ప్రేమించడం లేదని నిప్పుంటించుకున్నాడు | Polytechnic student attempts suicide for love at visakhapatnam city | Sakshi
Sakshi News home page

ప్రేమించడం లేదని నిప్పుంటించుకున్నాడు

Published Thu, May 29 2014 11:13 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

నిప్పుంటించుకున్న భరత్ - Sakshi

నిప్పుంటించుకున్న భరత్

యువతి తన ప్రేమను నిరాకరించటంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో చివరికి ప్రాణాలు దక్కించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రాంతం వరంగల్ నగరానికి చెందిన భరత్ నగరంలో కంచరపాలెం వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు.
 
 నగరంలో మూడోవార్డు పరిధి సింహగిరి కాలనీ (కొండపై)కి చెందిన ఓ యువతి అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతోంది. ఆమెను భరత్ మొదటి ఏడాది నుంచే ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఇష్టం లేని ఆ అమ్మాయి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ భరత్‌ను మందిలించారు. అయినా భరత్ పట్టువీడ లేదు. ఈ కారణంతోనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు నాలుగు నెలలుగా ఆమెను కళాశాలకు పంపించడం మానేశారు.
 
 ఆమె కళాశాలకు రాకపోవడంతో ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకుని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ బాటిల్‌తో పెట్రోల్ తీసుకుని ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. అక్కడే భరత్ తనతో తీసుకెళ్లిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒళ్లంతా మంటలు అంటుకోవడంతో తట్టుకోలేక ఇంటి ముందు పరుగులు తీశాడు. ఆ విషయం గమనించిన అమ్మాయి తల్లి బిందెలతో నీరు తీసుకొచ్చి భరత్ ఒంటిపై పోసి మంటలను అదుపు చేసింది  స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి భరత్‌కు ప్రథమ చికిత్స చేసి వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సుమారు 30 శాతం భాగం కాలినట్లు వైద్యులు గుర్తించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement