మహిళా రోగిని స్కానింగ్‌కు తీసుకెళ్లి .. | hospital strecher boy abusing with female patient | Sakshi
Sakshi News home page

మహిళా రోగిని స్కానింగ్‌కు తీసుకెళ్లి ..

Published Sun, Jan 21 2018 3:35 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

hospital strecher boy abusing with female patient

సాక్షి, విశాఖపట్నం: అత్యవసర వైద్యం కోసం అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన మహిళా రోగిపై స్ర్టెచర్‌ బాయ్‌ లైంగిక దాడికి యత్నించిన సంఘటన విశాఖ కేజీహెచ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సి.సి. కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సమీపంలోని వికాస్‌ నగర్‌కు చెందిన 43 ఏళ్ల మహిళకు రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్‌ వచ్చాయి. ఆమె చిన్నకుమారుడు క్యాబ్‌లో సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో కేజీహెచ్‌కు తరలించారు. ఆమెకు తలలో నరాల సమస్య తలెత్తినట్టు అనుమానించిన వైద్యులు బ్రెయిన్‌ స్కానింగ్‌ చేయించాలని సూచించారు.
 ఆస్పత్రి ఆవరణలోనే పీపీపీ విధానంలో నడుస్తున్న మెడాల్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు చెందిన స్ర్టెచర్‌ బాయ్‌ మాడుగుల కిరణ్‌కుమార్‌ ఆమెను వీల్‌చైర్‌లో స్కానింగ్‌కు తీసుకువెళ్లాడు. ఆమె వెంట చిన్నకుమారుడు కూడా వెళ్లినా స్కానింగ్‌ సమయంలో బయటే ఉండిపోయాడు. స్కానింగ్‌ అయ్యాక కిరణ్‌కుమార్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో రోగి భర్త శేషగిరిరావు ఈ విషయాన్ని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అర్జున్‌ దృష్టికి తీసుకెళ్లి అనంతరం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement