kgh hospital
-
వైద్య సౌకర్యాలు లేక విశాఖ KGHలో రోగుల అవస్థలు
-
పసికందు కోసం కన్నతండ్రి కష్టం..
-
విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
-
విశాఖ కేజీహెచ్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సీఎస్ఆర్ బ్లాక్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే దట్టంగా పొగ అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సీఎస్ఆర్ బ్లాక్ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్ బ్యాటరీ పేలడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వార్డులో ఉన్న ఏడుగురు రోగులను పిల్లలు, సర్జికల్ ఐసీయూకి తరలించారు. తర్వాత వెంటిలేటర్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాదాధికారి డాక్టర్ శివానంద ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ జరిపిస్తామన్నారు. రాత్రి 12గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని, 1గంట సమయానికి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. -
బ్రెయిన్ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని మృతి
గుమ్మలక్ష్మీపురం: బ్రెయిన్ కేన్సర్‌తో గిరిజన విద్యార్థిని హిమరిక ప్రమీల(13) విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. కొమరాడ మండలంలోని గాజులగూడకు చెందిన ప్రమీల గుమ్మలక్ష్మీపురం మండలం, రేగిడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 13వ తేదీన జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, వైద్యసేవలు అందజేశారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో ఈ నెల 14వ తేదీన విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, ప్రమీలకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధం కాగా, ప్రమీల శరీరం సహకరించడం లేదు. అలా చికిత్స అందిస్తుండగా, ఒకానొక దశలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఐసీయూకి తరలించి, ఆక్సిజన్ సదుపాయం కల్పించినా ఫలితం లేదని, చికిత్స పొందుతూ మృతి చెందిందని ఏటీడబ్ల్యూవో సురేష్‌కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే...
ఆరిలోవ (విశాఖ తూర్పు): రోజంతా తల్లితో సరదాగా గడిపాడు. సాయంత్రం అన్నయ్యతో కలిసి ఆడుకున్నాడు. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారనుకుని సంబరపడిన ఆ తల్లికి ఒక్కసారిగా షాక్ తగిలింది. తన చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. జీవీఎంసీ 13వ వార్డు పరిధి విశాఖ కేంద్ర కారాగారం పక్కన శ్రీకృష్ణాపురంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికులను కంటతడిపెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... ఈ కాలనీలో గుబ్బల నాగమణి కొన్నాళ్లుగా ఇద్దరు కుమారులతో భర్తకు దూరంగా నివాసముంటుంది. పెద్ద కుమారుడు(4), చిన్న కుమారుడు(2) తల్లితోపాటు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఇంట్లోనే ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. ఆటాడుతుండగా చిన్న కుమారుడు గగన్(2)కు ఓ మేకు దొరికింది. ఆ మేకును తీసుకెళ్లి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులో పెట్టడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడి తల్లి గమనించి స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దారిలోనే ప్రాణాలు విడిచిపెట్టడంతో తిరిగి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అంతవరకు సరదాగా ఆడుకొన్న తన కుమారుడు మృతి చెందడంతో నాగమణి కన్నీటిపర్యంతమైంది. ఆమె వేదన స్థానికులను కంటితడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసుల కేసు నమోదు చేశారు. భర్త, పిల్లలు కళ్లెదుటే... పీఎం పాలెం (భీమిలి): మారికవలస కూడలికి సమీపంలోని పెట్రోలు బంకుకు ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ వివాహిత ప్రమాద స్థలిలోనే ప్రాణాలు విడిచింది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు, భార్య స్వర్ణ(30) కుటుంబంతో ఉద్యోగరీత్యా సబ్బవరంలో నివసిస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగులే. అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భార్య స్వర్ణ వీఎంఆర్డీఏ ఉద్యోగి. ప్రస్తుతం వుడా పార్కులో టికెట్ బుకింగ్ కౌంటర్లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బుడతనాపల్లి నుంచి నగరంలోని ఆరిలోవలో అత్తవారింటికి భార్య స్వర్ణ, కుమారుడు(4), కుమార్తె(8), అంతే వయసున్న అన్న కూమార్తెతో అర్జునరావు బైక్‌పై బయలుదేరాడు. వీరు మారికవలస కూడలికి సమీపంలో పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న స్వర్ణ పడిపోగా ఆమె పైనుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించింది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో పిల్లలిద్దరూ షాక్‌కు గురయ్యారు. పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త అర్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. దూసుకొచ్చిన మృత్యుదేవత పెదవాల్తేరు (విశాఖ తూర్పు): లారీ బ్రేకులు ఫెయిలై మృత్యుదేవతలా దూసుకొచ్చి యువకుడి ప్రాణాలు బలిగొంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవాల్తేరు అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న అత్తోట కన్నా వెంకటరత్నం ఇద్దరు కుమారులతో కలిసి నేతాజీవీధిలో నివసిస్తున్నారు. చినవాల్తేరులో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె, చిన్న కుమారుడు కనకరాము (32) కనకమహాలక్ష్మి అమ్మవారి మాల ధరించారు. కుమారుడు వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జరిగిన హోమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటరత్నం ఆలయంలో వుండిపోగా, కనకరాము నేతాజీవీధిలో గల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. ఇంతలో ఓ క్వారీ లారీ చినవాల్తేరు పాత సీబీఐ డౌన్ మీదుగా నేతాజీవీధివైపు వస్తూ బ్రేకులు ఫెయిలవ్వడంతో అతివేగంగా దూసుకొచ్చింది. గమనించిన పాదచారులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కనకరాము కూడా కాలువ మీదకు వెళ్లిపోయినా అప్పటికే లారీ బలంగా ఢీకొనడంతో శరీరంపై పెద్ద గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీకి, కాలువకు మధ్య కనకరాము ఇరుక్కుపోయి మరణించడం స్థానికులను కలిచివేసింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్లలోంచి భయాందోళనలతో బయటకి వచ్చారు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు, త్రీ టౌన్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ట్రాఫిక్ ఎస్ఐ అసిరి తాత, త్రీటౌన్ ఎస్ఐలు జె.ధర్మేంద్ర, హరీష్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. డ్రైవర్ దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసుని త్రీటౌన్ సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్ఐ హరీష్ దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: గ్రామగ్రామానికీ ఇంటర్నెట్ ) -
అత్యాచార బాధితురాలికి ఎమ్మెల్యే పరామర్శ
నర్సీపట్నం: అత్యాచారానికి గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శనివారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు సమకూర్చిన రూ.2 లక్షల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, కౌన్సిలర్ బోడపాటి సుబ్బలక్ష్మి, కోఅప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ నాయకులు చింతకాయల వరుణ్, గుడబండి నాగేశ్వరరావు, మామిడి శ్రీనివాసరావు, అయ్యరక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, బుజ్జి, లలిత ఉన్నారు. -
విశాఖ KGH ఆస్పత్రిలో కిడ్నాప్ కలకలం
-
విశాఖ కెజిహెచ్ లో కోవిడ్ రోగీ ఆత్మహత్యాయత్నం
-
విశాఖ కేజీహెచ్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడి
-
కరోనా భయం వీడి జాగ్రత్తలు పాటించాలి
-
అందమే శాపమై.. హత్యకు గురైన దివ్య
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును విశాఖ పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్య మృతదేహానికి శనివారం కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆమె శరీరంపై 33 చోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిసింది. దివ్యను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆమెతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటట్లు చేసిన అక్కయ్యపాలెం నందినగర్ నివాసి వసంత అనే మహిళే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బతుకుదెరువుకు వచ్చి బలి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఊబలంకకు చెందిన దివ్య(20) తల్లిదండ్రులు చనిపోవడంతో బతుకుదెరువు కోసం వసంత(30) దగ్గరకు వచ్చింది. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వసంత దివ్యను కూడా వ్యభిచార రొంపిలోకి దింపింది. కొన్నాళ్లకు తన అందంతో ఎదుగుతున్న దివ్యను చూసి అసూయ, ద్వేషాలకు గురైన వసంత దివ్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ముందుగా దివ్య అందాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుని ఇంట్లో బంధించి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసింది. వీటిని భరించలేక దివ్య బుధవారం రాత్రి మృతి చెందింది. అంతిమయాత్ర వాహన యజమాని అనుమానంతో... దివ్య మరణించాక.. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు జ్ఞానాపురం ప్రాంతంలోని అంతిమ యాత్ర వాహనం యజమానికి ఫోన్ చేసి ఎంత డబ్బయినా ఇస్తానని వసంత ఆశ చూపించింది. అనుమానం వచ్చిన వాహన యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దివ్యది సహజ మరణంగా చూపడానికి ఆమె ప్రయత్నించింది. దివ్య మృతదేహంపై గాయాలు ఉండడాన్ని గమనించి హత్య కోణంలో దర్యాప్తు చేశారు. వసంత హత్యా నేరం అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులో వసంత సోదరి, మరిదిని అదుపులోకి తీసుకున్నారు. 2015లో దివ్య కుటుంబ సభ్యుల హత్య దివ్య కుటుంబ సభ్యులు కూడా 2015లో హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మలను కూ డా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ హత్యలపైనా పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
నిర్లక్ష్యం వద్దు.. బాధ్యతగా పనిచేయండి
సాక్షి, విశాఖపట్నం: నిర్లక్ష్యధోరణి వీడి.. వైద్యులు బాధ్యతయుతంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కింగ్ జార్జి ఆసుపత్రిలో వివిధ విభాగాలను డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పుష్పశ్రీవాణి, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. అనంతరం జెడ్పీ హాలులో సమీక్షా సమావేశంలో వీరంతా పాల్గొన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. కేజీహెచ్‌లో కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గతంలో కొన్ని మరణాలు సంభవించాయని తెలిపారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పోస్టు మార్టం చేయడానికి కూడా గిరిజనులు, పేదల నుంచి లంచం తీసుకుంటున్నారని మండిపడ్డారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యులుగా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే కృత నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వైద్యులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సంతృప్తిగా లేను.. మళ్లీ మళ్లీ తనిఖీలు చేస్తా: ఆళ్ల నాని కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజనులకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ కూడా అధ్వాన్నంగా ఉందన్నారు. కేజీహెచ్‌లో పరిస్థితులు మారాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి నిరుపేదకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం నెరవేరేలా పనిచేయలన్నారు. వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని మళ్లీ మళ్లీ వచ్చి తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న బ్లాక్‌ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఎంసిహెచ్‌లో అదనపు బ్లాక్‌ను మంజూరు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే అవినీతి: అవంతి పేదలకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందండం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కేజీహెచ్‌లో అవినీతి పెరిగిపోయిందన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి.. బంధువులకి అప్పగించడానికి కూడా లంచాలు తీసుకుంటున్న దుస్థితి ఉందన్నారు. ఆసుపత్రిలో అవినీతిని రూపు మాపాలన్నారు. కేజీహెచ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్లో అధిక వాటాను ఉత్తరాంధ్రకు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ అభివృద్ధి: ద్రోణంరాజు శ్రీనివాస్ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో కేజీహెచ్ ఆసుపత్రి బాగా అభివృద్ధి చెందిందని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఆయన హయాంలో రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు వైఎస్సార్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వైద్యం, విద్యపై దృష్టి పెట్టారన్నారు. కేజీహెచ్‌కు రెండు కోట్ల అదనపు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేజీహెచ్‌లో అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగింది: ఎంపీ సత్యవతి దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో పేదలకు ఎంతో మేలు జరిగిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి అన్నారు. కేజీహెచ్‌లో చిన్న పిల్లల వార్డుకి మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. -
నిండు గర్భిణీని కాళ్లతో తన్నిన భర్త
-
అభాగ్యురాలిపై కట్న పిశాచి పంజా
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తల్లిదండ్రులు ఎవరో.. అయిన వారెవరో తెలియని మూడేళ్ల ప్రాయంలో దొరికిన చిన్నారిని, ఆమె అన్నను పోలీసులు ప్రేమ సమాజంలో చేర్పించారు. సమాజం అండతో చదువుకుని సొంత కాళ్లపై బతుకుతున్న క్రమంలో... ఆదర్శ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆ యువతికి ప్రస్తుతం నరకం చూపిస్తున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని అనాథ యువతిపై తల్లితో కలిసి దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆ తల్లీకొడుకు దాష్టీకానికి పాల్పడడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే... ప్రేమగా చూసుకోవాల్సిన భర్త, అత్త అదనపు కట్నం కోసం ఆరు నెలల గర్భిణిపై అమానుషంగా దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు గిరిజాల రాజేశ్వరి (23) కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతోంది. బాధితురాలు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడి వారో తెలియని రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను పోలీసులు డాబాగార్డెన్స్ ప్రేమ సమాజంలో కొద్ది సంవత్సరాల కిందట అడ్మిట్ చేర్పించారు. అప్పటికి రాజేశ్వరికి మూడేళ్లు, చంద్రశేఖర్‌కు ఆరేళ్లు. ప్రేమ సమాజం అందించిన సాయంతో రాజేశ్వరి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం వరకూ చదువుకొంది. అయితే యుక్త వయసు వచ్చిన వారు ప్రేమ సమాజంలో ఉండే అవకాశం లేనందున బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఎన్ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్‌ను పెట్టుకుంది. ముందే పెళ్లి చేసుకుని మోసగించి... వివాహం జరిగిన తర్వాత కొంత కాలం రాజేశ్వరిని బాగా చూసుకున్న అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపించడం మొదలు పెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారు గొలుసును అమ్మించి దామోదర్ కారు కొనుక్కున్నాడు. అయితే దామోదర్‌కు స్వాతి అనే యువతితో ముండే వివాహం జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. ఒక రోజు రాజేశ్వరికి స్వాతి ఫోన్‌చేసి ఎలా అయినా చంపించేస్తానని హెచ్చరించింది. దీంతో రాజేశ్వరి భర్తను నిలదీయగా తనకు ఇదివరకే వివాహం జరిగిందని ఒప్పుకోవడంతోపాటు మరింతగా హింసించడం మొదలు పెట్టాడు. వివాహమైన రెండేళ్లలో మూడు అబార్షన్లు చేయించాడు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన రాజేశ్వరిని అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది. కలర్స్ సంస్థలో పనిచేస్తూ బతుకుతున్న రాజేశ్వరి వద్దకు మంగళవారం మధ్యాహ్నం వచ్చిన దామోదర్ ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంటి నుంచి బటయకు తీసుకొచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతోపాటు దామోదర్ విపరీతంగా కారులోనే కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతుంది. అన్ని పరీక్షలు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారు. కట్నం వద్దంటూనే వేధింపులు రాజేశ్వరి, ఆమె అన్న చంద్రశేఖర్ ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అక్కడి వృద్ధాశ్రమంలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చిపోతుండేవారు. ఆ క్రమంలో రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ సమాజం నుంచి వెలుపలికి వచ్చి బ్యూటీ పార్లర్ తెరిచిన తరువాత తల్లీ కొడుకు రాజేశ్వరిని, ఆమె అన్న చంద్రశేఖర్‌ను కలుసుకున్నారు. రాజేశ్వరిని తన కొడుకు దామోదర్‌కు చేసుకుంటానని చెప్పారు. తమ పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నారు కనుక కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్‌తో అటువంటివి అక్కరలేదని చెప్పి, వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా తమ వద్ద డబ్బులు లేవని, ఎలా అయినా డబ్బులు సర్దుబాటు చేయాలని దామోదర్ తల్లి లలిత చెప్పడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్ రూ.1.20లక్షలు ఇచ్చారు. -
కనిపించని కేజీహెచ్ నీడ
విశాఖ సిటీ: ఈ మధ్యన వచ్చిన నెపోలియన్ సినిమాలో హీరో నా నీడపోయింది సార్ అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాడు. సరిగా ఇదే తరహాలో కేజీహెచ్ సిబ్బంది ఆస్పత్రిలో ఈ రోజు ‘షాడో’ కనిపించలేదుగా అంటూ గుసగుసలాడుకున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఆస్పత్రిని, సూపరింటెండెంట్ని అంటిపెట్టుకుని ఉండే సదరు ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగి ఆదివారం ప్రచురితమైన సాక్షి కథనంతో కేజీహెచ్ ఛాయల్లోకి రాలేదు. ఉదయం 9 గంటలకే ఆస్పత్రికి వచ్చినసూపరింటెండెంట్.. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కేజీహెచ్‌పై పెత్తనం చెలాయిస్తున్న అనధికారి ఖాన్ వ్యవహార శైలిపై సాక్షి దినపత్రికలో ‘కేజీహెచ్‌కు నీడ.. పీడ’ శీర్షికన ప్రచురితమైన కథనంతో కింగ్‌జార్జి ఆస్పత్రిలో కలకలం రేగింది. ప్రతిరోజూ సిబ్బంది, వైద్యాధికారులపై పెత్తనం చెలాయించే సదరు సూపరింటెండెంట్ షాడో ఆదివారం మాత్రం కానరాలేదు. ఈ రోజు ప్రశాంతంగా పని చెయ్యగలుగుతున్నామని పలువురు వైద్యులు వ్యాఖ్యానించడం కనిపించింది. మరోవైపు ఏదైనా అత్యవసర సేవలు, ముఖ్య కార్యక్రమాలైతే తప్ప ఆదివారం ఆస్పత్రికి రాని సూపరింటెండెంట్ ఆదివారం ఉదయం 9 గంటలకే కేజీహెచ్‌కు వచ్చేశారు. ఇది ఆస్పత్రిలో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఖాన్’ట్రాక్టు ఉద్యోగిగా ఐడీ కార్డు హల్చల్ ఇదంతా ఒకెత్తయితే ఇన్నాళ్లూ అనధికారికంగానే ఆస్పత్రిలో చలామణి అయిన షాడో ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. కానీ సాక్షి కథనం ప్రచురితమైన తర్వాత ఆయన కేజీహెచ్‌లోని ఓ విభాగంలో ‘ఖాన్’ట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఐడీ కార్డు హల్చల్ చేసింది. ఇది నిజమైనదా ఉన్నఫలంగా తయారు చేసిందా అనే విషయంపై మాత్రం కేజీహెచ్ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది. అయితే శానిటేషన్ ఏజెన్సీ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సూపరింటెండెంట్ కారులో తిరుగుతూ ఆయన చాంబర్ చుట్టు పక్కలా కనిపించే పని ఏముంటుందని కేజీహెచ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ1 కాంట్రాక్టు ఉద్యోగే ఎ.ఖాన్ అనే వ్యక్తి ఎ1 ఔట్సోర్సింగ్ శానిటేషన్ ఏజెన్సీలో వర్క్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున ఓ ప్రకటనలో తెలిపారు. కేజీహెచ్‌లో జరిగే వివిధ పనులకు సంబంధించిన పర్యవేక్షణ చూస్తారని పేర్కొన్నారు. పరిపాలన పరమైన విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఖాన్‌పై ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని, ఒకవేళ ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై విచారణ చేపట్టి సదరు వ్యక్తిపైనా, సంస్థపైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
కాటేసిన ఆర్థిక కష్టాలు
మూడు దశాబ్దాల క్రితం మనసైన వాడిని మనువాడింది... ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోవడంతో కట్టుకున్నవాడి చేయి పట్టుకుని వచ్చేసింది... వారి ప్రేమకు ప్రతిరూపాలుగా ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చింది...చిరువ్యాపారంలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో అనారోగ్యం ఓ కొడుకుని కభళించింది. దాని నుంచి తేరుకునేలోపే విధి భర్తను కూడా దూరం చేసింది. అంతే ఆమె జీవీతంలో ఆనందం దూరమై కొండంత విషాదంఅలముకుంది. దానికితోడు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. కష్టకాలంలో ఆదుకునేవారు లేక... భవిష్యత్‌పై ఆశలు అడియాశలుకావడంతో ఆ ఇల్లాలు తనువు చాలించాలని నిర్ణయానికి వచ్చేసింది... తనతో పాటు తన రక్తం పంచుకు పుట్టిన ఇద్దరి పిల్లలకూఈ కష్టాలు వద్దని విషాన్ని పంచిపెట్టి తనువు చాలించింది... ఆ ఇద్దరు కుమారులు మృత్యువుతో పోరాడుతున్నారు... తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన మంగళవారం పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది. విశాఖపట్నం, పెందుర్తి: ఆర్థిక కష్టాలు భరించలేక ఓ తల్లి సహా ఇద్దరు కుమారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తల్లి మరణించగా ఇద్ద రు కుమారుల పరిస్థితి విషమంగాఉంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మం డలం గులివిందాడ గ్రామానికి చెందిన కేదారశెట్టి లింగరాజు, రమ(45) 29 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అం గీకారం లేకపోవడంతో బతుకుదెరువు కోసం చినముషిడివాడ ప్రాంతానికి వచ్చేశారు. వీరికి గణేష్తేజ(25), అజయ్‌కుమార్, దుర్గావరహాలుశెట్టి(21) సంతానం. వీరికి సుజాతనగర్లో టిఫిన్ దుకాణం జీవనోపాధిగా ఉంది. దీంతో పాటు పండగ సమయంలో సరుకులు ఇచ్చేందు కు ‘పండగ చిట్టీలు’ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం వీరి రెండో కుమారు డు అజయ్‌కుమార్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.అప్పటి నుంచి లింగరాజు వ్యాపారానికి దూరం కావడంతో పాటు మద్యానికి బానిసై తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పండగ చిట్టీల కోసం సేకరించిన సొమ్ము సుమారు రూ.10లక్షలు అతని వైద్యానికి ఖర్చయిపోయింది. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించి 25 రోజుల క్రితం లింగరాజు కన్నుమూశాడు. దీంతో ఒక్కసారిగా రమ, ఇద్దరు కుమారులపై ఆర్థిక భారం పడింది. విషం తీసుకున్న తరువాత ఆస్పత్రికి తరలించే సమయంలోబాధితులకు సపర్యలు చేస్తున్న స్థానికులు సమస్యలుచుట్టుముట్టడంతో... పండగ చిట్టీల కోసం సేకరించిన సొమ్ము ఇవ్వాల్సిన సమయం దగ్గర పడడంతో వీరి ఆందోళన మరింత పెరిగింది. ఓవైపు కుటుం బం చిన్నాభిన్నం కావడం... మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో రమ, గణేష్, వరహాలుశెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం ఇంటికి విషం తెచ్చుకుని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని ముగ్గురూ సేవించారు. కాసేపటికి అటుగా వెళ్తున్న వారు విషం వాసన గమనించి ఏం జరిగిందో అని ఇంటిలోకి చూడగా ముగ్గురూ అపస్మారకస్థితిలో ఉన్నారు. వెంటనే స్థానికులంతా కలిసి వారికి సపర్యలు చేసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలోనే రమ కన్నుమూసింది. గణేష్ తేజ, దుర్గావరహాలుశెట్టి ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అన్నదమ్ముల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ రొంగలి అప్పలనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల పరిస్థితి విషమం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పెందుర్తి మం డలం చినముషిడివాడ గ్రామానికి చెందిన అన్నదమ్ములు కడిమిశెట్టి దుర్గ, కడిమిశెట్టి గణేష్‌లు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అత్యవసర వైద్య విభా గంలో చికిత్స పొందుతున్న వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వీరితో పాటు పురుగుల మందు తాగిన కడిమిశెట్టి రమను ప్రాణం పోయిన తరువాత ఆస్పత్రికి తీసుకురావడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించామని తెలిపారు. అన్నదమ్ముల పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరికీ వెంటిలేటర్ల సాయంతో కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత శ్రద్ధతో బాధితులకు అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయనతోపాటు ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, అత్యవసర వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి, విభాగ సిబ్బంది ఉన్నారు. బంధువులు ఆదుకునే అవకాశం ఉన్నా..! ఓ వైపు కుటుంబంలో ఇద్దరిని తక్కువ వ్యవధిలో దూరం చేసుకోవడం... ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం వల్లే రమ కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. భార్యాభర్తలు టిఫిన్ సెంటర్ నిర్వహించుకుంటుండగా... పెద్దకుమారుడు గణేష్తేజ చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. దుర్గా వరహాలుశెట్టి పెందుర్తిలోని ఓ మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితం తండ్రి లింగరాజు మరణించడంతో చెన్నై నుంచి వచ్చిన గణేష్ తండ్రి కర్మక్రియలు పూర్తయినా తిరిగి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడు. అయితే ఈ కుటుంబం ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం చూసిన స్థానికులు చొరవ తీసుకుని గులివిందాడలో ఉన్న రమ కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లారు. దాదాపు 29 ఏళ్ల తరువాత రమ పుట్టిన ఊరికి వెళ్లడంతో వారు కూడా ఆదరించినట్లు తెలుస్తుంది. ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమైనప్పటికీ కొంత సమయం కావాలని వారు చెప్పినట్లు బోగట్టా. అయితే పండగకు భారీ ఎత్తున చిట్టీల సామాగ్రి ఇవ్వాల్సి ఉండడంతో రమకు ఆందోళన పెరిగిపోవడం... తక్కువ సమయంలో అంత మొత్తం ఇచ్చే పరిస్థితి లేకపోవడం... చిట్టీలు కట్టిన వారు ఎవరైనా నిలదీస్తే పరువు పోతుందన్న భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అంతా భావిస్తున్నారు. -
నాకు ప్రాణహాని ఉంది సర్: నిందితుడు శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం బాగాలేదని పోలీసులకు తెలపడంతో కేజీహెచ్‌కు శ్రీనివాసరావును పోలీసులు తరలించారు. పోలీసులు శ్రీనివాసరావును భూజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లి వ్యాన్‌లో కూర్చోబెట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆహారం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లే సందర్భంగా ‘నాకు ప్రాణహాని ఉంది సర్’ అని శ్రీనివాసరావు పేర్కొనడం గమనార్హం. ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పడంతో వైద్యులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పరీక్షలు చేసిన వైద్యుల సూచనల మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్‌కు తరలించారు. తన అవయవాలను దానం చేయాలంటూ నిందితుడు డాక్టర్లతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు సమాచారం. సమస్య ఏంటి అని అడిగితే.. నాకు వైద్యం కాదు.. అవయవ దానం చేయడానికి సహకరించాలంటూ వైద్యులతో శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. బీపీ, పల్స్ రేట్లు నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కేజీహెచ్ నుంచి నిందితుడు శ్రీనివాస్‌ను డిశ్చార్జ్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రతి 48 గంటలకు కస్టడీలో ఉన్న నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలి. అందులో భాగంగానే ప్రైవేట్ వైద్యునితో పరీక్షించామన్నారు. కోర్టుకి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ కేజీహెచ్‌కి వైద్య పరీక్షల కోసం తరలించామని పేర్కొన్నారు. విచారణ సాఫీగా సాగుతోందని చెప్పారు. -
కేజీహెచ్ కిటకిట
విశాఖపట్నం: జ్వరాలతో నగరం విలవిలలాడుతోంది. దీంతో కేజీహెచ్‌కు రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఓపీ వద్ద రోగులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఉదయం వెళ్తే మధ్యాహ్నం వరకూ క్యూ లైన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఓపిక లేనివాళ్లు అక్కడే కూర్చుండిపోతున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం మందుల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. గంటల కొద్దీ క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం కేజీహెచ్‌కు వేలాది మంది వైద్యం కోసం తరలివచ్చారు. ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్ సోమవారం కిటకిటలాడింది. వ్యాధులు ప్రబలుతుండడంతో పాటు ఒడిశా నుంచి కూడా రోగులు రావడంతో ఏ వార్డు చూసినా రద్దీగానే కనిపించాయి. శని, ఆదివారాల్లో సేవలు తగ్గిపోవడం, మంగళవారం గాంధీ జయంతి నేపథ్యంలో వైద్యులు అందుబాటులో ఉంటారో ఉండ రో అని చాలామంది రోగులు సోమవారమే ఆస్పత్రికి వచ్చారని సిబ్బంది చెప్పారు. రక్తపరీక్షల నివేదికలు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12గంటల లోపే తీసుకోవాల్సి ఉండడంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడా యి. మందులిచ్చే గది వద్దా చాంతాడంత క్యూ కనిపిం చింది. ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులుండడం ఇక్కడ సర్వసాధారణమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇద్దరికీ రెండు సెలైన్లు సిద్ధం చేయడం కనిపించింది. బాలింతలు, దివ్యాంగులు, గాయాలపాలైన వాళ్లూ.. ఇలా కేజీహెచ్‌లో జనం భారీగా ఉన్నారు. పారిశుద్ధ్య లోపం, స్ట్రెచర్లు లేకపోవడంతో రోగులు నడుచుకుంటూ రావడం సరేసరే.. -
కేజీహెచ్ ఉద్యోగుల్లో ఏసీబీ దాడుల భయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్ ఉద్యోగుల్లో ఏసీబీ భయం పట్టుకుంది. ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, కేజీహెచ్ మెడిసిన్ స్టోర్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్ కె.ఈశ్వరరావుకు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న అభియోగంపై ఏసీబీ దాడుల నేపథ్యంలో కేజీహెచ్ వైద్యులు, ఇతర సిబ్బందిలో ఆందోళన నెలకొంది. బుధవారం కేజీహెచ్‌లో ఎక్కడ చూసినా ఏసీబీ దాడుల అంశాన్నే చర్చించుకోవడం కనిపించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు కేజీహెచ్‌నే అంటిపెట్టుకుని ఈశ్వరరావుతో సన్నిహితంగా మెలిగిన ఉన్నతాధికారులు, మాజీ సూపరింటెండెంట్లు, మరికొందరు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. తీగలాగితే డొంక కదులుతుందన్న నమ్మకంతో ఏసీబీ అధికారులు అనుమానితుల ఆస్తులపై సోదాలు నిర్వహించనున్నట్టు తెలు స్తోంది. ఎన్జీవో సంఘం అధ్యక్షునిగా ఉన్న ఈశ్వరరావు తన పై అధికారులను మచ్చిక చేసుకుని ఆస్తులను కూడబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈశ్వరరావు అక్రమ సంపాదనకు పరోక్షంగా ఎవరు సహకరించార న్న దానిపై ఏసీబీ గురి పెట్టింది. ఆయనను ప్రోత్సహించిన వారికి చేకూరిన లబ్ధిపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో భూములు, స్థలాలు, ఇళ్ల కొనుగోలు కు సంబంధించి ఎవరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారో సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసిం ది. అంతేగాక కేజీహెచ్‌లో ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన సీనియర్ వైద్యులతో ఈశ్వరరావుకున్న లింకులపై కూపీ లాగుతోంది. ఇన్నాళ్లూ ఈశ్వరరావుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారంతా ఇప్పుడు ఆయనెవరో తమకు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రెండో రోజు బుధవారం కూడా ఏసీబీ అధికారులు పర్చేజింగ్ సెక్షన్లో సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈశ్వరరావుతో పనిచేస్తున్న సిబ్బందిని పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సెక్షన్లో ఈశ్వరరావు ఒక్కరే కాకుండా మరికొంత మంది కూడా అక్రమాస్తులు కూడగట్టారన్న సమాచారం ఏసీబీ వద్ద ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఆ దిశగా కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేజీహెచ్ వైద్యులతో పాటు ఈశ్వరరావు పనిచేస్తున్న సెక్షన్ విభాగపు ఉద్యోగుల్లోనూ రకరకాల ఊహాగానాలతో భయాందోళన నెలకొంది. -
‘బిడ్డను కేజీహెచ్‌కు తీసుకువెళ్లం’
అనంతగిరి: అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నా కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. మండలంలోని లంగుపర్తి పీహెచ్సీలో మల్లేపాడు గ్రామానికి చెందిన బీసాయి సన్యాసమ్మ మంగళవారం మూడో బిడ్డకు జన్మనించింది. జన్మించిన కుమారుడు శ్వాస సమస్యతో బాధపడుతున్నాడని, పీహెచ్సీ సిబ్బంది చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని గమనించి వెంటనే ఆ బిడ్డను విశాఖ కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే అందుకు వారు నిరాకరించి గ్రామానికి తీసుకుని వెళ్లారు. -
ఎన్టీఆర్ తర్వాత అడుగు పెట్టని సీఎంలు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రుల పదవికి కేజీహెచ్ ఎసరు పెడుతుందా? కేజీహెచ్‌ను సందర్శించిన సీఎంలకు పదవీ గండం కలుగుతుందా? ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు గాని.. ముఖ్యమంత్రులు కేజీహెచ్ వైపు తొంగి చూడడం లేదు. ఏడాది రెండేళ్ల నుంచి కాదు.. దాదాపు 23 ఏళ్ల నుంచి అడుగు పెట్టడం లేదు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేజీహెచ్‌ను సందర్శించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వెంటనే అల్లుడు చంద్రబాబునాయుడు ఆయనను వెన్నుపోటు పొడవడంతో పదవీచ్యుతుడయ్యారు. ఇక అప్పట్నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా కేజీహెచ్‌కు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో రెండు మూడు పర్యాయాలు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతలో కేజీహెచ్‌కు వచ్చిన సీఎంలు పదవులు పోగొట్టుకున్నారని, ఎమ్మెల్యేలు వద్దని వారించారు. దీంతో ఆఖరి నిమిషంలో ఆ సందర్శనను రద్దు చేసుకున్నారు. తాజాగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి విశాఖ వచ్చారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అనారోగ్యం పాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అటు నుంచి వచ్చేటప్పుడు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీ చేస్తారంటూ ఆస్పత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో కలవరపడ్డ కేజీహెచ్ అధి కారులు రాత్రి విధుల్లో ఉండేæ వైద్యులను అప్రమత్తం చేశారు. అంతా విధుల్లో ఉండాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని సెల్‌ఫోన్ మెసేజీలను పంపారు. ఇంతలో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కేజీహెచ్‌కు వెళ్లే సాహసం చేయవద్దని, వెళ్తే పదవీ గండం ఖాయమని చెప్పడంతో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీహెచ్‌కు రావడం లేదని అధికారుల నుంచి సమాచారం వచ్చిం ది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు! -
వైద్యసేవలపై సమ్మెట
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గురువారం సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందలేదు. ముఖ్యంగా కేజీహెచ్‌లో వైద్య సేవలు అందక రోగులు నానా పాట్లు పడ్డారు. వివిధ ఓపీల్లో వైద్యుల కోసం ఎదురుచూశారు. పలు విభాగాల వద్ద రోగులు బారులు తీరారు. చికిత్స కోసం నానా హైరానా పడాల్సి వచ్చింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. శనివారం లోపల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అత్యవసర సేవలకూ దూరంగా ఉంటామని జూడాలు స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూనిరవధిక సమ్మె తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. గురువారం కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల 14న సమ్మెకు పిలుపునిచ్చామని, చర్చిలకు పిలిచిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, రోజులు గడుస్తున్నా పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయి పడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవో విడుదల చేసిందని సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2010–11 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం దారుణమన్నారు. అత్యవసర సేవలకు ప్రత్యేక టీం ప్రస్తుతం ఔట్ పేషెంట్, వార్డుల్లో రోగులకు సేవలను నిలిపివేశామని, అత్యవసర కేసులను చూసేందుకు ప్రత్యేకం టీంను సిద్ధం చేశామని జూడాలు తెలిపారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్ చేస్తుందని, ఆ తరువాత మరో ఏడాది పనిచేస్తే సీనియర్ రెసిడెంట్స్‌గా గుర్తింపు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ ఇలా సీనియర్ రెసిడెంట్స్ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్స్‌కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్ల పరిష్కారానికి దిగిరాకపోతే శనివారం నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేజీహెచ్‌లో సుమారు 400 మంది జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. హక్కులతో పాటుబాధ్యతలూ గుర్తించాలి హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలి. జూనియర్ వైద్యులకు జనవరి నెల వరకూ ఉపకార వేతనాలు చెల్లించాం. 15 శాతం పెరిగిన ఉపకార వేతనాలతో పాటు బకాయిలకు సంబంధించి అవసరమైన జీవో విడుదల కాలేదు. మరో వారం రోజుల్లో ఈ జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. జూనియర్ వైద్యులు వారం, పదిరోజుల పాటు సంయమనం పాటిస్తే బాగుంటుంది. ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేస్తే బకాయిలు చెల్లించవచ్చు. సమ్మె కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ పి.వి.సుధాకర్, ప్రిన్సిపాల్, ఆంధ్ర వైద్య కళాశాల -
కేంద్రాస్పత్రికి వస్తే కేజీహెచ్‌కే...
గంట్యాడ మండలానికి చెందిన కె.రమణమ్మ నాలుగు రోజులు కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో కేంద్రాస్పత్రిలో చేరింది. చేరిన పది గంటల్లోనే ఆమెను కిడ్నీ సంబంధిత వైద్యులు లేరని అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేసేశారు. ఇది ఒక్క రమణమ్మ పరిస్థితే కాదు. కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం ఎదురువుతున్న పరిస్థితి ఇది. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో జిల్లా నలుమూలలు నుంచి రోగులు కేంద్రాస్పత్రికి వస్తారు. పెద్దాస్పత్రిలోనే వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఉన్నా ఒకసారి డయాలసిస్ చేసిన రోగులకు మాత్రమే కేంద్రాస్పత్రిలో చేస్తున్నారు. డయాలసిస్ అవసరం రోగికి నేరుగా డయాలిసిస్ చేసే సౌకర్యం( ఎ.వి.ఫిస్టులా) లేదు. ఈ సౌకర్యం లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. డయాలసిస్ సెంటర్ రోగులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి కేజీహెచ్‌లోగాని ప్రైవేటు ఆస్పత్రుల్లోగాని డయాలసిస్ చేసుకుంటే తప్ప డయాలసిస్ చేయని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి డయాలసిస్ చేయడం లేదు. దీంతో ప్రాణాలు కాపాడుకోవడానికి రోగులు విశాఖపట్నం కేజీహెచ్‌కుగాని కార్పొరేట్ ఆస్పత్రికిగాని వెళ్లాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చువుతుంది. డబ్బులు లేని నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా డయాలసిస్ చేయాలి. ఎ.వి. ఫిస్టులా సౌకర్యం లేకపోవడం వల్ల డయాలసిస్ జరగడం లేదు. అమలు కాని ఆదేశాలు రెండు నెలలు కిందట వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కేంద్రాస్పత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు ఎ.వి. ఫిస్టులా సౌకర్యం అందలేదని గుర్తించి నెల రోజుల్లో ఎ.వి. ఫిస్టులా సౌకర్యం కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలవుతున్నా ఇంతవరకు కేంద్రాస్పత్రిలో కిడ్నీ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. త్వరలో ఏర్పాటు చేస్తాం... కిడ్నీ రోగులకు నేరుగా డయాలసిస్ సౌకర్యం కేంద్రాస్పత్రిలో ప్రస్తుతానికి లేదు. త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –కె. సీతారామరాజు,కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ -
మహిళా రోగిని స్కానింగ్‌కు తీసుకెళ్లి ..
సాక్షి, విశాఖపట్నం: అత్యవసర వైద్యం కోసం అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన మహిళా రోగిపై స్ర్టెచర్ బాయ్ లైంగిక దాడికి యత్నించిన సంఘటన విశాఖ కేజీహెచ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సి.సి. కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సమీపంలోని వికాస్ నగర్‌కు చెందిన 43 ఏళ్ల మహిళకు రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్ వచ్చాయి. ఆమె చిన్నకుమారుడు క్యాబ్‌లో సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో కేజీహెచ్‌కు తరలించారు. ఆమెకు తలలో నరాల సమస్య తలెత్తినట్టు అనుమానించిన వైద్యులు బ్రెయిన్ స్కానింగ్ చేయించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలోనే పీపీపీ విధానంలో నడుస్తున్న మెడాల్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు చెందిన స్ర్టెచర్ బాయ్ మాడుగుల కిరణ్‌కుమార్ ఆమెను వీల్‌చైర్‌లో స్కానింగ్‌కు తీసుకువెళ్లాడు. ఆమె వెంట చిన్నకుమారుడు కూడా వెళ్లినా స్కానింగ్ సమయంలో బయటే ఉండిపోయాడు. స్కానింగ్ అయ్యాక కిరణ్‌కుమార్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో రోగి భర్త శేషగిరిరావు ఈ విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ దృష్టికి తీసుకెళ్లి అనంతరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.