
విశాఖ : విశాఖ జిల్లా పెందుర్తిలో అగ్ని ప్రమాదం జరిగింది. నారాయణ కాలేజీకి చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే పార్క్ చేసిన బస్సులు దగ్ధం అవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బస్సులు నిలిపి ఉంచిన స్థలంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పార్కింగ్‌లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత కాస్త తగ్గింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment