణావేళ వానొస్తే ధాన్యం తడిసిపోతుందే మోనన్న భయం ఇప్పుడు లేదు. స్థానిక డిపో బస్సులే కావటంతో ఆలస్యం అవుతుందన్న బెంగా లేదు. ప్రస్తుతం 150 పెద్ద బస్సులు, 50 మినీ బస్సులు కార్గో వాహనాలుగా పరుగులు పెడుతున్నాయి. అవసరానికి తగ్గట్టు మరిన్ని బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు ఇతర సరుకుల తరలింపులో బిజీగా ఉన్న ఆ బస్సులు ఇప్పుడు ధాన్యం తరలింపులో తలమునకలై ఉన్నాయి. గతంలో కనీసం 300 కి.మీ. బుక్ చేసుకోవాల్సి వచ్చేది. పైగా అప్ అండ్ డౌన్ ఛార్జీలూ భరించాల్సి ఉండేది. ఇప్పుడు 50 కి.మీ. పరిధిలో కూడా బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు కేవలం ఒకవైపు ఛార్జీ భరిస్తే సరిపోయేలా మార్చారు. 8 టన్నుల సామర్ధ్యం ఉండే బస్సు 50 కి.మీ.కు రూ.4,420, 75 కి.మీ.రూ.5,010, 100 కి.మీ. 5,600, 125 కి.మీ.రూ.6,190.. ఇలా ఛార్జీలతో అందుబాటులో ఉన్నాయి. ఇవి లారీల ఖర్చు కంటే తక్కువే అని ఆర్టీసీ చెబుతోంది. అయితే వ్యక్తిగతంగా రైతుల్లో ఇంకా ఆర్టీసీ కార్గో బస్సులపై అవగాహన రాకపోవటంతో ఆర్డర్లు తక్కువే ఉంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ డిపో మేనేజర్లు ఊళ్లలోకి బస్సులు తీసుకెళ్లి సర్పంచుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న నిడివి గల వీడియోలు రూపొందించి వాట్సాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్రమంగా రైతులు ఆర్టీసీ కార్గోకు చేరువవుతున్నారు. త్వరలో భారీ డిమాండ్: కృష్ణకాంత్, కార్గో ప్రత్యేకాధికారి ‘ఆర్టీసీ కార్గో బస్సులు రైతులకు ఎంతో ఉపయోగం. తక్కువ ఖర్చు, పూర్తి భద్రత ఉంటుంది. జవాబుదారీతనం కూడా ఉన్నందున రైతులు నష్టపోరు. ఇప్పుడిప్పుడే వారిలో అవగాహన పెరుగుతోంది. త్వరలో కార్గో బస్సులను భారీగా వినియోగించుకునే అవకాశం ఉంది’ -
ఏపీలో కోవిడ్ ప్రత్యేక బస్సులు
-
చలో పల్లె‘టూరు’
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్: ఒకపక్క కరోనా భయం.. హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ విధిస్తే తిరిగి ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు.. ఆ తరువాతా బతుకుబండి గాడిన పడే పరిస్థితి లేదని భావిస్తున్న ప్రజలు.. ‘అర్జెంటుగా హైదరాబాద్ విడిచిపెట్టి పోవాలె.. ఏదోలా ఇక్కడి నుంచి బయటపడాలె’అనుకుంటూ పల్లెబాట పడుతున్నారు. కలోగంజో తాగి బతకొచ్చనే భావ నతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. చాలామంది ఇళ్లు ఖాళీచేసి, సామాను సర్దుకొని వెళ్లిపోతున్నారు. మరికొందరు లాక్డౌన్ సమయాన్ని దృíష్టిలో ఉంచుకొని వెళ్తున్నారు. తొలిసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకొందరు ఊళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో రెండ్రోజులుగా హైదరాబాద్ నలువైపులా రహదార్లపై రద్దీ పెరిగింది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. విజయవాడ హైవేతో పాటు వరంగల్, హన్మకొండ, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, చేవెళ్ల తదితర మార్గాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్ – విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి రెండ్రోజులుగా రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. వాహనాలు ఎక్కువ వస్తుండడం, నగదు మార్గంలో బారులు తీరుతుండడంతో టోల్ సిబ్బంది వాహనదారుల వద్దకే వెళ్లి హ్యాండ్‌మిషన్ ద్వారా టోల్ రుసుము తీసుకుంటున్నారు. అటూఇటూ రద్దీ.. మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూపర్మార్కెట్లు, షాపింగ్ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద జనం నిత్యావసర వస్తువుల కోసం బారులు తీరుతున్నారు. లాక్డౌన్ కాలానికి సరిపడా సరుకులు కొని పెట్టుకోవాలనే ఆత్రుతతో దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. వైన్‌షాపుల వద్దా రద్దీ కనిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇతర బీదాబిక్కీ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాల్లేక కష్టపడ్డారు. సొంత వాహనాలున్న వారు అనుమతులు లభించక వెళ్లలేకపోయారు. అప్పటి అనుభవాలతో ఇప్పుడు ముందుజాగ్రత్తగా పల్లెలకు తరలివెళ్తున్నారు. నగరంలోని దాదాపు ప్రతి బస్తీ, కాలనీ నుంచి పల్లెబాట కొనసాగుతోంది. ఉద్యోగం, ఉపాధి కోసం ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ను నమ్ముకొని వచ్చిన వాళ్లు ట్రాలీ ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో ఇంటిసామానంతా సర్దుకొని వెళ్తున్న దృశ్యాలే ఎటుచూసినా కనిపిస్తున్నాయి. సొంత వాహనాలతో పాటు చివరకు బైక్‌లపై సైతం తరలిపోతున్నారు. బస్సు, రైళ్లకూ డిమాండ్ ఆర్టీసీ బస్సులు, రైళ్లకు రెండ్రోజులుగా డిమాండ్ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలకు హైదరాబాద్ నుంచి వెయ్యి బస్సులు నడుస్తున్నాయి. ‘ప్రయాణికుల డిమాండ్ ఇలాగే ఉంటే మరికొన్ని బస్సులను అందుబాటులోకి తెస్తాం’అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ప్రస్తుతం రోజుకు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 30 వేల మంది తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు నగరాలకూ రద్దీ పెరిగింది. విజయవాడ, విశాఖ వైపు వెళ్లే ప్రత్యేక రైళ్లలో 50 నుంచి 100 వరకు వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. ఇక, హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగించే దేశీయ విమాన సర్వీసులు 100 నుంచి 126కి పెరిగాయి. 63 సర్వీసులు హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు వెళ్తుండగా, మరో 63 సర్వీసులు నగరానికి చేరుకుంటున్నాయి. పాసులుంటేనే ఏపీలోకి అనుమతి కోదాడ: హైదరాబాద్‌లో త్వరలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో పలువురు సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నారు. అయితే పాస్‌లున్న వారినే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఆంధ్ర– తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రత్యేక పాసులున్న వారిని కూడా ప్రత్యేక మొబైల్ ల్యాబ్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమానితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నాకే అనుమతిస్తున్నారు. ఇళ్లలోకి రానివ్వట్లేదు కూతురుతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ బతికేవాళ్లం. కరోనా కారణంగా యజమానులు ఇళ్లలోకి రానివ్వట్లేదు. మళ్లీ లాక్డౌన్ పెడతారని అంటున్నారు. ఇక్కడుండి ఏం చేయాలి?. – సూర్యకళ, ధర్మవరం, తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ గిరాకీ లేదు.. ఏంజేయాలె! హైదరాబాద్ కొత్తపేట ప్రాంతంలో టీకొట్టు నడిపేవాడిని. కరోనా తరువాత ఎవరూ టీ తాగేందుకు రావట్లేదు. అందుకే ఉండలేక వెళ్లిపోతున్నా. – రమేష్, వాడపల్లి, నల్లగొండ జిల్లా -
వలస కూలీల కోసం 1000 బస్సులు
లక్నో: ప్రతిపక్ష నాయకురాలు ప్రియాంక గాంధీ అభ్యర్థన మేరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బస్సు నంబర్లతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వివరాలను ప్రియాంక గాంధీ కార్యాలయానికి పంపించారు. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది వలస కూలీలు మరణించగా.. 36మంది గాయపడ్డారు.(బారికేడ్లను బద్దలు కొడుతూ..) ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వలస కూలీల కోసం బస్సులను ఏర్పాటు చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రియాంక అభ్యర్థనపై స్పందించిన యోగి ప్రభుత్వం వలస కూలీల కోసం 1000 బస్సులను ఏర్పాటు చేసింది.(చితికిన బతుకులు) -
‘ప్యాకేజీ కాదు.. బస్సులు ఏర్పాటు చేయండి’
లక్నో: కరోనా వల్ల పట్టాలు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయనే చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్యాకేజీ పట్ల పేదలు ముఖ్యంగా వలస కార్మికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు కొందరు రిపోర్టర్లు ప్రయత్నించారు. మరి వారి స్పందన ఏంటో చూడండి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మీ సాహు అనే మహిళ ఉపాధి కోసం ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో వెళ్లారు. లాక్డౌన్ ప్రకటించడంతో సైకిల్‌పై 500కిలోమీటర్ల దూరాన ఉన్న సొంత ఊరికి ప్రయాణమయ్యారు. రిపోర్టర్లు లక్ష్మీని కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ గురించి ప్రశ్నించగా.. ‘ఈ వార్త గురించి విన్నప్పుడు కాస్త సంతోషమేసింది. కానీ ఈ ప్యాకేజీ వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. గతంలో కూడా ఓ ప్యాకేజీ ప్రకటించారు. డబ్బులు ఇస్తారు, రేషన్ ఇస్తారు అన్నారు. మూడు రేషన్ దుకాణాల్లో ఆధార్ కార్డు ఇచ్చాను.. కానీ మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ప్యాకేజీ సంగతి దేవుడెరుగు.. కనీసం మాకోసం బస్సులను అయినా ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం మమ్మల్ని కూడా పట్టించుకుంటుంది అని భావించే వాళ్లం. ప్రభుత్వ పథకాలు మాలాంటి వలస కూలీలకు అందడం లేదు. అందుకే సొంత ఊరికి వెళ్తున్నాం. కనీసం అక్కడ పొలం పనులయినా దొరుకుతాయి’ అని లక్ష్మీ సాహు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీలో తగ్గనున్న 2,080 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భారీగా బస్సుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్‌లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వెరసి 2,080 బస్సులు తగ్గిపోతున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్రంపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. తాజా నిర్ణయంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అద్దె బస్సులు వస్తుండటంతో.. సొంత బస్సుల నిర్వహణను తీవ్ర భారంగా భావిస్తున్న ఆర్టీసీ క్రమంగా వాటిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. వాటి స్థానంలో వీలైనన్ని అద్దె బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 అద్దె బస్సులు ఉండగా, వీటికి అదనంగా మరో పక్షం రోజుల్లో 1,334 బస్సులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెలాఖరుకు అవి రోడ్డెక్కబోతున్నాయి. కొత్తగా వస్తున్న అద్దె బస్సుల సంఖ్యతో సమంగా సొంత బస్సులను ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా నగరంలో 54 అద్దె బస్సులు చేరనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 800 బస్సులను తగ్గించినందున కొత్తగా ఇక తగ్గించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ఇక నగరం వెలుపల 1,280 అద్దె బస్సులు కొత్తగా వస్తున్నందున, అంతే సంఖ్యలో సొంత బస్సులను ఉపసంహరించుకోబోతున్నారు. వాటిల్లో ఎక్కువ బస్సులు బాగా పాతవే. వాటిని తొలగించి ఆ స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు తీసుకుంటోంది. మారుమూల గ్రామాలకు కష్టమే... రాష్ట్రవ్యాప్తంగా 800 గ్రామాలకు బస్సు వసతి లేకుండా పోయింది. కొత్త బస్సులు కొని వాటిల్లో కొన్ని ఊళ్లకు నడపాలని గతంలో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కొత్త బస్సులు కొనే పరిస్థితి లేకపోవటంతో చేతులెత్తేయాల్సి వస్తోంది. అదనంగా అద్దె బస్సులు వస్తున్నా, అంతే సంఖ్యలో సొంత బస్సులను తగ్గిస్తున్నందున అదనంగా ఒక్క ఊరికి కూడా బస్సు తిప్పే పరిస్థితి ఉండదు. అద్దె బస్సుల నిర్వాహకులు మారుమూల ఊళ్లకు బస్సులు తిప్పేందుకు ఆసక్తి చూపరు. లాభాలు వచ్చే రూట్లలోనే వారు తిప్పుతారు. వెరసి దూరంగా ఉండే ఊళ్లపై దుష్ప్రభావం తప్పేలా కనిపించటం లేదు. హైదరాబాద్‌ను గ్యాస్‌చాంబర్‌గా మార్చొద్దు.. నగరంలో భారీ సంఖ్యలో బస్సులను తగ్గించటం వల్ల సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగి కాలుష్యం తీవ్రమవుతుందని, ఇది ఢిల్లీ తరహాలో నగరం గ్యాస్‌చాంబర్‌గా మారేందుకు దోహదం చేస్తుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ట్రాఫిక్ చిక్కులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గించకూడదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్స్ మార్చటం వల్ల సమస్యకు పరిష్కారం: అధికారులు ఏయే ఊళ్లకు బస్సుల్లేవో ఎప్పటికప్పుడు గుర్తించి హేతుబద్ధీకరించటం ద్వారా షెడ్యూల్స్‌లో మార్పుచేర్పులు చేసి ఆయా ప్రాంతాలకు నడుపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఓఆర్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అద్దె బస్సులు రాగానే అదే తరహా కసరత్తు చేసి కొత్తగా కొన్ని ఊళ్లకు బస్సులు తిప్పుతామంటున్నారు. -
64 బస్సులను సీజ్ చేసిన అధికారులు
-
హలో.. ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: మీకు మరో చోటకు బదిలీ అయిందా.. అయితే మీ ఇంటి సామగ్రి తరలించేందుకు ఆర్టీసీకి ఫోన్ చేస్తే చాలు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ తరహాలో సేవలకు మీ ఇంటి ముంగిటకు ‘ఎర్ర బస్సు’వచ్చి ఆగుతుంది. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించబోతున్న కార్గో సేవల్లో ఇదీ ఓ భాగమే. ఒక పట్టణం నుంచి మరో పట్టణం, దూర ప్రాంతాలకు ఇంటి సామగ్రి తరలించేందుకు కూడా ఆర్టీసీ సై అంటోంది. డీజిల్, సిబ్బంది ఖర్చు వచ్చేలా.. దూర ప్రాంతాలకే ఈ సేవలు ఉండనున్నాయి. ఇక ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తరలింపు కూడా ఆర్టీసీ కార్గో సర్వీసుల్లోనే సాగనుంది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, రేషన్ సరుకులు, ఎఫ్‌సీఐ గోదాములకు ధాన్యం, కూరగాయల తరలింపు.. ఇలా అన్నీ వీటిల్లోనే. ఇవే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి కూడా వస్తువుల తరలింపునకు బుకింగ్స్ తీసుకోబోతోంది. ఈ నెలాఖరుకు కార్గో సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత రాష్ట్రం పరిధిలోనే వీటి సేవలు ఉండనుండగా, వీలైనంత త్వరలో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. అక్టోబర్ నాటికి 822 బస్సులు.. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకునేందుకు కార్గో సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో 822 ప్రయాణికుల బస్సులను ఉపసంహరించుకుని వాటిని సరుకు రవాణా వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. ఆర్టీసీ మియాపూర్ బస్ బాడీ బిల్డింగ్ వర్క్‌షాపులో ఇప్పటికే 8 బస్సులను సిద్ధం చేసింది. ప్రతినెలా 50 చొప్పున బస్సులను ఇక్కడ మోడిఫై చేయనున్నారు. అక్టోబర్ నాటికి 822 బస్సులు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లోగా వాటిని సిద్ధం చేసే సామర్థ్యం ఆర్టీసీ యూనిట్‌కు లేకపోవటంతో మిగతావాటిని ప్రైవేటు వర్క్‌షాపుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు 50 బస్సులతో కార్గో విభాగం ప్రారంభించి, కొత్తగా సిద్ధమయ్యే బస్సులను దానికి చేరుస్తూ పోవాలని నిర్ణయించారు. వీటి ద్వారా సాలీనా రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. రేషన్ సరుకులు, ప్రభుత్వ గోదాములకు ధాన్యం, కూరగాయలు, ఇతర వస్తువుల తరలింపు, ప్రభుత్వ ముద్రణాలయం నుంచి పాఠ్యపుస్తకాల తరలింపు, విద్యార్థులకు యూనిఫామ్స్ తరలింపు, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా, ప్రభుత్వ హాస్టల్స్‌కు బియ్యం ఇతర వస్తువుల తరలింపు.. ఇలా ప్రభుత్వ పరంగా ఉండే సరుకు రవాణా అంతా ఆర్టీసీ కార్గో బస్సులే చేయనున్నాయి. ఈమేరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వటంతో వాటి నుంచి ఆర్టీసీ ఆర్డర్స్ కోసం దరఖాస్తు చేసింది. 1,210 మందితో వ్యవస్థ ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ బస్సుల్లోనే కొన్ని పార్శిళ్లను రవాణా చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా కార్గో పేరుతో సరుకు రవాణా బస్సు లు ప్రారంభిస్తున్నందున, ఈ విభాగానికి ప్రత్యేకంగా సిబ్బంది అవసరం కూడా వచ్చింది. 822 కార్గో బస్సుల నిర్వహణకు 1,210 మంది సిబ్బం ది అవసరమవుతారని లెక్కలు తేల్చింది. ఇటీవల రద్దయిన బస్సుల వల్ల మిగిలిపోయే సిబ్బందిని ఇటు బదలాయిస్తున్నారు. వీరే కాకుండా జోనల్ స్థాయిలో ఓ డీవీఎం స్థాయి అధికారి, రీజియన్ స్థాయిలో డిపో మేనేజర్ స్థాయి అధికారిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నారు. ప్రతి డిపోలో ఓ కండక్టర్‌ను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నా రు. వీరు నిత్యం ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్డర్లు తెచ్చే పనిలో ఉంటారు. వెనక వైపు క్రీమ్ కలర్ స్ట్రిప్‌తో పూర్తి ఎరుపు రంగు లో ఈ బస్సులు ఉండబోతున్నాయి. వీటిని ఆయా డిపోల్లోనే అందుబాటులో ఉంచుతారు. సిబ్బంది కూడా అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. సమీక్షించిన ఇన్చార్జి ఎండీ.. ఈ నెలాఖరుకల్లా కార్గో పార్శిల్ సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు. నష్టాల్లో ఉన్న సంస్థకు బాసటగా నిలిచేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రెవెన్యూ, ఐటీ విభాగం ఈడీ పురుషోత్తం కార్గో పార్శిల్ విభాగం డీపీఆర్‌ను సునీల్‌శర్మకు అందజేశారు. ఈడీలు వినోద్‌కుమా ర్, యాదగిరి, టీవీరావు తదితరులు పాల్గొన్నారు. -
1000 ఔట్.. 1334 ఇన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సొంత బస్సులు వేయి వరకు తగ్గిపోనుండగా, అదే సమయంలో 1,334 అద్దె బస్సులు వచ్చి చేరబోతున్నాయి. అద్దె బస్సులు పెరిగే కొద్దీ నష్టాలు ఎక్కువవుతాయన్న నిపుణుల సూచనలు కాదని, సిబ్బంది జీతాల భారం, బస్సులపై పెట్టుబడి తగ్గించుకునే క్రమంలో అద్దె బస్సుల వైపు ఆర్టీసీ చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న 2,100 అద్దె బస్సులకు అదనంగా మరో నెల రోజుల్లో 1,334 వచ్చి చేరబోతున్నాయి. దీంతో మొత్తం బస్సుల్లో ఇవి 35 శాతానికి చేరనున్నాయి. హైదరాబాద్‌లో వేయి సొంత బస్సులను తగ్గించుకునే పని ఇప్పటికే ఆర్టీసీ ప్రారంభించింది. శనివారం నుంచి ఆ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ బస్సుల కండక్టర్లను పెరుగనున్న అద్దె బస్సులకు విని యోగించినా, డ్రైవర్లు మిగిలిపోతారు. ఇలా త్వరలో మొత్తం 5 వేల మంది సిబ్బంది అదనంగా మారనున్నారు. ప్రస్తుతం వేయి బస్సుల తొలగింపుతో 4 వేల మంది వరకు మిగిలిపోనున్నారు. వీరిని ఎక్కడెక్కడ నియమించాలన్న అంశంపై ఈడీలు, ఫైనాన్స్ అడ్వయిజర్‌తో కలసి ఓ కమిటీని ఎండీ సునీల్‌శర్మ ఏర్పాటు చేశారు. 17వ తేదీ వరకు నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే సరుకు రవాణా విభాగంలో అవసరమైన వారిని వినియోగించుకోవడం, తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న సిబ్బంది స్థానంలో వీరిని వాడుకోవడం, చదువు అర్హత ఉన్న వారిని జూనియర్ అసిస్టెంట్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, టికెట్ చెకింగ్ సిబ్బందిగా విధులు వేయడం... పలు అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. సమ్మె సమయం లో ఆర్టీసీ కొత్తగా అద్దె బస్సుల కోసం రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి 1,334 అద్దె బస్సుల ను ఖరారు చేశారు. నోటిఫికేషన్ ఒప్పం దం ప్రకారం.. జనవరి 26 వరకు నిర్వాహకులకు గడువు ఉంది. అంటే ఈ బస్సులు దాదాపు నెల రోజుల్లో రోడ్డెక్కనున్నాయి. -
బస్సు పాస్‌లే పెద్ద సమస్య...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం భాగ్యనగరవాసులపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ నష్టాల్లో సగం సిటీ నుంచే వస్తుండటంతో సిటీ సర్వీసులను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది! గతంలో ఈ నష్టాలను జీహెచ్ఎంసీ నిధులతో భర్తీ చేయాలని భావించినా తాజా సమ్మె సమయంలో అది సాధ్యం కాదని స్వయంగా ప్రభుత్వమే తేల్చేసింది. హైకోర్టుకు సమర్పించిన వివరాల్లోనూ దీన్ని స్పష్టం చేసింది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు సిటీ సర్వీసులను కుదించాలన్న దిశగా అధికారులు అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా సర్వీసులు తగ్గించకున్నా సిటీ రీజియన్‌లో పదవీ విమరణ చేసే సిబ్బంది స్థానంలో కొత్త వారిని ఇక నియమించరు. ఫలితంగా బస్సుల సంఖ్యను కూడా కుదించేందుకు మార్గం సుగమమవుతుంది. దీంతో ప్రస్తుతం నగరంలో ఉన్న 3,500 బస్సుల సంఖ్య క్రమంగా తగ్గనుంది. బస్సు పాస్‌లే పెద్ద సమస్య... హైదరాబాద్‌లో బస్సు పాస్‌లతోనే ఆర్టీసీకి పెద్ద సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ఆర్టీసీ నష్టాలను పెంచుతోంది. పాస్‌ల రూపంలో రాయితీ ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి రీయింబర్స్ చేయాల్సి ఉండగా సకాలంలో ఆ నిధులు అందక ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. నగరంలో 9.17 లక్షల విద్యార్థి పాస్‌లు ఉన్నాయి. వాటిలో నెలవారీ రూ.130తో కొనే జనరల్ పాస్‌లు 2.76 లక్షలుండగా రూ. 390తో 3 నెలలకోసారి కొనే పాసులు 6.41 లక్షలున్నాయి. సాధారణ ప్రయాణికుల పాసులు 17.56 లక్షలున్నాయి. ఇందులో రూ.770తో కొనే జనరల్ పాసులు 3.29 లక్షలుంటే రూ. 880తో కొనే మెట్రో పాసులు 14.27 లక్షలున్నాయి. భారీగా పాసులు ఉండటంతో ఆర్టీసీ ఆదాయం పడిపోతోందనేది అధికారుల మాట. ఇక ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకేసారి బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆ వేళల్లో రద్దీగా తిరుగుతున్న బస్సులు, ఆ తర్వాత కొంత ఖాళీగా ఉంటున్నాయి. ఈ బస్సుల్లో దాదాపు 8 వేల మంది కండక్టర్లు, డ్రైవర్లు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది సీనియర్లే కావడంతో వారి వేతనాలూ ఎక్కువగా ఉంటున్నాయి. నగరంలో 30 శాతం ఇంటి అద్దె భత్యం ఉండటంతో ఆ రూపంలో భారం పడుతోంది. దీంతో సిటీ సర్వీసుల సంఖ్యను తగ్గించడమే పరిష్కారమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. -
బస్సులు రోడ్డెక్కేనా.?
సాక్షి, హైదరాబాద్: షరతులు విధించడకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమేనని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేనా అన్న చర్చ మొదలైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 46 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ సమ్మెను ప్రభుత్వం మొదటి నుంచి చట్టవిరుద్ధంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులపై అనేక ఆంక్షలు విధించింది. విధుల్లో చేరేందుకు రెండుసార్లు గడువు విధించింది. అయినా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మెను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభించకుండానే తమంతట తాముగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి నగరంలోని అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో సహా సిబ్బంది విధుల్లో చేరే అవకాశా లున్నాయి. అయితే ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకుంటుందా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రెండుసార్లు విధించిన గడువుల్లో కొందరు విధుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తరువాత వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి కార్మికులంతా డ్యూటీలో చేరుతారా...సిటీ బస్సులన్నీ రోడ్డెక్కుతాయా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అక్టోబర్ 5న మొదలైన సమ్మె నవంబర్ 20న ముగిసింది. ఆర్టీసీ చరిత్రలోనే ఇది సుదీర్ఘ సమ్మెగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమంలోనూ సకల జనుల సమ్మెలో భాగంగా కార్మికులు ఆందోళనలో పాల్గొన్నప్పటికీ ఆర్టీసీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని సమ్మెల్లోకెల్లా ఇదే అతి పెద్ద సమ్మెగా నిలిచిపోయింది. సగానికి పైగా డిపోలకే పరిమితం... గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో 3750కి పైగా బస్సులు ఉన్నాయి. కార్మికుల సమ్మె కారణంగా సగానికి పైగా డిపోల్లోనే నిలిచిపోయాయి, 19 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు, గుండెపోటుతో ఒకరిద్దరు కన్నుమూశారు. అన్ని డిపోల్లో, బస్స్టేషన్లు, ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్ వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వందలాది మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పలువురు కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం దసరా సెలవులను సైతం పొడిగించింది. సమ్మెకాలంలో ప్రైవేట్ సిబ్బంది సహాయంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. కండక్టర్లకు రూ.1000, డ్రైవర్లకు రూ.1500 చొప్పున చెల్లించినా, ప్రతి రోజు 1000 నుంచి 1500 కంటే ఎక్కువ బస్సులు నడుపలేకపోయారు. దీంతో దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగింది. దసరా సెలవుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోగా, అరకొర బస్సుల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సమ్మె కారణంగా నరకం చవి చూడాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది మెట్రోల్లో రాకపోకలు సాగించగా, 1.7 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. రూ.100 కోట్లకు పైగా నష్టం... కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు రూ.వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అప్పటికే పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు సమ్మె శరాఘాతంగా మారింది. రోజుకు రూ.1.5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు ప్రైవేట్ సిబ్బంది చేతివాటంతో కూడా ఆదాయానికి గండిపడింది. సమ్మె తొలిరోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా రాకపోవడం గమనార్హం. కొన్ని రూట్లలో ప్రైవేట్ సిబ్బంది వేతనాలు కూడా ఆర్టీసీయే చెల్లించాల్సి వచ్చింది. గ్రేటర్‌వాసులకు ఊరట.. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి యధావిధిగా విధుల్లో చేరితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 32 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు బస్‌పాస్‌లను కలిగి ఉన్నారు. రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రాంతాలకు సిటీ బస్సే ప్రధాన రవాణా సదుపాయం. నగరంలో రోజుకు 9.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు 42 వేల ట్రిప్పులతో రాకపోకలు సాగిస్తున్నాయి. -
ఆర్టీసీ సొంతంగా కొనలేకే...
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రయాణికుల అవసరాల నిమిత్తం అద్దె బస్సులను లీజుకు తీసుకోవాల్సివస్తోందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. అద్దెకు బస్సులను తీసుకోవడం ఏనాటి నుంచో ఉందని, ఈ నిర్ణయం వెనుక ఆర్టీసీ కార్మికులను దెబ్బతీయాలనే కుట్ర ఏమీలేదని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో తెలిపారు. ఆర్టీసీ 1,035 అద్దె బస్సులను తీసుకునేందుకు టెండర్ ఆహ్వానించడాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి సవాల్ చేస్తూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఆర్టీసీ సంస్థ వాదనలతో సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ వేశారు. గత నెల 14న పత్రికల్లో అద్దె బస్సుల కోసం టెండర్‌ను ప్రచురించామని, అదే నెల 21న టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించి అదే రోజు టెండర్లను తెరిచి ఇప్పటి వరకూ 287 మంది బస్సు యజమానులకు ఖరారు పత్రాలను అధికారికంగా ఇచ్చామన్నా రు. ఆర్టీసీలో 10,460 బస్సులుంటే అందులో అద్దె బస్సులు 2,103 మాత్రమేనని వివరించారు. మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు 21.26 శాతమేనని, వాస్తవానికి 20 శాతం నుంచి 25% వరకూ అద్దెబస్సులు ఉండేందుకు వీలుగా 2013లోనే ఆర్టీసీ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యం లో ప్రయాణికుల సౌకర్యం కోసం అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించామని దీనికితోడు టెం డర్ల ప్రక్రియ ఖరారు అయినందున పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఈ నెల 18న హైకోర్టు విచారణ కొనసాగించనుంది. -
ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం
-
అద్దె బస్సుల టెండర్‌పై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సంస్థ 1,035 అద్దె బస్సుల్ని ఏడాది పాటు తీసుకునేందుకు పిలిచిన టెండర్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన రిట్‌పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారమైతే అంత పెద్ద సంఖ్యలో ప్రైవేటు బస్సుల్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదని, కాబట్టి మధ్యంతర స్టే ఆదేశాలు ఇవ్వాలంటూ టీఎస్ ఆర్టీసీ కార్మిక్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రమేశ్ కుమార్ దాఖలు చేసిన రిట్‌ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారించారు. సమ్మె కాలానికి అద్దె బస్సులు తీసుకోవడం సబబేనని, ఏడాది కాలానికి అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టమని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సూర్యకరణ్‌రెడ్డి వాదించారు. ఆర్టీసీ సమ్మెపై వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఉన్నాయని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు చెప్పారు. దీంతో ఈ రిట్‌ను కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి నివేదించాలని న్యాయమూర్తి నిర్ణయించారు. ఈ దశలో పిటిషనర్ న్యాయవాది కల్పించుకుని, ఏడాదిపాటు అద్దెకు తీసుకోకుండా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకునేలా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా, ఈ విషయాన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేయాలని సూచించారు. -
ఎలక్ట్రిక్ బస్సు సిటీ గడప దాటదా?
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపే విషయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మల్లగుల్లాలు పడుతోంది. దూర ప్రాంతాలకు నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో బ్యాటరీకి సంబంధించిన సాంకేతిక సమస్యలు ఏర్పడి మధ్యలో ఆగిపోతే ఎలా అని ఆందోళన చెందుతోంది. ఇక కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపైనా సంస్థ తీవ్రంగా మ«థనపడుతోంది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట లాంటి ప్రాంతాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలన్న ప్రతిపాదననూ ఆర్టీసీ విరమించుకుంది. ఫలితంగా ‘ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్)’పథకం రెండో విడత కింద కేంద్రం పెద్ద సంఖ్యలో బ్యాటరీ బస్సులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పరిమిత సంఖ్యలోనే తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఈ పథకం కింద 600 బస్సులు మంజూరుకు వీలుగా కేంద్రాన్ని కోరాలని ముందుగా భావించింది. కానీ, హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలకు వాటిని నడిపితే ఏర్పడే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఇప్పటికిప్పుడు లేనందున కేవలం 334 బస్సులు మాత్రమే కోరాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు కేంద్రానికి పంపే గడువు గురువారంతో ముగుస్తుండటంతో అధికారులు ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి పంపారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రంలోగా ఢిల్లీకి పంపనున్నారు. సమస్యగా చార్జింగ్ స్టేషన్లు.. ఎలక్ట్రిక్ బస్సు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇదే పథకం మొదటి దశ కింద మంజూరై హైదరాబాద్‌లో తిరుగుతున్న ఏసీ బస్సుల ధర ఒక్కోటి రూ.2.40 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 60 శాతం బ్యాటరీదే భారం. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు తయారువుతున్నా.. బ్యాటరీలను మాత్రం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో బ్యాటరీ బస్సులను వాడిన దాఖలాలు లేనందున ఎక్కడా వాటి చార్జింగ్ పాయింట్లు లేవు. గతేడాది హైదరాబాద్‌లో 40 బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. దీంతో వాటి కోసం 3 చోట్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. చార్జింగ్ కేంద్రం ఏర్పాటు కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్‌లోనే చార్జ్ చేసి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లుగా నగరం నుంచి ఇతర పట్టణాలకు వాటిని నడపాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రయాణం మధ్యలో బస్సు బ్యాటరీలో సమస్య తలెత్తితే దాన్ని వెనక్కు తీసుకురావటం పెద్ద ఇబ్బందిగా మారనుంది. అలాగే తరచూ సమస్యలు తలెత్తితే వాటిని నిర్వహించటం సాధ్యం కాదని తేల్చుకున్న అధికారులు.. వాటిని హైదరాబాద్ వరకే పరిమితం చేయాలని నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులే.. ఫేమ్ పథకం తొలి దశలో 40 బస్సులు కొన్నారు. అవన్నీ ఏసీ బస్సులే. వీటిని నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు తిప్పుతున్నారు. ఇప్పుడు కొత్తగా నాన్ ఏసీ బ్యాటరీ బస్సులే కొనాలని నిర్ణయించారు. వీటి ధర తక్కువగా ఉండటంతో టికెట్ ధర కూడా తగ్గనుంది. దీంతో వీటికి సాధారణ ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందనేది అధికారుల ఆలోచన. నగరం, శివారు ప్రాంతాలు, సమీపంలోని చిన్న పట్టణాల వరకు మాత్రమే వీటిని తిప్పబోతున్నారు. వరంగల్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే బస్సులను పూర్తిగా సిటీ బస్సులుగానే నడపాలని నిర్ణయించారు. అన్ని చోట్లా సిటీ సర్వీసులే.. ప్రస్తుతం దేశంలో ఎక్కడా దూర ప్రాంతాలకు వీటిని నడపటం లేదు. ఢిల్లీ, బెంగళూరు సహా మరికొన్ని నగరాల్లో ఈ బస్సులు పరుగుపెడుతున్నా.. అన్ని చోట్లా సిటీ బస్సులుగానే తిరుగుతున్నాయి. దూర ప్రాంతాల మధ్య వాటిని ప్రారంభించనందున.. వాటి నిర్వహణకు సంబంధించి ఏ ఆర్టీసీకి స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 వేల బస్సులు తిప్పాలని కేంద్రం నిర్ణయించినందున, కొన్ని చోట్ల దూరప్రాంతాల మధ్య తిప్పే అవకాశం ఉంది. అప్పుడు ఆయా సంస్థలకు ఎదురయ్యే అనుభవాలను తెలుసుకుని భవిష్యత్‌లో రాష్ట్రంలో కూడా దూర ప్రాంతాల మధ్య వాటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. అద్దె బస్సుల వివాదం.. మరో కారణం.. ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య 25 శాతానికి మించకూడదనేది నిబంధన. కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందంలో దీన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆ పరిమితి నిండిపోయింది. కొత్తగా అద్దె బస్సులను ఏర్పాటు చేసుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయి కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో అద్దె బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున, ఇక్కడ వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనే బ్యాటరీ బస్సులను అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున.. కార్మిక సంఘాల నుంచి వ్యక్తమయ్యే వ్యతిరేకతను ఎదుర్కోవటం కూడా ఇబ్బందిగా అధికారులు భావించారు. వెరసి తొలుత 600 బస్సులు సమకూర్చుకోవాలని భావించినా ఇప్పుడు దాన్ని 334కే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఎక్కువ బస్సులు తీసుకోవాలని కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే అందుకు వీలుగా 550, 450 బస్సులు తీసుకునేలా రెండు ప్రతిపాదనలు కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. స్మార్ట్ సిటీ బస్సులు.. స్మార్ట్ సిటీలకు ప్రత్యేకంగా ఈ బస్సులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఉన్న వరంగల్ పట్టణంలో కొన్నింటిని ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. 12 మీటర్లు, 9 మీటర్లు, 7 మీటర్ల పొడవుండే 3 కేటగిరీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న 40 బస్సులు 12 మీటర్ల పొడవైనవే. పాతబస్తీ లాంటి ఇరుకు దారులుండే రోడ్లపై వీటిని నడపడం ఇబ్బందిగా ఉంటుంది. టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉన్నందున వీటిలో రద్దీ కూడా తక్కువగా ఉంటోంది. అందుకోసం సాధారణ ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు చిన్న బస్సులే తిప్పబోతున్నారు. ఇందుకోసం 9, 7 మీటర్ల బస్సులను కూడా కొంటున్నారు. మొత్తం 334 బస్సులు కొనాలని దాదాపు ఖరారు చేశారు. ఇందులో 309 బస్సులను హైదరాబాద్‌లో తిప్పాలని, మిగతా వాటిని వరంగల్ పట్టణంలో సిటీ బస్సులుగా తిప్పాలని భావిస్తున్నారు. -
పైసలిస్తే బస్సులు తిప్పం..!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారిపై ఉన్న ప్రజ్ఞాపూర్ కూడలిలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు నిలబడి ఉన్నారు. వారిలో అక్కడి నుంచి భువనగిరి రోడ్డులో ఉన్న జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి వెళ్లాల్సినవారు అధికం. గంటసేపు ఎదురుచూసినా ఒక్క బస్సు కూడా రాలేదు, అప్పటికే అక్కడ దాదాపు ఇరవై వరకు ఏడు సీట్ల ఆటోలు రారమ్మంటూ ప్రయాణికులను పిలుస్తున్నాయి. ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మంది చొప్పున ప్రయాణికులు కిక్కిరిసిపోయి జగదేవ్‌పూర్ వైపు సాగిపోయారు. ఇలా నిరంతరం జరుగుతూనే ఉంది. ఇంతడిమాండ్ ఉన్నా ఈ మార్గం లో ఆర్టీసీ మాత్రం బస్సు సర్వీసుల సంఖ్య పెంచటం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపో యి సిబ్బంది జీతాలు చెల్లించలేని దుస్థితి ఆర్టీసీది. రాష్ట్రం నలుమూలలా ప్రధాన రహదారుల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాలకు వెళ్లే దారుల్లో బస్సుల సంఖ్యను పెంచితే ఆదా యం పెరిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అడపాదడపా వచ్చే బస్సు లో జనం వేళాడుతూ వెళ్లాల్సి వస్తోంది. బస్సు కోసం అంత సేపు ఎదురు చూడలేక ఏడుగురు ఎక్కాల్సిన ఆటోల్లో 15 నుంచి 20 మంది వరకు ప్రయాణిస్తున్నారు. బస్సుల కొరత అంటూ భారీగా వసూళ్లు.. ప్రతి ఆర్టీసీ డిపో పరిధిలో సిబ్బంది క్రమం తప్పకుండా రూట్ సర్వే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఏయే మార్గాల్లో ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోందో తెలుసుకుని కొత్తగా సర్వీసులు ప్రారంభించటం దీని ఉద్దేశం. కానీ కొందరు సిబ్బంది ఆటోవాలాలతో కుమ్మక్కై కొత్త సర్వీసులు ప్రారంభించబోమని చెప్పి ఒక్కో ఆటో నుంచి ప్రతినెలా వసూలు చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కొత్త బస్సుకోసం డి మాండ్ రాగానే ‘కొనేందుకు నిధులెక్కడివి’ అంటూ అధికారులు తిరస్కరిస్తున్నారు. తిక్క వ్యవహారాలు... గజ్వేల్ మండల కేంద్రం నుంచి జగదేవ్‌పూర్ మండల కేంద్రానికి బాగా డిమాండ్ ఉంది. కానీ, ఆర్టీసీ అధికారులు మాత్రం గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మీదుగా భువనగిరి వరకు సర్వీసులు నడుపుతున్నారు. ఇవి పరిమితంగా ఉండటంతో గజ్వేల్‌లో బయలుదేరిన బస్సు భువనగిరి వరకు వెళ్లి తిరిగి వచ్చేందుకు బాగా సమయం పడుతోంది. ఈలోపు ప్రజ్ఞాపూర్ వద్ద వేచిఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సిద్దిపేట మార్గంలో సిద్దిపేట–చేర్యాల, సిద్దిపేట– కొమురవెల్లి, అయినాపూర్, అయినాపూర్–చేర్యాల, సూర్యాపేట–ఆత్మకూరు, ఆదిలాబాద్–మంచిర్యాల రోడ్డు, సిరిసిల్ల–కరీంనగర్ రోడ్డు, మంథని–పెద్దపల్లి రోడ్డులను అనుసంధానం చేసుకుని ఉండే చాలా గ్రామాలవైపు బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉన్నాయి. జగిత్యాల నుంచి చందుర్తి, వేములవాడ, కొండగట్టువైపు వెళ్లే మార్గాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. ఇటీవల కొండగట్టు వద్ద దాదాపు 90 మంది ప్రయాణికులతో వెళ్తూ బస్సు బోల్తాపడి 70 మందిని మించి చనిపోయిన దుర్ఘటనే దీనికి సాక్ష్యం. తక్కువ ఖర్చు అయ్యే మినీ బస్సులు ఎక్కువ సంఖ్యలో కొను గోలు చేసి గ్రామాలకు తిప్పాల్సి ఉంది. -
ఆర్టీసీ... హైటెక్!
సాక్షి, హైదరాబాద్: ఆధునికత దిశగా ఆర్టీసీ ప్రయాణిస్తోంది. ప్రయాణికుల భద్రతకు సాంకేతికత తోడవుతోంది. రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు భరోసా ఇస్తోంది. ప్రజారవాణాలో ఉన్న ప్రతి వాహనానికి జీపీఎస్(జియో పొజిషనింగ్ సిస్టమ్) తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈ ఆదేశాలు పాతవే అయినా.. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రవాణా సంస్థలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జీపీఎస్ పరికరంతోపాటు ప్యానిక్ బటన్లు కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రజారవాణా సంస్థల్లో టీఎస్ఆర్టీసీ అత్యంత కీలకమైనది. సంస్థ వద్ద దాదాపు 10,500 బస్సులున్నాయి. ఇందులో 2,200 అద్దె బస్సులు ఉన్నాయి. రోజూ 98 లక్షల మందికిపైగా వివిధ రూట్లలో ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. రోజూ రూ.12 కోట్ల కలెక్షన్ ఉంటుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 6 నెలల నుంచి హైదరాబాద్– కరీంనగర్– మెట్పల్లి మార్గంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 400 బస్సులకు జీపీఎస్ పరికరాలను బిగించి పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు మార్చి ఆఖరునాటికి లేదా ఏప్రిల్ మొదటివారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారం. త్వరలో ఆర్టీపీఎస్ రద్దు? ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు ‘రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ (ఆర్టీపీఎస్) గ్రేటర్ పరిధిలో దాదాపు 600 బస్సుల్లో నిర్వహిస్తోంది. జీపీఎస్ అందుబాటులోకి వస్తే నగరంలోని ఆర్టీపీఎస్‌ను రద్దు చేసి దానిస్థానంలో జీపీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. నగరం ప్రైవేటు ట్రావెల్స్, ఓలా, ఉబర్ లాంటి వివిధ ప్రైవేటు క్యాబ్ సర్వీసులు కూడా జీపీఎస్, ప్యానిక్ బటన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బస్సు ఎక్కడుందనే విషయాన్ని యాప్‌లో జీపీఎస్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేటు రవాణా సంస్థల పోటీని తట్టుకోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. లారీలు, కార్లు కూడా...: మోటారు వాహన నిబంధనలు–1989 పరిధిలోకి వచ్చే అన్ని వా హనాలు అంటే బస్సులు, లారీలు, కార్లు ఇలా రవాణాకు వినియోగించే ప్రతి వాహనం ఇకపై జీపీఎస్, ప్యానిక్ బటన్లు అమర్చుకోవాలి. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, యాప్‌ల రూపకల్పన! పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికాగానే అధికారులు జీపీఎస్ పరికరాల బిగింపు కోసం టెండర్లు ఆహ్వానిస్తారు. ఇకపై కొనుగోలు చేసే ప్రతి బస్సుకు చాసిస్‌తోపాటు జీపీఎస్, ప్యానిక్ బటన్లు కలిపి ఉండేలా చూసుకుంటారు. జీపీఎస్ కోసం ఎంజీబీఎస్‌లో ఒకటి(రాష్ట్రవ్యాప్త సర్వీసుల కోసం), జేబీఎస్లో (గ్రేటర్ హైదరాబాద్ బస్సుల కోసం) మరో కంట్రోల్ రూము ఏర్పాటు చేయనున్నారు. బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. డివైజ్ లేకపోతే నో పర్మిట్! ఏఐఎస్–140 పేరిట వెహికిల్ ట్రాకింగ్ పోర్టల్‌ను బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేసింది. ఇందులో ఏఐఎస్–140 ట్రాకింగ్ డివైజ్, వాహనం చాసిస్ వివరాలు నమోదవుతాయి. జీపీఎస్ పరికరం బిగించుకోకపోతే కొత్త వాహనాలకు అనుమతి, పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా శాఖ జారీ చేయదు. స్కూలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, ఇతర రవాణా వాహనాలకు ఇకపై ఈ డివైజ్ బిగింపు తప్పనిసరి. భవిష్యత్తులో ఇవి లేని వాహనాలు రోడ్డుపైకి వెళ్లడానికి అనుమతి దొరకదు. -
జనం పల్లె‘టూరు’..
సాక్షి, హైదరాబాద్: దసరా పర్వదినానికి గ్రేటర్ నుంచి లక్షలాది మంది సిటిజన్లు పల్లెబాట పట్టారు. సుమారు 15 లక్షల మంది వ్యక్తిగత వాహనాలు, ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, రైళ్లలో ఊళ్లకు బయలుదేరారు. సోమ, మంగళవారాల్లో నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలివెళ్లారు. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఉప్పల్, మెహిదీపట్నం తదితర కూడళ్లు కిక్కిరిసాయి. గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దృష్ట్యా నగరం పల్లెబాట పట్టింది. రైళ్లు, బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, టాటా ఏసీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ ప్రయాణికులతో బయలుదేరాయి. నగరం నుంచి మంగళవారం సుమారు లక్ష వాహనాలు బయలుదేరి వెళ్లినట్లు విజయవాడ, వరంగల్ హైవేల్లోని టోల్‌ప్లాజా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మొత్తంగా దసరా సందర్భంగా ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలివెళ్లారు. బుధవారం మరో 5 లక్షల మంది బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికుల రద్దీ బాగా పెరగడంతో ఆర్టీసీ సోమ, మంగళవారాల్లో 2000 ప్రత్యేక బస్సులను నడిపింది. దక్షిణమధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయినా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాధారణ బోగీల్లో నరకం చూశారు. టికెట్ కౌంటర్ల వద్ద కూడా భారీ ఎత్తున రద్దీ ఏర్పడటంతో సకాలంలో టికెట్లు లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహిళలు, పిల్లలు, వయోధికుల పరిస్థితి మరింత దారుణం. సాధారణ బోగీల్లో ఊపిరి తీసుకొనేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఒత్తిడి కారణంగా ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. గంటల తరబడి ఒంటికాలిపై నిలుచుని ప్రయాణం చేయాల్సి వచ్చిందని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అరకొర రైళ్లతో తప్పని అవస్థలు.. ఏటా ఇదే పరిస్థితి. రద్దీకి తగినన్ని రైళ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతీసారి పండుగ ప్రయాణం నరకప్రాయమవుతోంది. ప్రతి సంవత్సరం అరకొర రైళ్లే దిక్కవుతున్నాయి. రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో 3 నెలల ముందే బెర్తులు బుక్ అయ్యాయి. అన్నింటిలోనూ ’నో రూమ్’దర్శనమిస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కనీసం 2 నెలల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించాల్సిన దక్షిణమధ్య రైల్వే చివరి క్షణం వరకు మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న రైళ్లనే ఆశ్రయించాల్సి వస్తోంది. బెర్తులు లభించకపోయినా, జనరల్ బోగీల్లో సీట్లు లేకపోయినా ప్రయాణం అనివార్యం కావడంతో ఏదో విధంగా రైలెక్కేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. సాధారణ బోగీల్లో కిక్కిరిసి బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు, తెలంగాణ జిల్లాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లన్నింటిలోనూ సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు సంఖ్యలో బయలుదేరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 120 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 1.8 లక్షల మంది బయలుదేరుతారు. తాజా రద్దీ నేపథ్యంలో రోజుకు 30 వేల నుంచి 50 వేల వరకు అదనంగా బయలుదేరుతున్నట్లు అంచనా. ఈ అదనపు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు వేయాల్సింది. కానీ విశాఖ, విజయవాడ, కాకినాడల వైపు మాత్రం మొక్కుబడిగా కొన్నింటిని వేశారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు అదనంగా ఎలాంటి ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు నరకం చవి చూస్తున్నారు. 15 లక్షలు దాటిన ప్రయాణికులు.. దసరా సందర్భంగా ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు వెళ్లారు. మరో రెండు రోజుల్లో ఈ సంఖ్య 20 లక్షలు దాటే అవకాశం ఉంది. బస్సుల్లో గత నాలుగు రోజులుగా 6 లక్షల మంది తరలివెళ్లగా, రైళ్లలో మరో 5 లక్షల మంది వెళ్లినట్లు అంచనా. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లినవారు 6,00,000 రైళ్లలో వెళ్లిన వారు 5లక్షలు వ్యక్తిగత వాహనాల్లో వెళ్లినవారు 4లక్షలు బుధవారం వెళ్లేవారు 5లక్షలు -
బస్సులా...రేకు డబ్బాలా?
సాక్షి,హైదరాబాద్: ఆర్టీసీది పేరు గొప్ప ఊరు దిబ్బ పరిస్థితిగా మారింది. ఇటీవల ఆర్టీసీ చరిత్రలోనే కాక దేశంలోనే జరిగిన అతిపెద్ద రోడ్డు యాక్సిడెంట్‌గా పరిగణిస్తున్న కొండగట్టు బస్సు ప్రమాదమే అందుకు తాజా ఉదాహరణ. కేవలం లాభార్జనపైనే దృష్టిపెట్టి నిబంధనలకు నీళ్లొదిలి ప్రయాణికులపాలిట మృత్యుశకటాలుగా మారిన బస్సుల్ని ఆర్టీసీ రోడ్డుపై నడుపుతోంది. కాలం చెల్లిన, ఫిట్నెస్ లేని దాదాపు నాలుగువేలకు పైగా పాతబస్సుల్లో జనాలను కుక్కి వారి జీవితాలతో ఆర్టీసీ చెలగాటమాడుతోంది. ఎక్కడికక్కడ ఊడుతున్న డోర్లు, సీట్లకు ఇనుప తీగలు, తాళ్లు కట్టుకుని నడుస్తోన్న బస్సులు ఆర్టీసీ దుర్భరస్థితిని లోకానికి చాటుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన ఆర్టీఏ రోడ్లపై తిరుగుతున్న డొక్కు బస్సుల్ని, రోడ్లపై జరుగుతున్న బస్సు ప్రమాదాల్ని చూసి కూడా కళ్లుమూసుకుని మొద్దు నిద్రను నటిస్తోంది. కనీసం కొండగట్టు బస్సు ప్రమాదం తర్వాతైనా ఆర్టీసీ, ఆర్టీఏ ఈ రెండూ కళ్లు తెరవలేదు. పొంచి ఉన్న ముప్పు తెలంగాణ ఆర్టీసీలో ఉన్న పాత బస్సులతో ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉంది. వీటిలో చాలా వరకు ఇప్పటికే తుక్కు దశకు చేరుకున్నా..అవే డొక్కు బస్సులను అధికారులు తిప్పుతున్నారు. ఇపుడు ఇవి మృత్యుశకటాలుగా మారి ప్రజలను అమాంతం మింగేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు అక్షరాలా 4,549 బస్సులు. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. కొత్త బస్సులు వద్దా? 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1095గా ఉంది. స్క్రాప్ బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సు లు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా కనిపించడం లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తుండటం గమనార్హం. - ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్షీ రేషియో దారుణంగా ఉంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. కొన్ని రూట్లలో ఒకరిద్దరే ఎక్కుతున్నారు. - ఈనెల 5న దాదాపుగా రూ.100 కోట్ల కేంద్రం గ్రాంటుతో 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడతగా 5 బస్సులు నగరానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో పర్యావరణ కోణంలో ఇలాంటి బస్సులను నడపాల్సిందే. కానీ, వాటిపై చూ పిన శ్రద్ధ గ్రామీణ, జిల్లాల్లో కొత్తబస్సులపైనా చూపిస్తే.. వాటికి వెచ్చించే బడ్జెట్లో జిల్లా బస్సులకు వెచ్చి స్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుందని యూని యన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్టర్లకు కాకుండా..ప్రజలకు, కార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఆర్టీఏ తనిఖీలెక్కడ? ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు పట్టించుకున్న దాఖలాలు తక్కువ. పోనీ, తనిఖీలు చేపట్టినా.. వెంటనే ఫోన్లు చేసి తమను అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులే వాపోతున్నారు. కాలంచెల్లిన బస్సులు రోడ్లపై తిరుగుతున్నా గుడ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులకు నడిచేందుకు ఏమాత్రం అర్హతలేదు అయినా వీటిల్లో జనాలను కుక్కి పంపుతోంది ఆర్టీసీ. ఇదీ ఆర్టీసీ లెక్క ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా రోజువారీ ప్రయాణికులు 97,00,000 ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000/ (రూ.12కోట్లు) సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. వీటిలో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000 మందికిపైగా ఈ బస్సులు ఎపుడు.. ఎక్కడ ప్రమాదానికి గురవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. -
తల్లిదండ్రులతో పిల్లలను చితక్కొట్టించిన పోలీసులు
-
కత్తులు ప్రదర్శిస్తూ..బస్సులో ఫుట్‌బోర్డింగ్
-
మైలేజీ తక్కువ.. డ్యామేజీ ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్ : ప్రతి రెండున్నర కిలోమీటర్లకు లీటర్ డీజిల్ తాగుతున్నాయి ఆ బస్సులు.. లాభాల సంగతి దేవుడెరుగు!! ప్రతి కిలోమీటరుకు దాదాపు రూ.20 వరకు నష్టం మిగులుతోంది. ఆ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఆర్టీసీ ఖజానా అంతగా ఖాళీ అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా మింగేస్తూ గుదిబండగా మారాయి. ఎట్టకేలకు కళ్లు తెరచిన ఆర్టీసీ యాజమాన్యం ఆ కేటగిరీలోని ఏసీ బస్సులను ఉపసంహరించాలని నిర్ణయించింది. కానీ అదే కేటగిరీలోని నాన్ ఏసీ బస్సులను మాత్రం కొనసాగించనుంది. వాటిని కనిష్టంగా 10 లక్షల కిలోమీటర్ల మేర తిప్పుతామంటూ తొలుత తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వాటిని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. నాటి యూపీఏ ప్రభుత్వంలోని కొందరు నేతల కమీషన్ల కక్కుర్తితో ఆర్టీసీకి బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సుల కథే ఇది. ఆది నుంచీ అంతే.. పెద్ద నగరాల్లో ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పాలని నిర్ణయించిన నాటి యూపీఏ ప్రభుత్వం.. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద హైదరాబాద్‌కు 100 వరకు లో ఫ్లోర్ బస్సులను అందజేసింది. స్థానికంగా కంపెనీల నుంచి చాసిస్ కొని ఆర్టీసీనే సొంతంగా బస్‌బాడీ రూపొందించుకునే వెసులుబాటు ఉన్నా.. కొందరు రాజకీయ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి నాసిరకం బస్సులు కొనిపించి సరఫరా చేశారు. లో ఫ్లోర్ బస్సులు పెద్ద వయసు వారికి, వికలాంగులకు సౌకర్యంగా ఉంటాయని చెప్పి అంటగట్టారు. కానీ తయారీలో లోపాలతో అవి ఆది నుంచి ఆర్టీసీకి పెద్ద గుదిబండగా మారాయి. ఎట్టకేలకు ఏసీ బస్సుల ఉపసంహరణ లో ఫ్లోర్ కేటగిరీలో ప్రస్తుతం 30 వరకు ఏసీ బస్సులు తిప్పుతున్నారు. భారంగా మారటంతో వాటిని ఉపసంహరించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది. అవి ఇప్పటికే 5 లక్షల కిలోమీటర్ల మేర తిరగటంతో 20 వరకు బస్సులను షెడ్డుకు పరిమితం చేశారు. కానీ నాన్ ఏసీ బస్సులను మాత్రం 10 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై ఇప్పుడు డిపో మేనేజర్లు గగ్గోలు పెడుతున్నారు. తాము ఎంత పకడ్బందీగా పనిచేసి ఆదాయాన్ని పెంచినా, ఈ బస్సుల వల్ల చివరకు నష్టాలే మిగులుతున్నాయని, వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నష్టాలు ఇలా.. సాధారణంగా సగటు ఆర్డినరీ బస్సు లీటర్ డీజిల్‌కు 4.8 కి.మీ. నుంచి 5 కి.మీ. వరకు మైలేజీ ఇస్తోంది. అదే ఏసీ బస్సు 3 కి.మీ. మేర ఇస్తోంది. కానీ లో ఫ్లోర్ నాన్ ఏసీ బస్సులు మాత్రం కేవలం 2.5 కి.మీ. మైలేజీ మాత్రమే ఇస్తున్నాయి. అంటే సాధారణ ఆర్టీనరీ బస్సుతో పోలిస్తే డీజిల్ ఖర్చు రెట్టింపవుతోంది. వీటి తయారీ, బస్బాడీలో లోపాల వల్ల నిర్వహణ సమస్య తీవ్రంగా ఉంటోంది. ప్రతినెలా బస్సును పూర్తిగా మెయింటెనెన్స్ సర్వీస్ చేస్తేగాని బస్సు రోడ్డెక్కని పరిస్థితి. బస్సు వెనుక వైపు ఇంజిన్ ఇండే ఈ తరహా బస్సుల విడిభాగాల ఖరీదు చాలా ఎక్కువ. సాధారణ బస్సులకు 24 వేల కిలోమీటర్లు ప్రయాణించిన ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తున్నారు. ప్రతిసారి 10.5 లీటర్ల ఆయిల్‌ను నింపుతారు. కానీ లో ఫ్లోర్ బస్సులకు 9 వేల కిలోమీటర్లకు ఓసారి మార్చాల్సి వస్తోంది. ప్రతిసారి 16.5 లీటర్ల మేర పోయాల్సి వస్తోంది. సాధారణ బస్సుల్లో 44 సీట్లు ఉంటుండగా వీటిలో కేవలం 32 సీట్లు మాత్రమే ఉంటున్నాయి. ఇవి డీలక్స్ కేటగిరీ బస్సులు కావడటంతో టికెట్ ఖరీదు ఎక్కువ. దీంతో ప్రయాణికులు వీటిని తక్కువగా వాడుతున్నారు. వెరసి టికెట్ ఆదాయం కూడా చాలా తక్కువ. ఎయిర్ సర్క్యులేషన్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. వారానికోసారి విడిభాగాలు చెడిపోయి మార్చాల్సి వస్తోంది. ఈ బస్సుల నుంచి విపరీతమైన పొగ వెలువడుతోంది. క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నా, తయారీలో లోపాల కారణంగా పొగను నియంత్రించటం సాధ్యం కావటం లేదు. -
చదవాలంటే.. నడవాల్సిందే!
రాజాపూర్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లు, అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా.. మరోవైపు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా కూడా ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు గ్రామాలకు కొనసాగకపోవడంతో ప్రజలు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఇటీవల బీటీ రోడ్లు వేయించారు. అయినా కూడా బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదవులు నిమిత్తం ఎండనకా.. వాననకా రోజూ కిలోమీటర్ల పొడవునా కాలినడకన నడవాల్సి వస్తుంది. ఉన్నత చదువులకు నడవాల్సిందే.. ఒకప్పుడు గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే ఆరోపణతో ఆర్టీసీ అధికారులు గ్రామాలకు బస్సులను నడిపేవారు కాదు. కానీ, ప్రస్తుతం అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నా నేటికీ ఆర్టీసీ బస్సు సర్వీస్‌లు మాత్రం కొనసాగడంలేదు. దీంతో రవాణా సౌకర్యం లేక రైతులు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని తిర్మలాపూర్,కల్లేపల్లి, ఈద్గాన్‌పల్లి, రాయపల్లి, నందిగామ, చెన్నవెల్లి, కుచ్చర్కల్, దోండ్లపల్లి, కుత్నేపల్లి, చొక్కంపేట్ తదితర గ్రామాలకు చక్కటి బీటీ రోడ్లు ఉన్నా ఇక్కడ ప్రాథమిక విద్య మాత్రమే అందుబాటులో ఉంది. పై చదువుల కోసం రాజాపూర్, రంగారెడ్డిగూడ, తిర్మలాపూర్లలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్య కోసం షాద్‌నగర్, జడ్చర్ల పట్టణాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, బస్సు సౌకర్యం లేకపోవడంతో నిత్యం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు నాలుగైదు కిలోమీటర్లు విద్యార్థులు నడవాల్సి వస్తుంది. అటు నుంచి ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలలు, కళాశాలలకు చేరుకుంటున్నారు. బస్సులే లేవు.. ఇక పాసులెందుకు? ఇదిలాఉండగా, విద్యార్థులకు ఆర్టీసి సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు పాసులు ఇస్తుంది.కానీ, బస్సులు లేకపోతే బస్సు పాసులెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఆటోలలో తమ పిల్లలను పక్క గ్రామాలకు చదువుకునేందుకు తప్పని పరీస్థితుల్లో పంపిస్తున్నారు. అంతేకాకుండ ప్రయివేటు వాహనాలను ఆశ్రయించడంతో ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి పల్లెకు ఆర్టీసీ బస్సు సర్వీస్ నడిపించాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. 6 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది ప్రతి రోజు పై చదువుల కోసం గ్రామం నుంచి జాతీయ రహదారి వరకు ఉదయం, సాయంత్రం నడుచుకుంటూ వెళ్లి వస్తాం. రోజూ 6 కిలోమీటర్లు నడక తప్పదు. ఎండాకాలం అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ వారు విద్యార్థులకు బస్సుపాసులు ఇస్తున్నారు. బస్సులే లేనప్పుడు ఇక పాసులెందుకు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నాం. -
ఆదాయం పెంచుతాం.. మరి వాటా ఇస్తారా..?
సాక్షి, హైదరాబాద్: బస్సుల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయా న్ని పెంచుతాం.. అందులో వాటా ఇవ్వండి.. ఇది అంతర్జాతీయంగా శాస్త్రీయ రవాణా విధానాన్ని ఏర్పాటు చేస్తున్న ఫ్రాన్స్ కంపెనీ ఆర్టీసీతో చేయబోతున్న బేరమిది. ప్రస్తుతం ఆర్టీసీ జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్లు లాభాల్లోకి రాగా, హైదరాబాద్ సిటీ జోన్ మాత్రం తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. తాజా నష్టాలు సంవత్సరానికి రూ.300 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి ఆర్టీసీని గట్టెక్కిస్తానంటోంది ఫ్రాన్స్ కంపెనీ. తమ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాల్సిందిగా ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన లుమీప్లాన్ అన్న సంస్థ ప్రతినిధులు ఆర్టీసీకి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటంతో అధికారులు కూడా ప్రయోగాత్మకంగా దాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్–కోఠి మార్గాన్ని పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కేటాయించారు. నెల పాటు ఆ మార్గం లో ఆ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి బస్సులను నిర్వహించనుంది. ఈ ప్రయోగం మార్చి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారు. సికింద్రాబాద్–కోఠి మార్గంలో.. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్–కోఠి మార్గం లో రూట్ నం.40, 86 బస్సులను ఆ సంస్థకు కేటాయించారు. ఈ రూట్లలో తిరుగుతున్న 23 బస్సుల్లో ఆ సంస్థ వెహికల్ మౌంటింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తోంది. అలాంటి పరికరాలనే ఆ మార్గాల్లోని బస్‌స్టాపుల్లో డిస్ప్లే బోర్డులతో అనుసంధానిస్తోంది. ఏ బస్సు ఎంత సేపట్లో వస్తుందనే సమాచారం డిస్ప్లే బోర్డుల్లో కనిపిస్తుందని సంస్థ చెబుతోంది. ట్రాఫిక్ జామ్స్ ను అంచనా వేసుకుంటూ సమయాలను చూపుతుంది. బస్‌లోని డిస్ప్లే బోర్డుల్లోనూ సమాచారం కనిపిస్తుంది. ట్రాఫిక్ చిక్కులు, ఇతర కారణాలతో ఒకే నంబర్ బస్సులు దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు సూచనలు చేరవేయడం ద్వారా వాటిని మళ్లీ క్రమబద్ధీకరిస్తారు. బస్సులను ఎలా నడపాలి, సిబ్బంది సమయా న్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి.. తదితరాలతో ప్రయాణికులకు చేరువ చేయటం దాని ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ప్రయోగం ఫలిస్తే బస్సులన్నీ.. నిర్ధారిత మార్గాల్లో పరిశీలించి ఎంత ఆదాయం పెరుగుతుందో నిర్ధారించుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆ సంస్థ అడిగే మొత్తం ఆమోదయోగ్యమా కాదా అని ఆలోచించనున్నారు. అనంతరం సిటీలో మొత్తం బస్సులను ఆ సంస్థ సాఫ్ట్వేర్ పరిధిలోకి తేవాలా వద్దా నిర్ణయించనున్నారు. -
ఆర్టీసీలో ఐ–టిమ్స్
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల రాక కోసం బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడకుండా ఉండేందుకు ఐ–టిమ్స్ (ఇంటెలిజెంట్–టికెట్ ఇష్యూ మిషన్) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. తొలిసారిగా సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం కొద్ది రోజులుగా అమలవుతోంది. ప్రయాణికుల సమయం ఆదాచేయడంతోపాటు, బస్సుల్లో కండక్టర్లపైన భారం పడకుండా ఉండేందుకు ఈ విధానం ఎంతగానో దోహద పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఐ– టిమ్స్, జీపీఎస్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి బస్సుల రాకపోకల సమయంతో పాటు, బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నా యి, ఎన్ని సీట్లు ప్రయాణికులతో నిండిపోయాయి, సమీప బస్‌స్టేషన్‌కు ఎంత సమ యంలో బస్సు చేరుతుందనే వివరాలు ముం దుగానే ప్రయాణికులకు తెలియజేస్తారు. తద్వారా ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సమ యం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బస్టాండ్లలో కండక్టర్లు ఐ–టిమ్స్ విధానంలో బస్సుల్లో కండక్టర్లు ఉండరు. బస్టాపుల్లో ఉంటారు. జీపీఎస్ టెక్నాలజీతోనే ఐ–టిమ్స్ మిషన్లు పనిచేస్తాయి. బస్టాండ్‌లో బస్సు బయల్దేరిన సమయం నుంచి సీట్ల వివరాల వరకు మొత్తం సమా చారం జీపీఎస్ టెక్నాలజీ ద్వారా తర్వాతి బస్టాప్‌లో ఉన్నటువంటి కండక్టర్‌కు చేరుతుంది. దీంతో అక్కడ వేచి ఉన్న ప్రయాణికులకు బస్సు వచ్చే సమయాన్ని చెప్పడంతోపాటు, ఖాళీగా ఉన్న సీట్ల వరకు ముందుగానే టికెట్లు జారీ చేస్తారు. ఈ విధంగా బస్సు చేరుకునే చివరి పాయింట్ వరకు ఎన్ని స్టాపులు ఉంటాయో అన్ని స్టాపుల్లోనూ కండక్టర్లు ఉంటారు. ఒక స్టాప్‌లో టికెట్లు ఇవ్వడం పూర్తికాగానే ఐ–టిమ్స్‌లో బిల్లు క్లోజ్ చేస్తారు. బిల్లు క్లోజ్ చేయగానే ఆ సమాచారం తర్వాతి స్టాప్‌లో ఉన్న కండక్టర్‌కు చేరుతుంది. పది రోజుల నుంచి సూర్యాపేట–నల్లగొండ మార్గంలో ఈ విధానం అమలవుతోంది. సూర్యాపేట డిపో ఎంపిక రాష్ట్రంలో సూర్యాపేట డిపోను ఎంపిక చేసుకుని ఐ–టిమ్స్ అమలు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి నల్లగొండ వరకు 50 కిలోమీటర్ల లోపు దూరం ఉండటం కూడా అందుకు ప్రధాన కారణం. ఐ–టిమ్స్ పనిచేయాలంటే నెట్వర్క్ అంతరాయం కలగకూడదు. ఈ మార్గంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య తలెత్తినా సులువుగా పరిష్కరించుకోవచ్చన్న ఉద్దేశంతో ఆర్టీసీ సూర్యాపేట డిపోను ఎంపిక చేసింది. అయితే ఈ ప్రయోగం ఒక్క సూర్యాపేట డిపోకు మాత్రమే పరిమితం చేయడంతో కండక్టర్ల వాడకం పెరిగింది. గతంలో 17 మంది కండక్లర్లు అవసరమైతే ఇప్పుడు 23 మంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో ఇద్దరు ఆపరేటర్లు. మొత్తం 25 మంది ఐ–టిమ్స్ కింద వివిధ బస్టాప్‌లలో పనిచేస్తున్నారు. అయితే అన్ని డిపోల్లో ఇదే విధానం అమల్లోకి వస్తే అప్పుడు కండక్టర్ల వాడకం తగ్గుతుందని అధికారులు తెలిపారు. దూర ప్రాంతాలకు మేలు ఐ–టిమ్స్ విధానం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మరింత మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ టు భైంసా, భద్రాచలం టు హైదారాబాద్, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులకు ఐ–టిమ్స్ సౌకర్యం ద్వారా సమయం కలిసొస్తుందని వారు అంటున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లోనే ప్రవేశపెడతారని చెప్పారు. త్వరలో ఆర్టీసీ మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీంతో బస్సుల సమయం, ఇతర వివరాలు అన్నీ మొబైల్లో చూసుకునే వీలుంటుంది. -
రూట్ మార్చిన బస్సు పరిశ్రమ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అదీ ఇదీ అని కాదు... దాదాపుగా బస్సులు తయారు చేసే కంపెనీలన్నీ ఇపుడు రూటు మార్చుకుంటున్నాయి. మెరుగైన ఆదాయాలు, భవిష్యత్తు దృష్ట్యా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఎలక్ట్రిక్, డబుల్ డెక్కర్ బస్సుల తయారీపై దృష్టి సారించాయి. ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం తెస్తున్న కొత్త ప్రమాణాలు, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మున్ముందు మన రోడ్లపై ఆధునిక బస్‌ల హవా ఉంటుందనేది పరిశ్రమ అంచనా. దేశంలో ఏటా 70–80 వేల బస్సులు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. 2018–19లో ఈ సంఖ్య 90 వేలు దాటుతుందని అంచనా. ఒకదాని వెంట ఒకటి.. వోల్వో, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, జేబీఎం, స్కానియా, బీవైడీ, గోల్డ్‌స్టోన్, కేపీఐటీ వంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చాయి. వోల్వో ఐషర్, వీర వాహన్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ బస్సులను పరీక్షిస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్, డెక్కన్ ఆటో నుంచి 2020 నాటికి ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. మహీంద్రా సైతం వీటి తయారీపై దృష్టి సారించగా... ప్రతి కంపెనీ కొత్త టెక్నాలజీపై పని చేస్తున్నట్లు సమాచారం. ‘‘దాదాపుగా బస్సుల తయారీలో ఉన్న కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ విభాగంపై ఫోకస్ చేశాయి. మేం కూడా ఈ విభాగంలో అడుగు పెడుతున్నాం’’ అని కరోన డైరెక్టర్ ఎం.బాలాజీ రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఉత్సాహం నింపిన టెండర్లు.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) 150 ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లను ఆహ్వానించడం పరిశ్రమలో ఉత్సాహం నింపింది. ప్రీ–బిడ్ సమావేశానికి దేశ, విదేశాలకు చెందిన 12 తయారీ కంపెనీలతో పాటు పదుల సంఖ్యలో ఆపరేటర్లు హాజరయ్యారు. అద్దెకు ఈ బస్సులను తీసుకోవాలనేది బీఎంటీసీ యోచన. ఎంపికైన కంపెనీలకు ఇది కిలోమీటరుకు నిర్దేశిత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. అలాగే కేంద్రం 10 స్మార్ట్ సిటీల్లో వెయ్యి బస్సుల్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. 2018 మార్చి 31లోగా టెండర్లు పూర్తి చేయనుంది. ఒక్కో బస్‌కు కేంద్రం రూ.65–85 లక్షలను భరిస్తుంది. ఇదీ బస్సు పరిశ్రమ... దేశవ్యాప్తంగా ఏటా రోడ్డెక్కుతున్న బస్సుల్లో ప్రైవేటు ఆపరేటర్లు 65 శాతం, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు 35 శాతం మేర కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో రూ.75 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ప్రీమియం బస్సులు 1,000 వరకూ ఉంటాయి. కస్టమర్ల డిమాండ్ నేపథ్యంలో 2018–19లో ప్రీమియం బస్సుల విక్రయాలు 3,000 యూనిట్ల దాకా ఉండొచ్చని పరిశ్రమ భావిస్తోంది. మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 55–60 శాతం ఉంది. ఇందులో అత్యధిక బస్సులు తెలుగు రాష్ట్రాల్లో పరుగెడుతున్నవే. నగరాల మధ్య డబుల్ డెక్కర్లు.. ఇప్పటి వరకూ సిటీకే పరిమితమైన డబుల్ డెక్కర్ బస్సులు ఇక నగరాల మధ్య పరిగెత్తనున్నాయి. మెర్సిడెస్ బెంజ్, వీర, వోల్వో, స్కానియా బ్రాండ్ల డబుల్ డెక్కర్లు 2019 కల్లా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇతర కంపెనీలూ వీటి సరసన చేరనున్నాయి. ఇటీవలే ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సుల నాణ్యత ప్రమాణాల కోసం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్–138ను తీసుకొచ్చింది. 80 మంది ప్రయాణించేలా సీట్ల సామర్థ్యం ఉంటుందని వీర బ్రాండ్ బస్సులను తయారు చేస్తున్న వీర వాహన ఉద్యోగ్ ఎండీ కె.శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బస్సు ధర రూ.1.8 కోట్ల వరకు ఉంటుందని, కాకపోతే ఆపరేటర్లకు వ్యయం కలిసి వస్తుందని చెప్పారు. ఇవి వస్తే పరిశ్రమకు కొత్త ఊపు వస్తుందన్నా్నరు. -
బస్సులకు, మెట్రోకు కామన్ కార్డు
న్యూఢిల్లీ : నగర రవాణా వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా కోసం వాడే బస్సులకు, మెట్రోకు కామన్ మొబిలిటీ కార్డును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాంచ్ చేశారు. దీంతో కామన్ మొబిలిటీ కార్డును లాంచ్ చేసిన తొలి నగరంగా ఢిల్లీ పేరులోకి వచ్చింది. మెట్రో రైళ్లతో పాటు, 200 డీటీసీ, 50 క్లస్టర్ బస్సులకు ఈ కార్డును వాడుకోవచ్చని లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. రవాణా వ్యవస్థలో తాము తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైనదని, ఢిల్లీ ప్రజలకు అనంతమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్డు లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి కొంచెం సేపు డీటీసీ బస్సులో ప్రయాణించారు. డెబిట్ కార్డు లాగానే ఈ కామన్ కార్డు పనిచేస్తుందని, ఏప్రిల్ 1 నుంచి డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో దీన్ని వాడుకోవచ్చని చెప్పారు. నగరవ్యాప్తంగా మొత్తం 3900 డీటీసీ, 1600కి పైగా క్లస్టర్ బస్సులు ఉన్నాయి. షీలా దీక్షిత్ ప్రభుత్వంలోనే ఈ కార్డును తొలిసారి ప్రతిపాదనలోకి వచ్చిందని, కానీ దీన్ని ప్రారంభించడం ఆలస్యం చేశారని కేజ్రీవాల్ అన్నారు. ఎందుకు ఆలస్యం చేశారో మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను అడగండంటూ సూచించారు. ఏదేమైనప్పటికీ, తమ ప్రభుత్వం ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ ప్రజలకు ప్రయాణం సులభతరం అవుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రో ఛార్జీలు పెంచిన నేపథ్యంలో దీనికి కౌంటర్‌గా కామన్ మొబిలిటీ కార్డును కేజ్రీవాల్ తీసుకొచ్చారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లోత్ కూడా ఉన్నారు. -
రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు
సాక్షి, సికింద్రాబాద్: ఉప్పల్ చెరువు కట్ట సమీపంలో పార్కింగ్ చేసిన ఉప్పల్ డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులకు గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఈ దుర్ఘటనలో బస్సుల ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అలాగే సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బస్సులకు నిప్పు పెట్టిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
బస్సు ఎక్కడుందో.. ఎప్పుడొస్తుందో..
సాక్షి, హైదరాబాద్: బస్టాప్‌లలో ప్రయాణికులు నిత్యం తమ తోటివారిని ఎప్పుడూ ఓ ప్రశ్న అడుగుతుంటారు. ఈ బస్సు ఎప్పుడొస్తుంది అని..! అడిగేవారికి ఎలా ఉన్నా చెప్పేవారు మాత్రం చిరాకుగా ఫీలవుతుంటారు. ఏదేమైనా ఎవరి సాయం లేకుండా ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు చేరుకుంటుందో అనే కచ్చితమైన సమాచారాన్ని తెలిపే ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును బస్టాపుల్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసింది ఆర్టీసీ ఈ ఆలోచనతోనే హైదరాబాద్‌లో ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాజెక్టుకు ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. పైలట్ ప్రాజెక్టుగా కోఠి–సికింద్రాబాద్ మార్గంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా 42 బస్సులతో ఈ వ్యవస్థను అనుసంధానిస్తున్నారు. బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు ఇప్పటికే రెండు ఫ్రెంచి కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేశాయి. దీన్ని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ శనివారం స్వయంగా పరిశీలించి ప్రారంభించనున్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావుల సమక్షంలో దీన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్న ఫ్రెంచి కంపెనీల నిర్వాహకులు ఈ ప్రాజెక్టు పనిచేసే తీరును ఫ్రాన్స్ రాయబారి, రవాణాశాఖ మంత్రి, అధికారులకు వివరిస్తారు. అలాగే అది పనిచేసే తీరును సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుపై ప్రత్యక్షంగా పరిశీలించి చూపుతారు. ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం.. 50 లక్షల వాహనాలతో కిటకిటలాడుతున్న భాగ్యనగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సగటు ప్రయాణికుడు నానా ఇబ్బంది పడాల్సివస్తోంది. బస్సు ప్రయాణికులు ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. దీని సాయంతో ఏ బస్సు ఎక్కడుందో, ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు చేరుకుంటుందో, దాని వెనక మరెన్ని బస్సులు ఎక్కడెక్కడున్నాయో తదితర కచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవచ్చు. -
ఇదేం పద్ధతి..!?
♦ ముఖ్యమంత్రి సభకు రైతుల తరలింపు బాధ్యత అధికారులకు.. ♦ ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ♦ పోలీసుల ఆంక్షలతో ట్రాఫిక్ కష్టాలు పామర్రు/ పెదపారుపూడి/ రెడ్డిగూడెం : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రైతులను భారీ సంఖ్యలో తీసుకురావాలని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మండలస్థాయి అధికారులు గ్రామస్థాయిలోని వీఆర్వోల వైపు చూశారు. అంతే వారు నయానో భయానో రైతులను తహసీల్దార్ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. ఇక అక్కడి నుంచి బస్సుల్లో వారిని కార్యక్రమం జరిగే ప్రాంతానికి తరలించారు. రవాణా ఖర్చుల భారం కూడా కిందిస్థాయి ఉద్యోగులపైనే మోపినట్లు సమాచారం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ఇలా వాడుకోవడంపై పలువురు ఇదేం పద్ధతి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నుంచి రెండు బస్సులు, పెదపారుపూడిలో ఒక బస్సులో అతికష్టంపై రైతులను అధికారులు తరలించారు. సీఎం సభలో పోలీసుల అత్యుత్సహం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఆంక్షాలు విధిస్తూ అత్యుత్సహం ప్రదర్శించారు. దీంతో అక్కడకు చేరుకున్న రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులను సైతం జలహారతి, సభ ప్రాంగాణానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎం సభను విజయవంతం చేయడానికి రెండు జిల్లాల పరిధిలోని 9 నియోజకవర్గాల్లోని రైతులు, ప్రజలను అధికార పార్టీ నాయకులు ఇక్కడకు తరలించారు. సీఎం సభ ప్రాంగణం తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేయడంతో కొంత మందిని రోడ్లపైనే నిలుపుదల చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం ట్రాఫిక్ కారణంగా ద్విచక్ర వాహనంపై సభ వేదిక వద్దకు చేరుకున్నారు. జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జలహారతి, సభ వేదిక వద్దకు స్థానిక జర్నలిస్టులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఆర్వో జారీ చేసిన పాసులు ఉన్నప్పటికీ పోలీసులు లెక్కచేయలేదు. ఈ క్రమంలో జర్నలిస్టులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. చివరకు పోలీసులు అనుమతించారు. -
స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుంటే చర్యలు
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి రాజమహేంద్రవరం క్రైం : స్కూల్, కళాశాల బస్సులు ఫిట్నెస్ లేకుంటే ఆ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు. ఎస్‌కేవీటీ కళాశాలలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ను, నిర్వహణను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 719 బస్సులకు 574కు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. మే 15వ తేదీకి ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగుస్తుందని రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రోడ్డు రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఐదు టీమ్‌లు ఏర్పాటు చేశామని ఇవి హైవేపై పెట్రోలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాయన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి స్కూల్, కాలేజీ బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, క్లినర్ లేకుండా బస్సులు తీయవద్దన్నారు. విద్యార్థులు బస్సులో నుంచి చేతులు బయట పెట్టకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నోడల్ ఆఫీసర్ భరత్ మాతాజీ, సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐలు చింతా సూరిబాబు, బాజీలాల్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీ రావు, ఎస్సై రాజశేఖర్, రోడ్ రవాణా శాఖల అధికారులు సాయినాథ్, పరందామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.