![Fire Accident At KGH Visakhapatnam No Casualties Reported](/styles/webp/s3/article_images/2024/06/18/vsp.jpg.webp?itok=jAcEa_3-)
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సీఎస్‌ఆర్ బ్లాక్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే దట్టంగా పొగ అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
సీఎస్‌ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలు, సర్జికల్ ఐసీయూకి తరలించారు. తర్వాత వెంటిలేటర్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాదాధికారి డాక్టర్ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు. రాత్రి 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని, 1గంట సమయానికి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment